
జడ్చర్ల టౌన్: మరికొన్ని గంటల్లో పెళ్లి పీట లెక్కాల్సిన ఆ వరుడు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరుకున్నాడు. గురువారం ఉదయం జడ్చర్ల–మహబూబ్‌నగర్ 167వ నం బరు జాతీయ రహదారిపై ఈ విషాదకర సం ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్యశామ్యూల్ (34)కు వన పర్తి పట్టణానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ కల్వరీచర్చిలో వి వాహం కావాల్సి ఉంది. మధ్యాహ్నం అక్కడి సుదర్శన్ ఫంక్షన్‌హాల్‌లో విందుకు సైతం ఏ ర్పాట్లు చేశారు. అందులోనే వధువు తరఫు కు టుంబ సభ్యులు, బంధువులు విడిది చేశారు.
పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు మరణ వార్తతో ఇంటి వద్ద విషాదంలో బంధువులు
15 నిమిషాల్లో వస్తానని చెప్పి..
గురువారం ఉదయం అందరూ పెళ్లికి సిద్ధమవుతుండగా 15 నిమిషాల్లో వస్తానంటూ వరుడు కారులో జడ్చర్లకు బయలుదేరాడు. ఏడు గంటలకు నక్కలబండ తండా సమీపంలోకి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి కోసం తీసుకొచ్చిన దండలను..
పెళ్లి వేడుకల్లో ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు వరుడు చైతన్య మరణ వార్త తెలియ డంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెళ్లి కో సం తీసుకొచ్చిన పూల దండలను మృతదేహా నికి వేయాల్సి వస్తుందని అనుకోలేదని బంధు లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment