‘సాక్షి’పై అరకమ కేసులు ఎత్తివేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కదం తొక్కారు. శనివారం నగరంలోని ఫైర్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం ర్యాలీగా ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన హక్కును కాలరాసినట్లేనన్నారు. అలాగే గత నెలలో కై కలూరుకు చెందిన న్యూస్ రైట్ దినపత్రిక ఎడిటర్ కూరెళ్ల కిషోర్‌పై కూటమి ప్రభుత్వానికి చెందిన కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. దీనిపై కేసు నమోదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణ మన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు కాగిత మాణిక్యరావు మాట్లాడుతూ ఇటీవల జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయన్నారు. అనంతరం టూటౌన్ సీఐ అశోక్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. నిరసన కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కిషోర్, రాష్ట్ర ఫొటోగ్రాఫర్స్ కార్యదర్శి షేక్ రియాజ్, సామ్నా జిల్లా కార్యదర్శి కూరెళ్ల కిషోర్, పోతురాజు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు సీహెచ్ రామకృష్ణరాజు, ఎం.రాజేష్‌కుమార్, కొల్లు శ్రీనివాస్, గంజి బెనర్జీ, కాయల మురళీమోహన్, ఉర్ల శ్రీనివాస్, రాము, కొత్తపల్లి వంశీ, రెడ్డి వెంకట నాయుడు, కొమ్మి రత్నకుమారి, సుబ్బారావు, గంజి చంటి, రవితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎన్‌వీ శివరావు, కట్టా ఏసుబాబు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
చింతలపూడిలో..
చింతలపూడి: స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా వైస్ ప్రెసిడెంట్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్‌కే ఆజాద్ మాట్లాడు తూ రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ కల్పించిందని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రైటర్ జయరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఏపీయూడబ్ల్యూజే సభ్యులు ఎస్‌కే అమీర్ పాషా, ప్రసాద్ రెడ్డి, ముతేశ్వరరావు, కృపావరం, గంధం నాగేశ్వరరావు, మూర్తి, ఖలీల్, సంజయ్, సురేష్, రజినీ, కిషోర్, సుధాకర్, వెంకట్, శివ, బాలు పాషి, సునీల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన జర్నలిస్టులు
ఉంగుటూరులో నిరసన
ఉంగుటూరు: ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల విలేకరులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉంగుటూరు ప్రెస్‌క్లబ్ గౌరవాధ్యక్షుడు పీవీ పెద్దిరాజు, అధ్యక్షుడు ముప్పన భుజంగరావు, కార్యదర్శి పీఈ సత్యనారాయణ, కోశాధికారి గుత్తికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’పై అరకమ కేసులు ఎత్తివేయాలి


