srinagar
-
కొత్త జంటలకు ఏకాంతం.. ఆలుమగలకు ప్రశాంతం! ఈ రొమాంటిక్ ప్లేసెస్ గురించి ఎప్పుడైనా విన్నారా? (ఫొటోలు)
-
వీర లెవల్లో అందాలు అదరహో.. మంచుకురిసే వేళలో మైమరపిస్తున్న కశ్మీరం (చిత్రాలు)
-
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ ప్రత్యేక దళాలకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఆదివారం ఉగ్రవాదులు, ఆర్మీ బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సైనికుడిని నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘‘జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వైట్ నైట్ కార్ప్స్ , అన్ని ర్యాంక్‌లకు చెందిన అధికారులమంతా నయాబ్ సుబేదార్ రాకేష్ కుమార త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం. భార్త్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించబడిన ఉమ్మడి కౌంటర్ ఎదురుకాల్పుల ఆపరేషన్‌లో భాగమై వీరమరణం పొందారు. ఈ దుఃఖ సమయంలో మేం మరణించిన కుటుంబానికి అండగా ఉంటాం’’ అని పేర్కొంది. #GeneralUpendraDwivedi #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of #Braveheart Nb Sub Rakesh Kumar who laid down his life in the line of duty in J&K. #IndianArmy offers deepest condolences and stands firm with the bereaved family in this hour of grief. https://t.co/bJRZY7w8d3— ADG PI - INDIAN ARMY (@adgpi) November 10, 2024గ్రామ రక్షణ గార్డులు నజీర్ అహ్మద్ , కుల్దీప్ కుమార్ల బుల్లెట్‌తో కూడిన మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిన్న భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చిన తర్వాత గురువారం సాయంత్రం కుంట్వారా, కేష్వాన్ అడవుల్లో ఆర్మీ బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.చదవండి: జార్ఖండ్‌లో అవినీతిపరులను బీజేపీ విడిచిపెట్టదు: ప్రధాని మోదీ -
కశ్మీర్లో స్థానికేతరులపై ముష్కరుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్‌లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి. కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్‌కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. -
J&K: సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Updates కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు.శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించారు.#WATCH | Omar Abdullah takes oath as the Chief Minister of Jammu and Kashmir.The leaders from INDIA bloc including Lok Sabha LoP Rahul Gandhi, Congress leader Priyanka Gandhi Vadra, JKNC chief Farooq Abdullah, Samajwadi Party chief Akhilesh Yadav, PDP chief Mehbooba Mufti, AAP… pic.twitter.com/IA2ttvCwEJ— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇండియా కూటమి నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్‌న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా హాజరయ్యారు.అంతకు ముందు.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శ్రీనగర్ చేరుకున్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge reaches Srinagar to attend the swearing-in ceremony of Omar Abdullah as the Chief Minister of Jammu and Kashmir. pic.twitter.com/3OCIoQKqMP— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శ్రీనగర్ చేరుకున్నారు. Rahul Gandhi, Priyanka Gandhi arrive in Srinagar to attend swearing-in ceremony of Omar AbdullahRead @ANI Story | https://t.co/u7dPfwgpJc#RahulGandhi #OmarAbdullah #PriyankaGandhi #SwearingInCeremony #JKChiefMinister pic.twitter.com/SRTlRKJ6N8— ANI Digital (@ani_digital) October 16, 2024 జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు.. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత ప్రభుత్వంతో సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సీఎంగా స్వంత హక్కు ఉంది. నేను విచిత్రమైన సవాళ్లను కలిగి ఉన్నా. పూర్తి ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసిన చివరి ముఖ్యమంత్రిని నేను. ఇప్పుడు నేను జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిని అవుతాను. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది’’ అని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఇప్పటికే ఇండియా కూటమి నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్‌న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా చేరుకున్నారు. Samajwadi Party chief Akhilesh Yadav, DMK MP Kanimozhi Karunanidhi, NCP-SCP MP Supriya Sule and CPI leader D Raja in Srinagar to attend the swearing-in ceremony of J&K CM-designate Omar AbdullahOmar Abdullah to take oath as J&K CM today. (Pics: Akhilesh Yadav's social media… pic.twitter.com/TO4tSGzFmn— ANI (@ANI) October 16, 2024ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. -
శ్రీనగర్ లాల్‌చౌక్ కోసం మామ- మేనల్లుడు పోటీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సీటు కీలకమైన సీటుగా పేరొందింది. సెప్టెంబర్ 25న లాల్ చౌక్ స్థానానికి రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఈ సీటు నుంచి ఇతర అభ్యర్థులతో పాటు మామ, మేనల్లుడు కూడా తలపడుతున్నారు.లాల్ చౌక్ నుంచి అప్నీ పార్టీ సీనియర్ నేత అష్రఫ్ మీర్, పీడీపీ యువ అభ్యర్థి జుహైబ్ యూసుఫ్ మీర్ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసకు మామా- మేనల్లుడు. గతంలో అష్రఫ్ మీర్ పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుండి పోటీచేసి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఓడించారు. అయితే 2018లో బీజేపీ, పీడీపీ కూటమి తెగిపోవడంతో అష్రఫ్ మీర్ పీడీపీని వీడి అల్తాఫ్ బుఖారీ సొంత పార్టీ అయిన అప్నీలో చేరారు. కాగా జుహైబ్ బ్రిటన్ నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పట్టా పొందారు. మెహబూబా ముఫ్తీ అతనికి లాల్ చౌక్ నుండి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో లాల్ చౌక్‌లో మామ- మేనల్లుడు పోరు ఆసక్తికరంగా మారింది.మరోవైపు జమ్ము కశ్మీర్ చరిత్రలో ఏనాడూ ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈసారి లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన బలాన్ని చాటే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి అజాజ్ హుస్సేన్ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించి, ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత బీజేపీ ఇక్కడ పలు అభివృద్ధి పనులు చేసిందని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ -
జమ్మూకశ్మీర్ యువతలో సాధికారత మొదలైంది... శ్రీనగర్, కాత్రాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కశ్మీర్లో యువ వికాసం
శ్రీనగర్/కాత్రా: జమ్మూకశ్మీర్ యువత ఇక నిస్సహాయులు కాదని, వారితో సాధికారత మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యంపై యువతలో విశ్వాసం పెరిగిందని, ఓటుతో మార్పు వస్తుందని వారంతా నమ్ముతున్నారని తెలిపారు. గురువారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో, రియాసీ జిల్లా కాత్రాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని పునరుద్ఘాటించారు. తమ పరిపాలనలో ఇక్కడి యువతరం ప్రగతి పథంలో ముందడుగు వేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.జమ్మూకశ్మీర్ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అవన్నీ నెరవేరుస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలపై మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ మూడు కుటుంబ పార్టీలు సొంత లాభం కోసం ప్రజాస్వామ్యాన్ని, కాశ్మీరియత్‌ను అణచివేశాయని మండిపడ్డారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించకుండా దగా చేశా యని ఆరోపించారు. ఓటు వేసినా, వేయకున్నా ఆ మూ డు కుటుంబాలే పెత్తనం చెలాయిస్తాయన్న ఆలోచన యువతలో ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రజాస్వామ్య పండుగ ‘‘జమ్మూకశ్మీర్‌లో గత ఐదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో సాయంత్రం 6 గంటలకే ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సి వచ్చేది. ఇంటింటి ప్రచారం అసాధ్యమే. ఇప్పుడు అర్ధరాత్రి దాకా స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేవు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఓటు ప్రజాస్వామిక హక్కు, ఆ హక్కుతో చుట్టూ ఉన్న సమాజంలో కోరుకున్న మార్పును సాధించుకోవచ్చన్న భరోసా యువతలో ఏర్పడింది. సాధికారత దిశగా ఇదొక గొప్ప ముందడుగు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం.కుటుంబంలో ఒక మహిళకు ఏటా రూ. 18 వేల చొప్పున ఇస్తాం. ఆరోగ్య బీమాను రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతాం. జమ్మూకశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందాన్నలదే మా ఆశయం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు జమ్మూకశ్మీర్ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. నూతన జమ్మూకశ్మీర్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లే ఎన్నికలివి. అందుకే తెలివిగా ఓటు వేయాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షకు చరమగీతం పాడుతాం. ఇప్పుడు మన నినాదం అబ్కీ బార్.. బీజేపీ సర్కార్’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
జమ్ముకు పర్యటకులు ఖైదీల్లా వచ్చి వెళ్తున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి టూరిజం అభివృద్ధి చెందినట్లు బీజేపీ చేస్తున్న వ్యాఖ్యపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. టూరిజం అభివృద్ధి చెందటం కాదు..టూరిస్టులు ఖైధీల వలే వచ్చి వెళ్తున్నారని అన్నారు. ఆయన ఓ జాతీయా మీడియాతో వచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఒకవైపు.. జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతూనే అమర్నాథ్ యాత్ర సందర్భంగా కేంద్రం భారీగా భద్రతా బలగాలను మోహరిస్తున్నాయి.అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇంత భారీగా భద్రతా బలగాలను ఎప్పుడూ మోహరించలేదు. జమ్ము కశ్మీర్‌కు వచ్చే.. టూరిస్టులు భయం కుప్పిట్లో ఖైదాల వలే బస్సుల్లో వచ్చి.. వెళ్లిపోతున్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సుమారు 200 ఏళ్ల కాలం పట్టిందిర. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కూడా చాలా సమయం పడుతుంది. గత ఐదేళ్లుగా జమ్ము కశ్మీర్‌పై పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ కేంద్రం ఇక్కడ ఉగ్రవాదాన్ని అదుపులోకి తీసుకురాలేకపోయింది. దీనికి రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జూన్‌లో జరిగిన ఉగ్రదాడే నిదర్శనం’ అని అన్నారు.ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ -
అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మనోజ్ ఇలా స్పందించారు.‘జమ్ము కశ్మీర్లో ప్రజల వద్ద రాహుల్ గాంధీ అభిప్రాయాలను సేకరించాలి. అప్పుడే రాహుల్‌కు మరింత అవగాహన వస్తుంది. కావాలంటే రహస్య బాలెట్ విధానంలో ప్రజాభిప్రాయాన్ని చేపట్టండి. ఇక్కడి 75 శాతం మంది ప్రజలు అభివృద్ధి జరగలేదని చెబితే నా పదవికి రాజీనామా చేస్తా’ అని అన్నారు. అలాగే.. జమ్ము కశ్మీర్లో ఎవరి ప్రభుత్వం కొలువుదీరినా వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండే లెఫ్టినెంట్ గవర్నర్‌కు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎల్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఒక రాజు ఉన్నారు. ఆయనే లెఫ్టినెంట్ గవర్నర్. ఆయన జమ్ము కశ్మీర్ ప్రజల సంపదను బయటి వ్యక్తులకు తరలిస్తున్నారు’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: ‘రాహుల్ గాంధీ.. మీకూ మీ నాన్నమ్మ గతే పడుతుంది’ -
ఎయిర్‌ఫోర్స్‌లో లైంగిక వేధింపులు.. వింగ్ కమాండర్‌పై కేసు
శ్రీనగర్: భారత వైమానిక దళంలో సీనియర్ ర్యాంక్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్ బేస్‌లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్ అధికారి వింగ్ కమాండర్ పీకే సెహ్రావత్ బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్ వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.అనంతరం వింగ్ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.అప్పటి నుంచి అనేక సార్లు వింగ్ కమాండర్ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.అయితే వింగ్ కమాండర్‌పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురి ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గురువారం కుప్వారా, రాజౌరీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందటంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం భద్రతా బలంగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.‘ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం అదించింది. దీంతో 28, 29 తేదీల్లో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులతో సంయుక్తంగా మచల్, కుప్వారా ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టాం. ప్రతికూల వాతావరణంలో అనుమానాస్పద కదలికలుపై కాల్పులు జరిపాం. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు’ అని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ‘ఎక్స్’లో పేర్కొంది.OP PHILLORA, TANGDHAR #Kupwara Based on intelligence inputs regarding likely infiltration bids, a Joint anti-infiltration Operation was launched by #IndianArmy & @JmuKmrPolice on the intervening night of 28-29 Aug 24 in general area Tangdhar, Kupwara. One terrorist is likely to… pic.twitter.com/R2N6ql2NgM— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 29, 2024 ఇవాళ ఉదయం కుప్వారా మచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేత కర్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.J-K: One terrorist likely killed in anti-infiltration Op in KupwaraRead @ANI Story | https://t.co/R5Q1x1r2rp#Infiltration #Kupwara #IndianArmy pic.twitter.com/8aJvooyP4i— ANI Digital (@ani_digital) August 29, 2024 -
చిన్నారులతో పానీపూరీ తిన్న రాహుల్ గాంధీ
శ్రీనగర్‌ను సందర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక రెస్టారెంట్లో చిన్నారులతో పాటు పానీ పూరీ తిన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ హోటల్ అహ్దూస్లో విందు ఆరగించారు. అలాగే చిన్నారులతో పాటు పానీ పూరీ తిన్నారు.శ్రీనగర్‌లోని వ్యూ రెసిడెన్సీ రోడ్ ప్రాంతంలో రాహుల్ గాంధీ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన బసచేసిన హోటల్ చుట్టూ పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఈ హోటల్లో రాహుల్ గాంధీ ఎవరికి కలుసుకున్నారనేది వెల్లడికాలేదు. थोड़ी पानी-पूरी.. थोड़ी Chit-Chat और ढेर सारा प्यार pic.twitter.com/TvBqFdVDIo— Congress (@INCIndia) August 21, 2024కాగా రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ పర్యటనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆయనకు పలు సవాళ్లు విసిరింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏపై రాహుల్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకు రాహుల్‌కు అవకాశం ఏర్పడిందని బీజెపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. కాంగ్రెస్ కొన్ని దశాబ్దాల పాటు జమ్ము కశ్మీర్లో వేర్పాటువాదం, ఉగ్రవాద వాతావరణానికి ఆజ్యం పోశాయని ఆరోపించారు. అయితే 2014లో కేంద్రంలో బీజెపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మారిపోయాయన్నారు.#WATCH | Jammu & Kashmir | Lok Sabha LoP & Congress MP Rahul Gandhi along with Congress national president Mallikarjun Kharge visits an ice cream parlour at Srinagar's Lal Chowk.Both the Congress leaders arrived in Srinagar, J&K, earlier today. They will meet party leaders and… pic.twitter.com/vIDkbY9FLw— ANI (@ANI) August 21, 2024 -
శ్రీనగర్‌లో దేశభక్తి పరవళ్లు... వైరల్ వీడియో
భారతదేశం నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఒక వీడియో దేశభక్తిని పరవళ్లు తొక్కిస్తోంది. దీనిని చూసిన భారతీయుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది.ఈ వీడియోలో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ దగ్గర ఓ యువకుడు జెండాను గాలిలో ఊపుతూ కనిపిస్తున్నాడు. ఆ యువకుడు ఖాకీ ప్యాంటు ధరించి, శరీరం పైభాగంలో త్రివర్ణాలను పెయింట్ చేయించుకున్నాడు. ఆ యువకుడి కడుపుపై అశోకచక్రం, ఛాతీపై భారత్ అని రాసి ఉంది. అతను భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.2019లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ముగిసింది. ఈ ఆర్టికల్‌ను తొలగించిన ఐదేళ్ల తర్వాత, కశ్మీర్లో శాంతి నెలకొంది. ఇక్కడి ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరారు. భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జమ్ముకశ్మీర్ అత్యంత వేడుకగా చేసుకుంటోంది. #WATCH | #IndependenceDay2024 | Lal Chowk in Jammu & Kashmir's Srinagar is all decked up as India celebrates its 78th Independence Day. pic.twitter.com/SVmzg7iqdX— ANI (@ANI) August 15, 2024 -
కాశ్మీర్‌లోయలో కుండపోత.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లాలో ఆదివారం(ఆగస్టు4) కుండపోత(క్లౌడ్‌బర్స్ట్) వర్షం కురిసింది. దీంతో శ్రీనగర్-లేహ్ జాతీయరహదారికి దారి తీసే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్- లేహ్ జాతీయరహదారిపైనా ట్రాఫిక్‌ను రద్దు చేయడంతో బల్టాల్ వద్ద అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. -
రికార్డులు బద్దలు కొట్టిన శ్రీనగర్, బారాముల్లా ఓటర్లు
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా రెండు దశల పోలింగ్ మిగిలివుంది. ఐదవ దశ ఓటింగ్‌లో జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదయ్యింది.సోమవారం జరిగిన పోలింగ్‌లో బారాముల్లాలో 59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది 1984 తర్వాత అత్యధికం. కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారి పీకె పాల్ ఈ వివరాలను తెలిపారు. 1967లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు బారాముల్లా లోక్ సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందన్నారు. 1984లో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 58.90 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఇది 59శాతంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,37,865 మంది ఓటర్లు ఉన్నారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలోని 2,103 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2019లో ఈ నియోజకవర్గంలో 34.6 శాతం ఓటింగ్ జరగగా, 1989లో అది 5.48 శాతం మాత్రమే ఉంది.దీనికి ముందు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో శ్రీనగర్‌లో 38.49 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత అత్యధికం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇవే మొదటి సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడి ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు జమ్మూ కశ్మీర్ ఓటర్లకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. 38 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం. నాడు జమ్మూకశ్మీర్‌లోని ఈ స్థానంలో దాదాపు 41 శాతం ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు శ్రీనగర్ నియోజకవర్గంలో జరిగాయి.సోమవారం రాత్రి 11 గంటల వరకు శ్రీనగర్‌లో 38 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారిని ప్రశంసించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వలన జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి యువతకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు.ఓటింగ్‌లో పాల్గొన్న శ్రీనగర్ నియోజకవర్గ ప్రజలకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలు రాజకీయ పార్టీలు అభినందనలు తెలిపాయి. శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, గండేర్బల్, పుల్వామా జిల్లాలు, బుద్గామ్, షోపియాన్ జిల్లాల్లోని 2,135 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఓటింగ్ జరిగింది.ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గత 34 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 1996లో పోలింగ్ నమోదైంది. నాడు దాదాపు 41 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 14.43 శాతం ఓట్లు పోలయ్యాయని, అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లో అంటే 2014లో 25.86 శాతం 2009లో 25.55 శాతం, 2004లో 18.57 శాతం, 1999లో 11.93 శాతం, 1986లో 30.086 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. Would especially like to applaud the people of Srinagar Parliamentary constituency for the encouraging turnout, significantly better than before. The abrogation of Article 370 has enabled the potential and aspirations of the people to find full expression. Happening at the… https://t.co/2DvSCnXFKR— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
శ్రీనగర్‌లో భారీ బందోబస్తు మధ్య మొదలైన పోలింగ్!
శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమయ్యింది. శ్రీనగర్, పుల్వామా, బుద్గాం, గందర్బల్, షోపియాన్ జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 17.47 లక్షల మంది ఓటర్లు నేడు (సోమవారం) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహిళా ఓటర్ల కోసం 20 పింక్ బూత్‌లను ఏర్పాటు చేసి, అక్కడ మహిళా సిబ్బందిని నియమించారు.శ్రీనగర్‌లోని 18 బూత్‌లను వికలాంగుల పర్యవేక్షణలో, 17 బూత్‌లను యువకుల పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించేందుకు 21 గ్రీన్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశారు. శ్రీనగర్ పార్లమెంటరీ సీటు పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అన్ని కేంద్రాల నుండి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కంట్రోల్ రూంతోపాటు సీఈఓ కార్యాలయం నుంచి దీనిని వీక్షించనున్నారు. కొన్ని కేంద్రాల్లో శాటిలైట్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు ఏర్పాటు చేశారు. VIDEO | Jammu and Kashmir: Security heightened at Srinagar’s Lal Chowk ahead of polling.Voting for the fourth phase will be held today in 96 Lok Sabha Constituencies across 10 states and UTs. #LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos -… pic.twitter.com/tEjEU7AVlG— Press Trust of India (@PTI_News) May 13, 2024 సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలుచున్న చివరి ఓటరు ఓటు వేసే వరకు పోలింగ్ జరగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సంబంధిత బీఎల్ఓ ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికలను సురక్షితంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలతోపాటు ప్రధాన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
శ్రీనగర్. తోటల నగరం. నిషాత్ బాగ్, షాలిమార్ గార్డెన్స్, చషే్మషాహీ గార్డెన్, నెహ్రూ బొటానికల్ గార్డెన్, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ వంటి అత్యంత అందమైన పూదోటలకు, ప్రఖ్యాత దాల్ సరస్సుకు నిలయం. జమ్మూ కశీ్మర్లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ఒకటైన శ్రీనగర్‌లో సోమవారం పోలింగ్ జరగనుంది. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.... శ్రీనగర్‌లో ముక్కోణపు పోరు అబ్దుల్లాలదే ఆధిపత్యం జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370 రద్దయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలుండేవి. జమ్మూ కశీ్మర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాక ఐదు జమ్మూ కశీ్మర్ పరిధిలోకి, ఒకటి లద్దాఖ్ కిందకు వెళ్లాయి. శ్రీనగర్‌లో విజయం నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కశీ్మర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ) మధ్యే చేతులు మారుతుంటుంది. 2017 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు. అంతకుముందు 2014లో ఆయనపై పీడీపీ నేత తారిక్ హమీద్ కర్రా నెగ్గారు. 2009లో ఫరూక్ అబ్దుల్లా, 2004లో ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా విజయం సాధించారు. ఈసారి ఎన్సీ నుంచి ఆగా సయ్యద్ రుహుల్లా మెహెదీ, పీడీపీ నుంచి వహీదుర్ రెహమాన్ పర్రా, జమ్మూ కశ్మీర్ ఆప్నీ పార్టీ నేత మహమ్మద్ అష్రఫ్ మిర్ బరిలో ఉన్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పాంథర్స్ పార్టీ, లోక్తాంత్రిక్ పారీ్టతో పాటు 18 మంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో ఆది నుంచీ ఎన్‌సీదే ఆధిపత్యం. 13సార్లు ఎన్నికలు జరిగితే 10సార్లు ఆ పారీ్టయే విజయం సాధించింది. ఓటర్లలో నిరుత్సాహం... శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో 25.5 శాతం, 2014లో 25.86 శాతం పోలింగే నమోదైంది. ఇక 2019 ఎన్నికల్లో మరీ 14.43 శాతానికి పడిపోయింది! ఈసారి కూడా శ్రీనగర్ వాసుల్లో ఓటింగ్ పట్ల నిరుత్సాహమే కనిపిస్తోంది. వలసదారులకు ఉన్నచోటే ఓటు! జమ్మూ కశీ్మర్లోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ లోక్‌సభ స్థానాల పరిధిలో 1.13 లక్షల కశీ్మరీ వలసదారులు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 52,100 మంది శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటేయనున్నారు. వీరి కోసం జమ్మూలో 21, ఢిల్లీలో 4, ఉధంపూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అంతేగాక ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్ద దిగబెట్టే ఏర్పాట్లు కూడా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీనగర్‌లో నువ్వా? నేనా? అంటున్న ఎన్సీ, పీడీపీ?
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఈ నేపధ్యంలో శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం మే 13న ఆసక్తికర పోటీకి సిద్ధమైంది. మొత్తం 17,43,845 మంది ఓటర్లు.. బరిలో ఉన్న 24 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా రెండు లక్షల మంది ఓటు వేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించి, కేంద్ర పాలిత ప్రాంత హోదాను కల్పించారు. ఈ ప్రకియ తరువాత ఇప్పుడు తొలిసారిగా ఇక్కడ ఎన్నికల పోరు జరుగుతోంది. కశ్మీర్‌లోని ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీనగర్ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 17,43,845 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 8,73,426 మంది పురుషులు, 8,70,368 మంది మహిళలు కాగా, 51 మంది ట్రాన్స్జెండర్లు.భారత ఎన్నికల కమిషన్ అందించిన డేటా ప్రకారం శ్రీనగర్, గందర్బాల్, బుద్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో మొత్తం 2,135 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నుండి అఘా సయ్యద్ రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నుండి వహీద్-ఉర్-రెహ్మాన్ పర్రా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్‌కు అమీర్ భట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంపై నేషనల్ కాన్ఫరెన్స్‌కు మంచి పట్టు ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ 2014 మినహా 1977 నుండి 2019 వరకు నిరంతరం ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూక్ అబ్దుల్లా 1,06,596 ఓట్లతో విజయం సాధించారు. అయితే 2014లో పీడీపీ అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 1,57,923 ఓట్లతో గెలుపొందడంతో పరిస్థితి మారిపోయింది. కశ్మీర్‌లోని ఐదు స్థానాల్లో మూడింటిని ఎన్సీ కైవసం చేసుకుంది.జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు నేషనల్ కాన్ఫరెన్స్, రెండు బీజేపీ చేతిలో ఉన్నాయి. శ్రీనగర్ లోక్‌సభ స్థానం నేషనల్ కాన్ఫరెన్స్‌కు బలమైన కోటగా ఉంది. పార్టీ 1947 నుండి 15 పార్లమెంటరీ ఎన్నికల్లో 12 సార్లు ఈ సీటును దక్కించుకుంది.శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అబ్దుల్లా కుటుంబ ఆధిపత్యం మొదటి నుంచి ఉంది. అయితే ఈ సారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. శ్రీనగర్ లోక్‌సభ స్థానాన్ని సున్నితమైన స్థానంగా పరిగణిస్తారు. గత 35 ఏళ్లలో వేర్పాటువాదం, హింసాయుత ఘటనల కారణంగా ఈ ప్రాంతంలో తక్కువ శాతం ఓటింగ్ జరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈసారి ఇక్కడి ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. -
లాల్ చౌక్‌లో నేతల సందడి.. స్వేచ్ఛాయుత ఓటుకు జనం సిద్దం!
దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కశ్మీర్లో వినూత్న ఉదంతం చోటుచేసుకుంది. గతంలో కశ్మీర్ లోయలో ఎన్నికలు ప్రకటించినప్పుడు వేర్పాటువాదులు బహిష్కరణకు పిలుపునిచ్చేవారు. దాని ప్రభావం స్పష్టంగా కనిపించేది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎలాంటి బహిష్కరణ పిలుపు లేకుండా ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ రాజకీయ నినాదాలతో మారుమోగుతోంది. క్లాక్ టవర్ ఎన్నికల సభలకు వేదికగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదుల బంద్ పిలుపులు, రాళ్లదాడులు, ఎన్కౌంటర్లు, ఊరేగింపులకు అడ్డాగా నిలిచిన క్లాక్ టవర్ ప్రాంతంలో ఇప్పుడు వేర్పాటువాదుల బహిష్కరణ పిలుపు లేకుండా వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతున్నాయి.దీనిని 2019 తరువాత వచ్చిన భారీ మార్పుగా పరిగణిస్తున్నారు. స్థానికుడు సుహైల్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్లో గత కొన్నేళ్లలో వేర్పాటువాదులపై ఎన్ఐఏ తదితర ఏజెన్సీలు చర్యలను కఠినతరం చేశాయి. వేర్పాటువాదులలోని కొందరు గృహనిర్బంధంలో ఉండగా, మరికొందరు జైలులో ఉన్నారని తెలిపాడు. మరో యువకుడు జహూర్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో బహిష్కరణ పిలుపు ఇచ్చేవారికి భయపడి ఓట్లు వేసేవారు కాదని, అయితే ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ఉందని, ఈసారి తామంతా తమ హక్కును వినియోగించుకుంటామని తెలిపారు.అల్తాఫ్ ఘంటాఘర్, నౌహట్టా, జామియా మసీదు, గోజ్వారా, రాజౌరి కడల్, సిమెంట్ కడల్, ఈద్గా తదితర ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎటువంటి భయం లేకుండా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు అశాంతితో అట్టుడికిపోయే లాల్ చౌక్‌లో ప్రస్తుతం రాజకీయ నేతలు శాంతి సందేశం ఇస్తూ, తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. -
జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు.. జనజీవనం అతలాకుతలం!
జమ్ము కశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనికితోడు కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలియాయి. బారాముల్లా, కిష్త్వార్, రియాసి జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి.కిష్త్వార్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. దీని గురించి ప్రభుత్వ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రెస్క్యూ టీమ్ అప్రమత్తమయ్యిందన్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో నేడు (మంగళవారం) కశ్మీర్లో పాఠశాలలను మూసివేశారు.కశ్మీర్లో జరగాల్సిన ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వాయిదా పడింది. జమ్ము-శ్రీనగర్ హైవేలోని శిథిలాలు తొలగించే వరకు ఈ రహదారిపై ప్రయాణాలు సాగించవద్దని అధికారులు ప్రయాణికులకు సూచించారు. భారీ వర్షాల నేపధ్యంలో కిష్త్వార్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రియాసిలోని దోడా, రాంబన్, గులాబ్‌గఢ్‌లలో నదులు, వాగుల్లో నలుగురు కొట్టుకుపోగా, వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం తదితర ఘటనల్లో12 మంది చిన్నారులతో సహా 22 మంది గాయపడ్డారు. -
దశాబ్ది ఉత్సవాలు: తెలుగు సినిమా, సీరియల్స్ డబ్బింగ్ కళాకారుల సందడి!
హైదరాబాద్: శ్రీ నగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా, సీరియల్స్‌కి సంబంధించిన డబ్బింగ్ కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. DAATT అధ్యక్షుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు మాట్లాడుతూ ఇన్ని గళాలతో కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, రోజంతా బిజీగా గడిపే మా జీవితాలకు అన్ని పండగలు కలిసి ఓకే రోజు చేసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సీనియర్ నటి రోజా రమణి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వినోద్ బాల, కాదంబరి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ బంటి , DAATT కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ వర్మ, టీవీ విఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ ఆవిష్కరణ -
నా నెక్ట్స్ మిషన్ ‘వెడ్డింగ్ ఇన్ ఇండియా’: ప్రధాని మోదీ
శ్రీనగర్: ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత.. శ్రీనగర్‌లో ఇవాళ తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. బక్షి స్టేడియం వేదికగా ‘వికసిత్ భారత్ వికసిత్ జమ్మూకశ్మీర్’ కార్యక్రమంలో రూ.6,400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అద్భుతమైన శ్రీనర్ ప్రజల తాను ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, వారి మనసులు గెలుచుకునేందుకు తాను శ్రీనగర్ వచ్చినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగిందని తెలిపారు. 2023లో కశ్మీర్లో 2 కోట్ల మంది పర్యటించారని పేర్కొన్నారు. తన నెక్ట్స్ మిషన్ ‘వెడ్డింగ్ ఇన్ ఇండియా’ అని.. వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా జమ్మూకశ్మీర్‌ను తయారు చేయబోతున్నామన్నారు. #WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "J&K has been a huge victim of 'Parivarvad' and corruption. The previous governments here had left no stone unturned to destroy our J&K Bank, by filling the bank with their relatives and nephews, these 'Parivarvadis' have… pic.twitter.com/6PJVAlcI3Y — ANI (@ANI) March 7, 2024 ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు జమ్మూకశ్మీర్‌కు తరలివస్తున్నారన్నారు ప్రధాని మోదీ. జమ్మూకశ్మీర్ విజయగాథ ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని చెప్పారు. కశ్మీర్ సరస్సుల్లో ఎక్కడ చూసిన కమలం పూలు కన్పిస్తాయని..50 ఏళ్ల క్రితం ఏర్పడిన జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లోగో కూడా కమలమేనని తెలిపారు. బీజేపీ సింబల్ కూడా కమలమేనని అన్నారు. #WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says "This freedom from restrictions has come after the removal of Article 370. For decades, for political gains, Congress and its allies misled the people of Jammu and Kashmir in the name of 370 and misled the country. Did J&K… pic.twitter.com/SKMmjHxgvT — ANI (@ANI) March 7, 2024 ఆర్టికల్ 370పై కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు మోదీ. ఆర్టికల్ 370తో జమ్మూక్మర్ ఏం లాంభం జరిగిందని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కుటుంబాలే 370తో లబ్ది పొందాయని విమర్శించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ యువత కొత్త అవకాశాలు అందుకుంటున్నారని, అందరికీ సమాన అవకాశాలు, హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi launches and dedicates to the nation 53 projects worth Rs 6,400 crores at Srinagar's Bakshi Stadium. pic.twitter.com/5Mfe2kRdGw — ANI (@ANI) March 7, 2024 -
మీ ఆశీస్సులే మమ్మల్ని బతికించాయి: స్టార్ హీరో పోస్ట్ వైరల్!
ఇటీవల విమాన ప్రమాదాల గురించే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇలాంటి అనుభవాన్ని పంచుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా విమానం ల్యాండింగ్ సమస్య రావడంతో భయాందోళనకు గురైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. ఆ సమయంలో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఆమెతో పాటే ఉన్నారు. తాజాగా అలాంటి అనుభవమే మరో స్టార్ హీరోకు ఎదురైంది. తొలిసారి మృత్యువు నుంచి ఆ దేవుడే మమ్మల్ని కాపాడారంటూ కన్నడ నటుడు ధృవ సర్జా పోస్ట్ చేశారు. నా జీవితంలో మొదటిసారి ఎదురైన చేదు సంఘటనను ఇన్‌స్టా ద్వారా షేర్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఫ్లైట్ ల్యాండింగ్‌కు ఇబ్బందులు రావడంతో మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం అంతా క్షేమంగా ఉన్నామని వెల్లడించారు. ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఢిల్లీ నుంచి ఓ పాట చిత్రీకరణ కోసం శ్రీనగర్‌కు ధృవ సర్జా బృందం బయలుదేరింది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అందరూ ఒక్కసారిగా తీవ్ర భయందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ చాకచక్యంగా వ్యవహరించిన సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో చిత్రబృంద సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ మాకు నిజంగా పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఇండిగో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో తీవ్ర అల్లకల్లోల వాతావరణ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించడంతో శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. కాగా..కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఓ పాట షూట్ చేసేందుకు శ్రీనగర్ వెళ్లారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) -
సిబ్బందిని పొట్టనబెట్టుకుంది అతడే
జమ్మూ: శ్రీనగర్‌లో 1990 జనవరి 25వ తేదీన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సిబ్బందిపై కాల్పులు జరిపింది జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ అని ప్రత్యక్ష సాక్షి ధ్రువీకరించారు. ఆ రోజు ఘటన జరిగిన తీరును గురువారం ఐఏఎఫ్ మాజీ కార్పొరల్ రాజ్వర్ ఉమేశ్వర్ సింగ్ ప్రత్యేక సీబీఐ కోర్టుకు చెప్పారు. శ్రీనగర్ వైమానిక కేంద్రానికి వెళ్లేందుకు ఐఏఎఫ్ సిబ్బంది 1990 జనవరి 25వ తేదీ ఉదయం రావల్పొరాలో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో యాసిన్ మాలిక్‌తోపాటు కొందరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. యాసిన్ మాలిక్ తన దుస్తుల్లో నుంచి తుపాకీని బయటకు తీసి, యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా సహా నలుగురు నేలకొరగ్గా మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఉమేశ్వర్ సింగ్ ఒకరు. తీహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్ గురువారం జరిగిన కోర్టు విచారణకు వర్చువల్‌గా పాల్గొన్నాడు. ప్రత్యక్ష సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చని కోర్టు ఇచ్చిన అవకాశాన్ని యాసిన్ మాలిక్ తిరస్కరించాడు. తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కోరాడు. ఈ కేసులో మాలిక్, మరో అయిదుగురిపై 1990 ఆగస్ట్ 31వ తేదీన జమ్మూలోని టాడా కోర్టులో చార్జిషీటు దాఖలైంది. 1989లో అప్పటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా కిడ్నాప్, నేవీ అధికారులపై కాల్పుల కేసులు యాసిన్ మాలిక్‌పై ఉన్నాయి. -
లాల్‌చౌక్‌లో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు!
శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో తొలిసారిగా నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో పాల్గొన్న యువత అత్యంత ఉత్సాహంగా 2024కు స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి కశ్మీర్ యువత లాల్‌చౌక్ వద్దకు చేరుకుని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా అధికసంఖ్యలో లాల్‌చౌక్ వద్దకు తరలివచ్చారు. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉత్తర కాశ్మీర్లో ఎప్పుడూ మంచుతో నిండిపోయే గుల్మార్గ్ శీతాకాలపు ఎండలో మెరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఉదయం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. గుల్మార్గ్లో రోజంతా సందడి నెలకొంది. వివిధ సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకులు ఆనందంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. తొలిసారిగా ప్రభుత్వం లాల్‌చౌక్ దగ్గర భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. గతంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులు మాత్రమే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు మొదటి సారిగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. తమ కొత్త సంవత్సరం 2024 ఇలాంటి స్వర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వినూతన వేడుకలు.. This is #SrinagarSquare, #LalChowk right now! A city life never seen before. The celebration, the vibrancy like never before! This is the probably the biggest alibi to the transformation that Srinagar city has witnessed with the implementation of #SrinagarSmartCity projects!… pic.twitter.com/f3mL69RjFF — Athar Aamir Khan (@AtharAamirKhan) December 31, 2023 -
రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా..
దేశంలో వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు నెలకొనివుంది. దక్షిణ భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతోంది. హిమాచల్‌లోని కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఎముకలు కొరికే చలి వ్యాపించింది. శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లో ఈ సీజన్లో అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉష్ణోగ్రత -4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం రానున్న రెండు రోజుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu: Heavy rain lashes parts of Coimbatore city early morning pic.twitter.com/2b9NmFCStR — ANI (@ANI) December 9, 2023 తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం దేశంలోని జార్ఖండ్, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ , అండమాన్, నికోబార్ దీవులలో వర్షాలు కురుస్తాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 12న పశ్చిమ బెంగాల్, సిక్కింలో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 10న దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్‌లోనూ చలి ప్రభావం పెరుగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ⛈️ Weather Alert! Possibility of scattered rain in parts of #Karnataka and #Kerala! 🌧️ #RainyDay #KarnatakaWeather #KeralaRain pic.twitter.com/2zg3lu1P3U — Weather & Radar India (@WeatherRadar_IN) December 9, 2023 ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ విషయానికి వస్తే శనివారం ఉదయం చల్లగాలులు వీచాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్సీఆర్లో డిసెంబర్ 15 తర్వాత చలి గణనీయంగా పెరగనుంది. కనిష్ట ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి! -
తీవ్ర ఆందోళనలు.. శ్రీనగర్ నిట్ మూసివేత, ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని (ఎన్ఐటీ) అధికారులు మూసివేశారు. ఓ విద్యార్థి మతపరమైన అంశంపై సోషల్ మీడియాలో ఓ పోస్టు చేయడంతో నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనగు దిగారు. దీంతో ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలు ఇతర విద్యాసంస్థలకు కూడా వ్యాపించాయి. అప్రమత్తమైన ఎన్ఐటీ అధికారులు విద్యార్ధులకు శీతాకాల సెలవులను ముందుగానే ప్రకటించారు. గురువారం నుంచే సెలవులు అమల్లోకి వస్తామని యూనివర్సిటీ డీన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టూడెంట్స్ అందరిని తక్షణమే క్యాంపస్, హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. నిట్ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కశ్మీర్‌లోని ఇతర డిగ్రీ కాలేజీలు కూడా శనివారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. డిసెంబర్ 20లోగా పరీక్షలు ఉండగా,.. వాటిని వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను సెలవుల అనంతరం నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఉన్నట్టుండి హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎన్ఐటీలో చదువుతున్న దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ నుంచి అత్యవసరంగా బయలుదేరేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. మరోవైపు స్థానికేతర నిట్వి ద్యార్థి సోషల్ మీడియాలో దైవదూషణతో కూడిన పోస్ట్ చేయడంతో మంగళవారం ఈ వివాదం చెలరేగింది. ఇది ఇన్స్టిట్యూట్లో భారీ నిరసనలకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యంతరకరమైన పోస్టు చేసి ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైన యూట్యూబ్ వీడియోను పోస్టు చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు శ్రీనగర్ పోలీసులు తెలిపారు. -
దాల్ సరస్సులో ఘోర అగ్ని ప్రమాదం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు హౌస్బోట్లలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విదేశీ ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మాడి మసైన హౌస్‌బోట్ శిథిలాల నుంచి గుర్తుపట్టలేని విధంగా కాలిన మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతులు బంగ్లాదేశ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని అనిందయ కౌశల్, మహ్మద్ మొయినుద్, దాస్ గుప్తా అని తెలిసిందన్నారు. వీరున్న సఫీనా అనే హౌస్‌బోట్ పూర్తిగా దగ్ధమైందన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం అయిదు హౌస్బోట్లు, వాటికి పక్కనే ఉన్న ఏడు నివాస కుటీరాలు, కొన్ని ఇళ్లు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఘటనలో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. తొమ్మిదో నంబర్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంపై ఉదయం 5.15 గంటల సమయంలో ఫోన్లో సమాచారం అందగానే రంగంలోకి దిగి, ఎనిమిది మంది పర్యాటకులను రక్షించగలిగామని స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఫైర్ సర్వీస్) ఫరూక్ అహ్మద్ తెలిపారు. ఒక హౌస్‌బోట్‌లో చెలరేగిన మంటలు వేగంగా మిగతా బోట్లకు వ్యాపించాయన్నారు. అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తేగలిగామని వివరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఒక బోటులోని హీటింగ్ పరికరాల్లో లోపం కారణంగానే మంటలు అంటుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2022లోనూ డాల్, నగీన్ సరస్సుల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడు హౌస్బోట్లు బూడిదగా మారాయి. అప్పటి ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. మంటల్లోకాలి బూడిదైన హౌజ్బోట్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనర్‌లో ఉన్న దాల్ సరస్సులో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్సులో ఉన్న హౌజ్‌బోట్లకు ఉదయం నిప్పంటుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో అనేక బోట్లు కాలిబూడిదయ్యాయి. దాల్ సరస్సులో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Several houseboats were gutted in a fire in Srinagar's Dal Lake last night pic.twitter.com/uDtuOQO9yw — ANI (@ANI) November 11, 2023 ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సరస్సు వద్దకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాల్ సరస్సులోని ఘాట్ నెంబర్ 9 సమీపంలోని హోస్బోట్లో ఉదయం 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ మంటలు ఇతర బోట్లకు వ్యాపించినట్లు పేర్కొన్నారు. #WATCH | Srinagar, J&K: On fire in houseboats at Dal Lake, Station House Officer Fire Service Farooq Ahmad says, "The fire emerged at around 5:15 in the morning and as soon as I received the call we came here. Some 5-8 houseboats and huts were gutted in the fire. We can't… pic.twitter.com/rEQ0cSCDw7— ANI (@ANI) November 11, 2023 సరస్సు వద్ద భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అయిదు నుంచి ఎనిమిది పడవల వరకు పూర్తిగా దగ్ధం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. చదవండి: జైలు నుంచి ఇంటికి సిసోడియా..అనుమతిచ్చిన కోర్టు Deeply saddened by the devastating fire incident in Dal Lake, Srinagar, where several houseboats were gutted. Requesting @OfficeOfLGJandK and the district administration to kindly ensure swift and comprehensive assistance to those affected. Our thoughts are with the victims… pic.twitter.com/qgvkvcNcGN — Tanvir Sadiq (@tanvirsadiq) November 11, 2023 -
ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా ఆ గార్డెన్!
తులిప్ గార్డెన్ చూడగానే ఎవ్వరైన మంత్రముగ్ధులవ్వాల్సిందే. అంతలా అందంగా ఉంటాయి ఆ పూల మొక్కలు. చూడగానే కట్టిపడేసే అందంతో పాటు ఆహ్లాదాన్నీ పంచే తులిప్ పుష్పాల గురించి వర్ణించడం కష్టతరం. తలలో పెట్టుకునేందుకు ఇవి ఉపయోగపడకపోయినా.. గృహాలంకరణలో మాత్రం రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. అలాంటి తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా రికార్డులకెక్కింది. ఇది శ్రీనగర్‌లోని ఇందిరాగాంధీ మొమోరియల్ ఉంది. ఏకంగా 1.5 మిలియన్ల పూలతో ఈ రికార్డును కైవసం చేసుకుంది. ఈ ఉద్యానవనంలో 68 విభిన్న రకాల మొక్కల నుంచి సుమారు 1.5 మిలయన్ల పైగా తులిప్ పుష్పాలు ఉంటాయి. ఈ విషయం గురించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో ట్విట్టర్లో పేర్కొన్నారు కూడా. ఆయన ఈ సుందర వనాన్ని దాదాపు లక్షమంది దాక సందర్శించి ఉండొచ్చన్నారు. అలాంటి అందమైన తులిప్ గార్డెన్ ఆసియాలో అతిపెద్దది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. తులిప్ అంటే లాటిన్ భాషలో తలపాగా అని అర్థం. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్‌లో దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు ఉన్నాయి. ఈ మొక్కలను మనం వెంకటేష్ టబు నటించిన కూలీ నెం.1 సినిమాలో చూశాం. అందులో "కొత్తకొత్తగా ఉన్నది..స్వర్గమిక్కడే అన్నది" అనే పాటలోఒ ఈ గార్గెన్ని కనిపిస్తుంది. చాలాచాలా బాలీవుడ్ సినిమాల్లో కూడా ఉండొచ్చు గానీ. మనీకు తెలిసినంతవరకు ఆ తులిప్ పూలను చూస్తే మనకు మాత్రం నిస్సందేహంగా ఆ పాట గుర్తుకొస్తుంది. నిజంగా ఆ పూలను చూసే అలా పాట రాశారేమో కాబోలు. ఇక ఈ తులిప్ తోట శ్రీనగర్‌లోని దాల్ సరస్సు జబర్వాన్ కొండల మధ్య ఉంది. ఈ ఉద్యానవనం సుమారు 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. గతంలో దీని సిరాజ్ బాగ్ అనిపిలిచే వారు. శ్రీనగర్ టూరిజం ప్రకారం ఈ ఉద్యానవనం 2007లో పూల పెంపకంతో పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ కాశ్మీర్ లోయలో ఏడు టెర్రస్లతో కూడిన టెర్రస్ పద్ధతిలో నేలపై ఏటవాలుగా ఈ గార్డెన్‌ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆ గార్డెన్‌లోని వివిధ రకాల పూలతో తులిప్ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి వసంత రుతువులో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించడం విశేషం. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భారత సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా హలాన్ అటవీ ప్రాంత పరిసరాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందడంతో భారత మిలటరీ వర్గాలు ఆగస్టు 4న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైన్యం ఉగ్రవాదుల జాడను జల్లెడ పడుతుండగా ఒక్కసారిగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు. ఉగ్రవాదులు చేసిన కాల్పులకు ప్రతిగా సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వారు చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు ఆ అధికారి తెలిపారు. హాలాన్ అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఉనికి ఇంకా ఉన్నట్టు మావద్ద పక్కా సమాచారముందని భారత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని అయన తెలిపారు. Operation Halan #Kulgam On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed. Search operations… pic.twitter.com/NJ3DZa2OpK — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023 ఇది కూడా చదవండి: Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి -
‘థాంక్యూ మోదీజీ’.. కశ్మీర్ యువతి బైక్ రైడ్ వీడియో వైరల్
శ్రీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక, కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL — Nusrat Fatima (@knusrata) August 4, 2023 మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. Action taken under relevant sections of MV Act. Violator also counseled not to repeat such acts. pic.twitter.com/To30U8FaiB — Traffic City Srinagar. (@SSPTFCSGR) August 4, 2023 ఇది కూడా చదవండి: నోర్మూయ్, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్ లొళ్లి -
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు బాంబ్ స్క్వాడ్. శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఐఈడీని అమర్చిన ఉగ్రవాదులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం నిముషాల వ్యవధిలో దాన్ని నిర్వీర్యం చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు అప్పుడే భారత దేశంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేశాయి ఉగ్రమూకలు. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఐఈడీ ని అమర్చారు ఉగ్రవాదులు. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఒక బ్యాగ్ కనిపించడంతో స్థానికులు అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ కు సమాచారమందించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఐఈడీని నిర్మానుష్య ప్రదేశంలో నిర్వీర్యం చేశాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.. ఒకవేళ ఈ పేలుడు గనుక యధాతధంగా జరిగి ఉంటే భారీగా నష్టం వాటిల్లేది. ఇది కూడా చదవండి: ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా -
కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటుకి చెందిన జవాను జావేద్ అహ్మద్ కొద్దిరోజుల క్రితమే సెలవులపై ఇంటికి తిరిగొచ్చాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చిన అతడు తర్వాత అదృశ్యమైనట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. దక్షిణ కాశ్మీర్ లో నివాసముండే భారత జవాను జావేద్ అహ్మద్(25) జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన జావేద్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళాడు. రాత్రి 9.00 అయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మార్కెట్ కు కొంత దూరంలో రక్తపు మరకలు అంటుకున్న కారు కనిపించింది కానీ అందులో జావేద్ లేడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాశ్మీర్ పోలీసులు కేసును నమోదు చేసి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి.. దయచేసి మమ్మల్ని క్షమించండి.. నా కుమారుడిని విడుదల చేయండి, నా జావేద్ ను విడుదల చేయండి.. వాడిని సైన్యంలో పనిచేయకుండా ఆపుతాను.. కానీ వాడిని విరిచిపెట్టండి.. అంటూ జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని కూడా సిద్ధం చేశారు. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..? -
మరోసారి హిజాబ్ వివాదం తెరపైకి.. ప్రిన్సిపాల్ క్షమాపణ
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్ధినులను బుర్ఖా వేసుకోకూడదని వారించిన ప్రిన్సిపాల్ కు ఉగ్రవాదుల నుండి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ ప్రినిసిపాల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తన వలన ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మాత్రం క్షమించమని కోరారు. ఉవ్వెత్తున నిరసన జ్వాల.. విశ్వభారతి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు చెప్పిన వివరాల ప్రకారం సదరు ప్రిన్సిపాల్ మేడమ్ కొంతమంది విద్యార్థినులను మాత్రం స్కూల్లో బుర్ఖా ధరించవద్దని చెప్పేవారట. అది మా ఆచారమని దయచేసి అనుమతించమని పదే పదే వేడుకుంటూనే ఉన్నాము. కానీ ఆమె ఇతర విద్యార్థినులకు అనుమతినిచ్చి మాకు మాత్రమే అనుమతినిచ్చేవారు కాదు. అంతగా కావాలంటే మమ్మల్ని పోయి మదర్సాలో చేరమని చెప్పారు. ఈ వివక్షను వ్యతిరేకిస్తూ మేము నిరసన చేపట్టామని తెలిపారు. బెదిరింపులు.. విద్యార్థినుల నిరసన వీడియోలు బాగా వైరల్ అయిన తర్వాత ఉగ్రవాదుల నుండి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫోన్ బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. దీంతో అదేరోజు సాయంత్రం ప్రిన్సిపాల్ విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇది కూడా చదవండి: కెనడాలో ఇందిరా గాంధీకి ఘోర అవమానం! -
రామ్ చరణ్ అరుదైన ఘనత.. తొలి భారతీయ నటుడిగా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనతను అందుకున్నారు. శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో చెర్రీ పాల్గొంటున్నారు. ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్ అనే కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులతో చరణ్ భేటీ కానున్నారు. పలు దేశాల నుంచి సెలబ్రిటీలు ఈ చర్చలో పాల్గొంటారు. (ఇది చదవండి: వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని) ఇలాంటి ప్రతిష్ఠాత్మక సమ్మిట్‌కు టాలీవుడ్ హీరో హాజరు కావడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ వేదిక జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ చర్చలో భారత్ నుంచి చరణ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యాటక రంగంపై జీ20 సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే సమావేశాలకు దాదాపు 60 మందికిపైగా విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. (ఇది చదవండి: Sarath Babu: శరత్‌బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..) కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం కియారా అద్వానీతో 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. అయితే త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నసంగతి తెలిసిందే. ఈ అరుదైన సందర్భం కోసం మెగా కుటుంబం ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తోంది. Srinagar welcomes our Global star @AlwaysRamCharan garu for the prestigious #G20Summit along with influential leaders from across the Globe. #GlobalStarRamCharan #ManOfMassesRamCharan #RamCharan#GlobalStarRCfrG20Summit #RamCharanForG20Summit pic.twitter.com/7WGzbPaQa1 — SivaCherry (@sivacherry9) May 22, 2023 -
G20 Meet: శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు
సాక్షి, శ్రీనగర్: భారత్ జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగరలో సోమవారం జీ 20 దేశాల మూడో పర్యాటక కార్యవర్గ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. కేంద్రం జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను రద్దు చేసిన తదనంతరం ఈ ప్రాంతంలో ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. జీ20లో ప్రెసిడెన్సీలో భారత్ సగానికి చేరుకుందని, ఇప్పటి వరకు 118 సమావేశాలు జరిగాయని జీ20 చీఫ్ కోఆర్టినేటర్ హర్షవర్ధన్ షింఘూ తెలిపారు. అంతేగాదు టూరిజంపై గతంలో జరిగిన రెండు సమావేశాలతో పోల్చితే శ్రీనగర్ సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని అన్నారు. ఈ జీ20 సదస్సు కోసం సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరవనున్నారుని చెప్పారు. శ్రీనగర్‌లో జరగుతున్న ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో సింగపూర్ నుంచి ప్రతినిధులు విచ్చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాదు ప్రత్యేక ఆహ్వానిత అతిథి దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. అక్కడ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్న చైనా.. కాశ్మీర్లో జీ20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా ఈ ఈవెంట్ కోసం సౌదీ అరెబీయా నమోదు చేసుకోలేదు. టర్కీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. వివాదాస్పద ప్రాంతాల్లో జీ20 సమావేశాలను ఏ రూపంలోనైనా నిర్వహించడాన్ని చైనా తప్పుపడుతోంది. అలాంటి సమావేశాలకు చైనా హాజరుకాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. అంతతేగాదు భారత్ తన సొంత భూభాగాల్లో ఇలాంటివి నిర్వహించుకోవడం ఉత్తమం అంటూ ఓ ఉచిత సలహ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా, ఈ జీ20 కార్యక్రమం కోసం శ్రీనగర్‌లో చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులు, నేల నుచి గగనతలం వరకు భారీగా మోహరించారు. యాంటీ డ్రోన్లతో గస్తీ, ఆర్మీ బోర్డర్(బీఎస్ఎఫ్). సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), సశాస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) జమ్ము కాశ్మీర్ పోలీసులతో సహా వేలాది మంది సైనికులు గట్టిగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే జీ20 ప్రతినిధులు ఉపయోగించే మార్గంలో ట్రాఫిక్ కదలికలపై ఆంక్షలు కూడా విధించారు. కాగా, సందర్శనా కార్యక్రమంలో భాగంగా G20 ప్రతినిధులు శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పోస్ట్‌కార్డ్‌గా మారిన పోలోవ్యూ మార్కెట్‌ను కూడా సందర్శిస్తారు. అంతేగాదు త్వరలో జరగనున్న జి-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతమైతే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల ప్రవాహం, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. CRPF Commandos, Marcos, and Black cat Commandos all geared up for the upcoming G20 summit in Srinagar pic.twitter.com/sMja7GHlX2 — The Asian News Hub (@AsianNewsHub) May 20, 2023 (చదవండి: 'నితీష్ జీ ప్రధాని కావాలనే పగటి కల'ను కనడం మానేయండి!) -
రక్షణ వలయంలో శ్రీనగర్
శ్రీనగర్: శ్రీనగర్‌లో నేటి నుంచి జీ–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఉగ్ర బెడద నేపథ్యంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తత ప్రకటించాయి. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్(ఎన్ఎస్జీ) కౌంటర్ డ్రోన్ బృందాలు గగనతలంపై కన్నేసి ఉంచాయి. సుందర దాల్ సరస్సుపై నేవీ మెరైన్ కమాండోలు గస్తీ చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా మోహరింపులు, తనిఖీలు ముమ్మరమయ్యాయి. వివిధ దేశాల నుంచి హాజరయ్యే 60 మంది ప్రతినిధులు, 20 మంది జర్నలిస్టుల కోసం సమావేశాల వేదికైన షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ) వద్ద యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశమిది. దీంతో, సమావేశ వేదికతోపాటు, వారు బస చేసే ప్రాంతం, ఆ పక్కనే ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణిపై ఆర్మీ బలగాలను రంగంలోకి దించారు. ఉగ్రమూకలు ఐఈడీలతో విధ్వంసానికి పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషేమొహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆదివారం కుప్వారా జిల్లాలో సోదాల సమయంలో బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సైన్యం కదలికల సమాచారాన్ని అతడు పాక్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. పూంఛ్‌లో సరిహద్దులకు సమీపంలో మెంధార్ సెక్టార్ వద్ద అనుమానాస్పద కదలికలతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సోదాలు పూర్తయ్యేదాకా ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రజలను అధికారులు కోరారు. -
జీ20 భేటీపై చైనా అభ్యంతరం.. భారత్ దీటైన జవాబు
శ్రీనగర్: ఈ నెల 22–24 తేదీల మధ్య జి–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించడంపై చైనా అభ్యంతరం తెలిపింది. జి–20కి సంబంధించిన ఏ విధమైన సమావేశాల్ని కూడా వివాదాస్పద ప్రాంతాల్లో జరపరాదని, అటువంటి సమావేశాలకు తాము హాజరుకాబోమని శుక్రవారం పేర్కొంది. దీనిపై భారత్ దీటుగా స్పందించింది. ‘మా సొంత భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు జరుకునే స్వేచ్ఛ మాకుంది. చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడటం అవసరం’అని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరు కారాదని టర్కీ ఇప్పటికే ప్రకటించగా, సౌదీ అరేబియా నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 100 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే, సుమారు 60 మంది హాజరవుతారని తాజాగా అంచనా వేస్తోంది. ఇలా ఉండగా, జి–20 సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మెరైన్ కమాండోలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ)ను రంగంలోకి దించింది. ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించవచ్చన్న అనుమానాల నేపథ్యంలో జి–20 సమావేశాల వేదిక, దాల్‌లేక్‌ను భద్రతా బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. -
ఎంతపనైపాయే! వార్నింగ్ లైట్ వచ్చిందని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే..
వార్నింగ్ లైట్ వెలిగిందని అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. తీరా అధికారులు విమానంలో సోదాలు నిర్వహించగా..అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలు దేరిన స్పైస్ జెట్ విమానం అనూహ్యంగా కొద్దిసేపటిలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి వచ్చింది. కాక్‌పిట్ నుంచి వార్నింగ్ లైట్ వెలగడంతో ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. దీంతో వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్ చర్యతో ఒక్కసారిగా వార్నింగ్ లైట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వద్ద ఆ విమానాన్ని తనిఖీ చేయగా తప్పుగా వార్నింగ్ లైట్‌ని చూపిందని తేలడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు అధికారులు. కాక్‌పీట్‌లోని కార్గోలో ఎలాంటి పొగ, మంటలు వచ్చిన సంకేతాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఆ విమానం 140 మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం శ్రీనగర్‌కు బయలు దేరినట్లు తెలిపారు. తదనంతరం సాధారణ తనిఖీలను పూర్తి చేసి ఆ విమానం తిరుగు పయనమైనట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: మిస్ అయిన మాజీ రైల్వే మంత్రి..హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై..) -
శ్రీనగర్ : తులిప్ గార్డెన్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
ప్రధాని కార్యాలయ అధికారిగా బురిడీ కొట్టించి..చివరికి పోలీసులకు చిక్కి..
ముగ్గురు వ్యక్తులు ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారనంటూ ఫోజులిస్తూ జమ్ముకాశ్మీర్ యంత్రాంగాన్ని మోసగించారు. ఈ మేరకు గుజరాత్‌కి చెందిన కిరణ్ భాయ్ పటేల్ నేతృత్వంలోని బృందంలో ముగ్గురు వ్యక్తులు పీఎంఓ అధికారులుగా నటిస్తూ.. జమ్మూకాశ్మీర్‌లో పర్యటించి, బుల్లెట్ ప్రూఫ్ మహింద్రా స్కార్పియో కార్లలో తిరుగుతూ ఫైవ్ స్టార్ హోటళ్లలో అతిధ్యం అందుకున్నారు. వారి చేతిలో మోసపోయిన జమ్ము కాశ్మీర్ అధికారులు వారికి సకల రాచమర్యాదలు అందించారు. గతేడాది నుంచి ఈ ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన బృందం కశ్మీర్లో పర్యటిస్తుంది. అదికూడా రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి పర్యటనకు రావడంతో అనుమానం తలెత్తి.. భద్రతా అధికారులు సీఐడీకి సమాచారం అందించారు. కిరణ్ భాయ్ పటేల్ తోపాటు ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన అమిత్ హితేష్ పాండియా, జే సితాపరా, రాజస్థాన్‌కి చెందిన త్రిలోక్ సింగ్‌లుగా గుర్తించారు. వీరంతా పీంఎంఓ బృందంగా నటిస్తూ.. గతుడాది అక్టోబర్ నుంచి కాశ్మీర్లో నాలుగు సార్లు పర్యటించారు. అధికారిక వర్గాల ప్రకారం..దక్షిణ కాశ్మీర్లో జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారి సదరు సీనియర్ పీఎంఓ అధికారి సందర్శన గురించి పోలీసుల భద్రతా విభాగానికి సమాచారం అందించినట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. దీంతో భద్రతా విభాగం నిందితుడు పటేల్‌కు జెడ్ ప్లస్ భద్రతలను అందించడమే గాక అక్టోబర్ నుంచి నాలుగు పర్యటనల్లో అతను ఎక్కడికి వెళ్లినా వీఐపీ హోదాగా వెంట స్థానిక పోలీసులు కూడా వచ్చారు. సదరు మోసగాడు కిరణ్ భాయ్ పటేల్ అక్కడ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి, నియంత్రణ రేఖ సమీపంలోని ఉరిలోని కమాన్ పోస్ట్ నుంచి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌కు వరకు పర్యటించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. అంతేగాదు అక్కడ దూద్పత్రిని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నిందితుడు పటేల్ తొలిసారిగా అక్టోబర్ 27న తన కుటుంబంతో సహా పర్యాటనకు వచ్చాడని ఆ తర్వాత పర్యటనలో ఈ ముగ్గురు వ్యక్తులు చేరినట్లు తెలిపారు. గట్టి నిఘాపెట్టిన సీఐడీ వర్గాలు అతడి గత చరిత్రను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆ వ్యక్తిని చాలా పకడ్బంధింగా అరెస్టు చేశారు. ఐతే పటేల్ అరెస్టు కావడానికి కొద్ది నిమిషాల ముందు మిగతా ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. వారికి సహకరించిన ఇద్దరు పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నారు. కాగా, నిందితుడు పటేల్‌ని దర్యాప్తు చేసేందుకు గుజరాత్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు తెలిపారు. (చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..) -
చలో ‘భారత్ జోడో’ సభ
సాక్షి, హైదరాబాద్: గతేడాది సెప్టెంబర్ 7న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు తరలివెళ్లారు. సోమవారం జరిగే ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఆదివారమే రేవంత్‌రెడ్డి శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీని కలిశారు. వీరితోపాటు నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు శ్రీనగర్‌కు వెళ్లారు. భారత్ జోడోయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులకు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఈ నాయకులందరూ శ్రీనగర్ బాట పట్టారు. నేడు సంఘీభావంగా సర్వమత ప్రార్థనలు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. భారత్ జోడోయాత్ర ముగింపు, గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనామందిరాల్లో ప్రత్యేక పూజలు చేయాలని ఇటీవల జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. జనవరి 26న హాథ్ సే హాథ్ జోడో యాత్రలను లాంఛనంగా ప్రారంభించగా, 30న అన్ని మతాల ప్రార్థనలు చేసి, ఫిబ్రవరి 6 నుంచి అట్టహాసంగా హాథ్ సే హాథ్ జోడో యాత్రలను ప్రారంభించి రెండు నెలలపాటు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను శుక్రవారం భద్రత లోపాల దృష్ట్యా సడెన్‌గా నిలిపివేసిన సంగతి తెలిసింది. ఆ తదనంతరం శనివారం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లాల కట్టుదిట్టమైన భద్రత నడుమ పునః ప్రారంభమైంది. ఇక ఈ యాత్ర ముగుస్తున్న తరుణంలో రాహుల్ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా తోపాటు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు కేటాయించిన భద్రతను కాంగ్రెస్ నేతలకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేగాదు గత రాత్రి నుంచే లాల్ చౌక్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేసి, వాహానాల రాకపోకలను నియంత్రించారు. ఈ యాత్ర బౌలేవార్డ్ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఎంఏ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఎస్కే స్టేడియంలో బహిరంగ ర్యాలీ నిర్వహిస్తారు. దీనికి 23 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యూకుమారి నుంచి ప్రారంభమై సుమారు 75 జిల్లాలు పర్యటించి దాదాపు 3,570 కి.మీ పాదయాత్ర చేశారు రాహుల్. #WATCH | Jammu and Kashmir: Congress MP Rahul Gandhi unfurls the national flag at Lal Chowk in Srinagar. pic.twitter.com/I4BmoMExfP — ANI (@ANI) January 29, 2023 (చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం) -
ఒవైసీకి శ్రీనగర్ పోలీసుల స్ట్రాంగ్ కౌంటర్
శ్రీనగర్: ఏఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి శ్రీనగర్ పోలీసులు కౌంటర్ ఇచ్చారు. జామియా మసీద్ విషయంలో ఒవైసీ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. సోఫియాన్, పుల్వామాలో తాజాగా మల్టీపర్పస్ సినిమా హాల్స్‌ను ప్రారంభించారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. దీంతో హాల్‌కు వెళ్లి సినిమా చూడాలన్న అక్కడి ప్రజల చిరకాల కల నెరవేరిందంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఎంపీ ఒవైసీ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. శ్రీనగర్‌లోని జామియా మసీద్‌ను ప్రతీ శుక్రవారం మూసేస్తున్నారని, కనీసం శుక్రవారం మధ్యాహ్న సమయంలో అయినా తెరవాలంటూ ఎల్జీని ఉద్దేశిస్తూ ఎద్దేవా ట్వీట్ చేశారు ఒవైసీ. అయితే దీనికి.. శ్రీనగర్ పోలీసులు ట్విటర్ ద్వారా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘జామియా పూర్తిగా తెరిచే ఉంటోంది. కరోనా తర్వాత కేవలం మూడు శుక్రవారాల్లో మధ్యాహ్న నమాజ్ సమయంలో మాత్రమే, అదీ ఉగ్రదాడి సమాచారం, శాంతిభద్రతల సమస్యలతో మూతపడింది. లోపల జరిగే సంఘటనలకు తమది బాధ్యత కాదని జామియా అధికారులు ప్రకటించిన నేపథ్యంలోనే తాత్కాలికంగా ఆ పూటకు మూసేయాల్సి వచ్చింది’’ అంటూ చివర్లో.. అజ్ఞానానికి సాకు లేదు అని ఒవైసీ ట్వీట్‌కు శ్రీనగర్ పోలీసులు ఘాటుగానే బదులు ఇచ్చారు. Jamia is fully opened,only on 3 occasions post-covid,it was temporarily shut for friday noon prayers owing to inputs of terror attack /law & order situation.This was after Jamia authorities failed to take responsibility of happenings inside. Staying far is no excuse of ignorance. https://t.co/wqicG3oAr2 — Srinagar Police (@SrinagarPolice) September 20, 2022 ఇదీ చదవండి: హిజాబ్‌పై నిషేధం సబబే! -
ఎట్టకేలకు నెరవేరనున్న కశ్మీరీల కల!
శ్రీనగర్: మిలిటెంట్ దాడులు, ఎన్కౌంటర్లు, భద్రతా దళాల పహారాతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది జమ్ము కశ్మీర్లో. అలాంటి చోట కశ్మీరీల చిరకాల కోరిక నెరవేరబోతోంది. దేశంలో మిగతా ప్రాంతాల్లోలాగే.. సరదాగా అయినవాళ్లతో సినిమాలు చూసే అవకాశం కలగబోతోంది అక్కడి ప్రజలకు. ఆ గడ్డపై మొట్టమొదటి మల్టీఫ్లెక్స్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఐనాక్స్ సంస్థ నిర్మించిన ఈ మల్టీఫ్లెక్స్.. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుంది. మూడు సినిమా హాల్స్‌తో ఐదువందల మంది సినిమా వీక్షించేలా ఏర్పాటు చేస్తోంది ఐనాక్స్. ఫుడ్ కోర్టుతో పాటు పిల్లల కోసం ప్లే స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. పైగా కశ్మీరీ కల్చర్ ప్రతిబింబించేలా లాబీలు, వుడెన్ వర్క్‌తో ప్రత్యేక ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అల్లకల్లోల పరిస్థితుల నడుమ 90వ దశకంలో కశ్మీర్లో థియేటర్లు మూతపడ్డాయి. అయితే.. 1999లో తిరిగి వాటిని తెరచేందుకు ప్రయత్నాలు జరిగాయి. శ్రీనగర్‌లో నీలం, రెగల్, బ్రాడ్వేలు తెర్చుకున్నప్పటికీ.. మిలిటెంట్ల దాడులతో మళ్లీ అవి మూతపడ్డాయి. ఇన్నేళ్ల తర్వాత కశ్మీర్లో ఒక మల్టీఫ్లెక్స్ రాబోతుండడంపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలు పేదలకు భారం కావడం దురదృష్టకరం.. సిగ్గుచేటు -
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
శ్రీనగర్‌లో ఉగ్రవాదుల దాడి.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాబలగాలు మైసుమా ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని.. గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు వలసదారులపైనా వరుస దాడులకు ముష్కరులు తెగబడుతున్నారు. 24 గంటల వ్యవధిలో రెండు చోట్ల దాడులు జరిగాయి. పుల్వామా జిల్లాలో వలస కూలీలపై కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులు బిహార్‌కు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం.. నౌపొరా ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలపైనా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. చదవండి: రీట్వీట్ చేసిన కేటీఆర్.. తప్పుపట్టిన కర్ణాటక మంత్రి.. అసలు ఏమైంది? -
మంచు దుప్పటిలో జమ్మూ కశ్మీర్ ఫొటోలు
-
యువతిపై యాసిడ్ దాడి.. ట్రెండింగ్‌లో యాసిడ్ అటాక్
Acidattack Trending In Twitter: యువతులపై యాసిడ్ దాడి ఘటనలు పలు సందర్భాల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల వారు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో విసృతంగా చర్చ జరిపిన వార్తలను కూడా చూశాం. ప్రస్తుతం ఓ యాసిడ్ దాడిపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదీ అబ్బాయిలపై జరిగిన దాడుల గురించి కావడం విశేషం.!! జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్‌లో మంగళవారం 24 ఏళ్ల యువతి యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయాల పాలైంది. శ్రీనగర్‌లోని హవాల్ ప్రాంతం వాంట్పోరాలోని ఉస్మానియా కాలనీలో యువతిపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆమెను వెంటనే స్థానిక ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆమె ముఖానికి గాయాలైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కన్వల్జీత్ సింగ్ తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఆమె కళ్లు దెబ్బతిన్నాయా లేదా అని నిర్ధారించడానికి శస్త్రచికిత్స చేస్తామని డాక్టర్ సింగ్ తెలిపారు. యాసిడ్ దాడికి తెగపడిన దుండగుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలు మారి గాలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే యాసిడ్ దాడిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. యాసిడ్ దాడి బాధితులు అమ్మాయిలే కాదు. యువతులు చేసిన యాసిడ్ దాడుల్లో అబ్బాయిలు కూడా బాధితులుగా మారారని వాటికి సంబంధించిన పాత ఘటనలు, వార్తలను సోషల్ మీడియాలో నెటిజన్లు #acidattack హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేస్తున్నారు. Crime has no gender and men also fall prey to Acid attacks😑#acidattack pic.twitter.com/qBSmj7QWSc — 🅆🄷🄸🅃🄴 🅃🄸🄶🄴🅁 👉#MI (@SidharthshuklaC) February 2, 2022 #acidattack Crime has no gender and men also fall prey to Acid attacks pic.twitter.com/kmAVyXLhpc — Amrita Pal Nishad (@AmritaP71033808) February 1, 2022 #shefoughtback #acidattack #Shereal Why media is silent when victims are men? pic.twitter.com/jTNf0vjHl0 — Amrita Pal Nishad (@AmritaP71033808) February 1, 2022 #acidattack Surendra Singh of delhi suffered acid attack by his wife because she wanted to live her with her lover pic.twitter.com/va8S7M8CLJ — Mr.India (@MrIndia92586350) February 1, 2022 #acidattack is a gender nuetral crime. Like women , men also become victims of such attacks Crime has no gender...पुरुषो पर भी होता है एसिड अटैक pic.twitter.com/2kAy6kskgS — Amita Tripathi (@AmitaTr52987852) February 1, 2022 #acidattack #shereal Why dont women raise their voice when acid victims are men? Why do feminists show such gender bias? pic.twitter.com/HmlvCWXH5S — Nancy (@NancyGu07971855) February 1, 2022 -
Jammu Kashmir: శ్రీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌బాగ్‌లోని ఒక వాణిజ్య భవనంలో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫైర్సెఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు ఫైరింజన్ సహయంతో మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు. ఒక సిలెండర్ పేలడం వలన మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. కాగా, మంటలను అదుపుచేసే క్రమంలో ఒక ఫైర్ అధికారి గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముందు జాగ్రత్తగా అధికారులు ఘటన స్థలం వద్ద అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు -
శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో ఉగ్రవాదులు గ్రెనేడ్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. కాగా, వీరు స్థానికంగా ఉన్న హైస్ట్రీట్ వద్ద మంగళవారం సాయంత్రం బాంబు దాడికి తెగబడ్డారు. పోలీసుల ప్రకారం.. భద్రత సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల బాంబు దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. అక్కడి ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. గ్రెనేడ్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భద్రత సిబ్బంది, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. భద్రత అధికారులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఏవైన పేలుడు పదార్థాలు ఉన్నాయా.. అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, రిపబ్లిక్‌డే వేడుకలకు ఒక రోజు ముందు ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారింది. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు. Jammu & Kashmir | Grenade attack at Hari Singh High Street in Srinagar Details awaited. pic.twitter.com/ioU2AQABgh — ANI (@ANI) January 25, 2022 చదవండి: రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా -
జమ్మూ కశ్మీర్లో మంచు తుపాన్.. 30మందిని రక్షించిన ఆర్మీ సైనికులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో హిమపాతం బీభత్సం సృష్టించింది. చౌకీబాల్-తంగ్ధర్ రహదారిలో హిమపాతం పరిస్థితి తీవ్రంగా ఉంది. దట్టమైన మంచుదిబ్బల్లో సోమవారం 30 మంది పౌరులు చిక్కుకున్నారు. అక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. 30మంది పౌరులను సురక్షితంగా కాపాడారు. వీరంతా ఖూని నాలా, ఎస్ఏం హిల్ వద్ద కురుస్తున్న భారీ మంచుచరియల్లో చిక్కుకున్నారని తెలిపారు. భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ 14 మంది పౌరులను నీలం పాస్ వద్దకు 16 మందిని సాధన పాస్ వద్దకు సురక్షితంగా తీసుకువచ్చామని తెలిపారు. పౌరులందరికీ రాత్రిపూట ఆహారం, వైద్యం, ఆశ్రయం కల్పించామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ఆరు గంటలు కొనసాగిందని తెలిపారు. చదవండి: డాక్టర్‌కు 5 డోసుల వ్యాక్సిన్! దర్యాప్తు చేయాలన్న బిహార్ ప్రభుత్వం -
మంచుకొండల్లో అద్భుత నిర్మాణం! ఎంఈఐఎస్ అరుదైన రికార్డు
హైదరాబాద్: మౌలిక రంగ నిర్మాణ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన మైలురాయిని చేరుకుంది. 18 కిలోమీటర్ల పొడవైన జొజిలా టన్నెల్స్ మార్గంలో 5 కిలోమీటర్ల మేర సొరంగ నిర్మాణ పనులను పూర్తి చేసింది. రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే దీన్ని సాధించినట్టు ఎంఈఐఎల్ ప్రకటించింది. జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) నుంచి ఈ ప్రాజెక్టును ఎంఈఐఎల్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ మార్గం అయిన ఇది పూర్తయితే, శ్రీనగర్–లద్దాక్ మధ్య ఏడాది పొడవునా ఎలాంటి అవాంతరాల్లేకుండా రవాణాకు వీలు కలుగుతుంది. జొజిలా టన్నెల్స్ పరిధిలో నీల్‌గ్రార్ 1, 2, జోజిలా ప్రధాన సొరంగం నిర్మాణాన్ని అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేగంగా అమలు చేస్తున్నట్టు ఎంఈఐఎల్ తెలిపింది. ఇందులో నీల్ గ్రార్ టన్నెల్ 1లో 915 మీటర్లకు గాను మొత్తం పని పూర్తయింది. నీల్ గ్రార్ టన్నెల్ 2 లో 3907 మీటర్లకు గాను 2573 మీటర్ల పని పూర్తయింది. ఇక, జోజిలా ప్రధాన టన్నెల్ లో 13145 మీటర్లకు గాను 1523 మీటర్ల పని పూర్తయింది. మొత్తం 18 కిలోమీటర్ల టన్నెల్ పనులకు 5 కిలోమీటర్ల టన్నెల్ పనులను అతి స్వల్ప వ్యవధిలోనే మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేయటం విశేషం. -
దాల్సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం
శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద అగ్నిప్రమాదం సంభవించడంతో రెండు హౌస్బోట్లు దగ్ధమయ్యాయి. దాల్ సరస్సు వద్ద మంటలు చెలరేగడంతో న్యూజిలాండ్, అపోలో xI అనే రెండో హౌస్బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి ఇతర హౌస్బోట్లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. అయితే స్థానిక దేవదారుతో చేసిన ఈ హౌస్బోట్లు దాల్ సరస్సులో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇవి పశ్చిమ భాగంలో విడిగా లంగరు వేసి ఉంచుతారు. ఫ్లోటింగ్ ప్యాలెస్‌లుగా పిలిచే హౌస్బోట్లు వంతెనలతో అనుసంధానించబడి ఉంటాయి. (చదవండి: తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్ ఫాలో మీ అంటూ..) -
లష్కరే టాప్ ఉగ్రవాది సలీం పర్రే హతం
జమ్మూ/శ్రీనగర్: శ్రీనగర్ శివారులో సోమవారం పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. లక్ష్య పెట్టకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. -
మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి: ఇండియన్ ఆర్మీ
శ్రీనగర్: తమ దేశ సైనికుడి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాకిస్తాన్‌కు భారత్ ఆర్మీ తెలిపింది. శనివారం నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న చొరుబాటును భారత్ ఆర్మీ ముందుగానే పసిగట్టి కాల్పులు జరిపింది. కెరాన్ సెక్టర్లో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో పాక్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చెందిన సైనికుడు మృతి చెందినట్లు మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి మహ్మద్ షబీర్ మాలిక్‌గా గుర్తించామని తెలిపారు. పాకిస్తాన్ వైపున భారత చొరబాటు నిరోధక వ్యవస్థ ఉన్న చోట ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. అయితే భారత్ సైనికులు జరిపిన కాల్పులో ఓ వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అతని వద్ద ఏకే రైఫిల్, మందుగుండు సామాగ్రి, 7గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాక్‌కు సమాచారం అందిచినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డు, పాక్ వైద్యశాఖ జారీ చేసిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అందులోని ఫోటోలో సదరు వ్యక్తి పాక్ ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘింగిచే చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. -
ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం రైతుల్లా పోరాడాలి: మాజీ సీఎం
శ్రీనగర్: రద్దు చేసిన ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కోసం జమ్ముకశ్మీర్ ప్రజలు రైతుల్లా పోరాటం చేయాలని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 11 నెలలకు పైగా పోరాటం చేశారని తెలిపారు. వారి పోరాటంలో 700 మందికి పైగా రైతులు మృతి చెందారని అన్నారు. రైతుల బలిదానాలతో కేంద్రం ప్రభుత్వం దిగివచ్చి.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని తెలిపారు. చదవండి: లుంగీ ధరించినవాళ్లు నేరస్తులు కాదు: రషీద్ అల్వీ కశ్మీరీలు తమ హక్కులు తిరిగి పొందాలంటే రైతుల్లా త్యాగాలు చేయాలని అన్నారు. తాము ఆర్టికల్ 370, 35 ఏ, రాష్ట్ర హోదాను తిరిగి పొందుతామని వాగ్దానం చేశామని గుర్తుచేశారు. దాని కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో తమ పార్టీ హింసకు మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 5 ఆగస్టు, 2019న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. -
పుష్కరాలకు వెళ్లి.. మృత్యుఒడికి చేరింది
సాక్షి,పాలకొండ రూరల్(శ్రీకాకుళం): శ్రీనగర్‌లో జరుగుతున్న సింధూ నది పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసి అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండలోని దేవరపేటకు చెందిన వ్యాపారి బోగాది సీతయ్య, సతీమణి ఆదిలక్ష్మి (53) ఈ నెల 17న పుష్కర స్నానాల కోసం శ్రీనగర్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస ఏర్పాట్లు చేసుకున్న వీరు శనివారం దైవ దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరిగి ప్రయాణంలో భాగంగా బస చేస్తున్న హోటల్‌కు చురుకున్నారు. అదే రోజు రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డికి వెళ్లిన ఆదిలక్ష్మి మృతి చెందారు. ఈ విషయాన్ని సీతయ్య ఫోన్ ద్వారా పాలకొండలోని కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. -
అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు
SSP Sandeep Chaudhary of Srinagar helped Chana seller with 1 lakh సాక్షి, ఇంటర్నెట్: బోసి నవ్వులు చిందిస్తున్న ఈ తాతను చూడగానే.. మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది కదా. కానీ ఈ తాతకు వచ్చిన కష్టం తెలిస్తే.. గుండె బద్దలవుతుంది. కష్టానికి కారకులైన వారి మీద ఎక్కడాలేని కోపం వస్తుంది. కొందరు సోమరిపోతుల మాదిరి కాకుండా.. వయసు మీద పడి.. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినప్పటికి కూడా.. పని చేయడం మానలేదు ఈ తాత. రోడ్డు పక్కన కూర్చుని పల్లీ, బఠాణీలు అమ్ముకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు పల్లీలు అమ్ముతూ దాదాపు లక్ష రూపాయల వరకు పోగు చేశాడు. తాను చనిపోయాక అంత్యక్రియలకు అక్కరకు వస్తుందని ఈ మొత్తాన్ని దాచుకున్నాడు. కానీ దరిద్రులు తాత కష్టార్జితాన్ని దొంగిలించారు. దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఈ విషయం ఓ ఉన్నతాధికారికి తెలిసింది. వృద్ధుడి కష్టం అతడిని కదిలించింది. దాంతో తాత పొగొట్టుకున్న లక్ష రూపాయలను తానే అందించాడు. సదరు ఉన్నతాధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివారలు.. (చదవండి: Mrs Vishnoi: నాన్న కావాలని ఉందన్నారు.. కానీ తిరిగి రాలేదు.. అయినా) జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అనే వృద్ధుడు రోడ్డు పక్క పల్లీలు, బఠాణీలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులు ఉన్నారో లేరే తెలియదు. ఒకవేళ ఉన్నా.. బతికున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా తన వల్ల వారు ఇబ్బంది పడకూడదని భావించిన రెహమాన్.. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బును కూడబెట్టసాగాడు. ఇలా ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు దాచుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు దుండగులు రెహమాన్ అంత్యక్రియల కోసం దాచుకున్న మొత్తాన్ని దొంగిలించారు. పాపం జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము ఇలా దొంగలపాలవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు రెహమాన్. పోయిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఏ కోశాన లేదు. అయినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: 20ఏళ్ల అవమానాలు: బారాత్, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి ) రెహమాన్ వ్యధ, బాధ శ్రీనగర్ సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు అధికారి సందీప్ చౌదరీని కదిలించింది. రెహమాన్ వివరాలు తెలుసుకున్న సందీప్.. అతడు పొగొట్టుకున్న లక్ష రూపాయలను రెహమాన్‌కు అందజేశాడు. దీని గురించి శ్రీనగర్ మేయర్ పర్వైజ్ అహ్మద్ ఖాద్రీ తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. సందీప్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. Appreciative decision by Srinagar police & @Sandeep_IPS_JKP towards the old aged Channa seller to assist him with the money of one lakh that was looted from his home. Abdul Rehman had saved the laborious money for his last rites; he sells snacks and lives all alone! Salute sir pic.twitter.com/FL0tXvoUWB — Parvaiz Ahmad Qadri (@Parvaiz_Qadri) November 14, 2021 చదవండి: దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు.. -
షాకింగ్ వీడియో: సెకను వ్యవధిలో తప్పింది.. చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడు!
నిన్నటి వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టి రావడం ఓ సరదా అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూట్టిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే బైకు ప్రయాణం అంటే మజాతో పాటు కాస్త ప్రమాదం కూడా దాగుంటుంది. మరీ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం వాహనదారుడు అప్రమత్తంగా లేకపోయినా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ బైకర్ మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్, లడఖ్‌కు మధ్య మార్గం జోజిలా పాస్‌లో పర్వతాల గుండా ఇద్దరు యువకులు బైకుపై వెళుతున్నారు. అయితే ఆ బైకర్ల కంటే ముందు ఇనుప పైపులతో నిండిన ట్రక్కు వెళ్తోంది. ఇంతలో ఓ బైకర్ ఆ ట్రక్కును ఓవర్టేక్ చేసే ప్రయత్నించబోయాడు. అప్పటికే ఆ రోడ్డు మొత్తం బురద బురదగా ఉండటం.. ట్రక్ దగ్గరికి వెళ్లగానే బైక్ స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న లోయలో పడబోయాడు. అదృష్టవశాత్తు అతను బైకుని కంట్రోల్ చేసి కాలు కింద పెట్టి అంతెత్తు పర్వతం నుంచి పడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియోను అతని వెనుకే ఉన్న మరో బైక్ రైడర్ రికార్డ్ చేశాడు. ఈ ఘటన కొన్ని నెలల కింద జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలాంటి రైడ్స్ చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: Guinness World Record: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
మరొకరిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు
శ్రీనగర్: శ్రీనగర్‌లో 24 గంటల వ్యవధిలో ఉగ్రవాదులు మరొకరిని పొట్టనబెట్టుకున్నారు. బొహ్రి కదల్ ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. బందిపొర జిల్లాకు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం మహరాజ్‌గంజ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఘటన నేపథ్యంలో భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఆదివారం సాయంత్రం బాటామాలూ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్ ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. -
జమ్మూ కశ్మీర్: ఆస్పత్రిలోకి చొరబడి ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. శ్రీనగర్‌లోని ఎస్‌కేఐఎంఎస్ ఆస్పత్రిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆస్పత్రి సమీపంలో భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులకు తెగపడ్డారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నారు. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని శ్రీనగర్ పోలీసులు పేర్కొన్నారు. -
మా గగనతలంపై మీ విమానాలొద్దు: పాకిస్తాన్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నగరాన్ని కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్’ పౌర విమానాలను తమ గగనతలం మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్ మంగళవారం స్పష్టంచేసింది. గతంలో గోఎయిర్‌గా పిలవబడిన గో ఫస్ట్ పౌర విమానయాన సంస్థ ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచి శ్రీనగర్–షార్జా నగరాల మధ్య డైరెక్ట్ విమానసర్వీసులను ప్రారంభించింది. ఈ నగరాలను కలిపే విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ఆ విమానాలన్నీ పాక్ మీదుగా రాకపోకలు సాగించాయి. అయితే తాజాగా తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దంటూ పాకిస్తాన్ కరాఖండీగా చెప్పేసింది. దీంతో మంగళవారం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం సుదూరంగా గుజరాత్ మీదుగా ప్రయాణిస్తూ షార్జా నగరానికి చేరుకుంది. దీంతో విమానం మరో 40 నిమిషాలపాటు ప్రయాణించాల్సి వచ్చింది. హఠాత్తుగా తమ నిర్ణయం మార్చుకున్నందుకు సరైన కారణాలను పాకిస్తాన్ ఇంతవరకు భారత్‌కు తెలియజేయలేదు. దీనిపై గో ఫస్ట్ సంస్థ నుంచి సైతం ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెగాసస్ Vinisha Umashankar: మీ తీరు చూస్తోంటే..కోపం వస్తోంది! శభాష్ వినీషా! -
బుల్లెట్ ప్రూఫ్ లేకుండా మాట్లాడటంలో కొత్తేముంది?
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ సభలో బుల్లెట్ ప్రూఫ్ లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటంలో కొత్తేముందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం కూడా అక్కడ బ్లులెట్ ప్రూఫ్ లేకుండా పర్యటించిందని, అందులో తాను కూడా ఉన్నానని గుర్తుచేశారు. ప్రస్తుతం పరిస్ధితులు మారాయని అన్నారు. టీ–20 వరల్డ్ కప్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో తలపడిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని అసదుద్దీన్ ఖండించారు. దేశంలో ప్రతి అంశం మతాల మధ్య గొడవలా తయారవుతోందని, మైనారిటీలను దోషులుగా చూపించి మెజారిటీ మతస్తులను ఉపయోగించుకునే రాజకీయాలు పెరిగిపోతున్నాయన్నారు. -
శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో వానలు
-
వారిని మనమే కాపాడుకోవాలి!
ఒకప్పుడు కశ్మీర్లో ముస్లింలు, పండిట్లు తమ సంతోషాలను, బాధలను పరస్పరం పంచుకుంటూ గడిపారు. మా బాల్యంలో పండిట్ల కుటుంబాలతో కలిసిమెలిసి జీవిస్తూ పొందిన అద్భుత జ్ఞాపకాలను 1989లో పూర్తిగా కోల్పోయాము. కశ్మీర్ సమాజ అస్తిత్వమే మారిపోయింది. కశ్మీరీ పండిట్లు మూకుమ్మడిగా వలసపోకుండా ప్రభుత్వ యంత్రాంగం, సమాజం ఎందుకు అడ్డుకోలేదని దశాబ్దాలుగా మేం దిగ్భ్రాంతి చెందుతూనే ఉన్నాము. ఇప్పటికీ అమాయకులైన, నిరాయుధులైన పౌరులను కాల్చిచంపడంపై విశ్వాసం ఉంచుతున్న వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు? సొంత ప్రజలైన కశ్మీరీ పండిట్లు, కశ్మీరీ సిక్కుల పక్షాన కశ్మీరీ ముస్లిమ్‌లం నిలబడటంలో విఫలమైతే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించదు అంటూ శ్రీనగర్ మేయర్ జునైద్ అజీమ్ మట్టు తన బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. కశ్మీర్లో ఇటీవల వరుసగా జరిగిన పౌరుల హత్యలు ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని కకావికలు చేశాయి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఊహాగానాలకు, చెలరేగుతున్న పుకార్లకు అంతే లేకుండా పోయింది. ఈ ఘటనలకు వెనుక అసలు మూలం 1989లో చోటు చేసుకుందని గ్రహిస్తేనే ప్రస్తుతం జరుగుతున్న పౌరుల హత్యలపై కాస్త స్పష్టత కలుగవచ్చు. ఆనాడు కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడటంతోపాటు, కశ్మీర్ లోయ విడిచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ వచ్చాయి. కశ్మీర్ లోయ నుంచి పండిట్ల తొలి వలసకు అదే మూలం. అప్పుడు నా వయస్సు నాలుగేళ్లు మాత్రమే. నా తల్లిదండ్రులు మా పొరుగునే ఉన్న పండిట్లను కౌగలించుకుని తమ ఇళ్లను ఖాళీ చేసి వెళుతున్న వారికి కన్నీళ్లతో వీడ్కోలు పలికిన జ్ఞాపకాలు నాలో చాలానే మిగిలి ఉన్నాయి. మా ఇంటి పొరుగునే ఉన్న వృద్ధ దంపతులు పండిట్ రఘునాథ్ మాటో ఆయన భార్య మా బాల్య జీవితాల్లో విడదీయరాని భాగమై ఉండేవారు. వారి పిల్లలు, మనవళ్లు దేశంలోని అనేక నగరాల్లో చక్కగా స్థిరపడి సంవత్సరానికి ఒకసారి తమ పెద్దలను కలవడానికి కశ్మీర్ వస్తుండేవారు. ఆ సమయంలో మేమంతా ఒక పెద్ద కుటుంబంలా ఉండేవాళ్లం. వారి ఇంట్లో గంటలసేపు నేను గడిపేవాడిని. వారు మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు. రుచికరమైన స్నాక్స్ తినడానికి ఇచ్చేవారు. ఇక బాబూజీ అయితే తన గ్రామ్‌ఫోన్‌ని సగర్వంగా మాకు చూపేవారు. తన ఇంట్లో మేము కూర్చుని ఉండగా జ్యోతిష్య ప్రపంచం గొప్పతనం గురించి మాకు వివరించి చెప్పేవారు. ఆ ఇంట్లో చిన్న కిటికీ ఉండేది. కశ్మీరులో ఎక్కువగా పెరిగే గుల్మ వృక్షం నుంచి ఆ కిటికీ బయట పెద్దగా గాలి వీస్తుండేది. ఒక కొత్త, కృత్రిమ, అసంపూర్ణ కశ్మీర్ కొన్నేళ్ల తర్వాత నేను బర్న్ హాల్ స్కూల్లో చదువుతున్నప్పుడు, ప్రతి రోజూ సాయంత్రం ట్యూషన్ కోసం జవహర్ నగర్ లోని పండిట్ దీనానాథ్ వలి చిన్న ఇంటికి వెళ్లేవాడిని. ప్రతి సాయంత్రం వారి ఇంట్లో గంటన్నరసేపు గడిపిన సమయంలో పిట్టకథలు, జానపద కథలను ఎక్కువగా చెబుతూ తరచుగా మాత్రమే పాఠ్యాంశాలను ఆయన చెబుతుండేవారు. నిజంగానే ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి. నాకంటే పెద్దవాళ్లకు కశ్మీర్లో అందరూ కలిసిమెలిసి బతికిన సుసంపన్నమైన అనుభవాలు ఎక్కువగా ఉండేవి. ముస్లింలు, పండిట్లు తమ సంబరాలు, బాధలను పరస్పరం పంచుకుంటూ గడిపేవారు. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కలిసే కొంటె చేష్టలకు పాల్పడేవారు. స్థానిక సరకుల దుకాణంలో కమ్యూనిటీ పెద్దలు కూడి సాయంకాలం చర్చల్లో పాల్గొనేవారు. మా బాల్యంలో, విద్యార్థి జీవితంలో మేం పొందిన ఆ అద్భుత జ్ఞాపకాలను 1989లో పూర్తిగా కోల్పోయాము. దాంతో కశ్మీర్ సమాజ అస్తిత్వమే మారిపోయింది. ఉమ్మడిగా జీవించిన చరిత్ర చెరిగిపోయి సామాజికంగా అసంపూర్ణంగా మిగిలిన, శాంతిని కోల్పోయిన ఒక కృత్రిమ కశ్మీర్ ఆవిర్భవించింది. కశ్మీరీ పండిట్లు మూకుమ్మడిగా వలసపోయిన ఆ మహాప్రస్థానం 1989లో సంభవించకుండా ప్రభుత్వ యంత్రాంగం, సమాజం ఎందుకు అడ్డుకోలేదని దశాబ్దాలుగా మేం దిగ్భ్రాంతి చెందుతూనే ఉన్నాము. పండిట్లను నిలుపుకోవడానికి మేం ప్రయత్నించలేదా? దానికోసం మరింతగా మేము కృషి చేసి ఉంటే బాగుండేదేమో! కశ్మీరీ పండిట్ల పక్షాన మేం గట్టిగా నిలబడి ఉంటే కశ్మీర్ చరిత్ర పంథా మరొకలా ఉండేదా? మరొక సామూహిక విషాదం ఇటీవల కొద్ది రోజులుగా పైగా కశ్మీర్ లోని మైనారిటీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని చంపడానికి సాక్షీభూతులుగా ఉన్న మా సామూహిక భయాలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మా మనస్సుల్లో, ఆప్తులను కోల్పోయిన మా ఆలోచనల్లో ప్రతిధ్వనించి ఉండాలి. కశ్మీర్లో నా తరం ఇలాంటి ప్రశ్నల మధ్యనే పెరుగుతూ వచ్చింది. వేలాదిమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న హింసాత్మక ఘటనలకు చరిత్ర ఉల్లేఖనాలుగా ఇలాంటి ప్రశ్నలు మాలో మెదులుతూనే ఉన్నాయి. శ్రీనగర్ నడిబొడ్డున తన షాపులో కూర్చుని ఉన్న పేరొందిన కెమిస్టు మఖన్ లాలా బింద్రూను ఉగ్రవాదులు ఇటీవల కాల్చిచంపిన తర్వాత ఆయన ఇంటికి నేను వెళ్లాను. ఒక సామూహిక, విషాదానుభవం నన్ను ముంచెత్తింది. నిస్సహాయత్వం నన్ను ఆవహించింది. ఆయన కుటుంబం ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలుకుతున్నప్పుడు మేం మరొక సామూహిక విషాదం ఊబిలో చిక్కుకున్నామా అని నాకనిపించింది. కొద్ది రోజుల తర్వాత ఉగ్రవాదులు ఈద్గాలోని సంగమ్వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చొరబడి, ఆ స్కూల్ ప్రిన్సి పాల్ సుపీందర్ కౌర్, టీచర్ దీపక్ చంద్‌లను పాశవికంగా చంపేశారు. ఒకే ప్లాన్, ఒకే పద్ధతిలో జరిగిన హత్యలవి. అదేరోజు సుపిందర్ కౌర్ ఇంటికి నేను వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించినప్పుడు, కొన్ని దశాబ్దాల క్రితం మేం అనుభవించిన బాధ, ఆగ్రహం, నిస్సహాయతలు నన్ను చుట్టుముట్టాయి. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి కూడా నా వద్ద మాటల్లేవు. మా శాంతిని, మా గతాన్ని మాకు దూరం చేస్తూ రాక్షసులు తలపెట్టిన దారుణ విషాదాలు రేపిన అవే గాయాలు మా భవిష్యత్ తరాలను కూడా వెంటాడనున్నట్లు తలిచి, కంపించిపోయాను. అస్పష్ట ముసుగును తొలగించాల్సిన సమయం! మరొక అర్థం లేని, అనాగరిక ఉగ్ర చర్యలో బిహార్‌కి చెందిన ఒక చిరు వ్యాపారిని లాల్ బజార్లో కాల్చి చంపారు. శ్రీనగర్‌లో జీవిస్తున్న వేలాదిమంది స్థానికేతర వ్యాపారులకు, కూలీలకు, కార్మికులకు ఉగ్రవాదులు చేసిన హెచ్చరిక ఇది. ఆ వ్యాపారి చేసిన తప్పేమిటి? తన భార్యా పిల్లలను పోషించడానికి వేలమైళ్ల దూరంలో ఉంటూ వీధుల్లో చిరు వ్యాపారం చేసుకునే అతడి ప్రాణం నిలువునా తీయడాన్ని ఏ సైద్ధాంతిక సమరం సమర్థిస్తుంది? నిజంగానే శ్రీనగర్‌కి ఇది దుస్సహమైన వారం. నగరం నడిబొడ్డున ఇలా ఎలా జరుగుతుంది అని మేం ఆశ్చర్యపడుతున్నాం. ఇలాంటి దారుణాలను అడ్డుకోవడానికి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవలసి ఉంది? ఇలాంటి హత్యా ఘటనలకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోని మెజారిటీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ ప్రతిఘటన రావాలని మేం అర్థం చేసుకోవలసి ఉంది. ఇలాంటి అనాగరిక హత్యలకు ముగింపు పలకడానికి కారణమవుతున్న సామాజిక పవిత్రత లేదా మనమే ఉండాలనే భావన పూర్తిగా నశించాలి. మన రాజకీయ అభిప్రాయాలతో, సిద్ధాంతాలతో పనిలేకుండా ఇలాంటి ఘటనల పట్ల మన ఖండన మండనలు ఎలాంటి సందిగ్ధతలూ లేని రీతిలో వెలువడాల్సి ఉంది. ఇలాంటి హత్యలను గుర్తు తెలియని సాయుధులు చేసినవిగా పేర్కొనడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. స్పష్టత లేని, అసందిగ్ధతతో కూడిన పరదాలే, జరుగుతున్న విషాదాలను ఇలాంటి గణాంకాలతో కప్పి పుచ్చుతుంటాయి. ఇలాంటి క్రూరహత్యలకు పాల్పడుతున్న శక్తులను ఉగ్రవాదులుగా మాత్రమే వర్ణిస్తూ స్థానిక మీడియా, సమాజం పెద్ద ఎత్తున ముందుకు రావాలని నేను విన్నవిస్తున్నాను. తమ క్రూరచర్యలను ఇంకా కొనసాగించేందుకు అమాయకులను, నిరాయుధులైన పౌరులను కాల్చిచంపడంపై విశ్వాసం ఉంచుతున్న వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు? ముఫ్తీలు, అబ్దుల్లాలు అనే రెండు రాజకీయ కుటుంబాలను మాత్రమే కాపాడుతూ, మిగిలిన వారిని విసిరివేయదగిన సరకులలాగా మాత్రమే భావిస్తూ మన పోలీసులు అడ్డుకోవడానికి ప్రజలు దృఢమైన వైఖరిని చేపట్టాల్సి ఉంది. మన మైనారిటీ కమ్యూనిటీలు (కశ్మీరీ పండిట్లు, కశ్మీరీ సిక్కులు) సురక్షిత వాతావరణంలో నివసించడానికి మనం దృఢనిర్ణయంతో లేచి నిలబడాల్సి ఉంది. తటస్థంగా ఉండటానికి, కపట వైఖరిని ప్రదర్శించడానికీ ఇది సమయం కాదు. అటో ఇటో తేల్చుకోవాలంటూ పిలుపు ఇవ్వాల్సిన సమయం ఇది. మన సొంత ప్రజల పక్షాన మనం నిలబడటంలో విఫలమైతే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించదు. -
శ్రీనగర్‌లో దారుణం
శ్రీనగర్: శ్రీనగర్‌లో ఉగ్రవాదులు సామాన్య పౌరులే లక్ష్యంగా మరో దారుణానికి తెగబడ్డారు. గురువారం ఉదయం నగరం నడి»ొడ్డున ఉన్న పాఠశాలలోకి చొరబడి మహిళా ప్రిన్సిపాల్, మరో టీచర్‌ను కాల్చి చంపారు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ బాలుర హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉదయం ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉండటంతో ఆ సమయంలో విద్యార్థులెవరూ పాఠశాలలో లేరు. క్లాసులు చెప్పడానికి సిద్ధమవుతున్న ప్రిన్సిపల్ సుపీందర్ కౌర్, మరో టీచర్ దీపక్ చాంద్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. మైనారీ్టలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ ఉండడంతో లోయలో భయాందోళనలు పెరిగాయి. ఉగ్రవాదులు మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాంగ్ సింగ్ అన్నారు. లోయలో భయభ్రాంతుల్ని సృష్టించడానికే ఈ దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇప్పుడిప్పుడే నెలకొంటున్న శాంతిని భగ్నం చేయడానికి పాక్ ఆడిస్తున్నట్టుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, త్వరలోనే వారి ఆట కట్టిస్తామని డీజీపీ అన్నారు. లోయలో వరుస దాడులు గత అయిదు రోజుల్లో కశీ్మర్ లోయలో జరిగిన వేర్వేరు దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకి చేరుకుంది. ఈ ఏడుగురిలో నలుగురు మైనార్టీ వర్గానికి చెందినవారు. పాఠశాలలో ప్రాణాలు కోల్పోయిన సుపీందర్ కౌర్ శ్రీనగర్‌కు చెందిన సిక్కు కాగా, దీపక్ చాంద్ హిందువు. రెండు రోజుల క్రితం ప్రముఖ కశ్మీర్ పండిట్ మఖాన్‌లాల్ బింద్రూని కాల్చి చంపడం, అదే రోజు మరో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకోవడం కలకలం రేపింది. ఈ దాడులపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘కశీ్మర్లో హింస పెరిగిపోతోంది. పెద్ద నోట్లు, ఆర్టికల్ 370 రద్దు ఉగ్రవాదుల్ని నిరోధించలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వం భద్రతని కలి్పంచడంలో పూర్తిగా విఫలమైంది’’ అని ట్వీట్ చేశారు. -
కశ్మీరీ పండిట్ కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ వ్యాపారి, కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రో హత్యకు గురయ్యారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి దుండగులు ఆయన్ను కాల్చి చంపారని పోలీసులు వెల్లడించారు. శ్రీనగర్‌లో ఆయనకు బింద్రో మెడికేట్ ఫార్మసీ వ్యాపారం ఉంది. ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న తన ఫార్మసీలో ఉన్న సమయంలో ఉగ్రవాదులు ఆయన వద్దకు వచ్చి కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనానంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రికి చేరే సమయానికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనానంతరం మరో ఇద్దరు వ్యక్తులను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. భేల్పురి అమ్మే వీరేందర్‌ను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. వీరేందర్‌ను చంపిన కొన్ని నిమిషాల్లోనే మొహమ్మద్ షఫి లోనె ను కూడా చంపారు. స్థానిక టాక్సీ స్టాండ్‌కు మొహమ్మద్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ హత్యలను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. చదవండి: (13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు) -
పట్టుబడిన పాక్ ఉగ్రవాది
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని ఉరి సెక్టార్లో గత కొన్నాళ్లుగా జరుగుతున్న చొరబాట్లను అడ్డుకునేందుకు ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ మంగళవారం ముగిసింది. ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకి చెందిన 18 ఏళ్ల వయసున్న ఉగ్రవాది అలీ బాబర్ పాత్రాను సైనికులు బంధించారు. సైన్యం జరిపిన కాల్పుల్లో మరో ఉగ్రవాది కారి అనాజ్ మరణించాడు. భారత్‌లో భీకరదాడులకు పన్నాగాలు రచించినట్టుగా బాబర్ ఆర్మీ విచారణలో చెప్పాడు. బారాముల్లాకు ఆయుధాలు తీసుకొని వెళ్లే పని తనకు అప్పగించారని తెలిపాడు. అతని దగ్గరనుంచి ఏకే–47 రైఫిల్స్, కమ్యూనికేషన్ సెట్, రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా నిర్వహించిన ఉగ్రవాద శిక్షణ శిబిరంలో తాను పాల్గొన్నానని బాబర్ చెప్పాడు. సలాంబాదా నాలా నుంచి ఈ చొరబాటు యత్నాలు జరిగాయి. 2016లో ఈ మార్గం నుంచే ఉరి సెక్టార్‌లోకి చొరబడి ఆత్మాహుతి దాడులు నిర్వహించారు. ఇస్లాం మతం ప్రమాదంలో పడిందని, కశ్మీర్లో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ స్వయంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి భారత్‌లోకి పంపుతోంది. తాను పేదరికాన్ని తట్టుకోలేకే లష్కరేలో చేరానని పట్టుబడిన ఉగ్రవాది బాబర్ చెప్పాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన తమ కుటుంబం దుర్భర దారిద్య్రంలో ఉందని, తన తల్లి అనారోగ్యాలకు చికిత్స కోసం 20 వేలు ఇవ్వడంతో తాను వారి వలలో చిక్కుకున్నానని బాబర్ తెలిపాడు. -
Alia Farooq: 4 నెలల్లో 28 కేజీల బరువు తగ్గి.. ఇప్పుడు...
అనేక రంగాల్లో మహిళలు రాణిస్తూ మగవారితో పోటాపోటీగా దూసుకుపోతున్నారు. కానీ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రాంతాల్లోని మహిళలు అనేక కట్టుబాట్లు, నిబంధనల మధ్య నిర్భయంగా ఇంటి నుంచి బయటకు రావడమే కష్టం. అటువంటిది ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో ఎప్పుడూ ఉగ్రమూకల దాడులతో దద్దరిల్లుతూ అశాంతిగా ఉండేది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో.. అక్కడి పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అయితే కశ్మీర్‌కు చెందిన ఆలియా ఫారుఖ్ ఎనిమిదేళ్ల కిందటే మూసపద్ధతులకు విభిన్నంగా ఆలోచించి, ఫిట్నెస్ను సరికొత్త కెరియర్‌గా మార్చుకుని మహిళా ఫిట్నెస్ ట్రైనర్‌గా రాణిస్తోంది. శ్రీనగర్‌లోని ఖన్యార్కు చెందిన ఆలియా ఇద్దరు పిల్లలకు తల్లి. పిల్లలు పుట్టిన తరువాత హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడడంతో ఒక్కసారిగా అధికంగా బరువు పెరిగి, తన పనులు తానే సరిగా చేసుకోలేక నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. సరిగ్గా అప్పుడే వెకేషన్లో భాగంగా ఆలియా కుటుంబం ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆలియా తల్లి ఆమెను డాక్టర్‌కు చూపించి ఆమె బరువు పెరగడం, నిరాశకు లోనవడం వంటి సమస్యల గురించి డాక్టర్‌కు చెప్పింది. Photo: Facebook డాక్టర్ జిమ్‌లో చేరి బరువు తగ్గమని సూచించడంతోపాటు ఢిల్లీలో.. పెళ్లి అయ్యి, పిల్లలున్న మహిళలు తమ శరీరాన్ని ఎంత ఫిట్‌గా ఉంచుకుంటున్నారో చూపిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో ఆలియా ఎలాగైనా బరువు తగ్గాలనుకుంది. ఈ క్రమంలోనే భర్త ప్రోత్సాహంతో జిమ్‌లో చేరింది. కానీ మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వారి శారీరక తత్వం గురించి పురుష ట్రైనర్లకు పెద్దగా అర్థం కాదు అనుకునేది. అలా అనుమానం ఉన్నప్పటికీ, ఎలాగైనా బరువు తగ్గాలన్న దృఢనిశ్చయంతో.. జిమ్‌లో చేరిన కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 28 కేజీల బరువు తగ్గింది. ఫిట్నెస్ సొల్యూషన్ ఆలియా భర్త 2010లో ఖన్యార్‌లో ‘ఫిట్నెస్ సొల్యూషన్ జిమ్’ పేరిట జిమ్‌ను ప్రారంభించాడు. కానీ దానిని సరిగా నిర్వహించలేకపోవడం చూసిన ఆలియా అతని జిమ్‌ను తీసుకుని తనే ఒక ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా మారాలనుకుంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఉన్న బాడీ బిల్డింగ్ అసోసియేషన్‌లో చేరి ఫిట్‌నెస్‌లో పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని 2012లో జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. శ్రీనగర్‌లో మహిళా ట్రైనర్ నిర్వహిస్తోన్న తొలి జిమ్ కావడంతో అమ్మాయిలంతా తన జిమ్‌లో చేరడానికి ఆసక్తి కనబరిచారు. Photo: Facebook దీంతో ఈ తొమ్మిదేళ్లలో ఆలియా కశ్మీర్ లోయలోని 20 వేల మందికిపైగా అమ్మాయిలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చింది. ప్రారంభంలో మహిళ జిమ్ నడపడం ఏమిటీ? అని అనేక విమర్శలు, ఈమె ఏమాత్రం నడుపుతుందో చూద్దాం వంటి సవాళ్లు అనేకం ఎదురయ్యాయి. వాటిని సీరియస్‌గా తీసుకోని ఆలియా తన భర్త, అత్తమామల ప్రోత్సాహంతో జిమ్‌ను ధైర్యంగా నిర్వహించేది. దీంతో కశ్మీర్లో తొలి మహిళా ఫిట్నెస్ ట్రైనర్‌గా ఆలియాకు గుర్తింపు రావడమేగాక, అనేక అవార్డులు వరించాయి. అంతేగాక జాతీయ అవార్డుకు నామినేట్ అయ్యింది. జిల్లాకో సెంటర్ ‘మహిళలకు ఉమన్ ఫిట్నెస్ ట్రైనర్ అవసరం చాలా ఉంది. అది నేను ప్రత్యక్షంగా ఫీల్ అయ్యాను. అందుకే స్త్రీలకోసం ప్రత్యేకంగా జిమ్‌ను నిర్వహిస్తున్నాను. హైబీపీ, కొలె్రస్టాల్ స్థాయులు, సంతానలేమితో బాధపడుతోన్న మహిళలకు ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ఈ సమస్యలున్న మహిళలంతా జిమ్‌లో చేరి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నా జిమ్‌కు స్పందన బావుండడంతో ప్రభుత్వాన్ని సంప్రదించి జిల్లాకో ‘మహిళా ఫిట్నెస్ సెంటర్’ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని ఆలియా చెప్పింది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
Air Show: ఆకాశంలో అద్భుత విన్యాసాలు
-
ఎస్సైని కాల్చి చంపిన ఉగ్రవాది
శ్రీనగర్: ఉగ్రవాది చేతిలో ఎస్సై హతమైన ఘటన జమ్మూకశీ్మర్‌లోని శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. పాయింట్ బ్లాక్ రేంజ్లో తల వెనుక భాగంలో తుపాకీతో కాలి్చన దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్షిద్ అహ్మద్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనానంతరం పోలీసులు మార్కెట్ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుల్ని గుర్తించామని, త్వరలోనే వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. ఓ నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో ఘటన జరిగిందని వెల్లడించారు. -
‘ఆలస్యానికి మా బాధ్యత లేదు’ రైల్వేశాఖపై సుప్రీంకోర్టు ఫైర్
మీరు ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు చాలా ఓల్డ్ డైలాగ్ కానీ మనం ఎక్కిన రైలు సరైన సమయానికి చేరుకోవడమన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. చాలా సార్లు రైళ్లు ఆలస్యం కావడం వల్ల ముఖ్యమైన పనులు చేయలేకపోతుంటా. సరేలే అని సర్థుకుపోతాం. కానీ ఓ వ్యక్తి అలా ఊరుకోకుండా రైలు ఆలస్యంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఫలితం సాధించాడు. అంతులేని ఆలస్యం కశ్మీర్‌కి చెందిన సంజయ్ శుక్లా జమ్ము నుంచి శ్రీనగర్‌కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఈ ఫ్లైట్‌ని అందుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకి జమ్ము ఏయిర్పోర్టు చేరుకోవాలి. కానీ అతను ఎక్కిన రైలు ఉదయం 8 గంటలకు జమ్ము రావాల్సింది. మధ్యాహ్నం 12 గంటలకు గానీ చేరుకోలేదు. దీంతో సంజయ్ తన ఫ్లైట్‌ని మిస్ అయ్యాడు. దీంతో ప్రత్యేకంగా కారులో ప్రయాణించి శ్రీనగర్ చేరుకున్నాడు. వేళ కాని వేళ చేరుకోవడం వల్ల అక్కడ హోటల్లో బస చేయాల్సి వచ్చింది. ఈ ఘటన 2016లో జరిగింది. రైలు ఆలస్యం వల్ల తనకు కలిగిన నష్టంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మా బాధ్యత కాదు రైల్వే శాఖ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బటి వాదిస్తూ ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ కోచింగ్ టారిఫ్ నంబర్ 26, పార్ట్ 1, వాల్యూమ్ 1 ప్రకారం రైలు ఆలస్యానికి ఎటువంటి పరిహారం అందివ్వాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు విన్నవించారు. సమయానికి వెల కట్టలేం రైల్వే తరఫున సోలిసిటర్ వినిపించిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుడి సమయానికి వెల కట్టలేమని వ్యాఖ్యానించింది, రైళ్ల ఆలస్యానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. జవాబుదారి తనం ఉండాలని సూచించింది. ఇలా రైళ్లు ఆలస్యంగా నడిపిప్తూ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేరంటూ హెచ్చరించింది. పరిహారం చెల్లించండి నిర్దేశిత సమయానికి రైలును గమ్యస్థానం చేర్చలేకపోయినందుకు రైల్వేశాఖను మందలించింది. రైలు ఆలస్యం కారణంగా నష్టపోయిన సంజీవ్ శుక్లాకు పరిహారంగా రూ. 30,000లను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. చదవండి: ఐపీఎల్లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? -
ఆ సమయంలో... భరోసా ఇస్తోంది!
తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరెవరూ పడకూడదని కోరుకునే పెద్దమనసు ఇర్ఫానా జర్గర్ది. అది 2014 శ్రీనగర్‌లో ఉన్న అత్యంత రద్దీ బజారులో నడుచుకుంటూ వెళ్తోంది ఇర్ఫానా. సడెన్‌గా ఆమెకు నెలసరి (పీరియడ్స్) బ్లీడింగ్ అవ్వడం మొదౖలñ ంది. ఆ సమయంలో తన దగ్గర శానిటరీ ప్యాడ్లు లేవు. కొనుకుందామనుకున్నా డబ్బులు లేవు. దీంతో దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలñ ట్‌కు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఏమీ దొరకలేదు. దీంతో ఇంటికి వెళ్లేంత వరకు తీవ్రంగా ఇబ్బందికి గురైంది. ఆరోజు ఇర్ఫానా పడిన ఇబ్బందిని మరే అమ్మాయి పడకూడదని శ్రీనగర్‌లోని పబ్లిక్ టాయిలెట్లలో శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందిస్తోంది ఇర్ఫానా. అమ్మాయిలు, మహిళలు నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురవుతుంటారు. ఇక నలుగురిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దృష్టి అంతా వెనుకాల ఎక్కడ మరకలు అంటుకున్నాయో? అని పదేపదే చూసుకుంటుంటారు. అది ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియే అయినా ఇప్పటికీ అమ్మాయిలు దానికి గురించి మాట్లాడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఈ ధోరణి మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్ కార్యక్రమాన్ని ఇర్ఫానా చేపట్టింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హెల్పింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న ఇర్ఫానా... నెల జీతంలో ఐదువేల రూపాయలను పొదుపు చేసి , వాటితో శానిటరీ ప్యాడ్స్ కొని నిరుపేదలకు ఉచితంగా అందిస్తోంది. ఇలా ఇప్పటిదాకా 20 వేలకు పైగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చింది. శానిటరీ న్యాప్కిన్స్, ప్యాంటీస్, హ్యాండ్ వాష్, బేబీ డయపర్స్తో కూడిన ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్‌ను పబ్లిక్ టాయిలెట్లలో ఉంచుతోంది. అత్యవసరంలో ప్యాడ్లు అవసరమైన మహిళలు ఎటువంటి టెన్షన్ పడకుండా వీటిని వాడుకునేలా పబ్లిక్ లేడీస్ టాయిలెట్స్‌లో అందుబాటులో ఉంచుతోంది. శ్రీనగర్‌లోని దాదాపు అన్ని పబ్లిక్ టాయిలెట్లలో ఇవ ప్యాడ్స్ కనిపిస్తాయి. వివిధ గ్రామాల నుంచి నగరానికి వచ్చే మíß ళలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. సమాజానికి ఏదైనా చేయాలన్న మనస్తత్వం ఇర్ఫానాది. తనకి 21 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీంతో తను చదువుకుంటూనే, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు... మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగంలో చేరింది. తన జీతంలో కొంత మిగుల్చుకుని ఉచితంగా ప్యాడ్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా సమయంలోనూ ఆసుపత్రులలో ప్యాడ్స్‌ను ఉచితంగా అందించింది. ఈ సమయంలో చాలామంది ఇర్ఫానాకు కాల్స్ చేసి శానిటరీ న్యాప్కిన్స్, కిట్స్ ఇవ్వమని అడిగితే వారికి పంపించేది. నిరుపేదలు, నిరక్షరాస్య మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ప్రాముఖ్యత వివరిస్తూ, మెన్స్ట్రువల్ హైజీన్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.ఈ మొత్తానికి ఎవరి సాయం లేకుండా తన సొంత డబ్బులను వాడడం విశేషం. ఇర్ఫానా చేస్తోన్న పని గురించి తెలిసిన వారంతా అభినందిస్తున్నారు. ‘‘నేను ఈ పనిచేయడానికి ప్రేరణ మా నాన్నగారే. షాపుల నుంచి మా నాన్న గారే శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చి నాకు ఇబ్బంది లేకుండా చూసేవారు. అందుకే నాన్న మరణించాక ఆయన గర్వపడేలా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. కొన్నిసార్లు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంటికి దూరంగా బయట ఎక్కడో ఉన్నప్పుడు సడెన్‌గా మొదలవుతుంది. ఆ సమయంలో మన దగ్గర ప్యాడ్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్యాడ్లు బాగా ఉపయోగపడుతాయి’’ అని ఇర్ఫానా చెప్పింది. -
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మోస్ట్ వాంటెట్ టెర్రరిస్ట్‌లు హతం
న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని అలుచి బాగ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లస్కరే తోయిబా ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు హతమార్చారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాలో కమాండర్ స్థాయిలో విధులు నిర్వహించే అబ్బాస్ షేక్, షకీబ్ మన్సూర్‌లుగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ల జాబితాలో చనిపోయిన ఈ ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం. కశ్మీర్ జోన్ పోలీసుల సమాచారం ప్రకారం.. అలుచి బాగ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. చదవండి: పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు -
కశ్మీర్ పర్యటనలో రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగం..
శ్రీనగర్: రెండేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తిరిగి తన సొంత ఉంటికి వచ్చినట్టుందని అన్నారు. శ్రీనగర్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాహుల్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘నా కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. అంతకు ముందు అలహాబాద్‌లో ఉండేవారు. దానికంటే ముందు నా కుటుంబం కశ్మీర్‌లోనే ఉండేది. నా తాత ముత్తాతలు ఈ జీలం నది నీళ్లు తాగే బతికారు. అందుకే కశ్మీరీయత్ (ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు) నా నరాల్లో ఎంతో కొంత జీర్ణించుకొని పోయింది. ఇక్కడికి రాగానే తిరిగి సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగింది’’ అని రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రేమ, గౌరవం ఈ రెండింటి ద్వారానే ఏదైనా సాధించాలి తప్ప విద్వేషం, బలవంతంతో ఒరిగేదేమీ లేదన్నారు. ‘‘కశ్మీర్‌కు లోక్‌సభలో ఎక్కువ స్థానాలు లేవు. ప్రస్తుతం దీనికి రాష్ట్ర హోదా కూడా లేదు. కానీ మీ సంస్కృతి సంప్రదాయాలే కశ్మీర్‌కు బలం. కశ్మీరీయత్ దేశానికి పునాది వంటిది. ఆ భావం నాలో కూడా ఉంది. అందుకే ప్రేమ, గౌరవం అనే సందేశాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను’’ అని రాహుల్ అన్నారు. 2019 ఆగస్టులో కేంద్రం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ శ్రీనగర్‌కు వస్తే అధికారులు విమానాశ్రయం నుంచి ఆయన్ను వెనక్కి పంపేవారు. ఈ విషయాన్ని గుర్తు చేసిన రాహుల్ జమ్మూ, లద్దాఖ్‌లలో కూడా పర్యటిస్తానని చెప్పారు. ప్రధాని విభజన సిద్ధాంతంపై పోరాటం కొనసాగుతుంది: రాహుల్ సమాజాన్ని విభజించాలని చూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధాంతాలపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పెగసస్, రైతు సమస్యలు, అవినీతి ఇలా ఏ అంశంపైనా చర్చకు అంగీకరించడం లేదని విరుచుకుపడ్డారు. ప్రధాని విభజన సిద్ధాంతాలతో దేశమే ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ మన వ్యవస్థలపై దాడి చేస్తోంది. న్యాయవ్యవస్థ, అసెంబ్లీ, పార్లమెంటు ఇలా అన్నింటిపైనా దాడికి దిగుతోంది. చివరికి మీడియాను కూడా తన గుప్పిట్లో ఉంచుకుంది. మీడియా మిత్రుల్ని బెదిరిస్తూ ఉండటంతో వారు తమ విధుల్ని కూడా నిర్వహించలేకపోతున్నారు. ఇది దేశంపై జరుగుతున్న దాడి’’ అని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇవ్వాలి జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడానికి ముందే రాష్ట్ర హోదా కట్టబెట్టాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముందుగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాక ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. అంతకు ముందుమాతా ఖీర్ భవానీ అలయాన్ని రాహుల్ సందర్శించి పూజలు చేశారు. శ్రీనగర్‌లో కొత్తగా ఏర్పాటైన పీసీసీ కార్యాలయంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ -
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల్లో స్థానికులు!
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లోని దాన్మర్ ప్రాంతం శుక్రవారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఆల్మదార్ కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా, మృతి చెందిన ఉగ్రవాదులిద్దరూ స్థానికులేనని, వీళ్లు లష్కరే తాయిబా ఉగ్రసంస్థకు చెందిన వాళ్లని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ ముగిసినట్లు ప్రకటించకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో తనిఖీలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 78 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టినట్లు విజయ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా కమాండర్ అయిజాజ్‌తో పాటు గుర్తు తెలియని మరో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు ఉగ్రవాదుల ఐడెంటిటీ తెలియాల్సి ఉంది. #Srinagar witnessed another encounter in the wee hours of July 16. 2 unidentified militants were neutralised in this process. Visuals show The #encounter house being on fire. pic.twitter.com/Ah5NCvjL3G — Sandeep Dhar (@sandeepdhar10) July 16, 2021 -
పుల్వామాలో ఉగ్రదాడి కలకలం
జమ్మూకశ్మీర్: పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. ఎస్పీఓ ఫయాజ్ అహ్మద్ ఇట్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఫయాజ్ భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య మరణించారు. కుమార్తెను శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా, శ్రీనగర్‌లోని మెంగన్‌వాజీ నౌగాం ప్రాంతంలో ప్రార్థనలకు వెళ్లే సమయంలో మరో పోలీసు అధికారి పర్వైజ్ అహ్మద్ దార్‌పై ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మంగళవారం కాల్పులు జరిపారు. అలాగే గత నెలలో జావైద్ అహ్మద్ అనే పోలీసు అధికారిపై తన నివాసం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చదవండి: రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోండి అణచివేత శకం ముగియాలి -
భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్: శ్రీనగర్‌లోని నౌగం ప్రాంతంలోని వగూరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఓ ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగపడిపట్లు వెల్లడించారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. మరో ఉగ్రవాది ప్రాణాలతో చిక్కినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల నుంచి పిస్తోల్, మ్యాగజైన్, 6 రౌండ్ల బుల్లెట్లు, 2 గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చదవండి: బహుమతి పంపించానంటూ.. రూ.80 లక్షలు స్వాహా -
అయ్యో పాపం.. అదా రాణి!
శ్రీనగర్: మీర్ యాసిర్ అదా.. ముద్దులొలికే ఐదేళ్ల పాప. ఇరుగు పొరుగు అందరూ ఆమెను అదా రాణి అని పిలుస్తారు. అలా పిలిపించుకోవడం ఆమెకు చాలా ఇష్టం. ఈ నెల 3న అదా సోదరుడు అలీ ఏడో జన్మదినం. ఈ వేడుకను ఇంట్లోనే ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం కేక్ కట్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. చిన్నారి అదా రాణి తనకెంతో ప్రీతిపాత్రమైన బార్బీ డ్రెస్ ధరించింది. తనను తాను బుల్లి యువరాణిగా ఊహించుకుంటూ తలపై కిరీటం కూడా పెట్టుకుంది. బుడిబుడి నడకలు నడుస్తూ చిరునవ్వులు చిందిస్తూ అందంగా మెరిసిపోతున్న పాపను చూసి విధికి కూడా కన్నుకుట్టిందో ఏమో! ఇంతలో చిరుతపులి రూపంలో మృత్యువు హఠాత్తుగా వారి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించింది. పాపను నోట కరుచుకొని సమీపంలోని చిట్టడవిలోకి పరుగులు తీసింది. చిన్నారి అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులంతా ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకొని అడవిలో పాప కోసం గాలించారు. స్థానికులు, అటవీ అధికారులు కూడా ఈ గాలింపులో పాల్గొన్నారు. అడవిలో ఒకచోట కొన్ని మాంసం ముద్దలు, రక్తం మరకలు, పాప అడుకొనే ఒక బొమ్మ మాత్రమే కనిపించాయి. తమ గారాల పట్టి చిరుత పంజాకు బలైపోవడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ శివారులో ఈ విషాదం చోటుచేసుకుంది. జనాభా విపరీతంగా పెరుగుతుండడం, అడవుల విస్తీర్ణం భారీగా తగ్గుతుండడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివారులో ఓంపురా ప్రాంతంలోని ‘మిర్ హౌస్’లో చోటుచేసుకున్న విషాదాంతం ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. చిన్నారి అదా రాణి మరణం పట్ల జనం సంతాపం వ్యక్తం చేస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఇంటి సమీపంలో ఉండేవారంతా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. బాలిక జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కంటతడి పెడుతున్నారు. అప్పటివరకు తన అమ్మమ్మ ఇంట్లో ఉన్న చిన్నారి తన అన్న అలీ పుట్టినరోజు వేడుక కోసం తమ ఇల్లు మీర్ హౌస్‌కు వచ్చిందని, పై అంతస్తులో ముస్తాబైన తర్వాత కిందకు వచ్చి లాన్లో ఆడుకుంటుండగా చిరుత ఎత్తుకుపోయిందని ఆమె మామ ఐజాజ్ అహ్మద్ చెప్పారు. ఈ నెల 5న చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేశారు. ముద్దుల పాపకు కన్నీటి వీడ్కోలు పలికారు. ‘‘స్వర్గం ఇప్పుడు మరింత అందమైన ప్రాంతంగా మారి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడక్కడ అదా రాణి ఉంది కదా’’ అని నెటిజన్ ఒకరు ట్విట్టర్లో పోస్టు చేశారు. పాప తండ్రి ముదాసిర్ థాయ్‌ల్యాండ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. కరోనా వ్యాప్తి వల్ల గత ఏడాది ఇండియాకు తిరిగి వచ్చాడు. అదా రాణి శ్రీనగర్‌లోని డీపీఎస్ స్కూల్లో చదువుతోంది. చిరుత పులి దాడిలో ఆమె మరణం పట్ల సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నారి మరణాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు ఫారెస్టు అధికారులను సస్పెండ్ చేసింది. -
కరోనా రోగుల కోసం బోట్ అంబులెన్స్ సేవలు
శ్రీనగర్: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు, మల్టీనేషనల్ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలను ఇచ్చాయి. చాలామంది కరోనా బాధితులకు తమవంతు సహాయం చేస్తున్నారు. నిరుపేదలు కూడా సేవలో తామున్నామంటున్నారు. ఎంతో మంది మానవతా మూర్తులు పెద్ద మనస్సును చాటుకుంటున్నారు. కశ్మీర్లో తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు తన పడవను అంబులెన్స్‌గా మార్చి దాల్ సరస్సులో సేవలందిస్తున్నాడు. అతడి సేవకు జనాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నివసించే తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు ఈమధ్యే కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. తారిక్కు కరోనా వచ్చినప్పుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. కోలుకున్నాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఎవరూ పడవలోకి ఎక్కనివ్వలేదు. కారణం కరోనా భయం. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రజలు పడుతున్న కష్టాలేంటో స్వయంగా అనుభవించాడు. అప్పట్లో తారిక్ పట్లూ… 20 రోజులు ఇంట్లో క్వారంటైన్ అయ్యాడు. అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది… అయితే ఎవరు కూడా తనను పడవ ఎక్కనిచ్చేవారు కాదు. పడవ నడిపే తన తోటి వారే పడవలోకి ఎక్కించుకోవడానికి భయపడటం చూసి… పట్లూ బాధపడేవాడు. కానీ వారికి ఓ కుటుంబం ఉంటుందని అర్థం చేసుకున్నాడు. దాంతో తనకున్న పడవను అంబులెన్సుగా మార్చేశాడు. దాల్ సరస్సులో పర్యాటకులను తిప్పి ఆ డబ్బులతో జీవించే తారిక్ తన పడవను అంబులెన్స్‌గా మార్చి సేవలందిస్తున్నాడు. కరోనా రోగులను తన పడవలో తీసుకెళ్తున్నాడు..అంతేకాకుండా వారికి ఏం కావాలో తెలుసుకుని మరీ సహాయం చేస్తున్నాడు. తన ఫోన్ నంబర్ ఇచ్చి ఏం సహాయం కావాలన్నా తన శక్తి మేరకు చేసి పెడతానని భరోసా కల్పిస్తున్నాడు. తారిక్ రూపాయి రూపాయి కూడబెట్టాడు. కొంత అప్పు చేశాడు. అలా ఆయన పడిన కష్టానికి ఏప్రిల్‌లో ఓ రూపం వచ్చింది. దాల్ సరస్సులో తేలియాడే పడవ కాస్తా అంబులెన్స్‌గా మారిపోయింది. వాటర్ అంబులెన్స్ సిద్ధం అయ్యింది. ఈ పడవ అంబులెన్స్ లో పీపీఈ కిట్స్, స్ట్రెచర్స్ ఉన్నాయి. వీల్ చైర్ కూడా ఉంది. దీంతో కరోనా రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం తేలికైంది. కాగా..శ్రీనగర్‌కి పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో… అక్కడ కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 25న శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ తెరవడంతో కేసులు మరింత ఎక్కువయ్యాయి. ఆ రోజు 131 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 2.29 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 1.75 లక్షల మంది కోలుకున్నారు. 2,912 మంది మరణించారు. (చదవండి: ఆనంద్ మహీంద్ర: ‘‘చాలా మంది పాత రోజులనే ఇష్టపడుతున్నారు’’) -
కరోనాతో ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన శనివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా చేరినట్లు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మార్చి 30వ తేదీన 83 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ మేరకు ఫరూక్ శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన కరోనా వ్యాక్సిన్ పొందిన తర్వాత పాజిటివ్ రావడం గమనార్హం. ‘తన తండ్రి కోసం ప్రతిఒక్కరూ చేస్తున్న ప్రార్థనలు, మద్దతు తెలుపుతున్నందుకు మా కుటుంబం గర్వపడుతుంది’ అని పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా ఆరోగ్యం విషయమై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకుని ఆయన వెంటనే కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. Based on the advice of doctors to enable them to better monitor my father, he has been admitted to hospital in Srinagar. Our family remains grateful to everyone for their messages of support & their prayers — Omar Abdullah (@OmarAbdullah) April 3, 2021 -
మెహబూబా తల్లికి పాస్‌పోర్ట్ నిరాకరణ
శ్రీనగర్: కేంద్ర మాజీ మంత్రి, కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తి మొహమ్మద్ సయీద్ భార్య గుల్షన్ నజీర్ పాస్‌పోర్టు దరఖాస్తు తిరస్కరణకు గురైంది. పోలీస్ శాఖ ఇచ్చిన ప్రతికూల నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్షన్ కూతురు, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా తన పాస్‌పోర్టు దరఖాస్తును అధికారులు తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించగా సోమవారం చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ తల్లి, కూతురు పవిత్ర మక్కా వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం గత ఏడాది డిసెంబర్లో దరఖాస్తు చేసుకున్నారు. పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6(2)(సి) ప్రకారం జమ్మూకశ్మీర్ పోలీస్ సీఐడీ విభాగం పాస్‌పోర్ట్ దరఖాస్తును తిరస్కరించిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి కార్యాలయం గుల్షన్‌కు లేఖ పంపింది. ఈ విషయాన్ని మెహబూబా ముఫ్తీ కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ‘ఏడు పదుల వయస్సున్న నా తల్లితో దేశ భద్రతకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి, ఆమెకు పాస్‌పోర్ట్ అవసరం లేదు. వారి మాట విన లేదని భారత ప్రభుత్వం మమ్మల్ని ఇలాంటి విధానాలతో వేధించేందుకు, శిక్షించేందుకు పూనుకుంది’అని విమర్శించారు. ఎవరైనా దరఖాస్తుదారు దేశం విడిచి వెళ్లడం ద్వారా దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావించినప్పుడు అధికారులు పాస్‌పోర్ట్‌ను నిరాకరించేందుకు పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6(2)(సి) సెక్షన్ అధికారం కల్పించింది. దరఖాస్తుదారుకు పాస్‌పోర్ట్ మంజూరు ప్రజాసంక్షేమం కోసం కాదని కేంద్రం భావించిన సందర్భాల్లో కూడా అనుమతి నిరాకరించవచ్చు. చదవండి: మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్ -
కశ్మీర్ వెళ్లి తులిప్ అందాలు చూసొద్దామా..
-
జమ్మూకాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
మోదీపై గులామ్ నబీ ఆజాద్ ప్రశంసలు
శ్రీనగర్ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబి ఆజాద్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నరేంద్ర మోదీ నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దేశ ప్రధాని స్థాయికి ఎదిగినా ఆయన తన మూలాలు మర్చిపోలేదు. తననో చాయ్‌వాలాగా గర్వంగా చెప్పుకుంటారు’’ అని అన్నారు. తనకు, మోదీకి రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నప్పటికి, వ్యక్తిగతంగా ఆయన ఉన్నతుడన్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం గులామ్ నబి ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేస్తూ.. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సొంత పార్టీ ప్రయోజనాలతో పాటు రాజ్యసభ, భారతదేశ ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. కరోనా సమయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆజాద్ తనను కోరారని, దాంతో వెంటనే అఖిలపక్ష భేటీ పెట్టానని గుర్తు చేశారు. తాను గుజరాత్ సీఎంగా, కశ్మీర్ సీఎంగా ఆజద్ ఉన్నపుడు తాము మాట్లాడుకునేవారమన్నారు. కశ్మీర్లో గుజరాత్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సమయంలో తనకు మొదట ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది ఆజాదేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి గురైన ప్రధాని కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. ‘అధికారం వస్తుంది. పోతుంది. కొందరికే ఆ అధికారాన్ని సరిగ్గా వినియోగించడం తెలుస్తుంది. అది ఆజాద్‌కు తెలుసు’అని అన్నారు. చదవండి : 'ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలు' -
కశ్మీర్ సోయగం: ఒక్కొక్కరికి ఎంత ఖర్చంటే!
ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్) నిర్వహించే ‘శ్రీనగర్– గుల్మార్గ్– పహల్గావ్– శ్రీనగర్’ టూర్లో పర్యాటకులను మొదటి రోజు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో పికప్ చేసుకుంటారు. ఈ పర్యటనలో శ్రీనగర్ షాలిమర్ తోటలు, శంకర్ నారాయణ్ టెంపుల్, గుల్మార్గ్ (గౌరీ మార్గ్), పహల్గావ్లోని కుంకుమ పువ్వు తోటల్లో విహారం, అవంతిపురా పర్యటన, థాజ్వాస్ గ్లేసియర్ తీరాన గుర్రపు స్వారీ, శ్రీనగర్‌లో శికారా రైడ్ ఉంటాయి. చివరి రోజు తిరిగి శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తారు. ఇవి ఉండవు! ఈ ప్యాకేజ్‌లో విమాన ప్రయాణ చార్జీలు కలిసి లేవు. శ్రీనగర్‌కు వెళ్లడానికి, శ్రీనగర్ నుంచి తిరిగి స్వస్థలం రావడానికి విమాన టిక్కెట్లను పర్యాటకులు సొంతంగా బుక్ చేసుకోవాలి. శ్రీనగర్‌లో దిగినప్పటి నుంచి తిరిగి విమానాశ్రయానికి చేర్చే వరకు రవాణా ప్యాకేజ్‌లో ఉంటుంది. అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం డిన్నర్ కూడా ప్యాకేజ్‌లోనే. ఈ పర్యటనకు ఏప్రిల్ నుంచి జూలై వరకు పీక్ సీజన్. జనవరి నుంచి మార్చి వరకు పీక్ సీజన్ కాకపోవడంతో పర్యాటకుల తాకిడి తక్కువ. ఆరు రోజుల (ఐదు రాత్రులు) ఈ ప్యాకేజ్‌లో ఒక్కరికి 35 వేలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 18 వేలవుతుంది. ముగ్గురు కలిసి వెళ్లినప్పుడు ఒక్కొక్కరికి 15 వేలకు మించదు. పీక్ సీజన్లో ప్యాకేజ్ చార్జ్‌లు మరో రెండు వేలు పెరుగుతాయి. గమనిక: పర్యాటకులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పోస్ట్‌పెయిడ్ సిమ్‌కార్డు ఉండాలి. ప్యాకేజ్ పేరు ‘శ్రీనగర్– గుల్మార్గ్– పహల్గావ్- శ్రీనగర్ ప్యాకేజీ. -
అదిగో ఆయేషా అజీజ్!
కొన్నింటిని అతిశయోక్తిగా చెప్పకపోతే, చెప్పడం మానడమే మేలు! అకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తే తమక్కూడా రెక్కలు ఉంటే బాగుండుననుకుంటారు పిల్లలెవరైనా. శ్రీనగర్‌లోని ఆడపిల్లలు మాత్రం ఆయేషా అజీజ్ గురించి వినగానే పక్షులైపోయి ఆకాశంలో విహరిస్తారు! ఆయేషా కమర్షియల్ పైలట్. దేశంలోనే అతి చిన్న వయసులో పైలట్ అయిన అమ్మాయి! పదిహేనేళ్ల వయసుకే ఆమెకు పైలట్ లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఐదు. భారతదేశ ప్రసిద్ధ వార్తా సంస్థ ఎ.ఎన్.ఐ. (ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్) ఆయేషా పదేళ్ల పైలట్ జర్నీ గురించి ఇంటర్వ్యూ చేయడంతో తాజాగా ఆమె వార్తల్లోకి వచ్చారు. ఆయేషా అజీజ్ పేరు మొదటిసారి 2011 లో దేశానికి తెలిసింది. అది ఆమె పైలట్ లైసెన్స్ సాధించిన సంవత్సరం. శిక్షణ కోసం లైసెన్స్ అది. శిక్షణ రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరంలో! ప్రారంభంలోనే ఎం.ఐ.జి.–29 జెట్‌ను నడపడం నేర్చుకున్నారు ఆయేషా. ఆ తర్వాత ఆమె సాధించవలసింది కమర్షియల్ లైసెన్స్. బాంబే ఫ్లయింగ్ క్లబ్లో చేరి విమానయానంలో డిగ్రీ సాధించాక ఆ లైసెన్స్ కూడా వచ్చేసింది. అది 2017లో. 2011లో లైసెన్స్ పొందాక తన ఈ పదేళ్ల ప్రస్థానం గురించి ఎ.ఎన్.ఐ. తో మాట్లాడుతున్నప్పుడు ఆయేషా తన గురించి కాక, కశ్మీర్లో ఇప్పుడు చక్కగా చదువుకుని పైకొస్తున్న ఆడపిల్లల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. ‘వాళ్లలో పైలట్ అవాలనుకున్న అమ్మాయిలకు మీరే ఇన్స్పిరేషన్ అయుండొచ్చు కదా..’ అన్న మాటకు, ‘కావచ్చేమో!’ అని నవ్వారు ఆయేషా. పైలట్ గా ఆమె తన కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. ‘‘ఎందుకంటే నాకు 9–5 ఉద్యోగం పడదు. నాకే కాదు.. అసలు ఏ అమ్మాయికీ అలాంటి ఉద్యోగం ఇష్టం ఉండదు. అవకాశం ఉండాలే కానీ, ఖండాలన్నీ తిరగాలనుకుంటుంది. అంతుకు తల్లిదండ్రులే లాంచింగ్ స్టెప్ అవాలి..’’ అంటారు ఆయేషా. ∙∙ ఆయేషాకు ఆకాశంలో ఎగరాలని మరీ చిన్న వయసులోనే మనసులో పడిపోయింది. వందల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యం చేర్చే ఉద్యోగం ఎంత థ్రిల్‌గా చెప్పడానికే ఆమె ఏ సమయంలోనైనా ఉత్సాహం చూపుతారు. తల్లిదండ్రులిద్దరూ రెండు చేతులతో భద్రంగా పైకి ఎగరేసిన పైలట్ పావురం ఆయేషా. వారు పెద్ద సపోర్ట్ ఆమె కెరీర్‌కు. ‘యంగెస్ట్ స్టూడెంట్ పైలట్’ అనే రికార్డు కూడా ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉంది. ఆయేషా పుట్టింది కశ్మీర్లో. పెరిగింది ముంబైలోని వర్లీలో. తల్లితో కలిసి ముంబై నుంచి అమ్మమ్మ వాళ్లుండే జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాకు తరచు విమానంలో వెళ్లివస్తుండంతో తనూ విమానాన్ని నడపాలని అనుకుంది ఆయేషా! ఆ మాటే అమ్మానాన్నకు చెబితే.. ‘తప్పకుండా.. అయితే అందుకు కష్టపడి చదవాల్సి ఉంటుంది’ అని చెప్పారు. టెన్త్ పూర్తి చేయగానే ఆమె ఆశకు పైలట్ కోర్సుతో రెక్కలు కట్టారు. పైలట్ అయ్యాక తొలిసారి అమ్మానాన్న ఉన్న విమానాన్ని నడపడం ఆయేషా జీవితంలోని మరపురాని అపురూప ఘటన. ఇక తల్లిదండ్రులు గర్వ పడకుండా ఉంటారా.. కూతురు కూర్చోబెట్టి తమను, ఇంకా మరికొంతమందిని గాల్లో తేలియాడిస్తుంటే! బాంబే ఫ్లయింగ్ క్లబ్లో లైసెన్స్ సాధించాక 2012లో ‘నాసా’లో కూడా రెండు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఆయేషా! అక్కడ ఆమెకు జాన్ మెక్‌బ్రైడ్ అనే నాసా రిటైర్డ్ వ్యోమగామి పరిచయం అయ్యారు. స్పేస్ షటిల్ మిషన్, మైక్రో గ్రావిటీ, మాన్డ్ మానోవరింగ్ (విన్యాసాలు), మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ.. వీటన్నిటిలో మెక్‌బ్రైడ్ ఆమెకు మెళకువలు నేర్పారు. ∙∙ జాన్ మెక్‌బ్రైడ్ తర్వాత ఆమెలో పూర్తి స్థాయి స్ఫూర్తిని నింపినవారు నాసాలోని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. స్వయంగా వెళ్లి సునీతను కలుసుకున్నారు ఆయేషా. నీటిలో స్కూబా డైవింగ్, నింగిలో మూన్ వాక్‌లలో తన అనుభవాలను ఆయేషాతో పంచుకుని ఆమె కలలకు ఇంధనాన్ని నింపారు సునీత. 1960లో ప్రైవేట్ పైలట్ లైసెన్స్‌తో ప్రయాణీకుల విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ రబియా ఫతే అలీ దగ్గర కూడా ఆయేషా ఆసక్తి కొద్దీ మరికొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారు. పైలట్ శిక్షణ లైసెన్స్ సంపాదించాక 2012లో శిక్షణలో భాగంగా తొలిసారి ఎం.ఐ.జి జెట్‌ను నడిపినప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని అంటారు ఆయేషా. ఆనాటి చిన్న పిల్ల ఇప్పుడు ‘ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్’ లో ప్రతిష్టాత్మక సభ్యురాలు. అయితే స్టూడెంట్ పైలట్‌గా, పైలట్‌గా, అసోసియేషన్ సభ్యురాలిగా ఘనమైన గుర్తింపు కలిగి ఉన్న ఆయేషాకూ కొన్ని ఒత్తిడిలు తప్పలేదు. సంప్రదాయ శిరోవస్త్రాన్ని (హిజబ్) ఎందుకు ధరించరనే ప్రశ్నను ఆమె ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు! అందుకు ఆమె దగ్గర సమాధానం కూడా ఉంది. ‘‘ప్రవక్త భార్య హజ్రత్ ఆయేషా యుద్ధంలో ఒంటెను స్వారీ చేయించగా లేనిది, నేను విమానాన్ని నడిపేందుకు సంప్రదాయాలు ఎందుకు అడ్డపడాలి?’’ అంటారు ఆయేషా. 2018 జనవరిలో ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో ఆర్మీ చీఫ్, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫస్ట్ లేడీస్’ టైటిల్‌ను అందుకున్న ఆయేషా.. పైలట్లు కావాలన్న ఉత్సాహం ఉండీ, ఆర్థికంగా వెలుసుబాటు లేని అమ్మాయిల్ని పైలట్లుగా ప్రోత్సహించేందుకు ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్ తరఫున కృషి చేస్తున్నారు. -
మంచు కురిసే వేళలో.. కశ్మీర్ అందాలు చూడ తరమా..
-
‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’
శ్రీనగర్: ఎలా ఉన్నావన్న మిత్రుడితో ‘‘బాగానే ఉన్నా. కానీ మా (సైనికుల) గురించి ఎవరేం చెప్పగలరు? ఇవాళ ఉంటాం. రేపుండొచ్చు, ఉండకపోవచ్చు’’ అని సమాధానమిచ్చాడు ఒక ఇరవయ్యేళ్ల జవాను. ఆ మరునాడే ఒక ఉగ్రదాడిలో అమరుడయ్యాడు. సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ పాటిదో చెప్తూ, సొంతూర్లోని తన చిన్ననాటి స్నేహితుడితో అతను చేసిన వాట్సాప్ చాట్ వైరల్‌గా మారడమే కాకుండా నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఎవరతను? మహారాష్ట్ర, జల్గావ్ జిల్లా, చలిగావ్ తాలూకాకు చెందిన యశ్ దిగంబర్ దేశ్‌ముఖ్ గతేడాదే ఆర్మీలో చేరాడు. యశ్ తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అతనికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. అక్కలిద్దరికీ పెళ్లవగా, తమ్ముడింకా స్కూలుకు వెళుతున్నాడు. కర్ణాటక, బెళగావ్‌లో నిర్వహించిన మిలటరీ ఎంపిక శిబిరానికి చేరుకున్న యశ్ ఎంతగానో శ్రమించి ఆర్మీలో చోటు సంపాదించి తన కల నెరవేర్చుకున్నాడు. అసలేమైంది? అక్రమంగా ఎల్వోసీ దాటిన ముగ్గురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గురువారం శ్రీనగర్‌లోని ఓ రద్దీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పట్టపగలే జరిగిన ఈ మెరుపుదాడిలో యశ్‌తో పాటు మరో జవాను అమరుడయ్యాడు. పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున (26/11) ముంబై ఉగ్రదాడి జరగడం గమనార్హం. మరో రెండు రోజుల్లో జమ్ము కశ్మీర్లో ‘జిల్లా అభివృద్ధి మండలి’ (డీడీసీ) ఎన్నికలు జరనున్న నేపథ్యంలోనే ముష్కరులు ఈ దాడి జరిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఈ నెల 19న జమ్ము-శ్రీ నగర్ జాతీయ రహదారిపై ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు జైషే మొహమ్మద్ మిలిటంట్లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే! -
హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ హతం..
కశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైఫుల్లా హతమయ్యాడు. శ్రీనగర్ సరిహద్దులో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కాగా మరో ఉగ్రవాది తమ అదుపులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. కాగా శ్రీనగర్‌లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు శనివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులు దాగినట్లు అనుమానించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరుపగా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైఫుల్లా( ఫైల్ ఫోటో) కాగా పోలీసులు ఎన్కౌంటర్ స్థలంలో ఉగ్రవాదుల నుంచి ఏకే-47, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ మట్లాడుతూ.. పుల్వామా జిల్లాలోని మలంగ్‌పోరాకు చెందిన అతడు 2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరినట్లు తెలిపారు. రియాజ్ నాయకూ అతడ్ని నియమించి ఘాజీ హైదర్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. భద్రతా దళాలు సైఫుల్లాను మట్టుబెట్టడం తమకు గ్రేట్ ఎచీవ్మెంట్ అని ఆయన పేర్కొన్నారు. -
మేఘా ‘జోజిలా’ టన్నెల్ పనులు ప్రారంభం
న్యూఢిల్లీ: శ్రీనగర్ లోయ, లేహ్‌ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన జోజిలా టన్నెల్ నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. నిర్దేశించుకున్న షెడ్యూల్ కన్నా ముందుగా నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎంఈఐఎల్ రూ. 4,509.5 కోట్లకు బిడ్ వేసింది. సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి. ఇది పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్‌గా నిలుస్తుంది. శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది. శ్రీనగర్–కార్గిల్–లేహ్ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది. సాధారణంగా శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్–లేహ్ మధ్య మార్గాన్ని మూసేయాల్సి ఉంటోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది. -
శ్రీనగర్‌లో స్త్రీశక్తి
ఆమె తెలంగాణ కేడర్ 1996 బ్యాచ్ ఐ.పి.ఎస్ ఆఫీసర్. ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలలో పని చేశారు. చిత్తూరులో పని చేసేటప్పుడు హెచ్ఐవి బాధితుల ఆస్తి హక్కు కోసం కృషి చేశారు. ప్రకాశం జిల్లాలో పని చేసేటప్పుడు చెంచుల వికాసానికి దోహదపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్ట్‌ల కార్యకలాపాలను కట్టడి చేశారు. బిహార్‌లో కూడా తన సత్తాను చాటిన చారుసిన్హా ఇప్పుడు శ్రీనగర్‌కు మొదటి సిఆర్పిఎఫ్ మహిళా ఐజిగా నియమితులయ్యి చరిత్ర సృష్టించారు. ఆమె ఆలోచనలు కొన్ని.... సీనియర్ ఐ.పి.ఎస్ ఆఫీసర్ చారు సిన్హా ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. ఆమె శ్రీనగర్‌లో నిలుచుని దేశం మొత్తం తన వైపు చూసేలా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆమె సి.ఆర్.పి.ఎఫ్ శ్రీనగర్ సెక్టార్‌కు ఇన్స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇలా శ్రీనగర్‌లో ఐజిగా ఒక మహిళ బాధ్యతలు తీసుకోవడం ఇదే ప్రథమం. అందునా ఉగ్రవాదుల గురి ప్రధానంగా ఉండే శ్రీనగర్ సెక్టార్లో ఒక మహిళా అధికారి ఈ సవాలును స్వీకరించడం మరీ విశేషం. శ్రీనగర్ సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్ ‘బ్రయిన్ నిషత్’ అనే ప్రాంతంలో ఉంది. మూడు జిల్లాలు– బడ్గమ్, గండెర్బల్, శ్రీనగర్‌తో పాటు కేంద్రపాలిత లడాక్ కూడా దీని ఆపరేషనల్ జూరీ డిక్షన్ కిందకు వస్తాయి. ఈ అన్ని ప్రాంతాలలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే కీలక బాధ్యత ఇప్పుడు చారు సిన్హాది అవుతుంది. అక్కడి పాలనా వ్యవస్థతో, పోలీసులు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించాలి. 2005లో శ్రీనగర్ సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్ మొదలైతే పురుష అధికారులే ఐ.జిలుగా బాధ్యతలు నిర్వరిస్తూ వచ్చారు. చారు సిన్హా ఇప్పుడు వారి స్థానంలో రావడం అమె దక్షతకు, ధైర్య సాహాసాలకు ఒక నిదర్శనం. హైదరాబాద్‌లో చదువుకుని చారు సిన్హా హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఎనిమిదవ తరగతి నుంచి ఆమెకు దేశానికి సేవ చేయాలన్న ఒక ఆశయం మొదలైంది. హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్ డిగ్రీ చదివి, సెంట్రల్ యూనివర్సిటీలో పిజి చేశాక 1996లో ఐ.పి.ఎస్‌కు ఎంపిక అయ్యారు. ఒక మహిళగా కఠినమైన పోలీస్ ట్రయినింగ్‌ను ఎదుర్కొన్నారు. ‘ఎన్నో గాయాలు, ఎముకలు చిట్లడాలు అయ్యాయి. అయినా హార్స్ రైడింగ్ దగ్గరి నుంచి అన్ని శిక్షణలను విజయవంతంగా పూర్తి చేశాను’ అంటారామె. ట్రయినింగ్ అయ్యాక పులివెందుల ఏ.ఎస్.పిగా పని చేశారు. ఆ తర్వాత ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, మెదక్ ఇలా భిన్న ప్రాంతాలలో పని చేశారు. ‘నేను ఉద్యోగానికి చేరిన కొత్తల్లో ఇదంతా మగ ప్రపంచంగా ఉండేది. అందునా మీడియాకు ఇలా మహిళా పోలీస్ అధికారిని చూడటం ఇంకా కుతూహలంగా ఉండేది. నేను ఎక్కడికి వెళుతున్నాను... ఏం చేస్తున్నాను.. అని నా వెంటబడేవారు. ఒక దశలో నాకసలు పర్సనల్ లైఫ్ లేదా అని సందేహం కలిగేది. తర్వాత తర్వాత ఈ కుతూహలం తగ్గి వెసులుబాటు వచ్చింది’ అంటారామె. మనిషా? నేరమా? ‘కొత్తల్లో నేను నేరాలను చూసినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకునేదాన్ని. నిందితుల్లో, బాధితుల్లో ఎవరు చెప్పేది సత్యం అని డైలమాలో ఉండేదాన్ని. ఎందుకంటే చట్టానికి బాధ్యులుగా ఉన్నవారు తప్పు నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తుల జీవితాలు నాశనమైపోతాయి. ఆ తర్వాత వ్యక్తులను కాదు నేరాన్ని మాత్రమే చూడాలి. జరిగిన నేరానికి శిక్ష మీద దృష్టి పెడితే వ్యక్తులు అప్రధానమైపోతారు అని తెలుసుకున్నాను’ అంటారామె. తనకు తనదైన పని విధానం ఉందనుకుంటారు చారు సిన్హా. ‘నా కింద పని చేసే వివిధ స్థాయుల అధికారులు ఉంటారు. కొందరు నాకు అంతా తెలుసు అనుకుంటారు. మరికొందరు నాకేమీ తెలియదు అనుకుంటారు. నేను ఒక బాధ్యత తీసుకున్నాక మొదట చేసే పని నా కింద పని చేసే సిబ్బందిని అంచనా వేయడం. వారి స్వభావాలు నాకు అర్థమవుతాయి. ఎవరు ఏమిటో అవగాహన వచ్చాక వారికి ఎలాంటి పని చెప్పాలో చూసి చెబుతాను. సాధారణంగా నా అంచనా తప్పదు’ అంటారామె. రైతుకు దొరికిన ఉంగరం ‘ఒక రైతు వ్యవసాయం చేసుకుని బతికేవాడు. అతనికి ఒకరోజు పొలంలో ఒక ఉంగరం దొరికింది. దానిని పెట్టుకుంటే తాను మాయం అయిపోతానని, ఎవరికీ కనపడడని అతనికి అర్థమైంది. వెంటనే అతడు దానిని పెట్టుకుని ఆ ఊరి భూస్వామి ఇంట్లో చొరబడి వజ్రాలు దొంగిలించి పారిపోతాడు. ఆ ఉంగరం వల్ల అతడు తనకు, ఆ భూస్వామికి చెడు తెచ్చాడు. ఆ ఉంగరాన్ని మంచికి ఉపయోగించి ఉంటే ఎంత బాగుండేది. పోలీసు విభాగాలలో ఉండే ప్రతి ఉద్యోగి అలాంటి ఉంగరం ఉన్నవాడి కిందే లెక్క. అధికారమే అతని ఉంగరం. దానితో మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. నా కలీగ్స్ అందరికీ కొత్త అధికారులకూ ఈ కథే నేను చెబుతూ ఉంటాను’ అంటారు చారు సిన్హా. బిహార్‌లో, జమ్ములో చారు సిన్హాకు తీవ్రవాద కార్యకలాపాల నిరోధం కొత్త కాదు. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పని చేశారు. ఒకసారి ఆమె కింద పని చేసే నలుగురు పోలీసు సిబ్బంది కిడ్నాప్‌కు గురైనప్పుడు అవతలి పక్షం పెట్టిన డిమాండ్స్‌కు చారు లొంగలేదు. పది రోజుల తర్వాత గత్యంతరం లేక ఆ సిబ్బందిని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ అనుభవాన్ని చూసి ఆమెకు బిహార్ నక్సల్ కార్యకలాపాల నిరోధానికి అక్కడి సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్‌కు ఐ.జిగా నియమించారు. అక్కడ ఆమె పని తీరును గమనించాక జమ్ము ఐ.జిగా నియమించారు. అక్కడా ఆమె తన ప్రతిభా సామర్థ్యాలను చూపింది. దాంతో జటిలమైన బాధ్యత అయిన శ్రీనగర్ ఐజి స్థానాన్ని అప్పగించారు. చారు సిన్హాను తెలిసినవారు ఆమె ఈ పని సమర్థంగా చేయగలరని అంచనా వేస్తున్నారు. సత్యసాయిబాబా భక్తురాలు చారు సిన్హా సత్య సాయిబాబా ఆరాధకురాలు. 19 ఏళ్ల వయసులో మొదటిసారి సత్య సాయిబాబాను కలిసి ఆ తర్వాత అనేకసార్లు ఆయన ఆశీర్వచనాలు పొందానని చెబుతారు. పుస్తకాలు చదవడం, విహారం, పెంపుడు శునకాలతో ఆటలు ఇవి ఆమెకు ఆటవిడుపు సమయాలు. – సాక్షి ఫ్యామిలీ -
శ్రీనగర్ సీఆర్పీఎఫ్ ఐజీగా చారు సిన్హా
న్యూఢిల్లీ : శ్రీనగర్ సెక్టార్ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్( సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్‌గా మహిళా అధికారి చారు సిన్హా నియమితులయ్యారు. శ్రీనగర్ సెక్టార్‌కు తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఏ మహిళా ఐపీఎస్ అధికారి కూడా ఆ పోస్టులో నియామకం కాలేదు. చారు సిన్హా తెలంగాణ 1996 కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో ఈమె సీఆర్పీఎఫ్ బిహార్ సెక్టార్ ఐజీగా పనిచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతామైన ఈ సెక్టార్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించారు. అనంతరం జమ్మూ ఐజీగా బాధ్యతలు చేపట్టి చాలాకాలం పనిచేశారు. ఈ క్రమంలో సోమవారం ఆమెను శ్రీనగర్ ఐజీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. (తాళ్లు, ట్రెక్కింగ్ పరికరాలతో చొచ్చుకువచ్చారు) కాగా 2005 లో శ్రీనగర్ సెక్టార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ఐజీ స్థాయిలో మహిళా పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు ఇండియన్ ఆర్మీతోను, జమ్మూ కశ్మీర్ పోలీసులతోను చారు సిన్హా సమన్వయంతో పని చేయవలసి ఉంటుంది. సీఆర్పీఎఫ్ శ్రీనగర్ సెక్టార్ పరిధిలో రెండు రేంజ్‌లు, 22 ఎగ్జిక్యూటివ్ యూనిట్లు, మూడు మహిళా పోలీసు కంపెనీలు, పారామిలటరీ బలగాలు ఉన్నాయి. వాటన్నింటికీ చారు సిన్హా హెడ్‌గా వ్యవహించనున్నారు. -
ఎంఈఐఎల్కు జోజిల్లా పాస్ టన్నెల్ పనులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిమాలయాల్లోని జమ్మూకశ్మీర్- లడఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్లలో ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచింది. శుక్రవారం (21-08-2020) జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ఐడీసీఎల్ (NHIDCL) ఫైనాన్స్ బిడ్లను తెరవగా ఎంఈఐఎల్ మిగిలిన సంస్థల కన్నా తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్ టన్నెల్‌కు సంబంధించిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, ఇతర రోడ్ పనులకు గాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేయగా ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 నిలిచింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీ వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచిన పనిని జాతీయ రహదారి-1లోని జడ్ -మోర్హ (Z-Morh) టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్‌ను జోజిల్లా పాస్ ప్రాంతంలో సోనామార్గ్- కార్గిల్ మధ్య నిర్మిస్తారు. ఈపీసీ పద్ధతిలో పిలిచిన ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన టన్నెల్‌ను నిర్మించాల్సి వస్తుంది. పూర్తిగా క్లిష్టమైన కొండ ప్రాంతంతో పాటు మంచు తుఫాన్లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8 నెలల పాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదు. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తోంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు. ఈ యాత్రకు వెళ్లే వారికి కార్గిల్ సమీపంలోని బల్తల్ బేస్ క్యాంప్‌గా ఉంది. సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్లా రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సిహెచ్ సుబ్బయ్య తెలిపారు. రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంచు తుఫాన్లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. -
‘నా జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి’
శ్రీనగర్: ‘‘అవాస్తవ, అభూత కల్పనలతో కశ్మీరీలను మభ్యపెట్టి వారు నిరాశపడేలా చేయడం నాకు ఇష్టం లేదు’’ అని ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన షా ఫైజల్ వ్యాఖ్యానించారు. గతంలో జమ్మూ కశ్మీర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించిన ఆయన భవిష్యత్తులో కూడా ప్రజా సేవకే అంకితమవుతానని స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పనకై కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. కొత్త ప్రపంచంలో తాను సరికొత్త జీవితం ఆరంభించబోతున్నానని ప్రకటించిన షా ఫైజల్ అందుకు తగ్గట్టుగానే తన సోషల్ మీడియా అకౌంట్లలో తాను మెడికోనని మాత్రమే పేర్కొంటూ రాజకీయ జీవితం తాలూకు జ్ఞాపకాలు, ట్వీట్లను తొలగించారు. కాగా గతేడాది జనవరిలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన షా ఫైజల్.. మార్చి 21న జమ్ము కశ్మీర్ పీపుల్స్ మూమెంట్స్ పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. (కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు) ఈ క్రమంలో 16 నెలల పాటు రాజకీయ నేతగా పలు అంశాలపై స్పందించిన ఆయన ఆగష్టు 10న అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్‌లోని అనేకమంది కశ్మీరీ నేతలతోపాటు ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలో ఉన్న ఇటీవలే విడుదలయ్యారు. ఆ తర్వాత నెల రోజులకే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో షా ఫైజల్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు.. ఎవరీ షా ఫైజల్? కశ్మీర్‌లోని కుప్వారాకు చెందిన షా ఫైజల్ 1983లో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. షాకు పందొమిదేళ్ల వయసున్నపుడు ఆయన తండ్రి గులాం రసూల్ షాను మిలిటెంట్లు కాల్చి చంపేశారు. ఈ విషయం గురించి షా గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్లో లోయలో జరిగే రక్తపాతాన్ని కళ్లారా చూశాను. నా తండ్రిని ఉగ్రవాదులు హతమార్చినపుడు విషాదంలో మునిగిపోయాను. విద్యకు ప్రాధాన్యం ఇచ్చే నాన్న నాకు ఇంగ్లీష్, మ్యాథ్స్ ఎక్కువగా బోధించే వారు’’అని గుర్తు చేసుకున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్య(ఎంబీబీఎస్) విద్యనభ్యసించిన షా ఫైజల్.. 2010 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాప్ ర్యాంకు సాధించారు. తద్వారా ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్న తొలి కశ్మీరీగా నిలిచారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారికగా నియమితులయ్యారు.(ముర్ము రాజీనామాకు దారి తీసిన పరిస్థితులేమిటి?) వివాదాల్లో చిక్కుకుని.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షా ఫైజల్ కశ్మీర్ లోయలో తరచూ జరిగే అత్యాచారాల గురించి ట్వీట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో 2018లో కశ్మీర్ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో(‘అన్బికమింగ్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్’) నోటీసులు జారీ చేసింది. ఇక అప్పటి నుంచి ప్రతిసారి ఫైజల్ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో 2018లో విధుల నుంచి సెలవు తీసుకుని ఫుల్బ్రైట్ ఫెలోషిప్(ప్రోగ్రాం) కోసం హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌కు వెళ్లారు. ఆ తర్వాతే ఏడాదే అంటే 2019లో ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదొక ధిక్కరణ చర్య ఈ సందర్భంగా ఫైజల్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ తాను తీసుకున్న ఈ నిర్ణయం చిన్నపాటి ధిక్కరణ చర్య వంటిదని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2019లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. స్వస్థలం కుప్వారాలో ఓ సమావేశం ఏర్పాటు చేసి పదేళ్ల పాటు ఐఏఎస్‌గా తాను గడిపిన జీవితం చెరసాల వంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్చి 21 జేకేపీఎం పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆగష్టు 5న ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలో మోదీ సర్కారును విమర్శిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ఇలా కశ్మీర్ స్వయంప్రతిపత్తిని కాలరాశారంటూ మండిపడ్డారు. అంతేగాక దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మూక దాడులు, హత్యలపై నిరసన వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్చను అణచివేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని అనేకమంది నేతలతోపాటు షాను కూడా ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధించారు. 2020 జూలైలో ఆయన విడుదలయ్యారు. నేనెందుకు జీవితం నాశనం చేసుకోవాలి? ఈ క్రమంలో సోమవారం రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన విడుదల చేసిన షా ఫైజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చివరాఖరికి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒంటరిగా మిగిలిపోయినపుడు కుటుంబం తప్ప మరెవరూ మనకోసం నిలబడరు. నిర్బంధంలో ఉన్నపుడు నాకు ఈ విషయం స్పష్టంగా తెలిసింది. నా గురించి పట్టించుకోని వాళ్ల కోసం నేనెందుకు నా జీవితం నాశనం చేసుకోవాలి. నిజంగా ఆ కఠిన సమయం జీవితాన్ని మరో కోణం నుంచే చూసేలా నాకు సాయం చేసింది’’అని వేదాంత ధోరణి అవలంభించారు. అయితే జమ్మూ కశ్మీర్ ఐఏఎస్ ఆఫీసర్ల జాబితాలో ఇంతవరకు ఫైజల్ పేరును తొలగించకపోవడంతో ఆయన మళ్లీ పాలనారంగంలోకి వస్తారా లేదా వైద్యుడిగా సేవలు అందిస్తారా? ప్రజాసేవ చేస్తానన్న తన మాటలు ఎలా నిలబెట్టుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
అల్లా దయవల్లే.. ఇప్పటికైతే అంతా సేఫ్!
శ్రీనగర్: కరోనా వైరస్ ప్రపంచ గతినే మార్చివేసింది. ఇది అది అని కాకుండా అన్ని రంగాలు కుదేలయ్యాయి. దాంతోపాటు మానవ సంబంధాలకు మరింత విఘాతం కలిగింది. కరోనా బాధితులను అంటరానివారిగా చూసేవారు కొందరైతే, మహమ్మారి కారణంగా మృతి చెందిన కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు కూడా చేయని ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెవెంత్ డిపార్ట్మెంట్లో అంబులెన్స్ డైవ్రర్గా పనిచేస్తున్న కోవిడ్ వారియర్ జమీల్ అహ్మద్ మాత్రం మనుషుల ప్రాణాలే ముఖ్యం అంటున్నాడు. తన ప్రాణాలకు రిస్కు ఉన్నప్పటికీ సేవచేస్తూ హీరో అనిపించుకుంటున్నాడు. కుల, మతాలకు అతీతంగా కరోనా రోగులను ఆస్పత్రులకు తరలిస్తూ ప్రాణాలు నిలబెడుతున్నాడు. అలా శ్రీనగర్ పట్ణణంలోని దాదాపు 8 వేల మంది కోవిడ్ బాధితులను జమీల్ తన అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలించడం విశేషం. అంటే శ్రీనగర్‌లో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 80 శాతం బాధితులు జమీల్ అంబులెన్స్‌లోనే ఆస్పత్రులకు వెళ్లారు. ఇక ఎవరైనా అభాగ్యులు కోవిడ్‌తో మరణిస్తే వారి మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు కూడా అతను సాయం చేస్తున్నాడు. ఇక శ్రీనగర్‌లో ఇప్పటివరకు 85 మంది వైరస్‌తో చనిపోగా 70 మృతదేహాలను జమీల్ తన అంబులెన్స్‌లో తరలించాడు. ఖననంలో పాలుపంచుకున్నాడు. (చదవండి: కరోనా రికవరీ రేటు 64%) ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని అల్లా చెప్పాడు. దేవుని ఆశీస్సులతో తన వంతుగా నిస్సహాయులకు సాయం చేయగలుతున్నానని జమీల్ చెప్తున్నాడు. తన కుటుంబ సభ్యులతో భౌతిక దూరం పాటిస్తున్నానని, అల్లా దయవల్ల ప్రస్తుతానికి అందరం క్షేమంగా ఉన్నామని తెలిపాడు. కరోనా మృతదేహంతో తాము శ్మశానవాటికకు చేరుకోగానే అక్కడి సిబ్బంది పనిచేసేందుకు ముందుకు రారని, దాంతో తామే గొయ్యి తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయని జమీల్ వెల్లడించాడు. ఇక జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా మొత్తం 18 వేల పాజటివ్ కేసులు నమోదవగా శ్రీనగర్‌లోనే బాధితులు అధికంగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 302 మంది కరోనాతో చనిపోయారు. (వైరల్ వీడియో: పులి అసలు ఏం చేస్తోంది?) -
కరోనా : డిశ్చార్జ్ అయ్యాక పాజిటివ్!
శ్రీనగర్ : కరోనా పరీక్షలో నెగిటివ్ తేలిన 12 మందికి మూడు రోజుల తర్వాత కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన ఉదంతం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో పనిచేసే 12 మంది కార్మికులకు కరోనా లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. పదిరోజుల అనంతరం నిర్వహించిన రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా మొదటిసారి ఫలితాల్లో నెగిటివ్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికి వారు తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ భూపిందర్ కుమార్‌ని సంప్రదించగా.. తనకు ఈ సంఘటన గురించి తెలియదన్నారు. విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్ ) ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగానే తాము పరీక్షలు నిర్వహించామని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. బాధితులు జూలై 1న వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ఆసుపత్రిలోనే చికిత్స అందించామని తెలిపారు. నిబంధనల ప్రకారం వైరస్ నిర్ధారణ అయిన 10 రోజుల అనంతరం రోగిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే, పరీక్షలోనూ నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయొచ్చని.. దానికనుగుణంగానే తాము చేసినట్లు పేర్కొన్నారు. నిజానికి కరోనా సోకిన వ్యక్తికి 10 రోజుల అనంతరం లక్షణాలు లేకపోతే రెండుసార్లు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండింటిలోనూ నెగిటివ్ వస్తే వైరస్ లేనట్లు. అంటే వారిని డిశ్చార్జ్ చేయొచ్చు. కశ్మీర్ ఆస్పత్రి సిబ్బంది మాత్రం రెండోసారి ఫలితాలు రాకముందే వారందరినీ ఇళ్లకు పంపించేశారు. దీంతో వారు ఇప్పుడు ఎవరెవరిని కలిసారన్న దానిపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. (అమర్నాథ్ యాత్ర రద్దు ) -
వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్
శ్రీనగర్ : కొవిడ్-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా, ఏకంగా ఓ మాస్క్‌ను పాఠకులకు ఉచితంగా ఇచ్చింది. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన స్థానిక ఉర్దూ పత్రిక రోష్నీ, తమ ముందు పేజీలో ఓ మాస్క్‌ను అంటించి తమ పాఠకులకు అందించింది. (అంత లేదు, కేసుల సంఖ్యతో పరేషాన్ కావొద్దు) ‘ఈ సందేశాన్ని ప్రజలకు పంపించడం ఈ సమయంలో ముఖ్యమని మేము భావించాము. మాస్క్ ధరించాలనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేయడానికి ఇది మంచి మార్గం’ అని రోష్ని ఎడిటర్ జహూర్ షోరా అన్నారు. (అయ్యో! తాతకోసం చిన్నోడి కష్టం) ఇక రోష్ని పత్రిక చూపించిన చొరవను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. కరోనా కట్టడిపై కేవలం సూచనలకే పరిమితం అవ్వకుండా పాఠకులకు మాస్క్‌లను పంపిణీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో సోమవారం ఒక్క రోజే 751 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, పది మంది మృతిచెందారు. మొత్తంగా 13,899 కేసులు నమోదవ్వగా 244 మంది మృతిచెందారు. -
‘అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు’
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అందినట్లు జమ్మూ కశ్మీర్ భద్రతా అధికారులు తెలిపారు. కుల్గాంలోని నాగర్-చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నాలుగు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (24 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టుల హతం) ‘అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. వారి దాడులను అడ్డుకోవడానికి తగిన సైనిక వ్యవస్థ, వనరులు ఉన్నాయి. యాత్రను శాంతియుతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాము’ అని బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకుర్ తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా సాగడానికి భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారి 44ను అమర్నాథ్ యాత్రికులు ఉపయోగించుకుంటారని తెలిపారు. -
‘కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లం’
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లార్కిపోరా ప్రాంతంలోని లుక్బావన్ గ్రామ సర్పంచ్ అజయ్ పండిత(40) అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. ఆయన ఉగ్రవాదుల చేతిలో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అజయ్ పండిత కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్. అజయ్ పండిత అంత్యక్రియల అనంతరం ఆయన సోదరుడు విజయ్ పండిత మీడియాతో మాట్లాడుతూ.. మేము కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లము. కశ్మీర్ లోయలో పండిట్ల కోసం ప్రభుత్వం వెంటనే రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తన సోదరుడు అందరికీ సహాయం చేసేవాడని తెలిపారు. బలహీన వర్గాల వారిని ఆదుకునేవాడని పేర్కొన్నారు. అజయ్ సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత ముస్లిం గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడని వెల్లడించారు. (కరోనా: ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ లేదు) అదే విధంగా మృతి చెందిన సర్పంచ్ అజయ్ పండిత తండ్రి ద్వారికా నాథ్ పండిత మాట్లాడుతూ.. తన కుమారుడు నిజమైన దేశభక్తుడని తెలిపాడు. 1996లో తమ కుటుంబం తిరిగి కశ్మీర్‌కు వచ్చిందన్నారు. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని అజయ్ తమ ఇంటిని నిర్మించాడని పేర్కొన్నారు. తన కుమారుడి మృతి వెనక దేశ ద్రోహులు ఉన్నారని ఆరోపించారు. అజయ్ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని తెలిపారు. గత డిసెంబర్లో అజయ్.. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరిన విషయాన్ని తండ్రి ద్వారికా నాథ్ గుర్తుచేశారు. (సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్) -
ఐదుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్
శ్రీనగర్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ మహమ్మారి డాక్టర్లను సైతం వదలటం లేదు. తాజాగా ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఐదుగురు డాక్టర్లకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఐదుగురు డాక్టర్లలో ముగ్గురు శ్రీనగర్‌లోని శ్రీమహారాజ హరీసింగ్ ఆస్పత్రికి చెందినవారు. ఇందులో ఒకరు ఎస్‌కేఐఎంఎస్ బెమినా ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ కాగా, మరొకరు శ్రీనగర్‌లోని ప్రభుత్వ దంత కళాశాలలో పనిచేసే డెంటిస్ట్. పాజిటివ్‌గా నిర్థారణ అయన ఈ ఐదుగురు వైద్యుల్లో నలుగురు కోవిడ్-19 రోగికి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. అయితే వీరు చికిత్స అందించిన కరోనా బాధితురాలు హబ్బా కదల్ (29) ఆదివారం మృతి చెందారు. (వారిని వెనక్కిపంపిచనున్న అమెరికా, కారణం?) మృతి చెందిన మహిళ నుంచి నలుగురు డాక్టర్లకు కోవిడ్ వైరస్ సంక్రమించినట్లు ఛాతి ఆస్పత్రిలోని పల్మోనాలజీ విభాగధిపతి డాక్టర్ నవీద్ నజీర్ తెలిపారు. ఇక వైరస్ బారినపడి మృతి చెందిన హబ్బా కదల్ శ్రీనగర్‌కి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మహిళ మరణంతో కశ్మీర్లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. వైరస్‌తో మృతి చెందిన హబ్బా కదల్ ముందుగా శ్రీమహారాజ హరీసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆమెకు చికిత్స అందించే క్రమంలో ముగ్గురు డాక్టర్లకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇక జమ్మూ కశ్మీర్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,188కి చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది డాక్టర్లు, ముగ్గురు నర్సులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా: డబ్ల్యూహెచ్ఓ వార్షిక సమావేశం ప్రారంభం -
లష్కరే తొయిబా ఉగ్రవాదులు అరెస్ట్
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను శనివారం అరెస్ట్ చేశారు. అదే విధంగా బుద్గాం జిల్లాలో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించనట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కశ్మీర్‌లోని ఖాన్సాయిబ్ పోలీసుస్టేషన్ పరిధిలోని అరిజల్ గ్రామంలో సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు, బుద్గాం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో టాప్ టెర్రరిస్ట్ జహూర్ వాని అతను ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద స్థావరంలో భద్రతా దళాలు అరెస్ట్ చేశారు. One hideout busted in Arizal Khansaib,Budgam & a top Over Groud Wirker of LeT, namely Zahoor Wani was arrested. Arms and ammunition recovered from his possession. More arrests and recoveries are expected. Case registered. pic.twitter.com/sFMfVft7Dh — J&K Police (@JmuKmrPolice) May 16, 2020 అతని రహస్య ఉగ్రస్థావరంలో ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరో నలుగురు ఉగ్రవాదులు.. యునిస్ మిర్, అసలాం షేక్, పవైజ్ షేక్, రెహమాన్ లోన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఖాన్సాయిబ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వీరు లష్కరే తోయిబా ఉగ్గవాదులకు సాయం అందిస్తూ.. ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. వీరిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కార్పొరేటర్‌కు కరోనా.. కేసు నమోదు!
శ్రీనగర్: కరోనా వైరస్(కోవిడ్-19) గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఓ ప్రజాప్రతినిధి తానే నిబంధనలను తుంగలో తొక్కాడు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన సోదరుడి వివరాలు దాచిపెట్టి కరోనా వ్యాప్తికి కారణమయ్యాడు. ప్రస్తుతం పోలీసులు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన కశ్మీర్లో చోటుచేసుకుంది. వివరాలు... శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ మాజిద్ షులూకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతడి నివాసానికి చేరుకోగా... కార్పొరేటర్ సోదరుడు ఇటీవలే ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు వచ్చినట్లు గుర్తించారు. అతడు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దొంగతనంగా ఓ ట్రక్కులో ఇంటికి చేరుకున్నట్లు తెలుసుకున్నారు. దీంతో మాజిద్‌తో పాటు అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు.(కరోనా.. 49 వేలు దాటిన కేసులు) ఈ విషయం గురించి జిల్లా అభివృద్ధి కమిషనర్ షాహిద్ చౌదురి మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని వారాలుగా కరోనా వ్యాప్తిని నియంత్రణ చేయగలిగాం. అయితే ప్రయాణ చరిత్రను దాచి.. కొంతమంది వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’అని తెలిపారు. కాగా కార్పొరేటర్‌కు కరోనా సోకినట్లు తేలడంతో ఎస్ఎంసీ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ మేయర్ జునైద్ మట్టు విజ్ఞప్తి చేశారు. ఇక కార్పొరేటర్ మాజిద్‌ను కలిసిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎస్ఎంసీ కమిషనర్ గజాన్ఫర్ అలీ సూచించారు. (ముఖ్యమంత్రి డ్రైవర్‌కు కరోనా; అప్రమత్తమైన అధికారులు) -
పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జమ్మూ కశ్మీర్ బారాముల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఈ అప్రకటిత కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత భద్రతా దళనికి చెందిన ఇద్దరు సైనికులు శనివారం మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బారాములల్లా జిల్లా రాంపూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ.. భారత భద్రతా సైనికులపై కాల్పులు జరిపిందని కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. అంతకు ముందు ఏప్రీల్ 30న పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలతో అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘన ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. ఇద్దరు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దక్షిణ కశ్మీర్ షోపియన్ జిల్లాలోని మెల్‌హురా ప్రాంతంలో మంగళవారం జరిగింది. మెల్‌హురా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో భద్రతా దళాలు, పోలీసులు కార్డన్ చెర్చ్ చేపట్టారు. దీంతో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు మంగళవారమే తెలిపారు. (చెన్నైలో భయం.. భయం) ఇక ఈ ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా మృతి చెందగా.. మూడో ఉగ్రవాది కాల్పులు జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీటర్లో పేర్కొన్నారు. ఇక మూడో ఉగ్రవాది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతి చెందినవారు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు. Operation at Melhura continued through the night. Two terrorists killed.Bodies recovered. For third terrorist search is on. https://t.co/mXMg99GzgU — J&K Police (@JmuKmrPolice) April 29, 2020 -
లాక్డౌన్: నిత్యావసరాలకు కొత్త ఆలోచన!
శ్రీనగర్: కరోనా లాక్‌డౌన్‌తో తలెత్తిన విపత్కర పరిస్థితుల నుంచి కొద్దిమేర గట్టేందుకు శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) కొత్త ఆలోచనకు తెరలేపింది. ఇంటి ఆవరణ, నివాసాల చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాల్లో పండ్లు, కూరగాయలు పండించాలని ప్రజలకు సూచించింది. ఇంటి పంటలతో లాక్డౌన్ లాంటి పరిస్థితుల నుంచే కాకుండా.. నిరవధిక కర్ఫ్యూ విధించినప్పుడు కూడా తరచూ బయటకు రాకుండా ప్రజలు సురక్షితంగా ఇళ్లల్లోనే ఉండొచ్చని ఎస్ఎంసీ శనివారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలో కిచెన్ గార్డెన్‌ను తప్పనిసరి చేస్తామని స్పష్టం చేసింది. (చదవండి: భర్త స్నానం చేయడం లేదని భార్య ఫిర్యాదు) ఇప్పటికే కిచెన్ గార్డెన్ పరికరాలను వ్యవసాయ విభాగం సబ్సిడీ ధరలకు అందిస్తోందని గుర్తు చేసింది. ఇక అధిక జనాభా ప్రాంతాల్లో ఒకటైన శ్రీనగర్‌లో లాక్డౌన్, కర్ఫ్యూలతో నిత్యావసరాలు లభించడం కష్టమవుతోంది. మరోవైపు శ్రీనగర్‌కు ప్రధాన మార్గమైన శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై రాకపోకలు వాతావరణ పరిస్థితులకు లోనై ఉంటాయి. కొండలు, గుట్టలతో ఉండే ఆ రహదారిపై ప్రయాణం మంచుకురియడంతో సంక్లిష్టంగా మారుతుంది. కొండ చరియలు విరిగిపడిపోవడంతో రాకపోకలు స్తంభించి సరుకు రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయి. (చదవండి: వలస కూలీలు: కేంద్రం కీలక మార్గదర్శకాలు) -
గ్రెనేడ్ దాడిలో సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
శ్రీనగర్ : కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సీఆర్పీఎప్ పెట్రోలింగ్ వాహనమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనైడ్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలోని బిజేహరాలో చోటుచేసుకుంది. కాగా గ్రనైడ్ దాడిలో ఇద్దరు గాయపడగా వారిలో హెడ్ కానిస్టేబుల్ శివలాల్ నీతమ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా మరొకరి పరిస్థితి బాగానే ఉందన్నారు. మంగళవారం సాయంత్రం బిజ్బెహరా ఏరియాలో సీఆర్పీఎఫ్ వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. -
మహమ్మారి బారిన చిన్నారి..
శ్రీనగర్ : మహమ్మారి వైరస్ వేగంగా విస్తరిస్తూ మానవాళికి సవాల్ విసురుతోంది. శ్రీనగర్‌లో తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కావడం గమనార్హం. పాజిటివ్‌గా వెల్లడైన కేసుల్లో ఒకరు 8 నెలల చిన్నారి కాగా, మరొకరు ఏడు సంవత్సరాల బిడ్డని తేలింది. ఈ చిన్నారులు సౌదీ అరేబియా నుంచి ఇటీవలే శ్రీనగర్‌కు తిరిగివచ్చి కోవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తి మనవళ్లని అధికారులు తెలిపారు. రెండు తాజా కేసులతో జమ్ము కశ్మీర్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 649కు చేరగా మృతుల సంఖ్య 13కి పెరిగింది. మహమ్మారిని పారదోలేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండగా, సామాజిక దూరం పాటించి ప్రాణాంతక వైరస్‌ను ఓడించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి : కరోనా కట్టడి : పోర్టబుల్ వెంటిలేటర్లు సిద్ధం -
మద్యం..మగువ..వయాగ్రా..ఓ డీఎస్పీ!
శ్రీనగర్ : హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పోలీసుల రిమాండ్‌లో ఉన్న జమ్ము కశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దవీందర్ సింగ్‌ను అరెస్ట్ చేసిన క్రమంలో వారం పాటు ఉత్తర, దక్షిణ కశ్మీర్లో జరిగిన దాడుల్లో లభ్యమైన ఆధారాలు, రికార్డులు, సీజ్ చేసిన మెటీరియల్ ద్వారా సింగ్ నిర్వాకాలు దిగ్భ్రాంతిగొలిపేలా బయటపడ్డాయి. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా డీఎస్పీ దవీందర్ సింగ్ ఎవరిమాటా వినే రకం కాదని, ఆయన ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి పనిచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించేవాడని తెలిసింది. సింగ్ ఫోన్ మెసేజ్‌లు, సాగించిన సంభాషణలను స్కాన్ చేసిన మీదట ఆయన భిన్నమైన లైఫ్‌స్టైల్‌ను కలిగి ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిత్యం మద్యం సేవించడంతో పాటు దాదాపు పన్నెండు మంది మహిళలతో ఆయనకు సంబంధాలున్నట్టు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. మహిళలతో ఎఫైర్లు నడపటంపై సింగ్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని లైంగిక సంబంధాలకు బానిసగా మారిన ఆయన నిత్యం వయాగ్రాను వాడతారని ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌తో ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అరెస్ట్ అయిన నాలుగు వారాల తర్వాత దవీందర్ సింగ్ పీలగా, వయసుమీరిన వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఆ వర్గాలు తెలిపాయి. తన ఖరీదైన అలవాట్లను కొనసాగించేందుకు ఆయనకు డబ్బు అవసరం విపరీతంగా పెరిగిందని, తన లైఫ్‌స్టైల్‌ను మెయింటెయిన్ చేసేందుకు భారీ మొత్తాలు అవసరమయ్యాయని పేర్కొన్నాయి. ప్లేబాయ్ లైఫ్‌స్టైల్‌తో పాటు శ్రీనగర్ ఇంద్రానగర్‌లో తాను నిర్మించే విలాసవంతమైన భవంతికి నిధుల కొరత ఏర్పడిందని, బంగ్లాదేశ్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న ఇద్దరు కుమార్తెలకు ఫీజు చెల్లించాల్సి వచ్చిందని విశ్లేషించాయి. శ్రీనగర్‌లోని ప్రముఖ స్కూల్లో ఆయన కుమారుడు చదువుతున్నాడని, మిలిటెంట్లు, ఆయుధాలతో ఆయన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడేవరకూ ఖర్చులను బాగానే నిర్వహించారని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. నాలుగు దశాబ్ధాలుగా తాను చేసిన సేవలు ఈ ఆరోపణలతో నీరుగారిపోయాయని విచారణ సందర్భంగా సింగ్ వాపోయారని చెప్పాయి. తాను చేసిన పనులపై ఇప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తోందని, దర్యాప్తులో పలుమార్లు ఆయన కంటనీరు పెట్టుకున్నారని తెలిపాయి. హిజ్బుల్ కమాండర్ నవీద్ బాబు, అతడి ఇద్దరు అనుచరులకు సింగ్ సాయం చేశారని ఇంతకు మినహా దేశ వ్యతిరేక కార్యకలాపాలతో ఆయనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎన్ఐఏ ఇంకా ఏమీ గుర్తించలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. చదవండి : ఉగ్రవాదులకు పోలీసు సాయం.. -
ఒమర్, ముఫ్తీలను వీడనున్న చెర..
శ్రీనగర్ : స్టేట్ గెస్ట్ హౌస్‌లో గృహ నిర్బంధంలో ఉన్న జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను వారి ఇళ్లకు తరలించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్ 5న మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దును ప్రకటించినప్పటి నుంచి వీరిని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా ఈ వారాంతంలో ఇరువురు నేతలను వారి ఇళ్లకు తరలించే ప్రక్రియ చేపట్టవచ్చని భావిస్తున్నారు. అయితే వీరిని ఇంకా హౌస్ అరెస్ట్‌లో ఉంచుతారా లేక విడుదల చేస్తారా అనేది అధికారులు ధ్రువీకరించలేదు. మరోవైపు ఎమ్మెల్యే హాస్టల్ నుంచి నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలు సజద్ లోన్, వహీద్ పరాలను బుధవారం విడుదల చేశారు. వీరితో పాటు సీనియర్ ఎన్సీ నేత అలి మహ్మద్, పీడీపీ నేత సర్తాజ్ మద్నీలను ఎమ్మెల్యే హాస్టల్ నుంచి మరో ప్రాంతానికి తరలించారు. అధికారుల నిర్బంధంలోకి వెళ్లిన తర్వాత తొలిసారిగా జనవరి 25న బహిర్గతమైన ఒమర్ అబ్దుల్లా తెల్లని గడ్డంతో ఉన్న తొలి ఫోటో ఆయనను గుర్తు పట్టలేనంతగా ఉండటంతో నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చదవండి : ఈ మాజీ సీఎం ఎవరో గుర్తుపట్టారా? -
జైషే మహ్మద్ కుట్ర భగ్నం
శ్రీనగర్/న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున విధ్వంసం సృష్టించేందుకు జైషే మహ్మద్ పన్నిన కుట్రను శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోండనా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ గజ ఉగ్రవాదిని దోడా జిల్లాలో మట్టుబెట్టామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్సింగ్ తెలిపారు. కాగా, ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడిన డీఎస్పీ దావిందర్‌సింగ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరపనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఆయనకు అందజేసిన శౌర్య పతకాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఉండగా, చొరబాట్ల కోసం, కేడర్‌ను బలోపేతం చేయడానికి ఉగ్ర సంస్థలు రహస్య సమాచార వ్యవస్థను, వాయిస్ ఆన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (Vౌఐ్క)ను ఉపయోగిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని డివిజన్లలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను అత్యవసర సేవలు అందించే బ్యాంకులు, ఆసుపత్రులు లాంటి సంస్థలకు మాత్రమే పునరుద్ధరించాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మంగళవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఒమర్ అబ్దుల్లా నివాసం తరలింపు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను అధికారిక నివాసానికి సమీపంలో ఉన్న మరో ఇంటికి తరలించనున్నారు.ఆర్టికల్ 370 రద్దుతో జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటినుంచి ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. -
సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్లతో ఉగ్రదాడి
శ్రీనగర్ : శ్రీనగర్‌లోని కవ్‌దారా ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని వారు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనాలపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడగా వారు ప్రయాణిస్తున్న వాహనాలు పూర్తిగా ద్వంసమయ్యాయి. అయితే ఈ దాడులు సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్లతో దాడులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులు కదలికలను గుర్తించేందుకు పరిశోధన నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కశ్మీర్లో మైనస్ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా చలిగాలుల ఉధృతితో వణికిపోతున్న ఉత్తర భారతానికి ఇంకో రెండ్రోజులపాటు ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ విభాగం శుక్రవారం తెలిపింది. తూర్పు, మధ్యభారతదేశ ప్రాంతాల్లో నూ చలితీవ్రత పెరగనుందని తెలిపింది. వాయవ్య దిక్కు నుంచి వస్తున్న శీతల పవనాలు కొనసాగుతున్న కారణంగా పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్ ఉత్తర ప్రాంతం, ఉత్తరప్రదేశ్‌లలో రానున్న రెండు రోజులు చలి లేదా అతిశీతల పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ తెలిపింది. కొత్త సంవత్సరం తొలిరోజు, అంతకుముందు రోజుల్లో దేశ వాయువ్య, మధ్య ప్రాంతాల్లో వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశముంది. ఇదిలా ఉండగా.. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు –5.6 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. ఈ సీజన్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని స్థానిక వాతావరణ విభాగం తెలిపింది. కశ్మీర్, లడాఖ్‌ల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు మైనస్లలోకి వెళ్లాయి. కశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని గుల్మార్గ్లో ఉష్ణోగ్రతలు – 9.5 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోగా, పహల్గామ్ రిసార్ట్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు – 12.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
శ్రీనగర్‌లో తెరుచుకున్న జామియా మసీదు
శ్రీనగర్ : నగరంలోని చారిత్రాత్మక జామియా మసీదు బుధవారం తెరుచుకుంది. ఆగస్ట్ 5 వ తేదీన జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత భద్రతా కారణాల రీత్యా మసీదును మూసేశారు. మసీదు ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద భద్రతా బలగాలను మొహరించారు. దాదాపు 135 రోజుల పాటు ఈ మసీదును మూసివేయగా, ఇన్ని రోజులు మూసేయడం మసీదు చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో ప్రధాన గేట్ల వద్ద భద్రతా సిబ్బందిని తొలగించారు. ఈ నేపథ్యంలో మసీదు నిర్వహణ చూసే కమిటీ మంగళవారం సమావేశమై మసీదులో ప్రార్థనలు చేయాలని నిర్ణయించింది. దాంతో బుధవారం మధ్యాహ్నం మసీదులో సామూహిక ప్రార్ధనలు చేశామని, దాదాపు 100 నుంచి 150 మంది ఈ ప్రార్థనలో పాల్గొన్నారని కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్న దృష్ట్యా కేవలం మధ్యాహ్నం మాత్రమే ప్రార్థనలు నిర్వహిస్తామని కమిటీ సభ్యుడు తెలిపారు. నవంబర్ 22 నుంచి ఈ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ బలగాలు పెద్ద సంఖ్యలో మొహరించడంతో ప్రార్థనలకు అనుమతించలేదు. ప్రస్తుత పరిణామంపై స్థానికుడు ఐజాజ్ అహ్మద్ హర్షం వ్యక్తం చేస్తూ.. చాలా మంది ఉదయం నుంచీ మసీదు ఆవరణను శుభ్రం చేయడంలో పాల్గొన్నారు. కొంతమంది ఉద్వేగానికి లోనై మసీదు స్తంభాలను ముద్దు పెట్టుకొన్నారు. చాలా రోజుల తర్వాత నమాజు చేయడంతో మేమంతా సంతోషంగా ఉన్నాం. మసీదు అంటే దేవుని ఇల్లు. దయచేసి ఇక్కడ కర్ఫ్యూ విధించవద్దని నా అభ్యర్థన అంటూ ముగించాడు. -
కాశ్మీర్ లోయకు కొత్త అందాలు
-
కశ్మీర్లో గ్రనేడ్ దాడి : 15 మందికి పైగా గాయాలు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సొపోర్‌లోని ఓ బస్‌స్టాండ్‌లో టెర్రరిస్టుల గ్రనేడ్ దాడిలో 15 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌కు తరలించారు. గ్రనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొపోర్‌లోని హోటల్ ప్లాజా వద్ద సోమవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో గ్రనేడ్ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. -
కశ్మీర్ : ఆపిల్ రైతులపై దాడులు; సంబంధాలే ముఖ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నిత్యం జరిగే ఉగ్రదాడులతో ప్రజలు భయంభయంగా బతుకున్నారు. ఇక రైతుల కష్టాలు సరేసరి. తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకునేందుకు ఆపిల్ రైతులు, సరఫరాదారులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆపిల్ పంట ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఓ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు కాశ్మీరీయేతర ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. మరో రెండు ట్రక్కులను ఉగ్రవాదులు తగులబెట్టారు. అక్టోబర్ 14న రాజస్తాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. దీంతో కశ్మీర్‌కు వాహనాల్ని పంపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి రాష్ట్రాలకు ఆపిల్ పంటను రవాణా చేసే క్రమంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పరిపాలన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ఆపిల్ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. బయటి రాష్ట్రాల్లో అమ్ముకుంటే వచ్చేదానికన్నా ఎక్కువ ధర చెల్లించిమరీ కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే, ఈ విధానంపై రైతులు, వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంవత్సరాల నుంచి ఉన్న తమ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఎంఐఎస్ స్కీమ్‌పైగులాంనబీ అనే రైతు మాట్లాడుతూ.. ‘సంప్రదాయ మార్కెటింగ్ విధానంలోనే ఇటీవల 15 కిలోల ఆపిల్ పెట్టెను కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరఫరా చేశాను. దాదాపు రూ.700 నుంచి రూ. 800 వరకు లాభం వచ్చింది. కానీ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తే రూ.1000 వచ్చేవి. అయితే, నాకది ఇష్టం లేదు. బయటి రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులతో చాలా ఏళ్లుగా ఉన్న సంబంధాలే మాకు ముఖ్యం. డబ్బులు ప్రధానం కాదు. పంజాబ్ లేదా దక్షిణ భారతదేశంలోని వ్యాపారులతో కశ్మీర్ వ్యాపారుల సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మాకు ఇష్టం లేదు’అన్నాడు. -
పాక్‌కు కశ్మీర్ గవర్నర్ హెచ్చరిక
శ్రీనగర్ : ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్‌కు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే ఆదివారం జరిగిన దాడుల వంటివి పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ గురించి అడుగగా.. ఇంటర్నెట్ సేవలను ప్రారంభిస్తే ఆ సౌలభ్యాన్ని ఉగ్రవాదులే ఎక్కువగా ఉపయోగించే అవకాశముందని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి కశ్మీర్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ‘ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా. ఇన్నాళ్లు మీరేం సాధించారు? మీ ఆశయాలు నెరవేరడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాల’ని కోరారు. కాగా, ఆదివారం సాయంత్రం భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో చేసిన దాడుల్లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
సరిహద్దుల్లో సైన్యం డేగకన్ను
శ్రీనగర్/జమ్మూ: పాక్ నుంచి సొరంగాలు, కందకాల ద్వారా అక్రమ చొరబాట్లు, డ్రోన్ల సాయంతో ఉగ్రవాదులకు ఆయుధ సరఫరా వంటి వాటిపై సైన్యం రెడ్ అలర్ట్ ప్రకటించింది. తనిఖీలు, నిఘాతో సరిహద్దుల వెంబడి డేగకన్ను వేశాయి. చొరబాట్లను నివారించేందుకు మూడంచెల గ్రిడ్‌ను హై అలర్ట్‌లో ఉంచాలని సైనిక, పరిపాలన యంత్రాంగాలను జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కోరారు. కశీ్మర్, పంజాబ్‌లలో పాక్‌తో ఉన్న వెయ్యి కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సొరంగాలు, కందకాల ద్వారా సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించేందుకు అవకాశం ఉందన్న అనుమానంతో జవాన్లు భారీగా తనిఖీలు చేపట్టారు. సొరంగాల జాడ కనిపెట్టేందుకు మూడంచెల సరిహద్దు కంచె వెంబడి నిర్ణీత లోతున్న కందకాలు తవ్వి, భూమిని దున్నుతున్నారు. గత వారం జమ్మూలోని ఆర్ఎస్ పురా సెక్టార్లో సైన్యం కళ్లుగప్పి దేశంలోకి ప్రవేశించిన పాక్ యువకుడిని సైన్యం పట్టుకుంది. అతడు సరిహద్దుల్లో కంచెను దాటకుండానే చొరబడినట్లు గుర్తించిన సైన్యం..అక్రమ చొరబాట్ల కోసం పాక్ ఆర్మీ సరిహద్దుల్లో తవి్వన కందకాలు, సొరంగాల గుండానే అతడు వచ్చి ఉంటాడని అనుమానిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవాన్లు సరిహద్దుల్లో కందకాలు, సొరంగాలను కనిపెట్టేందుకు పంజాబ్, జమ్మూలలో ప్రత్యేక సెన్సార్లు, ఆధునిక టెక్నాలజీలతో అణువణువూ తనిఖీలు చేపట్టారు. చీనాబ్ నది గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబాట్లను నిలువరించేందుకు నదిలో గస్తీని పెంచింది. భారత గగనతలంలోకి చొరబడే డ్రోన్లను తక్షణమే కూల్చి వేయాలని ఆదేశించింది. సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు పహారాను ముమ్మరం చేసింది. కశ్మీర్లో ఎన్ఎస్ఏ దోవల్ పర్యటన పాకిస్తాన్ ఆర్మీ ప్రేరేపిత చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో చొరబాటు నిరోధక గ్రిడ్‌ను అప్రమత్తంగా ఉంచాలని, కీలకమైన ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచాలని ఎన్ఎస్ఏ దోవల్ ఆదేశించారు. కశీ్మర్ లోయలో ఒక రోజు పర్యటనకు వచ్చిన ఆయన శ్రీనగర్‌లో అధికార యంత్రాంగం, భద్రతా అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు. పాక్ నుంచి భారీగా అక్రమ చొరబాట్లకు అవకాశం ఉందన్న సమాచారంపై ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చొరబాట్ల వ్యతిరేక గ్రిడ్‌ను హైఅలెర్ట్‌లో ఉంచాలని ఆర్మీ, బీఎస్ఎఫ్ అధికారులను కోరారు. -
శ్రీనగర్‌లో ఆజాద్
శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ శ్రీనగర్‌ను సందర్శించారు. లాల్ దేడ్ ఆస్పత్రిలోని రోగులను పరామర్శించి, వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మొత్తం నాలుగు రోజుల పర్యటనలో, రెండో రోజైన శనివారం ఆయన స్థానికులను కలుసుకొని ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉన్న పరిస్థితుల గురించి వాకబు చేశారు. సొంత రాష్ట్రమైన కశ్మీర్ చేరుకోవాలని ఆయన గతంలో ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకుని వచ్చారు. -
‘600 ఏళ్లలో ఎన్నడూ ఇలా లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘గత 600 సంవత్సరాల్లో మొట్టమొదటి సారిగా ఈద్, శుక్రవారం సందర్భంగా ముస్లింల ప్రార్థనలు లేకుండా పోయాయి’ అని ఇస్లాం మత గురువు హజీ బిలాల్ అహద్ అమ్దాని వ్యాఖ్యానించారు. ఆయన శ్రీనగర్‌లోని జేలం నదీ ఒడ్డునగల 14వ శతాబ్దం నాటి ‘ఖాంక్ ఏ మౌలా’కు ఆయన డిప్యూటి ఇమామ్‌గా పనిచేస్తున్నారు. ‘ఎన్నో ఆందోళనల సందర్భంగా కూడా ఇలా ప్రార్థనలు జరగకుండా ఉన్న రోజు లేదు. అంతెందుకు, మిలిటెన్సీ ఎక్కువగా ఉన్న 1989లో నలువైపుల నుంచి తుపాకీ తూటాలు దూసుకొచ్చినప్పుడు కూడా ఈ మౌలాలో ప్రార్థనలు నిలిచిపోలేదు. రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఆగస్టు 5వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఈద్ రోజునగానీ, శుక్రవారం నాడుగానీ మౌలాలో సామూహిక ప్రార్థనలకు స్థానిక అధికారులు అనుమతించలేదు’ అని ఆయన గురువారం స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. ‘హమ్ క్యా చాహ్తే హై, ఆజాదీ’ అంటూ 1989లో మిలిటెంట్లు జరిపిన ఆందోళనలో అనేక మంది మరణించారు. 1947లో కశ్మీర్లో జరిగిన మత కలహాల్లో కూడా వందలాది మంది మరణించారు. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1975లో కశ్మీర్లో ప్రధాన మంత్రి వ్యవస్థను రద్దు చేసి షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసినప్పుడుగానీ, 1998 కశ్మీర్లో సైన్యం సద్భావన యాత్ర నిర్వహించినప్పుడుగానీ ప్రార్థనలు నిలిచిపోలేదన్నది అమ్దాని ఉద్దేశం. కశ్మీర్లో అప్రకటిత కర్ఫ్యూ అమల్లోకి వచ్చి సెప్టెంబర్ 5వ తేదీ నాటికి సరిగ్గా నెల రోజులు గడిచాయి. అయినప్పటికీ శ్రీనగర్‌తోపాటు పలు పట్టణ ప్రాంతాల్లో స్మశాన నిశబ్దం కొనసాగుతోంది. ల్యాండ్, మొబైల్ టెలిఫోన్ సర్వీసులను, ఇంటర్నెట్ సదుపాయాలను ఇంతవరకు పునరుద్ధరించలేదు. రాష్ట్రం నుంచి ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు కశ్మీర్లోకి రావాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న అప్రకటిత ఆంక్ష కొనసాగుతోంది. ప్రార్థనలు నిర్వహించకుండా కొన్నిచోట్ల ఇమామ్‌లను అరెస్ట్ చేసినట్లు అమ్దాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను శ్రీనగర్ పోలీసు ఉన్నతాధికారి ఖండించారు. ఇతర కేసుల విషయంలో కొందరు ఇమామ్‌లను అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే తాజా పరిణామాలకు, వారి అరెస్ట్‌లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదని శ్రీనగర్‌లోని అగ సయ్యద్ హజీ హాసన్ మందిరం ఇస్లాం గురువు అగా సయ్యద్ ఐజాజ్ రిజ్వీ తనను కలిసిన మీడియా ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఆయన్ని ఆగస్టు 22వ తేదీన ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. జడిబాల్లోని మరో మసీదు ఇమామ్ ఇమ్రాన్ రెజా అన్సారీతోపాటు మరొ కొందరు ఇమామ్‌లను సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారట. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని మాత్రమే పోలీసులు వారికి చెప్పారట. శ్రీనగర్‌లోని పలు చారిత్రక మసీదుల్లో కూడా శుక్రవారం నాటి ప్రార్థనలు నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిల్లో పావురాల రెక్కల చప్పుడు మినహా మరే ఇతర శబ్దాలు వినిపించడం లేదు. -
భారత్‌లో దాడులకు పాక్ కుట్రలు !
శ్రీనగర్ : భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పథక రచన చేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ఉగ్రమూకల సంస్థలతో కలిసి సెస్టెంబర్ చివరి వారంలో లేక అక్టోబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పాకిస్తాన్ బిగ్రేడ్‌కు చెందిన 2000 మందితో కూడిన బలగాలను పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని పూంచ్ ఏరియాకు చెందిన బాగ్, కోట్లీ సెక్టార్‌కు తరలించినట్లు సమాచారం అందింది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) నుంచి భారత భూభాగంలోకి చొరబడేజైష్-ఎ-ముహమ్మద్ (జెఎమ్), లష్కర్-ఎ-తొయిబా తీవ్రవాదులకు ఈ బలగాలు సహకరించనున్నాయి. ప్రస్తుతం ఈ బలగాలు నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎస్ఎస్జి కమాండోలతో కలిసి ఎల్ఇటి, జైషే ఉగ్రవాదులు ఇప్పటికే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్లలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లో ఈ ఉగ్రవాద గ్రూపుల కోసం శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. జమాత్-ఎ-ఇస్లామి ఈ శిబిరాలకు నాయకత్వం వహిస్తుండగా, జైష్-ఎ-ముహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఎల్ఈటీ తమ వంతు సహకారం అందించనున్నట్లు తెలిసింది. వజీరాస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు ఐఎస్ఐ పెద్ద మొత్తంలో జాబితాను తయారు చేసినట్లు, దీనికంతటికి హిజ్బుల్ కమాండర్ షంషేర్‌ఖాన్ నాయకత్వం వహించనున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. -
కశ్మీర్లో సాధారణ పరిస్థితులు భ్రమే!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ విషయంలో నరేంద్ర మోదీ సర్కారు తీరుపై శ్రీనగర్ మేయర్, జేకేపీసీ అధికార ప్రతినిధి జునైద్ అజిమ్ మట్టు మండిపడ్డారు. కశ్మీర్ లోయలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నదని కేంద్రం చెప్తున్న వాదన చాలా అవాస్తవికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసి.. జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనగర్ మేయర్‌కు కేంద్రం కేంద్ర సహాయమంత్రి హోదాను కల్పించింది. అయితే, ఆర్టికల్ 370ను రద్దుచేయడంతో కశ్మీర్ అంతటా అస్తిత్వ సంక్షోభం నెలకొందని మట్టు తాజాగా మీడియాతో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ తమ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. నెలరోజులుగా కశ్మీర్లో ఆంక్షలు విధించడంతో కశ్మీరీలు తమ ఆప్తులతో కనీసం మాట్లాడలేకపోతున్నారని, కమ్యూనికేషన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో కశ్మీరీ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. -
కశ్మీర్లో కనిపించే నేటి పరిస్థితి ఇదీ!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను ఎత్తివేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఈ రోజుకు మూడు వారాలు అంటే, సరిగ్గా 21 రోజులు. ఇది జరిగిన ఆగస్టు ఐదవ తేదీన రాష్ట్రంలోని ల్యాండ్ ఫోన్, మొబైల్ ఫోన్ సర్వీసులతోపాటు ఇంటర్నెట్, తపాలా సర్వీసులను కూడా నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ అత్యయిక పరిస్థితులే కొనసాగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కశ్మీర్లో సాధారణ పరిస్థిలు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కేంద్రం దష్టిలో సాధారణ పరిస్థితులంటే ఏమిటీ ? ఈ ప్రశ్నలకు బదులేది ? కశ్మీర్ పరిస్థితి ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకులందరికి శ్రీనగర్ విమానాశ్రయంలోనే ఎందుకు నిలిపివేశారు. వారిని నగరంలోకి ఎందుకు అనుమతించలేదు ? ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించామని ప్రభుత్వం చెబుతోంది. మరి అలాంటప్పుడు కశ్మీర్‌కు ఒక్క ఫోన్‌కూడా కలవడం లేదని దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటికీ ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి ? శ్రీనగర్‌లోని సెంట్రల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఎందుకు మూసి ఉంది ? రాష్ట్ర యంత్రాంగం శ్రీనగర్‌లోని కొన్ని చోట్ల ప్రత్యేక ఫోన్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఎంతో దూరంలో ఉన్న ఆ అయిదు ఫోన్ల వద్దకు కాలి నడకన వెళ్లి రోజుకు 500 మంది చొప్పున ఫోన్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్ బ్యాండ్ సర్వీసులుగానీ తపాలా సర్వీసులు కూడా ఇంకా నడవడం లేదు. కొన్ని వార్తా పత్రికలు మాత్రమే పరిమిత సంఖ్యలో ముద్రణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ వారి వెబ్‌సైట్స్, సోషల్ మీడియా పేజెస్ అప్డేట్ అవడం లేదు. జర్నలిస్టులను వార్తా సేకరణ కూడా చాలా కష్టమవుతోంది. వారంతా నాలుగు కంప్యూటర్లు, ఓ మొబైల్ టెలిఫోన్ సౌకర్యం కలిగి. ప్రభుత్వ మీడియా సెంటర్‌పై ఆధారపడి పనిచేస్తున్నారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు ఇప్పటికీ గహ నిర్బంధంలోనే ఉన్నారు. వారికి వారి కుటుంబాలను కలుసుకునే అవకాశం నేటికి ఇవ్వడం లేదు. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం మినహా మినహా మిగతా పార్టీ కార్యాలయాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కశ్మీర్లో నాలుగువేల మందికి పైగా నిర్బంధంలోకి తీసుకొని స్థలా భావం వల్ల వారిని రాష్ట్రం బయటకు తరలించినట్లు ఓ అధికారి తెలిపారు. నిర్బంధంలోని తీసుకున్న వారిలో వ్యాపారస్థులు, ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీ నేతల బందంతోని వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి కూడా చేసుకున్నారు. స్థానిక మీడియా ప్రతినిధులను వీధుల్లోకి కూడా అనుమతించడం లేదు. రాళ్లు రువ్విన, పోలీసుల లాఠీఛార్జీ ఘటనల్లో గాయపడిన వారిలో 150 మంది ప్రస్తుతం శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మార్కెట్లు అన్నీ బంద్ ఉన్నాయి. మెడికల్ షాపులు మాత్రమే తెరచి ఉంటున్నాయి. ప్రభుత్వ సర్వీసులేవీ నడవడం లేదు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. అక్కడక్కడా, అప్పుడప్పుడు ప్రైవేటు టాక్సీలు కనిపిస్తున్నాయి. విధులకు హాజరు కావాలంటూ స్థానిక అధికార యంత్రాంగం ఎన్నిసార్లు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులులేక వెలవెల బోతున్నాయి. లాంఛనంగా పాఠశాలలను తెరచినప్పటికీ పిల్లలు వెళ్లడం లేదు. అందుకు వారిని తల్లిదండ్రులు అనుమతించడం లేదు. జబ్బు పడిన వారు అంబులెన్స్‌లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. -
సాధారణ పరిస్థితులు ఇలా ఉంటాయా!!?
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో సాధారణ పరిస్థితులే కొనసాగుతున్నాయని చూపడం కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు కొంత మంది సీనియర్ జర్నలిస్టులను విమానంలో తీసుకెళ్లి కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో గగన విహారం చేయించింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మార్కెట్లు, దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. పాఠశాలలు, కాలేజీలకు తాళాలు ఉన్నాయి. రోడ్ల మీద జన సంచారం లేదు. సైనికుల బూట్ల చప్పుడు, అక్కడక్కడ వీధి కుక్కల విహారం తప్ప ఎలాంటి సందడి లేదు. సాధారణ పరిస్థితులంటే ఇంతటి ప్రశాంతమా? అసలే బక్రీద్ పండగ రోజు. సాధారణ పరిస్థితులంటే ఎలా ఉండాలి ? సందడి సందడిగా, గోలగోలగా ఉండాలి. ఈద్ ముబారక్ అంటూ పెద్దలు కౌగిలింతలు, పిల్లల కేరింతల మధ్య వీధులు విస్తుపోవాలి. ఒకరినొకరు కలుసుకొని మంచి, చెడు కబుర్లు కలబోసుకోవాలి. అత్తరు వాసనల మధ్య పిల్లా, పాప, చిన్నా, పెద్ద మైమరచి పోవాలి. అలాంటిది ఈ భయంకరమైన నిశబ్దం ఏమిటీ? వారం రోజులుగా కశ్మీర్లో ఇదే పరిస్థితి. టెలిఫోన్, మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్నా పిల్లలతోని పెద్దలు, పెద్దలతోని పిల్లలు మాట్లాడేందుకు కనీసం ల్యాండ్‌లైన్ ఫోన్లు కూడా పని చేయడం లేదు. అసహన పరిస్థితులు కొనసాగుతున్న చైనాలోని హాంకాంగ్, మయన్మార్, సిరియా, ఇజ్రాయెల్ దేశాల్లో మినహా ప్రపంచంలో ఎక్కడా ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను నిలిపివేసిన దాఖలాలు లేవు. ఈ నాలుగు దేశాల్లో కూడా ల్యాండ్ లైన్ల సర్వీసులపై కోత లేదు. సాధారణ పరిస్థితలుంటే ఈ సర్వీసులన్నీ కొనసాగాలి. పౌరజీవనం ఇలా స్తంభించిపోకూడదు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రెండు ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీర్ ప్రజలు హర్షిస్తున్నారని కేంద్రం చెబుతున్నప్పుడు ఈ అకాల ఆంక్షలేమిటి? బక్రీద్ పండుగ రోజున యోగక్షేమాలు కనుక్కునేందుకు కూడా ఫోన్లు పనిచేయలేదు. ఈసారి పండగ సందర్భంగా కశ్మీర్‌కు వెళ్లలేని వారి కోసం ఢిల్లీ, గురుగావ్, ముంబై నగరాల్లో స్థానికులు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గుర్గావ్లో ఈద్ వేడుకలను కశ్మీర్ పిండిట్ కుటుంబాలు ఏర్పాటు చేయడం విశేషం. ఢిల్లీలో జంతరమంతర్ వద్ద కశ్మీర్ స్టూడెంట్స్ యూనియన్, కొంతమంది స్థానిక కశ్మీరీలతో కలిసి ఓ వేదికను ఏర్పాటు చేశారు. తాము ఈద్ వేడుకలను జరపడం లేదని, ఈ సందర్భంగా కశ్మీరీలు ఒక్కచోట కలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, రామ్ మనోహర్ లోహియా వైద్య కళాశాల నుంచి ఇటీవలనే పట్టా పుచ్చుకున్న షరీక ఆమిన్ తెలిపారు. యూపీఎస్‌యూ పరీక్షల ప్రిపరేషన్ కోసం పది రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన జుబేర్ రషీద్ అనే యువకుడు వేదిక వద్ద తెలిసిన వారిని పట్టుకొని బోరున ఏడ్చారు. వారం రోజులుగా కుటుంబ సభ్యులతోని మాట్లాడలేకపోతున్నానని బాధపడ్డారు. ఆ వేదిక వద్ద కంట తడి పెట్టించే ఇలాంటి దృశ్యాలెన్నో కనిపించాయి. -
శ్రీనగర్‌లో పదివేలమందితో నిరసన.. కేంద్రం స్పందన!
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో దాదాపు 10వేలమంది ప్రజలు గుమిగూడి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినట్టు వచ్చిన కథనాలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఖండించింది. ఇవి అసత్య.. కల్పిత కథనాలని హోంశాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన అనంతరం శ్రీనగర్, బారాముల్లా ప్రాంతాల్లో చిన్నాచితక ఆందోళనలు చోటుచేసుకున్నాయని, అంతకుమించి ఎలాంటి ఘటనలు జరగలేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 20, 30 మంది ప్రజలు గుమిగూడి పలుచోట్ల చిన్నస్థాయిలో నిరసనలు తెలిపారని, అంతేకానీ, పదివేలమందితో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారన్న మీడియా కథనాలు అసత్యమని ఓ ప్రకటనలో తెలిపంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయని, దాదాపు పదివేల మంది ఆందోళనకారులు శ్రీనగర్ నగరం నడిబొడ్డు వైపు ర్యాలీగా కదిలి నిరసన తెలిపారని, తమకు స్వేచ్ఛా కావాలని, ఆర్టికల్ 370 రద్దును అంగీకరించేది లేదని ఆందోళనకారులు నినదించారని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి.. టియర్ గ్యాస్‌లు, పెల్లెట్లు ప్రయోగించి.. నిరసనకారులను చెల్లాచెదురు చేసి.. ఆందోళనను అణచివేశారని ఆ కథనాలు చెప్పుకొచ్చాయి. -
నివురుగప్పిన నిప్పులా కశ్మీర్
శ్రీనగర్‌లో ప్రస్తుతం ఎటుచూసినా సాయుధ బలగాలే ఉన్నాయి. బయటివారి సంగతి పక్కనపెడితే స్థానికులు కూడా ఇంట్లోంచి అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా సీఆర్పీఎఫ్ బలగాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయి. ఎక్కడకు, ఎందుకు వెళుతున్నారు? అనే సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే ముందుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. శ్రీనగర్–జమ్మూ మధ్య 260 కి.మీ దూరాన్ని సాధారణ పరిస్థితుల్లో 6–7 గంటల్లో దాటేయొచ్చు. కానీ ప్రస్తుతం ప్రతీ కిలోమీటర్‌కు ఓ సీఆర్పీఎఫ్ పోస్ట్(మొత్తం 260 పోస్టుల)ను ఏర్పాటుచేశారు. ప్రతీ వాహనానికి వారు ఓ ప్రత్యేక నంబర్ కేటాయిస్తున్నారు. అదుంటేనే బండి ముందుకు కదులుతుంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి చాలామంది కశ్మీరీలకు తెలియదు. ఇందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడమే కారణం. అయితే ఆర్టికల్ 370 రద్దు గురించి తెలిసిన కొందరు కశ్మీరీలు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరిచారు. తమ జీవితాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సందర్భంగా తమకు కనీస సమాచారం ఇవ్వలేదనీ, విశ్వాసంలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీల్లో భయాందోళన.. ఆర్టికల్ 370తో తమ జీవితాలు మారిపోతాయనే వాదనను స్థానిక కశ్మీరీలు తిరస్కరిస్తున్నారు. ‘సగటు కశ్మీరీ కుటుంబం ఉన్నంతలో హుందాగా బతికేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడాన్ని, కూలిపని చేయడాన్ని కశ్మీరీలు నామోషీగా భావిస్తారు. సుగంధ ద్రవ్యాలు, యాపిల్ సాగు, కళాత్మక పనులు, చేతివృత్తుల విషయంలో కశ్మీరీలకు మంచి నైపుణ్యముంది. దీంతో సొంతంగా నిలదొక్కుకోవాలన్న తపన వీరిలో చాలా అధికం. అయితే కేంద్రం ఆర్టికల్ 370ని రద్దుచేయడంతో తమ పరిస్థితి తలకిందులవుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థానికేతరులు కశ్మీర్లో స్థిరపడ్డా, లేదంటే కేంద్రం నిర్ణయంతో ఉగ్రవాదం తిరిగి పుంజుకున్నా తాము ఉపాధిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ పండిట్లు మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఏళ్లుగా తాముపడిన కష్టాలకు ఇక ఓ ముగింపు దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో తెలుగు వారు కశ్మీర్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో పలువురు తెలుగువాళ్లు పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలవారిని కశ్మీరీలు గౌరవిస్తారనీ, ఆతిథ్యం విషయంలో ఎవరైనా వారి తర్వాతేనని తెలుగువాళ్లు చెప్పారు. మరోవైపు వచ్చే సోమవారం బక్రీద్, అనంతరం ఆగస్టు 15 వస్తుండటంతో అప్పటివరకూ ఆంక్షలు కొనసాగే అవకాశముందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. -(జమ్మూకశ్మీర్ నుంచి సాక్షి ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిలుద్దిన్) -
కశ్మీరీల్లో ఆగ్రహం.. ఆందోళన!
జమ్మూ: ఆర్టికల్ 370ని రద్దుచేయడంపై పలువురు కశ్మీరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో మళ్లీ హింస రాజుకుంటుందని భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం తాజా నిర్ణయం కారణంగా ముస్లిం మెజారిటీ గుర్తింపులను రాష్ట్రం కోల్పోతుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొందరు స్థానికులు మాత్రం ఇందుకు కశ్మీర్ ప్రాంతీయ పార్టీలను తప్పుపడుతున్నారు. ఈ విషయమై శ్రీనగర్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ షా మాట్లాడుతూ..‘కేంద్రం నిర్ణయంతో మేం షాక్‌కు గురయ్యాం. కేంద్ర ప్రభుత్వాలతో గత 70 ఏళ్లుగా చేతులు కలుపుతున్న కశ్మీరీ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని ఎముకలగూడులా మార్చేశాయి. కేంద్రం తాజా నిర్ణయం వల్లే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశముంది’అని హెచ్చరించారు. ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది.. కేంద్ర ప్రభుత్వం తమను ఇంకెంతకాలం గృహనిర్బంధంలో ఉంచుతుందని కశ్మీరీ యువకుడు అర్షద్ వార్సీ(20) ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని రద్దుచేయడం అంటే తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చేందుకు వీల్లేనట్లు కాదని స్పష్టం చేశారు. మరో మహిళా టీచర్ మాట్లాడుతూ..‘ఈ దుస్థితికి జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలే కారణం. ఆర్టికల్ 370 రద్దుతో మా గుర్తింపును కోల్పోయినట్లైంది’అని చెప్పారు. కశ్మీరీ పండిట్ల సమస్య అదే.. ఇక ఫాతిమా బానో అనే మహిళా ఎంట్రప్రెన్యూర్ కూడా తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేవలం ఆర్టికల్ 370 రద్దుతో దశాబ్దాలుగా కశ్మీర్లో కొనసాగుతున్న అశాంతి, హింస సమసిపోతుందా? అలా జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. కశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలకు తిరిగొచ్చేందుకు ఆర్టికల్ 370, ఆర్టికల్–35ఏ అన్నవి అసలు అడ్డంకే కాదు. పండిట్లు తిరిగిరావడానికి శాంతిభద్రతల పరిస్థితులే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి’అని తెలిపారు. -
జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
-
స్వస్థలాలకు శ్రీనగర్ నిట్‌లో 130 మంది తెలుగు విద్యార్థులు
-
శ్రీనగర్‌ను ముంచెత్తిన వర్షం!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ను ఆకస్మిక వర్షాలు ముంచెత్తాయి. గురువారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో నగరంలో పలు రోడ్లు జలమయం అయ్యాయి. లాల్ చౌక్, రాజ్‌బాగ్, ఖన్యర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక, నగరంలోని బిమినా, మెహ్జూర్ నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం శ్రీనగర్‌లో గురువారం ఉదయం 26.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఉత్తర, సెంట్రల్ కశ్మీర్లో భారీగా వర్షాలు కురిశాయి. జమ్మూకశ్మీర్‌లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ సమాచారం అందించడంతో ఆదివారం వరకు అమర్నాథ్ యాత్రను నిలిపేశారు. అమర్నాథ్ యాత్ర మార్గంలోని పహల్గామ్, బల్టాల్ ప్రాంతాల్లో రానున్న 12 గంటల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉగ్రవాద నిధుల కేసులో ఎన్ఐఏ దాడులు
న్యూఢిల్లీ: క్రాస్ లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) సరిహద్దుల్లో వాణిజ్య వ్యాపారులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం దాడులు చేసింది. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కెల్లర్ ప్రాంతంలోని వ్యాపారి గులాం అహ్మద్ వానీ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం కలసి దాడులు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పుల్వామాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై 2019 ఫిబ్రవరి 14 న ఉగ్రదాడి జరగక ముందే అహ్మద్ వానీ క్రాస్ ఎల్ఓసి వాణిజ్యంలో పాల్గొన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఉగ్రవాదలకు అందుతున్న నిధులపై ఎన్ఓఏ ప్రారంభించిన దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ప్రసిద్ధ కాశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ వతాలీ, షబ్బీర్ షా, ఆసియా ఆండ్రాబీ, మసారత్ ఆలం సహా కీలకమైన వేర్పాటువాద నాయకులను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి పాకిస్తాన్ నుంచి నిధులు అందుకున్నారన్న ఆరోపణలపై వతాలీని 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతడిని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీకి సన్నిహితుడిగా పేర్కొంటారు. ఎన్ఐఏ దర్యాప్తులో వతాలీకి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. బ్రిటన్, దుబాయ్‌లలో వతాలీకి అనేక ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాద నిధుల కేసుకు సంబంధించి అరెస్టయిన వేర్పాటువాదులందరూ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశాల నుంచి నిధులు, విరాళాలు సేకరిస్తున్నట్లు దుఖ్తరన్-ఎ-మిల్లతాద్ సంస్థ చీఫ్ ఆసియా ఆండ్రాబీ, మసారత్ ఆలం విచారణలో అంగీకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. -
తప్పు కోడ్ పంపినందుకు పైలెట్ సస్పెండ్
శ్రీనగర్ : విమానానికి సంబంధించిన 'హైజాక్ కోడ్'ను ఏటీఎస్ అధికారులకు తప్పుగా పంపినందుకు ఎయిర్ ఏషియా ఇండియాకు చెందిన పైలెట్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. జూన్ 9న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న E-I5-715 విమానంలో సాంకేతిక లోపంతో ఒక ఇంజిన్ నిలిచిపోయింది. విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ రవి రాజ్ అత్యవసర కోడ్ 7700ను ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎటిఎస్) అధికారులకు పంపాల్సి ఉండగా, దానికి బదులు 7500 ను పంపినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ విషయాన్నితీవ్రంగా పరిగణించిన డీజీసీఏ జూన్ 28న సదరు పైలెట్‌కు షోకాజ్ నోటీసులు పంపినట్లు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి కెప్టెన్ రవిరాజ్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో అతన్ని మూడునెలల పాటు విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీజీసీఏ వివరించింది. కాగా, విమానానికి సంబంధించి సాంకేతిక లోపాన్ని సరైన సమయంలో గుర్తించనందుకు, పైలట్ రవిరాజ్ పనితీరును సరిగ్గా పర్యవేక్షించనందుకు పైలట్ కమ్ కమాండర్ కిరణ్ సాంగ్వాన్‌ను హెచ్చరించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయనను ఆదేశించింది. -
జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!
న్యూఢిల్లీ : పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో దోషిగా తేలిన ఉగ్రవాది బసీర్ అహ్మద్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతను శ్రీనగర్ నుంచి వచ్చిన జైషే ఉగ్రసంస్థ సభ్యుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటి కమిషనర్ (స్పెషల్ సెల్) సంజీవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో బసీర్ ఢిల్లీ పోలీసులపై కాల్పులు జరిపాడన్న ఆరోపణలపై అరెస్టయ్యాడు. అయితే, కింది కోర్టు నిర్దోషిగా తేల్చడంతో విడుదలై బయటికొచ్చాడు. ఈ తీర్పుపై పోలీస్‌శాఖ హైకోర్టును ఆశ్రయించగా అతన్ని దోషిగా తేల్చింది. కానీ, బసీర్ కోర్టులో లొంగిపోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో హైకోర్టు అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పక్కా సమాచారంతో బసీర్‌ను, అతనితోపాటు ఉన్న ఫయాజ్, మాజిద్ బాబాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
శ్రీనగర్‌లో హైటెన్షన్
-
ఔదార్యం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్
-
వైరల్ : మానవత్వం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్..!
శ్రీనగర్ : పక్షవాతంతో బాదపడుతున్న ఓ బాలుడి పట్ల పుల్వామా ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇక్బాల్ సింగ్ అనే జవాన్ ఔదార్యం చాటాడు. అతనికి తన లంచ్ బాక్స్ ఇవ్వడంతో పాటు స్వయంగా ఆహారం తినిపించాడు. శ్రీనగర్‌లోని నవాకాదల్ ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్‌కు స్థానికంగా నివాసముంటున్న ఓ పిల్లాడు తారసపడ్డాడు. అతను ఆకలితో ఉన్నాడని గ్రహించిన జవాన్ తన లంచ్ బాక్స్ ఇచ్చాడు. అయితే, సదరు బాలుడి రెండు చేతుల్లో చలనం లేదని తెలియడంతో .. తనే దగ్గరుండి తినిపించాడు. 31 సెకన్ల నిడివి గల ఈ వీడియో వైరల్ అయింది. సోల్జర్ మంచితనంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్బాల్ ఔదార్యం మెచ్చి ‘హ్యూమన్ అండ్ సెల్ఫ్‌లెస్ యాక్ట్’ సర్టిఫికేట్ కూడా అందించామని సీఆర్పీఎఫ్ తెలిపింది. వీరత్వం, కరుణ అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు అని పేర్కొంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇదే కాన్వాయ్‌లోని ఓ వాహనానికి ఇక్బాల్ డ్రైవర్‌గా ఉన్నారు. క్షతగాత్రులైన సహచరులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఆయన వారి ప్రాణాలు కాపాడారు. ఔదార్యం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్ -
రూ. కోట్ల వ్యాపారం వదిలి..సొంతూరుకు కదిలి..
సాక్షి, న్యూఢిల్లీ : కల్లోల కశ్మీర్లో ఉద్రిక్తతల నడుమ బతకలేక 29 ఏళ్ల పాటు అజ్ఞాతంగా గడిపిన కశ్మీరీ పండిట్ వ్యాపారవేత్త రోషన్ లాల్ మవా తిరిగి స్వస్ధలం శ్రీనగర్ డౌన్టౌన్లో తన వ్యాపారాన్ని పునరుద్ధరించేందుకు అడుగుపెట్టాడు. పుట్టిన చోటే కన్నుమూయాలనే కోరికతో రూ 500 కోట్ల వ్యాపారాన్నీ వదులుకుని పోయిన చోటే వెతుక్కోవాలంటూ సొంతూరికి చేరుకున్న 75 ఏళ్ల మవాకు శ్రీనగర్‌లో ముస్లింలు, హిందువులు ఏకమై స్వాగతించారు. వేర్పాటువాదుల ప్రాబల్యం కలిగిన శ్రీనగర్ పాతబస్తీలో ఉగ్ర మూకలు 1990లో జరిపిన కాల్పుల్లో గాయపడ్డ మవా ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని అక్కడే స్ధిరపడ్డా తన చివరి రోజుల్లో స్వస్ధలంలో గడపాలన్న ఆయన కల మాత్రం ఇప్పటికి నెరవేరింది. 29 ఏళ్ల తర్వాత తన పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యాపారాన్ని బుధవారం తిరిగి ప్రారంభించారు. మవా తిరిగి తన షాప్‌ను ప్రారంభించే సమయంలో పెద్దసంఖ్యలో స్ధానిక ముస్లింలు చేరుకుని ఆయనను ఘనంగా సన్మానించారు. మవాను స్వాగతిస్తూ ఆయనకు సంప్రదాయ తలపాగా అమర్చి ఆయన కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. ఇరు మతాలకు చెందిన ప్రజలు స్వీట్లు పంచుకుని వేడుక చేసుకున్నారు. 1990, అక్టోబర్ 13న కొందరు తనపై కాల్పులకు తెగబడంతో తన పొత్తికడుపులోకి నాలుగు బుల్లెట్లు చొచ్చుకుపోయాయని, ఘర్షణల ప్రభావంతో తాము ఢిల్లీకి వలస వెళ్లి అక్కడ స్ధిరపడ్డామని మవా చెప్పుకొచ్చారు. దేశ రాజధానిలో వ్యాపారం వేళ్లూనుకున్నా తన హృదయం, ఆత్మ కశ్మీర్ కోసమే పరితపించేవని చెప్పారు. ఢిల్లీలో తమ వ్యాపారం అద్భుతంగా రాణించినా తనకు ప్రశాంతత లేదని అన్నారు. చివరి రోజులు కశ్మీర్లో గడపాలన్న చిరకాల వాంఛ ఇప్పటికి తీరిందని చెప్పారు. కాగా, చావైనా..బతుకైనా కశ్మీర్లోనేనని తన తండ్రి తరచూ చెబుతుండేవాడని, ఆయన కొడుకుగా ఇప్పుడు తాను ఆయన కోరికను నెరవేర్చానని మవా కుమారుడు డాక్టర్ సందీప్ అన్నారు. రూ 500 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నా గతంలో తాము అనుభవించిన వాతావరణం కోసం కశ్మీర్లో సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని మవా కుటుంబం చిన్నస్ధాయిలో ఆరంభించడం విశేషం. మరోవైపు తమ ఊరి బిడ్డ తిరిగి జన్మభూమిలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని స్ధానిక ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్లు అందరూ తిరిగి రావాలని కోరుకుంటున్నామని, ఇక్కడ ఎలాంటి భయాందోళనలు లేవని స్ధానిక ముస్లిం ముఖ్తార్ అహ్మద్ చెప్పుకొచ్చారు. -
కళ్లముందే కాలిబూడిదైన భారీ నోట్లకట్టలు!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డబ్బును తరలిస్తున్న ట్రక్కుకు మంటలంటుకోవడంతో కోట్లాది రూపాయల కరెన్సీ కళ్లముందే కాలి బూడిదైంది. అనంతనాగ్ జిల్లా ఖాజిగంద్ ప్రాంతంలోని పంజాత్‌లో ఆదివారం-సోమవారం మధ్య రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లోకల్ టీవీ చానెళ్లలో ప్రసారం చేసిన వీడియోలో.. ట్రక్కులో, రోడ్డు మీద పెద్ద ఎత్తున పడి ఉన్న తగలబడిపోవడం కనిపిస్తోంది. శ్రీనగర్ నుంచి ట్రక్కు జమ్ముకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కులో రూ. ఐదువందల కరెన్సీనోట్ల కట్టలు ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో ఎన్నికల సంఘం, పోలీసులు ఘటనపై దృష్టి సారించారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందా? అదే అయితే, ఏ పార్టీ, ఏ అభ్యర్థి తరఫున ఈ డబ్బు రహస్యంగా తరలించారని అన్నది తెలియాల్సి ఉంది. -
మేజర్ గొగోయ్‌పై ముగిసిన కోర్ట్ మార్షల్
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఓ యువతితో సన్నిహితంగా ఉంటూ పట్టుబడిన ఆర్మీ మేజర్ లీతుల్ గొగోయ్‌పై సైనిక కోర్టులో విచారణ పూర్తయింది. మేజర్ లీతుల్ గొగోయ్ 2018 మేలో స్థానిక యువతి(18)తో కలిసి శ్రీనగర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు. అక్కడ పోలీసులతో గొడవకు దిగడంతో వారు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్..కోర్టు మార్షల్‌కు ఆదేశించారు. మేజర్ గొగోయ్ మారు పేరుతో ఫేస్బుక్లో పరిచయమైనట్లు శ్రీనగర్ యువతి వాంగ్మూలం ఇచ్చింది. ఈ మేరకు సైనిక న్యాయస్థానం..ఉన్నతాధికారులకు నివేదిక అందజేసింది. ఆదేశాలను ఉల్లంఘించిన మేజర్ గొగోయ్ సీనియారిటీని తగ్గించే అవకాశమున్నట్లు సమాచారం. 2017లో కశ్మీర్లో పెట్రోలింగ్ సందర్భంగా రాళ్లు రువ్వుతున్న మూకల నుంచి రక్షణ పొందేందుకు మేజర్ గొగోయ్ తన జీప్ బోయ్నెట్పై ఓ సాధారణ పౌరుడిని కట్టేసిన ఘటనపై తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. -
మరోసారి అంకిత భావం చాటుకున్న అభినందన్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ మరోసారి దేశ సేవ పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. నాలుగు వారాల పాటు సెలవులు లభించినప్పటికీ ఇంట్లో గడపకుండా తన స్క్వాడ్రాన్‌తో కలిసి ఉండటానికే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆయన శ్రీనగర్‌లోని వాయుదళం చెంతకు చేరుకున్నట్లు సమాచారం. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు.(చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?) ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభినందన్‌కు వైద్యులు సూచించారు. ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో దాదాపు రెండు వారాల పాటు వైద్య పరీక్షలన్నీ పూర్తైన అనంతరం 12 రోజుల క్రితం ఆయనకు సెలవు ఇచ్చారు. ఈ క్రమంలో కుటుంబంతో గడిపేందుకు అభినందన్ చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే చెన్నైకి వెళ్లకుండా తన స్క్వాడ్రాన్, మిషన్లతో కలిసి పనిచేయడమే తనకు ఇష్టమని ఆయన చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.(చదవండి : ‘అభినందన్ దగ్గర గన్ లేకుంటే కొట్టి చంపేవాళ్లం’) కాగా ప్రస్తుతం అభినందన్ అభీష్టం ప్రకారం ఆయన శ్రీనగర్ చేరుకున్నప్పటికీ నాలుగు వారాల సిక్ పీరియడ్ పూర్తైన తర్వాత మెడికల్ బోర్డు ఆయనకు మరోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుంది. వీటి ఫలితంపైనే అభినందన్ యుద్ధ విమానాన్ని నడపగలరా లేదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది.(పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!) -
జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం
శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లోని ఉద్దంపూర్ జిల్లా మజాల్తా సమీపంలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఆరుగురు మృతి చెందగా, మరో 38మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు సురిన్సార్ నుంచి శ్రీనగర్ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉగ్రవాది కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి
-
ఉగ్రవాది కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నారు. ఉగ్రవాదులన్నారన్న సమాచారంతో ఉగ్రశిబిరాన్ని శిబిరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరగగా ఉగ్రవాది మరణించినట్లుగా నటించి దగ్గరకు వెళ్లిన జవాన్లపై బండరాళ్ల మధ్య నుంచి లేచి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఉగ్రవాది కాల్పుల్లో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, ఒక జవాన్, జమ్ము కశ్మీర్‌కు చెందిన ఇద్దరు పోలీసులు చనిపోయారు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మరోవైపు భారత పైలట్ అభినందన్‌ని అప్పగిస్తూనే శాంతి వచనాలు వల్లిస్తోన్న పాక్.. తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఎల్ఓసీ సమీపంలోని పూంఛ్ సెక్టార్ మేండర్, బాలాకోట్, కృష్ణా ఘాట్లలో మోర్టార్లతో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులకు భారత జవాన్లు కూడా అంతే దీటుగా జవాబునిస్తున్నారు. -
కశ్మీర్ లోయలో హైఅలర్ట్
శ్రీనగర్ : పుల్వామా తరహా ఉగ్రదాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో జమ్మూతో పాటు పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. జమ్మూలోని అన్ని ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. తనిఖీల్లో భాగంగా బారాముల్లా జిల్లా సోపోర్‌లో భద్రత బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని నిలువరించారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. (‘పుల్వామా కంటే పెద్ద ఉగ్రదాడి జరగొచ్చు’) ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషే మహ్మద్ నాయకులు, కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ నగరం లేదా జమ్మూ కశ్మీర్ బయటి ప్రాంతంలో ఒకచోట మన జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో ఇంటలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. (పాక్‌పై నిషేధం వద్దంటున్న డయానా) -
మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్ : ఉగ్రదాడితో ఆందోళనకరంగా మారిన దక్షిణ కశ్మీర్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని పింగ్లన్ ప్రాంతంలో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో వారిని మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో మేజర్ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. వీరంతా 55 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన వారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిని ఢీకొట్టి 43 మంది జవాన్ల మృతికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాదులు రోజుకో రకంగా దాడులు కొనసాగిస్తున్నారు. శనివారం రాజౌరీ జిల్లాలో వారు అమర్చిన ల్యాండ్‌మైన్ నిర్వీర్యం చేసే క్రమంలో ఆర్మీ అధికారి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా ఘటనలో మేజర్ సహా ముగ్గురు జవాన్లు మృతి చెందడంతో యావత్ భారతావని ఆగ్రహంతో రగిలిపోతోంది. Visuals: The 4 Army personnel including a Major, who were killed in action during encounter between terrorists and security forces, in Pinglan area of Pulwama district, belonged to 55 Rashtriya Rifles. #JammuAndKashmir (Visuals deferred by unspecified time) pic.twitter.com/Wa2sxz3bzT — ANI (@ANI) February 18, 2019