Mahabubnagar Crime News
-
TG: మరో ఘటన.. వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్ -
కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై సర్పంచ్ దాడి
-
మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్!
దేవరకద్ర రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం పేరూర్లో భార్యాభర్తల మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఎనిమిదేళ్ల తర్వాత పోలీసులు ఛేదించారు. దంపతుల అదృశ్యాన్ని హత్యగా తేల్చారు. వివాహేతర సంబంధమే అందుకు కారణమని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రజితరెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం దేవరకద్ర మండలంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్ పేరూర్లో తన బావమరుదులు నానేష్, మహమ్మద్ రఫీతో కలిసి బొగ్గు అమ్మేవాడు. ఈ క్రమంలో పేరూర్కే చెందిన దంపతులు బోయ శాంతమ్మ (32), బోయ ఆంజనేయులు (37)తో బుర్రన్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బుర్రన్ దగ్గర వారు రూ. 20వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ బుర్రన్ తరచూ వారి ఇంటికి వెళ్లే క్రమంలో శాంతమ్మతో బుర్రన్ వివాహేతర సంబ«ం«ధం ఏర్పర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు తన భార్యతో మాట్లాడితే చంపుతానని బుర్రన్ను హెచ్చరించాడు. అడ్డొస్తున్నాడని.. గొంతు నులిమి.. తన వద్ద తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతోపాటు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఆంజనేయులును హతమార్చాలని బుర్రన్ నిర్ణయించుకున్నాడు. 2014 ఏప్రిల్ 19న మాట్లాడుకుందామంటూ ఆంజనేయులను పెద్దమందడి మండలంలోని పెద్దమునగల్ చేడ్ గ్రామ శివారులోని ఓ పొలం వద్దకు తీసుకెళ్లి నానేష్, రఫీతో కలసి గొంతు నులిమి చంపాడు. అనంతరం ఈ విషయాన్ని శాంతమ్మకు చెప్పాడు. ఆమె ఈ హత్యోదంతాన్ని బయటకు చెబుతాననడంతో బావమరుదుల సాయంతో ఆమెను గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి చీర కొంగును గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఈ హత్యలు బయటపడకుండా ఉండేందుకు మృతదేహాలను పూడ్చి పెట్టారు. డీఎన్ఏ పరీక్షతో కేసు ఛేదన.. 2020 ఏప్రిల్ 17న మండలంలోని పేరూర్ శివారులో శ్మశానవాటిక నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ఓ చీర, ఎముకలు బయటపడ్డాయి. ఈ సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు... గత పదేళ్లలో తప్పిపోయిన మహిళల సమాచారాన్ని సేకరించే క్రమంలో శాంతమ్మ పేరు రావడంతో మృతురాలి కుమారుడు శ్రీకాంత్‌కు డీఎన్ఏ టెస్టు చేశారు. అది ఎముకలతో సరిపోలడంతో మృతి చెందింది శాంతమ్మగా నిర్ధారించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు సర్పంచ్‌ను కలిసి నిజం చెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో నిందితుడు రఫీ ఏడాది క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. -
కన్న తండ్రి చేతిలో నవవధువు దారుణ హత్య
-
మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే..
జడ్చర్ల టౌన్: మరికొన్ని గంటల్లో పెళ్లి పీట లెక్కాల్సిన ఆ వరుడు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరుకున్నాడు. గురువారం ఉదయం జడ్చర్ల–మహబూబ్‌నగర్ 167వ నం బరు జాతీయ రహదారిపై ఈ విషాదకర సం ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్యశామ్యూల్ (34)కు వన పర్తి పట్టణానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ కల్వరీచర్చిలో వి వాహం కావాల్సి ఉంది. మధ్యాహ్నం అక్కడి సుదర్శన్ ఫంక్షన్హాల్లో విందుకు సైతం ఏ ర్పాట్లు చేశారు. అందులోనే వధువు తరఫు కు టుంబ సభ్యులు, బంధువులు విడిది చేశారు. పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు మరణ వార్తతో ఇంటి వద్ద విషాదంలో బంధువులు 15 నిమిషాల్లో వస్తానని చెప్పి.. గురువారం ఉదయం అందరూ పెళ్లికి సిద్ధమవుతుండగా 15 నిమిషాల్లో వస్తానంటూ వరుడు కారులో జడ్చర్లకు బయలుదేరాడు. ఏడు గంటలకు నక్కలబండ తండా సమీపంలోకి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కోసం తీసుకొచ్చిన దండలను.. పెళ్లి వేడుకల్లో ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు వరుడు చైతన్య మరణ వార్త తెలియ డంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెళ్లి కో సం తీసుకొచ్చిన పూల దండలను మృతదేహా నికి వేయాల్సి వస్తుందని అనుకోలేదని బంధు లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మెడికో.. ఎదురుగా వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడ మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలీయర్ చదువుతున్న ఎం.సాయిభార్గవ్(23) శుక్రవారం మధ్యాహ్నం 11.50సమయంలో స్కూటీపై కళాశాల నుంచి శ్రీనివాస కాలనీకి బయల్దేరాడు. మార్గమధ్యలో అప్పన్నపల్లి బ్రిడ్జి సమీపంలో మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న టాటా ఏస్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో సాయిభార్గవ్ తలకు తీవ్రమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు సాయి భార్గవ్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో అద్దెకు ఉంటూ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలీయర్ చదువుతున్నాడు. రోజు కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ప్రభు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!) కొవ్వొత్తుల ప్రదర్శన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయి భార్గవ్ ఆత్మకు శాంతి కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, డాక్టర్ రామకిషన్ పాల్గొన్నారు. -
ఏటీఎంలో 15 లక్షల నగదు చోరీ
సాక్షి, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. 15 లక్షల నగదును దుండగులు అపహరించారు. తెల్ల కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించడంతోపాటు రుమాలును చుట్టుకుని ఏటీఎంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి, గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను కట్ చేశారు. ఏటీఎంలోని డబ్బును అపహరించి షట్టర్‌ను కిందికి దించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది ఏటీఎం షట్టర్ మూసి ఉండటాన్ని గమనించి షట్టర్‌ను తెరవగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బ్యాంకు మేనేజర్ దీపిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. -
బాలికపై అత్యాచారం
ఆత్మకూర్: మైనర్బాలికను అత్యాచారం చేసిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలను బుధవారం ఆత్మకూర్‌లో అడిషనల్ ఎస్పీ షాకీర్‌హుస్సేన్, సీఐ సీతయ్య సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిరాణషాపు యజమాని చందు(22) సోమవారం రాత్రి 8:0 గంటల ప్రాంతంలో బాలిక షాపులో కొనుగోలు కోసం వచ్చింది. ఇదే అదునుగా భావించిన యువకుడు బాలికను బలవంతంగా షాపులోకి తీసుకెళ్లి షెట్టర్‌వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక మంగళవారం మధ్యాహ్నం తల్లితండ్రులకు తెలిపింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆత్మకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి 376, ఫోక్సోచట్టం, ఎస్సీఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
జడ్చర్ల: పట్టణానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు రాంచంద్రారెడ్డి(62) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేశారని వార్త వెలువడిన గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యాడన్న సమాచారం అందటంతో పట్టణవాసులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హత్య చేశారు. రాంచంద్రారెడ్డి జడ్చర్ల కొత్తబస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన పెట్రోల్‌బంక్ నిర్వహిస్తున్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లో ఉంటుండగా ఇతను మాత్రం జడ్చర్లలో ఉండటంతో పాటు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండేవాడు. బాదేపల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేశారు. భూత్పూర్ జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. జడ్చర్ల శాసనసభ స్థానానికి కూడా అన్న టీడీపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి ఓటమి పాలయ్యారు. అనంతరం సుమారు నాలుగైదు ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాంచంద్రారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సత్యనారాయణరెడ్డి సోదరుడి కుమారుడు. చివరి రోజుల్లో జడ్చర్లలోని రాంచంద్రారెడ్డి ఇంట్లోనే సత్యనారాయణరెడ్డి ఉన్నారు. అయితే సత్యనారాయణరెడ్డికి సంబంధించిన ఆస్థుల వ్యవహారంలో, దాయాదులతో భూతగాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే హత్యకు గురయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాద్‌నగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో రాంచంద్రారెడ్డిని అతని వాహనంలోనే కిడ్నాప్ చేశారని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్, హత్యకు సంబంధించి తమవద్ద ఎలాంటి సమాచారం లేదని జడ్చర్ల ఎస్ఐ శంషోద్దీన్ తెలిపారు. కాగా హత్యకు గురైన రాంచంద్రారెడ్డి సొంత గ్రామం షాద్‌నగర్ సమీపంలోని అన్నారం. భార్య వాణి, కుమార్తెలు అఖిల, నిఖిల, కుమారుడు రఘు ఉన్నారు. పార్టీకీ తీరని లోటు: మల్లురవి రాంచంద్రారెడ్డి మృతికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. -
నిందితులను వదిలేది లేదు
జడ్చర్ల: హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జడ్చర్ల తదితర ప్రాంతాలను అడ్డాలుగా ఎంచుకొని అక్కడి నుంచి వచ్చి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టమని ఎస్పీ రెమారాజేశ్వరి హెచ్చరించారు. గురువారం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 7న మండలంలోని తంగెళ్లపల్లి, గంగాపూర్, కోడ్గల్‌లో అలివేలమ్మ, అలివేలు, సుజాత మెడల్లోంచి పుస్తెల తాళ్లను దొంగలు బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్తారని బాధితులు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దొంగతానికి పాల్పడిన పండిత్ సూరజ్కుమార్పాండే, పత్తెప్పరప్ప శ్రీనివాస్, షేక్ అఫ్రిద్ దొరికారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు తామే చేసినట్లు ఒప్పుకున్నారు. వీరిలో పండిత్ సూరజ్కుమార్పాండేపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో 18 కేసులు నమోదై ఉన్నాయని, పీడీయాక్టు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అంతేగాక షాద్‌నగర్ పీఎస్ పరిధిలో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడని, ఇతడిపై మరోసారి పీడీ యాక్టు నమోదు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో నివాసం ఉంటూ ఫంక్షన్‌హాల్స్‌లో డెకరేషన్ పనులు చేసుకుంటూనే ఇలాంటి నేరాలు చేస్తుంటారని తెలిపారు. ఇక పతెపరప్ప శ్రీనివాస్ ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ మండలం అన్నాసాగర్‌కు చెందినవాడని, ఇతను హైదరాబాద్ బాలాపూర్‌లో ఉంటున్నాడని తెలిపారు. ఇతడిపై జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో బాలికను కిడ్నాప్ చేసిన సంఘటనకు సంబందించి పొక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదై ఉందన్నారు. షేక్ అఫ్రిద్ బాలాపూర్‌లో ఉంటుండగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందినవాడని తెలిపారు. వీరంతా జైలులో పరిచయమయ్యారని.. బయటకు వచ్చిన అనంతరం తిరిగి నేరాలకు అలవాటు పడ్డారని, ఇతడిపై నాలుగు కేసులు బయట పడినట్లు వివరించారు. వీరి నుంచి మూడు పుస్తెల తాళ్లతో పాటు బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వారికి ఆశ్రయం కల్పించవద్దని ఎస్పీ సూచించారు. అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయాలని కోరారు. కేసులో పురోగతి సాధించిన జడ్చర్ల పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీధర్, సీఐ వీరస్వామి, ఎస్ఐలు శంషోద్దీన్, జయప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
లారీ భీభత్సం.. బడుగుల బ్రతుకులు ఛిద్రం
సాక్షి, జడ్చర్ల: పట్టణంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఇందులో ఇద్దరు వలస కూలీలు, మరొకరు దుర్మరణం చెందారు. రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి సర్వీస్ రోడ్డును అనసరించి ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో ఇటుగా వెళ్తున్న ముగ్గురు లారీ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం మేరకు వివరాలిలా.. కేరళ రాష్ట్రం పెరంబాకు నుంచి ఉత్తరప్రదేశ్‌కు పనసకాయల లోడ్‌తో లారీ వెళుతుంది. అయితే కావేరమ్మపేట వద్ద ఏఎస్ఆర్ గార్డెన్ ఎదుట అకస్మికంగా సరీ్వస్ రోడ్డుపై దారి మళ్లించాల్సి ఉండడంతో అతివేగంగా ఉన్న లారీ అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపుకు దూసుకెళ్లింది. ఎడమ వైపు సరీ్వస్ రోడ్డును అనసరించి ఉన్న ఇంటిని ఢీకొట్టి ఎడమవైపునకు బోల్తా పడింది. అదే సమయంలో లారీకి ఎడమవైపున అదే సర్వీస్ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, కాలినడకన వెళ్తున్న మరో వ్యక్తి లారీ కింద పడి మృతిచెందారు. మృతుల్లో కావేరమ్మపేట వాసి లారీ కింద పడి మృతిచెందిన వారిలో ఓ వ్యక్తిని కావేరమ్మపేటకు చెందిన రఫియొద్దీన్(50)గా గుర్తించారు. సరీ్వస్ రోడ్డు దగ్గర షాద్‌నగర్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మృతుడికి భార్య హబీబున్నీసాబేగం, కుమారుడు రియాజొద్దీన్, కూతురు అయేషా ఉన్నారు. మరో ఇద్దరు వలస కూలీలు మరో ఇద్దరు కూలీలు మల్లే‹Ù(30), బంగారయ్య (24) ఇద్దరు హైదరాబాద్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుంటారు. వీరిద్దరూ ఒకేచోట పని చేస్తున్నారు. బైక్‌పై వీరిద్దరూ అదే రూట్లో వెళ్తుండగా.. లారీ వీరి మీద పడింది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మల్లే‹Ùది కోడేరు మండలం రాజాపూర్ గ్రామం కాగా, అతనికి భార్య మంజుల, కుమారుడు పవన్, కూతురు భవాని ఉంది. బంగారయ్యది గోపాల్పేట మండలం మన్ననూర్ గ్రామం. ఇతనికి ఆర్నెళ్ల కిందట వివాహం కాగా, ప్రస్తుతం ఇతని భార్య గర్భిణి. మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరారీ ఇదిలాఉండగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. లారీ బోల్తాపడడంతో వెంటనే క్యాబిన్ నుండి బయటపడిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పోలీసులు పట్టుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని బావిస్తున్నారు. క్రేన్ల సహాయంతో మృతదేహాల వెలికితీత లారీ కింద పడి నలిగిపోయిన మృతదేహాలను భారీ క్రేన్ల సహాయంతో వెలికి తీశారు. లారీ టైర్ల కింద నుంచి ఇద్దరు వ్యక్తుల కాళ్లు కనిపించడంతో ఇద్దరు మృతిచెందినట్లు మొదట భావించారు. క్రేన్ల సహాయంతో లారీని పైకి ఎత్తి ఇద్దరి మృతదేహాలను బయటకు తీస్తున్న క్రమంలో మరో మృతదేహం కనిపించింది. దీంతో పనస కాయాలను పక్కకు తొలగించి ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. తరువాత లారీని అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి క్రేన్ల సహాయంతో తరలించారు. డీఎస్పీ శ్రీధర్ పరిశీలన మహబూబ్‌నగర్ డీఎçస్పీ శ్రీధర్ ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబందించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు. కావేరమ్మపేట వద్ద రోడ్ అండర్‌బ్రిడ్జి పనులు కొనసాగుతుండడంతో ప్రధాన రహదారిని మూసివేసి సరీ్వస్రోడ్లపై రాకపోకలు కొనసాగించగా.. ప్రమాదం చోటుచేసుకుంది. తప్పిన మరో పెను ముప్పు లారీ ప్రమాదం అరగంట ముందు జరిగి ఉంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండేది. లారీ ఢీకొట్టిన ఇంటిలో మొత్తం పది మంది కుటుంబ సభ్యులు ఉంటారు. లారీ వీరి ఇల్లును ఢీకొట్టిన సమయంలో ఇంట్లో సాయమ్మ, భాగ్యలక్ష్మి మాత్రమే ఉన్నారు. వీరు స్వల్పంగా గాయపడ్డారు. అంతకు ముందే చంద్రకళ, శేఖర్, స్వప్న, కృష్ణయ్య హాస్టల్స్‌లో వంట పనులు చేసేందుకు వెళ్లారు. ఇక వీరి పిల్లలు నిహారిక, నమ్రత, అజయ్, పండు స్కూల్‌కు వెళ్లారు. వీరంతా ఇంటి నుంచి వెళ్లిన అరగంట తరువాత ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లయ్యింది. ఆర్యూబీ పనుల కారణంగానే..? జాతీయరహదారిపై ఆర్యూబీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తిరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయరహదారిని మూసివేసి సర్వీస్ రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి రాకపోకలు నిలచిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. -
అజాగ్రత్త; కారు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, అయిజ (మహబూబ్‌నగర్) : అజాగ్రత్తగా కారు నడపడంతో ఓ చిన్నారి కారు కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన అయిజలో చోటుచేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ కథనం ప్రకారం.. అయిజలోని బ్రాహ్మణవీధిలో రాజగోపాల్ అనే వ్యక్తి కారు వేగంగా నడుపుకొంటూ రాగా.. అకస్మాత్తుగా అడ్డువచ్చిన చిన్నారి ఇర్ఫాన్ (20 నెలలు)ను ఢీకొట్టాడు. దీంతో కారు ముందుభాగంలో టైరు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఖాజాబీ, కబీర్‌లకు ఒక కూతురు ఒక కుమారుడు ఉండగా కుమారుడు మృతిచెందాడు. దీంతో వారు దుఃఖసాగరంలో మునిగిపోయారు.చిన్నారి మృతదేహానికి గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కారు డ్రైవర్ రాజగోపాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎలా జరిగిందో తెలియదు.. కానీ చెల్లా చెదురయ్యాం
జడ్చర్ల: పెళ్లి వేడకకు హాజరై తిరిగి ఆటోలో వస్తుండగా.. ముందున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 11మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు..తిమ్మాజీపేట మండలం బాజీపూర్ గ్రామ సమీపంలోని తువ్వబండతండ, తుమ్మలకుంట తండాలకు చెందిన వారు ఆదివారం తిమ్మాజీపేటలో జరిగిన తమ బంధువుల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తంతు ముగించుకుని సోమవారం ఆటోలో జడ్చర్లకు బయలుదేరారు. ఆటోలో దాదాపు 15మంది దాక ఉన్నట్లు తెలుస్తుంది. తండాకు చెందిన వారంతా హైద్రాబాద్‌లో ఉపాధి నిమిత్తం నివాసం ఉంటుండడంతో హైద్రాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమను ఆటోలో జడ్చర్లలో విడిచి రావాలని ఆటో డ్రైవర్ సురేష్‌ను కోరడంతో వారిని ఎక్కించుకుని జడ్చర్లకు బయలు దేరారు. 10 నిమిషాల తరువాత తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుకగా ఆటో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. చికిత్స పొందుతూ ఇద్దరి మృతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లలిత(18), లక్ష్మణ్ (28) అనంతరం మృతిచెందారు. లలిత మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. లక్ష్మణ్ హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకుముందు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సురేష్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న తావుర్యా, బుజ్జి, లక్ష్మి, అనిత, బుజ్జాలి, వైష్ణవి, చరణ్,చింటూ, జాంప, ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108అంబులెన్స్‌లో బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్య చికిత్సలు నిర్వహించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న అనిత, వైష్ణవి, తావుర్యా, సురేష్‌ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పేర్కొంటున్నారు. అంతా తువ్వబండతండాకు చెందిన వారేనని, ఆటో డ్రైవర్ సురేష్ మాత్రం తుమ్మలకుంట తండాకు చెందిన వాడని బంధువులు తెలిపారు. చెల్లాచెదురయ్యాం ఆటో ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చిందని, తామంతా చెల్లాచెదరై రోడ్డుపై పడిపోయామని క్షతగాత్రులు ఈసందర్భంగా తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో, అసలేం జరిగిందో తెలియదని, తామంతా తీవ్ర గాయాలకు గురయ్యామని వారు కన్నీరు మున్నీరయ్యారు. లలిత మృతిచెందడంతో తల్లిదండ్రులు జంబ్రు, పాత్లావత్ తార్యా కన్నీరు మున్నీరయ్యారు, -
దారుణం: పెళ్లింట విషాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వివాహం జరుగగా అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా.. మద్దూర్ మండలం దోరేపల్లికి చెందిన రాధికతో వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం గౌరారం గ్రామానికి చెందిన నరేష్‌తో ఈ నెల 22న వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం పెళ్లి పందిరి తీసేందుకు నూతన దంపతులతోపాటు ఇరు కుటుంబాల వారు అబ్బాయి స్వగ్రామం గౌరారానికి బొలేరో వాహనంలో బయల్దేరారు. గండిహనుమాన్ తండా శివారులోకి రాగానే వాహనం జాయింట్ రాడ్ విరిగిపోయింది. దీంతో వాహనం పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ సంఘటనలో నూతన దంపతులతోపాటు మరో ఆరుగురి గాయాలు అయ్యాయి. ఇద్దరు పిల్లల కాళ్ళు విరిగిపోయి తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారందరిని 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పెళ్లికుమారుడు తల్లి భీమమ్మ, పెళ్లికూతురు తల్లి లక్ష్మమ్మల పరిస్థితి విషమంగా ఉంది. శివకుమార్ అనే ఏడేళ్ల బాలుడి కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి. వీరితోపాటు శ్రీకాంత్, లక్ష్మీ, అశోక్, రాధిక, నరేష్‌లకు సైతం గాయాలయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గాయపడ్డ చిన్నారులు -
కారు అతి వేగం.. తుఫాన్ డ్రైవర్ మృతి
సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): అతివేగంగా వచ్చిన ఓ కారు డివైడర్‌ను దాటుకుని పక్క రోడ్డుపై వెళ్తున్న తుఫాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాన్ ముందు భాగంలో కూర్చున్న వారంతా అందులోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. దాదాపు 30నిమిషాలపాటు పోలీసులు, స్థానికులు శ్రమించి వారిని బయటికి తీయగలిగారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. తీవ్రగాయాలైన డ్రైవర్ మృతిచెందాడు. మరో 13మందికి గాయాలుకాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అడ్డాకుల శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్తుంటే ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం తుఫాన్ వాహనంలో కొత్తకోటకు బయలు దేరారు. కర్నూల్‌కు చెందిన లక్ష్మిదేవి కారులో హైదరాబాద్‌కు వెళ్తోంది. అడ్డాకుల శివారులోకి వచ్చే సరికి కారు అదుపు తప్పి డివైడర్ మీదుగా దూసుకెళ్లి పక్క రోడ్డులో వెళ్తున్న తుఫాన్‌పై పడింది. దీంతో తుఫాన్ డ్రైవర్‌తో పాటు ముందు సీటులో కూర్చున్న వారు అందులో ఇరుక్కు పోయారు. వీరిని అడ్డాకుల ఎస్ నరేష్‌తో పాటు స్థానికులు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. తుఫాన్ డ్రైవర్ శ్రీనివాసులు(23) తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ముందు సీట్లో కూర్చున్న శంకరయ్య, యుగేందర్ తీవ్రంగా గాయపడ్డారు. అదే వాహనంలో ఉన్న లలితకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజ, నారాయణ, నాగప్ప, జ్యోతి, నర్సిములు, రాజు, వెంకటయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఉన్న లక్ష్మిదేవి, కుమారుడు అనువంశ్, ఆమె తల్లి రుక్మినమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మూడు అంబులెన్స్‌లలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుడు శ్రీనివాసులు భూత్పూర్ మండలం హస్నాపూర్ వాసి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. కారు వేగం వందకుపైనే.. ప్రమాద సమయంలో కారు వందకు పైగా వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అతివేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత పక్క రోడ్డుపైకి దూసుకెళ్లింది. తుఫాన్‌ను కారు నేరుగా ఢీకొట్టకుండా గాలిలోకి ఎగిరి దానిపై పడినట్లు ప్రత్యక్ష సాక్షి శివనారాయణ తెలిపారు. కారు ఎగిరి తుఫాన్‌పై పడగానే ముందు సీట్లో ఉన్న వారు అందులో ఇరుక్కోవడంతో తీవ్రగాయాలై డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలు డివైడర్ పైనే పడ్డాయి. -
వైద్యుల నిర్వాకానికి బలైన నిండు ప్రాణాలు..
సాక్షి, మహబూబ్‌నగర్ : వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలో కొందరు ప్రైవేట్ వైద్యుల నిర్వాకంతో బాలింతతో పాటు నవజాత శిశువు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని గొల్లబండతండాకు చెందిన రాజేశ్వరి ప్రసవం కోసం గురువారం పట్టణంలోని వన్‌టౌన్ సమీపంలోని శ్రీలతరెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో పని చేసే వైద్యులు రాజేశ్వరికి ఆపరేషన్ చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అధిక రక్తస్రావం, ఇతర కారణాల వల్ల మొదట బాలింత మృతి చెందగా.. కొద్ది నిమిషాల్లోనే నవజాత శిశువు కూడా మృతి చెందింది. బాలింత రాజేశ్వరి మృతదేహం ఆస్పత్రి అద్దాలు ధ్వంసం బాలింత రాజేశ్వరి, శిశువు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ధర్నా చేశారు. ఆస్పత్రికి సంబంధించిన కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి వన్‌టౌన్ పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయంపై సంబంధిత వైద్యురాలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అందరూ అర్హత కల్గిన వైద్యులే పని చేస్తున్నారని, అధిక రక్తస్రావం వల్లే బాలింత మృతి చెందిందని, దీంట్లో వైద్యుల తప్పులేదని చెప్పారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులతో సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు భేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
సాక్షి, మక్తల్(మహబూబ్‌నగర్): లంచం తీసుకుంటూ మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ హబీబొద్దిన్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ రైతు తాను కొనుగోలు చేసిన భూమిని తమ పేర రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరగా.. రూ.75వేలు డిమాండ్ చేశాడు. ఈమేరకు సదరు రైతు ఏసీబీ అధికారులకు విషయం చెప్పాడు. చివరికి ఓ మధ్యవర్తి ద్వారా లంచం డబ్బులను తీసుకోగా.. సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను, మధ్యవర్తిని గురువారం ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేశారన్న విషయం తెలియడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. 18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విషయమై.. హైద్రాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన రైతు వెంకట్‌రెడ్డి మక్తల్ మండలం సంగంబండకి చెం దిన రైతుల దగ్గర సర్వే నంబర్ 200లో 18 ఎకరాల భూమిని ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ భూమిని తాను, తన సోదరుడి పేర్లపై రిజిస్ట్రేష న్ చేసుకునేందుకు రెండు సార్లు కార్యాలయాని కి వెళ్లి విన్నవించాడు. ఎంతకూ సదరు సబ్రి జిస్ట్రార్ హబీబొద్దీన్ లెక్కచేయలేదు. అసలు వి షయం కనుక్కునేందుకు కొందరిని సంప్రదిం చాడు. దీంతో ఓ మధ్యవర్తి లంచం డిమాండ్ చేశాడు. ఎన్నో భేరసారాల తర్వాత చివరికి రూ.75వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని సదరు అధికారి పేర్కొన్నాడని తెలిపారు. దీంతో చేసేది లేక మొదట పని పూర్తి చేయాలని, తర్వాత డబ్బు ఇస్తానని రైతు పేర్కొన్నాడు. గతంలో ఇద్దరు అధికారులు గత 15ఏళ్ల క్రితం మక్తల్‌కు చెందిన రైతు భూమి రిజిస్టేషన్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఇదే కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులకు పట్టించారు. అలాగే, మూడేళ్ల క్రితం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓను ఏసీబీ చేతికి పట్టించారు. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్ హబీబోద్దీన్ను పట్టుకోవడంతో ఏసీబీ దాడులు నిర్వహించడం పట్టణంలో మూడోసారి అవుతుంది. వల పన్ని పట్టుకున్నారిలా.. ఈమేరకు 18ఎకరాల భూమిని రైతు వెంకట్‌రెడ్డి, అతని సోదరుడి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారి హబీబోద్దీన్తో ఈ నెల 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు ఈ నెల 14వ తేదీన భూమి రిజిస్ట్రేషన్ చేయించారు. పని పూర్తయ్యిందని, ఒప్పందం ప్రకారం లంచం డబ్బులు ఇవ్వాల్సిందిగా రైతును కోరారు. వెంటనే రైతు జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులకు 1064 నంబర్‌కు ఫోన్ చేసి అక్కడికి వెళ్లిన వారిని ఆశ్రయించారు. వారి పథకం ప్రకారం.. గురువారం మక్తల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తమ భూమికి సంబందించిన పత్రాలను తీసుకునేందుకు రైతు వచ్చాడు. ఈమేరకు సబ్ రిజిస్ట్రార్ హబీబొద్దిన్ దగ్గర ఉండే మక్తల్‌కు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి అరీస్కు రైతు వెంకట్‌రెడ్డి రూ.75వేలు అందజేశాడు. అనంతరం డబ్బులను అరిస్ సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చాడు. ఏసీబీ అధికారులు వేసిన పథకం ప్రకారమే రైతు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, సీఐలు ప్రవీణ్‌కుమార్, లింగంస్వామి సబ్‌రిజిస్ట్రార్‌ను తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారి చేతులు కడిగించి ఎరుపు రంగు రావడంతో సబ్‌రిజిస్ట్రార్ హబీబోద్దిన్, అతనికి సహకరించిన అరిస్.. ఇద్దరిని పట్టుకున్నారు. సాయంత్రం 6.30 వరకు కార్యాలయంలోనే విచారణ జరిపి అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రతాప్ విలేకర్లకు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు సంప్రదించాలని ఆయన సూచించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొ దర్యాప్తు జరుపుతామని తెలిపారు. కార్యాలయంలో.. అంతా ఇష్టారాజ్యం మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అసలు సమయ పాలనే లేదు. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు వస్తే అప్పుడే రిజిస్టేషన్ చేయాలి. చాలామటుకు లావాదేవీలన్నీ ఫోన్లు, మరికొందరు దళారులు, కార్యాలయం వద్ద ఉన్న కొందరు డాక్యుమెంట్ షాపులకు చెందిన వారి ద్వారానే జరిగేవని పేర్కొంటున్నారు. ఇక్కడికి ఏ అధికారి వచ్చినా డబ్బులు ఇస్తేనే పనులు చేయండని.. గతంలో అధికారులు ఇలాగే ఉండేవారని, మీరు కూడా అదే బాటలో నడవాలని కొందరు దళారులు మాయమాటలు చెప్పి నడిపించేవారని కింది స్థాయి అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో డబ్బులిస్తేనే పని అవుతుందని, చేయి తడపకపోతే వారికి కంప్యూటర్ పని చేయడంలేదు, సర్వర్ పనిచేయడంలేదంటూ ముప్పతిప్పలు పెట్టేవారని ప్రజలు వివరిస్తున్నారు. -
క్షణికావేశంతో ఛిద్రమవుతున్న జీవితాలెన్నో..
క్షణికావేశం నిండు జీవితాన్ని బలితీసుకుంటోంది. ఓ చోట ఎన్నోఆశలతో పెంచిన కొడుకు, మరోచోట కడవరకు తోడుంటానంటూ ఏడడుగులు వేసి ప్రమాణం చేసిన భర్త, ఇంకోచోట అన్నీతానై కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటిపెద్ద... ఆత్మహత్యే తమ సమస్యకు పరిష్కారంగా భావించి తనువు చాలిస్తున్నారు. కుటుంబసభ్యులకు తీరని మనోవేదన మిగుల్చుతున్నారు. సాక్షి, వనపర్తి: చిన్నచిన్న కారణాలతో క్షణికావేశానికి లోనవుతూ...ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. కారణం ఏదైనా దాన్ని పరిష్కరించుకోలేక నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా..ప్రేమ విఫలమైనా కుటుంబంలో కలహాలు, పరీక్షల్లో తప్పడం.. వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయం...ఆ వ్యక్తి కుటుంబంలో పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తోంది. చనిపోతున్న వారిలో మహిళలు, పురుషులే కాకుండా యువకులే ఎక్కువగా ఉన్నారు. కష్టనష్టాలు, అపజయాలు, కుటుంబకలహలు తదితర సమస్యలు ఎదురైనప్పుడు మనోవేదనకు గురై చావే శరణ్యమనుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇవీ లక్షణాలు... ఆత్మహత్యకు పాల్పడేవారు దేనిపై శ్రద్ధచూపరు. మానసికంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకొని జీవితంపై విరక్తి కలిగినట్లుగా కనిపిస్తారు. ఆందోళన, నిద్రలేకుండా ఉండటం, కంగారు పడటం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నచిన్న కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు.. ఉద్యోగం రాలేని నిరుద్యోగి... పరీక్షా తప్పానని వి ద్యార్థి... భర్త తిట్టాడని భార్య.. భార్య కాపురానికి రాలేదని భర్త... చేయని నేరానికి నిందమోపారని ఒకరు...ఆరోగ్యం బాగోలేదని మరోకరు ఇలా క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 18నుంచి 35 ఏళ్లలోపు వారే.. ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో 18 నుంచి 35ఏళ్ల లోపువారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారమార్గం అంటూ ఏదో ఉంటుంది. అది తెలియక ఎందరో వ్యక్తులు తొందరపాటుకు గురవుతూ జీవితాన్ని ముగిస్తున్నారు. కుటుంబకలహాలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, చిన్న చిన్నగొడవలు, భూసమస్యలు, ఆస్తి తగాదాలు, ఇలా కారణం ఏదైనా ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తున్నారు. 2017లో 82మంది క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోగా..అందులో 23మంది మహిళలు, 59మంది పురుషులు ఉన్నారు. అలాగే 2018లో 107 ఆత్మహత్య చే సుకోగా ..అందులో 33మంది మహిళ లు, 74మంది పురుషులు ఉండగా... 2019లో ఇప్పటివరకు 62మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 18మంది మహిళలు, 46మంది పురుషులు ఉన్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 74మంది మహిళలు, 173మంది పురుషులు ఉన్నారు. ఇందులో యువకులే అధికంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వివిధ కారణాలతో ఆత్మహత్యలు.. 2019 నవంబర్ 3న వనపర్తి మండలం చందాపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బాలరాజు(28) గత కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురై మిషన్ భగీరథ ట్యాంకు దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 8న మదనాపురం మండలం సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్(17) ల్యాబ్‌రూం ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవంబర్ 9 ఘనపురం మండలం అప్పారెడ్డిపల్లిలో బాష(24) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 18న ఘనపురం మండలం సల్కెలాపురంతండాలో పవన్(15) విద్యార్థి పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రితోపాటు ఊరు తీసుకెళ్లలేదనే మనస్థాపంతో విద్యార్థి పవన్ పురుగులమందు తాగాడని గ్రామస్తులు తెలిపారు. గమనించిన తండావాసులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెప్టెబంర్ 18న గోపాల్పేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన పద్మమ్మ (76) తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె భర్త కూడా చనిపోవడంతో తీవ్రవనస్థాపానికి గురైన పద్మమ్మ ఒంటిపై కిరోసిన్ నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు గమనించి వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో మృతిచెందింది. సెప్టెంబర్ 17న వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి చెందిన వెంకటయ్య (40) తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేలోపు మృతిచెందాడు. అప్పులబాధ ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సెప్టెంబర్ 10న వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి తిరుపతమ్మ కుటుంబసమస్యల కారణంగా పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించడంతో ఆమె కోలుకుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి చిన్న సమస్యకు చావే శరణ్యమని భావిస్తే ఎట్లా, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. వారి అభిరుచులు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం శ్రద్ధచూపాలి. సరైన సంబంధాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో ఒంటరిగా ఫీలవుతారు. దీంతో సమాజంలో మెలిగే స్వభావాన్ని కోల్పోయి తన సమస్యను ఎవరికి చెప్పుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశానికి గురికాకుండా జీవితంలో ఎలా ఎదగాలో ఆలోచించాలి. – కిరణ్‌కుమార్, డీఎస్పీ, వనపర్తి -
ఇద్దరిని బలి తీసుకున్న అతివేగం
సాక్షి, దేవరకద్ర(మహబూబ్‌నగర్): తక్కువ సమయంలో గమ్యం చేరుకోవాలని.. అతివేగంతో వాహనం నడుపుతూ వచ్చాడు డ్రైవర్. స్పీడ్ పెరుగుతున్న కొద్దీ వాహనం అదుపు చేయలేకపోయాడు.. ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మరో మహిళ మృతిచెందగా.. 10మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం దాదాపు 100పైగా స్పీడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ట్యాక్సీతుఫాన్ వాహనం సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులను ఎక్కించుకొని హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు బయల్దేరింది. ఈ క్రమంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ దగ్గరకు రావడంతో వేగంగా ఉన్న వాహనం అదుపు తప్పి రోడ్డుకు దాదాపు 20 మీటర్ల దూరం పల్టీలు కొడుతూ చివరకు చెట్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న 12మందికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఇరువురి మృతి విషయం తెలుసుకున్న పోలీసులు, ఎల్అండ్టీ సిబ్బంది వెంటనే క్షతగాత్రులను 108వాహనంలో జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన అనంతరం తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ శేఖర్(27) మృతిచెందాడు. అలాగే, కోమాలోకి వెళ్లిన కర్నూల్ జిల్లా డోన్‌కు చెందిన మరో ప్రయాణికురాలు జయంతి(35)రాత్రి 7గంటల ప్రాంతంలో మృతి చెందారు. గాయపడ్డ వారి వివరాలు.. వాహనం బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో మానవపాడు మండలానికి చెందిన భార్య భర్తలు సంధ్య, మునిస్వామి, రాజస్థాన్‌కు చెందిన గజేందర్, గోవర్ధన్ ఉన్నారు. వీరితోపాటు కర్నూల్ జిల్లా కల్లూర్‌కు చెందిన భార్యభర్తలు సఫియా, బడేసాహెబ్, బిహార్‌కు చెందిన అల్లావుద్దీన్, కర్నూల్ జిల్లా బుద్వేల్‌కు చెందిన పద్మావతి, నర్దానా, కర్నూల్‌కు చెందిన వినయ్‌కుమార్‌తో మరో మహిళకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
ముందు లిఫ్టు అడిగి.. వెనకాలే ఆటోలో వచ్చి..!
సాక్షి, జడ్చర్ల: రహదారులపై వెళ్తున్న ద్విచక్రవాహనాలను లిఫ్టు అడిగి కొంతదూరం వెళ్లాక ఆపి చోరీకి పాల్పడే దారి దోపిడీ దొంగల ముఠాను పట్టుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వీరస్వామి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అఖిల్ కృష్ణ, అంకం భాస్కర్, పాస్టం కల్యాణ్, రాపల్లె చంద్రుడు, వడిత్యావత్ శివ, శివగళ్ల రాజ్‌కుమార్, నాయిడు దుర్గరాజ్‌కుమార్‌లు ఓ ముఠాగా ఏర్పడి ఆటోలో ప్రయాణిస్తూ దారిపై ఒంటరిగా వస్తున్న మోటార్‌బైక్‌లను ఆపుతారు. బైక్ ఆపితే వారిలో ఒకరు దానిపై ఎక్కి కొద్ది దూరం వెళ్లాక బైక్‌ను ఆపడం ఆ వెంటనే వెనకగా ఆటోలో వచ్చిన మిగతా దొంగలు అందరూ కలిసి లిఫ్టు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న బైక్, నగదు, మొబైల్ ఫోన్ తదితర సొత్తును దోచుకుని పరారవుతారు. ఈ క్రమంలో ఈ నెల 10న బూర్గుపల్లికి చెందిన కుమ్మరి రాములు బైక్‌పై వస్తుండగా లిఫ్టు అడిగి నాగసాల గ్రామ శివారులో ఆపి అతని దగ్గర రూ.1,800 నగదు, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెళ్లడించారు. ఈ క్రమంలో మంగళవారం వాహనాలను స్థానిక నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడిందన్నారు. అంతకు ముందు తిమ్మాజిపేట మండలంలో కూడా ఇదే విధంగా లిఫ్టు ఆపడం, కొద్ది దూరం వెళ్లాక బైక్ ఆపడం వెనువెంటనే వెనుకగా ఆటోలో వచ్చి బెదిరించి బైక్, సొమ్ము తదితర సొత్తును దోచుకెళ్లినట్లు చెప్పారు. నిందితుల నుంచి మూడు బైక్‌లు, ఆటో, మొబైల్ ఫోన్, రూ.1,200 నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం జడ్చర్లకు వచ్చి టిఫిన్ సెంటర్ తదితర ఉపాధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. వీరికి బాదేపల్లికి చెందిన యువకులు కూడా సహకరించి చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుళ్లు మహేందర్, మహమూద్, కానిస్టేబుళ్లు బేగ్, శంకర్, రఘునాథ్‌రెడ్డి, బాబియా తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య
జడ్చర్ల: కళాశాలకు వెళ్లకపోవడంతో తన తల్లి స్నేహితురాలిని మందలించిందని, తమ తల్లిదండ్రులు కూడా తనను కొడ తారేమోనని భయపడిన ఓ ఇంటర్ వి ద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. జడ్చర్లలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం .. శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటు న్న అశోక్, ఉమాదేవి కూతురు శ్రేయ (16) మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశా లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే శనివారం అదే కాలనీలో ఉంటున్న తన స్నేహితురాలితో కలిసి బయలుదేరారు. కళాశాలకు చెందిన బస్సు ముందుగానే వెళ్లిపోవడంతో వారు ఆటోలో కళాశాలకు వెళ్లారు. కళాశాలకు ఆలస్యంగా వచ్చారని, అధ్యాపకులు వారిని తరగతి గదిలోకి అనుమతించలేదు. దీంతో వారు వెనుతిరిగి ఇం టికి వచ్చారు. ఇంటికి చేరుకున్న శ్రేయ, స్నేహితురాలిని ఆమె తల్లి అడగగా.. ఆలస్యంగా వెళ్లడంతో తిప్పిపంపారని చెప్పింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రేయ ముందే స్నేహితురాలి మీద ఆమె తల్లి చేయి చేసుకుంది. దీంతో తన తల్లిదం డ్రులు కూడా కొడతారేమోనని భయపడిన శ్రేయ ఇంటికి వచ్చి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తర్వా త ఇంటికి వచ్చిన తండ్రి అశోక్ తలుపు తట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన ఇంటి వెంటిలేటర్ గుండా లోపలికి చూడగా.. బెడ్రూ ంలో శ్రేయ ఆత్మహత్యకు పాల్ప డిందని గుర్తించి.. వెంటిలేటర్ ఇనుప చువ్వలను తొలగించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందింది. శ్రేయ తండ్రి అశోక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా.. తల్లి ఉమాదేవి నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. వీరికి శ్రేయతోపాటు ఒక కుమారుడు ఉన్నారు. అకారణంగా తమ కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
విద్యార్థుల అదృశ్యం..కల్వకుర్తిలో ప్రత్యక్షం
సాక్షి, కల్వకుర్తి(మహబూబ్‌నగర్) : స్థానిక గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినుల అదృశ్యం కథ సుఖాంతమైంది. బాలికలు అమ్రాబాద్‌లో క్షేమంగా పట్టుబడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా.. కల్వకుర్తిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు రాజేశ్వరి, పావని, సుజాత, నాగేశ్వరి ఈ నెల 26న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమ సామగ్రిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. అదేరోజు అర్ధరాత్రి కల్వకుర్తి బస్టాండ్‌లో సంచరిస్తున్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు నమోదైంది. అయితే పాఠశాలలోని సీసీ కెమెరాల్లో మాత్రం ఈ దృశ్యాలు నమోదు కాలేదు. ఈ నెల 27న దీపావళి పండుగ కావడంతో వారిని ఎవరూ గుర్తించలేదు. చివరికి మధ్యాహ్నం సమయంలో ఆ నలుగురు విద్యార్థినులు పాఠశాలలో లేరని సిబ్బంది తెలుసుకుని పాఠశాల ప్రిన్సిపాల్ విజయరాంరెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని తల్లిదండ్రులకు తెలియజేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సావిత్రమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురుకులాల కార్యదర్శి ఆరా ఈ ఘటనపై రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరా తీశా రు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం ఐటీడీఏ పీఓ వెంకటయ్య, గిరిజన పాఠశాలల ఆర్సీఓ కల్యాణిని పాఠశాలకు వెళ్లి అక్కడి సిబ్బంది, తోటి వి ద్యార్థినులతో వివరాలు సేకరించారు. ఇక గిరిజన గురుకుల పాఠశాలలో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా ప నిచేయడం లేదు. ఈ ఘటనపై దృశ్యా లు ఏవీ అందులో రికార్డు కాలేదు. ఈ పాఠశాల నుంచి తప్పిపోయిన విద్యార్థిని సుజాతకు సోమవారం హాజరుపట్టికలో ఉపాధ్యాయులు హాజరు వేయడం గమనార్హం. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా పాఠశాల సిబ్బంది బయటకు పొక్కనీయలేదు. చివరకు పోలీసులతోపాటు తల్లిదండ్రులకు సైతం విషయాన్ని ఆలస్యంగా తెలియజేశారు. ఈ నలుగురు విద్యార్థినులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వారి ట్రంకు పెట్టెల్లో దొరికిన కొన్ని పత్రాలు, నోట్‌బుక్స్‌లో ఫోన్ నంబర్లు, ఉత్తరాల ఆధారంగా అలవాట్లను పాఠశాల సిబ్బంది వివరించారు. -
ధర్నా చేస్తే క్రిమినల్ కేసులు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపట్టిందని, ప్రజలకు అసౌకర్యం కల్పించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు చట్టానికి లోబడి నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. సమ్మె చేసే ఆర్టీసీ కార్మికులను ఇక ముందు డిపో వద్దకు గానీ, బస్టాండ్ గేట్ల వద్దకు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని పేర్కొన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం, బస్సుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు హెచ్చరించారు. సమ్మె సందర్భంగా చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. వారిపై నమోదైన కేసు వివరాలను సంబంధిత అధికారులకు పంపుతామని వెల్లడించారు. ఇలాంటి కేసులు నమోదు కావడం వల్ల ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక బలగాల మోహరింపు మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇప్పటికే కొన్ని సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, మంగళవారం మరో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ వివరించారు. గొడవ లు సృష్టించి ప్రయాణికులకు ఆటంకం కలిగిం చే వారి వివరాలు నిఘా కెమెరాల ద్వారా ప్రత్యే క సాక్ష్యాలుగా స్వీకరిస్తామన్నారు. సమ్మె చేస్తు న్న ఆర్టీసీ కార్మికులను బస్టాండ్, బస్ డిపో పరి సరాల్లోకి అనుమతించమన్నారు. జిల్లాలోని అ న్ని రహదారులపై ప్రత్యేక బలగాల పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపడుతామని, పోలీ సు బందోబస్తుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీఎస్పీలు భాస్కర్, సాయిమనోహర్ పాల్గొన్నారు. -
అత్యాశే కొంపముంచింది
సాక్షి, వనపర్తి: అత్యాశ పతనానికి దారితీస్తుందన్న విషయం మరోసారి నిరూపితమైంది. రూ.వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు పేద, ధనిక అనే తేడా లేకుండా లంచం కోసం వేధించటం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఓ చిన్న పనికోసం ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకున్న వనపర్తి మైన్స్‌శాఖ ఏడీ జాకబ్ మరో రూ.20 వేల కోసం అత్యాశపడి చివరికి ఏసీబీ వలకు శుక్రవారం చిక్కిన సంఘటన వనపర్తిలో సంచలనం రేకెత్తిస్తోంది. ఏసీబీ డీఎస్పీలు ఫయాజ్, శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన దిలీపాచారికి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో మినరల్స్ క్వారీ ఉంది. దానిని మరో కంపెనీకి విక్రయించిన దిలీపాచారి మైన్స్‌క్వారీని శ్రీ సాయి మినరల్స్ అండ్ మైన్స్ నుంచి మరో సంస్థ పేరున మార్చాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. తనిఖీ.. ఐదురెట్లు అదనంగా ఫైన్ ఇదిలాఉండగా, క్వారీని తనిఖీ చేసిన మైన్స్ ఏడీ జాకబ్ చెల్లించాల్సిన రాయల్టీకి ఐదురెట్లు అదనంగా ఫైన్ వేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఫై న్ వేసేందుకు కారణమేంటి నేను ప్రభుత్వ నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ చేస్తున్నానని బాధితుడు అధికారిని అభ్యర్థించగా రూ.ఒక లక్ష లంచం ఇవ్వమని ఏడీ కోరాడు. దీంతో సె ప్టెంబర్ 27వ తేదీన స్థానికంగా ఉన్న మైన్స్ ఏడీ జాకబ్ దిలీపాచారిని తన ఇంటికి పిలిపించుకుని రూ.ఒక లక్ష లంచం తీసుకున్నాడు. అయినా కూడా పనిచేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు. శుక్రవారం ఆర్ఐకి ఇవ్వాలంటూ మరో రూ.20వేలు తీసుకురమ్మని ఏడీ కోరాడు. దీంతో బాధితుడు దిలీపాచారి తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. పథకం ప్రకారం పట్టుకున్నారు.. ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకుని పనిచేయకుండా రోజూ ప్రదక్షణలు చేయిస్తూ ఇంకా లంచం కావాలని వేధించటంతో బాధితుడు దిలాపాచారి ఏబీసీ అధికారులను ఆశ్రయించారు. వారు పౌడర్ చల్లిన నోట్లను బాధితుడికి ఇచ్చారు. మైన్స్‌ఏడీ జాకబ్ ఆ నోట్లని తెలియక లంచంగా తీసుకుని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బాధితుడితో లంచం తీసుకున్న వెంటనే వనపర్తిలోని కార్యాలయం సమీపంలో కాచుకుని ఉన్న సుమారు 20 మంది ఏసీబీ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా.. దాడి చేసి జాకబ్‌ను పట్టుకున్నారు. జాకబ్‌తో పాటు లంచంలో భాగస్వామ్యం ఉన్న సాయిరాంను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను లాక్కున్నారు. ఇల్లు, కార్యాలయంలో సోదాలు మైన్స్ ఏడీ లంచావతారంపై ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు ఆఫీస్‌తో పాటు అతని ఇంట్లోను సోదాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ లంచం తీసుకుంటూ పట్టుబడగానే హైదరాబాద్‌లోని తన నివాసంలోనూ సోదాలు ప్రా రంభించినట్లు ఏబీసీ అధికారులు తెలిపారు. -
మాటలు కలిపి.. మాయ చేస్తారు!
సాక్షి, బోధన్: ఆర్టీసీ బస్టాండ్లలో దుండగులు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రయాణికులను గమనించి ప్రణాళిక ప్రకారం నగదు, ఆభరణాలను దోచుకుంటున్నారు. నవీపేట, నిజామాబాద్‌లలో ఇటీవల జరిగిన రెండు వరుస సంఘటనలతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి జంకుతున్నారు. నవీపేటలోని బస్టాండ్‌లో పది మంది మహిళా ముఠా సభ్యులు పథకం ప్రకారం చోరీలు చేస్తున్నారు. గల్లీల్లో పూసలు(మహిళల అలకంరణ కోసం) అమ్ముకుంటామని ఇంటికి తిరిగి వెళ్తున్నామని, బస్సు కోసం చూస్తున్నామని తోటి ప్రయాణికులను నమ్మించారు. బస్సెక్కే సమయంలో ఓ ప్రయాణికురాలి చేతిలో ఉన్న బ్యాగును కొట్టేసేందుకు ప్రయత్నించగా సదరు మహిళ ప్రతిఘటించింది. ఆ బ్యాగులో రూ.3 లక్షల నగదు ఉండడంతో ఊపిరి పీల్చుకున్న సదరు ప్రయాణికురాలు హడావుడిగా నిజామాబాద్‌కు వెళ్లిపోయింది. తమ పని కాలేదని భావించిన మహిళా దుండగులు ముఠా సభ్యులు మరో ప్రయాణికుడి కోసం గాలం వేశారు. బట్టల దుకాణంలో మునీమ్‌గా పని చేసే నారాయణ అనే వ్యక్తి రూ.48 వేల నగదుతో బస్టాండ్‌కు వచ్చాడు. అతడితో మాటలు కలిపిన మహిళలు నగదుతో ఉన్న బ్యాగును ఎత్తుకుని ఆటోలో పారిపోయారు. ఈ ముఠాలోని కొందరు సభ్యులను స్థానికులు పట్టుకున్నారు. ఎనిమిది మంది మహిళా ముఠా సభ్యులను పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీలపై విచారిస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చిన ప్రభుత్వ టీచర్ స్రవంతి దగ్గర 13 తులాల బంగారు ఆభరణాలను కొట్టేశారు. బస్సు దిగే సమయంలో ఒకరినొకరు తోపుకుంటూ ఆత్రుతగా దిగే ప్రయత్నంలో దొంగలు సునాయసంగా బ్యాగులో ఉన్న బంగారాన్ని అపహరించారు. రాకపోకలను గమనించి మాటేస్తారు.. బస్టాండ్లలో చోరీలకు ఈజీగా ఉంటుందని కొందరు మహిళా ముఠా సభ్యులు బస్టాండ్లను అనువుగా ఎంచుకున్నారు. గ్రామాల్లోని గల్లీలో తిరుగుతూ వ్యాపారాలు చేసే మహిళలు పనిలో పనిగా మహిళల రాకపోకలను గమనిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? అని మాటలు కలుపుతున్నారు. నవీపేటకు చెందిన మహిళ చీటీ డబ్బులను తీసుకుని వెళ్తుండగా గమనించిన ముఠా మహిళలే పథకం ప్రకారం చోరీకి యత్నించి విఫలమయ్యారు. గ్రామాల్లో ఇలాంటి వ్యాపారాలు చేసే మహిళల రాకపోకలు ఎక్కువవుతున్నాయి. అల్యూమీనియం వంట పాత్రల విక్రయాలు, జిప్పుల మరమ్మతులు, పిల్లలు ఆడుకునే బుగ్గలను అమ్మే మహిళల్లో కొందరు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారు. బస్సు ఎక్కి, దిగే సమయంలోనే.. ముఠా సభ్యులు ప్రయాణికులు రద్దీగా ఉండే సమయంలోనే చోరీలు చేస్తున్నారు. బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులు ఒక్కసారిగా బస్సెక్కే సమయంలో తమ వద్ద ఉన్న వస్తువులపై తాత్కాలిక నియంత్రణ కోల్పోతారు. ఆత్రుతలో ఏం జరుగుతుందో గమనించలేకపోతున్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారే గానీ చోరీ తంతులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ లోపాలను ఆసరాగా చేసుకున్న దుండగులు అవలీలగా చోరీలు చేస్తున్నారు. నవీపేట, నిజామాబాద్ బస్టాండ్లలో చోరీలు ఇలాగే జరిగాయి. విచారిస్తున్న పోలీసులు నవీపేటలో ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళా నిందితులు(ఫైల్) నవీపేట బస్టాండ్‌లో చోరీకి పాల్పడి హల్చల్ చేసిన పది మంది మహిళా ముఠాలోంచి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీపుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గతంలో ఎక్కడెక్కడా చోరీలు పాల్పడ్డారు, ఎంత మంది ముఠాలో ఉన్నారనే విషయమై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఎనిమిది మందిలోంచి ఆటోలో పారిపోయిన మరో ఇద్దరి వివరాలు కోసం పోలీసులు విచారిస్తున్నారు. బస్టాండ్‌లోనే చోరీలు జరగడంతో పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఆర్టీసీ బస్టాండ్లలోనే తరచూ చోరీలు చోటు చేసుకుంటున్నాయి. బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సూచించాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటివారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బస్సు ఎక్కే, దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. –శ్రీనాథ్‌రెడ్డి, అర్బన్ టౌన్ సీఐ, నిజామాబాద్ -
రూ.7లక్షలకే కేజీ బిస్కెట్ బంగారం అంటూ టోకరా
సాక్షి, గద్వాల: ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. 24కార్యెట్స్ బంగారు బిస్కెట్ కేజీ రూ.7లక్షలకే అది కూడా మీకు కాబట్టి ఈ ధరకు ఇస్తాం.. వేరే వాళ్లకైతే అస్సలు ఇవ్వదల్చుకోలేదంటారు. బయటి మార్కెట్లో మెలిమి బంగారం కేజీ ధర రూ.37లక్షల 64 వేలు.. కావాలంటే తెలుసుకో.. ఈ సదవకాశం మళ్లీ దొరకదు అంటూనే ఫోన్ కట్. ఇవతల హాల్లో.. హాల్లో అంటూ అయోమయంలో సదరు వ్యక్తి తిరిగి అదే నంబర్‌కు ఫోన్ చేయడంతోనే అసలు సిసలు ట్విస్టులతో మోదలై.. చివరికి మాయగాళ్ల ఉచ్చులో పడి నిండా మోసపోతున్నారు. నడిగడ్డలో ఇటీవల ఓ వ్యక్తి ఫిర్యాదుతో మాయగాళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. వలపన్ని దోచేస్తున్నారు.. నడిగడ్డ జిల్లా ప్రజలను టార్గెట్ చేసుకుని కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు. ధరూర్ మండలం గుడ్డెందొడ్డికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ ఆశ చూపి, మేం చెప్పిన స్థలానికి రావాలని చెప్పి నమ్మించి మోసగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలు జిల్లాను ఆనుకొని ఉండడంతో మాయగాళ్లు ఇలా మోసగించి అలా రాష్ట్రం దాటిపోతున్నారు. దీంతో మోసం జరిగిన ప్రాంతం ఇక్కడి రాçష్ట్రంలో కాదు కేసును ఎలా ముందుకు తీసుకువెళ్తామంటూ పోలీసులు సంశయిస్తున్నారు. ఇదే అదునుగా మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. వరుస ఘటనలతో బెంబేలు 2019 సెప్టెంబర్ నెలలో ధరూర్ మండలం గుడ్డెందొడ్డికి చెందిన ఓ వ్యక్తికి కర్నాటకు చెందిన ముఠా సభ్యులు కేజీ బంగారం తక్కువ ధరకే ఇస్తమని చేప్పడంతో ఇది నిజమని నమ్మి రూ.15 లక్షలు మోసపోయాడు. 2019 మార్చి నెలలో గద్వాల పట్టణానికి చెందిన ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ నడుపుతున్న వ్యాపారికి కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులు కేజీ బంగారం రూ.7లక్షలకే ఇస్తానని చెప్పారు. ఇది నిజమని నమ్మి కర్ణాటకకు రూ. 7లక్షల నగదుతో వెళ్లి మోసపోయాడు. చివరికి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. 2018 ఫిబ్రవరిలో ఏపికి చెందిన కొంత మంది ముఠా సభ్యులు గద్వాలకు చెందిన ఓ బంగారు వ్యాపారితో తక్కువ ధరకే బంగారం అమ్ముతామని చెప్పి సదరు వ్యక్తితో రూ.7లక్షలు తీసుకుని ఉడాయించారు. దంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డ్ బిస్కెట్లే అస్త్రంగా.. కొందరి అత్యాశను తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు ముఠాసభ్యులు. బంగారం తక్కువ ధరకు ఇస్తామంటే ప్రజలు ఈజీగా నమ్ముతారని ముఠా సభ్యుల ప్రణళికలు వేసి ఆమేరకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు మొదట నమ్మకం కలిగేలా ఒక బిస్కెట్‌ను అసలు బంగారు బిస్కెట్‌ను అందిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డబ్బులు తీసుకుని బంగారం కొనేందుకు వచ్చిన వ్యక్తిని వెన్నుపోటు పొడవడం ముఠా సభ్యులకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంది. ముఠాను నడిపించేది ఎవరు? గత కొన్నెళ్లుగా నడిగడ్డలో ప్రజలు పలు మోసాలకు గురవుతున్నారు. అయితే మోసానికి పాల్పడే ముందే ఇక్కడి ప్రజల తీరు తెన్నులు, ఆర్ధిక అంశాలు, ఒకవేళ ఆ వ్యక్తితో ప్రస్తావిస్తే బయటికి చెబుతుడా అనే తదితర అంశాలను పూర్తిగా నమ్మిన తర్వాతే ఇక్కడి కేటుగాళ్ల అక్కడి ముఠా సభ్యులకు చెరవేస్తారని తెలుస్తుంది. దీనికితోడు కేసు నమోదు చేసుకోవాల్సిన పరిస్ధితి ఉన్నా, నేరం జరిగిన ప్రాంతామే ప్రామాణికం కావడంతో పోలీసులకు కేసు ఛేదనలో అనేక అటుపోట్లు ఉంటాయనేది బాధితుని మనోవేదన. చర్యలు తీసుకుంటాం మోసం జరిగితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. అలాగే, తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పడం బాధితులు గ్రహించాలి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని బాధితులకు న్యాయం చేస్తాం. ఏ రాష్ట్రంలో ఉన్నా నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్కడి ముఠా సభ్యులకు ఇక్కడి వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిన వారిపై కూడా కేసు నమోదు చేస్తాం. ఇలాంటి వ్యవహరంలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు. – షాకీర్ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల -
పెట్రోల్, డీజిల్‌లో జోరుగా కల్తీ
ధనార్జనే లక్ష్యంగా.. కొందరు బంకు యజమానులు పెట్రోల్, డీజిల్‌ను కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటుండగా.. మరికొందరు నిబంధనలకు పాతరా వేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ కల్తీ పెట్రోల్, డీజిల్ వాడకంతో వాహనాలు మొరాయించడం.. వాటి లైఫ్ టైం తగ్గిపోవడంతోపాటు రిపేర్ చేయించేందుకు వెళ్తే షోరూంలలో రూ.వేలల్లో వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనే జడ్చర్ల సమీపంలోని పెట్రోల్ బంక్‌లో ఇటీవల చోటుచేసుకుంది. సాక్షి, జడ్చర్ల: పెట్రోల్‌బంకుల్లో ఇంధన కల్తీతో వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకునే సమయంలో బండిలో పెట్రోల్ పడక ముందే గిర్రున మీటర్ తిరిగి 2 నుంచి 4పాయింట్లు చూయిస్తుండడం, వెంటనే రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని అడిగితే.. అదంతే దిక్కున్న చోట చెప్పుకోమంటు బంక్ సిబ్బంది అక్రోషం వెల్లగక్కుతున్నారు. ఇలా డీజిల్, పెట్రోల్‌బంకుల నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్న సంఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. ఆయా సంఘటనలపై ఫిర్యాదు చేసినా పట్టింపు లేక పోవడంతో కొద్ది సేపు అరిచి వెళ్లి పోవడం షరామామూలుగా మారింది. అంతేగాక ఎవరికి ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. ఇందుకు సంబందించి ఫిర్యాదు స్వీకరించే అదికారుల ఫోన్ నంబర్లు, తదితర సమాచారాన్ని పెద్ద ఆక్షరాలతో ప్రతి బంకువద్ద రాయిస్తే బాగుంటుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. మచ్చుకు కొన్ని.. బాదేపల్లికి చెందిన దస్తగీర్ తన ఫార్చునర్ వాహనంలో పట్టణంలోని ఓ పెట్రోల్‌బంక్‌లో డీజిల్ పోయించి కొద్ది దూరం వెళ్లేలోగా వాహనం నిలిచిపోయింది. మెకానిక్‌తో విచారిస్తే ట్యాంకులో డీజిల్‌కు బదులు నిండా నీరే ఉందని చెప్పాడు. డీజిల్ కొట్టించిన సమయంలో ట్యాంకులో చేరిన నీరే వాహనంలోకి పంపింగ్ అయ్యిందని తరువాత సదరు ఇంధన కంపెనీ సేల్స్ ఆఫీసర్ ధ్రువీకరించారు. మరో బంకులో ఓ వ్యక్తి తన వోక్స్‌వ్యాగెన్ పోలో కారులో డీజిల్ పోయించాడు. ట్యాంకు ఫుల్ చేయించిన తరువాత హైద్రాబాద్ వెళ్లి జడ్చర్లకు తిరిగి వస్తుండగా కొత్తూరు దాటిన తరువాత అకస్మికంగా కారు ఆగిపోయింది. దీంతో అతను కారు కంపెనీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుండి వచ్చిన మెకానిక్ తనిఖీ చేసి డీజిల్‌లో కిరోసిన్ కల్తీ జరగడం వలన నాజిల్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నాడు. నాజిల్స్ కొత్తవి అమర్చడానికి రూ:లక్ష దాకా ఖర్చవుతుందని బాదితుడు వాపోయాడు. గంగాపూర్ రహదారిలో గల పెట్రోల్ బంకులో ఉదయాన్నే ఓ యువకుడు తన మోటార్ బైక్‌లో లీటర్ పెట్రోల్ పోయించాడు. అనంతరం బంకు దాటిండో లేడో బండి ఆగిపోయింది. బైక్ ట్యాంకు ఓపెన్‌చేసి చూస్తే చుక్క పెట్రోల్ లేదు. అదేంటి ఇప్పుడే లీటర్ పోయించా గదా పెట్రోల్ రాలేదు ఏంటీ అని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని బుకాయింపు పైగా బెదిరింపు ధోరణి. పారదర్శకతకు పాతర ఇంధన విక్రయాలు పారదర్శకంగా కొనసాగే విధంగా పర్యవేక్షించాల్సిన అధికారులు, కంపెనీ ప్రతినిధులు నిబంధనలకు నీళ్లొదిలి నిర్వాహకులతో కుమ్మక్కు కావడంతోనే కల్తీ పెట్రోల్, డీజిల్ విక్రయాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గత మూడేళ్ల క్రితం జడ్చర్ల జాతీయరహదారిని అనుసరించి నిర్వహిస్తున్న ఓ పెట్రోల్ బంక్‌లో ఏకంగా భూగర్భం ద్వార పైపులైన్ వేసి కిరోసిన్‌ను నింపుతుండగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి కిరోసిన్ కల్తీని వెలుగులోకి తీసుకువచ్చిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు బేఖాతరు పెట్రోల్ బంకుల్లో కనీస నిబంధనలు పాటించ డం లేదు. నిబంధనల మేరకు వినియోగదారులకు తాగు నీరు, మరుగుదొడ్లు, ఉచితంగా వా హనాల టైర్లకు గాలి సౌకర్యం, బిల్లులు ఇవ్వ డం, తదితర సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పా టు చేయాలి. అదేవిధంగా అగ్ని ప్రమాదాల నివారణకు గాను నీటి వసతి కోసం ఖచ్చితంగా బోరు ఉండాలి. కొలతల్లో అనుమానాలను నివృత్తి చేసేందుకు వినియోగదారుల డిమాండ్ మేరకు 5లీటర్ల కొలత పాత్రలో ఇంధనం నింపి మాక్ టెస్టింగ్ చేసి చూపించాలి. అదేవిధంగా ప్రతి వాహనదారుడికి బిల్లులు ఇవ్వాలి. డీజిల్ ట్యాంకులో నీళ్లు బంకుల్లో భూగర్భంలో ఇంధన నిల్వ కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో వివిధ కారణాలుగా నీళ్లు చేరే అవకాశం ఉంటుందని ఇంధన కంపెనీ అధికారులు ఈసందర్భంగా పేర్కొంటున్నారు. వాహనాల్లో ఇంధనం నింపే సమయంలో బంకులోని ట్యాంకర్ల అడుగు భాగంలో సబ్మెర్సిబుల్ మోటారు పంపు ఉండడంతో మొదటగా నీటినే లాగేస్తుంది. దీంతో వాహనాల్లోకి నీళ్లు చేరే అవకాశం ఉంటుందని ఇందన కంపెనీ సేల్స్ ఆఫీసర్ ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇదిలాఉండగా, ఇప్పటికైనా వినియోగదారులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం పెట్రోల్, డీజిల్ బంకుల్లో అక్రమాలకు తావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే బంకుల్లో తనిఖీలు చేపడుతాం. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారిస్తున్నాం. జడ్చర్లలో ఓ బంకుపై వచ్చిన ఫిర్యాదుపై విచారించి వెంటనే ట్యాంకును శుభ్రం చేయించే విదంగా ఆదేశించాం. – వనజాత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
జిల్లా క్లబ్‌పై దాడులు
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా క్లబ్‌పై పోలీసుల దాడులు జిల్లాకేంద్రంలో కలకలం రేపింది. పట్టణ నడిబొడ్డున ఉన్న జిల్లా క్లబ్లో డబ్బులు పందెంగా ఏర్పాటు చేసుకొని పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్, ఎస్బీ డీఎస్పీ గిరిబాబు, డీటీసీ డీఎస్పీ సాయిప్రసాద్, టూటౌన్ సీఐ శ్రీనివాసాచారి సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేయడం జరిగింది. దీంతో కాయిన్స్ పెట్టుకొని మూడు ముక్కలాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు బందిగ శివప్ప, ఉప్పల లక్ష్మయ్య, కేటీ సుదర్శన్, మల్లేశ్, దశరథం, మదన్మోహన్రెడ్డితోపాటు క్యాష్ కౌంటర్ మేనేజర్లను అదుపులోకి తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేశారు. అలాగే క్లబ్ కౌంటర్లో ఉన్న రూ.1,24,660 నగదు సీజ్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నట్లు ముందస్తు సమాచారం తెలుసుకున్న కొందరు పెద్దలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. జిల్లా క్లబ్లో పేకాట ఆడటానికి కోర్టు అనుమతి ఉన్న దానికి విరుద్ధంగా ఆడుతున్నట్లు తెలుస్తోంది. అనుమతి తుంగలో తొక్కారు గతంలో జిల్లా క్లబ్‌పై పోలీసులు దాడులు చేయడంతో దీనిపై అప్పట్లో ఉన్న పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించి కొన్ని నిబంధనలతో కూడిన పేకాట ఆడుకోవచ్చని ఆర్డర్ తెచ్చుకున్నారు. రమ్మీ, 13 కార్డ్స్ మాత్రమే ఆడాలని ఇందులో కూడా టేబుల్స్‌పై నగదు ఉండరాదని చెప్పింది. దీంతో పేకాట ఆడుతున్న గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానిని నేరుగా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని సూచించింది. దీంతో అలాంటి నిబంధనలు పాటించకుండా క్లబ్ కౌంటర్లో డబ్బులు కట్టి కాయిన్స్ తెచ్చుకొని పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పేకాట ఆడాలని భావించిన ప్రతి ఒక్కరు ఎన్ని వేలు అయినా కౌంటర్లో కట్టి దానికి ప్రతిఫలంగా కాయిన్స్ తీసుకోవాలి. దీంట్లో గెలుపొందిన వ్యక్తులకు కాయిన్స్ పరిశీలించి దాని ప్రకారం కౌంటర్ నిర్వాహకులు గెలుపొందిన వ్యక్తులకు నగదు చెల్లిస్తారు. రాత్రివేళలోనే అధికంగా.. జిల్లాకేంద్రంలోని జిల్లా క్లబ్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో కాయిన్స్ పెట్టి భారీస్థాయిలో మూడు ముక్కలాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో రాజకీయ పెద్దల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతిఒక్కరు ఉంటారని తెలుస్తోంది. ఈ దాడులు ఏదో రాత్రివేళలో చేసి ఉంటే పెద్ద మనుషులు అందరూ పట్టుబడే వాళ్లని చర్చించుకుంటున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రూ.300 నుంచి రూ.500లోపు ఆడేవారు మాత్రమే ఉంటారని సమాచారం. రూ.వేలు, లక్షలు పెట్టి ఆడేవారు సాయంత్రం 6 గంటల తర్వాతే క్లబ్ చేరుకుంటారని తెలుస్తోంది. పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడులు చేస్తే రూ.లక్షల్లో నగదు లభ్యమవుతుందని ప్రచారం. కాయిన్స్ పెట్టి పేకాట జిల్లా క్లబ్లో నూతనంగా ఏర్పాటు అయిన గేమింగ్ యాక్టు ప్రకారం డబ్బులు పెట్టి లేదా వాటిస్థానంలో కాయిన్స్ పెట్టి పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు క్లబ్లో భారీస్థాయిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతుండగా దాడులు చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రూ.1,24,660 నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. దీంతోపాటు డిస్ట్రిక్ క్లబ్లో చట్టవిరుద్ధంగా డబ్బులతో పేకాట ఆడుతున్న నేపథ్యంలో సంబంధిత కమిటీ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట కానీ ఇతర జూదం ఆడటం చట్టప్రకారం నేరమని ఇలాంటి కార్యకళాపాలు ఎక్కడ జరిగిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
కలెక్టరేట్ ఎదుట పంచాయితీ సెక్రటరీల బైఠాయింపు
సాక్షి, నాగర్‌కర్నూల్: రోజూ తమతోపాటు విధుల్లో పాల్గొన్న సహ ఉద్యోగిని అచేతన స్థితిలో పడి ఉండడాన్ని పంచాయతీ కార్యదర్శులు జీర్ణించుకోలేపోయారు. తమ సహ ఉద్యోగిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ కదంతొక్కా రు. నాగర్‌కర్నూల్‌కు చెందిన స్రవంతి తిమ్మాజిపేట మండలంలో గుమ్మకొండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో పని ఒత్తిడి తట్టుకోలేక పురుగు మందుతాగి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. కాగా శనివారం సాయంత్రం స్రవంతి మృతదేహాన్ని నాగర్‌కర్నూల్‌కు అంబులెన్స్‌లో తీసు కువచ్చారు. అప్పటికే డీపీఓ కార్యాలయం వద్ద వేచి ఉన్న జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఆమె మృతదేహంతో కలెక్టరేట్‌కు వెళ్లి ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయం నుండి డీపీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీపీఓ సురేష్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, పిల్లల పోషణ ప్రభుత్వమే భరించాలని వినతిలో కోరారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా స్రవంతి మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబు లెన్స్, అనాథలుగా మారిన స్రవంతి పిల్లలను కలెక్టరేట్ ఎదుట పెట్టి పంచాయతీ కార్యదర్శులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీఎన్జీఓ నాయకులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. దాదా పు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించినా ఒక్క అధికారి కూడా స్పందించలేదు. అయితే కలెక్టర్ సీసీ అక్కడికి వచ్చి కలెక్టర్ ఆదేశాల మేరకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. కలెక్టర్, డీపీఓ స్వయంగా రావాలంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటి తర్వాత డీఆర్ఓ మధుసూదన్‌నాయక్ అక్కడికి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబాన్ని ఆదుకుంటా మని, పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తాని చెప్పినా పంచాయతీ కార్యదర్శులు ఒప్పుకోలేదు. ఎక్స్‌గ్రేషియా విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రాత్రి 10.15 గంటల ప్రాంతంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ వచ్చి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే టీఎన్జీఓ తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. దిక్కులేని వారైన పిల్లలు స్రవంతి మృతితో తన ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. స్రవంతి భర్త గత 8 నెలల క్రితమే నాగర్‌కర్నూల్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అనంతరం పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన స్రవంతి పిల్లలు రోహన్ (రెండో తరగతి), అనుకృతి (మూడో తరగతి)ని చదివిస్తుంది. ఈ క్రమంలో స్రవంతి మృతిచెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. కలెక్టరేట్ ముందు పిల్లలతో ధర్నా చేస్తుండడంతో ఏం జరగుతుందో తెలియని పసిపిల్లల ముఖాలు చూసిన ప్రతిఒక్కరి మనసు కలచివేసింది. -
ఎనిమిదేళ్ల బాలికపై దాడి!
అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు కన్నేశాడు.. గణేష్ నిమజ్జనాన్ని తిలకించడానికి రాత్రి ఇంటి నుంచి బయటికి రావడం గమనించాడు.. తానే దగ్గరుండి ఇంటికి తీసుకొస్తానని బాలిక అమ్మమ్మకు నమ్మబలికాడు.. అతని మాయమాటలు నమ్మిన ఆ వృద్ధురాలికి ఏం తెలుసు ఆ కామాందుడు లైంగిక దాడి చేసి చిన్నారిని జీవితాన్ని నాశనం చేస్తాడని.. రాత్రంతా బిడ్డ ఇంటికి రాకపోవడంతో గ్రామస్తులందరు వెతుకగా గ్రామశివారులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాక్షి, దేవరకద్ర(మహబూబ్‌నగర్) : అభం శుభం తెలియని బాలికలపై మానవ మృగాలు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. జడ్చర్లలో పదో తరగతి బాలికపై జరిగిన సంఘటన మరువకముందే.. చిన్నచింతకుంట మండలం లాల్‌కోటలో ఎనిమిదేళ్ల బాలికపై ఆదివారం రాత్రి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎస్ఐ చల్లా జ్యోతి కథనం ప్రకారం.. లాల్‌కోటకు చెందిన మైనర్ బాలిక అమ్మమ్మతో కలిసి బస్టాండ్ కూడలిలో ఏర్పాటుచేసిన వినాయక నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు వెళ్లింది. అనంతరం తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో 22 ఏళ్ల పోగుల రాజు ఇంటి వద్ద వదులుతానని నమ్మించి బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సమీపంలోని కోయిల్‌సాగర్ కాల్వ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటికే అమ్మమ్మ ఇంటికి చేరుకోగా.. ఎంతకూ బాలిక రాకపోవడంతో చుట్టుపక్కల వారితో కలిసి వెతికారు. కాల్వ సమీపంలో బైకు కనిపించడంతో అక్కడికి చేరుకునేలోపు నిందితుడు పారిపోయాడు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై సోమవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి.. చదువు సంధ్యలేని పోగురాజు చిన్నతనం నుంచి తన తండ్రితో పాటు మేకలను కాసేవాడు. మూడేళ్ల క్రితం ట్రాక్టర్ నడుపుతూ విలాసాలతో గడిపేవాడు. తాజాగా ఆదివారం రాత్రి వినాయక ఉత్సవాల సందర్భంగా మద్యం తాగి ఈ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయి పెద్దచింతకుంట శివారులోని వెంటేశ్వరెడ్డిబావి వద్ద ఉండగా సోమవారం సాయంత్రం లాల్కోట గ్రామస్తులు కొందరు గమనించారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఈ సంఘటనపై లాల్‌కోటలో సీఐ పాండురంగారెడ్డి విచారించారు. బాలిక కుటుంబ నేపథ్యం కాగా, ఈ బాలిక తల్లికి ఆత్మకూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే మూడేళ్ల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తన కూతురిని అమ్మమ్మ వద్ద వదిలి హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. దీంతో ఈ బాలికను అమ్మమ్మనే చదివిస్తోంది. -
భార్య మృతి తట్టుకోలేక..
సాక్షి, నవాబుపేట (జడ్చర్ల): పెళ్లి పందిట్లో తోడూనీడగా ఉంటామని బాస చేసిన ఆ వధూవరులు.. తాము ఉంటే ఇద్దరం జీవించాలి.. లేకుంటే చనిపోవాలంటూ నిర్ణయించుకున్నట్టుంది..! భార్య మరణ వార్త విన్న వెంటనే భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేట మండలం లోని కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికంగా తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితం సొంత పనిమీద బైక్‌పై ఇద్దరూ నవాబుపేటకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అమ్మపూర్‌గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు భార్య కింద పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితం తనకు వద్దంటూ మనస్తాపం చెందిన భర్త సమీపంలోని తమ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. కాగా, వివాహం జరిగి పట్టుమని రెండేళ్లయినా నిండని దంపతులు ఇలా తుదిశ్వాస విడవటంతో గ్రామస్తులు బోరున్నారు. -
కలకలం రేపుతున్న శ్రీ హర్షిణి హత్య
సాక్షి, మహబూబ్‌నగర్: ఫేస్బుక్ పరిచయం మరో బాలికను బలిగొంది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడో యువకుడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న శ్రీ హర్షిణి అనే బాలిక ఈ నెల 27న ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీ హర్షిణి ఫేస్బుక్ చాటింగ్‌పై ఆరా తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన నవీన్ రెడ్డితో ఎక్కువగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో శ్రీ హర్షిణి హతమార్చినట్లు నవీన్‌రెడ్డి అంగీకరించాడు. బాలికకు మాయమాటలు చెప్పి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి...ఆమెపై అత్యాచారానికి యత్నించగా, శ్రీ హర్షిణి తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడ బయటపెడుతుందనే భయంతో శ్రీ హర్షిణిని బండరాయితో కొట్టి హతమార్చినట్లు వెల్లడించాడు. పోలీసులు గురువారం ఉదయం బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన నిందితుడు కుటుంబసభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ పోలీస్
సాక్షి, మహబూబ్‌నగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు తీసుకున్న గంటల వ్యవధిలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ కానిస్టేబుల్. దీంతో అవినీతి పరులకు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు ఇస్తున్నారని ఆ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మడవత్ రమేష్ ప్రభుత్వం నుంచి ఆన్లైన్లో అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తున్నాడు. ఈ క్రమంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడ్డి గత ఏడాది నుంచి నాకు డబ్బులు ఇవ్వడం లేదు, డబ్బులు కావాలని రమేష్‌ను పలు మార్లు ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అయితే రూ.17వేలు కావాలని తిరుపతిరెడ్డిని డిమాండ్ చేశాడు. దీనికి రమేష్ ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల సమయం ఇచ్చాడు. ఆ తర్వాత రమేష్‌తో రూ.15వేలకు బేరం కుదుర్చుకున్నాడు. పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు.. ఈమేరకు రమేష్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేసి ఇసుక తరలించడానికి రూ.17వేలు లంచం అడిగినట్లు రుజువు కావడంతో శుక్రవారం ఉదయం నుంచి ప్రణాళిక ప్రకారం విచారణ సాగించారు. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడిక్డి రూ.17వేలు లంచం ఇస్తుంటే ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అడిగిన డబ్బును రమేష్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ వాహనం వెనుక భాగంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాధితుడు మాకు తెలపడంతో మా టీంతో లోపలికి వెళ్లి తనిఖీ చేయగా తిరుపతిరెడ్డి ఫ్యాంట్ జేబులో రూ.17వేలు పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఏసీబీ అధికారులు కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని పూర్తిగా తనిఖీలు చేసి ఏమైన ఆస్తుల పత్రాలు ఉన్నాయా.. ఏమైన ఆస్తులు ఉన్నాయా? బంధువుల పేర్లమీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయి అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఈ కేసులో పూర్తిగా విచారణ చేసి కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. అవినీతిపరుడికి ఉత్తమ సేవా పతకం టూటౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సమయంలోనే తిరుపతిరెడ్డి అనేక వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కూడా పాత పద్దతిలోనే వసూళ్లకు పాల్పడుతూ వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఉత్తమ ఉద్యోగిగా పోలీస్ ఉన్నత అధికారులు ఎలా గుర్తించారో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇబ్బంది పెడుతూ వచ్చాడు నేను 2017 డిసెంబర్ నుంచి ప్రభుత్వ అనుమతులతో ఇసుక తరలిస్తున్నాను. వన్‌టౌన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి గత కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. రూ.17వేలు అడగగా నా దగ్గర డబ్బులు లేవు మూడు రోజుల సమయం ఇవ్వండి రూ.15వేలు ఇస్తానని చెప్పాను. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా. సదరు కానిస్టేబుల్‌కు టూటౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలో కూడా రెండుసార్లు ఇచ్చాను. ఇతను పల్సర్ వాహనంపై సివిల్ డ్రస్‌లో కోయిలకొండ ఎక్స్‌రోడ్, ఫైర్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇసుక ట్రాక్టర్లతో కలెక్షన్ చేస్తుంటాడు. – మడావత్ రమేష్, ఫిర్యాదుదారుడు -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
సాక్షి, జడ్చర్ల: మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మిడ్జిల్‌లో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బోంపెల్లి రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ముగ్గురు రైతుల పేరిట గత రెండు నెలల క్రితం డీడీ తీసి జడ్చర్ల విద్యుత్ కార్యాలయంలో అందజేశాడు. ఆ తర్వాత మిడ్జిల్ ఏఈ పర్వతాలును సంప్రదించగా.. రూ.15 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తానని చెప్పడంతో రైతు రూ.12 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయమై గత నెల 30న ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఏఈ డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది. దీంతో వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం రైతు నుంచి రూ.12 వేలు ఏఈ పర్వతాలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈపై కేసు నమోదు చేశామని, శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ రెండు నెలలు తిరిగా.. గ్రామ శివారులోని సర్వే నంబర్లు 116, 117లో తొమ్మిది ఎకరాల భూమి ఉండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం గత రెండు నెలల క్రితం తన తల్లి అలివేలు, తమ్ముడు రవీందర్‌రెడ్డి, పక్క పొలం రైతు గజేందర్‌రెడ్డి పేరిట డీడీ తీసి తీసి జడ్చర్ల సబ్‌డివిజన్ కార్యాలయంలో ఇచ్చానని రైతు రాజేందర్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కోసం గత రెండు నెలల నుంచి ఏఈ దగ్గరకు వస్తే డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని, రూ.15 వేలు డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనని రూ.12 వేలకు ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. వారి సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం ఏఈ కార్యాలయంలో ఏఈ పర్వతాలుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారన్నారు. మండలంలో నలుగురు ఉద్యోగులు రైతులకు పనులు చేసిపెట్టడానికి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్ శాఖలో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మొదట 1995లో బో యిన్‌పల్లికి చెందిన ఓ రైతు పేరిట పొలం మార్చడానికి రెవెన్యూ శాఖలో పనిచేసే ఆర్ఐ పెంటయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత 1997లో ముచ్చర్లపల్లికి చెందిన రైతు శ్యాంసుందర్‌రెడ్డికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడాని కి రూ.3 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ సబ్ ఇంజనీర్ అబ్దుల్‌రబ్ పట్టుబడ్డాడు. అలాగే 2013 ఏప్రిల్ 1న జకినాలపల్లికి చెందిన పోలే శంకర్‌ను ఓ కేసు విషయంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ సాయిచంద్రప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాజాగా విద్యుత్ ఏఈ పర్వతాలు రైతు నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏడాది క్రితమే ఇక్కడికి.. విద్యుత్ ఏఈ పర్వతాలు కేఎల్ఐ కాల్వ సమీపంలో రైతుల పొలాలు లేకపోవడంతో, అదే అదునుగా చూపించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి రైతుల నుంచి భారీగా లంచాలు వసూలు చేసినట్లు తెలిసింది. గతేడాది జూలై మొదటి వారంలో బాలానగర్ నుంచి బదిలీపై ఏఈ పర్వతాలు ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి న తర్వాత కేఎల్ఐ కాల్వ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రతి రైతు నుంచి డబ్బులు వసూలు చేసినా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా రైతు రాజేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈయన బాగోతం బయటపడింది. -
ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి
ప్రతి రోజూ ఉదయమే వెళ్లొస్తానని చెప్పిన తన పెనిమిటి తిరిగిరాని లోకానికి వెళ్లాడని జీర్ణించుకోలేని భార్య.. అమ్మా..నాన్న ఇక రాడా? అని పదేపదే అమాయకంగా అడిగే పిల్లలు.. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకుంటే మధ్యలోనే వదిలివెళ్లిన తమ కొడుకు ఇక లేడనే తల్లిదండ్రులు.. సాయంత్రం వేళావీధి చివర్లో అక్కా.. చెల్లె..అన్న..అని పలకరించుకున్న వారు ఇక లేరని..ఇక రారనే నిజాన్ని నమ్మలేని బంధుమిత్రులు.. ఇలా అందరూ తమతమ వాళ్లను గుర్తు చేసుకుని బాధను దిగమింగుకుని జీవచ్ఛవాలుగా మారిన పరిస్థితి సోమవారం కొత్తపల్లి, గోగ్యనాయక్‌తండాలో కనిపించింది. ప్రస్తుతం ఆ గ్రామాలను నిశ్శబ్దం కాటేస్తోంది. శుభకార్యాలకు డప్పు కొట్టిన వాళ్లే చావుడప్పులు కొట్టారు. ఎవరిని తట్టినా.. గుండె పిండేంత బాధ.. కళ్లలో కన్నీళ్లు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 మంది మృత్యుఒడిలోకి జారుకోవడం ఆ పల్లెల్లో పెను విషాదాన్నే నింపింది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఉదయం 11.30గంటలకు గ్రామానికి చేరుకున్న మృతదేహాలను చూసి.. అంత వరకూ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న బాధ కన్నీళ్ల రూపంలో ఎగసిపడింది. దు:ఖాన్ని దిగమింగుకుని నిశ్శబ్దంగా లోలోపల కుమిలికుమిలి పోయిన వారు ఒక్కసారిగా గొల్లుమన్నారు. విగతజీవులుగా మారిన తమ ఆప్తులను చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి. తమవారిని కడసారి చూపు కోసం బంధువులు, మిత్రులు తరలివచ్చారు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నాయకులు, అధికారులు కొత్తపల్లికి చేరుకున్నారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం మొత్తం కన్నీటి సంద్రంగా మారింది. సాక్షి, మహబూబ్‌నగర్(కొత్తపల్లి) : అమ్మా.. నాన్నా.. మీరిద్దరూ వెళ్లిపోయారు.. మాకు ఇప్పుడు దిక్కెవరు.. అంటూ శివాజీ, చాందీ దంపతుల పిల్లలు గుండెలవిసేలా రోదించారు.. గతంలోనే నాన్నను కోల్పోయాం.. ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయావా.. అంటూ పార్వతమ్మ కూతురు, కుమారుడు కన్నీరుమున్నీరయ్యారు.. భర్తను మృత్యువు కబళించగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. ఇదీ సుక్రు కుటుంబ పరిస్థితి.. సొంత అక్కాచెల్లెళ్లు ఒకేసారి మృత్యుఒడికి చేరుకున్నారు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ.. అందరివీ నిరుపేద కుటుంబాలే.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. అలాంటి వారి కుటుంబాలను రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు చిన్నాభిన్నం చేసింది.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి గాధలే వినిపించాయి.. మృతుల కుటుంబ పరిస్థితులను చూసిన వారంతా చలించిపోతున్నారు. కూలి పనులు చేస్తూ.. కోడలు అరుణమ్మ కొన్నేళ్ల్ల క్రితం మృతి చెందడంతో వారి పిల్లలు కార్తిక్, జ్యోతిలకు నానమ్మ వడ్డె చెన్నమ్మ పెద్దదిక్కుగా మారింది. అయితే ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నమ్మ సైతం మృత్యువాత పడటంతో వీరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. చెన్నమ్మ భర్త నర్సయ్య కూడా గతంలో మరణించాడు. దీంతో మనవడు, మనుమరాలుకు పెద్దదిక్కుగా ఉంటూ వారి పోషణ కోసం కూలీ పనులు చేస్తుండేంది. అనాథలుగా మారిన పిల్లలు గోగ్యతండాకు చెందిన భార్యాభర్తలు శివాజీ, చాందిలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. దీంతో వారి పిల్లలు అనూష, సరిత, సంతోష్‌లు అనాథలుగా మిగిలారు. సోమవారం తమ ఇంటికి విగతజీవులుగా వచ్చిన తల్లిదండ్రులను చూసిన పిల్లలు లబోదిబోమంటూ మృతదేహాలపై పడి రోదించారు. ఈ క్రమంలో చిన్నకుతూరు సరిత సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే కారులో జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. వీరికి చిన్న ఇల్లు ఉండగా అంతంత మాత్రమే భూమి ఉన్నట్లు బంధువులు తెలిపారు. వ్యవసాయం లేక భార్యాభర్తలు ఇద్దరు కూలీ పనులకు వెళ్తుంటారు. అదే క్రమంలో ఆదివారం కూడా వరినాట్లు వేసేందుకు వెళ్లి అనంతలోకాలకు చేరుకోవడంతో పిల్లలుదిక్కులేని వారయ్యారు. భర్త మృతి.. భార్య ఆస్పత్రిలో భర్త అంత్యక్రియలకు కూడా భార్య హాజరుకాలేని అత్యంత విషాదకర ఘటన గోగ్యతండాలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండాకు చెందిన సక్రునాయక్ మృతి చెందగా అతని భార్య దేవి తీవ్ర గాయాలతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సోమవారం జరిగిన సక్రు అంత్యక్రియలకు దేవి హాజరుకాలేకపోయింది. సక్రు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో వారి పిల్లలు గోగ్య, శ్రీవాణి, శివతోపాటు అతని ముసలి తల్లిదండ్రులు చావిలీ, గోబ్రియాలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వారి కుటుంబ పోషణ మరీ దయనీయంగా మారింది. సొంత భూమి లేకపోవడంతో వాడ్యాల్ శివారులో కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సక్రు దూరం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. సొంత అక్కాచెల్లెళ్లు.. కొత్తపల్లికి చెందిన నెల్లికంటి చంద్రమ్మ, ముదిగొండ వెంకటమ్మలు సొంత అక్కాచెల్లెళ్లు. వారి తల్లి చంద్రమ్మ తన కూతుళ్లు తన కళ్ల ముందే ఉండాలనే ఉద్దేశంతో కొత్తపల్లికి చెందిన వారితోనే వివాహం జరిపించింది. వీరి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉన్నాయి. మృతిచెందిన వెంకటమ్మకు భర్త లక్ష్మయ్య, కూతుళ్లు శివలీల, రాణి, కుమారుడు శ్రీను ఉన్నారు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటమ్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. అదేవిధంగా చంద్రమ్మ భర్త నర్సింహులు కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోగా.. పిల్లలు రాఘవేందర్, రమేష్, సుజాతలు ఉన్నారు. పెద్దదిక్కుగా ఉన్న తల్లికూడా చనిపోడవంతో ఒంటరి వారయ్యారు. వీరికి చిన్న ఇల్లు తప్ప భూమి తదితర ఎలాంటి ఆధారం లేదని బంధువులు తెలిపారు. తల్లి మృతితో తల్లడిల్లిన పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బండారి ఎల్లమ్మకు ఆరుమంది ఆడపిల్లలే సంతానం. ముగ్గురి కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించగా మరో ముగ్గురు కూతుళ్లు సునీత, లావణ్య, రాణి ఉన్నారు. ఎల్లమ్మ భర్త బొందయ్య కూడా దివ్యాంగుడు కావడంతో వెంకటమ్మనే కుటుంబ భారాన్ని మోస్తుంది. ప్రతిరోజు కూలీ పనులకు వెళ్లి కూలీ డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. రాణి, లావణ్య కవల పిల్లలు. వీరు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతుండగా సునీత ఇంటర్ చదువుతుంది. తల్లి మృతితో వీరి చదువులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది. పోషించే అమ్మ దూరమైంది బొంకూరు పార్వతమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి పిల్లలు శ్రీలత, శ్రీకాంత్‌లు ఒంటరి వారయ్యారు. తండ్రి చెన్నయ్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందగా.. తల్లి పార్వతమ్మ అన్నీతానై తన పిల్లలను కూలీ పనిచేసి చదివిస్తూ పోషిస్తుంది. ఈ క్రమంలో కూలీ పనులు ముగించుకొని తిరిగి వస్తూ మృతుఒడికి చేరడంతో ఆ పిల్లలు దిక్కులేనివారయ్యారు .శ్రీకాంత్ ఇంటర్ చదువుతుండగా, శ్రీలత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరికి కేవలం ఒక చిన్న గదితోపాటు గుడిసె మాత్రమే ఉంది. వీరికి ఎలాంటి వ్యవసాయ భూమి లేదని బంధువులు చెప్పారు. కూలి పనే ఆధారం కొత్తపల్లికి చెందిన బోలేపోగు వెంకటమ్మది ధీనస్థితి. వెంకటమ్మకు భర్త జంగయ్యతోపాటు కూతురు శైలజ ఉంది. వీరికి ఉండడానికి రెండు చిన్నగదుల ఇల్లు మాత్రమే ఉండగా.. దాదాపు ఎకరం గైరాన్ భూమి ఉంది. కూలీ పనే ప్రధాన జీవనాధారంగా కుటుంబం గడుస్తుంది. వెంకటమ్మ మృతితో కుటుంబం దయనీయ స్థితికి చేరుకుంది. తేరుకోలేకపోతున్నాం.. కొత్తపల్లిలో తొమ్మిది మంది, అలాగే గోగ్యతండాలో నలుగురు మొత్తం 13 మంది ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మా గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇంకా ఈ సంఘటన నుంచి గ్రామస్తులు తెరుకోలేకపోతున్నారు. ఇలాంటి సంఘటన జరగడం ఎంతో దురదృష్టకం. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. – దేవేందర్, సర్పంచ్, కొత్తపల్లి ఈ ఘటన కలచివేసింది.. గ్రామంలో 13 మంది ఒకేసారి మృతి చెందడం పట్ల గ్రామంలోని ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా మృతుల అంత్యక్రియలకు ఎంతో సహకరించారు. ఇలాంటి సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరం. ఈ ఘటన మొత్తం గ్రామస్తులను కలచివేసింది. – బాలయ్య, కొత్తపల్లి విషాదం అలుముకుంది.. గ్రామంలో ఒకేసారి 13 మంది మృతి చెందడం ఎంతో బాధాకరం. ఇలాంటి సంఘటన గ్రామంలో ఎప్పుడూ జరగలేదు. ప్రతి కులంలో ఒకరు మృతిచెందడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. దేవుడు బాధిత కుటుంబాలకు త్వరగా విషాదం నుంచి బయటపడేలా చూడాలి. – సుదర్శన్‌రెడ్డి, కొత్తపల్లి -
ఆపరేషన్‌కు సహకరించడం లేదని...
సాక్షి, పాలమూరు : ఆపరేషన్‌కు సహకరించడంలేదన్న కారణంతో కొందరు వైద్యులు బూతులు తిడుతూ.. పిడి గుద్దులు గుద్దుతుండడంతో ఆ బాలింతలు నరకం అనుభవిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కు.ని (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేకో.. మరే కారణంతోనో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న మహిళల పట్ల దయాగుణంతో వ్యవహరించాల్సిందిపోయి.. ఇక్కడికి ఎందుకు వస్తారని.. ప్రైవేట్‌కు పోవచ్చు కదా అంటూ వైద్యులు దూషిస్తున్నారు. ఇదేమిటని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. సర్జరీకి సహకరించడం లేదని సాకులు చెబుతున్నారు. ఈ వ్యవహారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న పీపీయూనిట్‌లో చోటుచేసుకుంది. ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలో పనిచేస్తున్న పీపీయూనిట్‌లో సంతానం వద్దని భావించే మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్(కుని) చేస్తుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మహిళలు అందరూ ఇక్కడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి వస్తుంటారు. అయితే ఇక్కడ పనిచేసే మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రఫీక్, మరో వైద్యురాలు కలిసి కుని ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చిన మహిళలు ఆపరేషన్‌కు సహకరించడం లేదని ముఖంపై, ఇతర ప్రాంతాల్లో పిడి గుద్దులు గుద్దడం, రక్కడం వంటివి చేస్తున్నారు. దీంతో పాటు నోటికి వచ్చిన బూతులు తిడుతూవారిని మానసికంగా..శారీరకంగా వేధిస్తున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా... ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోవడం పెద్ద చర్చనీయ అంశంగా మారింది. పేద మహిళలు..నిరక్షరాస్యులు కావడంతో ఇన్ని రోజుల పాటు విషయం వెలుగులోకి రాలేదు. అయితే బుధవారం అంజలి అనే బాలింతరాలు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొదటి నుంచి ఆరోపణలు మహబూబ్‌నగర్ పీపీయూనిట్‌లో పని చేస్తున్న డాక్టర్ రఫీక్‌పై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఇతను పీపీ యూనిట్లో 2011–12ప్రాంతం నుంచి అక్కడే పని చేస్తున్నాడు. చాలా కాలం నుంచి పనిచేయడం వల్ల స్థానికంగా పాతుకుపోయాడు. దీంతో అక్కడ అతను చెప్పిన మాటే వేదంగా మారింది. ఏడాదికి కేటాయించిన లక్ష్యం పూర్తి చేయకపోవడం..సకాలంలో కుని ఆపరేషన్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పారిపాటిగా మారింది. అయితే డీఎంహెచ్‌వో శ్రీనివాస్ పనిచేసే సమయంలో ఇతనిని సరెండర్ కూడా చేయడం జరిగింది. తిరిగి కొన్ని రోజులకు అక్కడే విధుల్లో చేరాడు. ఆ తర్వాత ఓసారి కలెక్టర్ విజిట్ చేసిన సమయంలో అతను విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కర్కశత్వం ఎందుకు? ఎన్నో పురటి నొప్పులు భరించి శిశువుకు జన్మనిచ్చిన తల్లి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అప్పటికే ప్రసవం కోసం ఆపరేషన్ చేసుకొని..మళ్లీ పిల్లలు కాకుండా ఉండటానికి మరో ఆపరేషన్ చేసుకోవడానికి వస్తోంది. అలాంటి తల్లి శరీరం ఆపరేషన్‌కు సహకరించడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా.. సమయం తీసుకొని ఆపరేషన్ చేయాలి. అంతే తప్పా మానవత్వం మరిచి దాడి చేయడం సరైన చర్యకాదు. అలా కొడుతున్న సమయంలో ఆ తల్లి ఎంతటి బాధను అనుభవిస్తోందో అంతు చిక్కడం లేదు. చాలా కొట్టారు నేను సోమవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి ఆస్పత్రికి వచ్చి ఆడ్మిట్ అయ్యాను. మంగళవారం ఉదయం ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్ రఫీక్ నా దవడపై, ముఖంపై బలంగా కొట్టాడు. తొడ భాగంపై కొట్టడంతో పాటు నడుముని విపరీతంగా మెలిమి తిప్పాడు. దీంతో నాకు పెదవి చిట్లి రక్తం వచ్చింది. అదేసమయంలో చెప్పకూడని బూతులు తిట్టాడు. – అంజలి, చౌదర్పల్లి పొట్ట లోపలికి తీసుకోలేదని కొట్టారు నాకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో పొట్టను లోపలికి తీసుకోలేదని ఓ మేడం రెండుసార్లు కొట్టారు. – రేణుక, మర్లు, మహబూబ్‌నగర్ ముఖంపై కొట్టడంతో రక్తం వచ్చింది నాకు ఆపరేషన్ చేసే సమయంలో నా ముఖంపై కొట్టడంతో నా పెదవి నుంచి రక్తం రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రైవేట్ ఆస్పత్రికి పోవద్దా అని..బూతులు తిట్టారు. – తిరుపతమ్మ విచారణ చేసి చర్యలు తీసుకుంటాం మహబూబ్‌నగర్ పీపీ యూనిట్లో వైద్యులు మహిళలపై దాడులు చేసిన విషయంపై ఫిర్యాదు వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీపీ యూనిట్‌కు వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరిస్తాం. ఆపరేషన్ కోసం వచ్చిన వారిపై మాత్రం దాడి చేయడం అనేది సరైన చర్య కాదు. – డాక్టర్ రజిని, డీఎంహెచ్ఓ, మహబూబ్‌నగర్ -
మరణించిన వారు వచ్చి రిజిస్ట్రేషన్!
జడ్చర్ల: వారు మరిణించి దశాబ్దాంన్నరకు పైగానే గడిచింది. కానీ వారి పేరున ఉన్న వ్యవసాయ భూములు మాత్రం వారే వచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇది నమ్మలేకున్నా జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేటతెల్లం కావడంతో ఇలాంటి మోసాలకు పాల్పడిన నిందితులు కటకటాలపాలయ్యారు. జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ కథనం మేరకు.. రాజాపూర్ మండలం తిరుమలిగిరికి చెందిన పాత్లావత్ ఘాన్సీబాయికి సర్వే నంబర్లు 189, 208, 211, 212, 200లో 5.18 ఎకరాల భూమి ఉంది. అదేవిదంగా పాత్లావత్ కేశవులుకు సర్వే నంబర్లు 200/1యు, 212/ఆర్యు, 211/1యులలో 4.04 ఎకరాల భూమి ఉంది. అయితే వీరు దాదాపు 15సంవత్సరాల క్రితమే మరణించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన పాత్లావత్ దీప్లా, పాత్లావత్ రమేశ్, పాతాల్వత్ అంబ్రి, సీత్యాలు తప్పుడు ఆధార్ కార్డులు, తదితర పత్రాలు సృష్టించి 2010లో ఇతరులు పేరున వారి భూమిని జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆధార్ కార్డుల్లో ఫొటోలు మార్చి రిజిస్ట్రేషన్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 2018లో ఘాన్సీబాయి కూతురు జమున, తదితరులు బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం గురువారం వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితులకు సహకరించిన అప్పటి వీఆర్ఓ, సర్పంచ్, తదితరులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఈసందర్భంగా సీఐ వెల్లడించారు. -
కిడ్నాప్ ముఠా అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: డబ్బుల కోసం రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి..విక్రయించిన ముఠాను మహబూబ్‌నగర్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 13న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు పోట్టోళ్ల చిట్టి అలియాస్ హద్దులమ్మ తన భర్త యాదయ్యతో కలిసి తమ కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. చివరకు క్రైం టీం కానిస్టేబుల్స్‌కు వచ్చిన సమాచారం మేరకు వీరన్నపేట ఓ ఇంట్లో చిన్నారి ఉందని గుర్తించి ఆ ఇంట్లో తనిఖీలు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని ఎర్రకుంటకు చెందిన పోట్టోళ్ల చిట్టి అలియాస్ హద్దులమ్మ, యాదయ్య దంపతులకు నలుగురు ఆడ సంతానం ఉన్నారు. కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తూ సొంత ఇళ్లు లేకపోవడంతో వల్లభ్‌నగర్‌లో ఉండే మదర్సాలలో పడుకుంటారు. అయితే పది రోజుల కిందట పోట్టోళ్ల చిట్టి, యాదయ్య తమ పిల్లలతో దొడ్డలోనిపల్లి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న సమయంలో వీరన్నపేటకు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ సలీం, తస్లీమ్, సమీనా నహిద్ కలిసి కల్లు తాగడానికి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కలిసి పోట్టోళ్ల చిట్టిని నీకు నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు కదా మాకు ఒక్కరిని ఇవ్వాలని అడిగారు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. అయితే మీరు ఎక్కడ ఉంటారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నాప్.. ఆ వెంటే విక్రయం ఈనెల 13న రాత్రి పట్టణంలోని వల్లభ్‌నగర్ దగ్గర ఉన్న మదర్సా పాఠశాల ఆవరణలో చిట్టి, యాదయ్య దంపతులతో పాటు పిల్లలు పడుకున్నారు. ఈ క్రమంలో తస్లీం, సమీనా నహిద్లతో కలిసి సలీం ఆటోలో వచ్చి తల్లి పక్కన పడుకున్న రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుండగా చిట్టికి మెళకువ వచ్చి వారి వెంటపడింది. కిడ్నాపర్లు ఆటోలో వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు వీరన్నపేటకు చెందిన ఖతీజా బేగంకు రూ.10వేలకు చిన్నారిని ముగ్గురు ముఠా సభ్యులు విక్రయించారు. ఆ తర్వాత బాధితురాలు పోట్టోళ్ల చిట్టి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని ఇద్దరు బూర్కా ధరించిన మహిళలు, ఒక వ్యక్తి ఆటోలో వచ్చి పాపను ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఐదు బృందాలతో గాలింపు దీంతో ఈ కేసును చేధించడానికి ఐదు ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ బృం దాలను ఏర్పాటు చేసి అనుమానం కల్గిన ప్రాంతాలను తనిఖీలు చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, కాచి గూడ రైల్వేస్టేషన్లు, హైదరాబాద్ ప్రధాన బస్టాండ్లు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటు మరికొన్ని బృందాలు రాయిచూర్, నారాయణపేట, కర్నూల్ తనిఖీలు చేశారు. అదేవిధంగా పాపను ఆటోలో కిడ్నాప్ చేయడం వల్ల పట్టణంలో ఉన్న ఆటోలపై దృష్టి పెట్టి తనిఖీలు చేయగా కొంత సమాచారం లభించింది. దీంతో క్రైంపార్టీ పోలీసులు వీరన్నపేట ఖతీజా బేగం ఇంట్లో రెండు నెలల చిన్నారి ఉందని గుర్తించి వారందరిని గురువారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా మదర్సాలో కిడ్నాప్ చేసి న చిన్నారియే అని ఒప్పుకోవడం జరిగిం ది. దీంతో పోలీసులు వారి నుంచి చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతం అయ్యింది. కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన ఆటో, రూ.700నగదు సీజ్ చేయడంతో పాటు నలుగురు నేరస్తులను మహ్మద్ సలీం, తస్లీమ్, సమీనా నహిద్, ఖతీజా బేగంను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు పరిశోధనలో ప్రతిభ కనబర్చిన వన్‌టౌన్ సీఐ రాజేష్, క్రైం పార్టీ కానిస్టేబుల్స్ తిరుపతిరెడ్డి, నరేష్, క్రైం టాస్క్‌ఫోర్స్ బృందాలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్ పాల్గొన్నారు. -
డబ్బుల కోసమే హత్య.. పట్టించిన ఫోన్ కాల్
నారాయణపేట: డబ్బుల కోసమే నారాయణను దారుణంగా హతమార్చారని ఎస్పీ చేతన తెలిపారు. హ్యత కేసును సీఐ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం కాల్ క్లూతో కూపీ లాగి కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దామరగిద్ద మండలంలోని నర్సాపూర్‌కు చెందిన కొమ్మూరు నారాయణ బియ్యం వ్యాపారం చేసేవాడు. ఈ నెల 10న బియ్యం వ్యాపారానికి సంబంధించిన రూ.7.68 లక్షల డబ్బులను గుల్బర్గా నుంచి వసూలు చేసుకొని వస్తున్నారు. డబ్బులు తీసుకువస్తున్నట్లు తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు నారాయణ కదలికలను గమనిస్తూ వచ్చారు. గుర్మిట్కల్ చేరుకున్న నారాయణ ద్విచక్రవాహనంపై బయలుదేరి నర్సాపూర్‌కు వస్తుండగా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామ శివారులోని ఎర్రగుట్ట దగ్గర మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు గండీడ్ మండలానికి చెందిన చించాటి వీరేశ్(20), నీరటి మహేశ్(23)లు వారి బొలెరో వాహనంతో ఢీకొట్టారు. అక్కడికక్కడే నారాయణ మృతిచెందిన విషయాన్ని గమనించి ద్విచక్రవాహనాన్ని, నారాయణ మృతదేహాన్ని తీసుకెళ్లి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో ఎర్రగుట్ట దగ్గర ముళ్ల పొదాల్లో పడేసి.. డబ్బులతో పరారయ్యారు. కాల్ క్లూతో కూపీ.. హత్యకు గురైన నారాయణ సెల్‌ఫోన్‌తోనే నింది తులు ఓ వ్యక్తికి ఫోన్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అదే చివరి కాల్. ఆ వ్యక్తి ఫోన్ కాల్ డాటాతో హంతకులను కేవలం రెండు రోజుల్లోనే పోలీసు బృందం పట్టుకుందని ఎస్పీ తెలిపారు. నారాయణతో తీసుకెళ్లిన డబ్బులను ఇద్దరూ చేరి సగం వాటాలుగా పంచుకున్నారని, ఆ డబ్బులను రికవరీ చేసేందుకు ఈ సమయం పట్టిందన్నారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. హత్య కేసును ఛేదించిన సీఐ సంపత్‌కుమార్, దామరగిద్ద ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు భాస్కర్, భీమప్ప, హరీశ్, టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుళ్లు నరేందర్, రాంకుమార్, నాగరాజుగౌడ్, ఆంజనేయులను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. -
పాపం.. పసివాళ్లు
వనపర్తి క్రైం/ వనపర్తి అర్బన్: ‘ఐరన్’ మాత్రలు వేసుకున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం వనపర్తిలో కలకలం రేపింది. తినక ముందు మాత్రలు వేయడం, వాటిని వేసుకునే ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేయడంలో ఏఎన్ఎం, ఆశలు నిర్లక్ష్యం వహించడంతో 37 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలతో ఏరియా ఆస్పత్రి మారుమోగింది. వివరాలిలా.. తినకుండా వేసుకోవడంతో.. మండలంలోని కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి గురువారం రాష్ట్రీయ బాలికల ఆరోగ్య పథకంలో భాగంగా (స్కూల్ హెల్త్) పాఠశాలలోని విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలు వేస్తారు. అయితే గురువారం సవాయిగూడెంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలను ఏఎన్ఎం, ఆశలు పంపిణీ చేశారు. అయితే విద్యార్థులు తిన్న తర్వాత మాత్రలు వేసుకోవాలి. కానీ కొంతమంది విద్యార్థులు ఉదయం తినకుండా పాఠశాలకు వచ్చారు. ఉదయం 11 గంటలకు ఏఎన్ఎం సాయిన్‌బేగం, ఆశ వెంకటేశ్వరమ్మ 63 మంది విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలు వేశారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 37 మంది విద్యార్థులకు వాంతులు కావడం, కడపునొప్పితో బాధపడటంతో ఉపాధ్యాయులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కొంతమంది విద్యార్థులను ఆటోలో, అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఒక్కో బెడ్డుపై ఇద్దరు విద్యార్థులను పడుకోబెట్టి చికిత్స చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే.. ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఐరన్, సీ విటమిన్ మాత్రలు పంపిణీ చేయడం వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు మాత్రలు వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాత్రలు వేసే ముందు విద్యార్థులు తిన్నారో లేదో చూసుకోవాలి. అలా ఏదీ చూడకుండా విద్యార్థులకు ఉదయమే మాత్రలు వేశారు. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసి కడుకుంట్ల ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎం, ఆశలు ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థు లు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతున్న తీరును చూసి ఖంగుతిన్నారు. విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
సరిహద్దుల్లో చేతివాటం!
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా సరిహద్దులో కృష్ణ చెక్‌పోస్టు మాముళ్లకు అడ్డాగా మారింది. ఇక్కడ ఆర్టీఏ శాఖ, ఆబ్కారీ శాఖల తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం జీఎస్టీ అమల్లోకి రావడంతో ఇక్కడ వాణిజ్య పన్నుల శాఖను ఎత్తివేశారు. ప్రస్తుతం ఉన్న శాఖలు చెక్‌పోస్టులను అడ్డాలుగా మార్చుకొని చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. పైకం అందిస్తే చాలు ఏ వాహనమైనా దర్జాగా తరలిపోయే పరిస్థితి కొనసాగుతోంది. చెక్‌పోస్ట్‌లో రవాణాశాఖకు సంబంధించి ఎంవీఐ, ఏఎంవీఐలుతో పాటు ఇతర సిబ్బంది విధులు ని ర్వహిస్తున్నారు. 24గంటలకో ఒక బృందం షిప్ట్‌ల పద్ధతిలో మారుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి అటు ఇటు సరకులు తీసుకెళ్లే వాహనాలు తప్పనిసరిగా ఇక్కడ ఆగి పత్రాలపై ముద్ర వేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల్లో ఏ సరుకు, ఎంత మేర సామర్థ్యంతో రవాణా అవుతుందో తనిఖీ చేయడం, పత్రాలు సరిచూడటం ఇక్కడివారి బాధ్యత. అసలు ఏం చేస్తున్నారు.. తనిఖీ కేంద్రం వద్ద వాహనం ఆగగానే సంబంధిత డ్రైవర్ అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి కాగితాలు చూపుతాడు. స్థాయిని బట్టి సొమ్ము చేతిలో ఉంచగానే వాహనాన్ని ముందుకు పంపిస్తారు. ఇందుకు ప్రైవేట్ వ్యక్తులు సహాయంగా ఉంటారు. సహకరించినందుకు వారికి కొంత వాటా ఇవ్వడం జరుగుతుంది. ఆబ్కారీ ఆగడాలే వేరు ఆబ్కారీ ఆగడాలకు అదుపేలేకుండా పోతోంది. మహారాష్ట్ర, రాయిచూర్, యాదగిరి తదితర పట్టణాల నుంచి తెలంగాణలో మద్యం తయారీకి సంబంధించిన ముడి సరకు ట్యాంకర్లు వస్తుంటాయి. వీటికి అన్ని అనుమతులు ఉన్నా ఇక్కడ ఎంతో కొంత రాబడుతుంటారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్న సమయంలో కూడా అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చిన తర్వాత జిల్లాలో సారా తయారీ చాలా వరకు తగ్గించారు. కానీ సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లాకు నాటుసారాను తరలిస్తున్నారు. ఈ క్రమంలో చెక్‌పోస్టు దగ్గర అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పోస్టింగ్‌కు భలే డిమాండ్.. కృష్ణ చెక్‌పోస్టు వద్ద పని చేసేందుకు ఎక్కవ మంది అధికారులు ఆసక్తి చూపుతారు. ఇక్కడ విధుల నిర్వహణ అదృష్టంగా భావిస్తారు. పోస్టింగ్ రావడానికి లేదా డిప్యూటేషన్‌పై పని చేయడానికి పై అధికారులను ప్రసన్నం చేసుకొని మరీ పోస్టింగ్‌లు పొందుతుంటారు. -
హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు
సాక్షి, గద్వాల(మహబూబ్‌నగర్): దాదాపు ఏడాది కిందట అదృశ్యమైన వారు హత్యకు గురయ్యారనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ కృష్ణఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఎల్కూరుకి చెందిన సంజన్నకు ఇద్దరు భార్యలు. రెండవ భార్య సరోజ(24)కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, కుటుంబ సమస్యలు తలెత్తడంతో భార్య సరోజ వేరే కాపురం పెట్టమని భర్త సంజన్నపై ఒత్తిడి తెచ్చేది. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రెండో భార్య, కుమారుడిని ఎలాగైనా చంపాలని భర్త పథకం పన్నాడు. ఈ క్రమంలో 2018 అక్టోబర్ 3వ తేదీన కర్నూల్ జిల్లా మంత్రాలయానికి వారిని తీసుకెళ్లాడు. అక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేస్తుండగా భార్య, కుమారుడిని గొంతు నులుమి నదిలోనే వదిలేశాడు. విషయాన్ని గోప్యంగా ఉంచిన సంజన్న గ్రామానికి వచ్చి భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంజన్నపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, ఇటీవల కాల్‌డేటా రావడంతో దాని ఆధారంగా విచారించగా.. భార్య, కుమారుడిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మిస్సింగ్ కే సును హత్య కేసుగా మార్చి నిందితుడు సంజన్నను మంగళవారం గద్వాల కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సబ్ ఇంజనీర్ మృతి
సాక్షి, గద్వాల అర్బన్(మహబూబ్ నగర్): విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సబ్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలోని జమ్మిచేడు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. గద్వాల రూరల్ ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. గద్వాల పట్టణానికి చెందిన సంజీవయ్య (41) మల్దకల్ మండలంలో విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆ శాఖ తరపున వరంగల్‌లో క్రీడలు నిర్వహిస్తుండగా మూడు రోజుల క్రితం సంజీవయ్యతో పాటు జూబేర్లో పోటీల్లో పాల్గొనేందుకు కారులో వెళ్లారు. తిరిగి పట్టణానికి వస్తుండగా.. మంగళవారం ఉదయం 7గంటలకు గద్వాల మండలంలోని జమ్మిచేడు హరిత హోటల్ ఎదుట వారి వాహనానికి పంది అడ్డు రాగా దానిని ఢీకొట్టి వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న జుబేర్‌కు చెయ్యి విరగ్గా సంజీవయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి శవాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య శ్రీలతతో పాటు కుమారుడు వినయ్, కుమార్తె అక్షిత ఉన్నారు. ఇదిలాఉండగా, సంజీవ య్య మృతి చెందడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విద్యుత్ ఎస్ఈ చక్రపాణి, 1104 విద్యుత్ యూనియన్ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు, గద్వాల ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు కుటుంబసభ్యులను పరామర్శించారు. -
పెబ్బేరులో మాయలేడి..!
వనపర్తి: రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటి వరకు చూడని కొత్త మోసం వనపర్తి జిల్లా పెబ్బేరులో వెలుగు చూసింది. అధికారుల అలసత్వం కారణంగా.. ఓ మహిళ తన రూ.కోటి విలువ చేసే ఆస్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎంతో విలువైన ఆస్తుల హక్కులను మార్పిడి చేసే సమయంలో రిజిస్ట్రేషన్ చేసే అధికారులు సంబంధిత లింకు డాక్యుమెంట్, పట్టాదారు పాసు పుస్తకాలు, లింకు డాక్యుమెంట్‌లోని ఫొటోలు, ఆధార్ నంబర్లు, సంతకాలను సరిపోల్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసేశారు. ఎట్టకేలకు గుర్తించిన బాధితురాలు ఎస్పీని ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. తహసీల్దార్ కార్యాలయంలోనే.. కొన్ని నెలలుగా తహసీల్దార్ కార్యాలయంలోనే మండలానికి చెందిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తహల్దార్లే సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహించేలా.. ప్రభుత్వ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అదునుగా చేసుకుని ఓ మాయలేడి, కొందరు వ్యక్తులు పెబ్బేరులో కర్నూలు పట్టణానికి చెందిన షరీఫాబీకి చెందిన సుమారు రూ.కోటి విలువ చేసే 12 ప్లాట్లపై కన్నేశారు. తానే నిజమైన షరీఫాబీని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఆరుగురు వ్యక్తులపై 2018 అక్టోబర్ 11వ తేదీన రిజిస్టర్ చేసింది. 2019 మార్చిలో నిజమైన యజమానురాలు ఈసీ తీసేందుకు ప్రయత్నించగా.. ప్లాట్లను షరీఫాబీ ఇతరులకు విక్రయించినట్లు గుర్తించింది. ఒక్కసారిగా అవాక్కైన ఆమె తన భర్త ఎం.మక్బూల్‌పాషా తనకు 2016 డిసెంబర్ 6వ తేదీన 12 ప్లాట్లను గిఫ్ట్ డీడీ చేయించి ఇచ్చారని ఆధారాలతో వనపర్తికి వచ్చి ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదును పంపించడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. స్పందన కరువు.. మాయలేడి చేసిన డాక్యుమెంట్లను పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో డూప్లికేట్ కాపీలను తీసుకుని బాధితురాలు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు. ఏప్రిల్‌లో పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయితే.. ఇప్పటి వరకు డూప్లికేట్ షరీఫాబీ గాను.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని గాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టలేదు. డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపడితే.. అక్కడి ఇళ్లు తాళం వేసి ఉన్నాయని పోలీసులు సమాధానం చెప్పినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో తన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తాయనుకున్న ప్లాట్లను ఇలా కాజేస్తారని ఊహించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఎస్పీ, సబ్ రిజిస్ట్రార్, పెబ్బేరు పోలీసులను వేడుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యమే కారణం బాధితురాలు షరీఫాబీ రూ.కోటి విలువైన ఆస్తి కోల్పోవడానికి ప్రధాన కారణం లింకు డాక్యుమెంట్లు, ఈసీ అడ్రస్, ఫొటో సరిచూసుకోకుండా.. కాసుల కోసం ఆశపడి హక్కులను ఇతరుల పేరున మార్చడమేనని చెప్పవచ్చు. భూముల విలువ రూ.లక్షల్లో పలుకుతుండటంతో మాయగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడటం సర్వసాధారణమైంది. చిన్న పొరపాటు వలన పెద్ద నష్టం వాటిల్లింది. ఇందుకు బాధ్యత ఎవరు వహిస్తారు. పోలీసుల వద్దకు వెళ్తే.. కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. అయితే డూప్లికేట్ మహిళ రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దారే.. మళ్లీ కొన్న వారిని.. అమ్మిన వారిని పిలిపించి సదరు ఆస్తిపై హక్కుదారులు మీరు కాదు కాబట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేస్తున్నట్లు మరో డాక్యుమెంట్ తయా రు చేసి రిజిస్టర్ చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
పూడ్చిన శవాలను కాల్చేందుకు యత్నం
గట్టు/ కేటీదొడ్డి (గద్వాల): వర్షాలు సరిగా కురియకపోవడానికి ఆ గ్రామస్తులు ఆరు నెలల క్రితం మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను ఖననం చేయడమేనని భావించారు. చివరకు పూడ్చిన ఆ శవాలను వెలికితీసి దహనం చేస్తేనే ఫలితం ఉంటుందని నమ్మారు. ఆనుకున్నదే తడువుగా దానిని ఆచరణలో పెట్టాలని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. వివరాలిల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని చింతలకుంట గ్రామం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఆరు నెలల క్రితం మృతి చెందిన ఇద్దరి (రెండు సామాజిక వర్గాలు) ని ఖననం చేయడంతోనే ఈ ఏడాది వర్షాలు కురియడం లేదని గ్రామస్తులు భావించారు. ఈ ఇద్దరికి శరీరంపై తెల్లమచ్చ (కుష్ఠువ్యాధి లక్షణాలు)లు ఉన్నాయని వారి మృతదేహాలను వెలికితీసి దహనం చేయాలని ఆదివారం ఉదయం నిర్ణయించుకున్నారు. ఈ విషయం కాస్త పోలీసులకు చేరడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహాలను వెలికితీస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో గ్రామస్థులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎలాంటి మూఢనమ్మకాలు ఆచరించవద్దని గ్రామస్తులకు ఎస్ఐ బాలవెంకటరమణ కౌన్సెలింగ్ ఇచ్చారు. -
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
సాక్షి, మహబూబ్‌నగర్ : గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చి.. గుర్తుపట్టడానికి రాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కనిమెట్ట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గురువారం స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కనిమెట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన గల ఓ బ్రిడ్జి కింద దాదాపు 35 సంవత్సరాల వయ స్సు గల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారు. అనంతరం ఆనవాళ్లు దొరకుండా ఉండేందుకు శవం పై, వస్తువులపై పెట్రోల్ పోసి నిప్పంటించా రు. అక్కడికి చేరుకున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం పక్కనే పడి ఉన్న టిఫిన్ బాక్సుపై నిందితుల వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్‌స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలించగా.. కొంతదూరం వెళ్లి అక్కడే ఆగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఎస్పీ వెంట స్థానిక సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ రవికాంత్‌రావు, ట్రైనింగ్ ఎస్ఐ హరీష్, ఏఎస్ఐ రోశన్న హెడ్‌కానిస్టేబుల్ వేమారెడ్డి, కానిస్టేబుళ్లు మహేష్, వెంకట్‌రెడ్డి, యుగంధర్‌గౌడ్ తదితరులున్నారు. -
ప్రేమించడం పాపమా.. శాపమా?
ప్రేమించడం పాపమా.. శాపమా? అనే ప్రశ్నకు సమాధానం లభించడంలేదు. కొందరు తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఆ ధైర్యం చేయలేక తనువు చాలిస్తున్నారు.. అందరికీ తెలిసిపోయిందని కొందరు.. తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో మరికొందరు.. వారిని ఎదురించలేక ఇంకొందరు.. ఇలా వేర్వేరు కారణాలతో ప్రేమికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆరునెలల కాలంలో పోలీసుల రికార్డులు పరిశీలిస్తే ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 20 నుంచి 25 మందికి పైగా ఉండగా జంట ఆత్మహత్యలే 10 వరకు ఉన్నాయి. తాజాగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రేమికుల జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. ప్రేమించడం పాపం కాదు.. కానీ ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు షాపంగా మార్చడమే సరైంది కాదు. అయితే వీరందరూ ఒక్కక్షణం ఆలోచించినా.. ఆత్మస్థైర్యం నింపుకున్నా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో బయటపడేవారని సూచిస్తున్నారు మానసిక వైద్య నిపుణులు. మహబూబ్‌నగర్ రూరల్: దేశానికి పట్టుగొమ్మలు అయిన అన్నదాతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రతి ఏడాది రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద పలు విడతల్లో రైతులకు ఎకరాకు రూ.16 వేల పెట్టుబడి సాయం వస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా పెట్టుబడి సాయం అందిస్తుండగా.. కేంద్రం తొలి విడతగా ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసింది. ఈ లెక్కన మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఏడాదికి రూ.755.33 కోట్ల సాయం అందినట్లయింది. వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభం నుంచి మొదలుకొని సాగు చేసే వరకు అయ్యే ఖర్చును కొంత వరకు ప్రభుత్వమే భరిస్తున్నందున రైతులు వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. నీటి వనరులు, బోరు బావులు, చెరువుల కింద పంటలు సాగు చేసే రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రేమే లోకం కాదు ప్రేమించిన వ్యక్తి నిరాకరించారని, ప్రేమించి మోసం చేశారని యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంలో ప్రేమ ఒక్కటే లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు ఇలా అందరినీ దుఃఖసాగరంలో ముంచి ఆత్మహత్యకు పాల్పడి సాధించేదేముంది. విలువైన జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలి. కన్నవారి కలలను తీర్చాలి. పుట్టి.. పెరిగిన ఊరికి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలి. ధైర్యం చెప్పేవారేరీ..? ‘సమాజంలో మనిషి ఎదుర్కోలేని కష్టాలను భగవంతుడు ఎన్నటికీ ఇవ్వడు’ అంటారు పరమహంస యోగానంద. రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు ఒక మాట అంటాడు. చనిపోవడం అనేక దోషాలకు కారణమవుతుంది. బతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది. అని ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు చెప్పేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. బలమే (ధైర్యమే) జీవితం.. బలహీనతే మరణమని అందరూ నమ్మాలని స్వామి వివేకానంద ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగయ్యేకొద్దీ ధైర్యవచనాలు చెప్పే వారు కరువవుతున్నారు. క్షణికావేశానికి లోనై బలవన్మరణం చేసుకుంటున్న వారిలో అత్యధికులు భారతీయులే ఉంటున్నట్లు ఒక అంతర్జాతీయ సంస్థ సర్వే వెల్లడించింది. వీరిలో అత్యధికులు ప్రేమలో విఫలం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఏటా వెయ్యి మందిలో 150 మంది ఇంట్లో ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది దీని సారాంశం. ఈ లెక్కన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక శాతం పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సంవత్సరానికి సుమారు పది లక్షల మంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతున్నారు. మనిషి తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం, మానవ అపసామాన్య స్థితిని తెలియజేస్తుంది. వ్యక్తి వారి జీవితాన్ని అంతం చేసుకోవాలని విపరీతమైన ఆలోచనలు చేయడాన్ని వైద్య భాషలో పారాసూసైడ్ అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ఆత్మహత్యా ప్రయత్నం రెండూ తీవ్రమైనవిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మనుషులు వారికి అనుకున్నది సాధించలేకపోయినప్పుడు.. నిస్సహాయులై మిగిలిపోయినప్పుడు.. భవిష్యత్‌ను అంధకారంగా భావించినప్పుడు తట్టుకోలేని మానసిక ఒత్తిడికి గురైనప్పుడు.. జీవితంలో మనోవ్యాధికిలోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని నిపుణుల మాట. ఇవిగో ఘటనలు.. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరనే అనుమానంతో ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన లోకేష్‌నాయుడు, కస్తూరిలు సోమవారం అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే తెలకపల్లి మండలం దాసుపల్లికి చెందిన గణేశ్ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని పురుగు మందు తాగి మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల తరచూ చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఘటనలన్నీ కేవలం క్షణికావేశంలో చోటుచేసుకున్నవేనని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మూడు కారణాలు ఆత్మహత్య చేసుకోవడం వెనక ప్రధానంగా మూడు కారణాలున్నాయి. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడం, ప్రేమ విఫలం కావడం, తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినే వారు ఎవరూ లేరనే భావనతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినే వారు ఉన్నారు అని వారు భావించినప్పుడు వారిలో ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది. గెలిచి.. చూపించాలి ప్రతీ వ్యక్తి జీవితంలో గెలవాలంటే అన్నింటికన్నా ముందు మానసిక పరిపక్వత చాలా అవసరం. చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు ఒడిదొడుకులు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అన్నీ దాటుకుంటూ వచ్చి అకారణంగా చిన్న విషయంలో ఒంటరి వారమవుతున్నాం. ప్రతి విషయాన్ని ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గెలుపు మన పక్కనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా మనసును పలకరిస్తుంటుంది. జీవితమంటే గెలుపోటముల సంగ మం అని గ్రహిస్తే కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే బలవన్మరణానికి పాల్పడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల ని కోటి మొక్కులు మొక్కే మన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఇలా మన వెనక గెలు పు చూడాలని తాపత్రయపడే వారు చాలామంది ఉంటారు. పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం జీవితాన్ని ధారబోసే తల్లిదండ్రులుంటారు. జీవితం ఒక్క మనకే పరిమితం కాదు. చాలా బంధాలు, బాంధవ్యాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి. మనపై ఆధారపడినవారి గురించి ఆలోచించాలి. మనం ఎదగడంలో, ఉద్యోగం సాధించడంలో వారి పాత్ర ఉందని, మన ఎదుగుదలకు వారు ఉపయోగపడాలనే ఆలోచన మదిలో మెదలాలి. మార్పు గమనించాలి.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మారణాలకు సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉంటారు. ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచన చేస్తారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తుంటారు. నేను లేకపోయిన మీరు బాగుండాలనే మాటలు నోటి నుంచి వస్తుంటాయి. తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగరు. ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందనే చర్చలు జరుపుతారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. – డాక్టర్ రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్ ఆ.. ఆలోచననే తుంచేయాలి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో మానసిక జబ్బులపై ప్రజలకు సరైన అవగాహన లేదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి కూడా తక్కువే. ఆ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రతి ఒక్కరికీ వచ్చే ఆలోచన ఆత్మహత్య చేసుకోవడం.. ఇలాంటి ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలి. ప్రేమలో విఫలం చెందిన వారి మీద వాస్తవానికి ఒత్తిడి బాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఆత్మహత్యలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఏమీ చేయలేనన్న భావనను మనసులోంచి తీసేయాలి. – వంగీపురం శ్రీనాథాచారి, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు -
క్షణికావేశానికి ముగ్గురి బలి
అమరచింత (కొత్తకోట): చిన్నపాటి వివాదం ఓ కుటుంబంలోని మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరు అన్నలు, ఓ చెల్లి క్షణికావేశంలో బావిలో దూకి మృతి చెందిన ఈ సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల ఎక్స్‌రోడ్డు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా.. నందిమల్ల ఎక్స్‌రోడ్డులో నివాసం ఉంటున్న దళిత రంగన్న, యాదమ్మకు నలుగురు సంతానం. పెద్దకూతురు రేణమ్మకు పదేళ్ల కిందట, పెద్ద కుమారుడు సంజీవ్(24)కు ఐదేళ్ల కిందట పెళ్లి చేశారు. రెండో కుమారుడు రమేష్(21) తనకు పెళ్లి చేయాలని ఈమధ్య తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ఈ తరుణంలోనే బుధవారం ఇంట్లో కుటుంబసభ్యులందరూ కూర్చొని రమేష్ వివాహంపై చర్చిస్తున్న సమయంలో చెల్లెలు జ్యోతి(17) ఫోన్లో మాట్లాడుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేని రమేష్ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో ఎందుకు కొట్టావంటూ అన్నదమ్ముల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర అసహనానికి గురైన రమేష్ ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకువచ్చి చెల్లెలిపై చల్లి తగులబెట్టడానికి ప్రయత్నిస్తుండగా కుటుంబసభ్యులు జ్యోతిని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవాలని పంపించారు. రక్షించేందుకు వెళ్లి.. దీంతో కలత చెందిన జ్యోతి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకింది. దీనిని గమనించిన అన్నదమ్ములు చెల్లిని కాపాడే ప్రయత్నంలో ఇరువురు ఒకరి తర్వాత ఒకరు బావిలో దూకారు. వీరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. వెంటనే తండ్రి రంగన్న సైతం బావిలోకి దూకి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా..ఫలితం దక్కలేదు. ఈత రాక ముగ్గురూ మృతి చెందారు. క్షణికావేశంలో జరిగిన సంఘటన ముగ్గురు జీవితాలను బలితీసుకోవడంతో నందిమల్ల ఎక్స్‌రోడ్డు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలం వద్దకు సీఐ బండారి శంకర్, ఎస్ఐ రామస్వామి, వీఆర్ఓలు పాంచజన్య చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాలను ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకర్ తెలిపారు. అలుముకున్న విషాదం మండలంలోని నందిమల్ల ఎక్స్‌రోడ్డులో బుధవారం చోటుచేసుకున్న సంఘటనలో ఇద్దరు అన్నలతోపాటు చెల్లి ఆత్మహత్య చేసుకోగా.. గ్రామంలో విషాదం అలుముకుంది. సాయంత్రం ఒక్కసారిగా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారన్న వార్త విని గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికితీసే యత్నంలో ఆ గ్రామ యువకులు సహాయపడ్డారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సంజీవ్ భార్య సుజాత, వారి పిల్లల రోదనలు పలువురిని కలిచివేశాయి. తల్లిదండ్రులు రంగన్న, యాదమ్మను ఓదార్చే ప్రయత్నం చేశారు. -
స్నేహితులే.. ప్రాణం తీసిండ్రు!
అయిజ (అలంపూర్): స్నేహితుల మధ్య డబ్బు చిచ్చుపెట్టింది. చివరకు స్నేహితుడి ప్రాణాన్నే తీసేంత స్థాయికి దిగజార్చింది. స్నేహానికే కళంకం తెచ్చే ఈ ఘటన అయిజ మండలంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కేశవరం గ్రామంలో కురువ మల్లేష్(25) ట్రాక్టర్ నడుపుకుంటూ సొంతంగా పొలం పనులు చేసుకునేవాడు. వీరన్న, నరసింహులు, మల్లేష్ స్నేహితులు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ కాలం గడిపేవారు. అయితే కుర్వ మల్లేష్ అతడి తండ్రి దస్తగిరి, భార్య సువర్ణకు తెలియకుండా వీరన్నకు గత ఏడాది రూ.70వేలు అప్పు ఇచ్చాడు. అయితే అప్పు తిరిగి చెల్లించాలని మల్లేష్ వీరన్నను కొన్ని రోజులనుంచి అడగడం మొదలు పెట్టాడు. పథకం ప్రకారం హతమార్చారు ఇదిలాఉండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గురువారం రాత్రి 9గంటలకు ముగ్గురు స్నేహితులు కలిసి బైక్‌పై మల్లేష్ పొలానికి చేరుకున్నారు. అక్కడే మద్యం సేవించారు. మల్లేష్ మద్యం మత్తులో ఉండగా.. వీరన్న, నరసింహులు అతని తలపై బండరాయితో మోదారు. అనంతరం బండిలో ఉన్న పెట్రోల్ తీసి మల్లేష్‌పై చల్లి నిప్పంటించారు. అప్పటికీ చనిపోయాడో లేదోనన్న అనుమానంతో కొంత దూరం లాక్కెళ్లి వేణిసోంపురంలోని మల్లన్న ఆలయం సమీపంలో గోతిలో పూడ్చిపెట్టారు. మరుసటి రోజు నుంచి ఏమితెలియని వారిలానే మృతుడి తండ్రితో మాట్లాడుతూ.. ఎక్కడికో వెళ్లి ఉంటాడు, రేపో మాపో వస్తాడంటూ చెప్పినట్లు తెలిసింది. తండ్రి ఫిర్యాదుతో.. అనంతరం మల్లేష్ ఫోన్ నంబర్‌కు అతని తండ్రి దస్తగిరి, కుటుంబసభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మూడురోజులైనా కొడుకు ఇంటికి రాకపోడంతో తండ్రికి అనుమానం వచ్చి.. వీరన్న, నరసింహులుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం వీరన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. సంఘటన మొత్తం బయటకు వచ్చింది. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్, శాంతినగర్ సీఐ గురునాయుడు, అయిజ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, ప్రొబిషనరీ ఎస్ఐ మానస, తహసీల్దార్ కిషన్‌సింగ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. వైద్యులతో అదే స్థలంలోనే పోస్టుమార్టం చేయించి కేసునమోదు చేసుకున్నారు. నరసింహులు పరారీలో ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
అంతు‘చిక్కట్లే’..!
ఉమ్మడి జిల్లాలో అదృశ్య కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. కనిపించకుండా పోతున్న వారిలో మహిళలు, బాలికలే అధికంగా ఉండటం విశేషం.. ఇందులో కొన్ని కేసులను పోలీసులు ఛేదిస్తున్నా.. మరికొందరు ఏమైపోతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకరోజులో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకటి లేదా రెండు కేసులు తమ వాళ్లు అదృశ్యం అయ్యారని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే కొందరు మతిస్థిమితం కోల్పోయిన వారు.. మరికొందరు ప్రేమ, ఇతర వ్యవహారాలతో కనిపించకుండా పోతున్నారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే 18 ఏళ్లపైబడిన వారు మూడేళ్లలో 963 మంది అదృశ్యమవగా.. 259 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాల విభజన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో 2017 సంవత్సరంలో 104 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. 2018లో 136, 2019లో 28 కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 298 అదృశ్య కేసులు నమోదైతే ఇందులో పదేళ్లలోపు వారు 110 మంది ఉండగా 188 మంది యువతులున్నారు. గద్వాల జిల్లాలో 2017లో నమోదైన 52 కేసులలో 23 మంది మహిళలు, 29 మంది చిన్నారులు, 2018లో 92 కేసులు నమోదవగా.. 69 మంది మహిళలు, 23 మంది చిన్నారులు, 2019లో 26 కేసులు నమోదు కాగా.. 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2017లో 270 కేసులు నమోదైతే 252 కేసులు ఛేదించారు. 2018లో 260 కేసులు నమోదు కాగా.. 125 కేసులు ఛేదించారు. 2019లో ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం వలస వెళ్లి.. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా మక్తల్, నారాయణపేట, కొడంగల్, గద్వాల నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరిలో దినసరి కూలీలు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదృశ్యమయ్యారు. ముఖ్యంగా కొయిలకోండ, నవాబుపేట, మద్దూరు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబయి, కర్ణాటక, పుణె తదితర నగరాలకు వెళ్లడంతోపాటు గల్ఫ్ దేశాలకు వెళ్తారు. ఇలా వెళ్లిన వారిలో చాలామంది అమాయకులు తప్పిపోతున్నారు. ఇందులో కొంత మంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి చూపిస్తామని తీసుకువెళ్లి మోసం చేస్తుండటంతో.. వారు తిరిగి రాలేకపోతున్నారు. అన్ని స్టేషన్లలో పెండింగే.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 74 పోలీస్స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్‌లో వందల సంఖ్యలో అదృశ్య కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటు కుటుంబ సభ్యులు.. బంధువులు గాలిస్తుంటే.. మరోవైపు పోలీసులు వారి కోణంలో గాలిస్తున్నారు. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులలో చాలా వరకు అదృశ్యమైన వారు కనిపించకపోవడంతో ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. దీనికి తోడు పోలీసులు సైతం అదృశ్యమవుతున్న కేసులపై అందగా దృష్టిసారించకపోవడంతో రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలు.. చచ్చుబండలు మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా.. అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. మహిళలపై వరకట్న వేధింపులు, గృహహింస.. బాలికలపై దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. కామాంధుల చేతుల్లో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం బలవుతున్న ఘటనలు కోకొల్లలు వెలుగుచూస్తున్నాయి. పండంటి కాపురంలో కలతలు నెలకొనడంతో రోజూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్న మహిళల సంఖ్య పెరుగుతోంది. వారంతా అత్తింటి నుంచి రక్షణ కోసం ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మంది భార్యాభర్తలకు పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్లో దారికి రాని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇవీ చేపట్టాల్సిన చర్యలు పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్ నంబర్లు గుర్తుండేలా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతోపాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించాలి. త్వరగా ఛేదిస్తున్నాం.. జిల్లాలో బాలికలు అదృశ్యమైతే కిడ్నాప్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. ఒక మర్డర్ కేసుకు ఇచ్చే ప్రాముఖ్యతను ఈ కేసుకు ఇస్తున్నాం. మేజర్ మహిళలు అదృశ్యమైతే మిస్సింగ్ కేసులు పెడుతున్నాం. ప్రతి కేసుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. పెండింగ్‌లో లేకుండా చూస్తున్నాం. యువతులు కొత్త వ్యక్తులను ఏమాత్రం నమ్మరాదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ, మహబూబ్‌నగర్ -
పెళ్లి వాహనం బోల్తా 35 మందికి గాయాలు
ఆదిలాబాద్‌రూరల్: ఓ పెళ్లి వాహనం బోల్తా పడి 35 మంది గాయాలపాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెళ్లికూతురుతో వెళ్తున్న ఆ వాహనం మరో 15 నిమిషాల్లో మండపానికి చేరుకోవాల్సి ఉండగా, ఈ ప్రమాదంతో పెళ్లికి వచ్చిన వారందరూ విషాదంలో మునిగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంద్రవెళ్లి మండలం సమ్మక్క గ్రామానికి చెందిన జంగు వివాహం ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామానికి చెందిన అనక సొనేరావుతో నిశ్చయమైంది. ఈ క్రమంలో సమ్మక్క గ్రామం నుంచి తంతోలి గ్రామానికి ఐచర్ వ్యాన్ పెళ్లి కూతురు, ఇతర బంధువులతో బయల్దేరింది. పెళ్లి జరిగే ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాల గుట్ట వద్ద ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 50 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలవగా, 29 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్న పెళ్లి కొడుకు తరుపు వారు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొని, గాయపడ్డ వారిని రిమ్స్‌కు తరలించారు. క్షతగ్రాతుల్లో షెడ్మకె నాగమణి, చాకటి లక్ష్మి, పెందూర్ దేవురావు, సోయం మాలని, కొడంగ యశ్వంత్‌రావు, పెందూర్ దాములకు తీవ్ర గాయాలవగా, వీరిలో మాలని కుడి చేతిని వైద్యులు తొలగించాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బంధువుల రోదనలతో రిమ్స్ దద్దరిల్లింది. స్వల్ప గాయాలపాలైన 29 మంది కూడా ప్రస్తుతం రిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రమాదం కారణంగా బంధువులంతా ఆసుపత్రిలోనే ఉండటంతో ముహూర్తం దాటిపోయింది. అయినా, మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన వివాహం సాయంత్రం 5.30 గంటలకు సాదాసీదాగా జరిపించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే.. వాహన డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ఒకసారి బోల్తా పడ్డ వాహనం, మరో పల్టీ కొట్టి ఉంటే వాహనంతోపాటు తామంతా లోయలో పడేవారమని వివరించారు. దేవుడి దయవల్ల పెద్ద ప్రమా దం తప్పిందని వారు వివరించారు. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. డీఎస్పీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ కూడా రిమ్స్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రముఖుల పరామర్శ.. పెళ్లి బోల్తా విషయాన్ని తెలుసుకన్న ఆయా పార్టీల నాయకులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను ప రామర్శించారు. వారిలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి ఉన్నారు. వీరు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విషయాన్ని తెలుసుకొని రిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రుల వైద్యంలో లోటు రాకుండా చూడాలని కోరారు. -
చిన్నారి దిగకముందే కారు లాక్.. విషాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్‌లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృతి చెందింది. చిన్నారి కారు దిగకముందే లాక్ చేయడంతో ఊపిరాడక మరణించింది. సోదరుడి వివాహం కోసం పూలమాలలు తేవడానికి అంజలయ్య, తన 6 ఏళ్ల కూతురుతో కలిసి జడ్చర్లకు వెళ్లివచ్చాడు. చిన్నారి కారు దిగకముందే కార్ లాక్‌చేసి వెళ్లిపోయాడు. అనంతరం వివాహ వేడుకల్లో పడి చిన్నారి కారులో ఉందనే విషయం మరిచిపోయారు కుటుంబసభ్యులు. అనంతరం కారు దగ్గరికి వచ్చి చూసేసరికి ఆరేళ్ల కేజియా అప్పటికే మృతి చెందింది. దీంతో అప్పటివరకు ఆహ్లాదంగా ఉన్న ఇంట్లో.. చిన్నారి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డిలో రోడ్డుప్రమాదం వివాహానికి వెళ్తోన్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. వీళ్లందరిది మహారాష్ట్రలోని దెగళూరు గ్రామంగా గుర్తించారు. హైదరాబాద్‌లో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ -టిప్పర్ లారీ ఢీ నిర్మల్‌లోని శివాజీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై ప్రయాణించిన ఇద్దరిది మామిడ మండలం పరిమాండ్ గ్రామం. మృతుడు రాజాగౌడ్‌గా గుర్తించారు. -
కేటీదొడ్డిలో హత్యల కలకలం
గద్వాల క్రైం: కూలీ పనులకు వెళ్లిన సగటు వ్యక్తులు సాయంత్రం ఇంటికి వస్తారనే ఆశ..! పొలం పనులకు వెళ్లిన రైతన్న మాత్రం నేడు క్షేమంగా ఇంటికి వెళ్లలేని దుస్థితి. కరెంటు షాక్.. విష పురుగులు.. జంతువుల దాడిలో పొలం వద్ద రైతు మృతి చెందాడనే వార్త గ్రామాల్లో చోటుచేసుకునేవి.. కానీ, ఇప్పుడు మనుషులే ఒకరిపై ఒకరు హత్యలకు తెరతీస్తున్నారు. అర్ధరాత్రి హత్యలకు తెగబడుతున్నారు. ఓ కుటంబ వ్యవస్థను నిలువునా చీల్చి వేస్తున్న దారుణ సంఘటనలు ప్రస్తుతం పల్లె ప్రజలను భయాందోళనలోకి నెట్టేస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో ఇటీవల కాలంలో రైతు హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇవిగో ఘటనలు ఠి మార్చి 8వ తేదీన కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన చంద్రబండ బోయ తిమ్మప్ప(35) అనే వ్యక్తి పని నిమిత్తం శుక్రవారం రాత్రి ఇంటి నుంచి దగ్గరలో ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లిన క్రమంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండు రోజుల తర్వాత వెలుగుచూసింది. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. ఠి ఏప్రిల్ 23న కేటీదొడ్డి మండలం పాతపాలెంకు చెందిన కొలిమి వెంకటేష్(55) రోజూ మాదిరిగానే పొలానికి వెళ్లి రాత్రిపూట నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులలో దాడి చేసి హతమార్చారు. ఈయనను కూడా ఎందుకు హత్య చేశారనే విషయంపై స్పష్టత లేదు. పోలీసులు రెండు హత్యలపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నెల వ్యవధిలోనే వ్యవసాయ పొలాల వద్ద చోటు చేసుకున్న ఈ హత్యలపై మండల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అసలు కారణమేంటి? ఈ రెండు హత్యల విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు, పొలం తగాదాలు కారణమై ఉంటాయని ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి తప్పిదాలు సైతం హత్యకు కారణం కావచ్చనే గుసగుసులు వినిపిస్తున్నాయి. సొంత వ్యక్తులను తమ వర్గం వారే హత్య చేయాల్సిన పరిస్థితికి తీసుకువస్తున్నారు. అయితే ఈ రెండు హత్యల తీరును చూస్తే వివాహేతర సంబంధాలే కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొలిక్కిరాని కేసులు.. సాంకేతిక పరంగా పోలీసు శాఖ పలు కీలక కేసులను ఛేదించడంలో మొదటి స్థానంలో ఉందనే చెప్పాలి. అయితే మార్చి నెల 8వ తేదీన హత్యకు గురైన వివరాలు ఇప్పటి వరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు. కేసు దర్యాప్తులో భాగంగా ముమ్మరంగా ఆరా తీస్తున్నా హంతకుల ఆచూకీ తెలియలేదు. అలాగే ఏప్రిల్ 23న జరిగిన హత్య విషయంలోనూ జాగిలాలు గ్రామాల్లో పలు మార్గంలో హంతకులు వెళ్లినట్లు గుర్తించాయి. పోలీసులు సైతం కేసుల విషయంలో పలు కీలక ఆధారాలను సేకరించినప్పటికీ కేసు ఓ కొలిక్కి రాలేదు. దీంతో నిందితులు చిక్కరు.. దొరకరు అన్న చందంగా మారింది. త్వరలోనే ఛేదిస్తాం.. కేటీదొడ్డి మండలంలో జరిగిన రెండు హత్య కేసులకు సంబంధించి హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించి తెలుసుకున్నాం. పలు కీలక ఆధారాల కోసం ఫోరెనిక్స్ నిపుణుల సహాయం తీసుకున్నాం. కేసుల విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే కేసులను ఛేదించి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. – హన్మంతు, సీఐ, గద్వాల -
అన్నను చంపిన తమ్ముడు
అమరచింత (కొత్తకోట): ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన సంఘటన మండలంలోని కొంకన్వానిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కొంకన్వానిపల్లి గ్రామానికి చెందిన గొల్ల చంద్రన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పెద్ద రాజు, చిన్నకుమారుడు చిన్న రాజు కలిసి వ్యవసాయ పనులతో పాటు గొర్ల మందను మేపేవారు. ఉమ్మడి కుటుంబంలో 200 పైచిలుకు గొర్రెల మందను పోషిస్తున్న ఇరువురు ఓ కాపరీని జీతానికి నియమించుకున్నారు. నెలసరి వేతనాలను చెల్లిస్తూ గొర్లను కాపాడుతూ వ్యవసాయ పనులను సాఫీగా కొనసాగిస్తూ వచ్చారు. గత రెండు నెలల క్రితం ఉమ్మడి ఆస్తిగా ఉన్న గొర్రెల మందను అన్నదమ్ములు ఇరువురు సమానంగా పంచుకున్నారు. దీంతో గొర్రెల కాపరికి చెల్లించా ల్సిన వేతనాన్ని అన్న ఇవ్వలేదని చిన్న రాజు తరచూ గొడవ పడేవాడు. హత్యకు దారితీసిన రూ.10వేలు ఇదిలాఉండగా, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తికి గొల్ల పెద్దరాజు ద్వారా రూ.10వేలు చెల్లించాల్సి ఉందని తమ్ముడు చిన్నరాజు తరచూ డబ్బుల విషయంలో తగువులాడేవాడు. దీంతో ఉమ్మడి ఆస్తిగా ఉన్న గొర్రెల మందలో ఎన్నో గొర్రెపిల్లలను అమ్ముకున్నావని అన్న చెప్పిన మాటలకు జీర్ణించుకోలేని చిన్నరాజు అన్నపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం నుంచి తిరిగివచ్చిన పెద్దరాజు తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడే ఇంటికి వచ్చిన చిన్నరాజు ఇంట్లోకి వెళ్లి నిద్రమత్తులో ఉన్న గొల్ల పెద్దరాజు తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు. దీంతో తల పగిలి తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చిన్నరాజు ‘నా అన్నను చంపేశా..’ అంటూ అరుస్తూ పరారైనట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఆత్మకూర్ సీఐ బండారి శంకర్, అమరచింత ఎస్ఐ రామస్వామి సంఘటన స్థలానికి చేరుకుని మృతుని బంధువులు, కుటుంబసభ్యుల ద్వారా వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గొల్ల పెద్దరాజుకు భార్య మంజులతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
తమ్ముళ్లే కడతేర్చారు!
మద్దూరు (కొడంగల్): ఒకే రక్తం పంచుకుని పుట్టిన తమ్ముల్లే.. చిన్నపాటి తగాదాలతో సొంత అన్నను బండరాయితో మోది హతమార్చారు. ఈ ఘటన మండలంలోని గోకుల్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త అంజయ్య(29) తండ్రి గోవిందు కొంతకాలం క్రితం మృతి చెందడంతో హైదరాబాద్‌లో కూలీ పనిచేసుకుంటూ తన ఇద్దరు తమ్ముళ్లు (కొత్త రాజు, కొత్త రమేష్)తోపాటు తల్లి తిరుమలమ్మ, భర్త వదిలేసిన అక్క అంజమ్మను పోషిస్తున్నాడు. పెద్ద తమ్ముడు కొత్త రాజు కూడా హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తుండేవాడు. గ్రామంలో తల్లి తిరుమలమ్మ, అక్క అంజమ్మ, చిన్న తమ్ముడు రమేష్ ఉండేవారు. మరో చెల్లెలు అనితను గ్రామంలోనే ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే తిమ్మారెడ్డిపల్లిలో బావాజీ జాతర జరుగుతుండడంతో గత నాలుగు రోజుల క్రితం కొత్త అంజయ్య గ్రామానికి వచ్చాడు. అలాగే ఒక తర్వాత తమ్ముడు కొత్త రాజు సైతం గ్రామానికి వచ్చాడు. కొంతకాలం క్రితం నిర్మించిన ఇంటిపై ఉన్న అప్పు విషయమై శనివారం రాత్రి కొత్త అంజయ్య కుటుంబ సభ్యులకు చెబుతూ పనిచేయాలని ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు, తల్లికి చెప్పాడు. ఇదే క్రమంలో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ఇద్దరు తమ్ముళ్లు రాజు, రామేష్‌లు బండరాయి తీసుకువచ్చి కొత్త అంజయ్య నెత్తిపై వేశారు. దీంతో అంజయ్య తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరో చెల్లెలు బసుల అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బెట్టింగ్ బంగార్రాజులు
మహబూబ్‌నగర్ క్రైం: క్రీడాభిమానులకు ఐపీఎల్ జ్వరం పట్టుకున్నట్లు.. రాజకీయ అభిమానులకు కూడా అదే జ్వరం పట్టుకుంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు.. అనే దానిపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకు రాజకీయ రణక్షేత్రంలో హోరాహోరీగా తలపడిన నేతల్లో విజేత ఎవరోననే ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థులు, వారి అనుచరులతోపాటు రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 23 వరకు ఆగాల్సిందే.. పోటీలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలడానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఫలితాలపై ఆసక్తి పెరగడంతో లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు. ప్రభుత్వ వ్యాపారులు, యువత, నాయకులు, ఉద్యోగులు సైతం బెట్టింగ్‌పై దృష్టి పెట్టారంటే పోరు ఎంత రసవత్తరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహబూబ్‌నగ్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఈ అంశమే వినవస్తోంది. ఎన్నికలు ముగిసి వారం కావస్తున్నా అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్యాలయాల్లో, హోటళ్లలో, దుకాణాల్లో అందరినోటా ఇదే ముచ్చట వినపడుతోంది. ఎవరి అంచనాలో వారు.. ఈనెల 11న సాయంత్రం 5గంటలకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. అప్పటి నుంచి ఎవరి అంచనాల్లో వారున్నారు. మరోవైపు కొందరు ఎవరు నాయకుడు అవుతాడనే అంశంపై బెట్టింగ్ వేస్తున్నారు. ఇప్పటికే ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువరించినా.. పార్టీల వారీగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు ఎవరి ధీమాలో వారున్నారు. ఇ అంతట ఇదే చర్చ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరు ఇదే చర్చ జరుగుతోంది. ఉదయం వేళ మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు ఫలితాలు ఎట్లుంటయోనని ఒకటే ముచ్చట్లు పెడుతున్నారు. టీ కొట్లు, హోటల్స్, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు ఇలా ఎక్కడికి వెళ్లినా ఫలితాలపైనే ఆసక్తికర సంభాషణలు నడుస్తున్నాయి. ఫలానా వ్యక్తి గెలువబోతున్నారని ఒకరంటే.. కాదు కాదు ఇంకో వ్యక్తి గెలుస్తారంటూ వాదనలకు దిగుతున్నారు. ఏదేమైనా ఫలితాల ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవాలంటే వచ్చేనెల 23వరకు ఆగాల్సిందే. -
అయ్యో.. దేవుడా ఎంత ఘోరం!
‘అయ్యో.. దేవుడా! ఇంత ఘోరమా.. ముక్కుపచ్చలారని మా పిల్లలు ఐదుగురిని ఒకేసారి తీసుకునిపోతివా..’ అంటూ బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలచివేసింది. మల్దకల్మండలం నాగర్‌దొడ్డికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు చిన్నారులు సోమవారం సాయంత్రం ఆడుకుంటూ శివారులోని రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడి బావి గుంతలో పడి మృత్యువాత పడటంతో విషాదం అలుముకుంది. ఉదయం ఎంచక్కా స్కూలుకు వెళ్లొచ్చారు. సాయంత్రం కాసేపు రిజర్వాయర్ నీటిలో ఆడుకుందామని ఆవుతోపాటు వెళ్లడమే.. ఆ చిన్నారుల జీవితాలకు నిండునూరేళ్లు నిండేలా చేసింది. ఎక్కడికి వెళ్లినా జాగ్రత్త బాబూ.. అంటూ చెప్పే తల్లిదండ్రులు ఊహించలేదు ఆ చిన్నారులకు కానరాని లోకాలు వెళ్తారని... మృత్యువు ఎప్పుడు ఏ విధంగా వెంటాడుతుందో చిన్నారులు పసిగట్టలేకపోయారు. అందరూ చిన్నపిల్లలు కావడంతో.. అప్రమత్తం కాలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరిని వరుసగా ఐదుగురిని నీటిగుంట మింగేసింది. ఈ దుర్ఘటన మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామాన్ని విషాదంలోకి నెట్టేసింది. బాధిత కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. మల్దకల్ (గద్వాల) : మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలోని బావి గుంతలో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృత్యువాత పడ్డారు. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన బాలికలు కాగా, మరో ఇద్దరు బాలికలు ఇతర కుటుంబాలకు చెందిన వారు. నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లప్ప, మాణిక్యమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో యుమున(12), చిన్నారి(11), వెంకటేశ్వరి (10) మృత్యువాతపడ్డారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో చిన్నారి (8) మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన చిన్న కుర్వ వెంకటేష్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కవిత(11) మృతిచెందిన వారిలో ఉన్నారు. సరదానే ప్రాణాలమీదికొచ్చింది.. చిన్నారులంతా పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఒంటిపూట బడులు కావడం, చిన్నారులంతా ఆటల్లో మునిగి తేలారు. ఈ క్రమంలో సాయంకాలం కావడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆవును దగ్గరలో ఉన్న పొలాల వద్ద మేపేందుకు తీసుకెళ్లారు. ఈ సంతోషమే వారిని మృత్యు ఒడిలోకి చేర్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంకాలం సుమారు 4.30గంటల ప్రాంతంలో ఆవుతో పాటు ఐదుగురు చిన్నారులు వెళ్లారు. చివరగా గంటన్నర వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులంతా కూడా దినసరి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే తమ పనులు ముగించుకొని ఇంటికి చేరుకోగానే పిడుగులాంటి వార్త విని నిశ్చేష్టులయ్యారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చిన్నారులను పాఠశాలకు పంపించేవారు ఆ తల్లిదండ్రులు. నిరక్షరాస్యులైన కుటుంబాలకు అక్షర జ్యోతులను వెలిగిద్దామని బుడి బుడి అడుగులు వేసిన బాల్యానికి బావిగుంత మృత్యుపాశమవగా.. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. తాము ఇంటికి వెళ్లగానే ఏం తెచ్చావనే ప్రశ్నించే చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడంతో గుండెలు బాదుకొని రోదించారు. ఆ దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఇక తోటి స్నేహితులు సైతం తమ స్నేహితులు లేరని తెలుసుకొని దీనస్థితికి చేరుకున్నారు. ప్రముఖుల పరామర్శ ఐదుగురు చిన్నారులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, ఎస్పీ లక్ష్మీనాయక్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, సర్పంచ్ బండ్ల జ్యోతి, డీఎస్పీ షాకీర్‌హుసేన్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వపరంగా కుటుంబాలను ఆదుకుంటామని చిన్నారుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. సంఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మల్దకల్ ఎస్ఐ కృష్ణ ఓబుల్‌రెడ్డి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆవుతోక పట్టుకొని వెళ్లి.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రోజూలానే సోమవారం గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు వెళ్లారు. అందరూ కూడా ఇంచుమించు ఒకే వయస్సు గల చిన్నారులు కావడంతో కలిసి మెలిసి ఆడుకునేవారు. సాయంత్రం 5గంటల సమయంలో గ్రామ సమీపంలోని రిజర్వాయర్‌లోని ఆడుకునేందుకు బయల్దేరారు. అరకొర నీటిలో ఆడుకుంటూ ముందుకు సాగారు. అయితే కుమ్మరి ఎల్లప్పకు చెందిన ఆవును కూడా వారితో పాటే తీసుకెళ్లారు. అక్కడ లోతుగా ఉన్న పెద్ద గుంత ఉంది. అది గమనించని చిన్నారులు అలాగే ఆవుతో పాటు నీటిలో నడుస్తూ వెళ్లారు. ప్రమాదవశాత్తు ఐదుగురు చిన్నారులు పెద్ద గుంతలో పడిపోయారు. పడిన వెంటనే పెద్ద ఎత్తున కేకలు వేసినా చుట్టు ప్రక్కల ఎవరూ లేకపోవడంతో చిన్నారులు నీటిలో మునిగిపోయారు. చిన్నారులకు ఈత రాకపోవడం, నీటిలో ఊపిరాడక మృతి చెందారు. తెలిసిందిలా.. ఇదిలాఉండగా, మృతిచెందిన చిన్నారి యమున తండ్రి ఫోన్ ఇంట్లో ఉండడంతో ఫోన్ కూడా తనతో పాటే తీసుకెళ్లింది. ఈ ఫోన్ ప్రమాదం జరిగిన నీటి గుంత ఒడ్డుపైనే ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రైతు కుమ్మరి ఎల్లప్పకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతసేపటికీ ఎత్తకపోవడంతో ఆ రైతు ఇంటివద్దకు వెళ్లి ఫోన్ ఎత్తడం లేదని ప్రశ్నించాడు. ఫోన్ తన వద్ద లేదని వివరించాడు. అయితే మీ ఆవు వ్యవసాయ పొలం వద్ద ఉందని, మీ పిల్లలు ఎక్కడున్నారనే మాట కలిపాడు. దీంతో హుటాహుటిన ఆవుతో పాటే పిల్లలు వెళ్లారని గ్రహించి అక్కడికి చేరుకున్నారు. ఫోన్ ఒడ్డుపైనే ఉండటం చూసి ఖంగుతిన్నారు. అటూ ఇటూ వెతకసాగారు. ఒకవేళ గుంతలో పడ్డారేమోనన్న అనుమానంతో గుంతలోకి దిగి వెతకగా చిన్నారుల మృతదేహాలు ఒక్కొక్కటికి బయట పడ్డాయి. అయితే కవిత మృతదేహం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇక మరోసారి స్థానికుల సాయంతో వెతకగా రాత్రి 8గంటల ప్రాంతంలో కవిత మృతదేహం లభ్యమైంది. -
మృత్యు మలుపులు
మహబూబ్‌నగర్ క్రైం: కళ్లు మూసి తెరిచేలోగానే.. ఘోరాలు జరిగిపోతున్నాయి.. రెప్పపాటులోనే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.. రహ దారి పొడవునా నెత్తుటేరులు పారుతున్నాయి.. క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి.. మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ మధ్య ఉన్న రహదారిపై ఈ పరిస్థితులు నిత్యకృత్యమయ్యాయి.. ఇలాం టి ఘటనలు ప్రతిరోజు చోటుచేసుకుంటున్నా.. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ రహదారి మరోసారి తెరపైకి వచ్చింది.. మైసమ్మ మలుపు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఓ పరిశీలిస్తే రాత్రివేళలో ఆ మలుపు దగ్గర రెడ్‌లైట్ ఇండిగేటర్ లేకపోవడంతో చీకటిలో ముందు వచ్చే లారీ కనిపించక టాటా సుమోను ఓవర్‌టెక్ చేసి ముందుకు వెళ్లిన ఇండికా కారు.. లారీని ఢీకొట్టింది.. ఇవిగో ఘటనలు మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న రహదారిపై గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి. వాటిలో ధర్మాపూర్ క్రాస్‌రోడ్ దగ్గర మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న సంఘటనలో ఆరు మంది మృత్యువాతపడ్డారు. అలాగే చౌదర్పల్లి స్టేజీ దగ్గర ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. మన్యంకొండ స్టేజీ దగ్గర కారు బోల్తాపడి ముగ్గురు, ఓబ్లాయిపల్లి దగ్గర కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు, రాంరెడ్డిగూడెం దగ్గర బోయపల్లికి చెందిన ఓ కుటుంబం, ఆటో, జీపు ఢీకోనడంతో ఆటోలో ఉన్న ఓ బాబు, ఓ వ్యక్తి మృతిచెందారు. న్యూ ఇయర్ వేడుకల్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు ధర్మాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ప్రమాదానికి గురై మృతిచెందారు. ఆగస్టులో జరిగిన ఆర్టీసీ బస్సు, ఆటో ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి, ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. తాజాగా మంగళవారం రాత్రి జరిగిన లారీ, రెండు కార్ల ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జడ్చర్ల నుంచి రాయచూర్ వరకు 167వ జాతీయ రహదారిగా మార్పు చెందిన తర్వాత ఈ రహదారిపై ఏ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆర్అండ్బీ అధికారులు ఈ రోడ్డుతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. జాతీయ రహదారి భద్రత అధికారులు స్థానికంగా కనిపించడం లేదు. దీంతో రోడ్డు పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారింది. కనిపించని సూచికలు, హెచ్చరికలు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్లపై వాహనాల వేగాన్ని క్రమబద్ధీకరించేందుకు రేడియం స్టిక్కర్లు అతికించి మొబైల్ బారికేడ్లు, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన బారికేడ్లు కింద పడిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. రోడ్డు మరమ్మతు జరుగుతున్న దగ్గర.. గుంతలు ఉన్న చోట సూచికలు ఏర్పాటు చేయాలి. రోడ్ల ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ రోడ్ల పక్కనే హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. రోడ్ల సామర్థ్యం మేరకు ఎంత వేగంగా వెళ్లాలో తెలిపే సూచికలు ప్రమాదాలు, వర్షం కారణంగా కిందపడిపోతే పునరుద్ధరించాలి. మహబూబ్‌నగర్ నుంచి రాయిచూర్ మధ్య ఉన్న రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తే.. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, రహదారిపై అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అనే విషయం తేటతెల్లమవుతుంది. ముఖ్యంగా రహదారిపై ఉన్న మూలమలుపులు, విశాలంగా లేని రోడ్డు కారణంగా ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ద్విచక్రవాహనాలతోపాటు ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు ఇతర భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దారుణమేమిటంటే కాలినడకన వెళ్తున్న వారు కూడా ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకోవడం దాదాపు ఇక్కడే చూస్తుంటాం అనడంలో అతిశయోక్తి లేదు. నరకప్రాయం.. అరగంట ప్రయాణం మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పరదేశీనాయుడు చౌరస్తా నుంచి దేవరకద్ర వరకు అత్యంత ప్ర మాదకరమైన మూల మలుపులు 12 ఉండ గా, 18 చోట్ల ఎగుడు దిగుడుగా రోడ్డు కనిపిస్తోంది. వన్‌టౌన్ చౌరస్తా నుంచి దేవరకద్రకు 23 కి.మీ. అంటే కేవలం 30 నిమిషాల ప్ర యాణం.. ఈ అరగంట సమయంలో ప్రయా ణికులకు నరకం చూపుతుంది. మొదటి మ లుపు రాజీవ్ గృహకల్ప దగ్గర ఎదురవగా.. ఇక్కడ ఉండే మలుపు అత్యంత ప్రమాదకరం గా ఉంటుంది. అక్కడి నుంచి కొంత ముందు కు వెళ్లడంతో మైసమ్మ దగ్గర ఉన్న మరో మ లుపు దగ్గర అవతలి వాహనాలు దగ్గరకు వెళ్లే వరకు కనిపించవు. అక్కడి నుంచి కొంత ముందుకు వెళ్తే ఆల్‌మదీనా కళాళాల దగ్గర మరోమలుపు దర్శనమిస్తుంది. అదేవిధంగా మరి కొంత దూరంలో పెట్రోల్ బంకు ఎదుట ధర్మాపూర్ సమీపం లో ఉన్న మలుపు ఈ రోడ్డులోనే అత్యంత ప్ర మాదకరమైంది. ఇక్కడ జరిగినన్ని ప్రమాదా లు మరెక్కడా జరిగి ఉండవు. అలాగే జేపీఎన్సీఈ కళాశాల దగ్గర మరో మలుపు, కోడూ రు– ఓబ్లాయిపల్లి మధ్యలో మరో అత్యంత ప్రమాదకరమైన మలుపు వస్తోంది. కేవలం ఈ మలుపుల దగ్గర గతంలో చూసుకుంటే అత్యంత దారుణమైన ప్రమాదాలు జరగడం గమనార్హం. కుటుంబాలు చిన్నాభిన్నం రహదారి ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, మృతుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. గాయాలతో బయటపడిన వారు ఎక్కువ సంఖ్యలో వికలాంగులు అవుతున్నారు. వారిలో కొంతమంది ఏళ్ల తరబడి మంచానికే పరిమితమవుతున్నారు. కొన్ని సంఘటనల్లో కుటుంబ సభ్యులంతా మృత్యుపాలవుతున్నారు. భర్తను కోల్పోయిన భార్య తమ పిల్లలను సాకుతూ ఒంటరిగా కుటుంబాన్ని పోషించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇవి ప్రమాదానికి గురైన కుటుంబాల్లో కనిపించే విషాధ ఘటనలు. ప్రమాదానికి కారణమైన వ్యక్తుల బాధలు మరోలా ఉంటున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరు జైలుకు కూడా వెళ్తున్నారు. డివైడర్ ఏర్పాటు చేయాలి రాయచూర్ రోడ్డు వెడల్పు అయిన తర్వాత వాహనాల వేగం చాలా పెరుగుతుంది. ఈ క్రమంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. రాత్రివేళలో రోడ్డు వెంబడి విద్యుత్ దీపాలు లేకపోవడంతో లైటింగ్ తక్కువగా ఉండే వాహనాలకు ముందు వాహనం కనిపించదు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. పాలమూరు యూనివర్సిటీ నుంచి మన్యంకొండ వరకు రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను కొంత వరకు తగ్గించవచ్చు. – శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ ఎంవీఐ, మహబూబ్‌నగర్ ఈ ప్రాంతాలే ప్రమాదకరం మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న అంతర్రాష్ట్ర రహదారిపై నిత్యం ప్ర మాదాలు జరిగే స్థలాలు 10 వరకు ఉంటా యి. వాటిలో ముఖ్యమైన ప్రదేశాలు రాజీ వ్ గృహకల్ప మలుపు, మైసమ్మ మలుపు, ఆల్‌మదీనా కళాశాల, ధర్మాపూర్ క్రాస్‌రో డ్, ధర్మాపూర్ సమీపంలో, చౌదర్పల్లి గేట్ ఎదుట, జేపీఎన్సీఈ దగ్గర, కోడూర్, ఓ బ్లాయిపల్లి మలుపు, దేవరకద్ర పెద్ద వంతెనపై ప్రమాదాలు జరుగుతుంటాయి. -
వివాహిత హత్య.. భర్తే నిందితుడు
ధన్వాడ(నారాయణపేట): మండలంలోని కిష్టాపూర్ పంచాయతీలోని మూలతండాలో మంగళవారం ఉదయం అనిత(23) హత్యకు గురైంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాలు... మూలతండాకు చెందిన బాల్యనాయక్‌కు అనితతో ఆరేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలను నానమ్మ వద్ద ఉంచి వీరు బతుకుదెరువు కోసం పూణె వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. పిల్లలను చూసేందుకు నాలుగు రోజుల క్రితం తండాకు వచ్చారు. మంగళవారం ఉదయం 7గంటల సమయంలో అనిత తన మేనల్లుడి(4)ని తీసుకొని పక్కనే ఉన్న తమ పొలంలో కంది కట్టెల కోసం వెళ్లింది. కొద్దిసేపటికే మేనల్లుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 9గంటలైనా ఇంకా అనిత ఇంటికి రాకపోవడతో మరదలు వరసైన చిట్టెమ్మ పొలానికి వెళ్లింది. అప్పటికే అనిత మృతిచెందింది. స్థానికులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమచారం అందించారు. భార్యను కడతేర్చిన భర్త మృతదేహం వద్దకు చేరుకున్న ధన్వాడ ఇన్చార్జ్ ఎస్ఐ జానకిరాంరెడ్డి, అనిత మృతి విషయమై ఆమె భర్త బాల్యనాయక్ను అడిగారు. పొంతన లేకుండా మాట్లాడడంతో అనుమానం వచ్చి, విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్య పూణెలో మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుతోందని తెలిపాడు. అందుకే చంపానని విచారణలో వెల్లడించాడు. కర్చిఫ్ గొంతుకు బిగించి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తండాకు వెళ్లిపోయాడని ఎస్ఐ జానకిరాంరెడ్డి తెలిపారు. -
ఆవిరైన ఆశలు..!
జడ్చర్ల: సొంత ఊరును.. కన్న వారిని చూసేందుకు గంపెడాశతో వస్తున్న ఆ దంపతులను రోడ్డు ప్రమాదం అమాంతం మింగేయగా.. కుమారుడు, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మరికొద్దిసేపట్లో తమ కుమారుడు, కోడలు వస్తారని ఇంటి దగ్గర ఆశగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. ఈ హృదయ విదారక సంఘటన జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజుయాదవ్ కథనం ప్రకారం.. హన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాకు చెందిన కేతావత్ రవి(30), అతని భార్య సుజాత(26)లు కొంతకాలంగా హైదరాబాద్‌లో మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరు గురువారం హైదరాబాద్ నుంచి సొంతూరులో తల్లిదండ్రులను చూసేందుకు ఓ ప్రైవేట్ ఓమినీ వాహనంలో వెంకటమ్మకుంటతండాకు బయలుదేరారు. మరికొద్దిసేపట్లో్ల స్వగ్రామానికి చేరుకుంటామనగా.. జడ్చర్ల సమీపంలో మునవర్ దాబా దగ్గర ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్నఅు ఓమినీ వాహనం ఓవర్‌టెక్ చేయబోయాడు. అయితే ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా అలాగే వెళ్లడంతో ఓమినీ డ్రైవర్ ట్యాంకుర్ను ఢీకొట్టి.. రోడ్డు డివైడర్‌పై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుజాత అక్కడికక్కడే మృతిచెందగా.. ఓమినీలో ప్రయాణిస్తున్న మరో మహిళ కవిత, కేతావత్ రవి, రవి కుమారుడు అభిరాం తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలి.. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన రవి, సుజాత దంపతులు హైదరాబాద్‌లో సిమెంట్ నిర్మాణ పనుల్లో కూలీ పనులు చేస్తూ జీవనం గడిపేవారని వెంకటమ్మకుంటతండా సర్పంచ్ వెంకట్‌నాయక్ తెలిపారు. రవికి ముగ్గురు సంతానమని, వీరిలో ఐదు సంవత్సరాల అభిరాం ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బడయపడ్డాడని వివరించారు. తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో పిల్లలు అనాథలయ్యారని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
గుట్కా ఘాటు
గద్వాల క్రైం: మన రాష్ట్రంలో మత్తునిచ్చే గుట్కా ప్యాకెట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో వివిధ కంపెనీలు మూతబడ్డాయి. అయితే వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలనుంచి పోలీసుల నిఘా నేత్రాల దృష్టిలో పడకుండా సరిహద్దులు దాట్టి వేలాది ప్యాకెట్లను దొంగచాటున తీసుకొస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంగా తోడేళ్లలాంటి జాదూగాళ్ల సాయంతో వనపర్తి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. షాలో మునిగిన యువత ఆ దురలవాటును మానుకోకపోవడంతో వీరి వ్యాపారం గుట్టుగా జోరుగా సాగుతోంది. పాన్ మాసాల, జర్దా, ఖైనీ, తంబాకు, గుట్కాలతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వీటి విక్రయాలను నిషేధించారు. అయినప్పటికీ సరఫరా పొరుగు రాష్ట్రాలనుంచి అవుతూనే ఉంది. జిల్లాలో జనవరి ఒక్క నెలలోనే సుమారు రూ.3లక్షల విలువ గల గుట్కాలను పోలీసులు పట్టుకుని 7 కేసులు, 11 మందిని అరెస్ట్ చేశారంటే విక్రయాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. మూడింతలు లాభం మత్తెక్కించే గుట్కాలో దందాలో లాభం కూడా అదేస్థాయిలో ఉంటుంది. ఒక్క గుక్కా ప్యాకెట్ ధర రూ.5 ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ.10 నుంచి రూ.15 పలుకుతోంది. అంటే సగటున రోజుకు ఓ చిరు వ్యాపారి 100 ప్యాకెట్లు అమ్మితే కనీసం రూ.1500ల సంపాదన. ఇలా రోజుకు, వారానికి, నెలకు లెక్కేస్తే వారి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నమోదైన కేసులు జనవరి 5న కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాయచూర్ నుంచి రూ.27 వేల విలువ గల నిషేధిత గుట్కాలను రహ్యసంగా బైక్‌పై అయిజ మీదుగా తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని సరుకును సీజ్ చేశారు. 17వ తేదీన వనపర్తి జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు రాయచూర్ నుంచి గద్వాల మీదుగా రూ.30 వేలు విలువగల గుట్కాలను తరలిస్తుండగా జమ్మిచెడ్ శివారులో పట్టుకున్నారు. అదే రోజున గద్వాల పట్టణ పోలీసులు సైతం పలువురిని అదుపులోకి తీసుకోగా వారినుంచి వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. సరుకును సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. 18వ తేదీన వనపర్తి జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాయచూర్ నుంయి కారులో ఎవరికీ అనుమానం రాకుండా రూ.1, 80 లక్షల విలువ గల గుట్కాలను తరలిస్తున్నట్లు కేటీదొడ్డి పోలీసులకు సమాచారం వచ్చింది. నందిన్నె చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు. గుట్కా.. కేరాఫ్ కర్ణాటక! నిషేధిత పాన్ మాసాల, జర్దా, తంబాకు, కైనీ, గుట్కా విక్రయాలకు కర్ణాటకలో నిషేధం లేదు. అందులోనూ రెండు రాష్ట్రాలకు సరిహద్దు గల ప్రాంతం కావడంతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కర్నూల్ జిల్లా వాసులు అలంపూర్ చౌరస్తా నుంచి శాంతినగర్, అయిజ, బల్గెర మీదుగా రాయచూర్‌కు చేరుకుంటారు. అక్కడ సరుకును కొనుగోలు చేసి రహ్యసంగా బస్సుల్లో బైక్, కారు వంటి వాహనాల్లో తరలిస్తుంటారు. బల్గెర వద్ద పోలీసుశాఖ చెక్‌పోస్టును ఏర్పాటు చేయగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారు. నామమాత్రంగా తనిఖీలు చేపడితేనే ఇలా పట్టుబడుతుంటే సరిగ్గా ప్రతి వాహనాన్ని పరిశీలించి తనికీ చేస్తే ఇంకెంత సరుకు పట్టుబడుతుందో. ఇలా తరలిస్తుంటారు.. వనపర్తి జిల్లాకు చెందిన వ్యాపారులు గద్వాల జిల్లా మీదుగా సరుకును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వనపర్తి నుంచి గద్వాల, కేటీదొడ్డి, ధరూర్, దేవరకద్ర, మక్తల్ తదితర ప్రాంతల మీదుగా అనువుగా ఉండడం అక్రమార్కులకు అనువుగా ఉంది. అయితే ఇక్కడే తప్పించుకునేందుకు సులువైన మార్గాలు కూడా ఉన్నాయి. కేటీదొడ్డి మండలం నందిన్నె సరిహద్దు వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఇక మక్తల్ వద్ద మాగనూర్ దగ్గర మరో చెక్‌పోస్టును పోలీసు శాఖ ఏర్పాటు చేసినప్పటికి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి గుట్కా ప్యాకెట్లు చేరాల్సిన ప్రాంతాలకు సునాయాసంగా చేరిపోతున్నాయి. ఇక రాయచూర్ నుంచి నిత్యం గుట్కాలను తరలిచడం, తనిఖీలు చేస్తున్న తరుణంలో కర్నాటక డిపోకు చెందిన బస్సుల్లో సైతం రవాణా చేయడం వ్యాపారులకు కలిసి వస్తోంది. ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ కీలక వ్యక్తులు ఎవరు? నిషేధిత గుట్కా తరలింపు చేస్తున్నది ఎవరన్నది పోలీసులు బయటపెట్టాలి. పలుకుబడి ఉన్న వ్యక్తులు, పెద్దల అండదండలతో ఈ వ్యవహారం కొన్నసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల సహాయంతో ముందుగానే పోలీసులను మచ్చిక చేసుకోవడంతో ఎలాంటి తనిఖీలు లేకుండా సరుకు గ్రామాలకు చేరుతోందనే ఆరోపణలు సైతం లేకపోలేదు. పక్కా ప్లాన్‌తో కర్నాటక వ్యాపారులకు, అక్కడి పెద్దలతో నిత్యం టాచ్‌లో ఉండి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి ఏ సమయంలో తరలించాలో ముందుగానే చెప్పడంతో లక్షల కొద్దీ సరుకులు సరిహద్దులు దాటిపోతోంది. గొలుసు కట్టు దుకాణాలే టార్గెట్.. వ్యాపారంలో నిర్ధేశించిన వ్యక్తులు మాత్రమే ప్రణాళిక ప్రకారం గుట్కాలను అమ్మే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా వీధి సైడ్, శివారు ప్రాంతం, పాన్ డబ్బాల నిర్వహకులు, టీ స్టాల్స్ తదితర వ్యాపారుల నుంచి పక్కా ప్రణాళికలతో గొలుసు కట్టుగా అమ్మకాలు ఉంటాయి. విక్రయాల్లో ఒక్కో దుకాణదారుని వద్ద గుట్కాలకు ఓ రేటు ఉంటుంది. అమ్మిన వ్యాపారి కొత్త వ్యక్తులకు ఎట్టి పరిస్థితిలో విక్రయాలు చేయరు. మరికొంత మందైతే కోడ్ భాషలో మాట్లాడితేనే అమ్ముతారు. ఈ వ్యాపారంలో మూడింతల లాభాలు ఉండ డంతో సామాన్యులు సైతం అమ్మకాలు చేయడానికి వెనకాడటంలేదు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెరవెనుక ఉన్న కేటుగాళ్లను పట్టుకుంటే తప్ప ఈ నిషేధిత గుట్కా వ్యాపారానికి చెక్పడదు. గుట్కా ప్యాకెట్ల పట్టివేత గద్వాల క్రైం: జిల్లాకేంద్రానికి గుట్కా ప్యాకెట్లను తీసుకొస్తుండగా పట్టుకున్నట్టు పట్టణ ఏఎస్ఐ జిక్కిబాబు తెలిపారు. గద్వాల పట్టణం రెండో రైల్వే గేటు కాలనీకి చెందిన మాణిక్యం ఆదివారం రాయచూర్ నుంచి గుట్కాలను బైక్‌పై గద్వాలకు తీసుకువస్తున్నట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం ధరూర్ మెట్టు ప్రాంతంలో కాపుకాసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనివద్దనుంచి గుట్కాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు పెడతాం నిషేధిత గుట్కాలను కొనుగోలు చేసినా, అమ్మినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి రాష్ట్రంలో అనుమతినిస్తాం. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు. గుట్కా వ్యాపారంలో భాగస్వాములుగా మారి తరలించేవారు పద్ధతి మార్చుకోవాలి. – షాకీర్ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల -
ప్రచారం.. రక్తపాతం!
నారాయణపేట రూరల్: పాతోకక్షలు రక్తపాతానికి దారి తీశాయి. పండగ వేళ ఎన్నికల ప్రచారం ఈ ఘటనకు కారణమైంది. ఆ వివరాలు.. నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, రైతు సమన్వయసమితి నాయకుడికి, గ్రామ తాజామాజీ సర్పంచ్ వర్గీయులకు చాలా కాలంగా విరోధం ఉంది. గతంలో చాలాసార్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇరు వర్గాలకు చెందిన మద్దతుదారులు బరిలో నిలవడంతో గ్రామంలో రాజకీయం వేడెక్కింది.పండుగ పూట కూడా తమ మద్దతుదారులతో గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఇరువర్గాల వారు 8వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వారు ఒకరికి మరొకరు తారసపడ్డారు. తమకంటే తమకు ఓటువేయాలని గట్టిగా నినాదాలు చేస్తు ముందుకు కదిలారు. ఈ సమయంలోనే గుంపులోని కొందరు రాళ్లు విసరడంతో ఘర్షణ మొదలైంది. రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఓ కారు అద్దాలు పగిలాయి. రాము అనే వ్యక్తి తల పగిలింది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. నారాయణపేట ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వారిని మహబూబ్‌నగర్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాము ఫిర్యాదు మేరకు కోట్ల జగన్మోహన్రెడ్డి, వెంకటప్పతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఆ దాడి చేసింది మేమే: విజయ్
అభంగాపూర్ వాసి ఆశప్పపై వేటకొడవళ్లతో గురువారం రాత్రి జరిగిన దాడి సంచలనం రేకెత్తించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే గ్రామపంచాయతీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడంతో అటు గ్రామస్తులు.. ఇటు అధికారుల్లో ఒక్కసారిగా ఆందోళన చోటు చేసుకుంది. ఈ మేరకు ఆశప్ప హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అభంగాపూర్ గ్రామంలో మాత్రం శుక్రవారం నిశ్శబ్దం అలుముకుంది. గ్రామం జన సంచారం లేక బోసిపోగా పలువురి ఇళ్లకు తాళాలు పడ్డాయి. ఇక పోలీసులు భారీగా గ్రామంలో మొహరించి ఎలాంటి ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. మహబూబ్‌నగర్ క్రైం: మహబూ బ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అ భంగపూర్ గ్రామంలో భూ‘పంచాయితీ’, పాత ‘పగ’ సాధింపు చర్యలు 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు ఎప్పుడు చూసినా ఆదిపత్య పోరే కనిపిస్తుంది. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులతో తరచూ ఏదోఒక సం ఘటన చోటుచేసుకుంటూనే ఉంటుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రరజలు భయాందోళనతోనే కాలం గడుపుతుంటారు. మొదటినుంచీ అదే పంచాయితీ! గ్రామంలోని చెన్నప్ప, ఆశప్ప కుటుంబీకుల్లో మొదటినుంచీ పంచాయితీలు నడుస్తూనే ఉన్నాయి. భూ తగదాలతోనే 1999 నుంచి ఆదిపత్య పోరు కొనసాగుతున్నాయి. భూముల విషయంలోనే ఆశప్ప అనుచరులు చెన్నప్ప ఇంటిపై అప్పట్లో బాంబుల దాడికి పాల్పడ్డారని స్థానికులు చెబుతారు. అందులో భాగంగానే కోయిల్‌కొండ మండల సమీపంలో బస్సులో వస్తున్న చెన్నప్ప కుటుంబసభ్యులను కొందరిని అప్పట్లో హతమార్చారని ప్రచారం జరిగింది. అలాగే కోర్టుకు వస్తున్న చెన్నప్ప కుటుంబసభ్యులను అప్పక్‌పల్లి, అమ్మిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో హత్యచేశారనే ఆరోపణల నేపథ్యంలో పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల్లో ఆశప్ప పాత్ర ఉన్నట్లు అప్పట్లో పోలీసు కేసులు నమోదు చేశారు. కానీ వాటికి సరైన సాక్ష్యాధారాలు లేక కోర్టులో కేసులు వీగిపోయినట్లు తెలిసింది. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆశప్ప మరికల్ దగ్గర జరిగిన హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన ఆశప్పను బుధవారం రాత్రి చికిత్స కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ జీవన్ ఆధ్వర్యంలో వైద్యం అందించగా రక్తం అధికంగా పోవడంతో పాటు న్యూరోసర్జరీ అత్యవసరం కావడంతో రాత్రి 11గంటలకు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అయితే ప్రస్తుతం ఆశప్ప నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామం నిర్మానుష్యం ఆశప్పపై దాడి జరిగిన సంఘటనతో బుధవారం రాత్రి నుంచి అభంగపూర్ గ్రామం నిర్మాణుషంగా మారింది. ఎస్పీ రెమారాజేశ్వరి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, 40 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తూ 144 సెక్షన్ విధించారు. గ్రామంలో జనసంచారం లేకుండా పోయింది. కొంత మంది భయభ్రాంతులకు గురై ఇళ్లకు తాళాలు వేసి వారి పక్క గ్రామాల్లోని బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లిపోయారు. దాడిచేసింది మేమే : విజయ్ అభంగపూర్ ఆశప్పపై దాడి చేసిన సంఘటనలో తన హస్తమే ఉందని ఆ గ్రామానికి చెందిన చెన్నప్ప కుటుంబసభ్యుడు విజయ్ ఓ ప్రైవేట్ చానల్ ముందుకు వచ్చి వెల్లడించాడు. 20 ఏళ్ల క్రితం మా ఇంటిపై ఆశప్ప వర్గీయులు భూ వ్యవహరంలో బాంబుల దాడికి పాల్పడ్డారని, 2001లో కోయిలకొండ మండలం వింజమూర్ గ్రామ సమీపంలో బస్సులో మా ఇద్దరి కుటుంబసభ్యులపై దాడి చేసి హత్య చేశారని, 2004 అప్పక్‌పల్లిలో మరో ఇద్దరి కుటుంబసభ్యులను హత్య చేయించాడని చెప్పారు. వాటిని జీర్ణించుకోకనే నేను క్రిమినల్‌గా మారాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి నుంచి ఆశప్పపై కసి పెంచుకొని పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, అలియాస్ సూరి వద్ద అనుచరుడిగా చేరానని తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో వారి కుటుంబసభ్యులు పోటీచేస్తున్నారని, ఎవరూ నిలబడొద్దంటూ గ్రామంలో పలువురిని బెదిరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరికల్ సమీపంలో ఆశప్ప తమకు కనబడటంతో హతమర్చేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. త్వరలోనే నారాయణపేట డీఎస్పీ, మరికల్ సీఐల ముందు లొంగిపోతానని చెప్పడంతో పోలీసులు ఊపిరిపిల్చుకున్నారు. -
వెంటాడి.. వేటాడి!
మరికల్ / మహబూబ్‌నగర్ క్రైం : పాలమూరులో పాత రోజులు పునరావృతం అవుతున్నాయా.. ఇటీవల, తాజాగా జరిగిన సంఘటనలను బట్టి చూస్తే నిజమేననిపిస్తోంది. బుధవారం మరికల్ సమీపంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్నిరోజులుగా ప్రశాంతంగా ఉంటున్న పాలమూరు జిల్లాలో వేట కొడవళ్ల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా భూ తగాదాలు, పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై వేట కొడవలితో దాడి జరగడం సంచలనం రేకెత్తించింది. పక్కా ప్లాన్‌తో దాడి నారాయణపేట మండలం అభంగాపూర్‌కు చెందిన ఆశప్ప అలియాస్ అశోక్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం స్వగ్రామం నుంచి నారాయణపేటకు వచ్చాడు. అక్కడి నుంచి తన కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. అయితే అతని కదలికలను గమనిస్తూ వెంటాడిన దుండగులు సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో కారు మరికల్ బీసీ కాలనీ వద్దకు రాగానే అడ్డగించారు. డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఆశప్పను వెంట తెచ్చుకున్న వేట కొడవలితో తలపై నరికారు. అనంతరం కత్తిని అక్కడే పడేసి పారిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో సంఘటన గురించి వెంటనే ఎవరికీ తెలియరాలేదు. తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆశప్ప తువాల చుట్టుకున్నాడు. కాసేపటి తర్వాత గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే సీఐ ఇఫ్తెఖార్ అహ్మద్, ఎస్ఐ జానాకీరాంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తంతో నిండిన ఆశప్పను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేయించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలే కారణం : డీఎస్పీ సంఘటన గురించి ఆరా తీసిన నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ పోలీసులను అప్రమత్తం చేశారు. పాత కక్షల కారణంగా దాడి జరిగిందని, ఆశప్ప బతికే ఉండటంతో మళ్లీ దాడి అవకాశం ఉందని తెలిపారు. సంఘటన పునరావృతమై మరిన్ని దాడులు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులకు, పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదిలాఉండగా ఆశప్పపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిసింది. భూ సెటిల్మెంట్లు, పంచాయతీలు, పైరవీలు చేస్తుండేవాడని సమాచారం. ఈ క్రమంలో గతంలో జరిగిన పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ ముఠా సభ్యులు వెంటాడి దాడికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు గాయపడిన ఆశప్పను పోలీసులు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు చికిత్సలు అందించగా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. -
ప్రాణం తీసిన నిషా?
వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి తీసుకుని ఇంట్లో వారిపై దౌర్జన్యాలకు దిగిన సంఘటనలు ఇటీవల వనపర్తి పోలీస్ స్టేషన్ వరకు వచ్చినట్లు సమాచారం. అయినా కన్నప్రేమ విషయం బయటకు పొక్కనివ్వవటం లేదు. ఈనేపథ్యంలోనే నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి యువకులు చేసుకున్న సంబరాల్లో ఓ యువకుడు మృతి చెందడానికి గంజాయి మత్తే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మత్తులో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వనపర్తి సీఐ సూర్యానాయక్, ఎస్ఐ జములప్ప, రమణ తెలిపిన వివరాలు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వ్యాపారం కోసం కొన్నేళ్ల క్రితం వనపర్తికి వచ్చిన దేవేందర్ ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనతో పాటు తమ్ముడు పుష్పెందర్ (28) వనపర్తిలోనే నివాసం ఉండేవాడు. పుష్పెందర్‌కు గత ఏడేళ్ల క్రితం సుజాత అలియాస్ రాఖితో వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత వారు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడ వ్యాపారంలో నష్టం వచ్చిందని మళ్లీ నలభై రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి వనపర్తికి వచ్చాడు. తన అన్నవెంట పనిచేసే యోగేష్‌తో కలిసి సోమవారం ఇంట్లోనే మద్యం సేవించిన పుష్పేందర్.. మిత్రుడు భానుకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సంతబజార్‌లో ఎస్పీ కార్యాలయం పక్కన తెలిసిన వ్యక్తులు సాయి, చరణ్ మరికొందరు కనిపిస్తే శుభాకాంక్షలు చెప్పారు. అక్కడే ఇరువర్గాల మధ్య మునుపటి విషయాలపై ఘర్షణ మొదలైంది. ఈ సందర్భంగా పుష్పేందర్‌పై సాయి, చరణ్‌తో పాటు మరికొందరు దాడి చేయగా యోగేష్ అడ్డుకునేందుకు యత్నించినా వారు వినకపోవడంతో పారిపోయాడు. ఆ వెంటనే విషయాన్ని పుష్పేందర్ అన్న దేవేందర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న దేవేందర్ ఎస్పీ కార్యాలయం పక్కన రోడ్డుపై పడి ఉన్న పుష్పేందర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిందని ఎస్ఐ జములప్ప తెలిపారు. కాగా, ఈ విషయమై సీఐ సూర్యానాయక్‌ను వివరణ కోరగా.. జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే అంశంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. -
పొంగి పొర్లింది!
మహబూబ్‌నగర్ క్రైం : ఈ ఏడాది జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఈ ఏడాది కాలానికి మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు కాసుల పండింది. రెండేళ్ల కాలానికి వైన్స్ అనుమతులు ఇవ్వగా.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో గతంలో ఎన్నడూ లేని విధం గా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర గా.. వైన్స్ యాజమానులకు కూడా కాసుల పంట పండింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అమ్మకాలు జరగడం విశేషం. ఈ మేరకు ప్రస్తుత ఏడాదిలో మద్యం అమ్మ కాలు, ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రత్యేక కథనం. గత ఏడాది అక్టోబర్ నుంచి.. వైన్స్‌ల అనుమతులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అనుమతులు 2019 సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలు కావడంతో ‘ఆనవాయితీ’ ప్రకారం మద్యం పంపిణీ కోసం నేతలు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన నాయకులు ముందుగానే మద్యం డంప్‌లు దించేశారు. అటు వైన్స్ యాజమాన్యాలు కూడా ముందస్తుగా భారీగా మద్యం నిల్వలు దిగుమతి చేసుకున్నారు. ఇక ఎన్నికల వేళ అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ మేరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.1,100.10 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో కొత్త ఏడాదిలో కూడా మద్యం అమ్మకాలు భారీగా సాగే అవకాశముంది. 2019లో కూడా మద్యం అమ్మకాలు ఇదే స్థాయిలో కొనసాగితే అమ్మకాలు ఉంటే దీని విలువ ఉమ్మడి జిల్లా నుంచి 2018, 2019 ఏళ్లకు గాను రూ.2,300 కోట్లకు చేరే అవకాశముంది. దుకాణాదారులకు కాసుల పంట ఈ దఫా లైసెన్స్ పొందిన వైన్స్ యజమానులకు అదృష్టం కలిసొచ్చినట్లే చెప్పాలి. ఏడాదికి రూ.45లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్దేశించగా రెండేళ్ల కాలపరిమితికి రూ.90లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ చెల్లించేందుకు కావాల్సిన నగదును యజమానులు కేవలం ఈ ఒక్క నవంబర్ నెలలో సంపాదించినట్లు చెబుతున్నారు. ఇక వచ్చే అక్టోబర్ 1వ వరకు ప్రస్తుత లైసెన్సుల కాలపరిమితి ఉంది. ఈ మేరకు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికలే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగడం.. వైన్స్ యాజమాన్యాలకు కాసుల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. ఈ ఏడాది రికార్డులో ఆదాయం గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో జిల్లాలో రూ.800కోట్ల నుంచి రూ.900కోట్ల వరకు అమ్మకాలు సాగేవి. కానీ ఈ ఏడాది ఏకంగా రూ.1,100.10 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. 2015 అక్టోబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో రూ.872.93 కోట్ల విలువైన అమ్మకాలు సాగగా, 2016 అక్టోబర్ నుంచి 2017 అక్టోబర్ వరకు రూ.959.16 కోట్ల అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 2016 కంటే 2017 ఏడాదిలో అమ్మకాలు పెరగగా.. ఈ ఏడాది ఇది మరింత పెరగడం గమనార్హం. ఉన్నతాధికారుల మన్ననలు 2018లో జిల్లాలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఉద్యోగుల పనితీరు ఉన్నతాధికారుల మన్ననలు అందుకుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 100రోజుల యాక్షన్ ప్లాన్‌ను జిల్లా అధికారు విజయవంతంగా అమలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆబ్కారీ శాఖకు అవసరమైన సిబ్బంది లేకపోయినా.. ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా విధులు నిర్వర్తించారు. పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించడం ద్వారా అక్రమ మద్యం సరఫరాను అడ్డుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యంతో ఎక్సైజ్ పోలీసులు (ఫైల్) ఏడాది మొత్తం కష్టపడ్డాం ఈ ఏడాది కాలంలో మొత్తం ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డాం. ఇదే ఏడాదిలో వంద రోజుల ప్రణాళిక, అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్ల ప్రణాళికాయుతంగా విధులు నిర్వర్తించాం. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. మా పనితీరును కమిషనర్ అభినందించారు. ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకున్నాం. 24గంటల పాటు మా శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. – జయసేనారెడ్డి, డీసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ -
ఇక.. ఈ–చలాన్
మహబూబ్‌నగర్ క్రైం : మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు నోటీసును రాసే విధానంలో కాకుండా ఆన్లైన్లో అందించనున్నారు. అంతేకాకుండా జరిమానాను సైతం నగదు రూపంలోస్వీకరించే విధానానికి స్వస్తి పలుకుతూ మీ–సేవ, ఈ–సేవ కేంద్రాలతో పా టు పేమెంట్ గేట్‌వేల ద్వారా చెల్లింపునకు వెసలుబాటు కల్పించారు. అంతేకాకుండా వాహనదారులు తమ పేరిట ఉన్న చలాన్లు, చెల్లించిన జరిమానా ను ఆన్లైన్లో చూసుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకాలం ట్రాఫిక్ పోలీసులపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టేలా క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు వెల్లడించారు. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను భౌతికంగా ఆపి చలానా విధించి అక్కడిక్కడే డబ్బు కట్టించేవారు. ఈ ప్రక్రియలో కింది స్థా యి సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చేవి. పారదర్శకత లోపించడం ద్వారా ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై మచ్చ పడుతోంది. దీంతో ఈ విధానానికి స్వస్తి చెప్పిన మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై పోలీసులు జరిమానాను నగదు రూపంలో వసూలు చేయకుండా నేరుగా వాహనదారుడు పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించగల విధానాన్ని ప్రవేశపెట్టారు. నిబంధనలు ఉల్లంగించిన వారికి పోలీసులు ఈ–టికెట్ జారీ చేసి జరిమానా చెల్లించేందుకు ఏడు రోజుల గడువు ఇస్తారు. ఇలా జారీ చేసిన ఈ–టికెట్లు మించినట్లయితే రిజిస్ట్రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వావానాన్ని స్వాధీనం చేసుకుని జరిమానా విధించిన తర్వాతే విడుదల చేస్తారు. ఇంటికే ఈ–చలాన్ ట్రాఫిక్ కమాండ్ సెంటర్ పరిధిలో ట్రాఫిక్ నియమాలను అతిక్రమించే వారిని ట్రాఫిక్ పోలీసులు కెమెరాలతో వీడియో, ఫొటోలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సర్వర్‌లో భద్రపరుస్తారు. అనంతరం తగిన సాక్ష్యాధారాలతో ఈ–చలాన్‌ను వాహనదారుడి ఇంటికి పంపిస్తారు. అంతేకాకుండా పెండింగ్ చలాన్ల వివరాలను వెబ్సైట్లలోకి వెళ్లి తెలుసుకునే వెసలుబాటు కల్పించారు. ఆ తర్వాత జరిమానాను వాహనదారులు ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో చెల్లించే అవకాశం ఇస్తున్నారు. అంతేకాకుండా వాహనదారులు చెల్లించిన జరిమానా వివరాలను వెంటనే డేటాబేస్‌లో ఆప్డేట్ చేస్తారు. లీగల్ నోటీసు నిబంధనలు ఉల్లంఘించే వారికి ఎప్పటికప్పుడు ఈ–చలా న్లు జారీ చేయనున్నారు. ఆ వెంటనే ఏడు రోజుల్లోగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టకుండా పెండింగ్ చలాన్లు పేరుకుపోయిన వారి పేరిట స్పీడ్‌పోస్టులో లీగల్ నోటీసులు పంపిస్తారు. అయినప్పటికీ స్పందించకపోతే న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేయనున్నారు. సాక్షాధారాలతో సహా ఇంటికే జరిమానా పత్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా జిల్లాలో ఈ–చలాన్ పద్ధతి ప్రవేశపెట్టాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి బాధ్యులను గుర్తించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు ప్రత్యక్షంగా తనిఖీ చేస్తూ, జరిమానా విధిస్తున్న పద్ధతికి స్వస్తి పలికి.. కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించేలా వాహన యజమాని ఇంటికే జరిమానా పత్రం పంపిస్తాం. తపాలా, మొబైల్‌ఫోన్, పోలీసు వెబ్సైట్ల ద్వారా ఈ–చలాన్ జరిమానా వివరాలు తెలుసుకుని చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అమల్లో ఉండి సత్ఫలితాలు ఇస్తున్న ఈ విధానాన్ని మరికొన్ని జిల్లాల్లోనూ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పాలమూరులో కూడా ప్రవేశపెట్టాం. – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ -
పండగకొస్తూ.. పరలోకానికి
ఆత్మకూర్ (కొత్తకోట): కుటుంబ సభ్యులతో కలిసి పండగను ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి.. పనిచే స్తున్న ప్రాంతం నుంచి స్వగ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యలో చోటుచేసుకున్న ప్రమాదం లో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకోగా.. యువకుడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. అమరచింత మండల కేంద్రానికి చెందిన దీక్షిత్(26) అయిజలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా వి ధులు నిర్వహిస్తున్నాడు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామమైన అమరచింతకు ద్విచక్రవాహనంపై కొత్తకోట మీదుగా బయలుదేరాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆ త్మకూర్ శివారులోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో దీక్షిత్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ శంకర్, ఎస్ ఐ ముత్తయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచార ణ చేపట్టారు. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదే హాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు జగన్నాథరెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వగ్రామంలో విషాదఛాయలు అమరచింత (కొత్తకోట): నాన్నమ్మతో కలిసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుందామనుకుని వస్తున్న అమరచింతకు చెందిన దీక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అమరచింతలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఫ్రాంక్లిన్ కుమారుడు దీక్షిత్ అయిజ ఎస్బీఐ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అయితే క్రిస్మస్ పండగను అమరచింతలోని నాన్నమ్మ కృపమ్మతో కలిసి జరుపుకోవాలని ద్విచక్రవాహనంపై బయలుదేరి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే కృపమ్మ ఇంటి వద్ద జనం గుమిగూడారు. గత రెండు నెలల క్రితం కృపమ్మ టీచర్ భర్త దీనదయాల్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ ఘటన నుంచి కోలుకోలేని ఆ కుటుంబ సభ్యులకు దీక్షిత్ మృతి మరింత కుంగదీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెలే చిట్టెం రాంమోహన్రెడ్డితోపాటు ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు నరేష్‌రెడ్డి, వీరేశలింగం, భూషణంగౌడ్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
నెత్తురోడిన రహదారులు
మక్తల్/అలంపూర్: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోజు ఏదో ఒక రూట్లో ప్ర మాదం చోటుచేసుకుంటూనే ఉంది. కారణం ఏదైనా.. నిర్లక్ష్యం ఎవరిదైనా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మక్తల్, అలంపూర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు బలైపోయారు. బస్సు ఢీకొన్న సంఘటనలో.. ఊట్కూర్‌కు చెందిన రమేష్ (45) మక్తల్‌లో జరుగుతున్న పడమటి ఆంజనేయస్వామి జాతరకు తన భార్యాపిల్లలతో వచ్చాడు. అలాగే అతని తోడల్లుడు దాసర్‌పల్లికి చెందిన కొండయ్య (40) కూడా జాతరకు వచ్చాడు. భార్యాపిల్లలను ఇంట్లో వదిలిపెట్టి వారిద్దరు కలిసి ఆదివారం బైకుపై పనిపై దండు గ్రామానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి మక్తల్‌కు వస్తుండగా పెద్ద చెరువు సమీపంలోకి రాగానే మక్తల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా కొండయ్యకు సైతం బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కొండయ్యను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి చనిపోయాడు. మిన్నంటిన రోదనలు తోడళ్లుల్లు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు సంఘటనను జీర్ణించుకోలేకపోయారు. సంఘటన స్థలంలో, ఆస్పత్రి వద్ద గుండెలు బాదుకుంటూ విలపించారు. ఈ సంఘటనతో ఊట్కూర్, దాసర్లపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు రమేష్‌కు భార్యతోపాటు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు. ఊట్కూర్‌లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఓ హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. కొండయ్య వ్యవసాయం చేసుకుంటూనే ఓ చానల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. జాతరకోసం అత్తారింటికి వచ్చిన అల్లుళ్లు అకాల మరణం పొందడం, పెద్దదిక్కు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ సంఘటనపై ఎస్ఐ అశోక్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. అలంపూర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉండవల్లి మం డలం అలంపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. వివరాలిలా.. అలంపూర్ మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన మహేష్ (44) ఓ గోదాంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే ఆదివారం విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి బైక్‌పై వస్తుండగా అలంపూర్ చౌరస్తాలోని అలంపూర్ రోడ్డు మార్గంలో ఉన్న రైస్‌మిల్లు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఇదిలాఉండగా మహేష్ గతంలో గ్రా మ ఉప సర్పంచ్‌గా సేవలందించి అందరి మన్ననలు పొందాడు. అతని మరణ వార్త విని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బందితో వచ్చి పంచనామా నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఇదిలాఉండగా మృతుడికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెల్దండ (కల్వకుర్తి): మండలంలోని ఏవీఆర్ ఫంక్షన్‌హాల్ సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. గుండాల గ్రామానికి చెందిన ఏనుముల తిర్పతయ్య, కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామానికి అందె శేఖర్ ద్విచక్ర వాహనంపై గుండాల నుంచి కల్వకుర్తి వైపు బయల్దేరారు. ఫంక్షన్‌హాల్ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం డీకొట్టి వెళ్లిపోయింది. స్థానికులు గుర్తించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను...
మహబూబ్‌నగర్ క్రైం: మహిళను చీర కొంగుతో బిగించి హత్యచేసిన సంఘటనకు సంబంధించిన కేసును పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. సోమవారం సీఐ కిషన్ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. నవాబ్‌పేట మండలం కన్మన్‌కాల్వ గ్రామానికి చెందిన భీమమ్మ(35) భర్త గతంలోనే వదిలేయడంతో కొన్నిరోజులుగా తంగెడపల్లికి చెందిన ముర్గని శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భీమమ్మ ఇతరులతో తిరుగుతోందని శ్రీనివాస్‌కు అనుమానం రావడంతో అప్పటినుంచి ఆమె తరచూ డబ్బుల కోసం వేధిస్తుండేది. అయితే అది సహించని శ్రీనివాస్ ఆమెను తుదముట్టించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే ఈనెల 11న సాయంత్రం 5గంటల సమయంలో నవాబ్‌పేటలో ఉన్న బేకరి దగ్గర కలిశాడు. చీకటి పడిన తర్వాత భీమమ్మకు కల్లు తాగించి నవాబ్‌పేట సమీపంలోని నల్లరాళ్లగుట్ట వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమె గొంతుకు చీర కొంగు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, తాళిబొట్టు, సెల్‌ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టగా శ్రీనివాస్‌ను పిలిపించి విచారించారు. దీంతో తానే హత్యచేసినట్లు బయటపడింది. అతని వద్ద ఉన్న ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఎస్ఐ శివకుమార్, కానిస్టేబుళ్లు వెంకటయ్య, గొవింద్, శంకర్లను అభినందించారు. -
రక్తమోడిన రహదారులు
భూత్పూర్ (దేవరకద్ర): మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి దుర్మరణం పాలవగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజు(32) అనే వ్యక్తి అమిస్తాపూర్ నుంచి ద్విచక్రవాహనంపై యూటర్న్ తీసుకొని మహబూబ్‌నగర్ వెళ్తుండగా.. భూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్ వైపు పత్తి లోడ్‌తో వెళ్తున్న లారీ రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజుది నాగర్‌కర్నూల్ జిల్లా అవురాస్పల్లికి చెందినవాడిగా గుర్తించారు. అయితే రాజు అమిస్తాపూర్‌లో గ్యార్మీ పండగకు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మరో ప్రమాదంలో మున్సిపాలిటీలోని శేరిపల్లి(బి) వద్ద తాటిపర్తి నుంచి భూత్పూర్ వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వెంకటయ్య అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. సమాచారం తెలుసుకున్న భూత్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో బోల్తాపడి.. మహబూబ్‌నగర్ క్రైం: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగంగా ఆటో నడపటం వల్ల అదుపు తప్పి బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ఫతేపూర్ మైసమ్మ ఆలయ సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. గండీడ్ మండలం కొంటెపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య(21) మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఫతేపూర్ మైసమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ మొక్కులు చెల్లించాక రాత్రి 8 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా నడపడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వెంకటయ్య తీవ్రంగా గాయపడగా.. చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు వెంకటయ్య అన్న అంజిలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారు, ఆటో ఢీకొని.. పెబ్బేరు (కొత్తకోట): మండలంలోని తోమాలపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట నుంచి పెబ్బేరు వైపు వస్తున్న ఆటోను తోమాలపల్లి గ్రామ సమీపంలో కర్నూలు వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో బీసన్నకు చెయ్యి విరిగి తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనం తరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్కు తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరా లు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయకుమార్ తెలిపారు. -
రక్తమోడిన రహదారులు
శాంతినగర్ (అలంపూర్): వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన వడ్డేపల్లి మండలం పైపాడు శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా.. మెన్నిపాడు గ్రామానికి చెందిన బోయ నారాయణకు వడ్డేపల్లి మండలం జిల్లెడిదిన్నె గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వివాహం గురించి మాట్లాడిన అనంతరం తిరుగు ప్రయాణమవ్వగా అలంపూర్–రాయచూర్ ప్రధాన రహదారిపై పైపాడు స్టేజీ సమీపంలోకి రాగానే వాహన వేగం అతిగా ఉండటంతో అదుపుతప్పింది. సమీపంలోని పంట పొలంలోకి దూసుకుళ్లింది. డ్రైవర్ నాగేష్ అప్రమత్తమై చేసిన ప్రయత్నం విఫలమై ఇంజన్, ట్రాలీ బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 20 మంది పడిపోయారు. వారిలో బోయ మద్దిలేటి (55), బోయ వెంకటేశ్వరమ్మ (30) ట్రాలీ కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నాగేష్, అతని కొడుకు మధు, శేషమ్మ, రంగమ్మ, వెంకటేశ్వరమ్మలకు సైతం తీవ్ర గాయాలు తగిలాయి. స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అసువులు బాసిన బోయ వెంకటేశ్వరమ్మ, మద్దిలేటి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు శాంతినగర్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. మరో ప్రమాదంలో యువకుడు తిమ్మాజీపేట (నాగర్‌కర్నూల్): మండలంలోని మరికల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో వడ్డె సురేష్(19) అనే యువకుడు మృతిచెందాడు. వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ ద్వారా కరిగెట చేస్తుండగా ట్రాక్టర్ తిరగడడి బోల్తా పడింది. ట్రాక్టర్ మీద పడటంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్క గ్రామాల రైతులు గమనించి బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుం బ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఆటో, బైకు ఢీకొన్న సంఘటనలో.. మహబూబ్‌నగర్ క్రైం : ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో మహిళ మృతిచెందింది. హన్వాడ మండలం చిరుమల్కుచ్చతండాకు చెందిన కృష్ణయ్య, అతని భార్య వెంకటమ్మ (65) గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. పట్టణంలోని టీడీగుట్ట వద్దకు రాగానే హన్వాడ వైపు నుంచి మహబూబ్‌నగర్ వస్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వెంకటమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానికులు మొదట జనరల్ ఆస్పత్రి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ రాజేష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు భూత్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన ఓ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్తుండగా జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పక్కన నిలిపాడు. కారులో ఉన్న కల్పన అనే మహిళ రోడ్డుపై నిల్చొని ఉండగా అదే సమయంలో కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న యువకులు ఢీ కొట్టి బోల్తాపడ్డారు. దీంతో కల్పన ఎడమ చేయి, కుడి కాలు విరిగిపోగా, మోటర్ సైకిల్‌పై ఉన్న మణికంఠ, శ్రీనులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. గాయపిన ముగ్గురిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మణికంఠ, శ్రీను పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలాఉండగా ఢీ కొట్టిన ఇద్దరు యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ వాసులుగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు. -
స్మార్ట్ చీటింగ్!
నాగర్‌కర్నూల్ క్రైం : టెక్నాలజీ పెరిగే కొద్ది ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి వారి బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులు స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వస్తువును ఆన్లైన్లో కొనుగోలు చేయడం, ఆన్లైన్ ద్వారా ఫీజులు , రీఛార్జ్‌లు, టిక్కెట్లు బుక్ చేయడంతోపాటు ఇతర రకాల పేమెంట్లు చేస్తుంటారు. ఇలా ఆన్లైన్లో లావాదేవీలు జరిపేటప్పుడు లేదా బ్యాంకర్ల పేర్లతో ఫోన్‌చేసి వ్యక్తిగత డాటా సేకరించి వారి అకౌంట్లలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఆన్లైన్ మోసాలు జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి. గత నెలలో జరిగిన సంఘటనలు అక్టోబర్ 23న నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన చెన్న రమేష్ తన స్మార్ట్ ఫోన్లో మిత్రుడికి తేజ్ యాప్ ద్వారా రూ.10వేల నగదు పంపాడు. కానీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ కాలేదు. దీంతో గూగుల్‌లోని తేజ్ యాప్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశాడు. వాళ్లు చెప్పినట్లుగా మరో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అడిగిన వివరాలు నమోదు చేశాడు. కాసేపటికి చెన్న రమేష్ అకౌంట్లో నుంచి రూ.50వేలు డ్రా అయ్యాయి. దీంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ూ అక్టోబర్ 10న నల్లవెల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డికి ఎస్బీఐ బ్యాంకు నుంచి అంటూ ఫోన్‌కాల్ వచ్చింది. ఏటీఎం కార్డు గడువు ముగిసిందని (ఎక్స్పైరీ) చెప్పారు. పాతకార్డు బ్లాక్‌చేసి కొత్తకార్డు పంపడానికి వివరాలు అడిగారు. ఫోన్‌కు వచ్చిన మెసేజ్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఖాతాలో నుంచి రూ.50వేలు డ్రా అయ్యాయి. దీంతో అతడు ఈనెల 23న స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాల్స్, మేసేజ్‌లతో జాగ్రత్త వినియోగదారులకు బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని, అకౌంట్ వివరాలు, ఏటీఎం, క్రెడిట్ కార్డుల వివరాలు తెలియజేయాలని అడుగుతుంటారు. అలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సంబందిత బ్యాంకులకు ఫిర్యాదు చేయాలి. కొన్నిసార్లు బహుమతులు గెలుచుకున్నారని ఫోన్లు, మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయాలి. వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు ఏదైనా ఫోన్నంబర్ల నుంచి ఇతరులు ఫోన్లు చేసి ఖాతానంబర్లు, వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు వారికి వ్యక్తిగత వివరాలు తెలుపవద్దు. ఒకవేళ వివరాలు తెలియజేస్తే అకౌంట్లో ఉన్న నగదు ఖాజేసే అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వెబ్సైట్లలో ఫైల్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. తెలియని అనుమానాస్పద సైట్ల నుంచి ఫైల్స్ డౌన్లోడ్ చేయడం వల్ల వ్యక్తిగత కంప్యూటర్లో సమస్యలు వస్తాయి. వెబ్సైట్లలో నుంచి పాటలు, వీడియోలు, డౌన్లోడ్ చేయడం వల్ల అందులో ఉన్న సాఫ్ట్వేర్, మాల్వేర్ కంప్యూటర్లలో ఉన్న డాటాను హ్యాకర్లకు చేరవేస్తుంది. వెబ్సైట్లలో నుంచి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ ఫైల్స్‌ను యాన్టీవైరస్ ద్వారా స్కాన్ చేసుకోవాలి. పాస్వర్డ్ మార్చాలి ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే నెట్‌బ్యాంకింగ్, ఏవైనా యాప్‌లకు సంబందించినవి, అకౌంట్లకు సంబందించిన వాటి పాస్వర్డ్లు తరుచూ మారుస్తూ ఉండాలి. అలాగే ప్రతిఒక అకౌంట్‌కు ఒకే పాస్వర్డ్ పెట్టుకోకూడదు. వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయొద్దు అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్‌చేసి వ్యక్తిగత వివరాలు, అకౌంట్ వివరాలు అడిగితే వారికి ఎలాంటి సమాచారం అందించవద్దు. ఫోన్‌కాల్‌కు సంబందించిన సమాచారాన్ని పోలీసులకు వెంటనే తెలియజేయాలి. – భగవంత్‌రెడ్డి, ఎస్ఐ, నాగర్‌కర్నూల్ -
దూసుకొచ్చిన మృత్యువు
గద్వాల క్రైం: మరో అయిదు నిమిషాలైతే ఆ మహిళా కూలీలు వారి ఇంటికి చేరుకునేవారు. ఉదయం నుంచి కూలీపనిలో ఉన్న వారు వాహనంలో బయలుదేరి ఇంటివద్ద ఉన్న భర్త, పిల్లలను గుర్తు చేసుకున్నారు. ఇంటికెళ్లి చేయాల్సిన పనుల గురించే మాట్లాడుతున్నారు. ఇంతలోనే మృత్యువు మరో వాహనరూపంలో ఎదురుగా దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఎగిరి మృత్యుశకటం చక్రాల మధ్య పడి ప్రాణాలొదిలారు. నిమిషం వ్యవధిలో విగతజీవులుగా మారారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు, టాటాయేస్ డ్రైవర్ కథనం ప్రకారం ఆ వివరాలు... గద్వాల మండలం జమ్మిచేడు గ్రామానికి చెందిన ఈడిగ అనసూయమ్మ(41), బోయ రాములమ్మ (40)తో పాటు అదే గ్రామానికి చెందిన మరికొంత మంది (10మందికి పైగా) మహిళా కూలీలు, పట్టణ శివారులోని ఓ జిన్నింగ్ మిల్లులో పత్తి గింజలు వేరు చేసే కూలిపనికి వెళ్తున్నారు. అయితే రోజులాగే మంగళవారం కూడా టాటాయేస్ వాహనంలో పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి 7.15 గంటల సమయంలో ఇంటికి వాహనంలో వస్తున్నారు. ఇద్దరు ఓ వైపు నిల్చుని ఉన్నారు. గద్వాల నుంచి అయిజ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం కొండపల్లి మలుపు వద్ద వేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టింది. దీంతో టాటాయేస్ వాహనంలో నిల్చుని ఉన్న ఇద్దరు మహిళలు గుర్తుతెలియని వాహనం చక్రాల కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వీరితోపాటు రుక్మిణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన మహిళా కూలీలు కేకలు వేస్తూ గట్టిగా రోదించారు. స్థానికులు గమనించి వారిని వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో జమ్మిచేడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం ప్రమాద వార్త తెలియడంతో జమ్మిచేడు గ్రామస్తు లు, బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ వారిని చూసుకుని గుండెలవిసేలా రోధించారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగింది. అనసూయమ్మ భార్త రాములు, రాములమ్మ భర్త బీసన్న ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మా ర్చురీలో భద్రపర్చారు. కూలీలు మృతి చెందారన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, బీఎల్ఎఫ్, బీఎస్పీ తదితర పార్టీల నాయకులు బాధిత కుంటుబాలను ఓదార్చారు. అన్నివిధాలా ఆదుకుంటామని బంధువులకు హామీ ఇచ్చారు. -
రోడ్లపై నెత్తుటి ధారలు
నాగర్‌కర్నూల్ క్రైం: రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం నిద్ర, మద్యంమత్తులో వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే. తాజాగా జిల్లాలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందగా నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరుకు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృత్యువాత పడింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నాగర్‌కర్నూల్ : మండలంలోని పెద్దముద్దునూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లికి చెందిన రాములు తన టాటాఎస్ ఆటోలో 14 మంది ప్రయాణికులను ఎక్కించుకుని నాగర్‌కర్నూల్‌కు బయల్దేరారు. పెద్దముద్దునూరు గ్రామ సమీపంలోకి రాగానే కొల్లాపూర్ నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తాపడి ఓ గుర్తుతెలియని మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన జ్యోతి, పెద్దకొత్తపల్లికి చెందిన ముత్యాలమ్మ, యాదిరెడిపల్లికి చెందిన బాలయ్య, పెద్దకొత్తపల్లికి చెందిన రాములు, పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లపల్లికి చెందిన సాయిబాబకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు, స్థానికులు 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురిలో ఉంచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. ఇదిలాఉండగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. ఉప్పునుంతల (అచ్చంపేట): దైవదర్శనానికి వెళ్లివస్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఈరట్వానిపల్లి స్టేజీ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వీరేశం, కొండలు, మహేష్, ప్రణయ్‌లు డిగ్రీలో స్నేహితులు. ప్రస్తుతం వీరంతా ఓ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరూ శ్రీశైల మల్లన్నను దర్శించుకోవడానికి శుక్రవారం రెండు ద్విచక్రవాహనాలపై వెళ్లారు. శనివారం సాయం త్రం తిరుగు ప్రయాణమవ్వగా రాత్రి 11 గంటల సమయంలో మండలంలోని ఈరట్వానిపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే డిండి వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు, వీరి బైక్ ఎదురుపడి ఢీకొన్నాయి. దీంతో మహేష్ (24), ప్రణయ్ (23)లకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే చనిపోయారు. మరో బైక్‌పై ఉన్న వీరేషం, కొండలు ఈ విషయాన్ని ఫోన్‌చేసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. వెంటనే ఎస్ఐ విష్టు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేశారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు మహేష్ హయత్‌నగర్‌లో ఉంటున్న ఉపాధ్యాయుడు శంకరయ్య, అనితల పెద్దకుమారుడు. మరో మృతుడు ప్రణయ్ సైదాబాద్‌లో ఉంటూ ముత్యాల వ్యాపారం చేసుకుంటూ జీనవం గడిపే యదగిరి, పద్మల రెండో కుమారుడు. ఆదివారం మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం
గోపాల్పేట (వనపర్తి): ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన నాగపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన చక్రి (13), బాలరాజు (20), వినయ్ లు గురువారం బావాయిపల్లి నుంచి గౌరిదేవి పల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అదే స మయంలో కొల్లాపూర్ డిపోకు చెందిన (ఏపీ 28 జెడ్ 4173) నంబర్‌గల ఆర్టీసీ బస్సు నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళుతుండగా నాగపూర్ గ్రా మం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చక్రి అనే యువకుడికి తీ వ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలరాజును స్థానికులు నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా నాగపూర్ సమీపంలో ప్రాణాలు వది లాడు.వినయ్ తీవ్ర గాయాలతో కొల్లాపూ ర్ ప్ర భుత్వాస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. ఒ క్కగానొక కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రు లు తిరుపతయ్య, పార్వతమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. చక్రిమృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం రేవల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇన్నోవా ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి గాయాలు పెంట్లవెల్లి (కొల్లాపూర్): మండల కేంద్రంలోని న మాజ్ చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయప డ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. జటప్రోల్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మిద్దేటి వెంకటేశ్వర్లు (52), మిద్దేటి శ్రీధర్ కొల్లాపూర్‌కు బ్యాండ్ వాయించడానికి వెళ్లారు. ప ని ముగించుకుని తిరిగి జటప్రోల్‌కు వస్తుండగా మార్గమధ్యలో కేవైఎఫ్ సంస్థకు చెందిన కారు ప్ర చారానికి వెళ్లి వస్తూ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకటేశ్వర్లు ప్రాణాలు వదిలాడు. శ్రీధర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని వైద్యుల ద్వారా తెలిసింది. ఈ సంఘటనపై డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. -
ఏసీబీ వలలో సర్వేయర్
సాక్షి, అలంపూర్: లంచం తీసుకుంటుండగా సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఉండవల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు... మండలంలోని కంచుపాడుకు చెందిన పెద్ద వెంకట్‌రెడ్డి, చిన్న వెంకట్ రెడ్డి, సత్యారెడ్డి అన్నదమ్ములు. వారికి 7.12 ఎకరాల పొలం ఉంది. ఆస్తి పంపకాల్లో పెద్ద వెంకట్ రెడ్డికి 2.18 ఎకరాలు, చిన్న వెంకట్ రెడ్డికి 2.17 ఎకరాలు, సత్యారెడ్డికి 2.17 ఎకరాలు ఆస్తి సంక్రమించింది. తనçపొలానికి హద్దులు ఏర్పాటు చేయాలని సత్యారెడ్డి రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్ సూచన మేరకు గతనెల 18న మీసేవ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేశాడు. ఈవిషయాన్ని సర్వేయర్ హరికృష్ణకు తెలిపాడు. దీంతో అక్టోబర్ 2న హరికృష్ణ సర్వే పనులు పూర్తి చేశాడు. రిపోర్టు ఇవ్వలేదు. కొన్నిరోజులు తిప్పుకుని రూ.7వేలు ఖర్చవుతుందని చెప్పాడు. సత్యారెడ్డి అభ్యర్థన మేరకు రూ.5వేలకు రిపోర్టు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇదే విషయమై సత్యారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే సర్వేయర్ ముందుగా లంచం డబ్బులు కర్నూలులోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించాడు. చివరకు కార్యాలయం వద్దకే తేవాలని చెప్పాడు. చివరికి సర్వేయర్ సూచన మేరకు ఆయన కారులో డబ్బును ఉంచాడు. ఏసీబీ అధికారులు కారును సోదా చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్ హరికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో కర్నూలోని ఆయన నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇన్స్పెక్టర్లు లింగస్వామి, కమల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
నవాబుపేట (జడ్చర్ల): ఉమ్మడి జిల్లాలో జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సంఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. నవాబ్‌పేట మండలం మైస మ్మ చెంత మొక్కులు తీర్చుకునేందుకు ట్రాక్టర్లో వచ్చిన భక్తులు తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అటవీప్రాంతంలో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ మలుపువద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లోకిరేవుకు చెందిన కావలి లక్ష్మమ్మ (50), గండీడ్ మండలం నసర్లబాద్కు చెందిన గంగపురం బాలయ్య (45) అక్కడిక క్కడే మృతి చెంద గా, లింగంపల్లికి చెందిన చెన్నçమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్లో ఉన్న మరో 15 మందికి సైతం గాయాలయ్యాయి. విషయం తె లుసుకున్న డీఎస్పీ భాస్కర్ సంఘటన స్థలానికి వె ళ్లారు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో చెన్నమ్మ, మాసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, శాంతమ్మ, యాదమ్మ, లక్ష్మ మ్మ, జంగమ్మ, రాములమ్మ, రాములుతోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో పోచమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కిషన్, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కేసును పరిశీలించారు. డ్రైవర్ అతివేగంగా నడపటం వల్లే ప్రమాదానికి కారణమని తెలిపారు. ఇదిలా ఉండగా.. సరిగ్గా 18 ఏళ్ల కిందట కిందట కూడా ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతిచెందారు. ఇన్నేళ్ల కాలంలో ఏనాడూ ప్రమాదాలు చోటుచేసుకోలేదు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. లింగంపల్లిలో మరొకరు.. మక్తల్ : ఊట్కూర్ మండలం మల్లెపల్లికి చెం దిన మారెన్న (45) అనే వ్యక్తి సో మవారం మక్తల్‌లో జరిగిన కేటీఆర్ సభ కు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలో కల్వర్టు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ రూట్లో రాత్రి ఎవరూ రాకపోవడంతో గమనించలేదు. ఉదయం బాటసారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్ఐ అశోక్‌కుమార్ కేసు నమోదుచేసి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రైలు ప్రమాదంలో మహిళ మహబూబ్‌నగర్ క్రైం: పట్టాలుదాటుతున్న ఓ మహిళను రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. బోయపల్లికి చెందిన నర్సమ్మ (40) రోజులాగే మంగళవారం మధ్యాహ్నం కూలి పని చేయడానికి పట్టణంలోని లక్ష్మినగర్ కాలనీకి వచ్చింది. సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతుండగా గుంతకల్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. నర్సమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. కుమారుడు యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వివరించారు. -
‘లెక్క’ తప్పిందా.. సొత్తు గోవిందా!
నాగర్‌కర్నూల్ క్రైం: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే బెల్టు షాపులపై జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు బెల్టుషాపుల నిర్వాహకులను బైండోవర్ చేశారు. అధికారులు చెక్‌పోస్టుల వద్ద, బ్యాంకు ఖాతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత వారం రోజుల క్రితం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం అల్లీపూర్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యాపారి వాహనం నుంచి రూ.33,72,330 నగదు పట్టుబడటంతో తరలింపుపై నిఘా తీవ్రతరం చేశారు. వ్యాపారుల్లో ఆందోళన ఎన్నికల సీజన్ కావడంతో వ్యాపారులు, ప్రజలు నగదును ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే జంకుతున్నారు. వ్యాపారులు చాలా వరకు బ్యాం కు చెల్లింపుల ద్వారానే వ్యాపార లావాదేవీ లు కొనసాగిస్తున్నారు. ఆస్పత్రులకు, షాపింగ్‌లు, ఇతర అవసరాల కోసం ప్రజలు నగదును తీసుకువెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నగదుకు సంబంధించి ఆధారాలను చూయిస్తేనే వాటిని సీజ్ చేయమని అధికారులు చెబుతున్నా చాలామందికి ఆ విషయాలు తెలియక నగదుకు సంబంధించిన రశీదులు తీసుకువెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. లావాదేవీలపై సమాచార సేకరణ ఎన్నికలలో ఓటర్లకు నగదు పంచి ప్రలోబాలకు గురిచేసే అవకాశం ఉన్నందున నగదు తరలింపు పై నిఘా పెంచిన అధికారులు బ్యాంకు ఖా తాలపై దృష్టిసారించారు. అభ్యర్థులు నగదును నే రుగా కాకుండా బ్యాంకుల ద్వారా లావాదేవీలు జ రుపుతారనే ఉద్దేశంతో కొద్దిరోజుల నుంచి బ్యాం కుల్లో రూ.లక్షల్లో జరిగిన లావాదేవీలపై ఆదాయ పు పన్ను శాఖ, ఎన్నికల అధికారులుç Üసమాచా రం సేకరిస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లో మహిళా సంఘాలు అధికంగా ఉండటంతో వారు రూ.లక్ష ల్లో రుణాలు తీసుకుంటుంటారు. అభ్యర్థులు మ హిళా సంఘాలను ప్రభావితం చేయకుండా ఉం డేందుకు వారి ఖాతాల్లో ఇటీవల జరిగిన నగదు లావాదేవీల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పూర్తి ఆధారాలతో.. ఏ వ్యక్తి అయిన సొంత అవసరాలకు, వ్యా పార లావాదేవీల కోసం, షాపింగ్‌లకు ఇలా ఏ అవసరం నిమిత్తం నగదు తీసుకువెళ్తున్నామనే ఆధారాలను అధికారులకు చూయిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చు. తనిఖీలలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే ఆ నగదుకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తారు. సరైన ఆధారాలు చూయించకపోతే సీజ్‌చేసి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. సదరు అధికారి నగదును జిల్లా ఎన్నికల మానిటరింగ్ కమిటీ విచారణ చేసి సరైన ఆధారాలు చూయించకుంటే ట్రెజరీలో డిపాజిట్ చేసి కోర్టులో కేసు వేస్తారు. తనిఖీలలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు పట్టుకుంటే ఆ నగదును సీజ్ చేసి జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలి. జిల్లా ఎన్నికల అధికారి ఆ నగదును ఎస్టీఓలో జమ చేసి ఆదాయ శాఖాధికారులకు సమాచారం ఇస్తే నగదు పట్టుబడిన వ్యక్తికి ఆదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. నగదుకు సంబంధించిన వ్యక్తి ఐటీ రిటరŠన్స్, సరైన ఆధారాలు చూయించి నగదు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నగదు తరలింపునకు ప్రత్యామ్నాయంగా చెక్కులు జారీచేసే అవకాశం ఉంది. చెక్కులను అకౌంట్లో జమ కావడానికి చాలారోజులు పడుతుంది అనుకుంటే బ్యాంకుల నుంచి డిమాండ్ డ్రాఫ్ట్‌లను తీసుకునే అవకాశం ఉంది. ఆధారాలు చూయించాలి ఎన్నికల కోడ్ ఉన్నందున రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వెంట తీసుకువెళితే నగదుకు సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలలో నగదుకు సంబంధించిన ఆధారాలు చూయించి అధికారులకు సహకరించాలి. ఎవరైనా సరైన ఆధారాలు చూయించకుంటే సీజ్ చేసి ట్రెజరీ కార్యాలయంలో జమ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – హన్మానాయక్, ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నాగర్‌కర్నూల్ -
ఉరేసుకుని ఇద్దరి యువకుల ఆత్మహత్య
నేరేడుచర్ల(హుజూర్నగర్) : మనస్తాపంతో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘట నలు శనివారం సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలకేంద్రంలోని మ హింద్రా షోరూం వెనుకాలో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ షేక్. సిరాజోద్దీన్ (30)కు సంవత్సరంన్నర క్రితం దిర్శించర్ల గ్రామానికి చెందిన హాజి దాభేగంతో వివాహం జరిగింది. సిరోజోద్దీన్ భార్య వేరే కాపురం పెట్టాలని ఘర్షణ పడి తన పుట్టిల్లు దిర్శించర్లకు వెళ్లిపోయింది. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో సిరాజోద్దీన్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్ద మ్మ కుమారుడు రియాజుద్దీన్ గమనించి బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి హజిదాభేగం రెండో భార్యకాగా 5 నెలల పాప కూడా ఉంది. మృతుడి తల్లి జహిన్నిస్సాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ సర్ధార్ నాయక్ తెలిపారు. సింగారంలో.. ఆత్మకూరు(ఎం)(ఆలేరు) : ఆత్మకూరు(ఎం) మండలం సింగారంలో శనివారం ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగారం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసరెడ్డి(33) శనివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు పోయాడు. అక్కడ తల్లిదండ్రులతో గొడవ జరిగినట్లు తెలిసింది. సాయంత్రం ఇంటికి వచ్చి ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియడంతో తట్టుకోలేక భార్య అపర్ణ ఇంటికి వచ్చి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
భూత్పూర్ (దేవరకద్ర): వారాంతపు సంతలో కూరగాయలు విక్రయించి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్న ఓ రైతును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్ కథనం ప్రకారం.. అన్నాసాగర్ గ్రామానికి చెందిన సూదిరెడ్డి కొండారెడ్డి(50) వ్యవసాయంతోపాటు కూరగాయలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మూసాపేటలో జరిగే వారాంతపు సంతకు ద్విచక్రవాహనంపై కూరగాయలు తీసుకువెళ్లి విక్రయించిన అనంతరం ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అన్నాసాగర్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోసుకుని అన్నాసాగర్ వైపు వస్తుండగా హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. దీంతో కొండారెడ్డికి తీవ్రగాయాలు కాగా 108లో ఎస్పీఎస్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కొండారెడ్డి భార్య హారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. గండేడ్ (మహబూబ్‌నగర్): పొలం నుంచి ఇంటికి వస్తున్న ఓ రైతును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా.. మండలంలోని కొమిరెడ్డిపల్లికి చెందిన రైతు తెలుగు శ్రీను(35) మంగళవారం రాత్రి సమయంలో తన సొంత పొలానికి వెళ్లి.. తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలపాలయ్యాడు. సకాలంలో ఎవరూ గుర్తించలేకపోయారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అటువైపు నుంచి వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు గమనించి స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. శ్రీను భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. క్రూయిజర్, బైక్ ఢీ.. తాడూరు (నాగర్‌కర్నూల్): క్రూయిజర్, ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇరువురికి గాయాలైన సంఘటన మండలంలోని ఇంద్రకల్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామానికి చెందిన శ్రీను, సత్యం ఇరువురు ద్విచక్రవాహనంపై యాదిరెడ్డిపల్లి నుంచి ఇంద్రకల్‌కు వస్తుండగా ఇంద్రకల్లో ప్రధాన రోడ్డుపై ఎదురుగా వచ్చిన క్రూయిజర్ ఢీకొనడంతో ఇరువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గ్రామస్తుల సహకారంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
మీ త్యాగం చెదరని జ్ఞాపకం
మహబూబ్‌నగర్ క్రైం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన అమరుల త్యాగం చెదరని జ్ఞాపకం లాంటిదని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు స్థూపం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఎస్పీ రెమా రాజేశ్వరి ఒదార్చారు. సంఘ విద్రోహక శక్తులతో పోరాడి ప్రాణాలు వదిలిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరుల కీర్తి.. పోరాట పటిమ తమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, గిరిబాబు, సీఐలు రామకృష్ణ, రాజేష్, కిషన్, రాజు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అమరులకు పూలమాలలతో వందనం సమర్పించారు. పోలీసుల సంక్షేమానికి కృషి సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడం పోలీస్ వృత్తిలో సహజమైన అంశంగా భావించి ప్రతి అధికారి ముందుకుసాగాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ప్రజల సంరక్షణ కోసం నిత్యం పోలీసింగ్ వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట పోలీస్ అధికారి ప్రాణాలు త్యాగం చేస్తున్నాడని, కాశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు శాంతి భద్రతలను రక్షించే క్రమంలో ఈ ఏడాది 414 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అందరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి అమరవీరులు చేసిన త్యాగమని కొనియాడారు. రెండు దశాబ్దాల కిందట నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో మావోయిస్టులు జరిపిన విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు. ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని, సమాజంలో శాంతియుత వాతావరణ నిర్మాణం కోసం పోలీసు బలగాలు, దేశ రక్షణ కోసం పొరాటం చేసే సైనికులు 39మంది చనిపోయారని గుర్తు చేశారు. పోలీసులు చేస్తున్న సేవలను, త్యాగాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. పోలీసులకు ప్రజల సహకారం ఉంటే శాంతిభద్రతల రక్షణ సులువవుతుందని, ఎక్కవ జనాభా ఉన్న ఈ సమాజంలో సుమారు లక్ష మందికి ఒక పోలీస్ అధికారి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నట్లు తెలిపారు. గౌరవప్రదంగా కవాతు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. సాయుధ బలగాలు సంప్రదాయ పూర్వకంగా వందనం సమర్పించగా ఎస్పీ రెమా రాజేశ్వరికి స్వీకరించారు. అనంతరం అమరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగానే అమరు పేరున రచించిన పుస్తకాన్ని పరేడ్ కమాండర్ వీరేష్ ఎస్పీకి అందజేయగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు చదివి వినిపించారు. పిల్లలతో ముచ్చటించిన ఎస్పీ కార్యక్రమం అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ రెమా రాజేశ్వరి తన చాంబర్లో ముచ్చటించారు. వారి సాదక బాదకాలను అడిగి తెలుసుకున్నారు. బరువెక్కిన హృదయాలతో వారి కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. వేదికపై పలువురు తమ మనోభావాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తండ్రితో కూతురు గడిపిన రోజులు.. కొడుకుతో తల్లి పంచుకున్న మధుర జ్ఞాపకాలు.. భార్య తన భర్తతో పెళ్లియిన నాటి నుంచి చివరకు పంచుకున్న తీపి గుర్తులు నెమరువేసుకుని భావోధ్వేగానికి లోనయ్యారు. పట్టణంలో శాంతి ర్యాలీ అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి జెండా ఊపి శాంతిర్యాలీ ప్రారంభించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశీనాయుడు విగ్రహం వరకు వెళ్లారు. నినాదాలు చేస్తూ విగ్రహానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ వెంకటేశ్వవర్లు, డీఎస్పీ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే అమరవీరుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్‌రావు, డీఎస్పీలు గిరిబాబు, ఇమ్మాన్యుయేల్, డీఎఫ్ఓ గంగారెడ్డి, సీఐలు డివిపి రాజు, రామకృష్ణ, రాజేష్, కిషన్, అమర్నాథ్రెడ్డి, ఎస్ఐలు భాస్కర్‌రెడ్డి, పీపీ బాలగంగాధర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, రాజయ్య, నాగభూషణం, సత్తయ్య, మన్మోహాన్ పాల్గొన్నారు. -
హత్యా.. ఆత్మహత్యా?
ఖిల్లాఘనపురం (వనపర్తి): వాగులో స్నానానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని మల్కిమియాన్పల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన శిల్ప (28) (సిరాతిబేగం, కల్పన) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గురువారం తోడికోడళ్లు, పల్లవి, బావ వెంకట్‌రెడ్డి, కుటుంబ సభ్యులు మమత, తేజస్విని, ఆంజనేయులు, యాదమ్మతో కలిసి పొలం దగ్గరకు వెళ్లింది. అయితే పొలానికి సమీపంలో పెద్ద వాగు పారుతుండగా అందరూ కలిసి అక్కడే స్నానం చేశారు. ఈ సమయంలో శిల్ప ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి గుంతలోకి జారిపోయింది. గమనించిన పల్లవి, మమత ఆమెను రక్షించే ప్రయత్నంలో అందరూ వాగులో పడిపోయారు. సమీపంలో ఉన్న శ్రీనివాసరెడ్డి, వెంకట్‌రెడ్డి వచ్చి వాగులోకి దూకి కనిపించిన వారందరిని పైకి లాగారు. శిల్ప కనిపించకపోవడంతో నీటిగుంతలో వెతికారు. చివరికి ఆమె కాళ్లకు తగలడంతో మునిగి పైకి తీశారు. శ్వాస తీయడం ఇబ్బందిగా ఉండటంతో ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా శిల్పను గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కొట్టిచంపి నీటి గుంటలో పడేశారని ఆమె మృతిపై తమకు అనుమానం ఉందని బంధువులు ఆరోపించారు. శిల్ప చిన్నమ్మ గోరెబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిల్ప కుటుంబ సభ్యులను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పరామర్శించారు. చిన్నారులు చదువుకోవడానికి తనవంతుగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
ఫేస్బుక్ తంటా..యువకుడిపై పాశవిక దాడి!
మహబూబ్‌నగర్ క్రైం: పాతకక్ష్యలను మనసులో పెట్టుకుని కొందరు ఇద్దరు యువకులపై పాశవిక దాడికి పూనుకున్నారు. ఈ సంఘటన పట్టణంలో హల్చల్ సృష్టించింది. రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పీర్లబాయికి చెందిన శ్యాంసుందర్ అతని స్నేహితుడు రోహిత్ మంగళవారం లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మర్లుకు చెందిన చాణక్య అతని స్నేహితులు జగదీష్, పల్లె నరేష్, పల్లె దేవ, కృతిక్తోపాటు మరికొందరు కలిసి శ్యాంసుదర్, రోహిత్‌ను పట్టుకుని వారి కాలనీకి తీసుకుకెళ్లారు. దుస్తులు తొలగించి నగ్నంగా చేసి చేతులతో, కర్రలతో దాడిచేశారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించారు. బయటికి వచ్చిందిలా.. ఆగస్టు 25న చాణిక్య, వేపూర్‌గేరికి చెందిన బంటి ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. అయితే అందులో చాణక్య ఫొటోను ఎక్కువ మంది లైక్ కొట్టడంతో పాటు కామెంట్లు చేశారు. నాకంటే ఎక్కువ లైక్‌లు అతనికి వచ్చాయని బంటి తట్టుకోలేక చాణక్యను కొట్టాలని పతకం రచించాడు. అందులో భాగంగానే చాణక్య స్నేహితుడు శ్రీకాంత్‌చారిని వెంట పెట్టుకొని బంటి అతని స్నేహితులు దత్తు, శ్యామ్‌సుందర్, జగదీష్, శివ, సందీప్, శివసాయి, రోహిత్, విష్ణు, మధుచారి, నందివర్ధన్రెడ్డిలతో కలిసి ఆగస్టు 25న రాత్రి 9.30గంటలకు చాణక్య ఇంటికి వెళ్లారు. శ్రీకాంత్ చారితో అతనిని బయటకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేసి కొంత దూరం మాటల్లో పెట్టి తీసుకెళ్లారు. బంటికి సారీ చెప్పాలని అతని స్నేహితులు చాణక్యతో గొడవ పడ్డారు. వినకపోవడంతో ఇనుప రాడ్లు, కట్టెలతో చాణక్యపై దాడి చేశారు. బట్టలు తీసి నగ్నంగా చేసి కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. ఈ విషయం బయటికి పొక్కలేదు. ప్రతికారం తీర్చుకోవాలని చాణక్య అదేపద్ధతిలో చాణక్య అతని స్నేహితులు కలిసి శ్యాంసుందర్, రోహిత్‌పై దాడి చేశారు. శ్యాంసుందర్ తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పిపోతున్న వారందరూ ఏమైపోతున్నారు?!
అసలు ఏం జరుగుతోంది.. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి ఒకటీరెండు మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి.. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువతులు అదృశ్యమైపోతున్నారు.. వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు.. మనుషుల అక్రమ రవాణా జరుగుతోందా.. లేక తప్పిపోతున్నారా.. వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తున్నారా.. ఎక్కడికైనా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నారా.. ఇంతకు ఏం జరుగుతోంది.. అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు. మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న లోకేష్ కనిపించకుండా పోయాడు.. బోయపల్లికి చెందిన చరణ్ అనే విద్యార్థి బడికి వెళ్లి వస్తానని చెప్పి ఇంతవరకు తిరిగిరాలేదు. పట్టణంలోని బాల సదనం నుంచి శైలజ అనే చిన్నారి అదృశ్యమైంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఒక్క మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నెలకు 20 మంది అదృశ్యమయ్యారు. ఈ లెక్కన జిల్లాలో ని త్యం కనిపించకుండా పోతున్న వారి సంఖ్య ఎంత ఉంటుందో అంచన వేయడం కూడా కష్టసాధ్యం. ప్రతీస్టేషన్‌లో ఇలాంటి కేసులే.. జిల్లాలో మనుషుల అక్రమ రవాణ సాధారణమై పోయింది. ఒక్క రోజులో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకటి లేదా రెండు కేసులు ‘మా వాళ్లు అదృశ్యం అయ్యారని’ బాధితులు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరానికి ఒక్క మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో సగటున 720 మంది కనిపించకుండా పోయినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. వారిలో కొందరు మతిస్థిమితం లేనివారు, ప్రేమించిన వారితో వెళ్తున్నవారు, వివాహేతర సంబంధాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అదృశ్యమైన వారు ఉన్నారు. మరికొందరు ఇతర కారణాల వల్ల కన్పించకుండా పోతున్నారు. వారిలో చాలా మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. నిత్యం నిరీక్షణ అదృశ్యమైన వారి ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు, అయినవాళ్లు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. గత మూడేళ్లలో 18 సంవత్సరాలు పైబడినవారు 963మంది కనిపించకుండా పోయారు. వారిలో 259మంది ఆచూకీ లభ్యం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గల్ఫ్ అక్రమ రవాణా గురించి చెప్పనక్కరలేదు. అభం శుభం తెలియని అమాయకులకు గాలం వేస్తూ కొందరు నకిలీ ఏజెంట్లు వారివద్ద లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేసి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. మూడునాలుగేళ్లు కుటుంబాలకు దూరంగా ఉండి కష్టపడి నాలుగు రాళ్లు సంపాదిద్దామని వెళ్లిన అమాయకులు తాము మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నకిలీ ఏజెంట్ల చేతిలో జిల్లా వ్యాప్తంగా ఏడాదికి సుమారుగా రెండు వేల మంది నష్టపోతున్నారు. వలసల్లోనూ మోసాలు జిల్లాలోని మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్తున్న వారున్నారు. వీరిలో దినసరి కూలీలు చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదశ్యమవుతున్నారు. ముఖ్యంగా కోయిలకొండ, నవాబ్‌పేట, మద్దూర్ మండల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబాయి, కర్ణాటక, పూణే తదితర నగరాలకు వెళ్లి చాలా మంది తప్పిపోతున్నారు. దీంట్లో కొంత మంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి చూపిస్తామని తీసుకువెళ్లిన వారిలో చాలా వరకు వెనుక్కి తిరిగి రావడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కేసులు జిల్లాలోని 31 పోలీస్స్టేషన్లలో వందల సంఖ్యలో మిస్సింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటూ కుటుంబ సభ్యులు, అటు బంధువులు గాలిస్తుంటే మరోవైపు పోలీసులు వారి కోణంలో విచారణ చేస్తున్నారు. స్టేషన్లలో నమోదైన కేసుల్లో చాలా వరకు అదృశ్యమైన వారు కనిపించకపోవడంతో పెండింగ్‌లో ఉండటం విశేషం. అయితే చాలా వరకు పోలీసులు అదృశ్యం అవుతున్న కేసులపై ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం వల్ల వారి సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఫైల్‌ను గాలికి వదిలేస్తున్నారు. ఇవీ కారణాలు పాఠశాలలో, కళాశాలలో, హాస్టళ్లలో ఉపాధ్యాయులు, వార్డెన్లు మందలించారని, ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం తిడుతున్నారని.. పిల్లలు, విద్యార్థులు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. కొంత మంది వివాహితులు ఇష్టంలేని పెళ్లి చేశారని వెళ్లిపోతుండగా మరికొంత మహిళలు భర్తలు, అత్తమామలు వేధింపులకు తట్టుకోలేక ఇంటి గడప దాటుతున్నారు. ఇంకొందరు ఆరోగ్యం బాగాలేక, మానసిక పరిస్థితి సక్రమంగా ఎటూ వెళ్తున్నామో తెలియక వెళ్తున్నారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు మత్యువాతపడితే మరికొందరూ రోడ్లపై యాచకులుగా తయారవుతున్నారు. ఇవీ తీసుకోవాల్సిన చర్యలు పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. రైళ్లు, బస్సులను, ఇతర వాహనాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్ నెంబర్స్ గుర్తుండేలా నేర్పించాలి. పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతోపాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించేలా జాగ్రత్త పడాలి. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి జిల్లాలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం. కొన్ని స్టేషన్ల పరిధిలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు మారం చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకునే లక్షణాలను ముందే పసిగట్టి కౌన్సెలింగ్ ఇప్పించాలి. పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నాం. – రెమారాజేశ్వరి, ఎస్పీ,మహబూబ్‌నగర్ -
కరెంటు కాటు ముగ్గురు రైతుల మృతి
కరెంటు రైతుల పాలిట శాపంగా మారుతోంది. ట్రాన్స్‌కో శాఖలో కొత్త టెక్నాలజీ వచ్చినా క్షేత్రస్థాయిలో ఇంకా పాత విద్యుత్ తీగలు అలాగే ఉండటంతో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈదురు గాలులు వీచినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ల వద్ద, స్తంభాలు, బోరుబావుల వద్ద తీగలు తెగిపోయి రైతులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు రైతులు విద్యుదాఘాతంతో చనిపోయారు. సాక్షి, భూత్పూర్: మండలంలోని అమిస్తాపూర్‌లో మంగళవారం యాదగిరి ప్రశాంత్ (42) అనే రైతు తన పొలంలోనే విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. వివరాలిలా.. తనకున్న మూడు ఎకరాల పొలంలో వరి పంట సాగుచేసిన ప్రశాంత్ మంగళవారం ఉదయం చేనుకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్ పనిచేయక పోవడంతో కరెంట్ స్తంభం నుంచి వచ్చే వైర్లను పరిశీలించారు. దీంతో స్తంభం నుంచి స్టార్టర్ డబ్బాకు వచ్చే వైరు మధ్యలో తెగిపోయింది. వాటిని సరి చేస్తుండగా అకస్మాత్తుగా వైర్లు చేతికి తగలడంతో ప్రమాదం సంభవించి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు కాసేపటి తర్వాత ఇరుగుపొరుగు రైతులు గమనించి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. భార్య యాదగిరి దేవిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఎగ్గని నర్సింహులు పరామర్శించారు. శంకర్‌నగర్‌లో.. గట్టు : మండలంలోని ఆరగిద్ద పంచాయతీ పరిధిలోని శంకర్‌నగర్ గ్రామానికి చెందిన రైతు బోయ కుర్తిప్పల నాగన్న(45) విద్యుతాఘాతానికి మృతి చెందాడు. రోజులాగే మంగళవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. పత్తి పొలంలో హై టెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పడి ఉండటం గమనించకుండా తొక్కడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదని వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులు విగతజీవిగా పడి ఉన్న నాగన్నను చూసి బోరున విలపించారు. మృతునికి భార్య పద్దమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నాయకుల పరామర్శ విషయం తెలుసుకున్న గద్వాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పీఏసీఎస్ డైరెక్టర్ గోపాల్, ఏఈఓ తిరుమలేష్, టీఆర్ఎస్ నాయకులు తిప్పారెడ్డి, హనుమన్న, రామకృష్ణారెడ్డి, బసన్న, హనుమంతు, కిష్టన్న, గోపాల్, బజారి, నర్సింహులు పరామర్శించిన వారిలోఉన్నారు. తిర్మలాపూర్‌లో.. చిన్నచింతకుంట (దేవరకద్ర): మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ఖాజామైనొద్దీన్ (45) కొన్నేళ్లుగా పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం పశువులకు నీరు పెట్టేందుకు తన యజమాని పొలంలో సింగిల్‌ఫేజ్ మోటార్ ఆన్ చేసేందుకు స్విచ్‌బోర్డులో వైర్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు ఓ వైరు చేతికి తగిలింది. దీంతో పెద్దశబ్ధంతో విద్యుదాఘాతం సంభవించి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నా డు. మృతుడి భార్య ఖాజాబీ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. -
ముందస్తు మద్యం
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలవడంతో మద్యం విక్రయాలు పెరిగాయి. సెప్టెంబర్‌లోనే నాలుగు జిల్లాల్లో కలిపి రూ.60కోట్ల మద్యం కొనుగోలు చేసి స్టాక్ చేశారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాదారులు, బార్ల యజమానులు, రాజకీయ పార్టీల నాయకులు ముందస్తుగా డిపోల నుంచి రూ.కోట్ల విలువైన మద్యాన్ని ముందుగానే కొనుగోలుచేసి ఆయా నియోజకవర్గాల్లో నిల్వచేసినట్లు సమాచారం. 2017–19 నూతన ఎక్సైజ్ పాలసీ సోమవారం నాటికి ఏడాది పూర్తికానుంది. గతేడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకు ఉమ్మడి జిల్లాలో రూ. 999కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. వచ్చే ఎన్నికల సీజన్ నేపథ్యంలో మరో రూ.2వేల కోట్ల అమ్మకాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి అధికాదాయం సమకూరింది. మద్యం స్టాక్ ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో 66 మద్యం దుకాణాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 45 దు కా ణాలు, వనపర్తిలో 29దుకాణాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 24 దుకాణాలు ఉన్నాయి. అ యితే ఇప్పటికే ఒక్క నాగర్‌కర్నూల్ నియోజవర్గంలోనే దుకాణాల కోసం రూ.6కోట్ల మద్యం కొనుగోలు చేసి స్టాక్ చేసినట్లు తెలిసింది. దీంతో పాటు వనపర్తి నియోజకవర్గం కోసం రూ.4కోట్ల మద్యం డిపో నుంచి తీసుకువెళ్లినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా కోసం రూ.30కోట్ల మద్యం, జో గుళాంబ గద్వాల జిల్లా కోసం రూ.20కోట్ల మ ద్యంను ఆయా డిపోల నుంచి కొనుగోలు చేశారు. 15రోజుల క్రితం కొత్తకోట సమీపంలో నూతన మద్యం డిపో ప్రారంభించారు. ఇక్కడి నుంచి వనపర్తి, కొత్తకోట, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, ఆత్మకూర్, నారాయణపేట, పెబ్బే ర్లో ఉన్న మ ద్యం దుకాణాలకు మద్యం స రఫరా చేస్తారు. ఇదివరకు నాలుగు జిల్లాలకు కలిపి తిమ్మాజిపేట వద్ద ఉన్న మద్యం డిపో నుంచి స రఫ రా అయ్యేది. ప్ర స్తుతం నూతన డిపో ఏర్పాటు చే యడం ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాదా రులు ఇక్కడి నుంచే కొనుగోలు చేయనున్నారు. పంట పడినట్టే ఈ దఫా మద్యం దుకాణాల లైసెన్స్ పొందిన వారికి అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. రెండేళ్ల కాలవ్యవధిలో మద్యం లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.45లక్షలు, రెండేళ్ల కాలపరిమితికి రూ.90లక్షలు చెల్లించాలి. అయితే ఈ కాలపరిమితిలో అనేక ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు కిటకిటలాడనున్నాయి. వచ్చే మే నెలలోపు పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. అంతకుముందు సర్పంచ్‌లు, స్థానిక సంస్థలకు ఎన్నిక జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్ పొందినవారికి పంట పండినట్లేనని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల వేళ.. ఆదాయం భళా! వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం (ఎక్సైజ్ పాలసీ) విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆరు స్లాబులు ఉండగా తాజాగా రెండింటిని కుదించి పట్టణ ప్రాంతాల్లో దుకాణం ధర ఏడాదికి రూ.55లక్షలు, గ్రామీణప్రాంతాల్లో రూ.45లక్షలకు సర్దుబాటు చేసింది. అయితే గతంలో కంటే ఈ సారి మద్యం దుకాణాలకు పోటీదారులు గణనీయంగా పోటీపడి దుకాణాలను సొంతం చేసుకున్నారు. 2015 అక్టోబర్ నుంచి 2016సెప్టెంబర్ రూ.872.93కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, 2016 అక్టోబర్ నుంచి 2017 ఆగస్టు వరకు రూ.923.16కోట్ల వ్యాపారం జరిగింది. 2016తో పొలిస్తే 2017లో మరో రూ.91కోట్లకు పైగా విక్రయాలు పెరిగాయి. 2017తో పొలిస్తే 2018లో రూ.76కోట్ల అధికాదాయం వచ్చింది. గత రెండేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేకపోయినా విక్రయాలు భారీగానే సాగాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో వచ్చే ఏడాదిలో దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా అదనపు విక్రయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. స్టాక్ చేస్తే చర్యలు తప్పవు ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల్లో గతనెలలో ఎంతస్థాయిలో మద్యం విక్రయించారో అదేస్థాయిలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అక్టోబర్‌లో 10వేల కేసులు అమ్మకాలు చేస్తే నవంబర్‌లో సైతం 10వేల కేసులు ఇస్తాం. వచ్చే ఎన్నికల నేపథ్యంలో అన్ని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయాలు, స్టాక్ చేసినట్టు తేలితే కేసులు నమోదుచేసి మద్యం సీజ్‌చేస్తాం. –జయసేనారెడ్డి, డీసీ ఉమ్మడి జిల్లా -
అయ్యో.. గణేశా!
ఇటిక్యాల (అలంపూర్) : జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానదిలో బుధవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. రెండు మూడు రోజులుగా హైదరాబాద్, కర్నూలు, ఇతర ప్రాంతాలనుంచి కృష్ణానదిలో వినాయకులను నిమజ్జనం చేయడానికి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మస్తాన్‌నగర్‌కు చెందిన 22 మంది యువకులు విగ్రహాన్ని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు ఉదయం 8.15 గంటలకు బీచుపల్లికి చేరుకున్నారు. వారి వెంట వచ్చిన సాయిరాం (18), రాజ్‌కుమార్ (18)లు సైతం పుష్కరఘాట్లపై నుంచి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు నదిలోకి దిగారు. 10 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని అందరు కలిసి ఎత్తుకోని పుష్కరఘాట్ల మేట్లపై నుంచి నదిలోకి వదిలేందుకు వెళ్లారు. ఘాట్లపై నీరు 4 ఫీట్ల ఎత్తులోనే ఉండగా పెద్ద విగ్రహం కావడంతో నదిలోకి ఎక్కువ దూరం వెళ్లారు. లోతు అధికంగా ఉన్న విషయం తెలియక ఈత రాని ఇద్దరు గల్లంతయ్యారు. ఎవరూ గమనించకపోవడంతో ఆ విషయం తోటి స్నేహితులు పసిగట్టలేకపోయారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చిన గజ ఈతగాళ్లు నదిఒడ్డున వచ్చిన యువకకులు కాసేపటి తర్వాత ఆందోళనకు గురయ్యారు. నదిలో దిగిన వారిలో ఇద్దరు ఇంకా రాలేదని.. నీటిలోనే మునిగిపోయి ఉంటారని కేకలు పెట్టారు. అక్కడున్న వారు గజ ఈతగాళ్లను పిలిచి విషయాన్ని చెప్పారు. వెంటనే వారు నదిలో దిగి ఇద్దరి మృత దేహలను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న అలంపూర్ సీఐ రజితారెడ్డి, ఇటిక్యాల ఎస్ఐ జగదీశ్వర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తోటి స్నేహితులు జరిగిన సంఘటన గురించి కుటుంబసభ్యులకు తెలిపారు. మృతదేహాలను చూసి స్నేహితులు బోరున విలపించారు. అవగాహన లేకే ప్రమాదం సోమ, మంగళ, బుధవారాల్లో ఎలాంటి ప్రమాదా లు జరుగకపోయినా నదిలో ఉన్న లోతు తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు. బుధవారం ఉద యం జరిగిన ప్రమాదానికి నది లోతు తెలియకపోవడం, దానికి తోడు వారికి ఈత రాకపోవడం, నీటి లో పడిపోయినప్పుడు ఎవరూ గమనించకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇదే మొదటి ప్రమాదం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద ప్రతియేటా వేలసంఖ్యలో గణేష్ విగ్రహాలను కృ ష్ణానదిలో నిమజ్జనం చేస్తారు. పుణ్యక్షే త్రం వద్ద ఇప్పటివరకు ఎలాంటి అప శ్రుతి చోటుచేసుకోలేదు. యువకుల తప్పిదం వల్ల మొదటిసారి ప్ర మాదం చోటుచేసుకోవడంతో బీచుపల్లి వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది మొత్తం 1004 వినాయక విగ్రహాలను అధికారుల సమక్షంలో నిమజ్జనం చేశారు. రెండురోజుల క్రితమే నిమజ్జన కార్యక్రమం ముగియడంతో సంఘటన జరిగినప్పుడు అధికారులు ఎవరూ అక్కడ లేరు. మృతదేహాల అప్పగింత గద్వాల క్రైం: వినాయకుని నిమజ్జనం చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందగా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటిక్యాల పోలీసుల సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి స్నేహితులకు అప్పగించారు. ఇదిలాఉండగా మృతి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. -
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
జడ్చర్ల టౌన్: బాదేపల్లి పట్టణంలోని బీసీ మేనేజ్మెంట్ హాస్టల్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తోటి విద్యార్థినులు, మృతురాలి సోదరి అనిత తెలిపిన వివరాల ప్రకారం... ఇటిక్యాల మండలం సాసనూల్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, ఈరమ్మ దంపతుల మొదటి కూతురు జి.వినీల(18) జడ్చర్ల వీఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో ఏడాది చదువుతోంది. స్థానికంగా కోర్టు ఎదురుగా ఉన్న బీసీ మేనేజ్మెంట్ హాస్టల్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 3గంటలకు కళాశాల నుంచి హాస్టల్‌కు వచ్చింది. సమీపంలో వినాయక నిమజ్జన వేడుకల్లో తోటి విద్యార్థినులతో కలిసి పాల్గొంది. రాత్రి 11.30గంటల సమయంలో హాస్టల్‌గదిలో పడుకుంది. కొద్దిసేపటికే వాంతికి రావడంతో వాష్ రూంకు వెళ్లింది. ఆయాసంగా ఉండటంతో వంట మనిషికి చెప్పింది. వారు బాదేపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృత్యువాత పడింది. మృతురాలికి థైరాయిడ్ సమస్య, అస్థమా ఉందని తెలిసింది. అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి ఉండవచ్చని బాదేపల్లి డాక్టర్లు తెలిపారని కులసంఘాల నాయకులు చెప్పారు. విద్యార్థిని అస్వస్థత, మృతి విషయం తెలియగానే వార్డెన్ స్వప్నారాణి అదేరాత్రి ఆస్పత్రికి చేరుకుంది. అప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం అందించటంతో వారుకూడా ఆస్పత్రికి చేరుకున్నారు. వినీల మృతదేహానికి బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇవీ సందేహాలు విద్యార్థిని మృతిపట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటం, ఇటీవలే పట్టణంలో డెంగీ కేసులు అధికంగా రావటంతో మృతిపట్ల సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వాష్‌రూంకు వెళ్లిన సమయంలో ఏదైనా కరిచి ఉంటుందా అన్న అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జడ్చర్ల సీఐ బాల్‌రాజ్‌యాదవ్ హాస్టల్‌కు చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆర్థికసాయం చేసిన మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విద్యార్థిని తల్లిదండ్రులకు రూ.25వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బీసీ వెల్ఫేర్ డీడీ విద్యాసాగర్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వినీల మృతిపట్ల ప్రభుత్వం విచారణ జరిపించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్, బీసీసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జంగయ్యమాదిగ తదితరులు డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ హాస్టల్లో వసతులు సక్రమంగా లేకపోవటం వల్లే ఘటన జరిగిందని ఆరోపించారు. -
వివాహేతర సంబంధం.. అనుమానం రాకుండా..
మూసాపేట (దేవరకద్ర): యువకుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని తేలిపోయింది. అనుమానాస్పదంగా బయటపడిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి పక్కాప్లాన్‌తో హత్య జరిగినట్లు తేల్చారు. భూత్పూరు సీఐ పాండురంగారెడ్డి కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా..మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన నాగరాజు (22), చెన్నకేశవులు అనే యువకులు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే విషయంపై వారి మధ్య కొన్నిరోజులుగా అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే వీరి విషయం గురించి శ్రీకాంత్ అనే యువకుడికి తెలిసింది. శ్రీకాంత్‌కు సదరు మహిళ చిన్నమ్మ కావడంతో మొదట నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. తీరు మార్చుకోక పోవడంతో నాగరాజును ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. చెన్నకేశవులుతో చేతులు కలిపి.. వరుసకు చిన్నమ్మ అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని సహిం చలేని శ్రీకాంత్ ఎలాగైనా బోయ నాగరాజును చంపాలని నిర్ణయించుకుని చెన్నకేశవులు సాయం కోరాడు. అతడు ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి ఈనెల 9వ తేదీన ఆదివారం రాత్రి నాగరాజును మాటల్లో పెట్టి గ్రామ సమీపంలోని వాగులోకి తీసుకెళ్లారు. పక్కా ప్లాన్‌తో రాత్రి 11 గంటల సమయంలో వివాహేతర సంబంధంపై గొడవ పెట్టుకున్నారు. తనపై దాడి జరుగుతుందని పసిగట్టిన నాగరాజు వారినుంచి తప్పించుకునేందుకు కళ్లలో ఇసుక చల్లి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినా వెంబడించి వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచి చంపేశారు. అనుమానం రాకుండా.. కసితీరా చంపిన ఇద్దరు ఎవరికీ అనుమానం రాకుండా ముందుగా వాగులో గోతి తీశారు. తల, మొండాన్ని వేరుచేసి ముందుగా తీసిన గోతిలో పూడ్చివేశారు. అనంతరం తలను కాస్త దూరంలో పూడ్చిపెట్టారు. మరుసటి రోజునుంచి తమకు ఏ మీ తెలియనట్లు వ్యవహరిస్తూ నటించారు. అయి తే సోమవారం రాత్రి వాగులో అనుమానాస్పదంగా మృతదేహం బయట పడింది. విషయం కాస్త పోలీసుల చెవిన పడటంతో వారు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ మొదలెట్టారు. తలను గుర్తించిన జాగిలం మంగళవారం ఉదయం పోలీసులు జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. బయటపడిన మొండెం నుంచి దాదాపు కిలోమీటరు వరకు వెళ్ళిన జాగిలం తల పాతిన ప్రదేశానికి వెళ్లి ఆగింది. ఆ ప్రాంతంలో వెతుకగా తల బయటపడింది. కొన్నిరోజులుగా అదృశ్యమైన నాగరాజుగా స్థానికులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. అడ్డుకున్న గ్రామస్తులు ఈ సంఘటన గురించి బయటపడగా మొదట గ్రామస్తులు ఎక్కడ గొడవలు జరుగుతాయోనని పోలీసులు విచారణ చేస్తుండగా అడ్డుకున్నారు. దాదాపు 6 గంటల పాటు శవాన్ని వెలికితీయకుం డా అడ్డుచెప్పడంతో సీఐ, ఎస్ఐ గ్రామస్తులను ఒప్పించి మధ్యాహ్నం 1.15 గంటలకు యువకుని మృత దేహాన్ని వెలికి తీయించారు. తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, సీఐ పాండురంగారెడ్డి సమక్షంలో పంచనామా చేసి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్లతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల బందోబస్తు.. సోమవారం సాయంత్రం వాగులో మొండెం భ యట పడటంతో రాత్రి నుంచి మంగళవారం వర కు గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ఎస్ఐతోపాటు చుట్టుపక్క మండలాల ఎస్ఐలు, 70 మంది పోలీసులను గ్రామంలో దించారు. వీడిన అదృశ్యం మిస్టరీ వాగులో తేలిన మొండెం నాగరాజుదేనా లేక మరెవరిదైనా అని ఇటు గ్రామస్తులు, అటు పోలీసులు మొదట తర్జన భర్జన పడ్డారు. కొన్ని రోజులుగా అదృశ్యమైన యువకుడు ఎక్కడికెళ్లాడని మరోపక్క ఆందోళన కొనసాగింది. చవరికి వాగులో శవంగా తేలడం పోలీసులు లోతుగా విచారణ చేశారు. మృతుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేవాడని తెలియడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు చెన్నకేశవులు, శ్రీకాంత్‌లను విచారించగా వారు ఒప్పుకుని లొంగిపోయారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఆర్ఐ అహ్మద్, వీఆర్వో మంజుల, నియోజకవర్గంలోని ఎస్ఐలు విచారణలో పాల్గొన్నారు. -
తప్పిన ఘోర ప్రమాదం
నాగర్‌కర్నూల్ క్రైం: కాలం చెల్లిన బస్సులు.. సా మర్థ్యానికి మించి ప్రయాణికుల తరలింపు.. కొం దరు డ్రైవర్ల నిర్లక్ష్యం వెరసి.. ప్రయాణికుల జీవితా ల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. జిగిత్యాల జి ల్లా కొండగట్టు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు బో ల్తాపడి 62మంది దుర్మరణం పాలైన విషాద సంఘటనను మరవకముందే అలాంటి ఘోర ప్ర మాదమే త్రుటిలో తప్పింది. ఈ ప్రమాదంలో నుంచి ప్రయాణికులు మృత్యువు అంచు దాకా వెళ్లి క్షేమంగా బయటపడ్డారు. బిజినేపల్లి మం డలం వట్టెం సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం ప్రభుత్వం, అధికారుల తీ రును ప్రశ్నిస్తోంది. వీఆర్వో పరీక్షకు వెళ్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో పరిమితికి రెండింతలు మించి ఎక్కడంతో ఆర్టీసీ బస్సు టైర్ రాడ్ ఊడిపోయి పొలంలోకి దూ సుకెళ్లింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్రంగా గా యపడ్డారు. వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వీఆర్ఓ పరీక్షకు వెళ్లి.. వీఆర్ఓ పరీక్ష జరగనుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి అభ్యర్థులు వనపర్తి జిల్లాకేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లోని సెంటర్లలో పరీక్ష రాసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో బయలుదేరిన యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జడ్చర్లలో ఎక్కారు. దాదాపు వంద మందికిపైగా బస్సు లోపల, టాప్‌పై ప్రయాణికులతో బయలుదేరింది. బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలోకి రాగానే బస్సు ముందు టైర్ ఊడిపోవడంతో అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లింది. బస్సును అదుపు చేసేందుకు డ్రైవర్ విఫలయత్నం చేశాడు. దీంతో టాప్‌పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు కుదుపులకు బస్సు మీద నుంచి చెల్లాచెదురుగా కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనస్థలిలో ఆర్తనాదాలు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పడం, పక్కకు ఒరిగిపోవడం, బయట నుంచి ఆర్తనాదాలు వినిపిస్తునండటంతో లోపల ఉన్న ప్రయాణికులకు ఇవేమీ అర్థం కాలేదు. అయితే ఏదో ప్రమాదం జరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకున్న వారంతా ఒక్కసారిగా బస్సు లోపలి నుంచి బయట పడేందుకు ఇబ్బంది పడ్డారు. బయటికి వచ్చే డోరు సైతం బిగుసుకుపోవడంతో.. బస్సు ముందు భాగం అద్దాలు పగులగొట్టి అందులోంచి బయటకు వచ్చారు. అయితే ప్రయాణికులలో అత్యధిక శాతం వీఆర్ఓ పరీక్షలు రాసే వారే కావడం.. ఒక్కొక్కరే ప్రయాణిస్తుండటంతో కొత్త వారైనా గాయపడిన తోటి ప్రయాణికులకు సురక్షితంగా ఉన్నవారు సఫర్యలు చేశారు. ఆస్పత్రికి తరలింపు.. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో నాగర్‌కర్నూల్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రి ఆవరణ మొత్తం క్షతగాత్రులు, ప్రయాణికుల రోదనలతో దద్దరిల్లిపోయింది. సంఘటన విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా ఆస్పత్రికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. అయితే తీవ్రంగా గాయపడిన 11 మందిలో 9 మందిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించండి నాగర్‌కర్నూల్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న బాధితులను కలెక్టర్ ఈ.శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను, వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారి వెంట జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్‌నాయక్ తదితరులున్నారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘనందన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి తదితరులు పరామర్శించారు. -
చెడ్డీగ్యాంగ్ వచ్చింది జాగ్రత్త మరీ!
జడ్చర్ల: పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెడ్డి గ్యాంగ్ స్వైరవిహారం చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏకకాలంలో నాలుగు కాంప్లెక్స్‌ల్లోని ఆరు ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు.. ఈ క్రమంలో నాలుగు ఇళ్లలో తమ చేతివాటం ప్రదర్శించి.. మరో రెండు ఇళ్లలో విఫలమయ్యారు. ఈ క్రమంలో దొంగల చేతికి పెద్దగా బంగారు, వెండి, నగదు దొరకకపోవడం గమనార్హం. హైదరాబాద్‌కే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్ కన్ను జడ్చర్లపై పడడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా.. స్థానిక శ్రీనివాసనగర్‌కాలనీలో శనివారం రాత్రి ఒంటిగంట తర్వాత ప్రవేశించిన దొంగల ముఠా ముందుగా నరేందర్‌కు చెందిన మూడంతస్థుల భవనంలోకి ప్రవేశించింది. ముగ్గురు బయట కాపలా ఉండగా మరో ఇద్దరు ప్రహరీ దూకి భవనంలోకి ప్రవేశించారు. అయితే సీసీ కెమెరాలను వారు పెద్దగా గమనించలేదు. నేరుగా కాంప్లెక్స్‌లోని అన్ని అంతస్థులను కలియదిరిగారు. తాళం వేసిన ఇళ్లను పరిశీలించినా.. ఎలాంటి చోరీకి పాల్పడకుండా వెనుదిరిగారు. ఇదంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. వారి చేతుల్లో పదునైన పరికరం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. దుండగులంతా 25–30 ఏళ్ల మధ్య వయస్సు గల వారై ఉండగా.. ముఖాలకు ముసుగు వేసుకుని.. చెడ్డీలు ధరించి ఉన్నారు. రెండో కాంప్లెక్స్‌లో చేతివాటం.. శ్రీనివాసనగర్‌లో నరేందర్ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన దొంగలు ఆ పక్కనే ఉన్న మరో కాంప్లెక్స్ భవనంలోకి వెళ్లారు. అక్కడ అద్దెకు ఉన్న సుశాంత్‌సాహు ఇంటికి తాళం వేసి ఉండడంతో తాళం విరగ్గొట్టి బీరువాలో ఉన్న మూడున్నర గ్రాముల చెవి కమ్మలు, కాళ్ల పట్టీలు, రూ.13 వేల నగదు అపహరించారు. ఇదే కాంప్లెక్స్‌లో మరో పోర్షన్లో అద్దెకు ఉన్న ఎల్ఐసీ ఉద్యోగి రమణకుమారి ఇంటి తాళాన్ని విరగ్గొట్టి తులం బంగారంతోపాటు దాదాపు రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం ఆపక్కనే ఉన్న కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన దొంగలు అద్దెకు ఉంటున్న బ్యాంకు మేనేజర్ శ్రీనునాయక్ ఇంటిని గుళ్ల చేశారు. మేనేజర్‌కు ఇటీవల బెంగుళూరుకు బదిలీ కావడంతో అక్కడ ఇల్లు వెతికేందుకు వారం రోజు క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. దొంగలు తాళం విరగ్గొట్టి బీరువాలో ఉన్న దాదాపు 6 తులాల బంగారు నగలు, కొంత నగదు అపహరించుకెళ్లారు. అనంతరం ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన దొంగలు ఎదురుగా ఉన్న కృష్ణారెడ్డి ఇంట్లోకి ప్రవేశించి రెండు బెడ్రూంలను గాలించారు. బీరువాలను, కప్ బోర్డులను సోదా చేశారు. ఇక్కడ కొంత వెండి సామగ్రి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కంటపడని నగల మూట కాగా ఓ ఇంట్లో దాదాపు 26 తులాల బంగారు నగలు, కొంత నగదు ఉన్నా అవి దొంగల చేతికి చిక్కకపోవడంతో కటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటిలోని రెండు బెడ్ రూంలలో బీరువాలను, కప్ బోర్డులలో దుస్తులు తదితర సామగ్రిని సోదా చేసినా దుస్తుల మధ్యలో మూటగట్టి ఉన్న నగలు వారి చేతికి చిక్కలేదు. పట్టపగలే చోరీలు అచ్చంపేట రూరల్: పట్టణంలోని వినాయకనగర్, ఆదర్శనగర్ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం పట్టపగలే రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. స్థానికుల కథనం ప్రకారం.. వినాయకనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న జగ్జీవన్‌రాం, అరుణలు శనివారం హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి వెళ్లగా గమనించిన దొంగలు ఇంటి తాళాలు విరగొట్టి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న తులంన్నర చైను, రూ.20 వేల నగదు, వెండి ఆభరణాలు తీసుకెళ్లారు. అలాగే ఆదర్శనగర్ కాలనీలో ఓ ఇంటి తాళం విరగొట్టి మూడు మాసాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పరశురాం తెలిపారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కాలనీలో అపరిచితులు తిరుగుతుంటే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. స్పష్టత రాలేదు దొంగతనం జరిగిన రెండు ఇళ్లకు సంబంధించిన బాదితులు స్థానికంగా లేకపోవడంతో ఎంత మేరకు చోరీ జరిగిందన్నది ఇంకా స్పష్టత లేదని సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సీసీ పుటేజీలు సేకరించామన్నారు. ఎవరైనా ఇళ్లకు తాళం వేసి వెళ్లే సమయంలో తమకు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు. -
విద్యార్థిపై అధ్యాపకుల దాష్టీకం
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి వ్యవహార శైలి బాగోలేదని సాకు చూపుతూ సంబంధిత తరగతి అధ్యాపకుడు దాష్టీకం ప్రదర్శించాడు. తనను దుర్భాషలాడాడని విచక్షణ కోల్పోయి చితకబాదడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన శనివారం జిల్లాకేంద్రంలోని గీతాంజలి ప్రైవేటు కళాశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామానికి చెందిన హన్మాండ్ల శివయ్య, కృష్ణవేణి దంపతుల ఆదిత్య(18) స్థానిక గీతాంజలి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజులాగే శనివారం తరగతులు నిర్వహించిన అధ్యాపకుడు తన క్లాస్ అయిపోయిన తర్వాత అధ్యాపకుడిని సదరు విద్యార్థి దుర్భాషలాడటంతో అది విన్న అధ్యాపకుడు తనను ఈడ్చుకెళ్లి చితకబాదాడు. వెంటనే కళాశాల యాజమాన్యానికి తెలపడంతో మరో ముగ్గురు కలిసి చావబాదాడని ఆరోపించారు. ఆస్పత్రికి తరలించిన అనంతరం సమాచారం అందించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆస్పత్రికి చేరుకున్న ఎస్ఐ భగవంత్‌రెడ్డి వారి వివరాలు సేకరించారు. విద్యార్థి పరిస్థితిపై వైద్యుడిని వివరణ కోరగా కుడి కాలి తొడ ఎముక క్రాక్ వచ్చిందన్నారు. ఇదిలా ఉండలా కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా విద్యార్థిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. సెలవు రోజు అయినప్పటికీ కళాశాల నడపడంపై జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ వెంకటరమణ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థిని కొట్టడానికి గల కారణాలను అడిగారు. దీనిపై సంబంధిత తరగతి గది అధ్యాపకుడు నీళ్లు నమలడంతో కళాశాలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. నలుగురిపై కేసు నమోదు నాగర్‌కర్నూల్ క్రైం: ఆదిత్యను కొట్టిన ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కళాశాల డైరెక్టర్ సునేంద్ర, అధ్యాపకులు లక్ష్మణాచారి, రమేష్, నవీన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం విద్యార్థి ఆదిత్యను జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
ప్రేమ పేరుతో ఆడిన నాటకంలో...
వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్): ప్రేమ పేరుతో ఆడిన నాటకంలో ఓ బాలిక ప్రమాదవశాత్తు బావిలో పడి మృత్యువాతపడింది. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని ప్యాటగడ్డ కాలనీకి చెందిన దంపతులకు ముగ్గురు కూతుళ్లు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటుండగా ఇద్దరు కూతుళ్లు సరిత, శ్రీలత(17) స్థానికంగా వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే వనపర్తి మండలం మెట్‌పల్లికి చెందిన శ్రీకాంత్ శ్రీలతతో, ప్యాటగడ్డకు చెందిన నరేష్ సరితతో రెండేళ్లుగా ప్రేమ పేరుతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాంత్ తన బైక్‌పై శ్రీలత, సరితను ఎక్కించుకుని పట్టణ శివారులోని ఖాసీంనగర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. విషయం తెలుసు కున్న నరేష్ తన స్నేహితుడు శేఖర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై శ్రీకాంత్ వద్దకు వెళ్లాడు. ఈ వి షయం గమనించిన కొందరు ప్యాటగడ్డ యువకులు వారిని అనుసరించారు. ఖాసీంనగర్ సమీ పంలోని వ్యవసాయం పొలం వద్ద బైక్‌లు ఉండటాన్ని గమనించిన యువకులు చుట్టుపక్కల వెతికారు. వీరి రాకను గమనించిన శ్రీలత, సరిత, శ్రీకాంత్, నరేష్, శేఖర్ పారిపోయారు. ఈ క్రమంలోనే శ్రీలత చీకట్లో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. మిగతా వారు పరారయ్యారు. అయితే తన సోదరి కనిపించడం లేదని సరిత ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. మృతదేహం వెలికితీత సమాచారం అందుకున్న వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ సూర్యనాయక్, పట్టణ ఎస్ఐ నాగశేఖరరెడ్డి, రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని బావిలో గాలించారు. ఈ క్రమంలో వ్యవసాయ బావిలో నుంచి శ్రీలత మృతదేహాన్ని వెలికితీశారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా ప్రజా, కుల సంఘాల నాయకులు, కాలనీవాసులు అడ్డుకున్నారు. బాలిక మృతికి కారణమైన యువకులపై చర్యలు తీసుకుని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు వెంకటేష్, వెంకటస్వామి, చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ విషయమై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు. అలాగే ముగ్గురు యువకులపై కూడా కేసు నమోదు చేశామన్నారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా
దేవరకద్ర(మహబూబ్‌నగర్): చదువుకున్న నిరుద్యోగులకు ఎర వేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాం, రూ.వేలల్లో జీతం, మంచి భవిష్యత్‌ను కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి పలువురిని ఒడిశాకు తీసుకువెళ్లి శిక్షణ పేరుతో నిర్బంధానికి గురి చేసిన ఘటన ఇది. అక్కడి నుంచి కొందరు యువకులు తప్పించుకుని రావడంతో విషయం వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ దేవరకద్రకు చెందిన కొందరు యువకులు, ఒక యువతి ఇప్పటికి అక్కడే వారి నిర్బంధంలో ఉన్నట్లు తప్పించుకుని వచ్చిన వారి ద్వారా తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ముందుగా కొందరు నిరుద్యోగలకు ఎర వేసి వారి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి వివరాలు, ఫోన్ నంబర్లు తీసుకుని తిరిగి వారి ద్వారామరి కొందరిని చైన్ సిస్టం మాదిరిగా లాగుతున్నట్లు సమాచారం. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారినే ఎక్కువగా తమ చైన్ సిస్టంలోకి లాగుతున్నారు. సభ్యత్వానికి డబ్బు వసూలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ కంపెనీలో చేరడానికి రూ.10,500 చెల్లించాలని, ఆ తర్వాత భోజనం ఖర్చు కింద రూ. 6 వేలు చెల్లిస్తే ఇక రూ.16 వేల నుంచి రూ. 18 వేల వరకు నెలకు వేతనం వస్తుందని మాయమాటలు చెబుతున్నట్లు సమాచారం. ఇలా అంగీకరించిన వారిని ఒడిశాలోని బద్రక్ జిల్లాకు వచ్చేలా చేస్తున్నారు. అక్కడి వెళ్లాక వారి నుంచి రూ. 16,500 తీసుకుని.. ఒక గాల్వే బ్యాగ్ అందులో కొన్నిరకాల క్రీములు, పౌడర్లు, ప్రొటీన్ డబ్బాలు ఇస్తున్నారు. గ్రేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద గాల్వే బ్రాండ్ వస్తువులను అంటగడుతున్నారు. అలాగే, ఒడిశాకు వచ్చిన వారికి సూటు వేయించి ఫొటో తీసి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట్లు ఐడెంటిటీ కార్డు జారీ చేస్తున్నారు. ఇదంతా చూసిన నిరుద్యోగులు ఆశతో ఉంటున్నారు. బద్రక్ జిల్లాలో అద్దెకు తీసుకున్న గదుల్లో పది నుంచి ఇరవై మంది వరకు ఉంచి రెండు పూటల భోజనం మాత్రం పెట్టి తరగతులు నిర్వహిస్తూ చివరకు గాల్వే ఉత్పత్తులు ఎలా విక్రయించాలో చెబుతున్నారు. ప్రతీ సభ్యుడు ముగ్గురిని సభ్యత్వం చేయించాలని, ముందుగా తీసుకున్న వారి స్నేహితులు, బంధువులు, ఇతరులకు ఫోన్ చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఒడిశా వెళ్లిన వారెవరూ బయటకు వెళ్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల నుంచి రెండు నెలలు పూర్తయ్యాక ఉద్యోగం లేదనే విషయం తెలుసుకుని గ్రామాలకు వెళ్తామని చెప్పినా కంపెనీ ప్రతినిధులు నిరాకరిస్తున్నారు. ఇరుకు గదుల్లో నెలల తరబడి ఉండడం దుర్భరంగా మారిందని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్టేజీ వన్ నుంచి ఫోర్ వరకు సభ్యత్వాలను చేయిస్తే రూ.74 వేలు అకౌంట్లో వేస్తాం, ఆ తర్వాత రూ.లక్ష, చివరగా రూ.5 లక్షలు వస్తాయని ఆశపెడుతూ ఇతరులకు ఫోన్లు చేయించి మోసం చేయిస్తున్నారని బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు దేవరకద్రకు చెందిన ఎరుకలి వెంకట్రాములు, ఎ రుకలి శివ, కురుమూర్తి, బల్సుపల్లి నర్సింహా ఒ డిశాలో నిర్బంధం తప్పించుకుని వచ్చారు. అదే విధంగా మద్దూర్ మండలం నిడ్జింతకు చెందిన ఆంజనేయులు కూడా వీరి వెంట వచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం విషయం పోలీసులకు వివరించారు. తమకు జరిగిన అన్యాయమే చాలా జరుగుతోందని తెలిపారు. తన తమ్ముడు రాము, చెల్లెలు రామలక్ష్మీ ఇప్పటికి ఒరిస్సాలోనే వారి నిర్బంధంలో ఉన్నారని ఎరుకలి వెంకట్రాములు తెలిపారు. ఈ మేరకు వారిని విడిపించి తీసుకు రావాలని కోరారు. -
కేఎల్ఐ కాల్వలో పడి ఇద్దరి మృతి
కల్వకుర్తి టౌన్(మహహబూబ్‌నగర్): కేఎల్ఐ కాల్వలో పడి ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని తిమ్మరాశిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన గోరంట్ల సుక్కమ్మ(40) శుక్రవారం రాత్రి కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. శనివారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వలో సుక్కమ్మ వస్తువులు కనిపించడంతో గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా సుక్కమ్మ మృతదేహం లభించింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుక్కమ్మ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఆమెకు భర్తతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. బహిర్భూమికి వెళ్లి వృద్ధుడు.. ఇదే గ్రామానికి చెందిన బాలయ్య(80) వృద్ధుడు బహిర్భూమికి వెళ్లి కాల్వలో జారిపడి మృతిచెందాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లిన బాలయ్య ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెందాడు. కాల్వలో నీరు పారుతుండటంతో అక్కడే పక్కన బోరుమోటార్లకు కట్టిన తాడు అడ్డుకొని మృతదేహం కనిపించింది. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కల్తీమయం!
అచ్చంపేట రూరల్ : కొన్ని సంవత్సరాలుగా నల్లమల ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. వివిధ శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇస్తూ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించారు. గత పదేళ్లుగా మద్యం వ్యాపారంలో బాగా రాటుదేలిన నాయకులే దీనికి సూత్రధారులుగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో అమ్రాబాద్ మండలంలో జోరుగా కల్తీ మద్యం వ్యాపారం కొనసాగగా.. ఆ ప్రాంతంలో వైన్సులను లాటరీ పద్ధతిన దక్కించుకున్న వారు విచ్చలవిడిగా మద్యం కల్తీ చేసి అమ్మకాలు సాగించారు. రెండుసార్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతున్నారని మరోసారి కేసు చేశారు. అయితే అప్పట్లో లైసెన్స్ ఉండటంతో మద్యాన్ని కల్తీ చేసి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారు. అలవాటు పడిన వారు వైన్సులు.. లైసెన్సు లేకున్నా అదే తరహాలో మద్యం కల్తీ చేసి వైన్స్‌లకు చేరవేస్తున్నారు. కూతవేటు దూరంలోనే.. గతంలో అమ్రాబాద్ ప్రాంతంలో మద్యం కల్తీ చేసిన వారు, లైసెన్స్‌లు దక్కని వారు ప్రస్తుత సంవత్సరం నుంచి అచ్చంపేట పట్టణాన్ని ఎంచుకుని మద్యం కల్తీ చేసి అమ్రాబాద్, పదరతోపాటు వివిధ వైన్సులకు చేరవేస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ఇంటిలో గుట్టుగా మద్యం కల్తీ వ్యాపారం సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అచ్చంపేటలో ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే మద్యం కల్తీ దందా జరగడం గమనార్హం. అయినా ఇన్ని రోజులు స్థానిక ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మామూళ్ల విషయంలో తేడా వచ్చినందుకే ఇప్పుడు దాడులు జరిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓసీ, ఎంసీలతో.. బ్రాండెడ్ అమ్రాబాద్ మండలానికి చెందిన వెంకట్రామ్నాయక్ గతంలో ఇదే మండలంలో వైన్సు షాపును దక్కించుకున్నారు. అప్పట్లో నకిలీ మద్యం తయారు చేసి వైన్‌షాపులో అమ్మినట్లు రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది మద్యం షాపు దక్కించుకోని వెంకట్రామ్నాయక్ అచ్చంపేట, వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు చెందిన ఓసీ, ఎంసీ లాంటి కొన్ని మద్యం బాటిళ్లను షాంపిల్‌గా తీసుకుని, అధిక రేట్లు ఉన్న బ్లెండర్‌స్పైడ్, సిగ్నేచర్, రాయల్ ఛాలెంజ్, రాయల్‌స్టాగ్ లాంటి ఖాళీ బాటిళ్లలో సగం మద్యం, సగం నీటిని నింపి బాటిళ్లపై మూతలను ఏర్పాటు చేసి వైన్ షాపులకు తరలిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు చేస్తున్నాడని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి వెంకట్రామ్నాయక్ ఇంట్లో తనిఖీ చేయగా కల్తీ మద్యం తయారు చేసిన 5 కాటన్ల ఓసీ బాటిళ్లు, 15 లీటర్ల కల్తీ మద్యం బాటిళ్లు, ఖాళీ సీసాలు, వాటిపై బిగించే మూతలను గుర్తించారు. బెల్టుషాపులకు సరఫరా.. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలిశాయి. మద్యం ఏరులై పారుతుంది. సాధారణ మద్యం నుంచి విలువైన మద్యం వరకు లభ్యమవుతుంది. ప్రతి ఫుల్ బాటిల్‌పై రూ.50 నుంచి రూ.150 వరకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తయారు చేసిన కల్తీ మద్యాన్ని గ్రామాల్లోని బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి బెల్ట్‌షాపులపై దాడులు చేయడం లేదని, కేసుల కోసం మాత్రమే అప్పుడప్పుడు దాడులు చేసి ఉనికి చాటుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నల్లమల ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం జరగకుండా, గ్రామాల్లో బెల్ట్‌షాపు లేకుండా, మద్యం అధిక రేట్లకు విక్రయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
అచ్చంపేట రూరల్ : రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఎక్కడో ఒక దగ్గర ఆ శాఖ అధికారులు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఉప్పునుంతల మండలం ఫిరట్వానిపల్లికి చెందిన వీఆర్ఓ వెంకటయ్య రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అచ్చంపేట ఆర్టీసీ బస్టాండు ఆవరణలోని చెట్ల కింద పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన వెంకటసాయి కిరణ్ ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామ సమీపంలో ఉన్న గుట్ట సర్వే నంబర్ 61లో గాజు పెంకులు తీసుకోవడానికి 2018 ఆగస్టు 1న మైనింగ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆగస్టు 3న సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు ఉప్పునుంతల మండల తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి సర్వే నంబర్ 61లో పూర్తి వివరాలను సేకరించి దరఖాస్తుదారుడికి కావాల్సిన పత్రాలను ఇవ్వాలని సూచించారు. రూ.30 వేలు డిమాండ్ విచారణ చేసిన అనంతరం తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆగస్టు 14న ఎన్ఓసీ, స్కెచ్ ఇచ్చారు. కాగా ఏ1 సర్టిఫికెట్ మాత్రం వీఆర్ఓ వెంకటయ్య దగ్గర ఉండిపోయింది. విచారణ చేసి ఏ1 సర్టిఫికెట్ ఇవ్వాలని తహసీల్దార్ పదేపదే చెప్పినా వినిపించుకోలేదు. ఏ1 సర్టిఫికెట్ ఇవ్వాలని వెంకటసాయి కిరణ్ వీఆర్ఓ వెంకటయ్యను పదే పదే అడిగినా అలసత్వం చేసి రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకటసాయి కిరణ్ ఈ నెల 25న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు అదే రోజు వెంకటసాయి కిరణ్ వీఆర్‌ఓతో మాట్లాడి రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిర్చాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కింద వెంకటసాయి కిరణ్ వీఆర్ఓ వెంకటయ్యకు రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్నట్లు వేలిముద్రల ద్వారా నిర్ధారణ అయ్యిందని, పూర్తి విచారణ చేసి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో వీఆర్ఓ వెంకటయ్యను హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. రెవెన్యూ శాఖలో, ఎవరైనా అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని డీఎస్పీ కోరారు. వీఆర్ఓ వెంకటయ్యను వలవేసి పట్టుకున్న ఏసీబీ సిబ్బందిలో ఎస్ఐ లింగస్వామి, కమల్‌కుమార్, అష్రప్, కృష్ణ, రవి, ఆంజనేయులు ఉన్నారు. అప్పుడూ అదే స్థలంలో.. బల్మూర్ మండల కేంద్రంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తించిన వీఆర్ఓ వెంకటయ్య 2014 జనవరి 7న భూమి విరాసత్ విషయంలో రూ.4 వేలు లం చం తీసుకుంటూ పట్టుబడ్డారు. విషయమేమంటే మొదటిసారి కూడా అచ్చంపేట ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కిందే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. గురువారం కూడా అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కిందే రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రస్తుతం వీఆర్ఓ వెంకటయ్య వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్ క్రైం : ప్రేమించుకున్నాం..పెళ్లి చేయండని ఓ ప్రేమజంట పెద్దలను వేడుకున్నారు.. వారు ఒప్పుకోక పోవడంతోపాటు ప్రేమజంటను విడదీయాలని ప్రయత్నించడంతో ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు. కలిసి బతకలేకపోతే కలిసి చనిపోదాం అని నిర్ణయించుకుని పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. పట్టణంలోని గాంధీరోడ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, అల్లీపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 18న ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయిని తీసుకుని రావాలని అబ్బాయి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు రోజులు గడువు పెట్టారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ విషయం ప్రేమికులకు తెలియగా శుక్రవారం ఉదయం అల్లీపూర్ సమీపంలో పంట పొలాల్లో వారిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా అమ్మాయి మైనర్ కావడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆంజనేయులపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
చికిత్స పొందుతూ భాస్కర్ మృతి
మహబూబ్‌నగర్ క్రైం : పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ప్రియురాలి ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన భాస్కర్(24) జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ప్రాణాలు వదిలాడు. హైదరాబాద్ బొరబండ సంజయ్‌నగర్ కాలనీకి చెందిన భాస్కర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు. అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం భాస్కర్ ఇంటికి వెళ్లి నచ్చజెప్పి వచ్చాడు. అయినా వినకుండా ఆమె ఇంటిచుట్టూ తిరిగాడు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పరిసరాలలో తిరిగాడు. అదేరోజు రాత్రి నిద్రమాత్రలు మింగి ఆకస్మరక స్థితిలోకి వెళ్లాడు. వైద్యం చేయించుకుని అంతటితో ఆగకుండా గురువారం ఉదయం మళ్లీ మహబూబ్‌నగర్‌కు చేరుకుని ప్రియురాలి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్సపొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు. ఈ సంఘటనపై న్యాయం చేయాలని శుక్రవారం ఉదయం మృతుడి తండ్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు ఇచ్చిన వాగ్మూలం ప్రకా రం 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. -
ప్రేమ విఫలమైందని.. ప్రియురాలి ఎదుట..
మహబూబ్‌నగర్ క్రైం: తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నిప్పంటించు కోవడంతో క్షణాల్లో మంట లు చెలరేగి శరీరం పూర్తిగా కాలింది. వెంటనే బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా.. హైదరాబాద్‌లోని బొరబండ సంజయ్నగర్కాలనీకి చెందిన భాస్కర్ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా పట్టణంలోని ఓ కాలనీకి చెందిన యువతి అదే కళాశాలలో మొదటి ఏడాదిలో చేరింది. అయితే యువతి తన ప్రేమను నిరాకరించడంతోపాటు నిర్లక్ష్యం చేస్తుందని గురువారం సాయంత్రం ఆమె ఇంటి దగ్గరికి చేరుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే మంటలు వ్యాపించడంతో దాదాపు 95 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరం నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నామని, ఇప్పుడు తనను నిర్లక్ష్యం చేస్తుందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాస్కర్ మీడియాకు వెల్లడించాడు. సోమవారం అమ్మాయి వాళ్ల బాబాయి తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించారని ఆరోపించారు. వాళ్ల పెద్దల మాటలు విని అమ్మాయి తన ప్రేమను నిరాకరిస్తుందని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇదే విషయమై యువతి బాబాయి ‘సాక్షి’తో మాట్లాడుతూ భాస్కర్ కొన్నిరోజుల నుంచి ప్రేమించా లని తమ అమ్మాయిని వేధిస్తుండటంతో ఇటీవల వాళ్ల ఇంటికి వెళ్లి పెద్ద మనుషుల సమక్షంలో నచ్చజెప్పి వచ్చామన్నారు. గురువారం సాయంత్రం వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. ఈ విషయమై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. -
బల్గెరలో రైతు దారుణ హత్య
గట్టు(గద్వాల) : వ్యవసాయ పొలం వద్ద నిద్రించేందుకు రాత్రి వెళ్లిన రైతు, తెల్లారేసరికి శవమై కనిపించాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనతో బల్గెర గ్రామం ఉలిక్కిపడింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సమీప బంధువు బల్గెర గ్రామానికి చెందిన గీరప్పగాళ్ల యల్లప్ప(52)కు గ్రామ సమీపంలో 5ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. పొలంలోనే గుడిసె వేసుకుని చాలాకాలంగా ఒక్కరే రాత్రి అక్కడే నిద్రిస్తున్నాడు. సోమవారం కూడా రాత్రి ఇంట్లో భోజనం ముగించుకుని వ్యవసాయ పొలానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం మృతుని సోదరుడు తిమ్మప్ప తన పత్తి పొలంలొ మొగ్గలను తుంచేందుకు వెళ్తున్న క్రమంలో దారి మధ్యలోనే యల్లప్ప పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుని కాళ్లను కర్రలతో కొట్టి చంపినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాళ్లు విరిగినట్లు గుర్తించారు. మోచేతికి రక్తగాయం కూడా ఉంది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నాయి. పోలీస్ జాగిలాలతో పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య శంకరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తిమ్మప్ప హైదరాబాద్‌లోని ఓయూలో పీజీ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం కౌలు విషయంలో మూడు నెలల క్రితం పక్కపొలం రైతులు ముగ్గురితో వివాదం జరిగిందని, దీన్ని మనసులో పెట్టుకుని నర్సిములు, స్వాములు, సవారి హత్యకు పాల్పడ్డారని యల్లప్ప కొడుకు బసప్ప అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు జాగిలాలతో అన్వేషణ గద్వాల నుంచి రప్పించిన పోలీసు జాగిలాలు ఘటనా స్థలంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న పత్తి పొలాల్లో తిరిగాయి. క్లూస్ టీం ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు గద్వాల సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
రాళ్లు పాతెయ్.. వెంచర్ వేసెయ్!
జడ్చర్ల మహబూబ్‌నగర్ : జడ్చర్లలో వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. భూమి కొనుగోలుదారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు చేస్తున్నారు. గుడ్డిగా కొలతలు వేసి రాళ్లుపాతి, ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల పట్టణం నాలుగు వైపులా విస్తరిస్తుండడం ఈ దందాకు బాగా కలిసివస్తోంది. ఈ క్రమంలోనే జడ్చర్లలో అక్రమ రియల్ వ్యాపారం ఊపందుకుంది. అనుమతులు ఎందుకు తీసుకోరంటే..? వ్యవసాయ భూమిని వెంచర్, ప్లాట్లుగా మార్చాలంటే మొదట ఆ భూమిని వ్యవసాయేతర(నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)గా రెవెన్యు రికార్డుల్లో మార్పు చేయాలి. ఇందుకు పూర్తి వివరాలతో సంబందిత రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. భూమి విలువలో మూడు శాతం రుసుమును ప్ర భుత్వానికి చెల్లించాలి. తర్వాత సంబంధిత అధికారులు విచారించిన పిమ్మట నాలా సర్టిఫికెట్ జారీ చేస్తారు. అనంతరం నాలాను పొందుపరుస్తూ వెంచర్‌కు సంబందించి రోడ్లు, గ్రామ పంచాయతీ కి సంబందించి 10శాతం కమ్యూనిటీ స్థలాన్ని కే టాయిస్తూ గుర్తింపు పొందిన డిజైనర్ నుంచి ఓ లేఅవుట్‌ను తయారు చేయించాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత గ్రామ పంచాయతీ అ ధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారు విచారణ చేస్తారు. తమ పరిధిలో లేకుంటే డీటీసీపీ అధికారులకు ఆయా లేఅవుట్ ప్రతిపా దనలను సంబందిత పాలకవర్గం తీర్మానంతో ని వేదించాల్సి ఉంటుంది. అనంతరం డీటీసీపీ అధికారులు విచారించి నిబంధనల మేరకు రోడ్లు, క మ్యూనిటీకి సంబందించిన స్థలాలను కేటాయి స్తూ అనుమతి ఇస్తారు. దీని ప్రకారం సదరు వెం చర్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ తదితర మౌళిక సదుపాయాలతో వెంచర్‌ను ఏర్పాటు చే స్తారు. తరువాత వినియోగదారులకు అక్కడ ప్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. అయితే వెం చర్ల నిర్వాహకులు ఇదంతా ఓ ప్రహసనంగా, వ్య యంతో కూడుకున్న వ్యవహారమని పేర్కొంటూ తమ ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లను తయారు చేసి సంబంధిత అధికారులు, పాలకులకు అంతో ఇంతో ఇచ్చుకుని ప్లాట్లను విక్రయిస్తున్నారు. కావేరమ్మపేట పరిధిలో.. కావేరమ్మపేట(జడ్చర్ల) : మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ వ్యవహారం జోరుగా కొనసాగుతోంది. అధికారులు, పాలకులు కుమ్మౖక్కై నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా కావేరమ్మపేట రైల్వే ట్రాక్ సమీపంలో దాదాపు 10ఎకరాలలో ఏర్పాటు చేసిన వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవు. యథేచ్చగా రాళ్లు పాతి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమ వెంచర్లపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పరిహారం ఇచ్చేదాకా పనులు జరగనివ్వం
గోపాల్పేట (వనపర్తి): రేవల్లి మండలంలోని బండరాయిపాకులలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏదుల గ్రామస్తులకు పరిహారం అందలేదని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ వనపర్తి జిల్లా అసెంబ్లీ ఇన్చార్జ్ మహేష్ మాట్లాడుతూ పాలమూరు– రంగారెడ్డి బ్యాలెన్సింగ్ ఏదుల రిజార్వాయర్ మునకకు గురవుతుందని, ఏదుల గ్రామంలో రిజర్వాయర్ పనులు గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నా ఇంత వరకు పరిహారం అందలేదన్నారు. గ్రామంలో ఇంకా 60 ఎకరాలకు పరిహారం రావాల్సి ఉందన్నారు. గ్రామంలో ఇళ్ల సర్వే చేసి దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆరోపించారు. ఇళ్ల సర్వే చేసినప్పుడు రేవల్లి తహసీల్దార్, వనపర్తి ఆర్డీఓలు 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పరిహారం చెల్లించే దాకా పనులు జరగనివ్వమని తెగేసి చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ గ్రామ అధ్యక్షుడు దేవేందర్, నాయకులు స్వామి, రాములు, మధు, హుస్సేన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న చికెన్‌గున్యా
మాగనూర్ (మక్తల్) : మండల కేంద్రంలో చికెన్‌గున్యా వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రజలు మంచానపడ్డారు. ఈ వ్యాధికి గురైన పిల్లలు, వృద్ధుల పరిస్థితిని చూడలేకపోతున్నారు. వ్యాధిగ్రస్తులు పూర్తిగా నడవలేకపోవడంతోపాటు కీళ్లు పట్టేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉన్న సమయంలో ఈ వ్యాధి సోకడంతో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లి రూ.వేలు ఖర్చు చేస్తున్నా వ్యాధి నయం కావడం లేదు. ఇటు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి.. అటు వ్యవసాయ పనులు నిలిచిపోతుండడంతో తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యాధి గ్రామంలో అంతటా విజృంభిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామంలో మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉండడంతోపాటు అపరిశుభ్రత కారణంగా దోమ లు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ దోమల కాటు మూలంగానే వ్యాధి వ్యాపిస్తోందని వాపోతున్నారు. వారం పది రోజులుగా ప్రజలు మంచం పట్టినా ఇటు వైద్యశాఖ గాని.. అటు పంచాయతీ పాలకులు గాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిబిరం ఏర్పాటు చేయాలి గ్రామంలో ఈ వ్యాధి తీవ్రస్థాయిలో ఉండడం మూలంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలి. అలాగే ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది కూడా ఈ విషయమై పెద్దగా స్పందించడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. – సత్యమ్మ, బాధితురాలు -
ప్రమాదాలా.. ఆత్మహత్యలా?
మదనాపురం (కొత్తకోట) : మండలంలోని కొన్నూర్ రైల్వేస్టేషన్ ప్రమాదాలకు నిలయంగా మారింది. గత కొంతకాలంగా రైల్వేస్టేషన్ సమీపంలో రైళ్లు ఢీకొని చాలామంది గ్రామస్తులు చనిపోతున్నారు. రైలు కిందపడి చనిపోయేవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. చాలా వరకు చనిపోవాలనుకున్న వారే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అయితే మరికొందరు ప్రమాదవశాత్తే చనిపోతున్నారని రైల్వేట్రాకు గ్రామ మధ్యలో ఉండడమే దీని ప్రధాన కారణమని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఏటా పదుల సంఖ్యలో మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నడిబొడ్డులో ట్రాకు.. ప్రధానంగా గ్రామం నడిబొడ్డున రైల్వేట్రాకు ఉండడంతో గ్రామంలో రాకపోకలు సాగించే గ్రామస్తులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బీసీకాలనీ నుంచి గ్రామంలోకి వెళ్లి కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకురావాలంటే రైల్వే ట్రాకు దాటాల్సిందే. ఈ క్రమం లో చిన్నపిల్లలు, వృద్దులు, యువకులు, ప్రతిఒక్కరూ ట్రాకు దాటి వెళ్తారు. ఈ ట్రాకు దాటే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలకు గురికాక తప్పదు. గత కొన్నేళ్ల తరబడి రైలు ప్రమాదాలకు గ్రామస్తులు గురై చనిపోతున్నారు. ఏడాదిలో కనీసం పదిమంది చనిపోతుంటారు. అలాగే గొర్రెలు, మేకలు, పశువులు రైలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కాంపౌండ్‌కు నోచని స్టేషన్ రైల్వేస్టేషన్ పరిధి ఉన్నంత వరకు ప్లాట్‌ఫాం గుండా కాంపౌండ్ వాలు నిర్మాణం చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అడ్డగోలుగా ట్రాకు దాటకుండా ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్ సమీపంలో గ్రామస్తులకు నడక వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆయుర్వేద వైద్యుడినంటూ టోకరా
పెంట్లవెల్లి (కొల్లాపూర్) : కిడ్నీ వ్యాధికి సంబంధించి ఆయుర్వేద మందులు ఇస్తానని వచ్చిన ఓ వ్యక్తి టోకరా వేశాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని గోప్లాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ఆయుర్వేదిక్ మందులతో జబ్బులు నయం చేస్తామంటూ కొందరు గ్రామానికి వచ్చి దామోదర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆ కుటుంబంలో వరాలు అనే మహిళ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండేది. ఆయుర్వేదిక్ మందులతో సమస్యను నయం చేస్తానని చెప్పాడు. మరుసటి రోజు వచ్చి జబ్బు నయం కావాలంటే రూ.12 వేలు ఇవ్వాలని అన్నాడు. ఈ మందులు శ్రీశైలం అడవులు, అచ్చంపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయని చెప్పి, మీకు నమ్మకం లేకపోతే తన ఆధార్ కార్డు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితులు రూ.12 వేలు ఇవ్వడంతో సదరు వ్యక్తులు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో బాధితులు పెంట్లవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అలాగే చిన్నంబావి, కొప్పునూర్, లక్ష్మిపల్లి గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, పోలీసులు వారిని పట్టుకుని శిక్షించాలని కోరుతున్నారు. -
స్నేహితుడు, యువతి పారిపోవడంతో..
మహబూబ్‌నగర్ క్రైం : ఓ అమ్మాయి, అబ్బాయి కనిపించకపోవడంతో.. వారిద్దరి విషయమై గ్రామస్తులు చేసిన ఒత్తిడి భరించలేక ఓ యువకుడు బుధవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు కింద తల పెట్టడంతో తల, మొండెం వేర్వేరయ్యాయి. మం డలంలోని మాచన్‌పల్లికి చెందిన శ్రీకాంత్(17) జిల్లా కేంద్రంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శ్రీ కాంత్‌కు గ్రామంలో ఆటోడ్రైవర్‌గా పనిచేసే అంజి అనే స్నేహితుడు ఉన్నాడు. వారం క్రితం అంజితో పాటు అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి గ్రా మం నుంచి వెళ్లిపోయారు. అయితే, వారు ఎక్కడి కి వెళ్లారో శ్రీకాంత్‌కు తెలుసునని భావించిన గ్రామస్తులు ఆచూకీ చెప్పాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. అది భరించలేక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. కాగా, ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ శ్రీకాంత్ రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ వీడియో తీసి.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. ఈ వీడియో చేసి స్పందించే లోగానే ఆయన ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. -
ఒకే కుటుంబంలో నలుగురికి పాముకాటు
భూత్పూర్ (దేవరకద్ర) : ఇంట్లో రాత్రి నిద్రిస్తుండగా నిద్రలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పాము కాటుకు గురికాగా, చిన్నారి బాలుడు మృత్యువాతకు గురికాగా, మరో ముగ్గురికి ప్రాణపాయం తప్పిన సంఘటన మండలంలోని భట్టుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం భట్టుపల్లికి చెందిన వేముల సుదర్శన్‌రెడ్డికి భార్య వేముల సునీత, కుమారుడు మంజీత్ రెడ్డి, కుమార్తె మిన్నీ ఉన్నారు. బుధవారం రాత్రి వారు ఇంట్లో పక్కపక్కనే నిద్రించారు. అర్ధరాత్రి వేముల సుదర్శన్‌రెడ్డికి చేతికి చల్లగా తగలడంతో నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. దీంతో అక్కడి నుంచి పాము వెళ్తుండడాన్ని చూసి చంపివేశాడు. ఆ తర్వాత చూసే సరికి కుమారుడు మంజీత్‌రెడ్డి(2) మత్తులోనే ఉండడంతో ఆయన పాము కాటు వేసిందని గుర్తించి చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, గురువారం ఉదయం మంజీత్ అంత్యక్రియలు చేసేందుకు సమాయత్తమవుతుండగా.. సుదర్శన్‌రెడ్డితోపాటు ఆయన భార్య సునీత, కూతురు మిన్నీ కిందపడిపోయారు. దీంతో వీరిని కూడా పాము కాటు వేసిందని గుర్తించిన బంధువులు మహబూబ్‌నగర్‌లో ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని సాయంత్రం ఇంటికి పంపించగా అశృనయనాల నడుమ కుమారుడు మంజీత్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
బల్మూర్ (అచ్చంపేట) : ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాత్రి సమయంలో ఎద్దు అడ్డు రావడంతో కిందపడి ఓ వ్యక్తి మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కొండనాగుల సమీపంలో అచ్చంపేట ప్రధాన రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ విక్రం కథనం ప్రకారం.. కొండనాగులకు చెందిన వలూవాయి నర్సింహ(40) రామాజిపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్ ఊశయ్య కలిసి శని వారం రాత్రి ద్విచక్రవాహనంపై రామాజిపల్లికి వెళ్తున్నారు. మార్గమధ్యలోని రైస్‌మిల్ వద్ద రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఎద్దును ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనక కూర్చున్న నర్సింహ తలకు తీ వ్ర గాయాలు, ఊశయ్య బలమైన గాయాలయ్యా యి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తర లిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఊ శయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హై దరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై నర్సింహ భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. నర్సింహ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థికసాయం అందజేశారు. సైకిల్‌పై నుంచి కిందపడి.. బల్మూర్ (అచ్చంపేట): మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఆదినారాయణ(45) సైకిల్‌పై వెళ్తుండగా పశువులను ఢీకొనడంతో కిందపడి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ఆదినారాయణ తాపీ మేస్త్రీ పని కోసం తన సైకిల్‌పై కొండనాగులకు వెళ్తుండగా గ్రామ స్టేజీ సమీపంలో పశువులను ఢీకొట్టి కింద పడిపోయాడు. గమనించిన బాటసారులు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించి కు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే గుండెపోటుతో మార్గమధ్యలోనే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. సంఘటనపై ఆదినారాయణ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. గుర్తుతెలియని రైలు ఢీకొని.. మాగనూర్ (మక్తల్): మండలంలోని చేగుంట రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొని కర్ణాటకలోని యాద్గీర్ పట్టణానికి చెందిన రమేష్(38) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వర్రావ్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగిన తల్లి
నాగర్‌కర్నూల్ రూరల్ : కలహాలు ఆ కుటుంబాన్ని కుంగదీశాయి. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగు మందు ఇచ్చి తానూ తాగింది. పరిస్థితి విషమించడంతో తల్లి, కూతురు మృతిచెందింది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల భూషయ్య, మహాదేవి(30) అలియాస్ మాధవి భార్యాభర్తలు.. వీరికి అచ్యుత, మౌనిక(4నెలలు) కూతుళ్లు ఉన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య మూడు నెలలుగా తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కూతుళ్లకు పురుగు మందు తాపి తాను తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్తుండగా తల్లి మహాదేవితో పాటు ఆమె కూతురు మౌనిక ఆరో గ్య పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే మృత్యువాతపడ్డారు. వీరిలో చిన్నారి అచ్యుత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగర్‌కర్నూల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.10 కోసం పంచాయితీ!
బిజినేపల్లి రూరల్ మహబూబ్ నగర్ : మాంసం తీసుకుని పది రూపాయలు తక్కువ ఇవ్వడంతో దుకాణ యజమానికి, ఓ మహిళకు మధ్య గొడవ చోటుచేసుకుంది. అది ప్రాణాల మీదికి తెచ్చింది. ఆ వివరాలు... బిజినేపల్లిలో ప్రతి గురువారం సంత జరుగుతుంది. వారం క్రితం సంతకు వట్టెం గ్రామానికి చెందిన లక్ష్మి వచ్చింది. ఓ మటన్ దుకాణం వద్ద మాంసం తీసుకుని రూ.10 తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఈ క్రమంలోనే షాపు యజమానికి, మహిళకు చిన్న గొడవ జరిగింది. దీంతో మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై ప్రదీప్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాతే షాపు యజమానిని పిలిపించాలి. అదేమీ లేకుండానే కటికె శ్రీనును పోలీస్‌స్టేషన్‌కు తీసుకు రమ్మని హోంగార్డులను పురమాయించాడు ఎస్సై. వచ్చిన తర్వాత తమదైన శైలిలో మందలించారు. బెల్ట్‌తో కొట్టడంతో మెడపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్లి రాత్రి బాగానే ఉన్నా మరుసటి రోజు ఉదయం కళ్లు తిరిగి శ్రీను కిందపడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల తర్వాత రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు చిన్న మెదడులో కొద్దిభాగం రక్తం గడ్డ కట్టుకుపోయిందని, సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ తరలించాలని బుధవారం చెప్పడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సర్జరీకి దాదాపు 15లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే సమయంలో బాధితుడు కోమాలోకి వెళ్లడంతో సర్జరీ చేసినా కోలుకోవడం కష్టమేనని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జిల్లా ఆరెకటిక సంఘం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారు స్థానిక ఎమ్మెల్యేను కలిసి ఘటనను వివరించారు. దీనిపై ప్రభుత్వపరంగా పూర్తి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నేనెవర్నీ కొట్టలేదు వట్టెం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ బిజినేపల్లిలో ఉన్న కటికె శ్రీనివాసులుతో ఘర్షణ పడింది. ఠాణాకు వచ్చి ఇదే విషయాన్ని చెప్పింది. ఫిర్యాదు ఇవ్వమంటే ఇవ్వలేదు. దాంతో అతన్ని పిలిపించి మందలించాను తప్ప చేయిచేసుకోలేదు. – ప్రదీప్‌కుమార్, ఎస్సై