ముందస్తు మద్యం | Telangana Elections Alcohol Storage Is Not Good Mahabubnagar | Sakshi
Sakshi News home page

ముందస్తు మద్యం

Published Mon, Oct 1 2018 10:07 AM | Last Updated on Mon, Oct 1 2018 10:07 AM

Telangana Elections Alcohol Storage Is Not Good Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలవడంతో మద్యం విక్రయాలు పెరిగాయి. సెప్టెంబర్‌లోనే నాలుగు జిల్లాల్లో కలిపి రూ.60కోట్ల మద్యం కొనుగోలు చేసి స్టాక్‌ చేశారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాదారులు, బార్ల యజమానులు, రాజకీయ పార్టీల నాయకులు ముందస్తుగా డిపోల నుంచి రూ.కోట్ల విలువైన మద్యాన్ని ముందుగానే కొనుగోలుచేసి ఆయా నియోజకవర్గాల్లో నిల్వచేసినట్లు సమాచారం. 2017–19 నూతన ఎక్సైజ్‌ పాలసీ సోమవారం నాటికి ఏడాది పూర్తికానుంది. గతేడాది అక్టోబర్‌ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వరకు ఉమ్మడి జిల్లాలో రూ. 999కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. వచ్చే ఎన్నికల సీజన్‌ నేపథ్యంలో మరో రూ.2వేల కోట్ల అమ్మకాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి అధికాదాయం సమకూరింది.  

మద్యం స్టాక్‌ 
ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలో 66 మద్యం దుకాణాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 45 దు కా ణాలు, వనపర్తిలో 29దుకాణాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 24 దుకాణాలు ఉన్నాయి. అ యితే ఇప్పటికే ఒక్క నాగర్‌కర్నూల్‌ నియోజవర్గంలోనే దుకాణాల కోసం రూ.6కోట్ల మద్యం కొనుగోలు చేసి స్టాక్‌ చేసినట్లు తెలిసింది. దీంతో పాటు వనపర్తి నియోజకవర్గం కోసం రూ.4కోట్ల మద్యం డిపో నుంచి తీసుకువెళ్లినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా కోసం రూ.30కోట్ల మద్యం, జో గుళాంబ గద్వాల జిల్లా కోసం రూ.20కోట్ల మ ద్యంను ఆయా డిపోల నుంచి కొనుగోలు చేశారు. 15రోజుల క్రితం కొత్తకోట సమీపంలో నూతన మద్యం డిపో ప్రారంభించారు. ఇక్కడి నుంచి వనపర్తి, కొత్తకోట, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, ఆత్మకూర్, నారాయణపేట, పెబ్బే ర్‌లో ఉన్న మ ద్యం దుకాణాలకు మద్యం స రఫరా చేస్తారు. ఇదివరకు నాలుగు జిల్లాలకు కలిపి తిమ్మాజిపేట వద్ద ఉన్న మద్యం డిపో నుంచి స రఫ రా అయ్యేది. ప్ర స్తుతం నూతన డిపో ఏర్పాటు చే యడం ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాదా రులు ఇక్కడి నుంచే కొనుగోలు చేయనున్నారు.

పంట పడినట్టే  
ఈ దఫా మద్యం దుకాణాల లైసెన్స్‌ పొందిన వారికి అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. రెండేళ్ల కాలవ్యవధిలో మద్యం లైసెన్స్‌ ఫీజు ఏడాదికి రూ.45లక్షలు, రెండేళ్ల కాలపరిమితికి రూ.90లక్షలు చెల్లించాలి. అయితే ఈ కాలపరిమితిలో అనేక ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు కిటకిటలాడనున్నాయి. వచ్చే మే నెలలోపు పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. అంతకుముందు సర్పంచ్‌లు, స్థానిక సంస్థలకు ఎన్నిక జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ పొందినవారికి పంట పండినట్లేనని పలువురు  భావిస్తున్నారు.
 
ఎన్నికల వేళ.. ఆదాయం భళా! 
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం (ఎక్సైజ్‌ పాలసీ) విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆరు స్లాబులు ఉండగా తాజాగా రెండింటిని కుదించి పట్టణ ప్రాంతాల్లో దుకాణం ధర ఏడాదికి రూ.55లక్షలు, గ్రామీణప్రాంతాల్లో రూ.45లక్షలకు సర్దుబాటు చేసింది. అయితే గతంలో కంటే ఈ సారి మద్యం దుకాణాలకు పోటీదారులు గణనీయంగా పోటీపడి దుకాణాలను సొంతం చేసుకున్నారు. 2015 అక్టోబర్‌ నుంచి 2016సెప్టెంబర్‌ రూ.872.93కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, 2016 అక్టోబర్‌ నుంచి 2017 ఆగస్టు వరకు రూ.923.16కోట్ల వ్యాపారం జరిగింది. 2016తో పొలిస్తే 2017లో మరో రూ.91కోట్లకు పైగా విక్రయాలు పెరిగాయి. 2017తో పొలిస్తే 2018లో రూ.76కోట్ల అధికాదాయం వచ్చింది. గత రెండేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేకపోయినా విక్రయాలు భారీగానే సాగాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో వచ్చే ఏడాదిలో దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా అదనపు విక్రయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది.  

స్టాక్‌ చేస్తే చర్యలు తప్పవు 
ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల్లో గతనెలలో ఎంతస్థాయిలో మద్యం విక్రయించారో అదేస్థాయిలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అక్టోబర్‌లో 10వేల కేసులు  అమ్మకాలు చేస్తే నవంబర్‌లో సైతం 10వేల కేసులు ఇస్తాం. వచ్చే ఎన్నికల నేపథ్యంలో అన్ని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాం.  నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయాలు, స్టాక్‌ చేసినట్టు తేలితే కేసులు నమోదుచేసి మద్యం సీజ్‌చేస్తాం.  –జయసేనారెడ్డి, డీసీ ఉమ్మడి జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement