జైలు నుంచి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే నేత అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.. తనతో పాటు జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ కూడా ఇవాళ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
అమృత్‌పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు నుంచి పెరోల్‌పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక రషీద్ ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించచారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment