Bride groom died
-
AP: పెళ్లింట విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి.. ఏం జరిగింది?
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే దారుణం జరిగింది. శోభనం గదిలోనే వరుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. మదనపల్లెలో తులసీప్రసాద్, శిరీషకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో, సోమవారం వీరికి పెళ్లి జరిగింది. కాగా, పెళ్లి రోజులు రాత్రి వారికి ఇరు కుటుంబాల పెద్దలు శోభనం జరిపాలని నిర్ణయించారు. అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, గదిలోకి ముందుగానే వెళ్లిన తులసీప్రసాద్ బెడ్‌పై నిర్జీవంగా పడిపోయాడు. గదిలోకి వెళ్లిన నవ వధువు శిరీష్.. తులసీప్రసాద్ గదిలో పడిపోయి ఉండటంతో టెన్షన్‌కు గురైంది. ఈ విషయాన్ని అత్తామామలకు చెప్పింది. వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తులసీప్రసాద్‌కు పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు నిర్ధారించారు. నవ వరుడు పెళ్లి జరిగిన 24 గంటల్లోనే ఇలా మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకింది. నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, వరుడు తులసీప్రసాద్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. -
Nalgonda: కెనడాలో పరిచయం.. 15 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే..
నకిరేకల్: పెళ్లయిన 15రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతిచెందిన ఘటన మండలంలోని గోరెంకలపల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఆద పృథ్వీ(29)కి గత నెల 26న విజయవాడకు చెందిన భార్గవితో వివాహం జరిగింది. వీరిద్దరూ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం పృథ్వీ తన తండ్రి రాజేందర్‌తో కలిసి కారులో నకిరేకల్ మీదుగా హాలియాకు బయల్దేరాడు. ఈ క్రమంలో నకిరేకల్ మండలం గోరెంకలపల్లి శివారులోని మూలమలుపు వద్ద కరీంనగర్ డిపో–2కు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీ తీవ్రంగా గాయపడడంతో ఆస్పపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అతడి తండ్రి రాజేందర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసున్న క్రమంలోనే భార్గవితో పరిచయం కావడంతో ఇరువురు ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. మరో వారం రోజుల్లో కెనడాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పెళ్లయిన 15రోజులకే పృథ్వీ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని ఎస్ఐ వివరించారు. ఇది కూడా చదవండి: రెండు నెలల క్రితమే పెళ్లి.. కోడలు రాకతోనే ప్రమాదం జరిగిందని -
మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే..
జడ్చర్ల టౌన్: మరికొన్ని గంటల్లో పెళ్లి పీట లెక్కాల్సిన ఆ వరుడు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరుకున్నాడు. గురువారం ఉదయం జడ్చర్ల–మహబూబ్‌నగర్ 167వ నం బరు జాతీయ రహదారిపై ఈ విషాదకర సం ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్యశామ్యూల్ (34)కు వన పర్తి పట్టణానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ కల్వరీచర్చిలో వి వాహం కావాల్సి ఉంది. మధ్యాహ్నం అక్కడి సుదర్శన్ ఫంక్షన్హాల్లో విందుకు సైతం ఏ ర్పాట్లు చేశారు. అందులోనే వధువు తరఫు కు టుంబ సభ్యులు, బంధువులు విడిది చేశారు. పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు మరణ వార్తతో ఇంటి వద్ద విషాదంలో బంధువులు 15 నిమిషాల్లో వస్తానని చెప్పి.. గురువారం ఉదయం అందరూ పెళ్లికి సిద్ధమవుతుండగా 15 నిమిషాల్లో వస్తానంటూ వరుడు కారులో జడ్చర్లకు బయలుదేరాడు. ఏడు గంటలకు నక్కలబండ తండా సమీపంలోకి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కోసం తీసుకొచ్చిన దండలను.. పెళ్లి వేడుకల్లో ఆనందంగా ఉన్న కుటుంబ సభ్యులు వరుడు చైతన్య మరణ వార్త తెలియ డంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెళ్లి కో సం తీసుకొచ్చిన పూల దండలను మృతదేహా నికి వేయాల్సి వస్తుందని అనుకోలేదని బంధు లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పెళ్లి సరదా తీరకుండానే..
కొత్తూరు : వివాహం జరిగిన 40 రోజులకే ఆ నవ వరుడును మృత్యువు కబళించింది. పెళ్లి సరదా తీరకుండానే నూరేళ్లు నింపేసింది. నవ వధువును వితంతువుగా మార్చేసింది. ఎన్నో ఆశలతో మెట్టినింటిలో కొత్త జీవితం ప్రారంభించిన ఆమెకు కాళ్ల పారాణి ఆరకముందే విషాదం మిగిల్చింది. ట్రాక్టర్ ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మండలంలోని మదనాపురం పంచాయతీ పరిధి వెంకటాపురం కాలనీకి చెందిన సన్నిబోయిన సాయిరాం(26) తన సొంత ట్రాక్టర్‌తో గురువారం మట్టి పెరుగుతున్నాడు. అయితే మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ కలిగాం వద్ద ఎత్తు మీదకు వస్తున్న తరుణంలో ఇంజిన్‌మీదకు లేచింది. ఈ తరుణంలో తొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సాయిరాంకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందాడు. దీంతో సాయిరాం కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు సాయిరాంకు అదే కాలనీకి చెందిన నర్సమ్మతో గత నెల 18వ తేదీన వివాహం జరిగింది. ఇంకా పెళ్లి సరదా తీరక ముందే ట్రాక్టర్ రూపంలో సాయిరాంకు మృత్యువు కబళించింది. సాయిరాం మృతి చెందిన వార్త విన్నవెంటనే భార్య నర్సమ్మ, తల్లిదండ్రులు భాస్కరరావు, చెల్లమ్మ రోదనలు మిన్నంటాయి. వివాహం జరిగి 40 రోజులకే ఈ దారుణ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాళ్ల పారాణి ఆరక ముందే భర్తను పోగొట్టుకున్న నర్సమ్మను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయిరాం అందరితో మంచిగా ఉన్నందున ఈయన మృతిని కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సంఘటనపై రిమ్స్ వైద్యులు చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
-
గత రాత్రి ఒక్కటైనా జంట.. వరుడు మృతి
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. వివరాలివి.. తణుకులో గతరాత్రి(గురువారం) బంధువుల సమక్షంలో వారికి పెళ్లి పెరిగింది. ఎంతో సంతోషంతో అందరూ తిరిగి ప్రయాణమయ్యారు. వధువు, వరుడు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా, వధువుకు గాయలయ్యాయి. మృతులు వరంగల్ జిల్లా వర్ధన్నపేట వాసులుగా గుర్తించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారు కొమ్మటూరు శరత్, శ్రీదేవి దంపతులు, పద్మ, పెండ్లి కొడుకు రామకృష్ణ ప్రసాద్, వడ్లకొండ, డ్రైవర్ వేణుగా గుర్తించారు. -
పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ పేలి వరుడి దుర్మరణం
-
పేలిన పెళ్లి కానుక.. వరుడి దుర్మరణం
భువనేశ్వర్ : అంగరంగ వైభవంగా పెళ్లి, రిసెప్షన్లు జరిగాయి. ఆ ఆనందంలో ఇంటికి చేరిన జంట తమకు వచ్చిన కానుకలను తెరిచి చూసింది. అందులో ఒక కవర్ పేలి పెళ్లి కొడుకు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. దీంతో ఆ ఇంట పెనువిషాదం నెలకొంది. బోలన్‌గిర్ జిల్లాలోని పట్నాఘడ్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే సౌమ్య శేఖర్ సాహూకి రీమా అనే యువతితో ఈ నెల 18వ తేదీన వివాహం జరగ్గా.. 21వ తేదీ రిసెప్షన్ నిర్వహించారు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక శేఖర్ దంపతులు శుక్రవారం ఇంటికి చేరుకున్నారు. తమకు వచ్చిన కానుకల్లో ఒకదానిని తెరవగా అది పేలిపోయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో శేఖర్, అతని నానమ్మ జీమా అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రీమాను బుర్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించటంతో ఆమెను రూర్కెలా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గిఫ్ట్‌లో బాంబు మూలంగానే ఈ పేలుడు సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. రిసెప్షన్లో రికార్డయిన వీడియో దృశ్యాల గిఫ్ట్ ఎవరు ఇచ్చారన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పట్నాఘడ్ పోలీస్ స్టేషన్ అధికారి సెసదేవ భారియా వెల్లడించారు. ఇది కూడా చదవండి.. ఆ తల్లీకూతుళ్లు చాలా అదృష్టవంతులు! సౌమ్య శేఖర్ మృతదేహాం -
అనైతిక బంధం ..వరుడిపై పెట్రోల్ దాడి