బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం | RTC Bus Accident At Wanaparthy | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం

Published Fri, Nov 9 2018 10:51 AM | Last Updated on Fri, Nov 9 2018 10:51 AM

RTC Bus Accident At Wanaparthy - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి తిరుపతయ్య  తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రీకొడుకులు

గోపాల్‌పేట (వనపర్తి): ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన నాగపూర్‌ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన చక్రి (13), బాలరాజు (20), వినయ్‌ లు గురువారం బావాయిపల్లి నుంచి గౌరిదేవి పల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అదే స మయంలో కొల్లాపూర్‌ డిపోకు చెందిన (ఏపీ 28 జెడ్‌ 4173) నంబర్‌గల ఆర్టీసీ బస్సు నాగర్‌కర్నూల్‌ నుంచి కొల్లాపూర్‌ వెళుతుండగా నాగపూర్‌ గ్రా మం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

దీంతో చక్రి అనే యువకుడికి తీ వ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలరాజును స్థానికులు నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా నాగపూర్‌ సమీపంలో ప్రాణాలు వది లాడు.వినయ్‌ తీవ్ర గాయాలతో కొల్లాపూ ర్‌ ప్ర భుత్వాస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. ఒ క్కగానొక కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రు లు తిరుపతయ్య, పార్వతమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. చక్రిమృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం రేవల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇన్నోవా ఢీకొని ఒకరి మృతి..  మరొకరికి గాయాలు
పెంట్లవెల్లి (కొల్లాపూర్‌): మండల కేంద్రంలోని న మాజ్‌ చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయప డ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. జటప్రోల్‌ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మిద్దేటి వెంకటేశ్వర్లు (52), మిద్దేటి శ్రీధర్‌ కొల్లాపూర్‌కు బ్యాండ్‌ వాయించడానికి వెళ్లారు. ప ని ముగించుకుని తిరిగి జటప్రోల్‌కు వస్తుండగా మార్గమధ్యలో కేవైఎఫ్‌ సంస్థకు చెందిన కారు ప్ర చారానికి వెళ్లి వస్తూ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకటేశ్వర్లు ప్రాణాలు వదిలాడు. శ్రీధర్‌ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని వైద్యుల ద్వారా తెలిసింది. ఈ సంఘటనపై డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement