Eluru District News
-
మామిడిలో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
నూజివీడు: ప్రస్తుతం మామిడి తోటలు పూమొగ్గ దశ, పచ్చిపూత దశ, పూత దశలో ఉన్న దృష్ట్యా ప్రస్తుత ముసుగు వాతావరణ పరిస్థితులలో రైతులు సస్యరక్షణ చర్యలను చేపట్టాలని నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బొర్రా కనకమహాలక్ష్మి వెల్లడించారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గత రెండు, మూడు రోజులు గా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, అలాగే అల్పపీడనం వల్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు 22.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25.1 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతున్నాయన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల మామిడిలో రసం పీల్చే పురుగుల ఉధృతి, తెగుళ్ల ఉధృతి అధికమయ్యే ప్రమాదం ఉందన్నారు. మామిడి తోటలు పూమొగ్గ దశలో ఉంటే తేనె మంచు పురుగులు, పక్షికన్ను తెగులు, బూడిద తెగులు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ, క్లోరోథలోనిల్ 2 మిలీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. -
అలిగిన రొయ్య!
ఆకివీడు: రొయ్య.. అలిగింది.. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇది అక్షర సత్యం. గత 15 రోజులుగా రొయ్యలు మేతలు తినక పోవడంతో ఎదుగుదల పడిపోయింది. ఎన్ని మందులు చల్లినా ఫలితం దక్కడం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపత్యంలో రొయ్యల సాగుకు ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలికి తోడు మబ్బులు, చిరుజల్లులతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోయింది. దీంతో రొయ్యలకు సక్రమంగా ఆక్సిజన్ అందడం లేదు. ప్రతి క్షణం ఏరియేటర్లు తిరుగుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రత 23 డిగ్రీలకు పడిపోయింది. ఒక్కోసారి 18–20 డిగ్రీలకు పడిపోతుంది. చల్లటి వాతావరణంలో రొయ్యలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఆక్సిజన్ అందకపోవడంతో రొయ్యలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. నెలా పదిహేను రోజుల నుంచి పెంపకం కొనసాగుతున్నా రొయ్యల్లో ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంది. మేతలు వృథాగా మట్టిలో కలిసిపోతున్నాయి. 200 నుంచి 150 కౌంటులో ఉన్న రొయ్యలకు వైరస్ సోకితే పట్టేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడిపోయిన రొయ్య ధర వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రొయ్యల వ్యాపారులు ధరలను ఒక్కసారిగా తగ్గించి వేశారని రైతులు వాపోతున్నారు. రొయ్యల్లో ఎదుగుదల లేకపోవడం, వైరస్ సోకడంతో 100 కౌంట్ ధర రూ.265 నుంచి రూ.250లకు పడిపోయిందంటున్నారు. దళారుల బెడదతో ధరలు తగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు, దళారులు ఇష్టానుసారం ధరలు తగ్గిస్తూ, పెంచుతూ నిలకడ లేకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేత తినకపోవడంతో మందగించిన ఎదుగుదల లబోదిబోమంటున్న ఆక్వా రైతులు -
రేపు విక్టరీ 3కే రన్
పెంటపాడు: మండలంలోని అలంపురం టీబీఆర్ జూనియర్ కళాశాల, డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం విక్టరీ 3కే రన్‌ను నిర్వహిస్తున్నట్లు సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ నాయకుడు బోగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో పోరాడిన 20 మంది యుద్ధవీరులను ఎంపిక చేసి సన్మానిస్తామని పేర్కొన్నారు. అలాగే నేషనల్డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ఆధ్వర్యంలో విద్యార్థులకు మూడు కేటగరీల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. ప్రథమ బహుమతి సాధించిన 10 మందికి ఉచితంగా విద్య అందిస్తామని పేర్కొన్నారు. అలాగే మొదటి 50 మందికి రాయితీతో కూడిన విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి భీమడోలు: కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన నాళం శివగణేష్ (28) చికిత్స పొందుతూ మృతి చెందాడని భీమడోలు హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామానికి చెందిన నాళం శివగణేష్(28) భీమడోలు లిక్సిల్ సెరామిక్ కంపెనీలో టీం లీడర్‌గా పని చేస్తూ భీమడోలులో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 1న శివగణేష్ ఇంటి వద్దనే మద్యం తాగుతుండడంతో భార్య లక్ష్మీ ప్రసన్న మద్యం తాగవద్దని, ఆరోగ్యం పాడైవుతుందని మందలించింది. మనస్తాపం చెందిన శివగణేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లి కొద్ది సేపటి తర్వాత వచ్చి కలుపు మందు తాగానని చెప్పడంతో భార్య లక్ష్మీ ప్రసన్న భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రికి భర్తను తీసుకుని వచ్చింది. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం శివగణేష్‌ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివగణేష్ మృతి చెందాడు. భార్య లక్ష్మీ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కట్నం వేధింపులపై ఫిర్యాదు యలమంచిలి: కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని అడవిపాలెం పంచాయతీ గగ్గిపర్రు గ్రామానికి చెందిన చెల్లింకుల వాణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం వాణికి 2021 సంవత్సరంలో పాలకొల్లు రూరల్ పంచాయతీ యాళ్లవానిగరువుకు చెందిన పాండురంగప్రసాద్తో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు పుట్టిన తరువాత ప్రసాద్ కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో వేధింపులను తట్టుకోలేక వాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు. -
నన్నయ యూనివర్సిటీ మహిళా వాలీబాల్ జట్టు ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆదికవి నన్నయ యూనివర్సిటీ తరఫున అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీల్లో తలపడే జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. స్థానిక సీఆర్ఆర్ మహిళా కళాశాలలో గురువారం, శుక్రవారం నిర్వహించిన అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారిణులను యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. కాగా ఈ పోటీల్లో జంగారెడ్డిగూడేనికి చెందిన సీఎస్టీఎస్ ప్రభుత్వ కళాశాల జట్టు విజేతగా నిలువగా గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ జట్టు ద్వితీయ స్థానంలో, ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళశాల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. యూనివర్సిటీ జట్టు తరఫున ఆడే జట్టుకు కె.జయశ్రీ, యూఎన్డీ భవాని, వి.ఉషా నాగబాల, టి.రోహిణి, సీహెచ్ పల్లవి, పి.రమ్య, జి.జయశ్రీ, ఎల్.జ్యోతిలక్ష్మి, టి.శైలజ, జి.ప్రసన్న జ్యోతి, ఎం.నాగ తులసి, డి.మల్లేశ్వరి ఎంపికయ్యారు. వీరితో పాటు స్టాండ్ బై క్రీడాకారిణులుగా ఎం.లావణ్య, బి.అనిత, సీహెచ్ శోభారాణి, వి. ప్రవల్లికలను ఎంపిక చేశారు. ఈ జట్టు జనవరి 7 నుంచి 11వ తేదీవరకూ తమిళనాడులోని జెప్పియర్ యూనివర్సిటీలో నిర్వహంచే దక్షిణ భారత స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలో నన్నయ యూనివర్సిటీ తరఫున పాల్గొంటారు. అంతకు ముందు జరిగిన పోటీల్లో విజేతలకు సీఆర్ఆర్ మహిళా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్స్‌పాల్ జీ. సరళ బహుమతులు అందజేశారు. పశువధపై చర్యలు తీసుకోవాలి భీమవరం(ప్రకాశం చౌక్): తణుకు మండలం తేతలి గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న పశువధశాలలో ప్రతిరోజూ వందలాది పాడి పశువులను వధిస్తున్నారని రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి ఆరోపించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌కు అక్రమ పశువధశాల బాధితులతో వచ్చి అక్రమ పశువధపై చర్యలు తీసుకోవాలని అందుబాటులో ఉన్న వన్‌టౌన్ ఎస్సై కిరణ్‌కు వినతిపత్రం అందించారు. పశువధ విషయాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, కాబట్టి కలెక్టర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రామ్రాజ్ కాటన్ షోరూమ్ ప్రారంభం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో రామ్రాజ్ కాటన్ షోరూమ్ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఏలూరు రోడ్లో షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్‌ను యజమాని కానూరి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు యశ్వంత్, శ్రీనివాసరావు తల్లి సత్యనారాయణమ్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, వైఎస్సార్ సీపీ నాయకులు బత్తిన చిన్న, రామ్రాజ్ కాటన్ జీఎం శశీంద్రన్ నాయక్, కానూరి సూర్యకుమారి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేయగా, కౌంటర్‌ను వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మండవల్లి సోంబాబు ప్రారంభించి, కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా రామ్రాజ్ జీఎం శశీంద్రన్ నాయక్ మాట్లాడుతూ తమ వద్ద రామ్రాజ్ ప్రోడక్ట్స్ అనగా పట్టుపెంచెలు, కండువాలు, చీరలు, రెడీమేడ్ షర్ట్స్, ఫ్యాంట్స్, జెంట్స్ క్లాత్ ఫాంటింగ్, షర్టింగ్ అన్నీ రామ్రాజ్ బ్రాండ్‌లో లభిస్తాయని తెలిపారు. షోరూమ్ యజమాని కానూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మా సొంత వ్యాపారంలో అనుభవం ఉన్న ప్రావీణ్యంతో చక్కగా అందరికీ సరసమైన ధరలలో అందరికీ కావాల్సిన దుస్తులను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అందరూ విచ్చేసి మాధవి క్లాత్ అండ్ రెడీమేడ్స్ షోరూమ్‌కు అందించినట్లుగానే, తమ రామ్రాజ్ షోరూమ్ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. -
అన్నదాతకు వాయుగండం
ఆరబెట్టిన ధాన్యపు రాశులపై టార్పాలిన్ కప్పి ఉంచిన దృశ్యం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల చిరుజల్లులు పడడంతో శుక్రవారం రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. అత్తిలి మండలంలో దాదాపుగా నూరు శాతం వరికోతలు పూర్తయ్యాయి. నూర్పిడి చేసిన ధాన్యాన్ని రైతులు రోడ్ల వెంబడి రాశులు పోసి ఆరబెట్టగా ఆకాశం మేఘావృతం కావడంతో వాటిని పోగు చేసి టార్పాలిన్లు కప్పారు. తేమ శాతం ఉన్నప్పటికీ కొంతమంది రైతులు ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుందామని రైస్ మిల్లులకు తరలించారు. – అత్తిలి -
పెరుగుతున్న పెట్టుబడి
రొయ్యల సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. శీతాకాలం దానికి తోడు వాయుగుండ ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్ పడిపోతుంది. ఏరియేటర్లు తిప్పినా ఫలితం ఉండటం లేదు. – ఇంటి ప్రేమానందం, ఆక్వా రైతు, చినమిల్లిపాడు రొయ్యలు మేత తినడం లేదు ప్రస్తుత రొయ్యల సాగు తుఫాన్, వాయుగుండం ప్రభావాలకు గురై అతలాకుతలమవుతుంది. చలి గాలులతో పాటు తెలికపాటు జల్లుల వల్ల రొయ్యకు ఆక్సిజన్ అందడం లేదు. ఎదుగుదల లేక, వైరస్‌లతో సతమతమవుతున్నాం. దీంతో పెట్టుబడులు అధికమై, ధర లేక కుదేలవుతున్నాం. – నంద్యాల సీతారామయ్య, ఆక్వా రైతు, కుప్పనపూడి సిండికేట్‌గా వ్యాపారులు వాతావరణం మార్పులతో రొయ్యలు రోగాలబారిన పడుతున్నాయి. ఇమ్యునిటీ తగ్గిపోయి వైరస్లు సోకే ప్రమాదం ఉంది. అలాగే రొయ్య ధరలు తటస్థంగా ఉండటంలేదు. వ్యాపారులు సిండికేట్‌గా తయారై ధరలు నిర్ణయిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలి. – పిల్లా నర్శింహరావు, ఆక్వా రైతు, ఆకివీడు -
సామాజిక అసమానతలతో ఓబీసీలకు అన్యాయం
భీమవరం: దశాబ్దాల తరబడి దేశం గర్వపడే స్థాయిలో తమ వంతు పాత్ర పోషించినప్పటికి ఓబీసీలకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని, అధికార పాలక వర్గాలు ఓబీసీలను వెనుకబాటు తనంలోకి నెట్టివేస్తుందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విమర్శించారు. భీమవరం టౌన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఓబీసీల స్థితిగతులు మెరుగుపడాలంటే కులగణనే పరిష్కార మార్గమని, 2010లో బీజేపీ ప్రతిపక్ష పార్టీ హోదాలో లోక సభలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని, అధికారానికి వచ్చారు కానీ ఓబీసీ జనగణన చేపడతారన్న నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని, బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంత్ రావు, జిల్లా నాయీబ్రాహ్మణ అధ్యక్షుడు కొడవర్తి శివప్రసాద్, గుడాల శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వర రావు, మల్లుల కేదరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి చుట్టాలకు బస్సులు రెడీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సంక్రాంతి పండుగంటే గోదావరి జిల్లాల్లో సందడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో పిండి వంట ఘుమఘుమలతో పాటు పంట చేతికందగానే రైతులు చేసే రైతు పండుగ కాబట్టి గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ పెట్టింది పేరు. కాబట్టి సొంతూళ్లకు దూరంగా ఉన్న వారు కచ్చితంగా సంక్రాంతికి సొంతింటికి చేరుకుని ఉల్లాసంగా పండుగ జరుపుకుంటారు. జిల్లాకు చెందిన ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగం, వ్యాపార రంగాల్లో స్థిరపడడంతో అక్కడి నుంచే జిల్లాకు వచ్చే జనాభా వేలల్లో ఉంటారు. వారందరినీ జిల్లాకు తీసుకురావడానికి ఆర్టీసీ ఇప్పటి నుంచే సిద్ధం అవుతుంది. ప్రత్యేక సర్వీసులు ఇలా పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి జిల్లా ప్రజలను తీసుకురావడానికి, పండుగ అనంతరం వారిని తిరిగి గమ్య స్థానాలకు చేర్చడానికి ఉమ్మడి పశ్చిమ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుంది. వీటిలో ఏలూరు జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి జనవరి 9 నుంచి హైదరాబాద్ నుంచి తీసుకురావడానికి, 15 నుంచి హైదరాబాద్‌కు తరలించడానికి మొత్తం 93 బస్సులను ఇప్పటికే ఆన్లైన్ రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం డిపోల నుంచి మొత్తంగా ప్రతి నిత్యం 20 ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచారు. ఇవి కాక ఏలూరు జిల్లా నుంచి ఏడాది పొడవునా ప్రతి రోజూ తిరిగే రెగ్యులర్ షెడ్యూల్ బస్సులతో పాటు మరో 29 అందుబాటులో ఉంటాయి. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తిరిగే 20 రెగ్యులర్ షెడ్యూల్ బస్సులు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సాధారణ టిక్కెట్ ధరలే వసూలు గతంలో పండుగల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సర్వీసుల్లో ప్రయాణికుల నుంచి 50 శాతం అధికంగా టిక్కెట్ ధరలు వసూలు చేసేవారు. దీంతో ప్రయాణికులు తమకు అందుబాటులో ఉన్న వాహనాల్లో అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ట్యాక్సీలు, రైళ్లు తదితర వాహనాల్లో వెళ్లేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవారు. దీనిపై సర్వత్రా వచ్చిన విమర్శలు రావడం, ఆర్టీసీ ఆదాయానికి గణనీయంగా గండి పడిన నేపథ్యంలో గత ఏడెనిమిదేళ్ల నుంచి సాధారణ టిక్కెట్ ధరలతో ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. గతేడాది సంక్రాంతి ఆదాయం రూ. 1.29 కోట్లు గతేడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 డిపోల నుంచి నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా ఆర్టీసీ రూ. 1.29 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది. దీంట్లో ఏలూరు జిల్లా నుంచి మొత్తం 307 ప్రత్యేక బస్సులను తిప్పారు. వాటిలో 144 హైదరాబాద్ నుంచి జిల్లాకు, 163 జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిప్పారు. వీటి ద్వారా మొత్తం 15590 మంది ప్రయాణం చేయగా 76,36,712 ఆదాయం వచ్చింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 డిపోల నుంచి హైదరాబాద్ నుంచి జిల్లాకు 88 బస్సులు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు 104 బస్సులు తిప్పారు. దీని ద్వారా మొత్తం 6 వేల మంది ప్రయాణించగా రూ. 53,16000 ఆదాయం వచ్చింది. టిక్కెట్ ధరల పెంపు లేకుండానే హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు డిపోల నుంచి సేవలు పది శాతం రాయితీ.. హైదరాబాద్ నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఒకే సారి రానుపోనూ టిక్కెట్లు రిజర్వ్ చేసుకుంటే టిక్కెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నాం. హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల ప్రజలకు ఇప్పటి నుంచే రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. సూపర్ లగ్జరీ బస్సులతో పాటు అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులో ఉంచాం. డిమాండ్ ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తాం. – ఎన్వీఆర్ వర ప్రసాద్, ఏలూరు జిల్లా ఇన్చార్జ్ ప్రజా రవాణా అధికారి -
దొంగ బంగారానికి దొడ్డిదారి
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో భారీగా బంగారం, వెండి, వజ్రాలతో జ్యూయలరీ షాపు యజమాని పరారు కావడంతో పట్టణంలోని బులియన్ మార్కెట్ ఒక్కసారిగా ఉల్కిపడింది. నిందితుడి కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి వేట కొనసాగిస్తున్నారు. గూడెంలో గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దొంగ బంగారం కొనడం, నకిలీ బంగారం తయారు చేయించండం వంటివి ఎన్నో.. దొంగ బంగారం వచ్చిన వెంటనే కరిగించే ఏర్పాట్లు కూడా ఉండేవి. బిల్లులేని వ్యాపారం, ఎస్టిమేటు కాపీలతో ఆభరణాల తయారీ, తప్పుడు పనులు చేసే వారికి గూడెం రాచమార్గంగా కనిపించింది. తాజాగా బంగారు టోకరా ఉదంతం ఇక్కడ బంగారం వ్యాపారంలోని లొసుగులను బట్టబయలు చేసింది. మూడు బిస్కెట్లు.. ఆరు లాకెట్లు గూడెంలో దొడ్డి దారిన బంగారం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగేది. అమాంతంగా కోటీశ్వరులు కావాలనే ఆశలతో దొంగ బంగారం కొని సొమ్ము చేసుకునేవారు. ఏడాదికి ఒకటిలేదా రెండు కేసులు పోలీసులకు చెబితే చాలనే భావన పెంచుకున్నారు. అదే ఫార్ములాతో కొన్నేళ్ల పాటు వ్యాపారం సాగించారు. వీరి బాగోతం తణుకులోని ఒక నగల దుకాణంలో జరిగిన చోరీతో బహిర్గతమైంది. తణుకులోని నరేంద్ర సెంటర్లో ఉన్న జడావి జ్యూయలర్స్‌లో భారీ చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి చేధించే క్రమంలో పోయిన నగలను తాడేపల్లిగూడెంలోని టూటౌన్‌కు చెందిన వ్యాపారి ఒకరు కొన్నట్లు గుర్తించారు. బంగారు దుకాణంలో విక్రయించే ఆభరణాల వెనుక ట్రేడ్‌మార్కు గుర్తు ఉంటుంది. ఆ గుర్తులను బట్టి దొంగిలించిన నగలు గూడెం దుకాణదారుడు కొన్నట్టుగా పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత అరెస్టు చేసి ప్రశ్నించగా.. గూడెం వ్యాపారి నేరాన్ని అంగీకరించాడు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత ఒక వ్యాపారి ప్రోద్బలంతో టూటౌన్లో మోడరన్ కేఫ్ దాటాక బంగారు దుకాణంలో చోరీకి ఏకంగా సొరంగం తవ్వి ఆనక పోలీసులకు దొరికిపోయారు. 2001 సంవత్సరంలో దొంగబంగారు వ్యాపారం గూడెంలో మూడు బిస్కెట్లు, ఆరు లాకెట్లుగా సాగింది. దొంగ మార్గంలో బంగారం, అభరణాలు కొనుగోలు చేసిన కొందరు వ్యాపారులు ఇళ్ల దగ్గర సెటప్ చేసుకున్న ఊక పొయ్యల్లో కరిగించే ఏర్పాట్లు ఉండేవి. వెండి వస్తువులపై బంగారు పూతతో మోసం గతంలో ఒక వ్యాపారి బంగ్లాదేశ్ నుంచి బంగారు ఆభరణాలు తయారుచేయడానికి వచ్చిన వారితో నాసిరకం బంగారం వస్తువులు తయారు చేయించేవాడు. వెండి వస్తువులపై రాగి కోటింగ్, దానిపై బంగారు పూత వేయించి విక్రయించేవాడు. ఇలా వస్తువులు తయారు చేయడానికి పనివారికి అడ్వాన్సులుగా పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చేవారు. సొమ్ములు సకాలంలో చెల్లించకపోయినా, వస్తువులను సకాలానికి అందించక పోయినా వివిధ శిక్షలు వేసే వారు. రాత్రిపూట వివస్త్రల్ని చేయించి, సిగరెట్ వాతలు పెట్టేవారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. ‘గూడెం బంగారం’ లోగుట్టు బట్టబయలు వ్యాపారి పరారీతో గత ఉదంతాలు గుర్తు చేసుకుంటున్న జనం -
సబ్ కలెక్టర్‌గా స్మరణ్‌రాజ్ బాధ్యతల స్వీకరణ
నూజివీడు: నూజివీడు సబ్ కలెక్టర్‌గా 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బచ్చు స్మరణ్ రాజ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు చెందిన స్మరణ్‌రాజ్ ట్రైనీ కలెక్టర్‌గా అనకాపల్లి జిల్లాలో పనిచేయగా, తొలి పోస్టింగ్‌లో నూజివీడు సబ్ కలెక్టర్‌గా నియమించారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ మోవిడి వాణి సీసీఎల్ఏ ఆఫీసుకు బదిలీ అయ్యారు. సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యతగా పనిచేస్తానన్నారు. ఉపాధి కల్పనకు ప్రాధాన్యం నూజివీడు: నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో శుక్రవారం మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మెగా జాబ్‌మేళాకు దాదాపు 31 కంపెనీల ప్రతినిధులు వచ్చారని, నిరుద్యోగ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 8 స్కిల్ హబ్‌ల్లో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్‌రాజ్, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. 40 మందికి పదోన్నతులు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని వివిధ పురపాలక యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ శుక్రవారం రాత్రి దాదాపు 10.30 గంటల వరకూ కొనసాగింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 40 మందికి పదోన్నతులు కల్పిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఉత్తర్వులిచ్చారు. ఏలూరు నగర పాలక సంస్థలో ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లలో బయోలాజికల్ సైన్స్ ఒకరికి, ఇంగ్లీష్ ఒకరికి, గణితం ఒకరికి, సోషల్ ఇద్దరికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. మున్సిపల్ యాజమాన్యాల్లోని నలుగురికి గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా, మరో ముగ్గురికి ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించారు. వీరితో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పని చేస్తున్న వారిలో ఫిజికల్ సైన్స్ నలుగురికి, సోషల్ 8 మందికి, బయోలాజికల్ సైన్స్ ఐదుగురికి, ఇంగ్లీష్ ముగ్గురుకి, గణితంలో ఐదుగురికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. దళిత మహిళా సర్పంచ్‌పై దాడి ఉండి: ఉండి పంచాయతీ దళిత మహిళా సర్పంచ్‌పై వార్డు సభ్యురాలి భర్త, మరికొందరు దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం పంచాయతీ సమావేశంలో జరిగింది. ఉండి సర్పంచ్‌గా దళిత మహిళ కమతం సౌజన్య గెలుపొందగా, ఆమె భర్త కమతం బెనర్జీ వార్డు సభ్యుడిగా ఉన్నారు. కొంతకాలంగా పంచాయతీ సమావేశాలకు మహిళా వార్డు సభ్యుల స్థానంలో వారి భర్తలు హాజరవుతుండటంతో సర్పంచ్ అభ్యంతరం చెబుతున్నారు. శుక్రవారం సమావేశానికి 11వ వార్డు సభ్యురాలు కాగిత నాగమణి భర్త విజ్జు హాజరవడంతో సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సర్పంచ్‌పై విజ్జు దాడికి పాల్పడ్డాడు. తన భార్యను ఎందుకు కొట్టారని సర్పంచ్ భర్త ప్రశ్నించగా, ఆయనపై విజ్జు, మరో వార్డు సభ్యుడు అడబాల వరప్రసాద్ దాడి చేశారు. తాను దళిత సర్పంచ్ కావడంతోనే పలుమార్లు తనను అవమానపరిచారని, ఇప్పుడు ఏకంగా దాడి చేశారని మీడియా ఎదుట ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం సర్పంచ్, ఆమె భర్త భీమవరం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. -
హోం మంత్రిని బర్తరఫ్ చేయాలి
ఏలూరు (టూటౌన్): అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పాతబస్టాండ్ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహంవద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు. నేర చరిత్ర కలిగిన అమిత్ షా భారత దేశ రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కురెళ్ల వరప్రసాద్, కొండేటి బేబి, భజంత్రీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు. నిరసనలో చాగంటి సంజీవ్, పల్లెం ప్రసాద్, నేతల రమేష్ బాబు, మేతర అజయ్ బాబు, దాసరి నాగేంద్ర కుమార్, కాపుదాసి రవి తదితరులు పాల్గొన్నారు. -
దార్శనిక నేత విద్యాప్రదాత
● ప్రపంచంతో విద్యార్థులు పోటీపడేలా ట్యాబుల పంపిణీకి శ్రీకారం ● రెండేళ్లలో 38,393 మందికి ట్యాబులు అందజేత ● విద్యాదీవెన, వసతి దీవెనలతో ఉన్నత విద్యకు తోడ్పాటు ● అమ్మ ఒడిలో ఏటా రూ.15 వేలు తల్లుల ఖాతాలో జమ ● కూటమి పాలనలో తల్లికి వందనం అంటూ ఎగనామం క్లాస్‌రూంలో టేబుల్‌పై ట్యాబులతో విద్యాభ్యాసం.. కార్పొరేట్ స్కూళ్లలో కనిపించే ఈ విధానం సర్కారు స్కూళ్లలో అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా, పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా నాలుగేళ్లలో వైఎస్ జగన్ కృషితో ప్రభుత్వ విద్యా విధానంలో వచ్చిన విప్లవాత్మక మార్పునకు నిదర్శనమిది. శిధిలావస్థకు చేరిన పాఠశాలలకు మహర్దశ.. క్లాస్‌రూమ్‌లో సౌకర్యాలు.. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యాదీవెన, విదేశీ విద్య.. పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం ఇలా వైఎస్ జగన్ హయాంలో విద్యా రంగానికి పెద్దపీట వేశారు. – సాక్షి ప్రతినిధి, ఏలూరు -
సర్కారు స్కూళ్లకు కొత్త రూపు
2019 నాటికి శిథిల భవనాలు, పెచ్చులు ఊడే పైకప్పులు, రాళ్లు పైకిలేచిన ప్లోరింగులు, కలుషిత తాగునీరు, దుర్గంధం వెదజల్లే టాయిలెట్లు, రక్షణ గోడలు లేక అసాంఘిక కార్యకలాపాలతో అధ్వాన స్థితికి చేరిన ప్రభుత్వ బడులకు నాటి సీఎం జగన్ కొత్త ఊపిరిలూదారు. నాడు – నేడులో తొలి విడతగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 648 పాఠశాలలను ఎంపిక చేసి రూ.134.84 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడతగా 889 పాఠశాలల అభివృద్ధికి రూ. 295.54 కోట్లు కేటాయించారు. డిజిటల్ క్లాస్రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహారీ గోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మేజర్, మైనర్ మరమ్మతులతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. రెండో విడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ పనులు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో రూ.150 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో నాడు – నేడు పనులు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన నిధులు విడుదల చేయలేదు. -
పుట్టిన రోజున ట్యాబుల పంపిణీ
ప్రపంచంతో పేద విద్యార్థులు పోటీపడేందుకు వీలుగా దృశ్య, శ్రవణ విద్య ద్వారా వారిలోని అభ్యసన సామర్థ్యం పెంపొందించేందుకు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. 2022 డిసెంబరు 21న తన పుట్టినరోజున 8వ తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అప్పటి సీఎం జగన్ ట్యాబుల పంపిణీ ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో 2022– 23 విద్యా సంవత్సరంలో 18,370 విద్యార్థులు, 2613 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో 17,410 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏలూరు జిల్లాలో 16614 మంది ఉండగా వారు ట్యాబుల కోసం ఎదురు చూస్తున్నారు. -
పోషకాల గోరుముద్ద
విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలోను జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆకర్షణీయ మెనూతో రోజుకో కొత్త రుచిని అందిస్తూ జగనన్న గోరుముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ రైస్‌తో పాటు రాగిజావ, కోడిగుడ్డు, చిక్కీలతో విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించింది.ఉన్నత విద్యకు భరోసా ఆర్ధికపరమైన ఇబ్బందులతో పేద విద్యార్థులు మధ్యలో ఉన్నత చదువులు మానేయకుండా జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా వారికి అవసరమైన ఆర్ధిక సాయాన్ని తల్లుల ఖాతాలకు జమచేస్తూ వచ్చారు. సీఎం జగన్ పాలనలో క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మొత్తాన్ని జమచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలుగా విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయలేదు. -
గత ఐదేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకంలో
సంవత్సరం విద్యాదీవెన లబ్ధి వసతి దీవెన లబ్ధి విద్యార్థులు (రూ.కోట్లలో) విద్యార్థులు (రూ.కోట్లలో) 2019–20 36,527 95.78 36,580 36.86 2020–21 37,148 77.97 37,750 35.76 2021–22 38,677 105.67 36,350 34.76 2022–23 33,655 81.53 32,316 30.96 2023–24 29,111 22.45 –––– ––––– -
అమిత్‌షా వ్యాఖ్యలపై మండిపాటు
ఏలూరు (టూటౌన్): కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడారంటూ దిష్టిబొమ్మ దహనం, కొవ్వొత్తులతో నిరసన తెలుపుతూ అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం షెడ్యూల్ కులాల వారిని అవమానించిన అమిత్‌షాపై కేసు పెట్టాలన్నారు. భారతీయ బౌద్ధమసభ, సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షుడు బేతాళ సుదర్శనం, దాసి లీలా మోహన్, బేతాళ నాగరాజు, చొప్పల సాయిబాబా, ఎ.సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భౌగోళిక గుర్తింపునకు కృషి తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటలకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి చేస్తోందని వక్తలు అన్నారు. వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన పంటల ఉత్పత్తుల్లో భౌగోళిక గుర్తింపు, విధానాలు, ప్రక్రియలు అనే అంశంపై గు రువారం ఆన్లైన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐపీఆర్ రిసెల్యూట్ హెడ్ సుభజిత్ సాహా మాట్లాడుౖౖౖతూ భౌగోళిక గుర్తింపు అప్లికేషన్ పద్ధతులు, లోగో తయారీ, సాంకేతిక అవసరాలపై అవగాహన కల్పించారు. ఉద్యాన వర్సిటీ వీసీ కె.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటలకు హబ్‌గా మారిందన్నారు. దుర్గాడ మిరప, అరటి సుగంధాలు, పోలూరు వంకాయ, కాకినాడ రోజ్, నూజివీడు చిన్నరసాలు, పండూరి వారి మామిడి, బాపట్ల వంకాయ, మైదుకూరు పసుపునకు భౌగోళిక గుర్తింపు సాధించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పరిశోధన సంచాలకులు ఎం.మాధవి మాట్లాడుతూ భౌగోళిక గుర్తింపు సాధించేందుకు సహకారం అందిస్తామన్నారు. రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, డీన్ ఆఫ్ హార్టీకల్చర్ ఎల్.నారం నాయుడు, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ కేటీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 21న పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎన్నిక భీమవరం (ప్రకాశంచౌక్): గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపికకు ఈనెల 21న ఎన్నికలను నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో కమిటీకి సంబంధించి ఒక అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులకు అభ్యర్థులను ఎంపికచేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 14 డీసీలు, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 డీసీలు, ఏలూరు జిల్లా నుంచి 4 డీసీలు మొత్తం 20 నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులతో డెల్టా ప్రాజెక్ట్ కమిటీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల అధికారిగా జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డిని నియమించామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం భీమవరం: జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టడంతో పాటు మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. అధికారులు గ్రామ సందర్శనలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేయాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సైబర్, సోషల్ మీడియా క్రైమ్స్, మహిళా సంబంధిత నేరాలు, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అడిషినల్ ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు, సైబర్–సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ జీవీవీ నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ అహ్మదున్నిషా పాల్గొన్నారు. -
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..
భీమడోలు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమడోలు పంచాయతీ పరిధిలోని అరుంధతీ కాలనీకి చెందిన నల్లభరికి లక్ష్మణ రావు(42) కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అతనికి వివాహం కాగా భార్య, ఇద్దరు సంతానం. లక్ష్మణరావు మద్యానికి బానిసయ్యాడు. అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి మరలా తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య జ్యోతిని అడిగాడు. ఆమె మందలించడంతో మనస్థాపానికి గురైన లక్ష్మణరావు తన ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణరావును భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని రాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణరావు అన్నయ్య నల్లభరికి రాము ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. -
పదోన్నతుల కౌన్సెలింగ్‌పై అభ్యంతరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ గురువారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగే పదోన్నతుల కౌన్సెలింగ్‌కు సహకరించాలని కోరారు. తెలుగు, హిందీ ఉపాధ్యాయులు మినహా మిగిలిన వారికి పదోన్నతులు కల్పించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డిదొర మాట్లాడుతూ గతంలో ఏఏ సబ్జెక్టుకు, ఏఏ రోస్టర్, ఎవరెవరికి పదోన్నతులు కల్పించారు అనే విషయం పూర్తి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు పదోన్నతులు కల్పించాలని చూడటం సరికాదన్నారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ తదితర రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. దీనిపై పూర్తి సమాచారం కోరగా మున్సిపల్ కార్యాలయాల నుంచి పూర్తి సమాచారం ఇవ్వలేదని డీఈఓ కప్పదాటు సమాధానం చెబుతున్నారని సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటివరకు ఏలూరులో ఉర్దూ స్కూలుకు ప్రత్యేకంగా సీనియార్టీ జాబితా, రోస్టర్ లేకుండా కామన్ సీనియార్టీ మీదే పదోన్నతులు కల్పించారని, అయితే ఇప్పుడు కొత్తగా సీనియార్టీని ప్రత్యేకంగా చూపించి కొన్ని సబ్జెక్టులకు శాంక్షన్ పోస్టుల క్యాడర్‌ను తగ్గించి చూపుతున్నారని విమర్శించారు. ఈ మేరకు పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే పదోన్నతులు కల్పించాలని కోరారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డీఈఓ కప్పదాటు సమాధానంపై ఉపాధ్యాయ సంఘాల ఆందోళన -
కూటమి వాత.. ప్రజల వ్యథ
● ఉచిత ‘కార్పొరేట్’ విద్యకు మంగళం! ● ఉచిత ప్రవేశాలు పొందినా ఫీజులు చెల్లించాల్సిందే.. ● పాఠశాలల యాజమాన్యాల ఒత్తిడి ● విద్యాహక్కు చట్టానికి తూట్లు ● ఉచిత ప్రైవేట్ విద్యకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు ● 1వ తరగతిలో ప్రవేశాలకు 25 శాతం సీట్ల కేటాయింపు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
ఏలూరు (టూటౌన్): ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతో పాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతిఒక్కరిపై ఉందని ఆల్ ఇండియా అంబ్కేర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్ అన్నారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బీఆర్ అంబేడ్కర్‌ని తక్కు వ చేసి మాట్లాడటం దారుణమన్నారు. రాజ్యాంగంపై చర్చ జరపాలని ప్రతిపక్షం కోరినప్పుడు రా జ్యాంగం రాసిన అంబేడ్కర్ పేరు చెప్పకుండా వేరే వారి పేరు ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. అమిత్‌షా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పులవర్తి డేవిడ్, పాము మాన్ సింగ్,తెనాలి సురేష్,ిసీహెచ్ బాలకృష్ణ,నాని,నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే సుపరిపాలన వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ కె.వెట్రి సెల్వి అన్నారు. గురువారం ‘ప్రశాసన్ గావ్ కి ఒరే ’ సుపరిపాలనపై కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లకు వెబ్ కాస్టింగ్ ద్వారా న్యూఢిల్లీ నుంచి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కలెక్టర్ చాంబర్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కో సం నిబద్ధత కలిగిన పనితీరు చూపడం ముఖ్యమ న్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్ర జా సమస్యలు పరిష్కార వేదికను ప్రతి సోమ వారం నిర్వహిస్తూ జవాబుదారీతనం ఉండేలా సు పరిపాలన అందిస్తుందన్నారు. ఈనెల 24 వరకూ ‘ప్రశాసన్ గావ్ కి ఒరే’ క్యాంపెయిన్, ‘గుడ్ గవర్నెన్స్ వీక్’ నిర్వహిస్తున్నామన్నారు. అందరు అధికారుల సమన్వయంతో సుపరిపాలన దిశగా మెరుగైన సేవలందించాలన్నారు. -
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు!
శ్రీవారి దీక్ష.. సర్వ జగద్రక్ష చినవెంకన్న దివ్య క్షేత్రంలో పెద్ద ఎత్తున భక్తులు గోవింద మాలను స్వీకరించారు. గోవింద స్వాములతో శ్రీవారి క్షేత్రం కళకళలాడింది. 8లో uశుక్రవారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2024సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాడేపల్లిగూడెంలోని యాగర్ల పల్లిలో చదరపు గజం ప్రభుత్వ విలువ రూ.10 వేలు.. బహిరంగ మార్కెట్లో రూ.6 వేలు.. ఇకపై ప్రభుత్వ విలువ రూ.12 వేల వరకు పెరుగనుంది.. బహిరంగ మార్కెట్లో మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగడం లేదు.. ఇదే పరిస్థితి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో తీవ్ర సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంపై మరో ‘పోటు’ పడనుంది. భూ విలువలు సవరణకు ప్రతిపాదనలు ఖరారు చేసి సగటున 10 శాతం నుంచి 25 శాతం వరకు రేట్లనకు పెంపునకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శుక్ర వారం నుంచి పెంపు ప్రతిపాదనలను సబ్ రిజిస్ట్రా ర్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈనెల 24లోపు రాత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించి, 27న తుది ప్రతిపాదనలు ఖరారు చేసి జనవరి 1వ తేది నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. రియల్‌పై మరో పిడుగు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైంది. ప్రధానంగా ఏడు నెలల నుంచి ఓపెన్ ప్లాట్ల నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు, ఇళ్లు, వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో పొలాలు ధరలు తిరోగమన బాటపట్టినా కాని కొనుగోలుదారులు ముందుకు రాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పశ్చిమలో ధరలు బాగా పెరుగుతాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడావుడి చేశారు. కట్‌చేస్తే.. స్థానికంగా రియల్ మార్కెట్‌పై ప్రజల్లో ఆసక్తి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఏలూరు జిల్లా పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రధానంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పా లకొల్లులో రియల్ మార్కెట్ రెండేళ్ల క్రితం వరకు ఆ శాజనకంగా సాగింది. ఈ ఏడాదిలో మొత్తంగా 140,449 రిజిస్ట్రేషన్లు జరగ్గా 50 శాతానికిపైగా తనఖా, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు కావడమే గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు మరింత ఇబ్బందికరంగా మారనుంది. పెంపు ప్రతిపాదనలు ఇలా.. న్యూస్రీల్ఏలూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 12 రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం (2024–25) రూ. 309.65 కోట్లు ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.214.43 కోట్లు పూర్తయిన లక్ష్యం 69.25 శాతం రిజిస్ట్రేషన్ల సంఖ్య 72,268 పశ్చిమగోదావరి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 15 రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం (2024–25) రూ.447.15 కోట్లు ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.260.92 కోట్లు పూర్తయిన లక్ష్యం 58.35 శాతం రిజిస్ట్రేషన్ల సంఖ్య 68,181 ప్రభుత్వం పోటు భూములు, నిర్మాణాల విలువ పెంపునకు ప్రతిపాదనలు సగటున 10 నుంచి 25 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగే అవకాశం మార్కెట్లో మందగించిన ఆర్థిక లావాదేవీలు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు ఈ నిర్ణయంతో మరో ఎదురుదెబ్బ మార్కెట్ రేట్లకు సమానంగా రిజిస్ట్రేషన్ విలువలు ఏలూరు జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అర్బన్, రూరల్‌గా విభజించి ధరలు పెంచారు. భీమడోలు అర్బన్, రూరల్‌లో 15 శాతం, చింతలపూడి అర్బన్, రూరల్‌లో 10 నుంచి 15 శా తం, జంగారెడ్డిగూడెం అర్బన్, రూరల్‌లో 15 శా తం, పోలవరం అర్బన్‌లో 10 నుంచి 20 శాతం, రూరల్‌లో 10 నుంచి 25 శాతం పెంచారు. కా మవరపుకోట అర్బన్‌లో 10 నుంచి 20 శాతం, రూరల్‌లో 10 నుంచి 25 శాతం, వట్లూరు అర్బన్, రూరల్‌లో 15 శాతం, ఏలూరు అర్బన్‌లో 10 శాతం, రూరల్‌లో 10 నుంచి 15 శాతం, గణపవరం అర్బన్, రూరల్‌లో 10 నుంచి 15 శాతం, కై కలూరు అ ర్బన్లో 10 నుంచి 20 శాతం, రూరల్‌లో 10 నుంచి 25 శాతం, మండవల్లి, నూజివీడు, ముదినేపల్లి అర్బన్, రూరల్‌లో 10 నుంచి 20 శాతం పెంపుదలను ఆమోదించారు. పశ్చిమగోదావరి జిల్లా ప రిధిలో కార్యాలయాల్లో ధరల పెంపునకు సంబంధించి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలను పరిగణనలోనికి తీసుకుని సర్వే నంబర్ల ఆధారంగా విలువ పెంపు నిర్ధారించాలని సూచించి మూడు రోజుల్లోగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కూడా సగటున 10 నుంచి 25 శాతం పెంపు ప్రతిపాదనలను ప్రాథమికంగా ఆమోదించారు. -
పేదలపై ఫీజుల భారం
ఉండి ఎన్ఆర్పీ అగ్రహారానికి చెందిన రాజా తన కుమారుడిని ఉండిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సెక్షన్ 12 (1)సీ కింద గతేడాదిలో 1వ తరగతిలో చేర్పించారు. ప్రస్తుతం 2వ తరగతిలోకి రాగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని ఈ ఏడాది ఫీజు మొత్తం రూ.23 వేలు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడంతో అప్పు చేసి టర్మ్‌ల వారీగా ఫీజు చెల్లిస్తున్నారు.తణుకుకు చెందిన పి.వెంకటేశ్వరరావు విద్యాహక్కు చట్టంలో ఉచిత ప్రవేశం కింద తన కుమార్తెను పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థలో 1వ తరగతిలో చేర్పించారు. ఇప్పటివరకు ఫీజు ఊసెత్తని స్కూల్ యాజమాన్యం మొదటి రెండు టర్మ్‌లతో కలిపి ఫీజు మొత్తం రూ.27,000 చెల్లించాలని రెండు రోజుల క్రితం నోటీసు అందించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు.