
నెల్లూరు(క్రైమ్): వారిద్దరు ఉన్నతోద్యోగులు. అయితే విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్త తనను వేధిస్తున్నాడంటూ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడంతో పోలీసులు స్పందించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చా రు.
వివరాలిలా ఉన్నాయి. జీవీఆర్‌ఆర్ కళాశాల సమీపంలో దంపతులు తమ కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త పశుసంవర్థక శాఖలో, భార్య వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి మధ్య కొంతకాలంగా మనస్పర్థలతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన వేదాయపాళెం పోలీసులు దంపతుల ఇంటికి చేరుకుని మాట్లాడారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment