ఆప్కాస్ రద్దు నిర్ణయం తగదు
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ (ఆప్కాస్)ను రద్దు చేయాలని చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు నగరపాలక సంస్థ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద శనివారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆప్కాస్ రద్దు చేయొద్దు, ఆప్కాస్ ఉద్యోగులను ప్రైవేటు ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు అప్పజెప్పొద్దు, ఆప్కాస్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని నినదించారు. మున్సిపల్ వర్కర్స్ ఎంపాయీస్ యూనియన్ (సీఐటీ యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. సోమయ్య మాట్లాడు తూ 2019లో జగన్ ప్రభుత్వంలో ఆప్కాస్ సంస్థ నెలకొల్పారని, దీని వల్ల కార్మికులకు చాలా మేలు జరిగిందన్నారు. ప్రతినెలా 1వ తేదీనే జీతాలు ఇస్తున్నారని, పీఎఫ్, ఈఎస్‌ఐలు సకాలంలో చేస్తున్నారని, కనీస వేతనం అమలు చేస్తున్నారని అన్నారు. ఆప్కాస్ లేకుంటే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్య వహరిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆప్కాస్‌లో ఉన్న లక్ష మంది ఉద్యోగులతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని, నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆప్కాస్ రద్దు ఆలోచన వీడాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జా న్ బాబు, కేవీపీఎస్ నగర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment