
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని (ఎన్ఐటీ) అధికారులు మూసివేశారు. ఓ విద్యార్థి మతపరమైన అంశంపై సోషల్ మీడియాలో ఓ పోస్టు చేయడంతో నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనగు దిగారు. దీంతో ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలు ఇతర విద్యాసంస్థలకు కూడా వ్యాపించాయి. అప్రమత్తమైన ఎన్ఐటీ అధికారులు విద్యార్ధులకు శీతాకాల సెలవులను ముందుగానే ప్రకటించారు.
గురువారం నుంచే సెలవులు అమల్లోకి వస్తామని యూనివర్సిటీ డీన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టూడెంట్స్ అందరిని తక్షణమే క్యాంపస్, హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. నిట్ వెబ్సైట్ను తాత్కాలికంగా మూసివేశారు. కశ్మీర్‌లోని ఇతర డిగ్రీ కాలేజీలు కూడా శనివారం నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. డిసెంబర్ 20లోగా పరీక్షలు ఉండగా,.. వాటిని వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను సెలవుల అనంతరం నిర్వహిస్తామని వెల్లడించారు.
అయితే ఉన్నట్టుండి హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎన్ఐటీలో చదువుతున్న దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ నుంచి అత్యవసరంగా బయలుదేరేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
మరోవైపు స్థానికేతర నిట్వి ద్యార్థి సోషల్ మీడియాలో దైవదూషణతో కూడిన పోస్ట్ చేయడంతో మంగళవారం ఈ వివాదం చెలరేగింది. ఇది ఇన్‌స్టిట్యూట్‌లో భారీ నిరసనలకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యంతరకరమైన పోస్టు చేసి ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైన యూట్యూబ్ వీడియోను పోస్టు చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు శ్రీనగర్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment