
కర్ణాటక, బనశంకరి : తల్లిదండ్రుల బలవంతం మీద వివాహం చేసుకున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ ఓ అనుమానపు భర్త పెళ్లయిన మొదటి రోజే భార్యను వేధించిన ఘటన బసవనగుడి పోలీస్‌స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... ఆరునెలల క్రితం నగరానికి చెందిన యువతితో వివేక్ రాజగోపాల్‌కు వివాహమైంది. వివేక్ రాజగోపాల్ వివాహమైన మొదటి రాత్రిలోనే భార్య ప్రవర్తన పట్ల అనుమానం మొదలైంది.
అంతేగాక మా తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక నిన్ను వివాహం చేసుకున్నానని, తనను వదిలి పెట్టి వెళ్లి పోవాలని భార్యతో తెలిపాడు. వివేక్ భార్యను ఉద్యోగానికి పంపించి తనకు వచ్చిన జీతం డబ్బు ఇవ్వాలని వేధించడంతో పాటు తనతో అసభ్యంగా మాట్లాడే ఆడియో, బెడ్‌రూమ్ వీడియోతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు తెలిపింది. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఆడియో, వీడియో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. తన భర్తకు ఉన్న డబ్బు వ్యామోహానికి తీవ్రమనస్థాపం చెందిన గృహిణి పుట్టింటికి వెళ్లిన అనంతరం ఘటన పట్ల బనవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అనుమాన పిశాచి : పెళ్లైన మొదటిరాత్రే తన భర్త తనపై అనుమానంతో తన మొబైల్‌ఫోన్‌లోని కాల్స్, మెసేజ్‌లను పరిశీలించాడని, ఆ తరువాత ప్రతి రోజు అనుమానించడం మొదలుపెట్టినట్లు బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. తన భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చినట్లు తెలిపింది. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment