baramulla
-
‘వారి కోసం జీవితాన్ని త్యాగం చేస్తా’.. జైలులో లొంగిపోయిన ఎంపీ రషీద్
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ‘ఇంజనీర్ రషీద్’ సోమవారం తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియడంతో జైలులో లొంగిపోయారు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని పేర్కొన్నారు. తాను కాశ్మీర్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, శాంతి, అభివృద్ధి, ప్రజల హక్కుల పునరుద్ధరణ కోసం కృషిచేస్తానని చెప్పారు.‘మా ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయం జరుగుతుంది. మేము జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ప్రజల సంక్షేమం, కాశ్మీర్ సంక్షేమం, శాంతి గురించి , గౌరవంగా మాట్లాడుతాం. మేము లొంగిపోము. జైలు శిక్ష గురించి భయపడవద్దు. పోరాడి గెలుస్తాం. ‘మేం ఏ నేరం చేయలేదు. నేను జైలుకు వెళ్లడం గురించి చింతించను. నా ప్రజలకు దూరంగా ఉంటానన్న ఒకే ఒక భావన ఉంది’ అని అన్నారు.అయితే తీవ్రవాద నిధుల కేసులో అరెస్టయిన అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు రషీద్, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్ పొందారు. అనంతరం రెండుసార్లు మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన ఎంపీగా ఉన్నందున చట్టసభ సభ్యులను విచారించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కోర్టుకు అతని కేసు వెళ్లవచ్చని దనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ తెలిపారు. దీనిపై ఢిల్లీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లతో సహా నలుగురి మృతి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. మరణించారని వర్గాలు తెలిపాయి.బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిపై కాల్పులు జరపడంతో.. దీంతో ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినసైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు - మరణించిన వారిని కశ్మీర్‌లోని నయీద్గామ్లోని బుద్గామ్కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్, బీహార్‌కు చెందిన మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీమ్‌లుగా గుర్తించారు.ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్‌లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం.కశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని నేను ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అబ్దుల్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
ఎంపీగా ఓడిన కొద్ది వారాలకే సీఎం
శ్రీనగర్: జూన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లాలో ఓటమిని చవిచూసిన ఒమర్ అబ్దుల్లా కేవలం కొద్ది వారాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గతంలోనూ ఇలాగే 38 ఏళ్ల వయసులో తొలిసారిగా జమ్మూకశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టి రికార్డ్ సృష్టించారు. అత్యంత పిన్న వయసులో సీఎం అయి 2009–14 కాలంలో రాష్ట్రాన్ని పాలించారు.స్కాట్లాండ్లోని స్ట్రాత్క్లీడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తూ చదువును మధ్యలో వదిలేసిన ఒమర్ 1998లో తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జయకేతనం ఎగరేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. గోధ్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ సమరంలో అడుగుపెట్టి చతికిలపడ్డారు. 2002లో నేషనల్ కన్ఫెరెన్స్ కంచుకోట గందేర్బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనామక ఖాజీ మొహమ్మద్ అఫ్జల్చేతిలో ఓడిపోయారు. తర్వాత 2004లో మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. తర్వాత జమ్మూకశ్మీర్ అటవీప్రాంతాన్ని శ్రీ అమర్నాథ్ ఆలయబోర్డ్కు 2008లో ఇచ్చేందుకు నాటి అటవీమంత్రిగా అఫ్జల్ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అసంతృప్తి నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఒమర్ ఆందోళనలు లేవనెత్తారు. పార్టీ బలాన్ని పెంచి ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచించి ఎన్సీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. దీంతో 38 ఏళ్ల వయసులో ఒమర్ కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల ఒమర్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడోవ్యక్తి ఒమర్. గతంలో ఈయన తాతా షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చదవండి: నేనెందుకు అరెస్టయ్యానో మీకు తెలుసా? -
జమ్ము కశ్మీర్లో స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం
జమ్ము కశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. బారాముల్లా, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9, 4.8గా నమోదైంది.జమ్ము కశ్మీర్లో సంభవించిన భూకంపాలకు ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే బారాముల్లాలో సంభవించిన భూకంపం నుండి ప్రాణాల్ని కాపాడుకునేందుకు భవనంపై నుండి దూకినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం బారాముల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాధితుడికి వైద్య సేవలందిస్తున్నారు. VIDEO | Tremors of an earthquake with a magnitude of 4.8 felt in Jammu and Kashmir earlier today. Visuals from Baramulla.#earthquake pic.twitter.com/8zbcMySOC6— Press Trust of India (@PTI_News) August 20, 2024 -
జమ్మూ కశ్మీర్లో పేలుడు.. నలుగురి మృతి
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం పేలుడు సంభవించింది. సోపోర్ పట్టణంలోని షేర్ కాలనీలో స్క్రాప్ డీలర్ దుకాణంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నజీర్ అహ్మద్ నద్రో(40), మహమ్మద్ ఆజర్(25), ఆజిమ్ అష్రఫ్ మిర్(20), ఆదిల్ రషీద్ భట్(23) గా స్థానిక అధికారులు గుర్తించారు.పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని సహాయక చర్యులు చేపట్టారు. ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే షాప్ డీలర్, మరికొంతమంది ట్రక్కు నుంచి కొన్ని పదార్థాలను దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. -
Amritpal Singh-Engineer Rashid: జైలు నుంచి గెలుపు.. ఎంపీలుగా ప్రమాణం
జైలు నుంచి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే నేత అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.. తనతో పాటు జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ కూడా ఇవాళ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.అమృత్‌పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు నుంచి పెరోల్‌పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక రషీద్ ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించచారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. -
Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
శ్రీనగర్: ఎన్నికల వ్యయ నివేదికలో చూపిన ఖర్చులో తేడాలున్నాయని బారాముల్లా ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్)కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీచేసింది. తీవ్రవాదులకు నిధులు అందజేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్‌ను 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్న రషీద్ బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి విజయం సాధించారు. కోర్టు రెండు గంటలు పెరోల్ ఇవ్వడంతో ఈనెల 5న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రషీద్ తనకు రూ.2.10 లక్షలు ఖర్చయిందని ఎన్నికల రిజిస్టర్లో చూపారని, అయితే ఎన్నికల పరిశీలకులు నిర్వహించిన సమాంతర రిజిస్టర్లో ఖర్చును రూ.13.78 లక్షలుగా చూపారని ఈసీ తెలిపింది. ఈ వ్యత్యాసంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. జిల్లా వ్యయ పర్యవేక్షక కమిటీ ముందు రషీద్ లేదా ఆయన ప్రతినిధి హాజరై వివరణ ఇవ్వాలని, ఈసీకి సకాలంలో ఎన్నికల వ్యయ నివేదికను సమరి్పంచాలని కోరింది. -
ఎంపీగా ప్రమాణ స్వీకారానికి.. రషీద్ ఇంజినీర్‌కు ఎన్ఐఏ అనుమతి
న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర ఎంపీ షేక్ రషీద్ ఇంజినీర్‌కు లోక్‌సభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమతించింది. దీంతో ఈ నెల అయిదవ తేదీన రషీద్ లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్ఐఏ ఆయనకు కొన్ని షరతులు విధించింది.నూతన ఎంపీ మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. కాగా షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.షేక్ అబ్దుల్ రషీద్ ఎవరు?జమ్మూకాశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇంజనీర్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద ఎన్ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అబ్దుల్ రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2008 మరియు 2014లో గెలుపొందిన జమ్మూ కశ్మీర్‌లోని లాంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. -
కశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. బారాముల్లాలోని వాటర్‌గామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు తలదాచుకొన్నారనే సమాచారంతో బుధవారం భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని, తీవ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ మొదలైందని అధికారవర్గాయి తెలిపాయి. కాల్పుల్లో మరణించిన తీవ్రవాదుల పేర్లు, వారు ఏ సంస్థకు చెందిన వారనే విషయాలను ఆరాతీస్తున్నారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీసు, మరో జవానుకు గాయాలయ్యాయని వెల్లడించారు. -
లోక్‌సభ ఎన్నికలు: ప్రత్యేకతను చాటారు.. వార్తల్లో నిలిచారు!
హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల్లో పలు అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. కొన్ని చోట్ల ప్రత్యర్థులు.. సీనియర్టీ, డబ్బు, పలుకుబడి, కుల సమీకరణాల అనుకూలతలతో బరిలో నిలిచారు. అయితే వాటన్నింటికి భయపడకుండా.. తీవ్రమైన ప్రతికూలతలను సైతం ఎదుర్కొని కొందరు ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి వార్తల్లో నిలిచారు. ఇలా గెలిచిన వారిలో తక్కువ, అధిక వయసు ఉన్న అభ్యర్థులు, తక్కువ మెజార్టితో గెలుపొందినవారున్నారు. అదీకాక జైలులో ఉండి మరీ విజయం సాధించిన అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ మైనార్టీ ముస్లిం మహిళ గెలుపొందింది. ఇలా ఓ ముస్లిం మహిళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఒడిశా చరిత్రలో తొలిసారి కావటం గమనార్హం.అతి తక్కువ మెజార్టీతో గెలుపుఎన్నికల్లో కొన్నిసార్లు ఒక్క ఓటు కూడా అభ్యర్థి గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్నాథ్ షిండే) నేతృత్వంలోని పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇద్దరి మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. ఇక.. కేరళలోని అత్తింగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు.అత్యంత పిన్న వయసు, అత్యంత వృద్ధుడు గెలుపుఉత్తరప్రదేశ్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులుగా కౌశంబీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర సరోజ్, మచిలీషహర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రియా సరోజ్ విజయం సాధించారు. వారిద్దరి వయసు 25 ఏళ్లే కావడం విశేషం. వీరిద్దరే ఈసారి అత్యంత పిన్నవయస్కులైన ఎంపీలుగా రికార్డు సృష్టించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్.బాలు సులువుగా నెగ్గారు. 82 ఏళ్ల టి.ఆర్.బాలు ఈ ఎన్నికల్లో అత్యంత వృద్ధుడైన ఎంపీగా రికార్డుకెక్కారు.దాతల సాయంతో గెలుపులోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాభిమానం, పార్టీ మద్దతుతో పాటు డబ్బు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యర్థులకు ధీటుగా కాకపోయిన ఎన్నికల ప్రచారానికైనా లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అయితే గుజురాత్లో మాత్రం ఓ అభ్యర్థికి దాతలు ముందుకువచ్చి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా నిధులను సేకరించారు. గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే.జైలులో నుంచే గెలుపులోక్ సభ ఎన్నికల్లో ఓ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఏకంగా జైలులో ఉండి మరీ.. ప్రజల మద్దతు, అభిమానంలో విజయం సాధించారు. అందులో సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని కాదూర్ సాహిబ్ స్థానం నుంచి గెలుపొందారు. ఉగ్రవాదలకు నిధులు సమకూరుస్తున్నారనే కేసులో ఆయన అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక.. మరో అభ్యర్థి జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లాలో ఇంజనీర్ రషీద్ కూడా జైలులో ఉండి ఎన్నకల్లో ఎంపీగా విజయం సాధించారు. ఇంజనీర్ రషీద్ 2019 నుంచి తిహార్ జైలులో ఉన్నారు. ఆయనపై ఉగ్రవాదులకు నిధలు సేకరిస్తున్నరనే ఆరోపణలపై కేసు నమోందైంది. ఇక.. వీరి ప్రమాణస్వీకారంపై చర్చ జరుగుతోంది.ఒడిశా చరిత్రలో తొలి ముస్లిం మహిళ గెలుపుఒడిశాలో బీజేపీ 78 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 స్థానాల్లో గెలుపొంది అధికారం కోల్పోయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలిచి మూడో స్థానానికి పరిమిమైంది. అయితే కాంగ్రె పార్టీ తరఫున బారాబతి-కటక్ అసెంబ్లీ సెగ్మెంట్లో సోఫియా ఫిర్దౌస్ అనే ముస్లిం మహిళా అభ్యర్థి విజయం సాధించారు. ఒడిశాలో చరిత్రలో ఓ ముస్లిం మహిళ ఎమ్యెల్యేగా విజయం సాధించటం ఇదే తొలిసారి. -
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
సీఆర్పీఎఫ్ బంకర్‌పై మహిళ బాంబు దాడి.. వీడియో వైరల్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఓ మహిళ సీఆర్పీఎఫ్ బంకర్‌పై పెట్రో బాంబుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ ముందు మంగళవారం సాయంత్రం ఈ బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో బుర్ఖా ధరించిన ఓ మహిళ చేతిలో బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ కనిపిస్తోంది. ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఆగి తన బ్యాగులోంచి బాంబును తీసి దానికి నిప్పటించి సీఆర్పీఫ్ క్యాంప్ మీదకు విసిరింది. అనంతరం అక్కడి నుంచి పరారయ్యింది. కాగా మహిళ విసిరిన బాంబు సెక్యూరిటీ క్యాంపు బయట పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అలాగే దాడి జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్లు అప్రమత్తమై నీళ్లు పోసి మంటలు ఆర్పేసినట్లు తెలిపారు. ఇప్పటికే మహిళను గుర్తించినట్లు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం #WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir (Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY — ANI (@ANI) March 30, 2022 -
జమ్మూకశ్మీర్లోగల బారాముల్లా ప్రాంతంలో ఎన్కౌంటర్
-
చొరబాట్లను అడ్డుకున్న సైన్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హాత్‌లంగా ప్రాంతంలోని ఘటనా స్థలం నుంచి భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం సైన్యాధికారి చెప్పారు. హతమైన వారిలో ఒకరు పాకిస్తానీ అని, మిగతా వారి వివరాలు ఇంకా తెలియదని అధికారి పేర్కొన్నారు. ఉరీ సెక్టార్, గోహలన్ ప్రాంతాల్లో చొరబాట్లు జరగొచ్చనే ముందస్తు సమాచారం మేరకు సరిహద్దు వెంట గాలింపు పెంచామని, చివరకు ఇలా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నామని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు. మొత్తం ఆరుగురు చొరబాటుకు ప్రయత్నించారని, నలుగురు సరిహద్దు ఆవలే ఉండిపోయారని, ఇద్దరు సరిహద్దు దాటారని, ఎదురుకాల్పుల్లో మొత్తంగా ముగ్గురు హతమయ్యారని వివరించారు. భారత్‌లో ఉగ్రచర్యల్లో పిస్టళ్లను వాడే కొత్త పంథాను పాక్ అవలంభిస్తోందని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది 97 పిస్టళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది నిరాయుధులైన పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడుల్లో 85 శాతం ఘటనల్లో పిస్టళ్లనే వాడారని ఐజీ పేర్కొన్నారు. షోపియాన్‌లో మరో ఉగ్రవాది.. షోపియాన్ జిల్లాలో కేశ్వా గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అనాయత్ అష్రాఫ్ అనే ఉగ్రవాది మరణించాడు. అక్రమంగా ఆయుధాలను సమీకరిస్తూ, మాదక ద్రవ్యాల లావాదేవీలు కొనసాగిస్తున్నాడనే పక్కా సమాచారంతో సైన్యం అష్రఫ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. లొంగిపోకుండా అష్రఫ్ సైన్యం పైకి కాల్పులు జరిపాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో అతను మృతిచెందాడు. -
బారాముల్లా ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టామని తెలిపారు. జమ్ము కశ్మీర్లో గత వారంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన మూడవ దాడి ఇది. ఆగస్టు 14న శ్రీనగర్ నగర శివార్లలోని నౌగాం వద్ద ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అంతకుముందు శ్రీనగర్- బారాముల్లా హైవేలోని హైగాం వద్ద సైనికుల బృందంపై ఉద్రవాదులు కాల్పులు జరపగా, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. -
హృదయవిదారక ఫోటో.. ‘లే తాత.. లే’
కశ్మీర్: కొద్ది సేపటి క్రితం వరకు తనతో పాటు నడుస్తూ.. కబుర్లు చెప్పిన తాత ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఎంత పిలిచినా పలకడం లేదు. పైగా తాత శరీరం నుంచి రక్తం వస్తుంది. ‘ఏమయ్యింది. లే తాత లే’ అంటూ మృతదేహం దగ్గర కూర్చుని ఏడుస్తున్న ఆ పసివాడిని చూసి ప్రతి ఒక్కరు అయ్యో అంటున్నారు. ఈ హృదయ విదారక సంఘటన సోపూర్లో చోటు చేసుకుంది. భద్రతా దళాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఈ సంగతి తెలియని అతడి మూడేళ్ల మనవడు తాత కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. వివరాలు.. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ముష్కరులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువైపులా కాల్పులు జరుగుతున్నాయి. (‘కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లం’) ఆ సమయంలో సదరు పిల్లాడు, అతడి తాత అక్కడి నుంచి వెళ్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఎదురుకాల్పుల్లో పిల్లాడి తాతకు రెండు బుల్లెట్లు తగిలాయి. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పాపం ఏం జరిగిందో తెలీని ఆ పసివాడు.. అంతసేపు తనకు కబుర్లు చెప్పిన తాత ఒక్కసారిగా చలనం లేకుండా పడి ఉండటం.. శరీరం నుంచి రక్తం రావడంతో భయపడ్డాడు. అక్కడే కూర్చుని ఏడవడం ప్రారంభించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ చిన్నారిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. వీటిల్లో ఒక దాంట్లో సదరు పసివాడు చనిపోయిన తన తాతను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుండగా.. మరొక దాంట్లో గోడ వెనక దాక్కున్న సైనికుడు ఒకరు ఆ పపసివాడిని అక్కడి నుంచి పక్కకు వెళ్లమని చెప్పడంతో.. ఆ ప్రదేశం నుంచి నడుచుకుంటూ వెళ్తోన్న పిల్లాడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఎదురుకాల్పుల్లో వృద్ధుడితో పాటు ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.(కశ్మీర్ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు) -
కుక్కను కాపాడాడు.. కానీ చివరికి
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో విషాదం నెలకొంది. ఒక ఆర్మీ ఆఫీసర్ తన పెంపుడు కుక్కను మంటల నుంచి కాపాడి తాను అగ్నికి ఆహుతయ్యాడు. వివరాలు.. కశ్మీర్‌కు చెందిన అంకిత్ బుద్రజా గుల్మర్గ్ ఎస్‌ఎస్‌టీసీ మిలటరీ క్యాంపెయిన్‌లో మేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంకిత్ రెండు శునకాలను పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అంకిత్ ఉంటున్న ఇంటికి శనివారం రాత్రి నిప్పు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న తన కుటుంబసభ్యులతో పాటు ఒక కుక్కను బయటికి పంపించాడు.అయితే మరొక కుక్క లోపలే ఉండిపోవడంతో దానిని రక్షించడానికి వెళ్లి మంటల్లో చిక్కుకున్నాడు. అయితే ఎలాగోలా దానిని బయటకు పంపినా అప్పటికే అంకిత్ 90 శాతం కాలిపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అంకిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాన్‌మార్గ్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రనిధుల కేసులో భాగంగా జమ్మూకశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో ఏకకాలంలో నాలుగు చోట్లు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడి ఇళ్లను జల్లెడపడుతున్నారు. వేర్పాటువాద నేత మసరత్ ఆలంను గతవారం జమ్మూకశ్మీర్ జైలు నుంచి ఢిల్లీ నుంచి తరలించిన ఎన్ఐఏ.. విచారణలో అతడని నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఆ డేటా ఆధారంగానే ఇప్పుడు సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. టెర్రర్ ఫండింగ్ కేసు 2012లో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మసరత్ ఆలంతోపాటు వేర్పాటువాద నేతలు అసియా ఆంద్రబి, షబీర్ షా సహా 12మందిపై అభియోగాలు నమోదుచేసింది. -
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
కశ్మీర్: బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం జరగలేదని, అలాగే జవాన్లు ఎవరికీ గాయాలు కాలేదని దక్షిణ కశ్మీర్ డీఐజీ అతుల్ కుమార్ గోయల్ తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అలాగే సంఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనికి జవాన్లు చెప్పేంతవరకు ప్రజలు ఎవరూ రావద్దని ఓ ప్రకటనలో డీఐజీ తెలిపారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా ఇళ్లను తనిఖీ చేస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపైకి కాల్పులు జరిపారని, రెప్పపాటులో జవాన్లు స్పందించి ఎదురు కాల్పులకు దిగడంతో జవాన్లు మట్టికరిచారని డీఐజీ వివరించారు. -
కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
కశ్మీర్: శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌లో సీర్పీఎఫ్ బలగాలపై దాడికి ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతాదళాలు హతమార్చాయి. జైషేమహ్మద్ సంస్థకి చెందిన ఉగ్రవాదులు భారత క్యాంపుపై దాటికి పన్నాగం పొందుతున్నారని ముందస్తూ సమాచారంతో బలగాలను ఆలర్ట్‌చేసి వారి చర్యను తిప్పికొట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రోండురోజుల క్రితమే దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదులు గ్రెనైడ్లతో 18 నెంబర్ సిఆర్పీఎఫ్ బెటాలియన్‌పై దాడికి దిగారని, ఈ ఆపరేషన్‌లో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టంగాని జరగలేదని కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు. గతమూడు నెలల నుంచి జైషేమహ్మద్ ఉగ్రవాదులు భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. దానిలో భాగంగానే గత డిసెంబర్ 31న ఐదుగురి భారత సెక్యూరిటి సిబ్బందిని హతమార్చారని తెలిపారు. రాజధాని శ్రీనగర్‌కి 21కీ.మీ దూరంలో అబు అన్సార్ అనుచరులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని వారిని మార్చి 5న దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్ చేసినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. -
ఉగ్ర పంజా... కశ్మీర్లో భారీ పేలుడు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో భారీ పేలుడు జరపటంతో నలుగురు పోలీస్ సిబ్బంది ప్రాణాలు వదిలారు. ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. శనివారం ఉదయం రద్దీగా ఉండే ఓ మార్కెట్ సముదాయం వద్ద ఐఈడీ మందుపాతరతో ఉగ్రవాదులు పేలుడు జరిపారు. పేలుడు ధాటికి ఓ షాపు పూర్తిగా కుప్పకూలిపోయిందని.. తీవ్రత చాలా దూరం ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించిన సైన్యం.. ఉగ్రవాదుల కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. More #visuals from Baramulla where 4 Policemen have lost their lives after an IED blast by terrorists in Sopore #JammuAndKashmir pic.twitter.com/BLybHzhaFl — ANI (@ANI) January 6, 2018 -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్, బారాముల్లా జిల్లాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్ టాప్ కమాండర్‌తో సహా ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. బుద్గాంలో ఉగ్రవాదులతో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఆర్మీ జవాను మృతిచెందాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బారాముల్లా జిల్లాలోని లాదోరా ప్రాంతంలో బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఖాలిద్ అలియాస్ షాహిద్ సౌకత్ మృతిచెందాడు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఖాలిద్ కశ్మీర్లో జరిగిన పలు ఉగ్ర ఘటనల్లో సూత్రధారిగా వ్యవహరించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఖాలిద్ అక్కడే ఉగ్రవాదిగా శిక్షణ పొందాడు. మూడేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు పలువురిని జైషేలో నియమించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘ఏ ప్లస్ ప్లస్’ కేటగిరీ ఉగ్రవాద జాబితాలో ఉన్న అతనిపై రూ.7 లక్షల రివార్డు ఉంది. సోపియాన్ జిల్లా కెల్లెర్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. మృతుల్లో హిజ్బు ల్ ముఖ్య నియామకుడు జహిద్తో పాటు ఇర్ఫాన్, అసిఫ్ ఉన్నారు. ఇక బుద్గాంలో ప్రాణాలు కోల్పోయిన జవానును సుబేదార్ రాజ్‌కుమార్‌గా గుర్తించారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు
► ఇద్దరు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్ల జిల్లాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు పాల్పడ్డారు. చివరకు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని సోపూర్ నాటిపూరలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది గురువారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు ప్రారంభించారు. ఇది గుర్తించిన ఉగ్రవాదులు భద్రతాబలగాలపైకి కాల్పులు జరపడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. -
ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాదులిద్దర్ని భారత భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, ఏకే 47తో సహా ఓ పిస్టలను స్వాధీనం చేసుకున్నారు. కాగా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్ఎస్ పుర సెక్టార్లో శుక్రవారం రాత్రి పాక్ దళాలు కాల్పులు జరిపాయి. అప్రమత్తమైన భారత భద్రతా దళాలు కాల్పులను తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా జమ్ము కమిషనర్ సిమ్రాన్ దీప్ సింగ్ మాట్లాడుతూ సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో 18 గంటల వరకూ స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే మంచిదని ఆయన సూచించారు. అలాగే రాజౌరీలోని మంజకొటె సెక్టార్లో వద్ద కూడా పాక్ కాల్పులకు పాల్పడింది. భారత్ సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం పరిపాటిగా మారింది. -
కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సోమవారం కర్ఫ్యూను తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ హింస చెలరేగింది. బారాముల్లా జిల్లాలో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన తాజా ఘర్షణలో 18 ఏళ్ల దనిష్ అహ్మద్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆందోళన కారులు నదిహల్ గ్రామం వద్ద భద్రతా బలగాలపై పెద్ద ఎత్తున రాళ్లదాడి చేశారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కశ్మీర్ అల్లర్ల మృతుల సంఖ్య 72 కు చేరుకుంది. అహ్మద్ మరణంతో మరోసారి ఉధ్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బారాముల్లా, సోపోర్ లలో మరోసారి భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.