
కశ్మీర్: శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌లో సీర్‌పీఎఫ్ బలగాలపై దాడికి ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతాదళాలు హతమార్చాయి. జైషేమహ్మద్ సంస్థకి చెందిన ఉగ్రవాదులు భారత క్యాంపుపై దాటికి పన్నాగం పొందుతున్నారని ముందస్తూ సమాచారంతో బలగాలను ఆలర్ట్‌చేసి వారి చర్యను తిప్పికొట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రోండురోజుల క్రితమే దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదులు గ్రెనైడ్‌లతో 18 నెంబర్ సిఆర్‌పీఎఫ్ బెటాలియన్‌పై దాడికి దిగారని, ఈ ఆపరేషన్‌లో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టంగాని జరగలేదని కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు.
గతమూడు నెలల నుంచి జైషేమహ్మద్ ఉగ్రవాదులు భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. దానిలో భాగంగానే గత డిసెంబర్ 31న ఐదుగురి భారత సెక్యూరిటి సిబ్బందిని హతమార్చారని తెలిపారు. రాజధాని శ్రీనగర్‌కి 21కీ.మీ దూరంలో అబు అన్సార్ అనుచరులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని వారిని మార్చి 5న దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్ చేసినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.