
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే దారుణం జరిగింది. శోభనం గదిలోనే వరుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. మదనపల్లెలో తులసీప్రసాద్, శిరీషకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో, సోమవారం వీరికి పెళ్లి జరిగింది. కాగా, పెళ్లి రోజులు రాత్రి వారికి ఇరు కుటుంబాల పెద్దలు శోభనం జరిపాలని నిర్ణయించారు. అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా, గదిలోకి ముందుగానే వెళ్లిన తులసీప్రసాద్ బెడ్‌పై నిర్జీవంగా పడిపోయాడు. గదిలోకి వెళ్లిన నవ వధువు శిరీష్.. తులసీప్రసాద్ గదిలో పడిపోయి ఉండటంతో టెన్షన్‌కు గురైంది. ఈ విషయాన్ని అత్తామామలకు చెప్పింది. వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తులసీప్రసాద్‌కు పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు నిర్ధారించారు.
నవ వరుడు పెళ్లి జరిగిన 24 గంటల్లోనే ఇలా మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకింది. నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, వరుడు తులసీప్రసాద్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment