first night
-
కట్నం ఇవ్వలేదని శోభనం అడ్డుకున్న కుటుంబ సభ్యులు
కర్ణాటక: కట్నం ఇవ్వలేదని శోభనం జరగకుండా అడ్డుకున్న ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులపై వివాహిత బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు...బాధిత మహిళకు 2022 జూన్ 6న అవినాశ్ శర్మతో వివాహం జరిగింది. వివాహ సమయంలో వరుడు కుటుంబ సభ్యులు కట్నం వద్దన్నారు. వివాహమై భర్త ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు వరుడి తండ్రి మీ కుటుంబ సభ్యులు తనకు రూ.15 లక్షలు ఇస్తామని తెలిపారని, ఆ డబ్బు ఇవ్వకపోతే మొదటిరాత్రి శోభనానికి అనుమతించేదిలేదని కోడలిని బెదిరించాడు. ఈ విషయం కోడలు తల్లిదండ్రులకు తెలపడంతో డబ్బు ఇవ్వడానికి తల్లిదండ్రులు కొద్దిరోజులు సమయం ఇవ్వాలని కోరారు. 2022 జూన్ 22 తేదీన బాధిత మహిళ తల్లిదండ్రులు రూ.5.8 లక్షలు నగదు ఇచ్చారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. స్నానం చేస్తుండగా గమనించేవారు ఇంతటితో మిన్నకుండిన భర్త కుటుంబ సభ్యులు మిగిలిన రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఇంట్లో ఉండనిచ్చేదిలేదని కోడల్ని బెదిరించారు. స్నానం చేస్తుండగా భర్త తండ్రి చాటుగా గమనించేవాడు. దీనిపై కోడలు మామను ప్రశ్నించగా ఎవరికై నా చెబితే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామని బెదిరించారని మహిళా ఫిర్యాదులో ఆరోపించింది. బాధిత మహిళ మళ్లీ పుట్టింటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంది. తల్లిదండ్రులు అల్లుడి ఇంటి వద్దకు విచారించగా మేము చెప్పినట్లు వినాలని లేకపోతే ఇప్పుడే రూ.15 లక్షల డబ్బు ఇవ్వాలని తెలిపారు. అనంతరం మహిళ కుటుంబసభ్యులు అక్కడ నుంచి తమ ఇంటికి వెళ్లిపోయారు. నాకు సంబంధించిన పత్రాలు అత్తగారింట్లో ఉన్నాయని వీటి గురించి అడిగితే డబ్బు ఇచ్చి మీ పత్రాలు తీసుకెళ్లాలని తెలిపారని ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. -
AP: పెళ్లింట విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి.. ఏం జరిగింది?
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే దారుణం జరిగింది. శోభనం గదిలోనే వరుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. మదనపల్లెలో తులసీప్రసాద్, శిరీషకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో, సోమవారం వీరికి పెళ్లి జరిగింది. కాగా, పెళ్లి రోజులు రాత్రి వారికి ఇరు కుటుంబాల పెద్దలు శోభనం జరిపాలని నిర్ణయించారు. అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, గదిలోకి ముందుగానే వెళ్లిన తులసీప్రసాద్ బెడ్‌పై నిర్జీవంగా పడిపోయాడు. గదిలోకి వెళ్లిన నవ వధువు శిరీష్.. తులసీప్రసాద్ గదిలో పడిపోయి ఉండటంతో టెన్షన్‌కు గురైంది. ఈ విషయాన్ని అత్తామామలకు చెప్పింది. వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తులసీప్రసాద్‌కు పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు నిర్ధారించారు. నవ వరుడు పెళ్లి జరిగిన 24 గంటల్లోనే ఇలా మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకింది. నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, వరుడు తులసీప్రసాద్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. -
తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్‌తో భర్తను కొట్టి..
లక్నో: ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభిద్దామనుకున్న వరుడికి తొలిరాత్రే షాకిచ్చింది ఓ నూతన వధువు. గదిలోకి వెళ్లగానే ఐరన్ రాడుతో భర్త తల మీద మోది డబ్బు, నగలతో ఉడాయించింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని హరిద్వార్‌కు చెందిన యువతికి బింజోర్‌లోని కుండా ఖుర్ద్‌కు చెందిన యువకుడికి మార్చి 15న గుడిలో వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వరుడు తనతో ఏడడుగులు నడిచిన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. తనతో కలిసి కొత్త మజిలీ ప్రారంభించబోతున్నందుకు సంతోషంలో తేలియాడాడు. కానీ అతడి ఆనందం ఎంతో సేపు ఉండలేదు. అతడి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఫస్ట్‌నైట్ రోజే అసలు స్వరూపం బయటపెట్టింది నూతన వధువు. గదిలోకి వెళ్లగానే కట్టుకున్న భర్త మీద ఐరన్ రాడితో దాడి చేసింది. దీంతో అతడు పెద్దగా కేకలు వేయగా.. బంధువులు గదిలోకి వచ్చేసరికి ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘటన గురించి అతడు మాట్లాడుతూ.. "అసలేం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. నా భార్య ఆ రోజు సడన్‌గా నా మీద దాడి చేసింది. దీంతో నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆమె బంగారు నగలతో పాటు రూ.20 వేలు తీసుకుని పారిపోయిందని తర్వాత తెలిసింది" అని చెప్పుకొచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కోసం గాలిస్తున్నారు. అలాగే ఈ పెళ్లి కుదిర్చిన పెళ్లిళ్ల పేరయ్య కోసం వెతుకుతున్నారు. చదవండి: స్వేచ్ఛ కోసం ఇల్లు వదిలింది.. మృగాడికి బలయ్యింది -
ఫొటో వైరల్: శోభనం గదిలో భార్యను వదిలి..
మానవుడి జీవితంలో మధురానుభూతి పంచేది తొలిరాత్రి. దీనికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి రోజు రానే వస్తే ఎంతో సంతోషించి పడక గదిలోకి వెళ్తారు. అలా వెళ్లిన ఓ పెళ్లి కొడుకు భార్యను పట్టించుకోకుండా కంప్యూటర్లో పని చేసుకుంటూ కూర్చున్నాడు. వధువేమో అతడినే చూస్తూ బెడ్‌పై కూర్చుని ఉంది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. కొత్తగా పెళ్లయిన దంపతులు పెళ్లి బట్టలతోనే అందంగా అలంకరించిన శోభనం గదిలోకి వెళ్లారు. అయితే భార్య బెడ్‌పై కూర్చుని ఉండగా భర్త కంప్యూటర్ ముందు వాలిపోయాడు. ఫొటో చూస్తుంటే ఎంతకీ అతడు రాలేదనే నిర్వేదంతో చూస్తూ కూర్చుండిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఫొటోలపై కామెంట్స్, షేర్లు ట్రెండవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఫొటోను చూసినవారంతా ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం’ అని ఒకరు, ‘ఉండమ్మ హిస్టరీ డిలీట్ చేయని’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వధూవరులు ఎక్కడివారో తెలియదు కానీ దానికి సంబంధించిన ఫొటో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆన్లైన్ క్లాస్‌ల ప్రభావం.. అందుకే టీచర్ శోభనం రోజు కూడా కంప్యూటర్లో బోధన చేస్తున్నాడని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మా సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతోందని మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తమ బాధను వెళ్లబోసుకున్నాడు. "hold on babe, let me finish my shift" #WFH pic.twitter.com/6Z6gO5kIvI — Diaper Don (@NamasteTrumpi) February 10, 2021 -
మొదటి రాత్రే భార్యకు వేధింపులు..
కర్ణాటక, బనశంకరి : తల్లిదండ్రుల బలవంతం మీద వివాహం చేసుకున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ ఓ అనుమానపు భర్త పెళ్లయిన మొదటి రోజే భార్యను వేధించిన ఘటన బసవనగుడి పోలీస్‌స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... ఆరునెలల క్రితం నగరానికి చెందిన యువతితో వివేక్ రాజగోపాల్‌కు వివాహమైంది. వివేక్ రాజగోపాల్ వివాహమైన మొదటి రాత్రిలోనే భార్య ప్రవర్తన పట్ల అనుమానం మొదలైంది. అంతేగాక మా తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక నిన్ను వివాహం చేసుకున్నానని, తనను వదిలి పెట్టి వెళ్లి పోవాలని భార్యతో తెలిపాడు. వివేక్ భార్యను ఉద్యోగానికి పంపించి తనకు వచ్చిన జీతం డబ్బు ఇవ్వాలని వేధించడంతో పాటు తనతో అసభ్యంగా మాట్లాడే ఆడియో, బెడ్రూమ్ వీడియోతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు తెలిపింది. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఆడియో, వీడియో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. తన భర్తకు ఉన్న డబ్బు వ్యామోహానికి తీవ్రమనస్థాపం చెందిన గృహిణి పుట్టింటికి వెళ్లిన అనంతరం ఘటన పట్ల బనవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనుమాన పిశాచి : పెళ్లైన మొదటిరాత్రే తన భర్త తనపై అనుమానంతో తన మొబైల్‌ఫోన్‌లోని కాల్స్, మెసేజ్‌లను పరిశీలించాడని, ఆ తరువాత ప్రతి రోజు అనుమానించడం మొదలుపెట్టినట్లు బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. తన భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చినట్లు తెలిపింది. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
నా ఫస్ట్ నైట్...వాళ్లకు అంకితం!
కొత్త ఇల్లు.. కొత్త కాపురం.. పెళ్లికి ముందే ప్రముఖ హిందీ దర్శకుడు మహేశ్ భట్ ముద్దుల కూతురు ఆలియా భట్ వేసిన ప్లాన్ అదుర్స్ అంటున్నారు ముంబై జనాలు. సిస్టర్ షహీన్‌తో కలసి తల్లిదండ్రులకు కాస్త దూరంగా ఆలియా వేరే ఇంట్లోకి మకాం మార్చనున్నారనే మాట ఎప్పట్నుంచో వింటున్నాం. ఇప్పుడా మాట నిజం కాబోతోంది. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న కొత్త ఇంట్లోకి త్వరలోనే అక్కాచెల్లెళ్ల్లు ఆలియా, షహీన్‌లు అడుగు పెట్టనున్నారు. గృహ ప్రవేశం రోజున, ఆ రాత్రి ఏం చేయాలో.. ఇప్పుడే ప్లాన్ చేసేశారు. ‘‘ద ఫస్ట్ నైట్ ఇన్ ద న్యూ హౌస్ విల్ బి డెడికేటెడ్ టు మై పేరెంట్స్’’ అని ఆలియా భట్ స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో తొలి రాత్రిని తల్లిదండ్రులకు అంకితం ఇచ్చేస్తారట. గృహ ప్రవేశం రోజు రాత్రి అమ్మానాన్నలతో పాటు కుటుంబ సభ్యులందర్నీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇస్తానని చెబుతున్నారు. ‘‘నా జీవితంలో ఆ ఫస్ట్ నైట్ (అదేనండీ.. కొత్తగా కట్టుకున్న ఇంట్లో తొలిరాత్రి) చాలా ముఖ్యమైన వేడుక. అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటాననే అనుకుంటున్నా’’ అన్నారు ఆలియా. ఇరవై మూడేళ్లకు నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు సొంతంగా ఇల్లు కొనుక్కున్న ఆలియాను ముంబై జనాలు అభినందిస్తున్నారు. -
శునకాలకు శోభనంరాత్రి
శునకాలకు శోభనం రాత్రి, ఇదేదో వింతగా అనిపించిందా? వాటికి పెళ్లి, డ్యూయెట్లు అంటే ఇంకా ఆశ్చర్యపోతారేమో! ఇవన్నీ నాయ్‌కుట్టిగళ్ చిత్రంలో వినోదం అందించడానికి రెడీ అవుతున్నాయి. టోనీ అనే మగ శునకం, జీనో అనే ఆడ శునకం హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం నాయ్‌కుట్టిగళ్. ఇందులో ప్రేమికులుగా నితిన్‌సత్య, శ్రుతిరామకృష్ణన్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఎంఎస్.భాస్కర్,ఢిల్లిగణేశ్, మహానది శంకర్, పొన్నంబళం, వాసువిక్రమ్, వైయాపురి, జయమణి, బోండామణి, కింగ్‌కాంగ్,సిజర్‌మనోహర్, అళగు,బామన్ బాలాజీ, రవిరాజ్ తదితరులు నటిస్తున్నారు. పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన ఏ.వెట్ట్రివేల్ తన వెట్ట్రివేల్ 567 మెగా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నాయ్‌కుట్టిగళ్. దీనికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని రంగా నిర్వహిస్తున్నారు. దర్శకులు ఎస్డీ.రమేశ్సెల్వన్, చిత్తిరెసైల్వన్, ఎల్జీ.రవిచంద్రన్‌ల వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేసిన ఈయన నాయ్‌కుట్టిగళ్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం గురించి రంగా తెలుపుతూ...ప్రేక్షకులు ఒకే తరహా చిత్రాలను ఇష్టపడటం లేదన్నారు. కొత్తదనాన్ని ఆశిస్తున్నారనీ అలాంటి ఆలోచనలో నుంచి పుట్టిందే నాయ్‌కుట్టిగళ్ కథ అన్నారు. నితిన్‌సత్య టోనీ అనే కక్కును, శ్రుతిరామక్రిష్ణన్ జీనో అనే కుక్కను పెంచుకుంటారు. వాటిలో టోనీ అనూహ్యంగా తప్పిపోతుంది. దీని కోసం నితిన్‌సత్య గాలిస్తుంటే, మరో పక్క నలుగురు దొంగలు, ఇద్దరు రాజకీయనాయకులు వెతుకుతుంటారు. వీరికి ఆ శునకంతో పనేమిటన్న పలు ఆసక్తికర అంశాల సమూహారమే చిత్ర కథ అన్నారు. ఇందులో నటించే శునకాల కోసం బక్(చెప్పినట్టు చేసే) శునకాలను చాలా ఖరీదు చేసి కొనుగోలు చేశామన్నారు. శునకాల ట్రైనర్ లారెన్స్ ఈ శునకాలకు ఏడాది పాటు శిక్షణనిచ్చారని తెలిపారు. ఇందులో శునకాలకు పెళ్లి చేసి పాటలో శోభనం రాత్రి సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయని తెలిపారు. చిత్రం ఆద్యంతం వినోదమే ప్రధానంగా సాగుతుందని దర్శకుడు చెప్పారు. -
సంధ్యాసమయం
క్లాసిక్ కథ మాకు వివాహమైన ఆ మరుసటి రోజునుంచే, నేను ఆమె కలిసి ఒకసారి బొంబాయి వెళ్లి రావాలని నా భార్య చెప్పసాగింది. అక్కడే ఆమె మాతామహుడు, మాతామహి ఉన్నారు. పెద్దతనం మూలాన వాళ్లు బెంగుళూరులో జరిగిన మా వివాహానికి రాలేకపోయారు. అందువల్ల మేమైనా తప్పకుండా వాళ్లని చూసి, వాళ్ల ఆశీస్సులు పొంది రావాలని మా శ్రీమతి అభిలాష. నాకూ అభిలాషగానే వుంది. డెబ్భై అయిదేళ్లు దాటిన వారంటే నాకెప్పుడూ అభిమానమూ ఆకర్షణా ఉండేవి. ప్రత్యక్ష పోటాపోటీలు వాదోప వాదాలంటే నాకు భయం. అందువల్ల వాటికి ఒదిగి సంచరించే నా స్వభావం ఒక కారణం కావచ్చు. సమవయస్సు వారితోనే - అంతెందుకు సొంత సోదర సోదరీమణులతో కూడా - పోటీలు, ఈర్ష్యలు, అభిప్రాయ భేదాలు కలుగుతూవుండడం వల్ల సుహృద్భావపూరితమైన సంబంధానికి విఘాతం ఏర్పడుతున్నది. కాని నా కంటె ముప్పయి అయిదు, నలభైయేళ్ల పెద్దవాళ్లతో నాకెలాంటి స్పర్ధ లేదు. విరోధమూ లేదు. తమ కాలపు ధోరణులకూ విలువలకూ సాధకంగానూ, వర్తమానకాలపు ధోరణులకు బాధకంగాను వీళ్లు మాట్లాడుతుంటే, నా తరానికి చెందిన విజయ సాధకుల తలమీద మొట్టికాయలు మొట్టినట్లుగా కనిపిస్తుంది నాకు. అది నాకెంతో సంతోషం కలిగిస్తుంది. కాని మా బొంబాయి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి గత సంవత్సరానికి మా వివాహమై దగ్గర దగ్గర అయిదేళ్లు కావస్తుంటే - మేము బొంబాయి వెళ్లాము. ఆ వృద్ధులు సహజంగానే మరీ వృద్ధులయ్యారు. మేము బొంబాయి వెళ్లేటప్పటికి తాతగారికేమో తొంభై తొమ్మిదేళ్లు; అవ్వగారికేమో దాదాపు డెబ్భై నాలుగేళ్లు. వి.టి., మరీన్డ్రైవ్, మలబార్ హిల్స్ ప్రాంతాలతో పోల్చి చూస్తే, డొంబివిలీ-అంటే ఆ వృద్ధులు నివసించే ప్రాంతం - ఎనభై ఒకటిలోనూ గ్రామంగానే కనిపించింది. ఆ వృద్ధులకు మా శ్రీమతి తల్లితో కలుపుకుని నలుగురు కుమార్తెలు; ఒకే పిల్లవాడు. ఈ పిల్లవాడు సకుటుంబంగా మలబార్ హిల్స్‌లో ఒక ఆధునిక ఫ్లాట్‌లో కాపురముంటున్నాడు. తల్లిదండ్రుల్ని తనతోపాటే ఉండమని ఆయన పిలుస్తున్నాడట. కాని తాతగారు డొంబివిలీ విడిచిపెట్టడానికి అంగీకరించడం లేదట. ఈ అయిదేళ్లలో నా భార్య ఆ వృద్ధుల్ని గురించి వివరంగానే చెప్పింది. వాళ్ల తాతయ్య ఆ కాలపు నిక్కచ్చి మనిషి అట; ఆయన్ని చూసి అందరూ గజగజ వణికిపోయేవారట, ఆఫీసులోనూ ఇంట్లోనూ కూడా. రైల్వేలో స్టోర్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాడు. నిర్వహణ యంత్రాంగాన్ని రాజకీయవాదులు దిష్టిబొమ్మగా తయారుచేసిన యీ రోజుల్లో జెనరల్ మేనేజర్లకు కూడా గౌరవం కాని మర్యాద కాని లేదు. కాని ఆ రోజుల్లో, అంటే ఇంగ్లీషువాడి రోజుల్లో అన్నమాట, మామూలు సూపరింటెండ్లకు కూడా ఆత్మాభిమానమూ హోదా ఉండేవట. (అని వాళ్ల తాతయ్య చెప్పినట్లుగా నా భార్య చెప్పింది). సమర్ధుడైతే దొరలతో సరిసమానంగా సంచరించే అవకాశం ఉండేదట. ఇలాంటి అవకాశాలు పొందినవాడట ఆ తాతగారు. అందువల్ల డిపార్టుమెంటే తనకు నమస్కారం చేసేలా ఆయనవల్ల వీలయిందట. ఆయన యింటి పనులన్నీ కూడా వుద్యోగులే సలాం పెడుతూ వచ్చి చేసి వెళ్లేవారట. ఇంక చెప్పాలా? ఇంట్లోనూ ఆయన ఒక నియంత... ఆమె అవ్వగారు కూడా మన పరంపరాగతమైన ప్రత్యేకతల్ని యింకా సరిగా తెలుసుకోలేని స్త్రీత్వపు ఉత్తమ ప్రతినిధి. సూటిగా వెళ్లే రకం. సూక్ష్మబుద్ధి, వివేకం కలది. వాటికి తోడుగా సహనం కలది. గృహకృత్యాలు, బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తూ వచ్చింది ఆవిడే. ఈ విషయంలో తాతగారు పెద్ద జీరో. ఉన్నట్టుండి కోపం తెచ్చుకోవడం, మండిపడడం, ఇంట్లో సామాన్లు ఎడాపెడా విసిరివెయ్యడం ఆయనకి మామూలు. తమ నలుగురు కుమార్తెలకు (మా అత్తగారితో సహా) వివాహాలు జరిగింది ఆవిడ వల్లనే; ఆమె చాలామంది స్నేహితురాండ్ర వల్లనే. తాతగారికి అందుకు కావలసిన సామర్ధ్యమో సాహసమో లేదు. (నా భార్య స్త్రీ కావడం వల్ల, తన అవ్వగారిని గురించి కొంచెం ఎక్కువగానే పొగడింది. కేవలం శాంపిల్ మాత్రమే తెలియజేశాను.) కాగా ఆ జూన్ మిట్టమధ్యాహ్నమప్పుడు డొంబివిలీలోని నా భార్య తాతగారి యింటిని సమీపిస్తుంటే నాలో ఒకటే తహతహ. చారిత్రక వ్యక్తుల్ని కలుసుకునే ఒక ఆదుర్దా. అవ్వగారే తలుపు తెరిచారు. క్షణంలో మమ్మల్ని గుర్తుపట్టి ఆహ్వానించారు. ఆ ఆహ్వానంలో ఒక సంకోచం కనిపించింది. దానికి కారణం నేనే అనుకుని బాధపడ్డాను. అవ్వగారికీ మనుమరాలికీ మద్య నేనొకణ్ని అవతరించాను! ఆవిడ ముఖంలో ‘లక్ష్మీకరమైన’ (శుభప్రదమైన) అంటారు చూడండి, అలాంటి కళ. ఊరికే వింత చూసేవారిని స్పందింపజేయని కళ... నేనే కనక మగవాణ్ని కాకపోతే, యింకా కొంచెంసేపు ఆ ముఖాన్ని చూస్తూ వుండవచ్చు; ఆ శోభలో లీనమైపోయి వుండవచ్చు. ఆవిడ మా మూడేళ్ల అమ్మాయిని తనవద్దకు రమ్మని పిలవగా, యిదియేమో బెదురుతూ నన్నే చూడగా, బిస్కెట్లు వెతకడానికి ఆవిడ లోనికి వెళ్లింది. ఆ పాతకాలపు పెంకుటింటిని నేను పైకీ కిందకీ చూశాను. ఆ నాలుగు గోడల మధ్య జరిగిన జీవిత నాటకాన్ని కల్పన చేసుకుంటూ కూర్చున్నాను. నా భార్య, ఆమె తల్లి - యిద్దరూ యీ యింట్లోనే పుట్టారు... ఉన్నట్టుండి నా భార్య ఒక పాత్రతో వచ్చింది. ‘‘డయరీ నుంచి పాలు తీసుకురావడానికి అమ్మమ్మ బయలుదేరింది. నాకు చోటు తెలుసుగదా. నేనే వెళ్లి వస్తానన్నాను. ఇప్పుడే వస్తాను’’ అంటూ నా భార్య వెలుపలికి వెళ్లింది. ఆమెతో పాటు మా అమ్మాయి కూడా బయటికి పరుగెత్తింది. నేనూ ఆవిడా మాత్రమే మిగిలాము. ఆవిడతో మాట్లాడడానికి నాకేవేవో విషయాలున్నట్లుగా అనిపించింది. అయితే దేన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆవిడ కూడా నాతో ఏదో మాట్లాడదలచినట్లు... ‘‘ఈ ఇంజనీర్లంతా వచ్చారు యివాళ...’’ అంది ఆవిడ హఠాత్తుగా. నాకేమీ అర్థం కాలేదు. ‘‘ఇక్కడ లోపల సిగ్నలింగ్ సిస్టం, ట్రాక్ ఎత్తులు వాలు ప్రదేశాలు అవన్నీ సరి చూసి, కొత్త సాధనాలు సిఫారసు చెయ్యడానికి ఫారిన్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు...’’ ‘‘ఓ!’’ అన్నాను. అవ్వగారు ఇంగ్లీషు మాటలు బోలెడు అనాయాసంగా వాడడం నాకు ఆశ్చర్యం వేసింది. ‘‘జపాన్‌లో అంతా వేగంగా రైళ్లు వెడుతున్నాయి గదా! అందుకు తగినట్టుగా ట్రాక్, సిగ్నలింగ్ అంతా మాడర్నైస్ చేసి వుంచారు... ఇక్కడ మాదిరిగానా?’’ ఈ విధంగానే ఆవిడ మాట్లాడసాగింది. నాకదంతా సరిగా జ్ఞాపకం లేదు. ఆశ్చర్యంలో మునిగిపోయి నోరు మూసుకుని కూర్చున్నాను. అప్పుడే నా భార్య తిరిగి వచ్చింది. ఆమె రావడంతో ఆవిడ మాట్లాడడం ఆపివేసింది. మేమందరం కాఫీ తాగుతున్నప్పుడు తాతగారు వచ్చారు. పోస్టాఫీసులో ఆలస్యమైపోయిందని క్షమాపణ చెప్పుకున్నారు. ఇంగ్లాండులో ఉన్న తన సహాధ్యాయుడికి ఉత్తరం వ్రాసి వచ్చారట. ‘‘నీకూ కాఫీ కలపనా తాతయ్యా’’ అని అడిగింది నా భార్య. ‘‘నాకు టీయే.’’ ‘‘సరే’’ అంటూ ఆమె లేచింది. కాని, ‘‘నువ్వు కూర్చో, నువ్వు కూర్చో’’ అని ఆయన ఆమెను కూర్చోబెట్టాడు. ‘‘ఇప్పుడు నేనిటువంటి పనుల్లో ఎక్స్పర్ట్నయ్యా. నీకు తెలుసా?’’ అన్నాడు. వంటింటికి వెళ్లి, తానే టీ తయారు చేసుకోసాగాడు. నేనూ లేచి అక్కడికి వెళ్లాను. వెంటనే ఆయన వంటింట్లో టైము మిగిల్చే నిమిత్తం తాను చేసిన కొత్త ఏర్పాట్ల గురించి సంతోషంగా వివరించాడు- తోమి బోర్లించిన పాత్రల నుంచి త్వరగా నీళ్లు కారేందుకు గాను ఏటవాలుగా ఉండే ఒక కొయ్య పలక, పొయ్యిమీద ఎక్కువ కాంతిపడేందుకు ఒక కొత్త లైట్ పాయింట్... ఇదంతా నాకు కొత్తగా కనిపించలేదు. ఈయనేనా నా భార్య వర్ణించిన నియంత అని ఆశ్చర్యపడ్డాను... ఆ రాత్రి మేము బస చేసిన యింటికి (ఇది నా భార్య పిన్నిగారిల్లు, తాతగారి మరొక కుమార్తె) తిరుగు ముఖం పట్టిన తర్వాత, డొంబివిలీ తాతయ్య అమ్మమ్మలు గురించి చాలా విషయాలు తెలియవచ్చాయి. అమ్మమ్మకు చిత్తభ్రమ మొదలయిందట; ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నదట; పాత విషయాలు ఏకరువు పెడుతున్నదట. మునుపు తాతగారో - మరెవరో ఆవిడతో మాట్లాడిన మాటలో లేకపోతే వినిపించేలా మాట్లాడిన మాటలో... ఓ! అలా అయితే ఆవిడ నాతో ఆ రోజు మధ్యాహ్నం మాట్లాడిన మాటలన్నీ... నాకు అదోలా అయిపోయింది. ఆవిడ చదువుకున్నదీ కాదు. అయినా కూడా ఎప్పుడో విన్నది అలాగే ఒప్ప చెప్పుతున్నదంటే మేధావిగా ఉండాలి! ఈ మేధావి తన కాలమంతా వంటింట్లోనే గడిపి వేసింది. ఛీ... ఆవిడ ప్రస్తుత పరిస్థితినీ చిత్తభ్రమనూ యితరులు వర్ణించడమూ నాకు చికాకు కలిగించింది. ఇందుకు మరో అందమైన వివరణ ఉండకూడదా అనిపించింది. ఆ తర్వాత కూడా కొన్ని తడవలు ఆ వృద్ధుల్ని చూడడానికి వెళ్లాము. ఒకసారి తాతగారే భోజన పాత్రల్ని తోమి బోర్లిస్తున్నారు. ఆ రోజు అమ్మమ్మకు ఏమీ బాగోలేదట! తాతగారే వంట చేశారట. ఇంకో రోజు. తాతగారప్పుడు ఇంట్లో లేరు. మమ్మల్ని చూసి అమ్మమ్మ తన ఇంగ్లీషు పాండిత్యాన్ని దులిపి వేసింది. రైల్లో మేము మా ఊరికి ప్రయాణమైనాము. నా భార్యకు ఆ వృద్ధుల జ్ఞాపకం వచ్చింది. ఉన్నట్టుండి ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. ‘‘ఏడవకు, ఏడవకు’’ అన్నాను ఓదారుస్తూ. కాని నాకు కూడా ఏడుపు వచ్చేంత పని అయింది. ‘‘తాతయ్య, అమ్మమ్మ - ఆ యిద్దర్లో ఎవరు ముందర పోయినా సరే మరొకరికి ఎంత దుఃఖంగా వుంటుందో! అది అనుకోడానికే బాధగా వుంది...’’ అంటూ మళ్లీ ఏడవసాగింది. నా మనస్సులో ఏదో తళుక్కుమంది. ఇదే సంగతి - అనుకున్నాను. తాతగారూ అవ్వగారూ తమకు తెలియకుండానే తరువాతి వారి మరణానికి తమను సిద్ధం చేసుకుంటున్నారు. తాతగారు అవ్వగారుగా మారిపోయి వంట చేస్తున్నారు. అవ్వగారేమో తాతగారై ఆంగ్లంలో... తాము బ్రతికినన్నాళ్లూ ధరించిన సాంఘిక వేషాల కోసం ఒకరిని చూసి మరొకరు పరితపిస్తున్నట్టుగా కనిపించింది. ఈ వేషాలు కల్పించిన గీతల్ని మచ్చల్ని యిద్దరూ ఒకరికొకరు సానుభూతితో తడవి చూసుకుంటున్నట్టుగా తోచింది. అవ్వగారు తల్లిగా, వంటింటి రాణిగా మెలిగిన పరిస్థితిని తాతగారూ, తాతగారు తండ్రిగా బయట తిరిగే వ్యక్తిగా మెలిగిన పరిస్థితిని అవ్వగారూ గ్రహిస్తున్నట్టుగా కనిపించింది. ఈ భావాన్ని శ్రీమతికి విశదీకరించాలని నాకనిపించింది. కాని వెంటనే ఒక సందేహం - తనకు పవిత్రంగా కనిపించిన దేనిమీదనో నేను ముదురు రంగులు పులిమి పాడుచేస్తున్నానని ఆమె భావించదు గదా! ఆమెతో నేనేమీ చెప్పలేదు. మేము ఢిల్లీ చేరుకున్న రెండు నెలలకల్లా డొంబివిలీ అవ్వగారు కాలధర్మం చేసినట్టుగా కబురు వచ్చింది. వెంటనే నాకు తాతగారు పాత్రలు తోమి బోర్లిస్తున్న ఆ దృశ్యమే స్ఫురణకు వచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఆయన్ని గురించి అనుకునేటప్పుడు, మునుపటికంటె ఆయన ఎక్కువగా వంటింట్లోనే మసులుతూ వుండవచ్చుననే స్ఫురిస్తుంది. మరొకటి కూడా స్ఫురిస్తోంది. ఆయన ఆంగ్లం మాట్లాడడం మానివేసి వుండవచ్చు. - కె.యస్.సుందరం (‘మొదట రాత్రి వస్తుంది’ సంకలనం నుండి)