శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ ప్రత్యేక దళాలకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఆదివారం ఉగ్రవాదులు, ఆర్మీ బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సైనికుడిని నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
‘‘జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వైట్ నైట్ కార్ప్స్ , అన్ని ర్యాంక్‌లకు చెందిన అధికారులమంతా నయాబ్ సుబేదార్ రాకేష్ కుమార త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం. భార్త్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించబడిన ఉమ్మడి కౌంటర్ ఎదురుకాల్పుల ఆపరేషన్‌లో భాగమై వీరమరణం పొందారు. ఈ దుఃఖ సమయంలో మేం మరణించిన కుటుంబానికి అండగా ఉంటాం’’ అని పేర్కొంది.
#GeneralUpendraDwivedi #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of #Braveheart Nb Sub Rakesh Kumar who laid down his life in the line of duty in J&K. #IndianArmy offers deepest condolences and stands firm with the bereaved family in this hour of grief. https://t.co/bJRZY7w8d3
— ADG PI - INDIAN ARMY (@adgpi) November 10, 2024
గ్రామ రక్షణ గార్డులు నజీర్ అహ్మద్ , కుల్దీప్ కుమార్‌ల బుల్లెట్‌తో కూడిన మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిన్న భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చిన తర్వాత గురువారం సాయంత్రం కుంట్వారా, కేష్వాన్ అడవుల్లో ఆర్మీ బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
చదవండి: జార్ఖండ్‌లో అవినీతిపరులను బీజేపీ విడిచిపెట్టదు: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment