wife complaint
-
వివాహేతర సంబంధం: భార్యా బిడ్డలపై భర్త దాడి
మైసూరు: వేరే మహిళతో కలిగిన తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్య, కుమార్తెపై భర్త తన ప్రియురాలితో కలిసి దాడి చేసి హత్య బెదిరింపులకు పాల్పడిన ఘటన నగరంలోని ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన శ్వేత అనే మహిళ తన భర్త సంతోష్‌కుమార్, అతని ప్రియురాలు శిల్పలపై ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్వేత, సంతోష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు బెంగళూరులోని కెంగేరి లింగదీరనహళ్లి బడావణెలో నివసిస్తున్నారు. వీరి అన్యోన్య దాంపత్య జీవితంలో సుడిగాలిలో శిల్ప ఎంట్రీ ఇచ్చింది. సుమారు ఆరు నెలల క్రితం సంతోష్ కుమార్ జీవితంలోకి శిల్ప ప్రవేశంతో శ్వేత దాంపత్య జీవితంలో కుదుపు ఏర్పడింది. తరచూ మొబైల్లో సంతోష్ కుమార్‌తో మాట్లాడుతూ అశ్లీల మెసేజ్‌లను పంపుతూ దగ్గరయిన శిల్ప క్రమంగా దంపతుల దాంపత్య జీవితానికి కంటకంగా మారారు. శిల్ప ప్రేరణతో సంతోష్ కుమార్ తరచు భార్య, పిల్లలపై దాడి జరిపి రగడ సృష్టించేవారు. ఈ విషయంపై గతంలో శ్వేత కెంగేరి పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం ఇద్దరు పిల్లలపై కూడా ప్రభావం చూపింది. చిన్న కుమార్తె మానసికంగా కుంగి మైసూరులో తల్లి ఇంటిలో ఉండిపోయింది. కుమార్తెను చూసేందుకు శ్వేత తన పెద్ద కుమార్తెతో కలిసి మైసూరుకు వచ్చినప్పుడు బన్నిమంటప ఎల్ఐసీ సర్కిల్ వద్ద సంతోష్ కుమార్, అతని ప్రియురాలు శిల్ప ఎదురై శ్వేత, ఆమె కుమార్తెపై దాడి చేసి హత్య చేస్తామని బెదిరించారు. దాడికి గురైన శ్వేత ఘటన నుంచి కోలుకున్న అనంతరం ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో భర్త, ఆమె ప్రియురాలిపై ఫిర్యాదు చేసింది. -
భర్త వేధింపులపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్!
నెల్లూరు(క్రైమ్): వారిద్దరు ఉన్నతోద్యోగులు. అయితే విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్త తనను వేధిస్తున్నాడంటూ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడంతో పోలీసులు స్పందించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చా రు. వివరాలిలా ఉన్నాయి. జీవీఆర్ఆర్ కళాశాల సమీపంలో దంపతులు తమ కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త పశుసంవర్థక శాఖలో, భార్య వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి మధ్య కొంతకాలంగా మనస్పర్థలతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన వేదాయపాళెం పోలీసులు దంపతుల ఇంటికి చేరుకుని మాట్లాడారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
కూతురిని కిడ్నాప్ చేశారంటూ అల్లుడిపై ఫిర్యాదు
పెనుమంట్ర: విడాకుల కేసు కోర్టులో ఉండగా భార్యను కిడ్నాప్‌చేసి, పుట్టింటి నుంచి తీసుకుపోయిన సంఘటన నెగ్గిపూడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెగ్గిపూడి గ్రామానికి చెందిన చిర్ల శ్రీనివాసరెడ్డి, కనకలక్ష్మి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం తమ రెండో కుమార్తె పూజారెడ్డిని అదే గ్రామానికి చెందిన సత్తి శ్రీరామారెడ్డికి ఇచ్చి 2020లో వివాహం చేశారు. మొదట్లో తమ కుమార్తెను అల్లుడు బాగానే చూసుకున్నాడని, బాబు పుట్టిన అనంతరం వేధింపులకు గురిచేస్తూ, కొట్టేవాడని చెప్పారు. 2022లో పెనుమంట్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉండగా ఈనెల 17న సాయంత్రం 4 గంటలకు అల్లుడు శ్రీరామారెడ్డి ఇంటికి వచ్చి తమను తిట్టడమే కాకుండా ఇంట్లోనే నిర్భంధించి కుమార్తె, మనవడిని బలవంతంగా తీసుకువెళ్లిపోయాడని చెప్పారు. అనంతరం 100కి ఫోన్ చేస్తే పోలీసుల నుంచి స్పందన లేదని, గాయాలతో సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లామన్నారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని పోలీసులు చెప్పడంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై పెనుమంట్ర ఎస్సై సురేంద్రకుమార్‌ను సాక్షి వివరణ కోరగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఆసుపత్రి నుంచి సమాచారం వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
నా బిడ్డ..నాకు కావాలి
చిత్తూరు రూరల్: ‘ఇష్టంలేని పెళ్లి చేశారు.. అందుకే నేను నాభర్త వద్దకు వెళ్లలేదు.. దీంతో మా అమ్మ నా బిడ్డను లాక్కొని నన్ను కొట్టి ఇంటి నుంచి తరిమేసింది.. నాబిడ్డ నాకు కావాలి’ అని ఓ బాలింత బుధవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వాపోయింది. వివరాలు ఆమె మాటల్లోనే... ‘నాపేరు అశ్విని(20). మాది పెద్దపంజాణి మండలం, నిడిగుంట గ్రామం. ఏడాదిన్నర క్రితం నన్ను వి.కోటకు చెందిన కోదండ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. నాకు 11 నెలల పండు అనే మగబిడ్డ ఉన్నాడు. ప్రసవం కోసం తల్లి ఇంటికి వచ్చాను. నా తల్లి ఇప్పుడు భర్త దగ్గరకు వెళ్లాలని బలవంతం చేస్తోంది. ఇందుకు నేను ఒప్పుకోకపోవడంతో శనివారం నా బిడ్డను లాక్కొని నన్ను కొట్టి ఇంట్లో నుంచి పంపించేసింది. రెండు రోజులుగా పలమనేరు బస్టాండులో ఉన్నాను. ఓ మహిళ సాయంతో చిత్తూరు చేరుకున్నాను. నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే అతడు అవసరం లేదు. నాకు నా బిడ్డ కావాలి.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాను’ అని కంట తడిపెట్టింది. ఈ మూడు రోజులుగా బిడ్డకు పాలు పట్టకపోవడంతో తన ఆరోగ్యం దెబ్బతినిందని వాపోయింది. బిడ్డను ఇప్పిస్తే చాలని, తన బతుకేదో.. బతుకుతానని పేర్కొంది. -
ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు.. సినిమా మధ్యలో భర్త బయటకువచ్చి..
మంగళగిరి(గుంటూరు జిల్లా): భర్త అదృశ్యంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని భార్గవపేటకు చెందిన పడవల బాలసుబ్రహ్మణ్యం శనివారం భార్య బేబి అఖిలతో కలసి విజయవాడ సినిమాకు వెళ్లాడు. సినిమా మధ్యలో బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం నేరుగా మంగళగిరిలోని తన ఇంటికి చేరుకుని బ్యాగు సర్దుకుని ఎటో వెళ్లిపోయాడు. చదవండి: మరో మహిళతో ఆర్ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో.. సినిమా హాలులో ఉన్న భార్య బేబి అఖిల ఎంత సేపటికీ భర్త హాలులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి చేరుకుని చూడగా అప్పటికే భర్త బ్యాగు సర్దుకుని వెళ్లిపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య ఫిర్యాదుతో ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
ముంబై : ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. గతరాత్రి భార్య నిషా రావల్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కరణ్‌ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. వివరాల ప్రకారం..యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో కరణ్ మెహ్రా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సీరియల్ ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదిచుకున్న కరణ్ ఆ తర్వాత పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. చాలా కాలం డేటింగ్ అనంతరం 2012 లో కరణ్-నిషాలు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కరణ్-నిషాలు జంటగా నాచ్ బలియే సీజన్-5లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీరి వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిద్దరు విడిపోనున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేసినా నిషా వాటిని ఖండించింది. తామిద్దరం బాగానే ఉన్నామని, ఇలాంటి వార్తలు అవాస్తవమని తేల్చేసింది. మరోవైపు నటుడు కరణ్ గత రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఆ సమయంలో మానసికంగా ఎంతో కుమిపోయానని, అయితే తన భార్య నిషా ఎంతో ధైర్యం చెప్పిందని, తనను చాలా జాగ్రత్తగా చూసుకుందని తెలిపాడు. అయితే అనూహ్యంగా కొన్ని వారాల నుంచి వీరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సోమవారం రాత్రి కూడా తమ మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో కరణ్ తన తలను గోడకు నెట్టేసినట్లు నిషా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సెక్షన్ 336, 337 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలోని అతని నివాసంలో కరణ్‌ను అరెస్ట్ చేశారు. Maharashtra | Actor Karan Mehra arrested after his wife & actor Nisha Rawal filed a complaint in Goregaon area last night. Rawal filed a complaint against Mehra following a brawl. A case has been registered: Mumbai Police — ANI (@ANI) June 1, 2021 View this post on Instagram A post shared by ɴɪsʜᴀ ʀᴀᴡᴀʟ (@missnisharawal) చదవండి : అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి.. మా అమ్మ ముందే నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు: నటి -
భార్యను పుట్టింటికి పంపి భర్త పరార్
హిమాయత్‌నగర్: ‘కరోనా సమయంలో చిన్నపిల్లలు బయట తిరగకూడదంట. ఫంక్షన్లకు రాకూడదు. బంధువుల ఫంక్షన్ ఉంది నేనూ మీ ఆయన వెళ్తాం. ఒక కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్లు’ అని వివాహితను అత్త, భర్త నమ్మించారు. తీరా పుట్టింటి నుంచి వివాహిత తిరిగి రాగా ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టు పక్కల వారిని విచారించగా చాలా కాలం నుంచి ఇంటికి తాళం వేసి ఉందని వారు సమాధానం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని విక్రమ్‌పురి పార్క్ వద్ద చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన వీణ, నారాయణగూడకు చెందిన మహేందర్ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 7 సంవత్సరాల కుమార్తె ఉంది. లాక్డౌన్ ప్రారంభం కాగానే భర్త, అత్త వీణను మార్చి నెలలో పుట్టింటికి పంపారు. కాగా ఆమె ఏప్రిల్ మాసంలో నారాయణ గూడలోని మెట్టింటికి రాగా తాళం వేసి ఉంది. అప్పటి నుంచి భర్త, అత్తలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. భర్త, అత్తయ్య ఎక్కడ ఉన్నారో తెలియదని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని తెలిపింది. నారాయణగూడలోని పక్క వారిని అడిగితే మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారని వాపోయింది. ఇంట్లో తనకు సంబంధించిన బంగారం, డబ్బు, ఇతర సామగ్రి ఉన్నాయని తనకు న్యాయం చేయాలని కోరుతూ వీణ ఇంటి ముందు బైఠాయించింది. -
సమయం అడిగాడు.. పారిపోయాడు
సంతబొమ్మాళి: చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సమయం అడిగాడు.. తీరా సమయం వచ్చే నాటికి ఇంటికి తాళం వేసి పారిపోయిన వైనం మండల కేంద్రం సంతబొమ్మాళిలో చోటుచేసుకుంది. బాధితరాలు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి గ్రామానికి చెందిన వివాహిత అట్టాడ యమునను ఆదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కుసుమకారి సిద్ధార్థ 2017 ఆగష్టు 18న అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. విశాఖట్నంలో రెండేళ్లపాటు కాపురం పెట్టిన తర్వాత వదిలించుకోవడానికి ఎత్తుగడ వేశాడు. అదనపు కట్నం తేవాలని వేధించాడు. 2019 నవంబర్ 6న సింహాచలంలో వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలియడంతో యమున విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో 2019 నవంబర్ 14న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న యమున గతేడాది డిసెంబర్ 23న సంతబొమ్మాళిలోని అత్తవారింటికి వచ్చింది. సిద్ధార్థ తల్లి ఇందిర, బంధువులు కలిసి ఆమెను బయటికి నెట్టేశారు. ఆదేరోజు సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయాన్ని ఎస్ఐ కామేశ్వరరావుకు చెప్పింది. వారిని పిలిచి ఎస్ఐ మాట్లాడారు. తన కుమారుడు ఆర్మీ విధుల్లో భాగంగా ఢిల్లీలో పని చేస్తున్నాడని, జనవరి 28న (2020) సెలవుపై వస్తాడని, అప్పటివరకు సమయం ఇవ్వాలని తల్లి కోరగా.. పెద్ద మనుషుల సమక్షంలో అంగీకారం కుదిరింది. ఆ సమయం రానే వచ్చింది. తల్లి ఇందిర, కుమారుడు సిద్ధార్థ, కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. ఈ విషయం తెలియక బాధితరాలు యమున కుటుంబ సభ్యులు, వారి తరఫు పెద్ద మనుషులు సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. దీనిపై ఎస్ఐ కామేశ్వరరావును వివరణ అడడగా గతంలో ఒకసారి బాధితరాలు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పిందన్నారు. గ్రామస్తుల సమక్షంలో సమస్య పరిష్కరించుకుంటామని ఆర్మీ జవాన్ తల్లి సమయం అడిగితే ఇరు వర్గాల వారు అంగీకారానికి వచ్చారన్నారు. దీనిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందన్నారు. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? రెండున్నర ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. విశాఖపట్నంలో కేసు నమోదు అయింది. సోమవారం స్పందనలో ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశాను. ఇక్కడికి వస్తే భర్త, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉద్యోగానికి సెలవులు పెట్టి వచ్చాను. న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. – కె.యమున, బాధితురాలు -
మగపిల్లాడి కోసం..
కర్నూలు, ఆళ్లగడ్డ టౌన్: చిత్రంలో అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు దస్తగిరమ్మ. జి. జంబులదిన్నె గ్రామానికి చెందిన ఈమెకు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన పెద్దదస్తగిరితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. మగపిల్లాడికోసం ఈమె భర్త రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. విడాకుల కోసం భార్యను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి గెంటివేయడంతో ఆమె పుట్టింటికి చేరింది. దీంతో తండ్రితో కలిసి శుక్రవారం స్థానిక టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై ఎస్ఐ ప్రియతంరెడ్డి మాట్లాడుతూ..దస్తగిరి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి దస్తగిరమ్మ వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. ఇరువురికి కౌన్సెలింగ్ ఇచ్చి విభేదాలు లేకుండా కాపురం చేసుకోవాలని పంపించినట్లు చెప్పారు. -
కొడుకును కడతేర్చిన తండ్రి
ఎర్రుపాలెం: కన్న కొడుకును తండ్రి హత్య చేసిన సంఘటన ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధసిరి లక్ష్మయ్య, ప్రభాకర్(30) తండ్రీ కొడుకులు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరూ లారీ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. రోజూ ఇద్దరు మద్యం సేవించి గొడవలకు దిగడం పరిపాటి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి లక్ష్మయ్య తన భార్యతో కలిసి అదే గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడు. అయితే ప్రభాకర్ భార్య అంజలితో మనస్పర్థలుండటంతో ఆమె ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. తండ్రి లక్ష్మయ్య అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్తున్నానని భార్యకు చెప్పి.. కొడుకు ప్రభాకర్ నిద్రిస్తున్న సొంత ఇంటికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న కొడుకు తలపై కర్రతో తీవ్రంగా కొట్టాడు. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రభాకర్ మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాకర్ భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేసి.. కేసు నమోదు చేశారు. మధిర సీఐ శ్రీధర్‌కి సమాచారం ఇవ్వడంతో ఆయన హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి విచారించారు. హత్య కేసులో సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
గ్రీన్‌కార్డు కోసం పెళ్లి చేసుకొని..
వేలూరు (తమిళనాడు): స్విట్జర్లాండ్ దేశంలో గ్రీన్‌కార్డు పొందేందుకు వివాహం చేసుకొని మోసం చేసిన భర్తపై చర్యలు తీసుకోవాలని భార్య ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బెంగుళూరుకు చెందిన అనుపమ(29) తల్లితో కలిసి వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తన వేదనను వెల్లడించింది. వేలూరు మాసిలామణి వీధికి చెందిన డెన్నీసన్ కుమారుడు సందీప్‌తో తనకు 2012లో వేలూరులోని చర్చిలో వివాహం జరిగిందని తెలిపింది. వివాహం జరిగిన తరువాత ఐదు రోజులు మాత్రమే తనతో గడిపాడని అనంతరం సందీప్ స్విట్జర్లాండ్ వెళ్లిపోయాడని వెల్లడించింది. ఆరు నెలల్లో వీసా తీసుకొని తనను తీసుకెళతానని చెప్పినట్టు పేర్కొంది. అప్పటి నుంచి తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని, సందీప్ తల్లిదండ్రుల వద్ద ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పడం లేదన్నారు. స్విట్జర్లాండ్ గ్రీన్‌కార్డు కోసమే తనను పెళ్లిచేసుకున్నాడని బంధువుల ద్వారా తెలిసిందని, మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని అక్కడికి వెళ్లిపోయాడని వాపోయింది. అయితే 2016లో సందీప్ వేలూరుకు వచ్చిన సమయంలో పోలీసులు విచారణ జరపగా తాను రెండు నెలల సెలవులో వచ్చానని, మరో రెండు నెలల్లో తనను తీసుకెళతానని చెప్పి రాత పూర్వకంగా రాసి ఇచ్చి వెళ్లాడని, తరువాత ఎలాంటి ఫోన్ కూడా చేయలేదని వాపోయింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
పోలీసు స్టేషన్లో ఆత్మహత్యాయత్నం
సామర్లకోట: రెండో భార్య పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన భర్త పోలీసు స్టేషన్ ఆవరణలోనే మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన చెల్లూరి దుర్గా ప్రసాద్ నాలుగేళ్ల క్రితం తణుకుకు చెందిన పూజితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పూజిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ తరుణంలో దుర్గాప్రసాద్ కాకినాడలో మకాం పెట్టాడు. కారు డ్రైవరుగా తిరుగుతున్న సమయంలో సామర్లకోటకు చెందిన మీనాక్షితో ఏడాది క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు జరిగిన మొదటి వివాహం విషయాన్ని దాచిపెట్టాడు. ఇటీవలే ఆ విషయం తెలుసుకున్న మీనాక్షి సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మొదటి భార్య పూజిత, దుర్గ ప్రసాద్‌లను స్టేషన్‌ను తీసుకువచ్చారు. అయితే పోలీసు స్టేషన్లోనే మీనాక్షితో ఎందుకు ఫిర్యాదు చేశావని వాదనకు దిగాడు. ఆ వాదన పెద్దది కావడంతో దర్గాప్రసాద్ బ్లేడుతో మెడ కోసుకున్నారు. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే దుర్గప్రసాద్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఎస్సై శ్రీనివాసు నాయక్ దర్యాప్తు చేస్తున్నారు. -
రోజూ నరకమే..
రాంగోపాల్‌పేట్: ఆయన ఓ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్...పెళ్లై 13 ఏళ్లు అవుతోంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ప్రతి రోజు భార్యను తీవ్రంగా కొడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం సంజయ్ కుమార్ అనే వ్యక్తి గోపాలపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ గాస్మండి ఆదయ్యనగర్‌లో ఉంటున్నాడు. 2003లో అతడికి సరితతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, ఒక బాబు. గత కొన్నేళ్లుగా సంజయ్ తరచూ భార్యపై చేయి చేసుకుంటున్నాడు. ప్రతి రోజు మధ్యం సేవించి ఇంటికి రావడమే కాకుండా విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారు. అతడికి రాము, శ్రీకాంత్ అనే అతని స్నేహితులు మద్దతు పలుకుతున్నట్లు తెలిపింది. మూడు రోజుల క్రితం కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సరిత మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా... భార్య ఫిర్యాదు మేరకు సంజయ్ కుమార్‌ను మార్కెట్ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఇన్స్పెక్టర్ మట్టయ్య వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తనకు భార్య వద్దని ఏ కేసు పెట్టుకున్నా సరే విడాకులు తీసుంటానని మొండికేశాడు. భార్య సరిత మాత్రం తనను మళ్లీ కొట్టకుండా బాగా చూసుకుంటానంటే సరేనని చెప్పినా అతను మాత్రం కేసు పెట్టుకోమని చెప్పడం గమనార్హం. -
భర్త వికృత చేష్టలపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్: తాళి కట్టిన భర్తే విచక్షణ మరిచాడు. భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అతగాడు స్నేహితుడికి పంపిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... సైబరాబాద్ పరిధిలో నివాసముంటున్నఓ మహిళ తన భర్త వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పడకగదిలో సన్నివేశాలను తన భర్త ఆన్లైన్ ద్వారా చెన్నైలోని తన స్నేహితుడు శ్రీమన్కు పంపిస్తున్నట్లు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి భర్త కృష్ణ చైతన్యను అరెస్ట్ చేశారు. లాప్‌ట్యాప్‌తో పాటు అతడి ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా కృష్ణ చైతన్య, శ్రీమన్ పరస్పరం తమ భార్యల న్యూడ్ ఫోటోలను స్కైప్ ద్వారా పంపుకునేవారిని వెల్లడించారు. కాగా కృష్ణచైతన్య ప్రవర్తనపై అనుమానం వచ్చి అతడి ఫోన్లో వెతకగా, ఈ వీడియోలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె తమకు ఫిర్యాదు చేసిందన్నారు. అలాగే శ్రీమన్ కోసం పోలీసులు చెన్నై బయల్దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో మరో ఎన్నారై మోసం
హైదరాబాద్: నగరంలో మరో ఎన్నారై మోసం వెలుగులోకి వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని.. రెండేళ్లు గడవక ముందే కట్టుకున్న భార్యను, ఆర్నెళ్ల బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో వదిలివెళ్లాడో ఎన్నారై. వివరాలు.. నగరంలోని రామాంతపూర్‌కు చెందిన యాలాల శిరీషకు రెండేళ్ల క్రితం కీర్తిసాయిరెడ్డి అనే ఎన్నారైకి వివాహం అయింది. పెళ్లి తర్వాత శిరీషను అమెరికా తీసుకెళ్లిన భర్త అక్కడ ఆమెను చిత్రహింసలు పెట్టాడు. అంతేకాకుండా ఆరు నెలల బాబుకు తల్లి పాలు ఇవ్వకుండా అడ్డుకొని వేధింపులకు గురిచేశాడు. భర్త, అత్త కలిసి తల్లి నుంచి చిన్నారి వేరు చేసి చిత్రహింసలకు గురుచేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో బుధవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆరు నెలల బాబుతో పాటు శిరీషను వదలి వెళ్లాడు కీర్తిసాయిరెడ్డి. దీంతో ఆమె గురువారం తల్లిదండ్రుల సహాయంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. భర్తను తనను కలపాలని కోరుతోంది. -
ఆయన చీర మాత్రమే కట్టుకుంటాడు
బెంగళూరు: ఇంట్లో తన భర్త మహిళలా ప్రవర్తిస్తున్నాడని, ఆయన నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని (29) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఏడాది క్రితం బెంగళూరులో వివాహం జరిగింది. బెంగళూరులోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో భర్త వైఖరిని భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. 'మా ఆయన పగలు ఆఫీసుకు వెళతాడు. ఇంటికి వచ్చాక నాలా మేకప్ వేసుకుంటాడు. రాత్రి పూట ఆయన చీర మాత్రమే ధరిస్తాడు. మహిళలా ప్రవర్తిస్తాడు. మా వివాహమై ఏడాది అయినా మేమిద్దరం దగ్గర కాలేదు. ఆయన నపుంసకుడు. పెళ్లయిన మొదటి రోజు నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. ఆయన అసహజమైన శృంగారం కోరుకుంటాడు. ఆయన వైఖరిని భరించలేకపోతున్నాను. భర్త నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాను' అని సంబంధిత వివాహిత మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె నుంచి విడిపోయేందుకు భర్త అంగీకరించాడు. -
ఎన్నారై భర్తపై భార్య ఫిర్యాదు
విశాఖ : ఆడపిల్ల పుట్టిందనే కోపం భార్యబిడ్డలను వదిలేసి ఓ భర్త అమెరికా వెళ్లిపోతే, మరో ఘటనలో అదనపు కట్నం కోసం ఓ ఎన్నారై భార్యను వేధింపులకు గురి చేస్తున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీంతో భర్త వేధింపులపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే ప్రతాప్‌రెడ్డి గార్డెన్‌కు చెందిన విజయానంద్‌తో జ్యోతిక వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షలు కట్నంగా ఇచ్చారు. అయినా అదనపు కట్నం కోసం భర్తతో పాటు, అత్తమామలు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారు. పైపెచ్చు జ్యోతికకు అక్రమ సంబంధం అంటగట్టి వేధించడంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. యూకేలో టీసీఎస్ కంపెనీలో పని చేస్తున్న భర్త విజయానంద్ గత రెండేళ్లుగా తనను, కొడుకును పట్టించుకోవడం లేదని బాధితురాలు జ్యోతిక ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అక్రమ సంబంధం ఉందంటూ విడాకులు కావాలంటూ భర్త నోటీసులు పంపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. డీఎన్ఏ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నట్లు జ్యోతిక తెలిపింది. అయితే న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల!
-
ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల!
అడ్డగుట్ట (హైదరాబాద్): పెళ్లైనా... పరస్త్రీలతో రాసలీలలు సాగిస్తూ.. వారిని నిలువునా వంచిస్తున్న ఓ కామాంధుడిని కట్టుకున్న ఇల్లాలే పోలీసులకు పట్టిచ్చింది. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జీ. శ్రీకాంత్‌కు, నగరంలోని గౌలిగూడకు చెందిన మాధవితో 2012లో వివాహం జరిగింది. ఇద్దరికీ అది రెండో వివాహం. ఈస్ట్ మారేడుపల్లిలో నివాసం ఉంటున్న వీరికి కవల పిల్లలు సంతానం. కాగా, శ్రీకాంత్ తుర్కపల్లిలోని ఓ కంపెనీలో రీసెర్చ్ కెమిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు పెళ్లి అయినప్పటి నుంచి భార్యను తరచూ వేధింపులకు గురిచేస్తుండేవాడు. తనకు వివాహం కాలేదంటూ సహచర ఉద్యోగినులతో పాటు ఇతర అమ్మాయిలను నమ్మించి వంచించడం అలవాటుగా మార్చుకున్నాడు. వారితో ఏకాంతంగా గడుపుతూ ఆ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించి, తర్వాత వారిని బెదిరించేవాడు. తన రాసలీలలకు భార్య అడ్డుగా ఉంటుందని తరచూ ఆమెను పుట్టింటికి పంపించేవాడు. దీంతో భర్త తీరుపై అనుమానం వచ్చిన మాధవి తన సోదరుడితో నిఘా పెట్టించింది. ఈ క్రమంలో ఆదివారం శ్రీకాంత్ వేరే అమ్మాయితో ఓ ప్రైవేటు గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని తుకారాంగేట్ పోలీసులకు పట్టిచ్చారు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని చూడగా అందులో చాలామంది అమ్మాయిలతో నగ్నంగా ఉన్న దృశ్యాలు వెలుగు చూశాయి. శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
మా ఆయనకు రెండోపెళ్లి.. ఆదుకోండి!
తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, 5 లక్షల కట్నం తెచ్చిస్తే మళ్లీ ఏలుకుంటానని తనకు చెబుతున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరిగింది. కరుణశ్రీ అనే మహిళ రామచంద్రపురంలో ఎంఎస్సీ చదివారు. అప్పట్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన నక్కా తిరుపతి రాజమండ్రిలో పనిచేస్తూ, ఫీల్డ్ వర్క్ కోసం రామంద్రపురం వెళ్లేవాడు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2007లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కట్నంగా లక్ష నగదు, ఇతర లాంఛనాలు ఇచ్చారు. తర్వాత ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు వెళ్లే తిరుపతి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను రెండోపెళ్లి చేసుకున్నాడు. దీనిపై తాను నిలదీయగా.. 5 లక్షల అదనపు కట్నం తెస్తే ఏలుకుంటానని చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
కన్న కొడుకునే కిడ్నాప్ చేసాడు
గుంటూరు : మద్యం తాగేందుకు డబ్బు కోసం కన్నకొడుకునే తండ్రి కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పీఎస్ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన గోళ్ల శ్రీనివాసరావుకు తాడేపల్లికి చెందిన మహాలక్ష్మితో 2006లో వివాహమైంది. భార్యభర్తలిద్దరూ కూలి పనిచేసి జీవిస్తున్నారు. భార్య సందపాదన కుటుంబ పోషణకు ఖర్చు పెడుతుంటే భర్త తన సంపాదనను తాగుడుకు ఖర్చు చేస్తున్నాడు. విషయం పెద్దల దాకా వెళ్లి పంచాయితీలు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. ఈలోగా వారికి ఓ కుమారుడు పుట్టాడు. ప్రతిసారి భార్య పంచాయితీ పెడుతోందన్న కోపంతో శ్రీనివాసరావు మహాలక్ష్మిని వదిలేసి, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాగుబోతు మొగుడు పోతేపోయాడనుకుని మహాలక్ష్మి కుమారుడితో సహా పుట్టింటికి వచ్చి కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 7న ఓటేసేందుకు తాడేపల్లి వచ్చిన శ్రీనివాసరావు మహాలక్ష్మి ఇంటికి వచ్చి పిల్లోడితో ఆడుకుంటున్నట్లు నటించి చాకెట్లు కొనిపెడతానంటూ తీసుకుపోయాడు. ఎంతసేపటికీ వారిద్దరూ రాకపోవటంతో అనుమానం వచ్చిన మహాలక్ష్మి అత్తంటికి వెళ్లి బిడ్డ కోసం ఆరా తీసింది. అయినా ఫలితం లేకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.