
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్‌లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృతి చెందింది. చిన్నారి కారు దిగకముందే లాక్ చేయడంతో ఊపిరాడక మరణించింది. సోదరుడి వివాహం కోసం పూలమాలలు తేవడానికి అంజలయ్య, తన 6 ఏళ్ల కూతురుతో కలిసి జడ్చర్లకు వెళ్లివచ్చాడు. చిన్నారి కారు దిగకముందే కార్ లాక్‌చేసి వెళ్లిపోయాడు. అనంతరం వివాహ వేడుకల్లో పడి చిన్నారి కారులో ఉందనే విషయం మరిచిపోయారు కుటుంబసభ్యులు. అనంతరం కారు దగ్గరికి వచ్చి చూసేసరికి ఆరేళ్ల కేజియా అప్పటికే మృతి చెందింది. దీంతో అప్పటివరకు ఆహ్లాదంగా ఉన్న ఇంట్లో.. చిన్నారి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సంగారెడ్డిలో రోడ్డుప్రమాదం
వివాహానికి వెళ్తోన్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. వీళ్లందరిది మహారాష్ట్రలోని దెగళూరు గ్రామంగా గుర్తించారు. హైదరాబాద్‌లో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బైక్ -టిప్పర్ లారీ ఢీ
నిర్మల్‌లోని శివాజీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై ప్రయాణించిన ఇద్దరిది మామిడ మండలం పరిమాండ్ గ్రామం. మృతుడు రాజాగౌడ్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment