పెనుమంట్ర: విడాకుల కేసు కోర్టులో ఉండగా భార్యను కిడ్నాప్‌చేసి, పుట్టింటి నుంచి తీసుకుపోయిన సంఘటన నెగ్గిపూడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెగ్గిపూడి గ్రామానికి చెందిన చిర్ల శ్రీనివాసరెడ్డి, కనకలక్ష్మి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం తమ రెండో కుమార్తె పూజారెడ్డిని అదే గ్రామానికి చెందిన సత్తి శ్రీరామారెడ్డికి ఇచ్చి 2020లో వివాహం చేశారు.
మొదట్లో తమ కుమార్తెను అల్లుడు బాగానే చూసుకున్నాడని, బాబు పుట్టిన అనంతరం వేధింపులకు గురిచేస్తూ, కొట్టేవాడని చెప్పారు. 2022లో పెనుమంట్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉండగా ఈనెల 17న సాయంత్రం 4 గంటలకు అల్లుడు శ్రీరామారెడ్డి ఇంటికి వచ్చి తమను తిట్టడమే కాకుండా ఇంట్లోనే నిర్భంధించి కుమార్తె, మనవడిని బలవంతంగా తీసుకువెళ్లిపోయాడని చెప్పారు.
అనంతరం 100కి ఫోన్ చేస్తే పోలీసుల నుంచి స్పందన లేదని, గాయాలతో సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లామన్నారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని పోలీసులు చెప్పడంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై పెనుమంట్ర ఎస్సై సురేంద్రకుమార్‌ను సాక్షి వివరణ కోరగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఆసుపత్రి నుంచి సమాచారం వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment