Husband harassment
-
భర్త వేధింపులపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్!
నెల్లూరు(క్రైమ్): వారిద్దరు ఉన్నతోద్యోగులు. అయితే విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్త తనను వేధిస్తున్నాడంటూ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడంతో పోలీసులు స్పందించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చా రు. వివరాలిలా ఉన్నాయి. జీవీఆర్ఆర్ కళాశాల సమీపంలో దంపతులు తమ కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త పశుసంవర్థక శాఖలో, భార్య వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి మధ్య కొంతకాలంగా మనస్పర్థలతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన వేదాయపాళెం పోలీసులు దంపతుల ఇంటికి చేరుకుని మాట్లాడారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
అందంగా లేదంటూ సౌందర్యకు వేధింపులు! అయ్యో తల్లీ..
క్రైమ్: బన్సీలాల్‌పేట్ కవల పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పపడ్డ తల్లి ఉదంతంలో దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడించారు గాంధీనగర్ పోలీసులు. పెళ్లయినప్పటి నుంచి అందంగా లేవంటూ అవమానించడంతో పాటు అదనపు కట్నం తేవాలని వేధించడంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తెలిపారు. సిద్ధిపేట జిల్లా రామంచకు చెందిన వేమన్న, దుర్గమ్మ దంపతులు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవచ్చారు. ప్రస్తుతం బన్సీలాల్‌పేట డివిజన్ జీవైఆర్ కాంపౌండ్ డబుల్బెడ్రూమ్ కాలనీలో ఉంటున్నారు. వారికి నలుగురు కుమార్తెలు. ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న వేమన్న పిల్లల పెళ్లిళ్లను ఉన్నంతలో ఘనంగా చేశారు. మూడేళ్లక్రితం చిన్నకూతురు సౌందర్య(26)ను సిద్దిపేట జిల్లా కొండాపూర్‌కు చెందిన గణేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. రూ.2.5 లక్షల నగదు, 4 తులాల బంగారం ఇచ్చారు. గణేష్, సౌందర్యలు ఉప్పల్‌లోని భరత్‌నగర్‌లో నివాముంటున్నారు. పద్మారావునగర్‌లోని ఓ క్షౌరశాలలో పనిచేస్తున్న గణేశ్... పెళ్లయిన కొంతకాలం తర్వాత అదనపు కట్నం తీసుకురమ్మంటూ భార్యను వేధించసాగాడు. ఏడాదిన్నర క్రితం సౌందర్య కవలలకు(పాప, బాబు) జన్మనిచ్చినా భర్త వేధింపులు ఆగలేదు. పలుమార్లు పుట్టింటి నుంచి అడిగినంత సొమ్ము తీసుకొచ్చినా అతను మారలేదు. పైగా అందంగా లేవంటూ హింసించేవాడు. ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వమిచ్చిన డబుల్బెడ్రూమ్ ఇల్లును తన పేరిట రాయించాలంటూ ఒత్తిడి చేసేవాడు. యాదాద్రి సమీపంలోని స్థలాన్ని సౌందర్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించినా సంతృప్తి పడలేదు. దీంతో సౌందర్య 25 రోజుల క్రితం పిల్లలతోసహా పుట్టింటికి చేరింది. ఇక్కడకు వచ్చాకా ఆమెను ఫోన్ ద్వారా భర్త వేధించేవాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాంధీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం 11 గంటలకు భర్త పనిచేస్తున్న పద్మారావునగర్‌లోని దుకాణానికి వెళ్లిన సౌందర్య.. తనను తీసుకెళ్లాలంటూ భర్తను కోరినా వినలేదు. దాంతో బన్సీలాల్‌పేటకు తిరిగొచ్చి, ఇంట్లో తల్లి నిద్రపోతున్న సమయంలో ఇద్దరు పిల్లలతో 8వ అంతస్తు పైకి వెళ్లింది. మొదట పిల్లలను కిందకు తోసేసి, ఆమె కూడా దూకేసింది. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాంధీనగర్ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వచ్చి బాధితులను పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: రిటైర్డ్ ఎంపీడీఓ హత్యలో ఎమ్మెల్యే హస్తం? -
కూకట్‌పల్లిలో దారుణం: మహిళా ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో భర్త కారణంగా తన బిడ్డను చంపుకోలేక ఐటీ ఉద్యోగి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భవనం 23వ అంతస్తు నుంచి దూకి మృతిచెందింది. వివరాల ప్రకారం.. శ్రీధర్, స్వాతి ఇద్దరు దంపతులు. వీరికి అంగవైకల్యంతో ఓ కుమారుడు జన్మించాడు. దీంతో, అంగకవైకల్యంతో ఉన్న కుమారుడిని చూస్తూ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మెర్సీ కిల్లింగ్ కోసం తండ్రి శ్రీధర్.. భార్య స్వాతిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ విషయమై తరచూ భార్యను వేధింపులకు గురిచేశాడు. భర్త ఎంత ఒత్తిడి తెచ్చిన కన్న కొడుకును చంపుకోలేక మెర్సీ కిల్లింగ్ ప్రతిపాదనను స్వాతి ఒప్పుకోలేదు. కాగా, కుమారుడి విషయంలో భర్త.. ఇలా వేధించడం భరించలేక స్వాతి మనోవేదనకు గురైంది. దీంతో, వారు నివాసం ఉంటున్న మంజీర ట్రినిటి హోమ్స్ 23వ అంతస్తు నుంచి దూకి స్వాతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా.. స్వాతి మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా శ్రీధర్ అందుబాటులోకి రాలేదు. కనీసం శ్రీధర్, అతడి కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని తీసుకువెళ్లలేదు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ను కఠినంగా శిక్షించాలని స్వాతి బంధువులు కోరుతున్నారు. -
మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి.. రెండు రోజులకే జీవితంలో సుడిగుండం..
మనోహరాబాద్(తూప్రాన్): ప్రేమించాడు..పెళ్లి చేసుకున్నాడు.. రెండురోజులకే ఇద్దరి కులాలు వేరంటూ వదిలేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి వేడుకున్నా కనికరించలేదు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. నెల రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో మృతురాలు కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని ఆ యువకుడి ఇంటి వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. ఈ విషాద ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తుప్రాన్ మండలపరిధిలోని ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18)లు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. గతేడాది అక్టోబర్ 15న పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 19న పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కాపురం చేసుకుంటామని ఒప్పుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో విభేదాలు వచ్చాయి. యువతికి అండగా కులపెద్దలు ఉండి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినా ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో, ఆ యువతి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తేజశ్రీ మంగళవారం వేకువజామున మృతి చెందింది. తేజశ్రీ మృతదేహాన్ని యశ్వంత్‌రెడ్డి ఇంటివద్ద ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీధర్, ఎస్ఐ సందీప్‌రెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజె ప్పారు. పోలీసులు చివరికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు చేశారు. -
నా భర్త పెద్ద సైకో!: లేఖ రాసి.. హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
నస్పూర్(మంచిర్యాల): భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవికుమార్, మృతురాలు రాసిన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకా రం పట్టణ పరిధిలోని నాగార్జున కాలనీలో నివాసం ఉండే ఆకుదారి కిష్టయ్య తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య వనిత (35) కూతుర్లు వర్షశ్రీ, చరితశ్రీ, కుమారుడు కృష్ణవంశీ ఉన్నారు. కిష్టయ్య భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతుండేవాడు. సోమవారం కిష్టయ్య పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి వనిత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. వాగ్వాదానికి దిగిన స్థానికులు వనిత ఆత్మహత్యకు భర్త కిష్టయ్యనే కారణమని, అతడిని ఇక్కడికి తీసుకురావాలని స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకున్నారు. ఎస్సై రవి కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ వారికి సర్దిచెప్పారు. -
'నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు'
సాక్షి, బెంగళూరు: నాన్నా నువ్వు రోజూ అమ్మను ఎందుకు కొడతావు. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు అని పిల్లలు అడుగుతుంటే తల్లి రోదిస్తూ చూస్తుంది. కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకున్నా భర్త చెడు నడవడిక వల్ల ఓ వివాహిత పిల్లలతో కలిసి జల సమాధి అయ్యింది. మద్యం తాగి భర్త పెట్టే వేధింపులను భరించలేక ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి చెక్‌డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా మళలి గ్రామంలో జరిగింది. తాలూకాలోని జానకల్ లంబాణి కాలనీకి చెందిన అర్పిత (28), కూతురు మానస(6), కొడుకు మదన్(4)లు మృతి చెందారు. అనుమానం, మద్యం వ్యసనం వివరాలు... 8 ఏళ్ల క్రితం హొసదుర్గ తాలూకా జానకల్ లంబాణి కాలనీకి చెందిన అర్పితకు కొండజ్జి లంబాణి కాలనీవాసి మంజా నాయక్‌తో పెళ్లయింది. భర్త అనుమానంతో తరచూ వేధించేవాడు. రోజు మద్యం తాగి గొడవపడేవాడు. భర్త సతాయింపులతో ఆవేదన చెందిన ఆమె ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి దగ్గరలోని చెక్‌డ్యాంలో దూకడంతో ప్రాణాలు విడిచారు. అంతకుముందు అర్పిత సెల్ఫీ వీడియో తీసింది. అందులో కొడుకు మదన్ నాన్న అంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. హొసదుర్గ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి) -
దంపతులిద్దరూ ఐటీ ఉద్యోగులే.. పిల్లలు లేకపోవడంతో భర్త..
కృష్ణరాజపురం: వేధింపుల భర్తతో విరక్తి చెందిన మహిళ అపార్ట్మెంటు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరు మహాదేవపురలో వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. టెక్కీలుగా పనిచేస్తూ.. వివరాల ప్రకారం.. ఉపాసన(30), ఆమె భర్త రంజన్ రావత్ దంపతులు ఉత్తరాది నుంచి వలస వచ్చారు. దిశా అపార్ట్మెంటులో 9వ అంతస్తులో అద్దె ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 9 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వేర్వేరు ఐటీ కంపెనీల్లో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై తరచూ గొడవ పడేవారు. చివరికి విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది. తన జీవితం ఏమాత్రం బాగాలేదని విరక్తి చెందిన ఉపాసనా రావత్.. డెత్‌నోట్ రాసి బుధవారం సాయంత్రం తన ఫ్లాటు వరండా నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి భర్త రంజన్ రావత్‌ను అరెస్టు చేశారు. డెత్‌నోట్‌లో ఏముంది? ఆమె ఆరు లైన్లలో ఆంగ్లంలో క్లుప్తంగా రాసిన డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా భర్త నన్ను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నాడు. అందుకనే నేను చనిపోతున్నా. లైంగికంగా అతడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతన్ని కఠినంగా శిక్షించాలి అని లేఖలో రాసి ఉంది. -
నువ్వు రాకపోతే ఆడపిల్లలను చంపేస్తా
పెంటపాడు: కన్నతండ్రే తన ఇద్దరు ఆడపిల్లలను చంపేందుకు సిద్ధమై విచక్షణారహితంగా దాడి చేశాడు. పిల్లలు భయంతో ఏడుస్తూ తమను చంపవద్దని తండ్రిని వేడుకుంటుండగా, వీడియో తీయించి కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన తన భార్యకు పంపించాడు. భార్యను వెంటనే తెరిగి రావాలని, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలను చంపేస్తానని హెచ్చరించాడు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులోని ఎస్సీపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెంటపాడు ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పెంటపాడు మండలం వీరపాలేనికి చెందిన గంజి దావీదుకు భార్య నిర్మల, కుమారుడు ఆకాష్(13), కుమార్తెలు అలేఖ్య(12), అమృత(11) ఉన్నారు. మద్యానికి బానిసైన దావీదు తన భార్యపై అనుమానంతో తరచూ కొడుతుండేవాడు. అతను ఏ పని చేయకుండా తాగి గొడవ చేస్తుండటంతో కుటుంబ పోషణ కోసం నిర్మల ఏడాది కిందట కువైట్ వెళ్లింది. నాలుగు నెలల కిందట దావీదు తన పిల్లలను తీసుకుని పెంటపాడు వచ్చి ఎస్సీ పేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తన భార్యను ఎలాగైనా కువైట్ నుంచి రప్పించాలని దావీదు కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇద్దరు ఆడపిల్లలను చిత్రహింసలు పెడుతూ కుమారుడితో వీడియోలు తీయించి భార్యకు పంపుతున్నాడు. ఇది చూసి తట్టుకోలేని నిర్మల ఆ వీడియోలను గురువారం గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళకు పంపింది. సర్పంచ్ వెంటనే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుమారుడు కొట్టు విశాల్‌కు వాటిని పంపారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో ఆయన సూచన మేరకు విశాల్ స్థానిక పోలీసులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. వారు వెళ్లేసరికి పిల్లలను కొమ్ముగూడెంలోని బంధువుల ఇంటి వద్ద వదిలి దావీదు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వేధింపులతో విసిగి కూతురుసహా తల్లి సజీవదహనం
ములుగు(గజ్వేల్): కుటుంబకలహాలు రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. ఒకవైపు భర్త వేధింపులు.. మరోవైపు మానసిక వికలాంగురాలైన కూతురుకు పెళ్లి కాదేమోననే బెంగ.. కొంతకాలంగా మానసిక వేదన అనుభవిస్తున్న ఓ తల్లి కూతురుతోసహా నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు అవిలయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య గంగవ్వ(40)కు జ్యోతి, హారతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకూతురు వివాహం జరగ్గా మానసిక వికలాంగురాలైన పెద్ద కూతురు జ్యోతి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. రెండో భార్యకు కొడుకు, కూతురు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆరునెలల నుంచి అవిలయ్య, గంగవ్వకు మధ్య కుటుంబకలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అవిలయ్య ఆమెను కొట్టడంతో గురువారం ఉదయం 10 గంటలకు తన సోదరుడు మానుక అవిలయ్యకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అతడు బావకు ఫోన్ చేయగా గంగవ్వ, జ్యోతి కనపడటం లేదని చెప్పాడు. ఆందోళనకు గురైన మానుక అవిలయ్య వారి కోసం వెతకడం ప్రారంభించాడు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు జప్తిసింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నీలగిరి చెట్ల మధ్య కాలినస్థితిలో గంగవ్వ, జ్యోతి మృతదేహాలు కనిపించాయి. అక్కడ సమీపంలోనే గంగవ్వ బంగారు, వెండి అభరణాలు మూటకట్టి ఉన్నాయి. భర్త వేధింపులు భరించలేకనే తన సోదరి గంగవ్వ కూతురితో కలసి నిప్పంటించుకుని బలవన్మరణం చెందిందని మానుక అవిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. గంగవ్వ భర్త అవిలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కట్నం కోసం భర్త వికృత రూపం.. డ్రగ్స్ మత్తులో ఫ్రెండ్స్‌తో కలిసి....
సాక్షి, కర్ణాటక: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి అంగరంగ వైభవంగా పెళ్లి, అంతకు మించి కట్న కానుకలు. కానీ వరుని కట్నదాహానికి అంతు లేకుండా పోయింది. ఇంకా తేవాలని సతాయిస్తూ, డ్రగ్స్ మత్తులో నరకం చూపించాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్‌పై బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ యువతికి– సుదీప్‌కు 2021 లో పెద్దలు పెళ్లి చేశారు. వరుని కుటుంబం డిమాండ్ మేరకు వధువు కుటుంబీకులు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవోపేతంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ.55 లక్షల విలువచేసే మినీ కూపర్ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను సుదీప్‌కు ముట్టజెప్పారు. కట్నం, పెళ్లి ఖర్చులు కలిపి రూ.6 కోట్లు అయినట్లు తెలిపింది. డ్రగ్స్ మత్తులో అరాచకం ఇంతటితో సంతృప్తి చెందని భర్త సుదీప్, పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భార్యను వేధించాడు. దీంతో యువతి తండ్రి తమ రెండు కంపెనీలను అల్లుని పేరిట రాశారు. ఆ కంపెనీల్లో వచ్చే లాభం సుదీప్ తీసుకునేవాడు. సుదీప్ డ్రగ్స్‌కు బానిస కాగా స్నేహితులను ఇంటికి పిలిపించుకుని డ్రగ్స్ సేవించి మత్తులో భార్య తలపై మూత్రవిసర్జన చేసి వికృతంగా ప్రవర్తించాడు. దీనిని ప్రశ్నిస్తే అసభ్యంగా దూషించేవాడు. ఆమె అత్తమామలకు చెప్పుకోగా వారు కొడుకునే వెనకేసుకొచ్చారు, పైగా నిన్నే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు -
ఒంటరిగా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి
చైతన్యపురి(హైదరాబాద్): ‘భర్త, అత్త వేధింపులు తట్టుకోలేను.. విడిపోయి ఒంటరిగా బతకలేను...అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరూర్‌నగర్ ఎస్ఐ మాధవరావు, మృతురాలి కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ ఆనంద్‌నగర్‌కు చెందిన వ్యాపారి రాపోలు జనార్ధన్, జయమ్మల ఏకైక సంతానం నాగలక్ష్మి (36) బీటెక్ పూర్తి చేసింది. 2015లో దేవరకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్‌తో పెళ్లైంది. చదవండి: భర్తను పచ్చడి బండతో కొట్టి చంపిన భార్య వివాహ సమయంలో 25 తులాల బంగారం, రూ.4 లక్షలు కట్నంగా ఇచ్చారు. సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీలో శ్రీకాంత్, నాగలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు చరణ్‌జిత్ ఉన్నాడు.పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం నాగలక్ష్మిని భర్త, అత్త, ఆడపడుచు వేధిస్తుండేవారు. నాగలక్ష్మిని తల్లిగారింటికి, బంధువుల ఇళ్లకు వెళ్లనిచ్చేవాడు కాదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది శనివారం సాయంత్రం నాగలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఆత్మహత్య చేసుకుందని శ్రీకాంత్ అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అల్లుడు తమ కూతుర్ని ఏనాడూ భార్యలా చూడలేదని, అందంగా లేదని సూటిపోటి మాటలతో వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు జనార్ధన్, జయమ్మ తెలిపారు. ఇల్లు కొనేందుకు డబ్బులు కావాలని గొడవ చేస్తూ శాడిస్టులా వ్యవహరించేవాడని వారు వాపోయారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మూడేళ్ల క్రితం రెండో పెళ్లి.. భర్త వేధింపులు భరించలేక..
బనశంకరి: అందంగా లేవంటూ భర్త పెట్టే వేధింపులు భరించలేక యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కర్నాటకలో డీజే హళ్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం నిజాముద్దీన్ అనే వ్యక్తిని అనిశా(33) రెండో వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్లు, ఆరు నెలల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అందంగా లేవంటూ అనిశాను భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఆమె బంధువులు ఆరోపించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం కూడా ఇదే విషయంపై గొడవ పడ్డారు. దీంతో, భర్త వేధింపులతో మనోవేదనకు గురైన అనిశా.. ఒంటిగంట సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు డీజే హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నెల రోజుల క్రితమే పెళ్లి.. లవర్‌తో కలిసి.. -
భర్త వేధింపులు.. యువ వైద్యురాలు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యోదయనగర్‌లో వరకట్న వేధింపులకు యువ వైద్యురాలు బలైంది. వివరాల ప్రకారం.. వైద్యురాలు వంగా భారతితో డాక్టర్ కొండగట్టు రమేష్‌కు గత డిసెంబర్లో వివాహమైంది. కాగా, అదనపు కట్నం తేవాలని రమేష్.. భారతిని వేధింపులకు గురిచేశాడు. కొత్తగా మరో ఆసుపత్రి పెడదామంటూ కట్నం కోసం ఆమెను వేధించాడు. ఈ క్రమంలో రమేష్ వేధింపులు భరించలేక యువ వైద్యురాలు భారతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు తండ్రి శంకరయ్య పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
మేడ్చల్‌లో దారుణం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ముగ్గురు పిల్లలతోపాటు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో ఆమెతోపాటు ఇద్దరు పిల్లలు మరణించగా, అదృష్టవశాత్తు కుమారుడు మృత్యువు అంచులవరకు వెళ్లి బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా రాజబొల్లారం గ్రామానికి చెందిన బ్రాహ్మణపల్లి భిక్షపతి, మమత దంపతులు. భిక్షపతి ప్లంబర్ పనులు చేస్తున్నాడు.పెళ్లయిన నాటి నుంచే భిక్షపతి మమతపై అనుమానం పెట్టుకుని ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించసాగాడు. తరచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషులు సర్ది చెప్పారు. వారికి జగదీశ్ (6), ప్రణతి (3), దీక్షిత్ (1) అనే పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టినా భిక్షపతి తీరు మారలేదు. గత రెండు నెలలుగా రోజూ మద్యం తాగి భార్య మమతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా భిక్షపతి, మమతను చితకబాది హింసించాడు. దీంతో మనస్తాపం చెందిన మమత.. తాను చెరువులోకి దూకి చనిపోతానని ఇరుగుపొరుగు వద్ద వాపోయింది. బుధవారం ఉదయం పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపకుండా వారితోపాటే ఆమె ఇంటి వద్ద ఉంది. చదవండి: ఏఎస్పీ ‘ముని రామయ్య’ కేసులో మరో అరెస్టు పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి ఎందుకు పంపలేదని భిక్షపతి ఉదయం మళ్లీ గొడవ పడ్డాడు. దాంతో అంగన్వాడీ కేంద్రానికని బయలు దేరిన మమత.. అక్కడికి వెళ్లకుండా ముగ్గురు పిల్ల లను వెంట పెట్టుకుని తమ పొలం వద్ద ఉన్న చెరువు వద్దకు వెళ్లి పిల్లలను తోసి, తానూ దూకింది. దీంతో నీట మునిగి మమత, ప్రణతి, దీక్షిత్ మృతి చెందారు. మరో కుమారుడు జగదీశ్ అదృష్టవశాత్తు ఒడ్డుకు చేరుకుని బతికాడు. కాగా, మమత ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆమె మరిది, ఆయన భార్య.. అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి చూడగా మమత, పిల్లలు అక్కడ లేరు. చెరువు వద్దకు వెళ్లి చూడగా జగదీశ్ చెరువు ఒడ్డున అపస్మారక స్థితిలో పడిఉండటం గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నీటిలో మునిగిన మృతదేహాలను వెలికి తీశారు. మమత తల్లిదండ్రులు భిక్షపతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భరించలేక భస్మం చేసింది
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక కోర్టు నుంచి విడాకులు కూడా తీసుకుని విడిపోయారు. బంధువులు సర్ది చెప్పటంతో మళ్లీ కలిసి కాపురం చేస్తున్నారు. అయినా తీరు మారని భర్త వేధింపులతో భార్య తట్టుకోలేక లీటర్ పెట్రోల్ తెచ్చి మందు తాగి మత్తులో పడుకున్న భర్తపై పోసింది. అగ్గిపుల్లతో నిప్పంటించి తలుపు గడియ పెట్టి తాళం వేసి పరారైంది. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో చుట్టుపక్కల వారు ఫైర్‌స్టేషన్‌కు, పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సంతనూతలపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడు మండలం గాజులపాలెం గ్రామానికి చెందిన క్రిష్టిపాటి మోహన కృష్ణారెడ్డి (31) సంతనూతలపాడులో మద్ది శ్రీనివాసరావు, జ్యోతి దంపతుల కుమార్తె రుక్మిణిని 2011లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మోహన కృష్ణారెడ్డి అప్పటి నుంచి సంతనూతలపాడులోనే నివాసం ఉంటున్నాడు. ఆ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కారు, లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న కృష్ణారెడ్డి మద్యానికి బానిసై భార్య, కుమారుడిని తరుచూ వేధించేవాడు. అంతే కాకుండా అత్తామామలను కూడా హింసించేవాడు. వేధింపులు తట్టుకోలేక రుక్మిణి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఇంట్లో వారు సర్ది చెప్పడంతో ఓర్చుకున్న రుక్మిణి ఆ తర్వాత రోజుల్లో భర్త ఆగడాలు తట్టుకోలేక 2016లో కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకుంది. చదవండి: (భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..) కృష్ణారెడ్డి సోదరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పెటాకులైన కాపురాన్ని నిలబెట్టింది. అయినా మార్పు లేకుండా రోజూ మద్యం తాగి వచ్చి రుక్మిణిని, కుమారుడిని వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి కూడా భార్య, కుమారుడిని కృష్ణారెడ్డి కొట్టి హింసించాడు. విసిగిపోయిన రుక్మిణి మద్యం తాగి ఇంటికొచ్చి మత్తులో పడుకున్న కృష్ణారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. వెంటనే తలుపు గడియపెట్టి తాళం వేసి పరారైంది. పెట్రోల్ పోయడంతో మంటలు వేగంగా వ్యాపించి ఆ మంటల్లో కృష్ణారెడ్డి గుర్తు పట్టలేని విధంగా కాలి బూడిదయ్యాడు. సంతనూతలపాడు ఎస్ఐ బి.శ్రీకాంత్‌తో కలిసి సంఘటన జరిగిన ప్రాంతాన్ని ఒంగోలు డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. రుక్మిణి తల్లిదండ్రులతో పాటు స్థానికులను విచారించారు. ఒంగోలులో ఉంటున్న కృష్ణారెడ్డి సోదరి హారిక ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..
సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్): భర్త వేధింపులతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు, బంధువులు సోమవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త దేవిరెడ్డి, మామ జంగారెడ్డి పోలీస్ స్టేషన్లో తలదాచుకోవడం ఏంటని బంధువులు పెద్దఎత్తున తరలివచ్చి స్టేషన్ ముందు బైఠాయించారు. వివరాలు ఇలా.. మాడ్గుల మండలం అర్కపల్లికి చెందిన మానసను వనస్థలిపురం క్రిష్టియన్‌కాలనీకి చెందిన దేవిరెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దేవిరెడ్డి మెడికల్ కంపెనీలో పని చేస్తుండగా మానస ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే... దేవిరెడ్డి సంసార జీవితానికి పనికిరాడని మానస తల్లిదండ్రులకు చెప్పగా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కోసం పెంచుకున్న దేవిరెడ్డి మానసను పలుమార్లు కొట్టడంతో పెద్దల సమక్షంలో ఇరువురికి నచ్చజెప్పారు. ఈ విషయమై 2021లో దేవిరెడ్డిపై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చదవండి: (నవమి వేడుకల్లో ఘర్షణలు) నాటి నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న మానస ఈ నెల 9న మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ మానస అపస్మారక స్థితిలో వెళ్లడంతో వెంటనే అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా మానస అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. గత మూడ్రోజులుగా మానసిక క్షోభతో మృతి చెందిన మానస మృతదేహానికి భర్త దేవిరెడ్డి అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేయడంతో ఇంటికి తాళం వేసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. -
పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని వెళ్లగొట్టాడు..
అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త.. ఆడపిల్లలు పుట్టారని వెలేశాడంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. స్పందించిన మానవతావాదులు ఆమెను కాపాడి జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి వద్దకు పిలుచుకెళ్లారు. బాధితురాలి వేదన ఆమె మాటల్లోనే.. ‘నా పేరు మమత. బుక్కపట్నం మండలం కొడపగానిపల్లి. బుక్కపట్నంలో వీఆర్వోగా పనిచేస్తున్న రామ్మోహన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మాది ప్రేమ వివాహం. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత నా భర్త నా నుంచి దూరమయ్యాడు. బుక్కపట్నంలో తాను పనిచేస్తున్న సచివాలయంలోనే వివాహిత అయిన ఓ ఉద్యోగినితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని నిలదీయడంతో నాపై పలుమార్లు దాడికి ప్రయత్నించాడు. అతని వేధింపులు తాళలేక 2021, డిసెంబరులో నిర్వహించిన పోలీస్ స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశా. దిశా పోలీసు స్టేషన్‌కు నా భర్తను పిలిపించి మందలించి పంపారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పైగా ఇంటి ముఖం కూడా చూడడం లేదు. నా తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి.. నన్ను, పిల్లలను పోషించలేక పోతున్నారు. సమస్యను కలెక్టర్‌కు విన్నవించి, నా సంసారాన్ని చక్కబెట్టాలని కోరేందుకు వచ్చా. అయితే నా కష్టం తీరుతుందని అనుకోలేదు. దీంతో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెరువులో పిల్లలను తోసి నేనూ దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. నా ప్రయత్నాన్ని అక్కడున్న వారు అడ్డుకుని జాయింట్ కలెక్టర్ సిరి మేడమ్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి కదిరి ఆర్డీఓకు ఫోన్ చేసి న్యాయం చేయాలని ఆదేశించారు’ అంటూ వివరించారు. బాధితురాలు మమత -
భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో..
సాక్షి, కుషాయిగూడ: అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక బీదర్‌కు చెందిన మచ్ఛీంద్రా రాథోడ్, కుటుంబ సభ్యులతో కలిసి ఏడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఏఎస్‌రావునగర్, సాయినాథపురంలో నివాసముంటూ స్వీట్‌కాన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ప్రియాంక జాదవ్ (20)ఉన్నారు. కూతురికి 2020 మార్చిలో ఏఎస్‌రావునగర్‌లోనే ఉంటున్న సచిన్‌జాదవ్‌తో వివాహం జరిగింది. వారికి 13 నెలల పాప ఉంది. కొంత కాలం సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ భార్యను అనుమానించడం, వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టాడు. భర్త వేధింపులు భరించలేని ప్రియాంక, తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా పలుమార్లు సర్ధి చెప్పినా అ తని తీరు మారలేదు. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఈ నెల 20న ప్రియాంక వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. కూ తురుకి మళ్లీ సర్ధిచెప్పి మరుసటి రోజు సోదరుడు సంతోష్‌తో కలిసి ప్రియాంకను అత్తరింటికి పంపించారు. వారిని చూసిన సచిన్ దురుసుగా ప్రవర్తించాడు. కాసేపటి తర్వాత సంతోష్ ఇంటికెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఒంటరిగా ఎందుకు వదిలివచ్చావని, చిన్న కొడుకు సందీప్‌ను కూతురు ఇంటికి పంపించాడు. సందీప్ అక్కడికి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎంతకీ తీయకపోవడంతో కిటికీ లోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమ.. మరొకరిని ప్రేమిస్తోందని తెలిసి.. మనోవేదనకు గురై.. అల్వాల్: మానసిక ఒత్తిడి, మనోవేదనకు గురై గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ గంగాధర్ వివరాల ప్రకారం.. భూదేవినగర్‌కు చెందిన రేవతి (28) మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్‌కు చెందిన కిరణ్‌తో గతేడాది వివాహం జరిగింది. గత కొంతకాలంగా రేవతి తల్లి లత తలకు తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతోంది. ఇటీవల రేవతి భూదేవినగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి మానసికంగా కుంగిపోయి ఒత్తిడి గురైంది. ఈ నెల 20న రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో లోపలికెళ్లి చూడగా రేవతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని నిలదీయడంతో..
సాక్షి, రాజేంద్రనగర్: విడాకులు ఇచ్చిన భర్త వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటం, కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హుడా కాలనీకి చెందిన షహజాబేగం(25), ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఇమ్రాన్(29)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. షేక్ ఇమ్రాన్ స్థానికంగా హార్డ్‌వేర్ దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతడికి బంధువుల మహిళతో అక్రమ సంబంధం ఉంది. సంవత్సరం క్రితం షహజాబేగం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని నిలదీసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం షేక్ ఇమ్రాన్ పాలల్లో గుర్తు తెలిని క్రిమి సంహారక మందు కలిపి షహజాబేగంతో తాగించాడు. దీంతో అస్వస్తతకు గురైన షహజాబేగంను ఆసుపత్రికి తరలించగా వారం రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. ఈ సమయంలో భర్తపై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. వీరికి ఇద్దరు సంతానం. స్థానిక పెద్దల జోక్యంతో కేసు విత్‌డ్రా చేసుకున్న షహజాబేగం అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది. మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. చదవండి: సెల్ఫీ కోసం రైలు బోగీ పైకి.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలడంతో కాగా పది రోజుల క్రితం షేక్ ఇమ్రాన్ కుమారుడిని చూస్తానని ఇంటికి తీసుకువెళ్లాడు. తిరిగి షాజాహబేగంకు అప్పగించలేదు. తరచూ స్థానికులతో అసత్య ప్రచారాన్ని చేపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెందిన షాహజాబేగం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. బుధవారం రాత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా -
విషాదం: రూ.25 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు.. అయినా చాల్లేదు..
సాక్షి, మెదక్ (గజ్వేల్): జగదేవ్‌పూర్‌లో పండగ పూట ఆ ఇంట విషాదం నెలకొంది. భర్త వేధింపులకు భార్య బలైంది. నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ప్రమాదంలో చికిత్స పొందుతూ పండగ పూట శుక్రవారం మృతి చెందింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవ్‌పూర్‌కు చెందిన పనగట్ల బాల్‌రాజు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు రమ ఉంది. 13 ఏళ్ల క్రితం రమను నిజామాబాద్‌కు చెందిన సంజయ్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.25 లక్షల కట్నంతో పాటు బంగారు అభరణలు పెట్టారు. రెండేళ్ల పాటు సంసారం సాఫీగా సాగింది. అప్పటి నుంచి ఆదనప్పు కట్నం కావాలని వేధింపులకు పాడ్పడడమే కాకుండా తాగుడుకు బనిసగా మారాడు. పలు సార్లు ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్తి చెప్పినా తనలో మార్పు రాకపోవడంతో భరించలేక రమ పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం తన అమ్మగారింటికి జగదేవ్‌పూర్‌కు వచ్చి ఇక్కడే ఉంటుంది. చదవండి: (కిరాణా షాపుకు వెళ్లొస్తానని ఒకరు.. డ్యూటీకి వెళ్తున్నానని మరొకరు..) కాగా మూడు నెలల క్రితం సంజయ్ అత్తగారింటికి భార్య, అత్తమామలకు తాను మారినట్లు నమ్మించి భార్యను తీసుకెళ్లాడు. తీసుకవెళ్లిన నాటి నుంచి మళ్లీ వేధింపులు పెట్టాడు. నాలుగు రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. చుట్టు ప్రక్కన వారు చూసి మంటలను ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. పండుగ పూట కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా జగదేవ్‌పూర్‌లోనే అమె అంత్యక్రియలు నిర్వహించారు. -
సామూహిక ఆత్మహత్యలు! ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి బావిలోకి దూకి..
జైపూర్: భర్తతో నిరంతర తగాదాలతో మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు ఐదుగురి కూతుళ్లతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురూ మృతి చెందారు. ఆదివారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను వెలికితీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలిని శివలాల్ బన్జారా భార్యగా గుర్తించారు. బాదందేవి (40) ఏడుగురు పిల్లల తల్లి. ఘటనలో బాదందేవితోపాటు సావిత్రి (14), అంకాలీ (8), కాజల్ (6), గుంజన్ (4), అర్చన (ఏడాది వయసు) మృతి చెందగా, మిగతా ఇద్దరు కూతుళ్లు గాయత్రి (15), పూనమ్ (7) నిద్రపోవడంవల్ల తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుప్పట్లను విక్రయించే పని చేసే శివలాల్‌కు, భర్య బాదందేవికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఐతే సంఘటన సమయంలో శివలాల్ ఇంటివద్దలేనని, బంధువు మృతి చెందితే సంతాపం తెల్పడానికి శనివారం రాత్రి పొరుగూరికి వెళ్లినట్లు తెలిపాడు. సంఘటన గురించి తెలియడంతో ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఐతే భార్య ఎందుకు చనిపోవాలనుకుందో మాత్రం పోలీసులకు తెల్పలేదు. మృతుల ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలోనే బావి ఉంది. మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టు రావల్సి ఉంది. ఈ సంఘటనపై సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని ఎస్హెచ్ఓ రాజేంద్ర మీనా మీడియాకు తెలిపారు. చదవండి: మహిళ ఎకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు! -
ఆ.. పిల్లలను ఆదుకుంటాం
ఆత్మకూరు: భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన మెప్మా రిసోర్స్‌పర్సన్ మొద్దు కొండమ్మ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో భర్త కిరాతకానికి బలైన కొండమ్మ కుటుంబీకులను వాసిరెడ్డి పద్మ గురువారం పరామర్శించారు. చిన్నారులైన కొండమ్మ కుమారులు ధనుష్, తరుణ్‌తో పాటు తల్లి పెంచలమ్మను, సోదరులను ఆమె ఓదార్చారు. కొండమ్మ కుమారుడు తరుణ్ గుండెజబ్బుతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వైద్యపరీక్షలు నిర్వహించేలా చూడాలని ఐసీడీఎస్ పీడీ రోజ్‌మాండ్‌ను ఆదేశించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో పద్మ విలేకరులతో మాట్లాడారు. భార్యను ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించడంతో పాటు ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి పలువురికి పంపడం హేయమైన చర్య అన్నారు. అదే క్రమంలో వైజాగ్‌లో దివ్యాంగురాలిపై జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మి, కమిషన్ డైరెక్టర్ కె.సూయజ్, ఆర్డీవో చైత్ర వర్షిణి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, చైర్పర్సన్ వెంకటరమణమ్మ పాల్గొన్నారు. -
సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాపింగ్.. ఆమెపై నీడలా భర్త
కోరుట్ల: సీక్రెట్ యాప్‌ను రహస్యంగా తన ఫోన్లో ఇన్స్టాల్ చేసి భర్త తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అనుమానంతో వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్‌రాజు వివరాల ప్రకారం.. కోరుట్లకు టి.నర్సింహాచలం (48) తన భార్య అనిత ఫోన్లో ఓ సీక్రెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేశాడు. ఆ యాప్‌తో ఆమె ఫోన్‌ను ట్రేస్ చేయడం మొదలుపెట్టాడు. దీంతోపాటు ఆమె ఫోన్‌ను కూడా భర్తే ఆపరేట్ చేస్తున్నాడు. వీటితోపాటు ఆమె వాట్సాప్ చాటింగ్ చూడటం, ఆడియో రికార్డింగ్ వినడం వంటివి చేస్తున్నాడు. ఈ తనకు తెలియకుండా ఫోన్‌ను అతడు అనుసంధానం చేసి వాటితో వీడియో షూటింగ్ కూడా చేసేవాడు. ఈ విషయం భార్య ఆలస్యంగా గుర్తించి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా భర్త నర్సింహాచలం భార్య ఫోన్లో చేసిన నిర్వాకాన్ని అంగీకరించాడు. కొన్నేళ్ల కిందట ఇంట్లో నుంచి పోయిన బంగారం విషయంలో ఆరా తీయడానికి ఈ సీక్రెట్ యాప్ ఇన్స్టాల్ చేసినట్లు నిందితుడు చెప్పాడని సీఐ తెలిపారు. ఇదే రీతిలో మరో ఇద్దరు బంధువుల ఫోన్లలోనూ సీక్రెట్ యాప్ వారికి తెలియకుండా ఇన్స్టాల్ చేసినట్లు విచారణలో తేలింది. బంధువుల ఫోన్లలో సీక్రెట్ యాప్‌ను ఎందుకు ఇన్స్టాల్ చేశాడన్న విషయంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింహాచలంపై 498, 354 (సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి: ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి) చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
భార్యను కాల్ గర్ల్‌గా మార్చిన భర్త రేవంత్
సాక్షి, తిరుపతి: భార్యను కాల్ గర్ల్‌గా మార్చిన శాడిస్టు భర్త రేవంత్‌ను అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా దిశ పీఎస్ డీఎస్పీ రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి చెందిన ఓ కాలేజీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ నాలుగు నెలల క్రితం నిరోషాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం ఆదనపు కట్నం తేవాలంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడని చెప్పారు. ఈ క్రమంలో ఆమెను మానసికంగా హింసించడంతో నిరోషా గతంలో అలిపిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఎస్ఐ హిమబిందు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారన్నారు. అయినప్పటికి రేవంత్ ఆమెను మరింత వేధింపులకు గురిచేయడమే కాక వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడన్నారు. అంతేగాక ఆమె న్యూడ్ ఫొటోలను పోస్టు చేసి గంటకు రూ. 3వేలు అంటూ భార్యను కాల్ గర్ల్‌గా చిత్రీకరించాడని తెలిపారు. అది తెలిసిన నిరోషా మరోసారి అలిపిరి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు రేవంత్‌పై ఐపీసీ సెక్షన్ 307, 313, 354(డీ), 324, 506, 66(ఈ) కింద కేసు నమోదు చేసి రేవంత్‌ను అరెస్టు చేశామన్నారు. అయితే మొదటి సారి నిరోషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయని ఎస్ఐపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
భార్యను కాల్ గర్ల్‌గా చిత్రించి..
తిరుపతి క్రైం/సాక్షి,అమరావతి: అదనపు కట్నం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మానసికంగా హింసించాడు. భౌతికంగా వేధింపులకు దిగాడు. తన హింసను భరిస్తూ వస్తున్న భార్యను చివరకు కాల్ గర్ల్‌లా చిత్రించాడు. వెబ్సైట్లలో తాను భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఉంచి తనలో క్రూరత్వాన్ని బయటపెట్టాడు. వేధింపులను తట్టుకోలేకపోయిన భార్య ఎదురుతిరిగింది. పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అరెస్టు చేశారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తిమ్మినాయుడుపాళెంకు చెందిన రేవంత్ నాలుగు నెలల క్రితం నిరోషాను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి సందర్భంగా అమ్మాయి తల్లిదండ్రులు రూ. 10 లక్షల విలువైన బంగారం, రూ. 10 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లయిన కొద్ది రోజుల తర్వాత నుంచే అదనపు కట్నం తేవాలని భార్యను రేవంత్ వేధించడం మొదలుపెట్టాడు. భౌతికదాడులు చేశాడు. అంతేగాక తన భార్యతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను, వీడియోలను వెబ్సైట్లలో ఉంచి ఆమెను కాల్‌గర్ల్‌గా చిత్రీకరించాడు. భర్త వేధింపులను నిరోషా తాళలేక ఎదురుతిరిగింది. ఆమెకు అండగా బంధువులు, స్థానికులు నిలబడ్డారు. రేవంత్ ఇంటికి వారు వచ్చేలోపు సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరోషాకు మద్దుతుగా వచ్చిన వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు నిరోషాతో అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే దిశా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళా కమిషన్ సీరియస్ భార్యను కాల్ గర్ల్‌గా చిత్రించిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. బాధితురాలితో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
కాళ్లు మొక్కి పెళ్లి చేసుకున్నాడు, కానీ..
సాక్షి, కోనరావుపేట(వేములవాడ): వెంటపడ్డాడు.. ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె తల్లడిల్లిపోయింది. నిత్యం వేధింపులు తాళలేక తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. కోనరావుపేట మ ండలం కొలనూర్‌కు చెందిన వీరవేణి పర్శరాములు–పద్మ దంపతుల కుమారుడు అజయ్ సిరిసిల్ల మండలం పెద్దూర్‌కు చెందిన ఇన్నారం దేవయ్య–మంగ దంపతుల కూతురు రాణి ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేయగా అజయ్ అడ్డుకున్నాడు. రాణిని తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ సంబంధాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో రాణి తల్లిదండ్రులు కొలనూర్‌కు వచ్చి అజయ్‌ను నిలదీశారు. దీంతో అతను వారి కాళ్లు మొక్కి, రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆగస్టు 12న పెళ్లి... అజయ్, రాణిలు ఆగస్టు 12న నిజామాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అన ంతరం అజయ్ ఆమెను కొలనూర్‌లోని ఇంటికి తీ సుకెళ్లాడు. ఇది నచ్చని అతని తల్లిదండ్రులు, నాన మ్మ రాణిని చిత్రహింసలకు గురిచేశారు. నిత్యం కులం పేరుతో దూషించేవారు. ప్రతిరోజూ ఇంటి, పొలం పనులు చేయిస్తూ పస్తులుంచేవారు. వారి వేధింపులు తీవ్రం కావడంతో రాణి తల్లి ఈ నెల 14న ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. తిరిగి మంగళవారం కొలనూర్‌కు వస్తే అజయ్ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో రా ణి అత్తవారింటి ఎదుట బైఠాయించింది. బాధితులరాలికి మహిళా సంఘాలు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పోలీసులు తనకు న్యాయం చేయాలని రాణి వేడుకుంటోంది. ఐపీఎల్ బెట్టింగ్ నిందితుల అరెస్టు గోదావరిఖని(రామగుండం): ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిందితులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలోని సీసీసీ నస్పూర్ ఏరియాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ కమీషన్లు తీసుకుంటున్న ప్రధాన నిందితుడు, ఆర్ఎంపీ జబ్రీ ఇక్బాల్‌తో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్ వివరాలు వెల్లడించారు. సీసీసీ నస్పూర్ ఏరియాలో భారీగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు రామగుండం సీసీఎస్ ఏసీపీ పీవీ.గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారన్నారు. మదర్ క్లినిక్ కేంద్రంగా ఈ దందా సాగుతోందని చెప్పారు. క్లినిక్ ఆర్ఎంపీ డాక్టర్ జబ్రీ ఇక్బాల్ ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్‌కు దిగేవారిని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 2019లోనూ ఇక్బాల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాలడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అతని బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నగదు, సెల్ఫోన్లు స్వాధీనం... క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 15 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు జబ్రి ఇక్బాల్‌తో పాటు సీసీసీ నస్పూర్‌కు చెందిన జబ్రి హాధి, జబ్రి అఖిల్, కొమ్మెర విజయ్, ఎండీ.ఫహీమ్, సుంకరి సాగర్, అనుమాస్ సంతోష్‌కుమార్, నేదూరి శ్రీనివాస్, అగ్గు కిరణ్, అగ్గు స్వామి, చిట్యాల ప్రశాంత్, సూరిమిల్ల కార్తీక్, చాతరాజు శరత్చంద్ర, మాచర్ల సాయి, కోట ఉదయ్రాజ్లను అరెస్టు చేశామన్నా రు. మంచిర్యాల మారుతినగర్‌కు చెందిన దేవేందర్ పరా రీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.40 లక్షలు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడి ంచారు. అనంతరం నిందితులతో ప్రతిజ్ఞ చేయించారు. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండి, తమ విలువైన భవిష్యత్‌ను కాపాడుకోవాలని డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్ సూచించారు. క్రికెట్ బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా కొనసాగుతోందని, ఎలాంటి సమాచారం అందినా ఆకస్మిక దాడులు నిర్వహిస్తామన్నారు. బెట్టింగ్‌లో పాల్గొంటే కేసులు నమోదు చేయడంతో పాటు, పలుమార్లు ఇదే వ్యవహారంలో దొరికితే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ గణేష్, సీఐలు రమణబాబు, వెంకటేశ్వర్, వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం సీఐ బి.స్వామి, ఎస్బీ సీఐ టి.నారాయణ పాల్గొన్నారు. -
భర్త వేధింపులు, యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్‌లోని రాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. త్రినయని, అక్షయ్ దంపతులు రాంపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ జంట పెద్దలను ఎదిరించి ఏడు నెలల క్రితమే ప్రేమ విహహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా త్రినయని భర్త అక్షయ్ వేధింపులకు గురవుతోంది. దీంతో భర్త వేధింపులు తాళలేక త్రినయని సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆప్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అక్షయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్‌లో వివాహిత బలవన్మరణం
-
హైదరాబాద్‌లో వివాహిత బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. గోపన్ పల్లిలో ఓ వివాహిత ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త సంతోష్, అత్తామామల వేధింపుల వల్లే స్రవంతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్వేర్ ఉద్యోగి కంకణాల సంతోష్‌కు 2017 అక్టోబర్‌లో స్రవంతితో వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం గోపన్ పల్లి ముప్పా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నారు. పెళ్లైయినా ఏడాదిలోపే తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 ఆగస్టులో ఈ కేసు నమోదైంది.(వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!) అప్పటి నుంచి కూడా భార్యభర్తల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి సైతం భర్త, అత్తమామలతో స్రవంతికి గొడవ జరిగినట్టు సమచారం. ఆ తర్వాత స్రవంతి ఒంటికి నిప్పంటించుకుని బలవనర్మణం చెందినట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు అక్కడికి చేరకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. స్రవంతి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.(లగ్నపత్రిక రాయించేందుకు వెళ్తూ..) -
అందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది?: లావణ్య
-
‘పెళ్లాం ఉండగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నావు’
సాక్షి, హైదరాబాద్ : భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్యకు పాల్పడటం పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆత్మహత్యకు ముందు లావణ్య రికార్డు చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో లావణ్య చెప్పుకున్న బాధలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ప్రేమ పేరుతో తన భర్త వెంకటేశ్ ఏ విధంగా మోసం చేశాడో లావణ్య ఈ వీడియోలో వివరించారు. అయినా అతడి మీద ప్రేమ చావలేదని కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు తనను ఎంతో ప్రేమించారని.. కానీ వాళ్లను మోసం చేసి ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నందుకు క్షమించాలని కోరారు. (లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం) ‘ప్రేమించానని వెంటపడ్డావు. నా కోసం ఏదైనా చేస్తానని చెప్పావు. నీ మీద నమ్మకంతో తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైన తర్వాత నీ నిజస్వరూపం తెలిసింది. బయటకు ఎన్నో నీతులు చెప్తావు.. కానీ నీకు అసలు వ్యక్తిత్వం ఉందా?. నేను గర్భిణిగా ఉన్నప్పుడు.. నువ్వు మరోకరితో సంబంధం పెట్టుకున్నావు అని తెలిసింది. నా ముందే వాళ్లతో వీడియో కాలింగ్‌లో మట్లాడేవాడిని. అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు తప్పని చెప్పినందుకు నాపై దాడి చేశావు. అనేక సార్లు నీ ఇష్టం వచ్చినట్టు కొట్టావు. హింసించావు. ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకుంది. నీ గురించి తెలిసిన రోజే నిన్ను వదిలేసి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకపోవడం నేను చేసిన తప్పు. నీకు, నీ కుటుంబానికి బంధుత్వాల గురించి తెలియవు. కుక్కలకైనా తిన్న విశ్వాసం ఉంటుంది.. మీ కుటుంబానికి అది కూడా లేదు. తప్పు చేస్తుంటే నీ తండ్రే నీకు మద్దతుగా నిలుస్తున్నాడు. పెళ్లాం.. ఉండగానే శిరీష అనే అమ్మాయితో తిరుగుతున్నావు. ఇలా ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశం చేస్తావు. నేను ఇక ఉండను కాబట్టి.. కనీసం ఆమెను అయినా పెళ్లి చేసుకో. మరోక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. నీ ముఖానికి ఉన్న మాస్క్ తీసేయ్. (ఇక భరించలేను.. ఉండలేను! ) ఎన్నో ఆశలతో నీతో భవిష్యత్తును ఊహించుకున్నాను. పెళ్లి తర్వాత నీ విశ్వరూపం తెలిసింది. నేను సంపాందించి అంతా నీ పేరున వేసుకున్నావు. నీకు ఉద్యోగం లేకపోయినా ఏళ్ల తరబడి పోషించాను. నీకు ఉద్యోగం వచ్చాక హింసించడం మొదలు పెట్టావు. కావాలంటే నా పే స్లిప్‌లు చూడండి. నేను సంపాదించింది ఎంతో తెలుస్తోంది. డాడీ వీడి వద్ద 48 లక్షలు తీసుకోండి.. ఒక అబ్బాయిని దత్తతు తీసుకుని మంచిగా పెంచండి. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.. ఎంతో ఇచ్చారు.. కానీ దాని మోసం చేసి వెళ్లిపోతున్నాను. మీ అందరు అంటే నాకు చాలా ఇష్టం.. ఈ వెధవ అన్న నాకు చాలా ఇష్టం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని లావణ్య తెలిపారు. మరోవైపు లావణ్య ఆత్మహత్య కేసులో శంషాబాద్ పోలీసులు ఇప్పటికే ఆమె భర్త, అత్తమామలు, ఇద్దరు ఆడపడుచుల్ని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. -
భార్య అందంగా ఉందని ఈర్ష్యతో..
కర్ణాటక, బొమ్మనహళ్లి: భార్య అందంగా లేదని వేధించేవారు కొందరైతే, అందంగా ఉందని ఈర్ష్యతో పీడించే కుత్సిత భర్తలకూ ఈ సమాజంలో కొదవ లేదు. వివాహిత ఇంట్లో అనుమానాస్పద మృతి చెందిన సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకాలో ఉన్న సర్జాపుర సమీపంలోని మాదప్పన హళ్ళి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సర్జాపుర పోలీసులు తెలిపిన ప్రకారం. మాదప్పనహళ్ళి గ్రామానికి చెందిన సుబ్రమణి భార్య జయశ్రీ (26) మృతురాలు. వివక్ష చూపుతూ వేధింపులు మాదప్పనహళ్ళికి చెందిన సుబ్రమణి రెండు సంవత్సరాల కిందట హొసకోటె ప్రాంతానికి చెందిన జయశ్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ఆందంగా ఉండటం భర్తకు నచ్చేది కాదు. ఆమె ముందు తాను తక్కువస్థాయిలో ఉన్నట్లు ఆత్మన్యూనత చెందేవాడు. దీంతో సూటిపోటి మాటలతో వేధించసాగాడు. నీవు చాలా అందంగా ఉన్నావు, నా వెంట బయటకి రావొద్దు, నేను సినిమా తీయాలనుకుంటున్నా. నీ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకునిరా అని పీడించేవాడు. గుడికి వెళ్లినా తాను ఒక లైన్‌లోవెళ్ళి భార్యను మరో లైన్‌లోవెళ్ళాలని హెచ్చరించేవాడు. ఇంట్లో ముస్తాబు అయినా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించేవాడు. తల్లిదండ్రులకు జయశ్రీ మొర దాంతో అనుమానం భర్త వేదింఫులను తట్టుకోలేక జయశ్రీ తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు వచ్చిపంచాయతీ పెట్టి నచ్చచెప్పారు. కానీ అతనిలో మాత్రం మార్పు రాలేదు. పుట్టింటి నుంచి వరకట్నం తీసుకుని రావాలని నిత్యం వేధించేవాడు. దాంతో శనివారం సాయంత్రం జయశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇక్కడ ఉండలేనని, తీసుకునిపోవాలని మొరపెట్టుకుంది. మేం ఒకటి రెండురోజుల్లో వస్తాం అని నచ్చజెప్పారు. ఈ పరిణామాలతో తీవ్ర విరక్తి చెందిన ఆమె ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్లు స్థితిలో శవమై తేలింది. సర్జాపుర పోలీసులు పరిశీలించిజరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. జయశ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తెని భర్త సుబ్రమణి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. -
నడివీధిలో భర్తపై భార్య దాడి
కర్ణాటక, యశవంతపుర: కుటుంబ కలహాలతో భర్త ను భార్య నడివీధిలో చితకబాదిన ఘటన బెంగళూరులో జరిగింది. బాణసవాడి మారుతీసేవనగరకు చెందిన వినోద్, దివ్యలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా దివ్య తల్లితో కలిసి ఉంటోంది. అయితే దివ్యను ఏదోవంకతో వినోద్ కుటుంబ సభ్యులు గొడవలు పడేవారు. ఇదిలా ఉంటే ఈనెల 9న దివ్య తనకు బంధువైన కానిస్టేబుల్‌ను తీసుకుని వినోద్ పిలిపించి నడి వీధిలో చితకబాదింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు. -
ముగ్గురు ఆడపిల్లలను కనడమే నేరమైంది..
బొమ్మలసత్రం: ముగ్గురు ఆడపిల్లలకు జన్మనివ్వటమే ఆమె పాలిట శాపమైంది.. మూడు రోజులుగా ఆమెకు అన్నం, నీళ్లు ఇవ్వకుండా భర్త గృహ నిర్బంధంలో ఉంచాడు. చివరికి బంధువుల రాకతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలుకు చెందిన మీసమ్మకు, బేతంచర్ల మండలం సిమెంట్‌నగర్‌కు చెందిన సుధాకర్‌తో 18 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురూ ఆడపిల్లలు పుట్టడంతో భార్యను భర్త వేధింపసాగాడు. పదేళ్ల కిందట సుధాకర్.. భార్య, పిల్లలతో కాపురాన్ని నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రానికి మార్చి ఓ టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. పిల్లలకు, తనకు మాత్రమే భోజనం వండుకుని భార్యను పస్తులుంచేవాడు. విషయం తెలుసుకున్న మీసమ్మ తండ్రి.. సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో ఆమెను పనిలో పెట్టాడు. మీసమ్మ కూడా తన అన్నం తానే వండుకు తినేది. ఈ క్రమంలో మీసమ్మ మానసిక పరిస్థితి దెబ్బతింది. ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని ఆమె తల్లిదండ్రులను వేధించసాగాడు. మంగళవారం భార్యను ఇంట్లో నిర్బంధించి పిల్లలను బడికి పంపి తానూ టైలర్‌షాప్‌నకు వెళ్లిపోయాడు. మీసమ్మ గట్టిగా కేకలు వేసినా తలుపులు తీయకుండా అలాగే ఉంచాడు. గురువారం మీసమ్మ బంధువులు ఇంటికి రావడంతో విషయం వెలుగులోకొచ్చింది. కూడూనీళ్లూ లేకుండా పడి ఉన్న మీసమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భర్త వేధింపులు: వివాహిత ఆత్మహత్య
-
ప్రిన్సీతో వివాహేతర సంబంధం..
గచ్చిబౌలి: భర్త వేధింపులు తాళలేక ఓ టీవీ నటుడి భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో మంగళవారంచోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన లక్ష్మణ్, తిరుమల దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో పెద్ద కుమార్తె భారతి(34) బీటెక్ పూర్తి చేసి, లండన్‌లో ఎంబీఏ చేసింది. అనంతరం అక్కడే మూడేళ్ల పాటు ఉద్యోగం చేసింది.ఈ సందర్భంగా ఫేస్బుక్లో టీవీ సీరియల్ నటుడు మధు ప్రకాశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఒప్పించి 2015లో పెళ్లి చేసుకుంది. అయితే గత ఏడాదిగా మరో టీవీ సీరియల్ నటితో పరిచయం పెంచుకున్న మధు భార్యను తరచూ వేధించడమేగాక సదరు యువతితో భార్యను తిట్టించేవాడు. ఓ సారి ఆమెను ఇంటికి తీసుకు రావడంతో భారతి ప్రశ్నించగా ఆమె భారతిని కొట్టిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్లిన మధుప్రకాష్ ఇంటికి రాకుండా అటు నుంచే ఆమె ఇంటికి వెళ్లి పోయాడు. మధ్యాహ్నం భర్తకు వీడియో కాల్ చేసిన భారతి తాను చనిపోతున్నాని ఫ్యాన్‌కు వేలాడుతున్న చున్నీని చూపించినా అతను పట్టించుకోలేదు. రాత్రి 7.30 గంటలకు ఇంటికి వచ్చిన మధు ప్రకాష్ తలుపు కొట్టగా స్పందించకపోవడంతో మాస్టర్ కీతో తలుపులు తెరచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పెద్దగా పట్టించుకోలేదని మధు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో కాల్ చేసినప్పుడు ఇంట్లోనే మరో గదిలో ఉన్న మామ వెంకటేశ్వర్లు, అత్త లక్ష్మీలను అప్రమత్తం చేసినా పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ఖరగ్‌పూర్‌లో ఉంటున్న మధు ప్రకాష్ కుటుంబం టీవీ సీరియల్స్‌లో అవకాశం రావడంతో కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ రూ. 15 లక్షల నగదు, 30 తులాల బంగారు కట్న కానుకలుగా ఇచ్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీవీ సీరీయల్‌లో నటించే ప్రిన్సీ అనే యువతితో పరిచయం ఏర్పడినప్పటి నుంచి మధు ప్రకాష్, భారతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందరూ ఉన్నా ఒంటరే... భర్తే తన ప్రపంచం అనుకున్న భారతి తన గదిలోని గోడలకు అతని ఫొటోలు అంటించి ప్రేమను చాటుకుంది. భర్త, అత్త, మామలతో కలిసి ఉంటున్నా, భర్తతో మనస్పర్థలు, అత్త, మామలతోనూ ఎడ మొహం పెడ మొహంగా ఉండటంతో ఆమె బెడ్ రూమ్‌కే పరిమితమైంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కార్వీలో పని చేసే భారతి ఎక్కువగా బెడ్ రూమ్‌లోనే ఉండేదని తల్లిదండ్రులు తెలిపారు. తన వంట తానే చేసుకునేదని, ఆమె చేసిన వంటను అత్తామామలు తినేవారు కారని భారతి తల్లి తిరుమల పేర్కొన్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మధుప్రకాష్, తండ్రి వెంకటేశ్వర్లు,తల్లి లక్ష్మీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నరకం చూపించారు టీవీ సీరియల్ నటి ప్రిన్సీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ మధు ప్రకాష్ నరకం చూపించడంతో భరించలేక తన కుమార్తె భారతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి తిరుమల పేర్కొన్నారు. ఏడాదిగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, కుమారుడికి బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులు కోడలిని వేధించారని ఆమె ఆరోపించారు. విడాకుల కోసం ఒత్తిడి తేవడంతో మనస్తాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందన్నారు. -
కుటుంబ కలహాలతో..
తొర్రూరు: కుటుంబ కలహాలు వివాహిత, ఏడాది వయసున్న కుమారున్ని బలి తీసుకున్నాయి. తరుచూ జరుగుతున్న గొడవలతో విరక్తి చెందిన ఓ వివాహిత కుమారుని గొంతు నులిమి ఆపై తాను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది. ఈ విషాద ఘటన మండల పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం..మండలంలోని గుర్తూరు గ్రామంలో చెట్టబోయిన సంధ్య(26), భర్త అశోక్ నివాసం ఉంటున్నారు. అశోక్ ఆటో నడపగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి 13 నెలల బాబు రిత్విక్ ఉన్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అత్త వెంకటమ్మ, భర్తతో గొడవలు అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గొడవల నేపథ్యంలో నెల రోజులుగా అమ్మగారి ఊరైన పెద్దవంగర మండలం పోచంపల్లికి సంధ్య వెళ్లింది. ఈ నెల 7న అశోక్ అత్తగారింటి వెళ్లి ఇకపై ఎలాంటి గొడవలు ఉండవని పెద్దమనుషుల సమక్షంలో నచ్చజెప్పి భార్యను కాపురానికి తీసుకొచ్చాడు. కుమారున్ని చంపి.. ఉరి వేసుకుని.. వేకువజామున లేచి కల్లాపి చల్లి కుమారున్ని నిద్ర నుంచి లేపింది. భర్త అశోక్ ఉదయాన్నే లేచి అల్పాహారం తీసుకొచ్చేందుకు రోడ్డుకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన సం«ధ్య ఎవరూ లేని వేళ తలుపులు బిగించి ఆడుకుంటున్న బిడ్డను గొంతునులిమి కడతేర్చి, ఆపై తాను అదే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. భర్త వచ్చి తలుపు కొట్టగా ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి చూడగా కుమారుడు, భార్య విగతజీవులుగా కనిపించారు. దీంతో భర్త ఒక్కసారిగా బోరుమన్నాడు. అత్తకు దూరంగా వేరు కాపురం ఉందామని భర్తతో ఎన్నిమార్లు చెప్పినా వినకపోవడంతోనే సంధ్య ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మదన్‌లాల్, సీఐ చేరాలు, ఎస్సై నగేష్‌లు పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల్లీకొడుకు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మొన్న శ్రీలత,నేడు లావణ్య
-
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
విశాఖపట్నం, మాడుగుల: వివాహమై తరువాత నాలుగేళ్ల వరకు కాపురం బాగా సాగింది. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం సాగుతుందని ఆశపడిన ఆమె తరువాత నకరాన్ని చవిచూసింది. పిల్లలు పుట్టాక భర్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. తట్టుకోలేక పోయింది. పిల్లత్తో సహా నాలుగేళ్లు పుట్టింటిలో ఉండిపోయింది. కాపురం నిలబెట్టుకోవాలని తల్లిదండ్రులు, పెద్దలు నచ్చజెప్పడంతో అమ్మగారి ఊరైన తుని నుంచి మాడుగుల వచ్చింది. కానీ భర్త వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో భరించలేక చావే శరణ్యమని భావించి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ తారకేశవరావు, గ్రామస్తులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2002 సంత్సరంలో తునికి చెందిన నూకరత్నానికి స్థానిక కొబ్బరితోట వీధికి చెందిన కొండబాబుతో వివాహం జరిగింది. కొండబాబు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగిన నాలుగేళ్ల తరువాత అదనపు కట్నం తేవాలని నూకరత్నం(32)ను వేధించడం ప్రారంభించాడు. భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. పంచాయతీ పెద్దలు సర్దిచెప్పడంతో ఆమె మళ్లీ భర్త వద్దకు వచ్చింది. అయితే భర్త తీరులో మార్పు రాలేదు. రోజూలాగే శనివారం కూడా నూకరత్నంతో కొండబాబు గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె... అందరూ నిద్రపోయాక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ తెలిపారు. నూకరత్నానికి ఇద్దరు ఆడపిల్లలుపుట్టారు. ఓ పాప ఏడాది కిందట మృతి చెందింది. మరో పాప ప్రస్తుతం ఆర్సీఎం హైస్కూల్లో 8 వ తరగతి చదువుతోంది.తల్లి మృతదేహం వద్ద ఆ బాలిక రోదిస్తున్న తీరుచూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. మృతిరాలి సోదరుడు ప్రగడ అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
భర్త అనుమానం..భార్య బలవన్మరణం
వేల్పూర్ : అనుమానపు భర్త ఆడగాలు తాళలేక ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వేల్పూర్ ఎస్సై శ్రీధర్‌గౌడ్ కథనం మేరకు.. వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామానికి చెందిన బోనాల స్వరూప (34), గంగాధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు రాంప్రసాద్ (4), కృతిక్ (1) ఉన్నారు. అయితే, భర్త తరచూ స్వరూపను అనుమానిస్తుండే వాడు. దీంతో తీవ్ర మనసాప్తం చెందిన ఆమె ఈ నెల 12న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మహిళా ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
బన్సీలాల్‌పేట్: భర్త వేధింపులు తాళలేక ఓ ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కవాడీగూడలో ఉంటున్న లత(23) పీఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త లక్ష్మీ నరసింహ సింగరేణి కాలరీస్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం తన గదిలోకి వెళ్లి కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల . సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకునకన గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తనవెంట ఇంటికి రాలేదని...
గోల్కొండ: తనవెంట ఇంటికి రావడంలేదని భార్యతో గొడవపడిన భర్త ఆమెపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన బుధవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండకు చెందిన రూబీనా, రియాజ్ భార్యాభర్తలు. కాగా పెళ్లైన తర్వాత రియాజ్ జులాయిగా తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. భర్త ప్రవర్తనకు విసిగిపోయిన రూబీనా వారం రోజుల క్రితం గోల్కొండలోని పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం మధ్యాహ్నం అత్తింటికి వచ్చిన రియాజ్.. భార్యను తనతో ఇంటికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించింది. కోపోద్రిక్తుడైన రియాజ్ తనవెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు రూబీనా మెడ, చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. విషయం పోలీసుకు చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొదటి రాత్రే భార్యకు వేధింపులు..
కర్ణాటక, బనశంకరి : తల్లిదండ్రుల బలవంతం మీద వివాహం చేసుకున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ ఓ అనుమానపు భర్త పెళ్లయిన మొదటి రోజే భార్యను వేధించిన ఘటన బసవనగుడి పోలీస్‌స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... ఆరునెలల క్రితం నగరానికి చెందిన యువతితో వివేక్ రాజగోపాల్‌కు వివాహమైంది. వివేక్ రాజగోపాల్ వివాహమైన మొదటి రాత్రిలోనే భార్య ప్రవర్తన పట్ల అనుమానం మొదలైంది. అంతేగాక మా తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక నిన్ను వివాహం చేసుకున్నానని, తనను వదిలి పెట్టి వెళ్లి పోవాలని భార్యతో తెలిపాడు. వివేక్ భార్యను ఉద్యోగానికి పంపించి తనకు వచ్చిన జీతం డబ్బు ఇవ్వాలని వేధించడంతో పాటు తనతో అసభ్యంగా మాట్లాడే ఆడియో, బెడ్రూమ్ వీడియోతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు తెలిపింది. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఆడియో, వీడియో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. తన భర్తకు ఉన్న డబ్బు వ్యామోహానికి తీవ్రమనస్థాపం చెందిన గృహిణి పుట్టింటికి వెళ్లిన అనంతరం ఘటన పట్ల బనవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనుమాన పిశాచి : పెళ్లైన మొదటిరాత్రే తన భర్త తనపై అనుమానంతో తన మొబైల్‌ఫోన్‌లోని కాల్స్, మెసేజ్‌లను పరిశీలించాడని, ఆ తరువాత ప్రతి రోజు అనుమానించడం మొదలుపెట్టినట్లు బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. తన భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చినట్లు తెలిపింది. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
చేతిలో చిల్లిగవ్వ లేదు తిండి లేదు.. న్యాయం కోసం ధర్నా
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. కొన్నేళ్ల తర్వాత భర్త మరో మహిళ మోజులో పడి భార్యను వదిలేశాడు. పిల్లలను తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లడంతో దిక్కుతోచని బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగిన సంఘటన మధురానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెందిన తోట లక్ష్మి, కృష్ణశంకర్ 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన లక్ష్మి, కృష్ణ శంకర్ దంపతులు మధురానగర్‌లోని సీ 83బ్లాక్‌లోని దివ్య రెసిడెన్సీలో అద్దెకు ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం శంకర్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిన లక్ష్మి భర్తతో గొడవకు దిగింది. గత జనవరిలో ఎర్రుపాలెంలో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణశంకర్ తన ఇంటికి తాళం వేసుకొని పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. తన పిల్లలను అపహరించాడని ఆమె ఎస్సార్‌నగర్‌లో ఫిర్యాదు చేయగా, తమ పరిధి కాదని, మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాలని వారు సూచించడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. చేతిలో చిల్లిగవ్వ లేదు... చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. బట్టలు కూడా లేవు. తాళం పగలగొట్టి లోపలికి వెళదామంటే ఇరుగుపొరుగు అడ్డుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నాకు న్యాయం చేయాలి. - బాధితురాలు లక్ష్మి -
వేధింపులకు తాళలేక బలవన్మరణం
పెద్దేముల్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పెద్దేముల్ ఎస్ఐ సురేశ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. మంబాపూర్ గ్రామానికి చెందిన చాకలి మంజుల (31), శ్రీనివాస్ దంపతులు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రోజు భర్త శ్రీనివాస్ మద్యం సేవించి భార్య మంజులను వేధిస్తుండేవాడు. ఆదివారం కూడా భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన మంజుల అర్ధరాత్రి ఇంట్లో దులానికి కట్టుకున్న చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు మంజుల కోసం చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని కిందకుదించి పోస్ట్‌మార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి పాండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులతోనే తన కూతురు మంజుల ఆత్మహత్య చేసుకుందని పాండయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలికి కుమారులు అభిషేక్, విష్ణువర్దన్ ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం, నర్సీపట్నం: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణానికి చెందిన దుర్గాప్రసాద్ ఇదే గ్రామానికి చెందిన వసుంధర అనే యువతి ఏడేళ్లుగా ప్రేమించుకుని, ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వీరిద్దురూ పట్టణంలోనే వేరుగా కాపురం ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో దుర్గా ప్రసాద్...భార్య వసుంధరను వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక బుధవారం ఉదయం భర్త ఇంటి ముందే వసుంధర బ్లేడ్‌తో చేయికోసుకుంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో అపస్మారిక స్థితికి చేరుకుంది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘన స్థలానికి వెళ్లి వసుంధరను ఏరియా ఆస్పత్రికి తరలించారు. వసుంధర మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌తో తనకు ఆరు నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపింది. మూడు నెలల గర్భాన్ని తన భర్త తీయించేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. కట్నం తీసుకురమ్మని భర్త నిత్యం వేధిస్తున్నానడని తెలిపింది. గర్భం పోవడంతో పాటు భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేశానని తెలిపింది. తనను వేధిస్తున్న భర్త దుర్గాప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. తన భర్తపై గతంలో ఫిర్యాదు చేశానని అయినా పోలీసులు పట్టించుకోలేదని వసుంధర తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ సింహాద్రినాయుడు తెలిపారు. -
‘మోజు తీరాకా నేనెవరో తెలీదంటున్నాడు’
సాక్షి, హైదరాబాద్: ప్రేమించి వివాహం చేసుకొని ఇప్పుడు వరకట్నం కోసం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ప్రేమావతిపేటకు చెందిన వికలాంగురాలు లిల్లీకుమారి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుద్వేల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లిల్లీకుమారి మాట్లాడుతూ.. ‘ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ బేస్‌పై కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నా, అదే కార్యాలయంలో సీహెచ్ శ్రీధర్ సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మా ఇద్దరికి 2010లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహం నుంచి ప్రేమ వరకు దారి తీసింది. 2014వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన శంషాబాద్ మండలం సాతంరాయి వద్ద గల రామాలయం గుడిలో శ్రీధర్ నన్ను వివాహం చేసుకున్నాడు. అనంతరం బుద్వేల్‌తో పాటు రాజేంద్రనగర్, శివరాంపల్లిలలోని అద్దె గృహాల్లో కాపురం చేశాం. 18 నెలల పాటు తమ దాంపత్య జీవితం సాఫీగా సాగింది. అనంతరం శ్రీధర్ తల్లి సరోజ, తమ్ముడు డాక్టర్ రాజ్‌కుమార్, చెల్లెలు సునీత వచ్చి మా కాపురంలో చిచ్చుపెట్టారు’ అని లిల్లీకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రకాలుగా వేధించారని, అదనపు కట్నం కోసం వేధించడంతో రూ. 7 లక్షల నగదు, ఆరు తులాల బంగారం, ద్విచక్ర వాహనాన్ని అందించామన్నారు. అయినా కట్నం కోసం వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో రాజేంద్రనగర్ పోలీసులు కేసు పెట్టడంతో రాజీకి వచ్చి సరిగ్గా చూసుకుంటానని పెద్దలు, పోలీసుల సమక్షంలో తెలపడంతో కాపురానికి వెళ్లినట్లు తెలిపారు. ఇదే సమయంలో రూ.35 లక్షల రూపాయల కట్నంతో మరో వివాహం చేసుకునేందుకు తన భర్త శ్రీధర్ సిద్ధమయ్యాడని, ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి వేరొక వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వికలాంగురాలినైన తనను పెళ్లి చేసుకొని మోజు తీరిన అనంతరం నీవు ఎవరో నాకు తెలియదని చెబుతున్నాడని వాపోయింది. ఈ విషయంలో పోలీసులు స్పందించి న్యాయం చేయాలని లేకపోతే తనకు ఆత్మహత్యే శరణమని వెల్లడించారు. ఈ విషయమై శ్రీధర్‌ను వివరణ కోరేందుకు వెళ్లగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
భర్త మరో యువతితో వెళ్లిపోయాడని..
చిత్తూరు,రొంపిచెర్ల: తన భర్త మరొక యువతిని తీసుకుని పది రోజుల క్రితం పరారయిపోయాడని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె సోమవారం విలేకరుల ఎదుట తన గోడు వెల్లబోసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. కె.వి.పల్లె మండలం తువ్వపల్లె కొత్తపల్లెకు చెందిన క్రిష్ణయ్య కుమారై సుమతిని రొంపిచెర్ల పంచాయతీ వారణాసివారిపల్లెకు చెందిన శ్రీనివాసులుకు ఇచ్చి 2012 నవంబరులో పెద్దలు పెళ్లి చేశారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం సుమతి ఆరు నెలల గర్భవతి. అదనపు కట్నం తీసుకురావాలని శ్రీనివాసులు తల్లి వేధిస్తుండడంతో సుమతి పుట్టింటి నుంచి రూ.35 వేలు తెచ్చి ఇచ్చింది. ఈ క్రమంలో శ్రీనివాసులు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని సుమతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. కొడుకును చూసుకుంటూ ఆమె మౌనంగా భరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు పది రోజల క్రితం తన ప్రియురాలిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. దీనిపై బాధితురాలు ఈ నెల 23వ తేదీన రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో విలేకరులను ఆశ్రయించింది. తన భర్త ఎక్కడ ఉన్నాడో అత్త, మరిదికి తెలిసినా చెప్పడం లేదని వాపోయింది. ఇప్పుటికైనా పోలీసు ఉన్నతా«ధికారులు తనకు న్యాయం చేయాలని కోరింది. -
ఎట్టకేలకు దిగొచ్చిన భర్త
తూర్పుగోదావరి , కడియం: స్థానిక బండారు వారి వీధికి చెందిన అనసూరి ప్రవీణ్‌కుమార్ తనకు అన్యాయం చేస్తున్నాడని, అతడి ఇంటిముందే భార్య శ్రీపద్మ చేపట్టిన దీక్షకు భర్త దిగొచ్చాడు. శ్రీపద్మ దీక్ష విషయం ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న అతడు బుధవారం అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నాడు. దీంతో స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం.సురేష్, షీ టీమ్ సభ్యులు ఇరువర్గాలతో మాట్లాడారు. ప్రవీణ్‌కుమార్ ఆచూకీ తెలిసిన నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో కేసు నమోదై ఉన్నందున వీరిద్దరినీ అక్కడికి పంపించారు. కేసు పెట్టినా స్పందించని పోలీసులు మీడియా రంగప్రవేశంతో కదిలారని గార్డ్స్ఫర్ ఆర్టీఐ అధ్యక్షులు రాయవరపు సత్యభామ, ముత్యాల పోసికుమార్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వేధింపుల్లో భాగంగా భార్య చేత భర్త తన మూత్రం, వీర్యం తాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి∙ఆమె భర్త రాజమహేంద్రవరానికి చెందిన కోటిపల్లి దేవి రమణకుమార్, మామ సుబ్బారావులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన సీఐ వెల్లడించిన వివరాలిలా.. అమలాపురం సూర్య బలిజవీధికి చెందిన సౌజన్యకు, రాజమహేంద్రవరానికి చెందిన కోటిపల్లి దేవీ రమణకుమార్‌కు 2014లో వివాహమైంది. ఆ సమయంలో రూ.ఆరు లక్షలు కట్నంగా ఇచ్చారు. మరో రూ.ఐదు లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నారని సౌజన్య ఫిర్యాదు చేసింది. తనను ఎంత దారుణంగా భర్త వేధిస్తున్నాడో ఆమె తన ఫిర్యాదులో వివరించిందని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేసినప్పుడు దారుణమైన వేధింపులకు దిగినట్టు తేలిందని సీఐ వివరించారు. అంతేకాకుండా సౌజన్య మేనత్త పేరున ఆస్తిని తన పేరున రాయించాలని కూడా వేధిస్తూ చంపుతానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో భర్త దేవి రమణకుమార్, మామ సుబ్బారావులను గురువారం రాత్రి అరెస్ట్ చేశామన్నారు. కేసులో అత్త ధనలక్ష్మిని అరెస్ట్ చేయాల్సి ఉండగా, ఆమె పరారీలో ఉందని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. మరో వివాహిత పోలీసుల వద్దకు.. భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ అమలాపురం పట్టణం నల్లవంతెన ప్రాంతానికి చెందిన కొల్లాటి రాజేశ్వరి పట్టణ పోలీసుకు ఫిర్యాదు చేసింది. అమలాపురానికి చెందిన తనకు, ముమ్మిడివరానికి చెందిన కొల్లాటి రాజేష్‌తో 2007అక్టోబర్ 28న పెద్దల సమక్షంలో వివాహమైందని, భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం వల్ల అక్కడే కాపురం ఉంటున్నామని, తమతో పాటు మామ బాబూరావు, అత్త అమరావతి కూడా ఉంటున్నారని తెలిపింది. తమ ఇంటికి సమీపంలోనే ఆడపడుచు దేవి, ఆమె భర్త పున్నారావు కుటుంబం ఉంటోందని, పెళ్లి సమయంలో రూ.ఆరు లక్షల నగదు, 20 కాపుల బంగారు నగలు కట్నంగా ఇవ్వగా, అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నారని సీఐ రామకోటేశ్వరరావుకు ఫిర్యాదు చేసింది. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
నువ్ అందంగా లేవు.. నీ చెల్లితో పెళ్లి చెయ్..!!
ఆదోని టౌన్: అందంగా లేవని భర్త నిత్యం వేధిస్తుండటంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం కోసిగిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. కోసిగికి చెందిన లక్ష్మి, కిష్టప్ప దంపతుల కూతురు లింగమ్మను ఏడు నెలల క్రితం పల్లెపాడు గ్రామానికి చెందిన మల్లేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన కొంతకాలానికే అందంగా లేవని, నీ చెల్లిని తనకు ఇచ్చి వివాహం చేసేలా తల్లిదండ్రులను ఒప్పించాలని, లేకపోతే పుట్టింటికి వెళ్లిపోవాలని వేధించేవాడు. వేధింపులు తట్టుకోలేక దీపావళికి పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు నచ్చచెప్పి ఆదివారం అత్తగారింటికి పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే అత్తగారింటికి వెళ్లేందుకు ఇష్టంలేక శనివారమే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదోని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోసిగి పోలీసులకు సమాచారం ఇచ్చామని ఔట్‌పోస్ట్ కానిస్టేబుల్ చింతలయ్య తెలిపారు. -
బైక్‌పై వెంబడించి.. భార్యపై పెట్రోల్ పోసి
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి బంధువులతో కలిసి భార్య, మామపై పెట్రోలుపోసి నిప్పంటించాడు. పెద్దలు జరిపిన పంచాయితీ విఫలం కావడంతో తన భార్య ఆమె తండ్రితో కలిసి పుట్టింటికి జీపులో వెళ్తుండగా బైకులపై బెంబడించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముప్పాళ్ల మండలం మాదల సమీపంలో సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. గుంటూరు, ముప్పాళ్ల (సత్తెనపల్లి): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, మామపై.. అల్లుడు, అతని సమీప బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల సమీపంలో సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బెల్లంకొండకు చెందిన మస్తాన్‌బీకి నరసరావుపేటకు చెందిన మహమ్మద్ ఇలియాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. తరచూ కుటుంబ కలహాలు జరుగుతుండగా భార్యాభర్తలకు బెల్లంకొండ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరలా కుటుంబ కలహాలు నెలకొనడంతో మస్తాన్‌బీ తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఇరు కుటుంబ సభ్యులూ ఆదివారం వారితో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో మస్తాన్‌బీని తీసుకుని ఆమె తండ్రి గఫార్ నరసరావుపేట నుంచి జీపులో బెల్లంకొండకు బయలు దేరాడు. దీంతో అల్లుడు ఇలియాస్ తన బంధువులైన మరో ఐదుగురితో కలసి ద్విచక్ర వాహనాలపై వెంబడించి మాదల చప్టా వద్ద జీపును నిలిపివేసి మాట్లాడుకుందామంటూ వారిని కిందికి దింపారు. తర్వాత మస్తాన్‌బీపై పెట్రోలు చల్లి నిప్పంటించారు. -
వివాహిత వాట్సాప్ మెసేజ్‌పై కలకలం
చిత్తూరు, మదనపల్లె: భర్త వేధింపులు, అవమానాలు భరించలేక ముగ్గురు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వివాహిత పెట్టిన వాట్సాప్ మెసేజ్ మదనపల్లె పట్టణంలో ఆదివారం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని మోతీనగర్ ఉర్దూ పాఠశాల వీధికి చెందిన షబానా (35)కు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముస్తఫాతో వివాహమైంది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆఫ్రిద్(12) గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. కవల పిల్లలైన ఆరీఫ్, మునీర్ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ముస్తఫా స్థానికంగా ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను సక్రమంగా పనికి వెళ్లేవాడు కాదు. ఇంటికి సక్రమంగా వచ్చేవాడు కాదు. భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త కుటుంబ పోషణకు ఏ మాత్రం సహకరించకపోవడంతో షబానా ఇంటిలోనే చిన్నపాటి చిల్లర దుకాణాన్ని నడుపుకుంటూ బిడ్డలను పోషించుకుంటోంది. మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భర్త తనను పోషించలేని స్థితికి చేరుకోవడమే కాకుండా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, అత్త, మామ కుమారుడిని సక్రమ మార్గంలో పెట్టకపోగా అతడికే మద్దతు తెలుపుతుండడంతో గత్యంతరంలేని స్థితిలో బిడ్డలను తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆదివారం వాట్సాప్‌లో తల్లికి మెసేజ్ పెట్టింది. అనంతరం బిడ్డలను తీసుకుని అదృశ్యమైంది. వాట్సాప్ వీడియో మధ్యాహ్నానికి వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న భర్త ముస్తఫా ఇంటి వద్దకు వచ్చాడు. చుట్టుపక్కల వారు జరిగిన విషయం తెలియపరిచి ఎందుకిలా చేశావని అడిగేలోపు అక్కడి నుంచి పరారయ్యాడు. షబానా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి షబానా, బిడ్డల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తన కష్టాన్ని చుట్టుపక్కల వారికి తెలియనివ్వకుండా గుట్టుగా నెట్టుకొచ్చిన షబానా బిడ్డలతో సహా తనువు చాలిస్తానంటూ చెప్పడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అమెరికాలో నరకం చూపించాడు
నేరేడ్మెట్: మూడుముళ్ల బంధంతో ఎన్నో కలలతో జీవించడానికి ఖండాంతారాలు దాటి వెళ్లిన ఆమెకు భర్త నరకాన్ని చూపించాడు. దేశంకాని దేశంలో అండగా ఉండాల్సిన భర్త పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవాలని వేధింపులకు దిగాడు. భర్త వేధింపులతో విసుగు చెందిన ఆమె అమెరికా నుంచి భారత్‌కు వచ్చేసింది. వచ్చిన రోజుల వ్యవధిలోనే పుట్టింట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈసంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. నేరేడ్మెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని కాకతీయనగర్‌కు చెందిన గంగాదేవి, మల్దారి దంపతుల కూతురు మాధురి(27)తో 2016 నవంబర్‌లో ఇదే ప్రాంతానికి చెందిన కోటేశ్వర్‌రావుతో వివాహం జరిపించారు. పెళ్లి తరువాత భార్యాభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లారు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడికి వెళ్లిన తరువాత వీకెండ్ పార్టీల్లో పాల్గొనాలని, మద్యం తాగాలని, పేకాట ఆడటం, స్నేహితులను ఇంటికి పిలిచి..వారితో డాన్స్ చేయాలని భార్యను వేధింపులకు గురి చేశాడు. భర్త చేష్టలతో విసుగి చెందిన భార్య ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ విషయమై తల్లిదండ్రులు పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈనెల 11న మాధురి భారత్‌కు వచ్చి కాకతీయనగర్‌లోని పుట్టింట్లో ఉంటుంది. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు, మృతదేహాన్ని శవపంచనామ కోసం ఆసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య
నేరేడ్మెట్: మూడుముళ్ల బంధంతో ఎన్నో కలలతో జీవించడానికి ఖండాంతారాలు దాటి వెళ్లిన ఆమెకు భర్త నరకాన్ని చూపించాడు. దేశంకాని దేశంలో అండగా ఉండాల్సిన భర్త పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవాలని వేధింపులకు దిగాడు. భర్త వేధింపులతో విసుగు చెందిన ఆమె అమెరికా నుంచి భారత్‌కు వచ్చేసింది. వచ్చిన రోజుల వ్యవధిలోనే పుట్టింట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈసంఘటన నేరేడ్మెట్ పోలీసుస్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. నేరేడ్మెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని కాకతీయనగర్‌కు చెందిన గంగాదేవి, మల్దారి దంపతుల కూతురు మాధురి(27)తో 2016 నవంబర్‌లో ఇదే ప్రాంతానికి చెందిన కోటేశ్వర్‌రావుతో వివాహం జరిపించారు. పెళ్లి తరువాత భార్యాభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లారు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడికి వెళ్లిన తరువాత వీకెండ్ పార్టీల్లో పాల్గొనాలని, మద్యం తాగాలని, పేకాట ఆడటం, స్నేహితులను ఇంటికి పిలిచి..వారితో డాన్స్ చేయాలని భార్యను వేధింపులకు గురి చేశాడు. భర్త చేష్టలతో విసుగి చెందిన భార్య ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ విషయమై తల్లిదండ్రులు పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈనెల 11న మాధురి భారత్‌కు వచ్చి కాకతీయనగర్‌లోని పుట్టింట్లో ఉంటుంది. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు, మృతదేహాన్ని శవపంచనామ కోసం ఆసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు. -
భార్యపై భర్త వేధింపులు
వరంగల్ : ఆస్తి కోసం కట్టుకున్న వాడితో పాటు.. కన్న పిల్లలు ఏడాదిగా చిత్ర హింసలు పెడుతూ వేధిస్తున్నారు.. చివరకు వారి వేధింపులు భరించలేక న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఇంటి ఎదుట నిరసన తెలిపిన సంఘటన నగరంలోని కాశిబుగ్గలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ మార్కెట్లో అడ్తి వ్యాపారం చేస్తున్న భూతం లక్ష్మీనారాయణ, రమాదేవిలు ఓ సిటీలో కాపురం ఉంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. గత ఏడాది కాలంగా రమాదేవిని ఆస్తికోసం భర్త లక్ష్మినారాయణ, కొడుకు అనిల్, చిన్న కూతురు మధులత ముగ్గురు కలసి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆరునెలల క్రితం భర్త కర్రతో చితకబాదడంతో చేతి వేళ్లు పూర్తిగా వంకరయ్యాయి. కాశిబుగ్గ 13వ డివిజన్లోని బాపూజీ కాలనీలో తన సొంత ఇంటిలో అద్దెకు ఉంటున్న పెద్ద కూతురుకు సమాచారం అందించారు. ఆమె వెంటనే వచ్చి తల్లిని తీసుకుపోవడంతో పాటు మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమెకు ఎవరు బాసటగా లేకపోవడం వల్ల అక్కడ సైతం న్యాయం జరగలేదు. ఇంతలోనే భర్త తనకు విడాకుల నోటీసు పంపించినట్లు తెలిపింది. రెండుసార్లు కోర్టుకు తాను హాజరైనప్పటికీ భర్త లక్ష్మినారాయణ రాలేదని చెప్పింది. పెద్ద కూతురు దగ్గర ఉంటున్నప్పటికీ తరచుగా వస్తూ భౌతిక దాడులకు పాల్పడుతుండడంతో భరించలేక ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంటి ఎదుట నిరసన.. కాశిబుగ్గలోని బాపూజీకాలనీలో ఉన్న ఇంటి ఎదుట రమాదేవి గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇళ్లు తన పేరు పైనే ఉందని చెప్పారు. కిరాయికి ఇచ్చినా.. అద్దెకు ఇల్లు ఇచ్చినా తీసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని ఇంతేజార్గంజ్ ఎస్సై శ్రీని వాస్ని కలిస్తే ఎందుకమ్మ వేరే ఇంట్లో కిరాయికి ఉండమని సలహా ఇచ్చార తెలిపారు. రెడ్డిపాలెంలోని ఐదెకరాల భూ మి అమ్మితే వచ్చిన రూ.2కోట్ల నగదు వారి వద్దనే ఉందని తెలిపారు. తన కొడుకు 15 ఏళ్లుగా అమ్మా అని పిలవడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. తాను పెద్దబిడ్డ వద్ద ఉంటున్నందున తన పేర ఉన్న ఆస్తిని వారి పేరు మీదకు మార్చుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఆస్తి విషయంలో తనను వారు హత్య చేసేందుకు సైతం వెనుకంజ వేయరని రమాదేవి తెలిపారు. తనకు, తన పెద్ద కూతురుకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఇన్నేళ్లుగా రాని గర్భం ఇప్పుడెలా వచ్చింది?
గూడూరు (నెల్లూరు): ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. తోబుట్టువే చందాలు సేకరించి ఆరేళ్ల క్రితం ఆటోడ్రైవర్‌కిచ్చి వివాహం చేసింది. పెళ్లై ఐదేళ్లు గడిచినా గర్భంరాని నీకు ఇప్పుడెలా వచ్చిందంటూ నిండు గర్భిణిని కొట్టి గెంటివేసిన ఘటన గూడూరు పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎస్కే ఖాదర్‌బాషా, అనూబేగంలకు కుమార్తెలు షబ్బీరా, దిల్‌షాద్‌లతోపాటు మరో కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు గత కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. ఈ మేరకు పెద్ద కుమార్తె షబ్బీరా బంధువులు, స్నేహితుల సాయంతో ఆరేళ్ల క్రితం దిల్షాద్కు వివాహం జరిపించింది. ఈ క్రమంలో దిల్షాద్కు ఐదేళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో భర్త రఫీతోపాటు అత్తమామలైన నూర్జహాన్, మస్తాన్‌బాషాల వేధింపులు పెరిగాయి. ఈ క్రమంలో దిల్షాద్ ఆరునెలల క్రితం గర్భం దాల్చింది. కొన్ని నెలలపాటు అత్తమామలు, భర్త ఇన్నేళ్లు రాని గర్భం ఇప్పుడెలా వచ్చిందంటూ శారీరకంగా హింసించారు. బాధలు పడుతూ వచ్చిన ఆమెను 23వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. ఈ మేరకు అదే సమయంలో దిల్షాద్ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసే క్రమంలో సృహకోల్పోయి శివాలయం సమీపంలో పడిపోయింది. అదే సమయంలో బీట్ పోలీసులు గుర్తించి దిల్షాద్ను స్థానిక ఏరియా ఆస్పత్రి తరలించారు. పరీక్షలు చేయగా తల్లీబిడ్డ క్షేమమని తెలిసింది. అయితే హాస్పిటల్లో బెడ్లు ఖాళీగా లేక పోవడంతో హాస్పిటల్ బయటే నిరీక్షించాల్సి వచ్చిందని షబ్బీరా ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరికి న్యాయం చేయాలంటూ ఆమె పోలీసుల చుట్టూ తిరుగుతోంది. -
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య
జనగామ: భర్త వేధింపులను భరించలేక ఓ మహిళ.. ఇద్దరు పిల్లలతో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. అన్నయ్యలకు రాఖీ కట్టేందుకు ఇంట్లో నుంచి బయలు దేరిన ఆ తల్లి, పిల్లల శరీర భాగాలు ఛిద్రమై కనిపించాయి. ఈ సంఘటన నేపథ్యంలో తమ మధ్య గొడవలు లేవని భర్త అంటుండగా.. వరకట్నం కోసం వేధించాడని పుట్టింటి వారు ఆరోపిస్తూ, అల్లుడికి దేహశుద్ధి చేశారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి స్ట్రీట్‌లో నివాసముంటున్న మాదాసు మధుకర్, మధులతకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉదయ్ కుమార్ (08), వినయ్(4) ఉన్నారు. మధుకర్ హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదనపు కట్నం కోసం తరచుగా భార్యను వేధిస్తుండటంతో.. మధులత తన బాధను పుట్టింటి వారికి చెప్పుకుని కుమిలి పోయేది. ఇటీవల మధులత తండ్రి నర్సయ్య రూ.70 వేలు ఖర్చు చేసి కూతురుకు పుస్తెలతాడు చేయించారు. కాగా బోడుప్పల్లో నివాసముంటున్న తన సోదరుడు సతీశ్ గృహ ప్రవేశానికి వెళ్తామంటే మధుకర్ అడ్డు చెప్పడంతో..మధులత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రోజు ఉదయం 9 గంటల వేళ ఇద్దరు కుమారులను వెంట బెట్టుకుని.. అన్న వద్దకు వెళ్తున్నానని భర్తకు చెప్పి బయలు దేరింది. అయితే తన మరో సోదరుడు సురేశ్‌కు ఫోన్ చేసి.. తాను రావడం లేదని ఒకే ఒక్క మాట చెప్పి ఫోన్ కట్ చేసి..రాజీవ్‌నగర్ ప్రాంతంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది. -
ప్రేమించి పెళ్లి చేసుకుంటే భర్తే శత్రువయ్యాడు
స్త్రీలకు సమానత్వం కల్పించాలి.. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని.. దశాబ్ధాలుగా పోరాటాలు జరుగుతున్న ఫలితం లేకుండా పోతోంది. ప్రధానంగా రాజకీయ ఉన్నతిలో అడుగడునా వారికి అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రజాప్రతిధిగా ఉన్నా పురుషాధిక్యతకు తలొగ్గాల్సిందే. ఇలా పురుషాధిక్యత మాటున అణచివేతకు గురైన ధర్మవరం నియోజకర్గం ముదిగుబ్బ మేజర్ పంచాయతీ సర్పంచ్ డి.అంజలిబాయి ‘దీక్ష కథ’ ఇందుకు దర్పణం పడుతోంది. అనంతపురం అర్బన్: మొన్నటి వరకు దర్జాగా బతికిన ఆమెపై విధి భర్త రూపంలో పడగవిప్పింది. దీనికి అధికారులు తొడవడంతో పదవిలో ఉన్న ఆమెకు అవమానాలు... చీత్కారాలు .... బెదిరింపులే ఆభరణాలయ్యాయి. ప్రజాప్రతినిధిగా కనీస విలువ లేకుండా పోయింది. భర్తకు దూరంగా తన ఇద్దరి పిల్లలతో ఏకాకిలా బిక్కుబిక్కుమంటూ అనంతపురం నగరంలో జీవితం గడుపుతోంది. పిల్లల ఫీజులు కట్టలేక, వైద్యం చేయించలేకపోవడంతో పాటు కట్టుకున్నవాడు పట్టించుకోకపోవడంతో దీనావస్థలో కాలం వెళ్లదీస్తోంది. దీక్ష బాధ ఆమె మాటల్లోనే... ప్రేమించి పెళ్లిచేసుకున్నాం మాది ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మేజర్ పంచాయతీ. నేను పదో తరగతి వరకు చదువుకున్నాను. మాది ప్రేమ వివాహం. నేను ప్రేమించిన ఐ.తిరుపాల్‌తో 2002లో వివాహమైంది. ఇద్దరు సంతానం పెద్దబ్బాయి జయంత్‌నాయక్, చిన్నబ్బాయి గౌతమ్ గంభీర్నాయక్. ఏసీ బంగ్లా... ఏసీ కారు... సంసారం హాయిగా సాగిపోతూ వచ్చింది. 2013 ఎన్నికల్లో ముదిగుబ్బ మేయర్ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. దీంతో గృహిణిగా ఉన్న నేను నా ¿భర్త సూచన మేరకు ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేశాను. ఎన్నికలకు డబ్బులు అవసరమంటూ నా పేరున ఉన్న ఇంటిని నా భర్త రూ.20 లక్షలకు కుదవ పెట్టించాడు. ఎన్నికల్లో గెలుపొందాను. అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. కలెక్టర్‌కి ఫిర్యాదు చేశా నా సంతకాన్ని నా భర్త ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు లక్షల రూపాయలు డ్రా చేయడంపై కలెక్టర్ 2018, మార్చి 21న కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీపీఓ విచారణ చేయించారు. అయితే అదంతా మొక్కుబడిగా జరిగింది. ఇదేమని డీపీఓని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. నా పేరున పాలసీ తీసుకున్నాడు ప్రాణహాని భయంతో భర్త నుంచి దూరంగా ఉంటూ తరువాత నా పేరున రూ.20 లక్షలకు ఆయన పాలసీ (మాస్టర్‌ప్లాన్– 1542–0000–00) తీసుకుని ప్రీమియం చెల్లించాడు. ఎందుకు తీసుకున్నావని అడిగితే... నీవు చస్తే నాకు ఏదైనా ప్రయోజనం ఉండాలి కదా అన్నాడు. అప్పటి నుంచి నేను భయం భయంగా ఉంటున్నాను. ఎలా బతకాలో తెలియడం లేదు నాకు 14 నెలలుగా గౌరవ వేతనం నిలిపివేశారు. ఇద్దరు పిల్లలతో ఎలా బతకాలో తెలీడం లేదు. ఒకవైపు పిల్లల స్కూల్ ఫీజు కట్టేందుకూ డబ్బులు లేవు. పెద్దబ్బాయి జయంత్ నాయక్‌కు ముక్కు ఆపరేషన్ చేయించాలి. పిల్లలకు జ్వరం వచ్చి పడిపోయినా పట్టించుకోడు. డబ్బులు ఇవ్వాలని నా భర్తను అడిగితే పంచాయితీ పెడతావా నిన్నెవరూ కాపాడలేరు... నేను చెప్పినప్పుడు వచ్చి చెప్పిన చోట సంతకం చేయాలని అంటున్నాడు. కలెక్టర్ స్పందిస్తేనే న్యాయం నా కష్టాలు తీరాలంటే కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలి. సర్పంచ్‌గా నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధుల స్వాహా చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. నాకు వేతనం వచ్చేలా చూడాలి. నా ఇంటిని కుదవ నుంచి నా భర్త విడిపించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నాకు ఏదైనా ఉపాధి చూపించాలి. నా భర్తే శత్రువయ్యాడు నాకు నా భర్తే శత్రువగా మారాడు. ఆయనకు వేరొక మహిళతో చాలా ఏళ్లగా సంబంధం ఉన్న విషయం తెలిసింది. ఈ విషయంపై గొడవ జరిగింది. అప్పటి నుంచి నాకు వేధింపులు అధికమయ్యాయి. దీంతో 2017 జనవరిలో నా ఇద్దరు కుమారులతో ఆయన నుంచి దూరంగా వచ్చేసి అనంతపురం నగరంలో ఉంటున్నాను. అలా వచ్చేసినా ఆయన ఫోన్ మెజేస్‌ల ద్వారా వేధించడం మానలేదు. మరోవైపు సర్పంచ్‌గా నాకు పంచాయతీ కార్యాలయంలో విలువ లేకుండా చేశాడు. తానే సర్పంచ్‌గా వ్యవహరిస్తూన్నాడు. ఇందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారు. విలాసాలకు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. పిల్లల స్కూల్ ఫీజుకు డబ్బులు ఇవ్వడు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా డబ్బులు పంపడు. సంతకాలు ఫోర్జరీ చేస్తున్నాడు పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేశామంటూ నిధులు స్వాహాకు సిద్ధపడ్డారు. నా సంతకాన్ని నా భర్త పోర్జరీ చేసి లక్షల రూపాయలు నిధులను డ్రా చేశాడు. పంచాయతీ తీర్మానాల పత్రాల్లో నా సంతకాలను పోర్జరీ చేస్తూనే ఉన్నాడు. ఇదేమి అడిగితే నేనే సర్పంచ్‌ని... నీ సంగతి చూస్తానంటూ ఫోన్లో మెసేజ్‌లు పెడుతున్నాడు. ఆయన ఒక హత్యకేసులో నిందితునిగా ఉంటూ బెయిల్ తెచ్చుకున్నాడు. నన్ను కూడా చంపుతానని బెదిరింపులకు దిగుతున్నాడు. ఉన్నతాధికారులు, అధికార పార్టీ పెద్దలకు విషయం తెలిసినా పట్టించుకోకపోగా నా భర్తకు వత్తాసుగా నిలిచి ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఎన్నికలప్పుడు నా ఇల్లు కుదవ పెట్టి తెచ్చుకున్న రూ.20 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగితే, నాపైనే దుష్ప్రచారం ప్రారంభించాడు. పనులకు పర్సంటేజీ అడుగుతున్నానని అందరికీ చెబుతున్నాడు. -
భర్త ఇంటి ఎదుట భార్య మౌనపోరాటం
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : తన ఇద్దరు కూతుళ్లతో ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఇంట్లోకి రాకుండా తాళం వేసి ఎటో వెళ్లిపోయాడంటూ బాధితురాలు రెండు రోజులుగా ఇంటి ఎదుట మౌనపోరాటం కొనసాగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా దాసారం గ్రామానికి చెందిన జయకిషన్(63) విశ్రాంత ప్రొఫెసర్. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా బొబ్బరలంక వాసి లక్ష్మీచైతన్య(37)తో రెండో వివాహం చేసుకున్నాడు. లక్ష్మీచైతన్య మొదటి భర్త మృతి చెందగా.. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి దేవాలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకుని చిన్నగోల్కొండలో కాపురముంటున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల నుంచి జయకిషన్ చిన్న చిన్న కారణాలతో లక్ష్మీని వేధించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కూతుళ్లు తనకు పుట్టలేదని, వారి పోషణ బాధ్యత నాది కాదంటూ గొడవలకు దిగేవాడు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల కిందట తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బొబ్బరలంక వెళ్లిన లక్ష్మీ శనివారం తిరిగి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానంతో ఇంటి పరసరాలను పరిశీలిస్తుండగా.. దొడ్డి దారి నుంచి తన భర్త ఇంటి బయటకు వచ్చి పట్టించుకోకుండా వెళ్లిపోయాడని చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆమె ఇంటి బయట ఇద్దరు కూతుళ్లతో కలిసి బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, ఇద్దరు కూతుళ్లు భవిష్యతు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తుంది. తనకు రూ.10 లక్షలు ఇచ్చి వదిలించుకోవడానికి చూస్తున్నాడని, లాయర్ల ద్వారా ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు సాయంత్రం ఆమె శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తకు కౌన్సిలింగ్ కోసం ఫ్యామిలీ కోర్టుకు సిఫార్సు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. -
భర్త వేధింపులకు బలైన మహిళ
వర్గల్(గజ్వేల్) : తాగుడుకు బానిసైన భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఒంటికి నిప్పించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం సింగాయపల్లిలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నల్ల పాపయ్య, శ్రీమతి భార్యాభర్తలు. వారికి పదో తరగతి చదువుతున్న అంజలి , ఏడో తరగతి చదువుతున్న అక్షయ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పాపయ్య తాగుడుకు బానిసై భార్యపై లేనిపోని అనుమానాలు పెట్టుకుని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమీప పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తూ శ్రీమతి కాలం నెట్టుకొచ్చింది. ఈ నెల 16న ఉదయం గొడవపడి భర్త కొట్టడంతో శ్రీమతి తీవ్ర మనో వేదనకు గురైంది. కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగు పొరుగువారు 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం శ్రీమతి మృతి చెందింది. ఆమె మరణ వాంగ్మూలం ఆధారంగా ఆత్మహత్యకు పురికొల్పి, ఆమె చావుకు కారణమైన భర్త పాపయ్యపై కేసు నమోదు చేశామని ఏఎస్ఐ దేవీదాస్ తెలిపారు. కంటతడి పెట్టించిన కూతుళ్ల రోదనలు.. తండ్రి పెడుతున్న బాధలు భరించలేక తల్లి తనువు చాలించడంతో ఇరువురు కూతుళ్లు అంజలి, అక్షయ పెనువిషాదంలో కూరుకుపోయారు. ఇక మాకు దిక్కెవరు, మమ్మల్ని చూసుకునేదెవరంటూ వారు విలపిస్తున్న తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. తండ్రి కటకటాల పాలవడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మృతురాలి భర్త పాపయ్య పోలీసులకు లొంగిపోగా, అతని తల్లి అండమ్మ కోడలి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
మగపిల్లాడి కోసం..
కర్నూలు, ఆళ్లగడ్డ టౌన్: చిత్రంలో అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు దస్తగిరమ్మ. జి. జంబులదిన్నె గ్రామానికి చెందిన ఈమెకు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన పెద్దదస్తగిరితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. మగపిల్లాడికోసం ఈమె భర్త రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. విడాకుల కోసం భార్యను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి గెంటివేయడంతో ఆమె పుట్టింటికి చేరింది. దీంతో తండ్రితో కలిసి శుక్రవారం స్థానిక టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై ఎస్ఐ ప్రియతంరెడ్డి మాట్లాడుతూ..దస్తగిరి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి దస్తగిరమ్మ వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. ఇరువురికి కౌన్సెలింగ్ ఇచ్చి విభేదాలు లేకుండా కాపురం చేసుకోవాలని పంపించినట్లు చెప్పారు. -
వేధింపులు భరించలేకే హతమార్చా..
గుంటూరు: ‘వ్యసనాలకు బానిసగా మారిన నా భర్త వేధింపులు భరించలేక కడతేర్చాలని నిర్ణయించుకున్నా. నా తమ్ముడి సహకారంతో హతమార్చాను’ అని పెద్దకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేతావత్ మల్లేశ్వరి బాయ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామానికి చెందిన బాణావత్ బాయ్‌కు తన కుమారుడు మరణించాడన్న వార్త ఏప్రిల్ 13న పెదకాకాని రోడ్డు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వ్యక్తుల ద్వారా తెలిసింది. హుటాహుటిన గుంటూరు చేరుకొని కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి మెడ చుట్టూ అనుమానాస్పదంగా నల్లని చార ఉండటంతో పాత గుంటూరు పోలీసులను ఆశ్రయించి ఆమె ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అప్పగించారు. అప్పటికే మృతుడి భార్య మల్లేశ్వరి భాయ్, ఆమె తమ్ముడు తులసీరామ్‌నాయక్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సీఐ బి.శ్రీనివాసరావు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 13న మద్యం సేవించి ఉన్న తన భర్తను సెల్‌చార్జర్ వైరుతో మెడకు వేసి తన తమ్ముడి సహకారంతో హతమార్చినట్లు నిందితురాలు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా హత్య చేసినట్లు రావడంతో ఇద్దరినీ అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. సమావేశంలో డీఎస్పీ కండె శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేధింపులు తాళలేక మహిళ ..
ఖాజీపేట : అత్త ఆడబిడ్డ వేధింపులు తాళలేక ములపాక గ్రామానికి చెందిన బుజ్జి అనే మహిళ ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కమలాపురం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన బుజ్జిని ములపాక చెందిన రాంప్రసాద్ అనే యువకుడికి ఐదేళ్ల కిందట వివాహం చేశారు. ఇటీవలే ఆ అమ్మాయి పోలీసు వలంటీర్‌గా ఎంపికైంది. గత కొంతకాలంగా అత్త యశోదమ్మ తోపాటు ఆడబిడ్డ భర్తతో అనేక విభేదాలు కారణంగా తరచూ ఇంట్లో వేధింపులు జరిగేవి. దీంతో మానసికంగా బుజ్జి తీవ్ర ఆవేదన చెంది బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న బుజ్జి తల్లితండ్రులు మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే తండ్రి పూజారి ఓబులేసు తన కూతురు అత్త, ఆడబిడ్డ భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతురాలి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. -
డబ్బు ఇవ్వకపోతే చంపేస్తా
రొంపిచెర్ల: డబ్బు తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తా.. లేదంటే చంపేస్తాను అని భర్త బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని బాధితురాలు ఆదివారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రొంపిచెర్ల పంచాయతీలోని చిన్న మశీదు వీధికి చెందిన ఎస్.జాకీర్ హుసేన్ కుమారుడు గౌస్‌బాషాకు రొంపిచెర్లకు చెందిన హసీనాను ఇచ్చి 10 నెలల క్రితం వివాహం చేశారు. వీరి కాపురం కొద్ది రోజులు సజావుగా సాగింది. అనంతరం భర్త గౌస్ బాష జూదం, మద్యానికి బానిసగా మారాడు. పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.55 వేలు డబ్బు తాగుడుకు ఖర్చు చేశాడు. అలాగే బంగారు నగలను తాకట్టు పెట్టాడు. మళ్లీ రూ.30 వేలు డబ్బు తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే తన స్నేహితులతో కలిసి చంపేస్తానని భార్యను బెదిరించాడు. దీనిపై బాధితురాలు రెండు నెలల క్రితం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురికీ సర్దిచెప్పి పంపించారు. గౌస్‌బాషాలో మార్పు రాలేదు. రెండు రోజుల నుంచి తనను, నా అన్న అమీర్‌ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని హసీనా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త స్నేహితులు బడాబాబు, నయీమ్, వసీం, యూనిస్, చాను, అçఫ్జల్, నిప్పల్, మస్తాన్, తొట్టుపల్లె, చోటాబాబుతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. -
భర్తపై నటి చైత్ర ఫిర్యాదు
జయనగర: భర్త వేధింపులు తాళలేకపోతున్నానని శాండిల్‌వుడ్ నటి చైత్రా మంగళవారం బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలు..‘తనకు 2006లో లిక్కర్, రియల్టర్ బాలాజీ పోతరాజ్తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల రోజులుగా వేధింపులు తీవ్రతరమయ్యాయి. ఎక్కడికి వెళ్లినా వెంట గన్‌మన్‌ను పంపుతున్నాడు. ఈనెల 14న చిన్న విషయానికి గొడవపడి ముఖంపై దాడి చేశాడు. జుట్టుపట్టుకుని తలను గోడకేసి బాదాడు. ముక్కు, నోటి నుంచి రక్తస్రావమైనా పట్టించుకోలేదు. తనను హత్యచేయాలనే ఉద్దేశంతో గొంతుపట్టుకుని పొట్ట ఇతరభాగాలపై డాడికి పాల్పడ్డాడు. తాను స్పృహ కోల్పోగా ఇంట్లో వదిలిపెట్టి వెళ్లాడు. అమూల్య అనే యువతితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తనను ఇంటి నుంచి గెంటేసేందుకే వేధింపులకు దిగుతున్నాడు. ప్రస్తుతం పుట్టింట్లో ఆశ్రయం పొందుతున్నా. బాలాజీపోతరాజ్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’. అని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్లీజ్... ఆ కిరాతకుడి నుంచి కాపాడండి!
-
ప్లీజ్... ఆ కిరాతకుడి నుంచి కాపాడండి!
సాక్షి, ముంబై : తన భర్త పెట్టే హింసను పూస గుచ్చినట్లు వివరిస్తూ ఓ మహిళ సాయం కోరిన వీడియో వైరల్ అవుతోంది. వ్యాపారవేత్త అయిన తన భర్త.. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆ మహిళ వీడియోలో వేడుకోవటం ఉంది. తన సందేశాన్ని ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ తన ట్విటర్లో ఆ వీడియోను పోస్టు చేశారు. ‘‘నా భర్త నన్ను హింసిస్తున్నాడు. ఇది ఈ నాటిది కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతోంది. అతనో అమ్మాయిల పిచ్చోడు. జూదగాడు.. అప్పుల పాలయ్యాడు. పైగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ అవలక్షణాల మూలంగానే నేను నా కూతురితో ఆయనకు దూరంగా ఉంటున్నాం. అయినా డబ్బు కోసం నన్ను వేధిస్తూ వస్తున్నాడు. నా పేరు మీద ఉన్న ఒక్క ఫ్లాట్‌ను తన పేరు మీద రాయాలంటూ వేధిస్తున్నాడు. పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పైగా ఆ స్టేషన్ ఎస్సై నా భర్తతో కుమ్మక్కయ్యాడు. నాకు ప్రాణ హని ఉంది. దయచేసి ఎవరైనా సాయం చెయ్యండి. ఈ కిరాతకుడిని నుంచి నన్ను, నా కూతురిని కాపాడండి’’ అంటూ ఆ మహిళ దీనంగా వేడుకున్నారు. ముంబై కమిషనరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్ప్రీత్ సింగ్ అనే వ్యాపారవేత్త తన భార్య, ముగ్గురు పిల్లలతో ఖర్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య, భర్తలిద్దరికీ మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో గొడవలు జరిగి అదే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఓరోజు భార్య ఉంటున్న ఫ్లాట్‌లో దొంగతనానికి యత్నించిన గుర్ప్రీత్, మరోసారి ఏకంగా ఆమెపై దాడికి యత్నించాడు. ఈ రెండు ఘటనలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదయినా పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతను మరోసారి ఆమెపై దాడికి తెగబడటంతో ప్రాణ భయంతో ఆమె వీడియోను పోస్టు చేసి సాయం కోరారు. -
వివాహిత ఆత్మహత్య
గార : కొర్లాం పంచాయతీ కొమురవానిపేటలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ గ్రామానికి చెందిన పుక్కళ్ల్ల ధనం(26) అనే వివాహిత సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తనచీరనే కట్టుకుని ఉరివేసుకుంది. భర్త దత్తాత్రేయ సీమెన్‌గా పనిచేస్తూ రెండు నెలల కిందట విధులు ముగించుకొని సెలవులపై ఇంటికి వచ్చాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు నిఖిల్(4), లోకేష్(8నెలలు) ఉన్నారు. తల్లి మృతితో ఇద్దరు చిన్నారుల రోదన మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఒడిశా రాష్ట్రం జబల్పూర్ గ్రామానికి చెందిన మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించారు. భర్త వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లి గురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బలివాడ గణేష్ కేసు నమోదు చేశారు. -
నా భర్త సంసారానికి పనికిరాడు
-
మా ఆయన చాలా ‘తేడా’
సాక్షి, సైదాబాద్: సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని ఓ వివాహిత శనివారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన దీపికకు జహీరాబాద్‌కు చెందిన అంకుష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి మానేశారు. అయితే పెళ్లయిన నాటి నుంచి అంకుష్ తనతో సంసార జీవితం గడపలేదని, అతడిలోని లోపం బయటపడకుండా ఉండేందుకు రోజూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.30 లక్షల కట్నం, 50 తులాల బంగారం ఇచ్చామని వెల్లడించారు. తన జీవితాన్ని నాశనం చేసిన అంకుష్‌పై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త
-
మొగుడు కాదు యముడు
సాక్షి, గోపాలపురం: ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలని వేధిస్తూ కోడలిని ఇంటి నుంచి గెంటివేసిన సంఘటన గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో వెలుగు చూసింది. బాధితురాలైన ఆ ఇల్లాలికి మద్దతుగా గురువారం వెదుళ్లకుంటలో మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు మోహనకృష్ణకు ఇచ్చి 2015 మేలో వివాహం చేశారు. శ్రీదేవి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించడంతో తల్లి కనకదుర్గే పెంచింది. అప్పట్లో కట్నం కింద రూ 15 లక్షలు, 70 కాసులు బంగారం ఇచ్చారు. పెళ్లి అయిన తరువాత కొంతకాలం బెంగళూరులో కాపురం పెట్టారు. ఆ తరువాత వారికి ఓ పాప పుట్టింది. కాని 70 కాసుల బంగారం హారతి కర్పూరంలా ఖర్చు చేశాడు. పెళ్లికి ముందు మోహన్‌కృష్ణ బెంగళూరులో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, అతని పేరుమీద 23 ఎకరాల పొలం ఉందని అతని తల్లిదండ్రులు చెప్పారని, కాని విచారిస్తే ఏ ఉద్యోగం లేదని తేలిందని శ్రీదేవి వాపోయింది. తీసుకెళ్లిన నగదు, నగలు అయిపోవడంతో శ్రీదేవి పేరుమీద ఉన్న ఎకరం పొలం అమ్ముకుని రావాలంటూ భర్త, అత్తమామలు, ఆడపడుచు, మరిది వేధిస్తున్నారని తెలిపింది. దీనిపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మహిళా సంఘాలను ఆశ్రయించినట్లు తెలిపింది. కోడలు శ్రీదేవి మనుమరాలితో గోపాలపురం వచ్చిందని తెలుసుకున్న శ్రీదేవి అత్తమామలు ఇంటి నుంచి పరారైనట్లు తెలిపింది. దీంతో ఏమి చేయాలో తెలియక వెదుళ్లకుంట అత్తారింటికి వెళ్లే దారిలో ధర్నా చేపట్టింది. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి బి.నిర్మలా కిషోర్, ఆలపాటి దుర్గాభవాని, డి. భీష్మాంబ, వై జగదాంబ, ఆర్ సంధ్య, సీహెచ్ లక్ష్మి, పి.సూర్యాకాంతం తదితరులు శ్రీదేవికి మద్దతు పలికారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ధర్నా విరమించేదిలేదని మహిళా సంఘాల సభ్యులు పేర్కొన్నారు. చీకటి పడటంతో బాధితురాలికి మహిళా సంఘ నేతలు వారి ఇంటిలో ఆశ్రయం కల్పించారు. ఈ విషయమై స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణను అడగగా ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. మోహనకృష్ణ, శ్రీదేవి పెళ్లి ఫోటో (ఫైల్) న్యాయం కోసం ధర్నా చేస్తున్న బాధితురాలు శ్రీదేవి -
ఉరివేసి... నిప్పంటించి..
హైదరాబాద్: భర్త వేధింపులు భరించలేక ఇద్దరు భార్యలు అతనికి చున్నీతో ఉరేశారు. చనిపోయాడో.. లేదో.. అన్న అనుమానంతో మృతదేహాన్ని బయటికి లాక్కొచ్చి తగుల బెట్టారు. తండ్రి హత్యకావడం.. తల్లులు జైలుపాలవడంతో వీరి ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అస్‌బేస్టస్ కాలనీలో ఉండే మహేందర్ యాదవ్‌కు(40) ఇద్దరు భార్యలు. 15 ఏళ్ల క్రితం పద్మను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె సోదరి జ్యోతినీ పెళ్లి చేసుకున్నాడు. ఈ ముగ్గురికీ కలిపి ఐదుగురు పిల్లలు. భార్యలు, పిల్లలతో కలసి అత్తారింట్లోనే ఉండేవాడు. తాగుడుకు బానిసైన మహేందర్ తరచూ భార్యలను వేధించడంతో పాటు అనుమానంతో కొట్టేవాడు. ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోదామని భార్యలు ఎంత చెప్పినా వినేవాడుకాదు. ఇల్లు తనకే ఇచ్చేయాలని ఎప్పుడూ గొడవపడేవాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం సేవించి మహేందర్ ఇంట్లో వాళ్లతో గొడవ పడ్డాడు. అంతే కాకుండా ఆదివారం తెల్లవారుజామునే అతని పెద్ద కొడుకును కొట్టడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతని భార్యలు మహేందర్ మెడకు చున్నీతో ఉరి బిగించి చంపేశారు. భర్త మృతి చెందాడో? లేదో? అన్న అనుమానం వచ్చిన పద్మ, జ్యోతి.. అతని మృతదేహన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారు. బాలానగర్ ఏసీపీ గోవర్ధన్, జగద్గిరిగుట్ట సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఇదిలా ఉండగా తండ్రి చనిపోవడం.. తల్లులు అరెస్టు కావడంతో వీరి పిల్లలు అనాథలుగా మారారు. -
ఆడపిల్ల పుట్టిందని..
కర్నూలు / రాంకొండ(తుగ్గలి): నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని బాస చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. రెండోసారి ఆడబిడ్డకు జన్మినిచ్చిందని వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ అబల ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన సోమవారం తుగ్గలి మండలం రాంకొండ గ్రామంలో చోటు చేసుకుంది. తుగ్గలి ఎస్ఐ కేశవ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రాంకొండకు చెందిన కాశీం కూతురు చామంతి అలియాస్ లావణ్యను (22) మూడేళ్ల క్రితం డోన్ మండలం కొచ్చెర్వుకు చెందిన రామాంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి మొదట సంతానం కూతురు. అప్పటి వరకు దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. మూడు నెలల క్రితం పుట్టింట్లో చామంతి రెండో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మినిచ్చింది. దీంతో జీర్ణించుకోలని భర్త రామాంజనేయులు భార్యను వేధింపులకు గురి చేశాడు. సోమవారం ఊరికి వచ్చిన భర్త ఇంటికి కూడా రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురై ఎవరూ లేని సమయంలో తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన ఇంటి చుట్టు పçక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతురాలి తండ్రి కాశీం ఫిర్యాదు మేరకు రామాంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
నరకం అనుభవించలేక.. నిత్యం పోరాడలేక..
కట్టుకున్న వాడి దురాశ, అత్త వేధింపులకు తోడు ముగ్గురు ఆడ బిడ్డలకు జన్మనీయడమే ఆ తల్లికి శాపమైంది. క్షణక్షణం అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి పొందేందుకు బలవన్మరణాన్ని ఆశ్రయించింది. అత్తింటివారితో పోరాడి అలసిపోయింది. ఇక మరణమే శరణ్యమనుకుంది. చంటి బిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. శాంతిపురం మండలంలో శనివారం జరిగిన ఈ సంఘటన విషాదం నింపింది. శాంతిపురం: దండికుప్పం పంచాయతీలోని నల్ల రాళ్లపల్లికి చెందిన బేబి(26) ఏడు నెలల వయసున్న కవల పిల్లలతో సహా పాలారు నదిలో దూకి ప్రాణా లు విడిచిన సంఘటన కలకలం సృష్టించింది. కోటి ఆశలతో 2011లో సొంత వూర్లోనే అత్తింట అడుగుపెట్టిన బేబికి ఆది నుంచి వేధింపులే ఎదురయ్యా యి. పెళ్లయిన మూడు నెలలకే ఆస్తి కోసం భర్త కోదండ, అత్త గోవిందమ్మల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఆస్తిలో వాటా తీసుకురావాలని పుట్టింటికి తరిమేశారు. తండ్రి వెంకటాచలం(జలమప్ప), తల్లి పద్మమ్మలు స్థానికుల సాయంతో సర్దుబాటు చేసి ఆమెను మళ్లీ అత్తింటికి పంపారు. అయినా ఇంట్లో గొడవలు తగ్గలేదు. బేబిని తరచూ హింసిస్తుండటంతో స్థానికులు కలగజేసుకునేవారు. కానీ జోక్యం చేసుకున్న వారిని భర్త, అత్తలు దుర్బాషలాడటం, మగ వారికి అక్రమ సంబంధం అంటగట్టి అసభ్యంగా మాట్లాడటంతో స్థానికులు దూరమయ్యారు. మూడేళ్ల క్రితం బేబి ప్రతీకకు జన్మనిచ్చింది. అంతా సర్ధుకుంటుందని పుట్టింటి వారు భావించినా పరిస్థితిలో మార్పు లేకపోయింది. పుట్టింటికి వెళ్లకుండా, వారితో పాటు స్థానికులతో కూడా మాట్లాడకుండా అత్తింటివారు బేబిని కట్టడి చేశారు. ఆడబిడ్డలకు జన్మనివ్వటమే శాపం.. ఏడు నెలల క్రితం బేబీ కవల బిడ్డలకు జన్మనిచ్చింది. ఆడబిడ్డలు కావడంతో వేధింపులు పతాక స్థాయికి చేరాయి. తరచూ భర్త, అత్త చేయి చేసుకునే వారని, బిడ్డలకు జన్మనిచ్చిన ఆరు రోజుల నుంచే బలవంతంగా వ్యవసాయ పనులు చేయించారని స్థానిక మహిళలు చెబుతున్న మాటలు బేబీ ఎదుర్కొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. శుక్రవారం ఉదయం ఇంట్లో పాలు ఒలికిపోయానే కారణంతో అత్త, భర్త బేబిని చితగ్గొట్టారు. వారు పనులకు వెళ్లగానే ముక్కు పచ్చలారని చంటి బిడ్డలతో సహా ఇంటి నుంచి వెళ్లి సమీపంలోని పాలారు నదిలో పడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి సమీప గ్రామాల వారు అక్కడికి చేరుకున్నారు. బేబి పరిస్థితులను తెలుసుకుని ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదని వెనుదిరిగారు. తల్లి, తోబుట్టువుల కోసం అమాయకంగా ఎదురు చూస్తున్న ప్రతీక(3) మాటలు జనం గుండెలను పిండాయి. -
శాడిస్ట్ భర్త అకృత్యం
-
శాడిస్ట్ భర్త అకృత్యం
- భార్య జననావయవాలపై కత్తితో గాట్లు - అనుమానంతో వైద్యపరీక్షలు - ఘట్కేసర్లో వెలుగుచూసిన ఘటన.. కేసు నమోదు ఘట్కేసర్: అనుమానం పెనుభూతమై భార్యతో రాక్షసంగా ప్రవర్తిస్తున్న భర్త ఉదంతం ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన పి.ప్రియాంక(25)కు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాకు చెందిన భూక్యా రవితో 2005లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఉద్యోగ రీత్యా రవి హైదరాబాద్ శివారు ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో కాపురంపెట్టాడు. అయితే, రవికి భార్య ప్రవర్తనపై అనుమానం ఉంది. దీంతో ఆమెపై చపాతీ కర్రతో దాడి చేయటంతో తలకు మూడు కుట్లు పడ్డాయి. తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లగా అక్కడి కెళ్లి మరీ దాడి చేశాడు. ఈ మేరకు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో రవిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. ఇకపై భార్యను తిట్టను, కొట్టను అంటూ పోలీసుల ముందు ఒప్పుకుని భార్యను అన్నోజిగూడకు తీసుకొచ్చి మళ్లీ వేధింపులు ప్రారంభించాడు. ఆమె సున్నిత భాగాల్లో కత్తితో గాట్లు పెట్టడంతోపాటు..వేరేవారితో లైంగిక సంబంధం పెట్టుకుందంటూ వైద్య పరీక్షలు చేయించాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రియాంక ఈ నెల 24న పిల్లల్ని వెంటబెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. కుమార్తె ఆచూకీ తెలియడం లేదంటూ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా ఆమె జనగాంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘట్కేసర్ తీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
జ్యోతికి న్యాయం ఏదీ..?
♦ న్యాయం కోసం 52 రోజులుగా పోరాటం ♦ భర్త వేధింపులు తాళలేక చంటి బిడ్డతో పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు ♦ కనికరం చూపడం లేదంటున్న గ్రామస్తులు చందంపేట (దేవరకొండ) : రెక్కాడితే డొక్కాడని కుటుంబం అది.. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తూ బిడ్డని కొడుకుగా భావించిన కుటుంబం అది.. కొడుకులు లేకపోయినా ఉన్న బిడ్డ చదువుకుంటే ఉన్నత స్థాయిలో ఉంటుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. తమ బిడ్డ ఉన్నత స్థాయికి వెళ్లి తమ కష్టాలను తీర్చుతుందని ఎన్నో కలలు కన్నారు. ఆ కలలు కల్లలయ్యాయి. అల్లుడికి ఉద్యోగం ఉందని, బిడ్డను చక్కగా చూసుకుంటాడని నమ్మి ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. ఇక సుఖ పడుతుందనుకున్న బిడ్డ.. వివాహం చేసిన కొద్ది రోజులకే కట్నం వేధింపులు, గృహ హింసతో ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆ గిరిజన కుటుంబం దేవకొండ డీఎస్పీ రవికుమార్, నేరెడుగొమ్ము పోలీసు స్టేషన్ మెట్లెక్కారు.. అసలు విషయానికొస్తే నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన కేతావత్ దస్మా, జీజా దంపతుల ఏకైక కుమార్తె మూఢావత్ జ్యోతిని డిండి మండలంలోని చెర్కుపల్లి గ్రామపంచాయతీ దేవునిగుడితండాకు చెందిన లాస్యనాయక్, జీజా దంపతుల కుమారుడైన మూఢావత్ గోపాల్‌కు 2016 సంవత్సరంలో బ్యాంక్ ఉద్యోగం ఉందని నమ్మి సుజాతను ఇచ్చి వివాహం చేశారు. కానీ గోపాల్ కారు డ్రైవర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. ఇదే విషయం వివాహం అయిన నాలుగు నెలలకు జ్యోతికి తెలియడంతో భర్త గోపాల్‌ను ప్రశ్నించింది. తల్లిదండ్రులకు చెప్పడంతో నచ్చజెప్పి కాపురానికి పంపించారు. పెళ్లి సమయంలో కట్న కానుకల దగ్గరి నుంచి బడిబాసండ్ల వరకు ఇచ్చేందుకు ఆ గిరిజన పేద కుటుంబం రూ.12 లక్షలు అప్పు చేసి పెళ్లిని వైభవంగా చేశారు. గోపాల్‌కు ప్రభుత్వ ఉద్యోగం లేదని, ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినందుకు గాను భార్యను గోపాల్ నిత్యం గృహ హింసకు పాల్పడుతూ మరో రూ.10 లక్షలు తేవాలంటూ.. జ్యోతి ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు జ్యోతిపై దాడి చేసి జోడుబాయితండాకు పంపించాడు. కాగా జ్యోతి ఏప్రిల్ 13న దేవరకొండలోని ఓ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. కాగా పురుడు కోసం జ్యోతి కుటుంబసభ్యులు గోపాల్‌కు సమాచారం అందించినా గ్రామానికి రాలేదు. కాగా జ్యోతి ఇదే విషయాన్ని జూన్ 24వ తేదీన దేవరకొండలో డీఎస్పీ రవికుమార్‌కు ఫిర్యాదు చేసింది. కాగా డీఎస్పీ రవికుమార్ నేరెడుగొమ్ము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు తనకు న్యాయం చేయాలని పలుమార్లు పోలీసులకు మొరపెట్టుకుంది. పోలీసులు కూడా అప్పటి నుంచి గోపాల్ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారే తప్ప తమకు ఎటువంటి న్యాయం చేయడం లేదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌కు జ్యోతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అయినా జ్యోతికి న్యాయం చేస్తారా.. అని ఆ కుటుంబం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఇదే విషయాన్ని నేరెడుగొమ్ము ఎస్ఐ క్రాంతికుమార్‌ను వివరణ కోరగా పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించామని, కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. -
లవ్ మ్యారేజ్.. ప్రతిరోజు భార్యకు నరకం!
హైదరాబాద్ : మొదటి భార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న లెక్చరర్‌ను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి కథనం మేరకు.. కృష్ణా జిల్లా విజయవాడ గొల్లపుడికి చెందిన చింతల బాలాజీ ఎన్బీటీ నగర్లో ఉంటూ సీఎంఆర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. దుర్గమణి(32)ని కొంతకాలం పాటు లవ్ చేసిన బాలాజీ 2009లో ఆమెను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. 2015 నుంచి లెక్చరర్ బాలాజీ భార్యను రూ. 10 లక్షలు అదనపు కట్నం తేవాలని వేధించడమేగాక ఆమెకు 6 సార్లు అబార్షన్ చేయించాడు. చేసుకున్నది ప్రేమ వివాహమే అయినా భార్యకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. నెల క్రితం తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు భార్య దుర్గమణిని బెదిరించాడు. ఈ నెల 8న తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో ఆ విషయంపై ఆమె గట్టిగా నిలదీసింది. దీంతో గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేయడమేగాకుండా చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. మంగళవారం లెక్చరర్‌ను అరెస్ట్ రిమాండ్‌కు తరలించి విచారణ చేపట్టారు.