గ్రూప్–2 రోస్టర్ విధానంలో తప్పులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రూప్–2 ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌లో ప్రకటించిన రోస్టర్ విధానంలో నెలకొన్న తప్పులను వెంటనే సవరించాలని గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పి.రఘురామ్ అనే అభ్యర్థి మాట్లాడుతూ రోస్టర్ విధానంలో తప్పుల కారణంగా అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నా ఏపీపీఎస్సీ అధికారుల్లో చలనం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు సమస్యలను తెలియజేసినా ప్రయోజనం లేదన్నారు. పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ మొండి వైఖరి వీడాలని, అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment