![Five Doctors Test Positive For Coronavirus In Jammu And Kashmir - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/18/coroana-4445.jpg.webp?itok=ZHVXK3fO)
శ్రీనగర్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ మహమ్మారి డాక్టర్లను సైతం వదలటం లేదు. తాజాగా ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఐదుగురు డాక్టర్లకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఐదుగురు డాక్టర్లలో ముగ్గురు శ్రీనగర్‌లోని శ్రీమహారాజ హరీసింగ్ ఆస్పత్రికి చెందినవారు. ఇందులో ఒకరు ఎస్‌కేఐఎంఎస్ బెమినా ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ కాగా, మరొకరు శ్రీనగర్‌లోని ప్రభుత్వ దంత కళాశాలలో పనిచేసే డెంటిస్ట్. పాజిటివ్‌గా నిర్థారణ అయన ఈ ఐదుగురు వైద్యుల్లో నలుగురు కోవిడ్-19 రోగికి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. అయితే వీరు చికిత్స అందించిన కరోనా బాధితురాలు హబ్బా కదల్ (29) ఆదివారం మృతి చెందారు. (వారిని వెనక్కిపంపిచనున్న అమెరికా, కారణం?)
మృతి చెందిన మహిళ నుంచి నలుగురు డాక్టర్లకు కోవిడ్ వైరస్ సంక్రమించినట్లు ఛాతి ఆస్పత్రిలోని పల్మోనాలజీ విభాగధిపతి డాక్టర్ నవీద్ నజీర్ తెలిపారు. ఇక వైరస్ బారినపడి మృతి చెందిన హబ్బా కదల్ శ్రీనగర్‌కి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మహిళ మరణంతో కశ్మీర్‌లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. వైరస్‌తో మృతి చెందిన హబ్బా కదల్ ముందుగా శ్రీమహారాజ హరీసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆమెకు చికిత్స అందించే క్రమంలో ముగ్గురు డాక్టర్లకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇక జమ్మూ కశ్మీర్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,188కి చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది డాక్టర్లు, ముగ్గురు నర్సులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక సమావేశం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment