TG: మరో ఘటన.. వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్.. | Students Protest At Mahabubnagar Polytechnic College Over Private Videos Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌: వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్.. పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద ఉద్రిక్తత

Published Sat, Jan 4 2025 3:44 PM | Last Updated on Sat, Jan 4 2025 4:25 PM

Students Protest At Mahabubnagar Polytechnic College

సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్‌లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.

వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్‌ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్‌లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్‌ 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement