బాలల చట్టాలు పక్కాగా అమలుచేయాలి
ఏలూరు (టూటౌన్): బాలల సంక్షేమం కోసం ఉన్న చట్టాలను అధికారులు పక్కాగా అమలుచేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్ సూచించారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శనివారం ఆయ న ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జ్యువనైల్ పోలీస్ యూనిట్‌కు జ్యువనైల్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల సంక్షేమ చట్టాలపై అధికారులు ఎప్పడికప్పుడు తర్ఫీదు పొంది చిన్నారుల సంక్షేమానికి కృషిచేయాలన్నారు. చట్టంతో విభేదించిన బాలలతో ప్రవర్తించాల్సిన విధి విధానాలు, వారికి కల్పించాల్సిన పు నరావాస సౌకర్యాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్యవివాహాల నిరోధానికి కృషిచేయాలన్నారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (సీని యర్ డివిజన్) కేకేవీ బులి కృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ జ్యువనైల్ యాక్ట్‌పై అవగాహన కల్పించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.శారద, డీసీపీఓలు సూర్య చక్రవేణి, రాజేష్, ప్రభుత్వ బాలుర వసతి గృహం సూపరింటెండెంట్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.
ఆ కాలేజీపై చర్యలు తీసుకోండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ అనుమతులు లే కుండా శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్ ఫర్ గరల్స్ అని కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తోందని, చర్యలు తీసుకోవాలని పీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనుమతులు లేకుండా కళాశాల యాజమాన్యం విద్యార్థులను చేర్చుకుంటోందని, విచారణ చేసి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు.
6 కేంద్రాలు..
4,415 మంది అభ్యర్థులు
గ్రూప్–2 పరీక్షలకు సర్వం సిద్ధం
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఆదివారం జరిగే గ్రూప్–2 పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్షలకు 4,415 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు ఉదయం 9.30 గంటల లోపు, మ ధ్యాహ్నం 2.30 గంటలలోపు కేంద్రాల్లోకి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9.45 గంటల తర్వాత గేట్లు మూసివేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బీసీఆర్ పీసీ సెక్షన్ విధించి రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు సమీపంలో జిరాక్స్ సెంటర్లు సైతం మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల సందేహాల నివృతికి కలెక్టరేట్‌లో సెల్ 99122 44293, 80085 39786 నంబర్లలో అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ముగిసిన టీసీసీ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 21 మందికి ఐదుగురు, హయ్యర్ పరీక్షకు 9 మందికి ఐదుగురు హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
25 నుంచి వీరంపాలెంలోశివరాత్రి ఉత్సవాలు
తాడేపల్లిగూడెం రూరల్: వీరంపాలెం శైవక్షేత్రంలో ఈనెల 25, 26, 27వ తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. శనివారం పీఠం ఆవరణలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 25న ఉదయం 9.23 గంటలకు కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అదే రోజు ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం 4 గంటలకు మేథా సరస్వతీ అమ్మవారికి లక్ష పుష్పార్చన, ధ్వజారోహణ, రాత్రి భూప్రస్తార శ్రీచక్రార్చన జరుగు తుందన్నారు. 26న స్ఫటిక లింగేశ్వరస్వామి వారికి మానస సరోవర జలంతో అభిషేకం, రాత్రికి శివపార్వతుల కల్యాణం, 27న గ్రామో త్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
బాలల చట్టాలు పక్కాగా అమలుచేయాలి
Comments
Please login to add a commentAdd a comment