సమన్వయంతో శివరాత్రి తీర్థం పనులు
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడు మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 8లో u
దేవదాయ శాఖ ఏసీ రంగారావు
కై కలూరు: అధికారులంతా సమన్వయంతో పనిచేసి కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి మహాశివరాత్రి కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని దేవదాయశాఖ సహాయ కమిషనర్ సీహెచ్ రంగారావు అన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై శనివారం ఆలయం వద్ద రెండో విడత సమావేశం నిర్వహించారు. ఈఓ వీఎన్‌కే శేఖర్ ఆధ్వర్యంలో ఆయా శాఖలు తీసుకున్న చర్యలపై చర్చ జరిగింది. సీఐ వి.రవికుమార్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా రెండు రహదారులు ఏర్పాటుచేశామని, సుమారు 200 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. కోనేరు వద్ద అపశ్రుతులు తలెత్తకుండా కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఎత్తు పెంచామన్నారు. ఈనెల 25న రాత్రి 1.20 గంటలకు స్వామి కల్యాణం నిర్వహిస్తామని ఈఓ తెలి పారు. 26న మహాశివరాత్రి తీర్థంతో పాటు రాత్రి తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు. అనంతరం అధికారులు కోనేరు, తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, దేవదాయశాఖ గుడివాడ తనిఖీదారు వి.సుధాకర్, ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎస్సై పి.ఆదినారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment