నా బిడ్డ..నాకు కావాలి | Chittoor Wife Complaint On Husband | Sakshi
Sakshi News home page

నా బిడ్డ..నాకు కావాలి

May 26 2022 8:47 AM | Updated on May 26 2022 8:47 AM

Chittoor Wife Complaint On Husband - Sakshi

చిత్తూరు రూరల్‌: ‘ఇష్టంలేని పెళ్లి చేశారు.. అందుకే నేను నాభర్త వద్దకు వెళ్లలేదు.. దీంతో మా అమ్మ నా బిడ్డను లాక్కొని నన్ను కొట్టి ఇంటి నుంచి తరిమేసింది.. నాబిడ్డ నాకు కావాలి’ అని ఓ బాలింత బుధవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వాపోయింది. వివరాలు ఆమె మాటల్లోనే... ‘నాపేరు అశ్విని(20). మాది పెద్దపంజాణి మండలం, నిడిగుంట గ్రామం. ఏడాదిన్నర క్రితం నన్ను వి.కోటకు చెందిన కోదండ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. నాకు 11 నెలల పండు అనే మగబిడ్డ ఉన్నాడు. ప్రసవం కోసం తల్లి ఇంటికి వచ్చాను.

నా తల్లి ఇప్పుడు భర్త దగ్గరకు వెళ్లాలని బలవంతం చేస్తోంది. ఇందుకు నేను ఒప్పుకోకపోవడంతో శనివారం నా బిడ్డను లాక్కొని నన్ను కొట్టి ఇంట్లో నుంచి పంపించేసింది. రెండు రోజులుగా పలమనేరు బస్టాండులో ఉన్నాను. ఓ మహిళ సాయంతో చిత్తూరు చేరుకున్నాను. నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే అతడు అవసరం లేదు. నాకు నా బిడ్డ కావాలి.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాను’ అని కంట తడిపెట్టింది. ఈ మూడు రోజులుగా బిడ్డకు పాలు పట్టకపోవడంతో తన ఆరోగ్యం దెబ్బతినిందని వాపోయింది. బిడ్డను ఇప్పిస్తే చాలని, తన బతుకేదో.. బతుకుతానని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement