
జమ్ము కశ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. బారాముల్లా, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9, 4.8గా నమోదైంది.
జమ్ము కశ్మీర్‌లో సంభవించిన భూకంపాలకు ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే బారాముల్లాలో సంభవించిన భూకంపం నుండి ప్రాణాల్ని కాపాడుకునేందుకు భవనంపై నుండి దూకినట్లు తెలుస్తోంది.
దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం బారాముల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాధితుడికి వైద్య సేవలందిస్తున్నారు.
VIDEO | Tremors of an earthquake with a magnitude of 4.8 felt in Jammu and Kashmir earlier today. Visuals from Baramulla.#earthquake pic.twitter.com/8zbcMySOC6
— Press Trust of India (@PTI_News) August 20, 2024