నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. దాంతో అక్కడి ప్రజలు భయంతో ఇళ్లనుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందులోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు విద్యుత్ లేక అంధకారంలో మునిగిపోయాయి.
ఈ సమయంలో హఠాత్తుగా భూమి కంపించడంతో నెల్లూరు జిల్లా వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే వర్షం బీభత్సానికి అల్లాడిపోతున్న ప్రజలకు భూకంపం రావడంతో భయాందోళనలకు గురయ్యారు.