తీవ్రంగా గాయపడిన పోచమ్మ
నవాబుపేట (జడ్చర్ల): ఉమ్మడి జిల్లాలో జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సంఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. నవాబ్‌పేట మండలం మైస మ్మ చెంత మొక్కులు తీర్చుకునేందుకు ట్రాక్టర్‌లో వచ్చిన భక్తులు తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అటవీప్రాంతంలో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ మలుపువద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లోకిరేవుకు చెందిన కావలి లక్ష్మమ్మ (50), గండీడ్ మండలం నసర్లబాద్‌కు చెందిన గంగపురం బాలయ్య (45) అక్కడిక క్కడే మృతి చెంద గా, లింగంపల్లికి చెందిన చెన్నçమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌లో ఉన్న మరో 15 మందికి సైతం గాయాలయ్యాయి. విషయం తె లుసుకున్న డీఎస్పీ భాస్కర్ సంఘటన స్థలానికి వె ళ్లారు.
గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో చెన్నమ్మ, మాసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, శాంతమ్మ, యాదమ్మ, లక్ష్మ మ్మ, జంగమ్మ, రాములమ్మ, రాములుతోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో పోచమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కిషన్, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కేసును పరిశీలించారు. డ్రైవర్ అతివేగంగా నడపటం వల్లే ప్రమాదానికి కారణమని తెలిపారు. ఇదిలా ఉండగా.. సరిగ్గా 18 ఏళ్ల కిందట కిందట కూడా ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతిచెందారు. ఇన్నేళ్ల కాలంలో ఏనాడూ ప్రమాదాలు చోటుచేసుకోలేదు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు.
లింగంపల్లిలో మరొకరు..
మక్తల్ : ఊట్కూర్ మండలం మల్లెపల్లికి చెం దిన మారెన్న (45) అనే వ్యక్తి సో మవారం మక్తల్‌లో జరిగిన కేటీఆర్ సభ కు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలో కల్వర్టు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ రూట్లో రాత్రి ఎవరూ రాకపోవడంతో గమనించలేదు. ఉదయం బాటసారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్ కేసు నమోదుచేసి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
రైలు ప్రమాదంలో మహిళ
మహబూబ్‌నగర్ క్రైం: పట్టాలుదాటుతున్న ఓ మహిళను రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. బోయపల్లికి చెందిన నర్సమ్మ (40) రోజులాగే మంగళవారం మధ్యాహ్నం కూలి పని చేయడానికి పట్టణంలోని లక్ష్మినగర్ కాలనీకి వచ్చింది. సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతుండగా గుంతకల్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. నర్సమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. కుమారుడు యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment