breaking news
Eluru District Latest News
-
పోలీసుల సేవలు భేష్
ఏలూరు టౌన్: తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను ఏలూరు టూటౌన్ పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అలాగే పర్సు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి అప్పగించారు. దీంతో పోలీసుల సేవలను ప్రశంసిస్తున్నారు. ఏలూరు టూటౌన్ పరిధిలోని తాపీమేసీ్త్ర కాలనీకి చెందిన నరేష్, భార్గవిలకు బండి హర్షిణి సహస్ర (3), తేజీ శ్రీదస్ (5) అనే చిన్నారులు ఉన్నారు. వీరు ఇంటివద్ద ఆడుకుంటూ మంగళవారం బయటకు వెళ్లి తప్పిపోయారు. తల్లిదండ్రులు ఎంత వెదికినా పిల్లలు కనిపించకపోవడంతో డయల్ 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ వెంటనే ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్‌కుమార్‌ను అప్రమత్తం చేయగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిమిషాల వ్యవధిలో చిన్నారులు ఇద్దరూ లంకపేట ప్రాంతంలో ఉండగా గుర్తించిన టూటౌన్ ఎస్సై మధు వెంకట రాజా, సిబ్బంది పిల్లలను ఇంటికి చేర్చారు. పర్సు అప్పగింత హైదరాబాద్‌కు చెందిన ఎర్రమిల్లి ఉదయ్‌శర్మ ఏలూరులోని ఎస్ఎంఆర్ నగర్లో నివాసం ఉంటున్న తన కుమార్తె ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన రైల్వే స్టేషన్ పరిసరాల్లో తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో రూ.8700 నగదు, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయి. ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్ ఎన్.శ్రీనివాస్, ఈ.సతీష్‌కి ఆ పర్సు దొరకగా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బాధితుడు ఉదయ్‌శర్మ వివరాలను సేకరించి మంగళవారం ఆ పర్సును అతడికి అందజేశారు. -
పందెం బరులు పంచుకున్నారు
డంపింగ్ యార్డులో మంటలు పాలకొల్లు యడ్లబజారు సెంటర్ డంపింగ్ యార్డులో మంగళవారం తారాజువ్వ పడి మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. IIలో uబుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 లకుపైగా పందెం బరులు సిద్ధమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి పందెం కోళ్లు ఢీకొట్టనున్నాయి. పండగ మూడు రోజులు పాటు విచ్చల విడిగా కోడి పందేలు, జూద క్రీడలు కొనసాగేలా భారీ ఏర్పాట్లు చేశారు. దానికనగుణంగా ఎక్కడా పోలీసుల అభ్యంతరం లేకుండా అన్ని చక్కదిద్దేశారు. కొన్ని బరుల్లో కార్ల బహుమానం, మరికొన్ని చోట్ల ఏఏ సమయాల్లో ఏ స్ధాయి పందేం జరుగుతుందో వివరాలను సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు బరుల్లో రూ.కోటి పందేలు నిర్వహించనున్నారు. పేకాట, గుండాట, కోతాట శిబిరాలు ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో సంక్రాంతి పోటీల పేరిట నాలుగు రోజుల క్రితమే బరులను పూర్తిస్ధాయిలో సిద్ధం చేశారు. మంగళవారం వరకు సంప్రదాయ పోటీలు నిర్వహించి బుధవారం నుంచి పందెం బరులుగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే కీలకంగా వ్యవహరిస్తూ పోటీలు పడి మరీ భారీ బరులు ఏర్పాటు చేస్తున్నారు. హైకోర్టు నిషేధాజ్ఞల నేపథ్యంలో పోలీసులు మొక్కుబడిగా అక్కడక్కడ చిన్నబరులను ధ్వంసం చేసి పొలిటికల్ బరులవైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా అన్ని సిద్ధం చేసి పందాలకు రెడీ అయ్యారు. ఈ ఏడాది కోడి పందేలల్లో పదుల సంఖ్యలో పేకాట, గుండాట, కోతాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది నిర్వాహకులు భారీ ధరకు ముందస్తుగానే విక్రయించారు. భీమవరంలో ఒక బరిలో జూదక్రీడలన్నీ కలిపి అత్యధికంగా రూ.1.40 కోట్లకు విక్రయించారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, నూజివీడు, తణుకులోనూ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు విక్రయాలు చేశారు. ప్రజాప్రతినిధులే నిర్వాహకులు జిల్లాలో ఈ సారి కీలక నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులే కీలక నిర్వాహకులుగా మారి పనులన్నీ నిర్వహించడానికి ఏజెన్సీలకు, జూదరులకు బరులు అప్పగించారు. నూజివీడు నియోజకవర్గంలోని మీర్జాపురంలో మంత్రి కొలుసు పార్థసారథి సహకారంతో భారీ బరి ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు సిద్ధం చేశారు. మూడు రోజులు పాటు ఎక్కువ పందేలు గెలిచిన వారికి కారును, ఒక్కొక్క రోజు ఎక్కువ పందేలు గెలిచిన వారికి కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రోజుకు సగటున 22 పందేలు రూ.25 లక్షల స్ధాయిలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. సినీ సెట్టింగుల హంగులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో దుగ్గిరాలలో బరి ఏర్పాటు చేశారు. ఏలూరు మండలం జాలిపూడిలో పందెం బరిఏలూరు మండలం మాదేపల్లిలో పేకాట శిబిరం మినీ స్టేడియంను తలపించే రీతిలో ఏర్పాట్లు.. మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్లు, మద్యం, మాంసం కోసం ప్రత్యేకంగా ఏసీ కంటైనర్లతో తాత్కాలిక గదులు, భారీ స్వాగత ద్వారాలతో కోడి పందేల బరులు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి నుంచి మూడు రోజులు కోడి పందేలకు సర్వం సిద్ధమైంది. పందేలతో పాటు పెద్ద ఎత్తున గుండాట, పేకాట శిబిరాలకు ఏర్పాట్లు చేశారు. వీటిలో ఎక్కువ శాతం కూటమి నేతలు పంచుకుని జేబులు నింపుకునే పనిలో పడ్డారు. పశ్చిమలో అనేక చోట్ల ప్రజాప్రతినిధులే నిర్వాహకులు భీమవరం, ఉండి, దెందులూరు, నూజివీడు, ఉంగుటూరులో భారీ బరులు సంప్రదాయం మాటున కత్తి కట్టిన కోడిపందేలు బరుల్లో సినీ సెట్టింగ్‌లు, క్యారవాన్లు, ఏసీ ట్రక్కుల్లో ప్రత్యేక ఆతిథ్యాలు మీర్జాపురంలో కార్లు బహుమానం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300కుపైనే పందెంబరులు -
పాపికొండల్లో హాయి హాయిగా..
బుట్టాయగూడెం: గలగల పారే గోదారిలో లాంచీ ప్రయాణం నడుమ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఒక అద్భుతం. అందులోని గోదారమ్మను ఆనుకొని పాపికొండల నడుమ సాగే బోటు ప్రయాణం ఓ మధురానుభూతి. దీంతో పాపికొండలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పర్యాటకులు ఆసక్తికగా ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి పండుగ వేళ సెలవులు దొరకడంతో కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు పర్యాటకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల టూర్‌కు వెళ్లేందుకు ఇప్పటికే కొందరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు సెలవులపై వచ్చిన వారు సైతం ఇక్కడ చిల్ అయ్యేందుకు తరలి వస్తుండడంతో పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సందర్శన స్థలాలు పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కార్టేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ శివుడిని దర్శించుకోవచ్చు. అలాగే గోదావరి వెంబడి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనస్సును దోచుకుంటుంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టును తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. గిరిజనుల ఆప్యాయత, ఆదరణ పేరంటాలపల్లి పర్యాటకులకు గిరిజనుల ఆప్యాయత, ఆదరణ నాగరిక సమాజానికే తలమానికం. అక్కడి కొండరెడ్డి గిరిజనులు పర్యాటకులకు వారు వెదురుతో తయారు చేసిన రకరకాల కళాకృతులను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పాపికొండల పర్యటనకు వెళ్లిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవి కొనుగోలు చేసి యాత్రకు గుర్తుగా ఇళ్లకు తీసుకువెళ్తూ ఉంటారు. గండిపోచమ్మ గుడి నుంచి ప్రశాంతమైన, సుందరమైన గోదావరి అలలపై సాగే సుమారు 5 గంటలకు పైగా ఈ యాత్ర ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. కాగా పర్యాటకులకు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి సంక్రాంతి పండుగ సెలవులకునెలకొన్న రద్దీ యాత్రికుల కోసం అందుబాటులోకి సౌకర్యాలు -
పోటాపోటీగా బరులు
భీమవరం, ఉండిలో పోటాపోటీగా పందెంబరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి పశ్చిమలోనే భారీ బరి భీమవరం రూరల్‌లోని గొల్లవానితిప్ప (డేగాపురం)లో పందెం నిర్వాహకుడు వెంప కాశీ ఏర్పాటు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో ఒక్కొక్క బరిని భారీగా ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. ఎల్ఈడీ స్క్రీన్లు, క్యారవ్యాన్లు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భీమవరంలోని ప్రకాష్‌నగర్‌లోని లేఅవుట్లో ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తనయుడు నేతృత్వంలో భారీ బరిని ఏర్పాటు చేసి రూ.25 లక్షల నుంచి పందేలు నిర్వహిస్తున్నారు. ఉండిలోనూ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసలిలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు సోదరుడు నేతృత్వంలో 5 ఎకరాల బరిని సిద్ధం చేసి ఎల్ఈడీ స్క్రీన్లు, ఏసీ గ్యాలరీలు, ఫ్లడ్‌లైట్లు, బౌన్సర్లు, క్యారవాన్లు ఏర్పాటు చేశారు. ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహకారంతో కోడి పందేల శిబిరాల నిర్వాహకుడు గబ్బర్ బరిని సిద్ధం చేశారు. 8 ఎకరాల విస్తీర్ణంలో బరిని ఏర్పాట్లు చేసి ఎల్ఈడీలు, భారీ స్వాగతద్వారాలు, క్యారవాన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖులను కూడా బరికి ఆహ్వానించారు. ప్రత్యేకంగా వీఐపీల కోసం కోడి పందేల శిబిరం వద్దే తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి లక్షల్లో పందేలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిగూడెంలో వెంకట్రామయ్య బరిలో రూ. కోటి పందాన్ని మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఎక్కువ పందేలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకున్నారు. ఉంగుటూరులోని నారాయణపురంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు లేఅవుట్లో ఆయన సహకారంతో భారీ శిబిరం ఏర్పాటు చేసి రూ.కోటి పందేలు నిర్వహించనున్నారు. తణుకు, పాలకొల్లు, నర్సాపురంలోనూ భారీగా బరులు ఏర్పాటయ్యాయి. ప్రతి మండల కేంద్రంలోనూ ఇదే తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేషనల్ పార్క్‌లో గొర్రెలు పెంచరాదు
పోలవరం రూరల్: పాపికొండలు నేషనల్ పార్క్ ప్రాంతంలో గొర్రెల పెంపకం చేస్తే చర్యలు తీసుకుంటామని అటవీశాఖ రేంజ్ అధికారి ఎస్కే వలీ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన నదీపరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా మేత, నీరు ఉండటంతో గొర్రెల కాపరులు ఈ ప్రాంతాన్ని గొర్రెల పెంపకానికి వినియోగిస్తున్నారు. రెండు రోజుల క్రితం గొర్రెల కాపరులు మెత్తాపుకోట, ఉడతపల్లి మీదుగా గొర్రెలను అటవీప్రాంతంలో దాటించే సమయంలో కాపరులకు, అటవీ శాఖ సిబ్బందికి మధ్య దీనిపై వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. 10 గొర్రెలను అటవీశాఖ సిబ్బంది నిలిపివేయడంతో గొర్రెల కాపరులు మంగళవారం ఉదయం అటవీశాఖ కార్యాలయానికి చేరుకుని రేంజర్ ఎస్కే వలీకి విషయం తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ ప్రాంతంలో గొర్రెల పెంపకాలు జరపడం వలన వన్యప్రాణులకు విఘాతం కలిగించే పరిస్థితులు ఎదురవుతాయని వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెలను బయటకు తరలించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో 10 రోజుల్లో గొర్రెలను బయటకు తరలిస్తామని కాపరులు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని రేంజర్ తెలిపారు. రేంజర్ ఎస్కే వలీ -
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కేసులు
జంగారెడ్డిగూడెం: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న 11 మందిపై 6–ఏ కేసులు నమోదు చేసినట్లు తహసీల్దార్ కె.స్లీవజోజి ఒక ప్రకటనలో తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై వచ్చిన సమాచారం మేరకు మండలంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి , అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 మందిపై 6ఏ కేసులు నమోదు చేసి సదరు బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు చెప్పారు. పట్టుకున్న 78.64 క్వింటాళ్ల బియ్యాన్ని ఈ నెల 17న తహసీల్దార్ కార్యాలయం వద్ద బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఈ వేలం పాటకు జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉన్న రైస్ ట్రేడర్స్, రిటైలర్, రైస్ మిల్లర్లు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. గణపవరం: గణపవరంలోని చినరామచద్రపురంలో కోడికత్తులు తయారు చేస్తున్న ముసినాని శివాజీ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తెలిపారు. అతని వద్దనుంచి సుమారు 300 సాన పట్టిన కత్తులు, మరో 200 సానపట్టని కత్తులతో పాటు, సానపట్టే మోటార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శివాజీ సంక్రాంతికి భారీగా కోడికత్తులు తయారు చేస్తున్నట్టు వచ్చిన సమాచారంపై సీఐ నక్కా రజనీకుమార్, ఎస్సై ఆకుల మణికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక దాడిచేసి అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈదాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బంది డి.శివాజీ, డి.రత్నాభాయి, జె.బాబీ, పి.జగపతిలను ఆయన అభినందించారు. -
రూ.20 కోట్ల దారి మళ్లింపు
ఏలూరు (టూటౌన్): చంద్రబాబు ప్రభుత్వం పథకాల ప్రచారం పేరుతో దారి మళ్లించిన రూ.20 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డబ్బులు వెంటనే కార్మికుల కోసం వినియోగించాలని ఏపీ బిల్డింగ్ అదర్ కన్షట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్వీడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ఎర్ర రాంబాబు డిమాండ్ చేశారు. ఓవర్ బ్రిడ్జి సెంటర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి నాయకులు అధికారంలోకి వస్తే 100 రోజులలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని పక్కనపెట్టి పథకాల ప్రచారం పేరుతో రూ.20 కోట్లు దుర్వినియోగం చేయడం దుర్మార్గమన్నారు. కార్మిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు వందల కోట్ల భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను దారిమళ్లిస్తున్నారని, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. -
నిడమర్రు ఎఫ్‌డీవో రవి సస్పెన్షన్
నిడమర్రు: నిడమర్రు ఎఫ్‌డీవో టీవీ రవికుమార్‌ను మంగళవారం సస్పెండ్ చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజకుమార్ తెలిపారు. నిడమర్రు మండలం అడవికొలను పంచాయతీ తిమ్మారావు గూడెం రెవెన్యూ గ్రామం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వేవారిపై చర్యలు తీసుకోకుండా విధులు దుర్వినియోగం చేస్తున్నాడని స్థానిక రైతు గంగుల సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం మత్య్సశాఖ అదనపు సంచాలకులు చంద్రశేఖర్ రెడ్డి నిడమర్రు ఎఫ్‌డీవో టీవీ రవికుమార్‌పై చార్జ్స్ ప్రేమ్ చేసి విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఎప్డీవో టీవీ రవికుమార్‌ను సస్పెండ్ చేసినట్లు డీఎఫ్‌వో బి.రాజకుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం: పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పారిజాతగిరి ఆర్చి వద్ద పట్టణానికి చెందిన సొలస వెంకట సురేష్‌కుమార్‌కు వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో 20ఏళ్ల వయసున్న మారుజాతి చెట్లు ఉన్నాయి. వాటిని ఈవో తన కారు హెడ్‌లైట్ వెలుతురులో ఏడుగురు కూలీలను పెట్టి నరికించి ట్రాక్టర్‌పై తరలిస్తుండగా తాను గుర్తించానని, సొలస సురేష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
ఏలూరు(మెట్రో): సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే పల్లె పండుగ, రైతులు పండుగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను కలుసుకుని కనువిందు చేసే అందరి పండుగ సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లాను ఆదర్శంగా నిలిచేలా కృషిచేద్దామని కలెక్టరు పిలుపునిచ్చారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత డిసెంబర్ 7న జరిగిన నేషనల్ మీన్స్–కం–మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ నెల 20 నాటికి కులం, ఆదాయం, 7వ తరగతి మార్కుల శాతం సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని డీఈవో ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాల ప్రక్రియలో భాగంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం జాబితాను త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారని, ఆ సమయంలో, అన్ని పత్రాలు, హాల్‌టికెట్ ఫొటోకాపీతో కార్యాలయానికి సమర్పించాలన్నారు. విద్యాశాఖాధికారి పేర్కొన్న తేదీ నాటికి సర్టిఫికెట్ కాపీలను సమర్పించని విద్యార్థుల వివరాలను తుది జాబితా నుంచి తొలగిస్తారని చెప్పారు. ఏలూరు(మెట్రో): జనగణన –2027 నిర్వహణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ డైరెక్టరు ఆఫ్ సెన్సెస్ జె.నివాస్ పాల్గొని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరు మాట్లాడుతూ జనగణన7కు జిల్లాలో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తూ జనగణన–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు. ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో రూ.679 కోట్లతో 7 పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తులు అందగా, పరిశ్రమ ఏర్పాటులో వారి సమస్యలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి జూమ్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు అనుమతుల జారీలో ఏదైనా సమస్య ఎదురైతే సమస్యను వారితో చర్చించి నిబంధనలకు మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్ డెస్క్ విధానంలో జిల్లాలో 793 చిన్న, మధ్య, పెద్దతరహా పరిశ్రమలకు అనుమతులు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసిన యూనిట్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పాలసీలో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలకు ఇన్వెస్ట్మెంట్, విద్యుత్, వడ్డీ, స్టాంప్ డ్యూటీ రాయితీల కింద 25 యూనిట్లకు రూ.96.04 లక్షలు మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. కాళ్ల : జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి సాహసోపేత రైడ్ చేసి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశారు. కాళ్ల మండలం పెద అమిరంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిత్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఖాళీ మైదానంలో ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో పారా మోటర్ ఎరైవల్ అడ్వెంచర్ స్కై రైడ్‌ను ఏర్పాటు చేయగా, తొలి రైడ్‌ను కలెక్టర్ చేసి యువతను ఉత్సాహపరిచారు. భీమవరం అంటే కోడి పందేలు అనే నానుడి ఉందని, దీనికి భిన్నంగా అడ్వెంచర్స్ రైడ్‌ను తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసిందని కలెక్టర్ చెప్పారు. సంక్రాంతి పండుగ రోజుల్లో యువతకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రైడ్స్ నిర్వహిస్తారని అన్నారు. -
భోగి మంటల్లో వేయాలి
ఏలూరు (టూటౌన్): జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకువచ్చి పేదల ఉసురు తీస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ఉసురు తీస్తుందన్నారు. ఉపాధి హామీకి నిధులు పెంచాల్సింది పోయి తగ్గిస్తూ.. పని దినాలు పెంచామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు 90 శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్ర వాటా పది శాతంగా ఉండేదని తెలిపారు. నేడు రాష్ట్రాలపై భారం వేస్తూ ఒకేసారి 40 శాతం రాష్ట్రాలు భరించాలంటే ఆంధ్రప్రదేశ్ లాంటి అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ చట్ట రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. జనవరి 14న భోగిమంటల్లో ప్రతులను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. -
సిండికేటుకు చంద్రన్న కానుక
సాక్షి, భీమవరం: తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు చేతల్లోకి వచ్చేసరికి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. బాటిల్‌పై మరోసారి రూ.10 పెంచారు. లిక్కర్ సిండికేటుకు సంక్రాంతి కానుక అందించారు. అమ్మకాలపై ప్రస్తుతం ఉన్న 14 శాతం మార్జిన్‌ను 15 శాతంకు పెంచారు. మరోపక్క బార్లకు అదనపు రిటైల్ ఎకై ్సజ్ పన్ను(ఏఆర్ఈటీ) రద్దు చేశారు. జిల్లాలో 194 మద్యం దుకాణాలు కూటమి సిండికేట్ల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అమ్మకాలపై వ్యాపారులకు మొదట్లో 10 శాతంగా ఉన్న మార్జిన్‌ను గత ఫిబ్రవరిలో ప్రభుత్వం 14 శాతంకు పెంచింది. మద్యం బాటిల్‌పై రూ.10 పెంచింది. ఏడాది తిరక్కుండానే రెండోసారి ధరలు పెంచేసింది. రూ.99 క్వార్టర్లు మినహా మిగిలిన అన్ని రకాల బ్రాండ్లపై బాటిల్‌కు రూ.10 పెంచింది. లిక్కర్ వ్యాపారుల మార్జిన్ పెంచుతూ, బార్లకు ఏఆర్ఈటీ రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 8వ తేదీన కేబినేట్ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకోగా జీవో విడుదల కాకుండా అదే రోజు నుంచి వ్యాపారులు బాటిల్‌కు రూ.10 చొప్పున పెంచేసి అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. పెరిగిన ధరలు 12వ తేదీ నుంచి అమల్లోకి రావడంతో నాలుగురోజులు అదనంగా వసూలు చేసిన సొమ్ములు సిండికేట్లు జేబుల్లోకి వెళ్లిపోయాయి. బార్లకు మేలుచేస్తూ.. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడులలో 31 బార్లు ఉన్నాయి. గత ఏడాది జరిగిన టెండర్లలో 23 బార్లను వ్యాపారులు దక్కించుకున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురంలో ఎనిమిది బార్లకు ఎవరూ ముందుకు రాక అధికారులు మరోమారు టెండర్లు పిలిచే పనిలో ఉన్నారు. డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే మద్యం బాటిళ్లపై ఎకై ్సజ్ శాఖ 15 శాతం ఏఆర్ఈటీ వసూలు చేస్తోంది. ఇది ఎత్తివేయాలన్న డిమాండ్ ఉంది. అందుకోసమే లిక్కర్ సిండికేట్ మిగిలిన బార్లకు టెండర్లు వేయకుండా ఆపివేసిందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ పన్ను పూర్తిగా రద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇకపై షాపు లైసెన్సుదారులకు మాదిరి బార్లకు ఏ విధమైన పన్నులు లేకుంండా డిపోల నుంచి ప్రభుత్వం మద్యం సరఫరా చేయనుంది. గత ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు జరిగేవి. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులు ఉండేవికావు. మద్యం అమ్మకాలపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరి తిరిగి సంక్షేమం రూపంలో పేదలకు అందేవి. కాగా చంద్రబాబు పాలనలో మద్యం అమ్మకాల ఆదాయం చాలా వరకు కూటమి నేతలు, సిండికేటు జేబుల్లోకి వెళ్తుండడం గమనార్హం. మరోసారి మద్యం ధరల పెంపు బాటిల్‌పై రూ.10 బాదుడు లిక్కర్ వ్యాపారుల మార్జిన్ 14 నుంచి 15 శాతానికి పెంపు బార్లకు అదనపు రిటైల్ ఎకై ్సజ్ పన్ను రద్దు కూటమి నేతలు, సిండికేట్ జేబుల్లోకి మద్యం ఆదాయం జిల్లాలో రోజుకు సుమారు నాలుగు కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది పేద, మధ్యతరగతి వర్గాల వారే. రూ.99 చీఫ్ లిక్కర్ బ్రాండ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా రూ.120 ఓఏబీ, రూ.130 మంజీర, హెచ్డీ, రూ.150 ఖరీదైన క్లాసిక్ బ్లూ, ఏసీ బ్లాక్, పార్టీ స్పెషల్, సిల్వర్ బ్రాండ్లు, మధ్యతరగతి వర్గాల వారు రూ.190 ఎంసీ, ఐబీ, ఐకానిక్ వైట్, ఆప్టర్ డార్క్, రూ.190 ఎంహెచ్ బ్రాందీ, రూ.230 8 పీఎం తదితర క్వార్టర్ బాటిల్స్ కొనుగోళ్లు చేస్తుంటారు. వీటన్నింటిపైనా అదనంగా ప్రభుత్వం రూ.10 పెంచింది. మద్యం సిండికేట్లు రూ.10 అదనంగా వసూలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో రూ.40 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్ బాదుడితో బాటిల్‌పై రూ.30 అదనంగా పెరిగిందని మందుబాబులు వాపోతున్నారు. -
గోడమీద పిల్లివాటంలా పవన్ కల్యాణ్
చాట్రాయి: ఉపాదీ హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిధుల భారం పడుతున్నా పంచాయతీరాజ్ మంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు నిలదీయడం లేదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధికార ప్రతినిధి ఆర్ శ్యామల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గోడమీద పిల్లివాటంలా వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వాకం కారణంగా పెద్ద పండుగ సంక్రాంతికి రైతుల ముఖంలో సంతోషం కనపడడంలేదని 2029లో మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 25న మండలంలోని చిన్నంపేటలో మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆమె కోరారు. మరో వైఎస్సార్ సీపీ అదికార ప్రతినిఽఽధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వీకెండ్ వస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు హైదరాబాద్ పబ్బుల్లో ఉంటారని ఆయన ఎద్దేవా చేసారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని భోగి మంటల్లో కలుపుతామని అన్నారు. మంగళవారం చాట్రాయి మండలంలోని నరశింహారావుపాలెం గ్రామానికి శ్యామల, వెంకటరెడ్డి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ కార్యదర్శి హైదరాబాదు) కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి తల్లి సత్యవతి ఇటీవల మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గడ్డం లోకేశ్వరరెడ్డి, పరసా చెన్నారావు, గడ్డం శ్రీనివాసరెడ్డి, చింతలపూడి మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, సిద్దిపేట పార్టీ అధ్యక్షుడు తడకా జగదీశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
● సంక్రాంతి సందడి
జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి శోభ నెలకొంది. మహిళలు అందమైన రంగవల్లులతో వీధులను ముస్తాబు చేస్తుండగా.. పలుచోట్ల భోగి మంటలకు సిద్ధం చేశారు. పొరుగూర్ల నుంచి తమ సొంత ప్రాంతానికి వస్తున్న వారితో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. చుట్టాలు, అయినవాళ్ల రాకతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. – సాక్షి నెట్వర్క్ పాలకొల్లు మార్కెట్లో భోగి పిడకల విక్రయం గణపవరంలో ట్రాఫిక్ నిలిచిపోయి రోడ్డుపై బారులు తీరిన కార్లు -
ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆదరించాలి
పెనుగొండ: ప్రభుత్వ విద్యా సంస్థలకు దీటుగా సేవలందిస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. పెనుగొండలోని ఎస్వీకేపీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సరైన వనరులు, సదుపాయాలు సమకూర్చకపోవడంతో నిర్వహణతో పాటు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై విద్యాశాఖా మంత్రి లోకేష్ దృష్టికి రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, బుర్రా గోపి మూర్తిలతో కలసి తీసుకువెళ్లడం జరుగుతుందని, అదేవిధంగా శాసన మండలిలోనూ ప్రస్తావిస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, బుర్రా గోపీ మూర్తి మాట్లాడుతూ ఉన్నతాశయాలతో గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కళాశాలను పేద విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులు సేకరించిన విరాళాన్ని అతిథుల చేతుల మీదుగా పాలకవర్గానికి అందించారు. కార్యక్రమంలో సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కే రామచంద్రరాజు, పాలకవర్గ అధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ వైవీవీ అప్పారావు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ–విశాఖపట్టణం మధ్య 12 జనసాధారణ (అన్ రిజర్వ్డ్) రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్టణం–విజయవాడ మధ్య ఆరు సర్వీసులు ఈ నెల 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో రైళ్లు నడుస్తాయి. ఈ రైలు ఉదయం 10 గంటలకు విశాఖపట్టణంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడ–విశాఖపట్టణం మధ్య 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో ఆరు సర్వీసులు నడుపనున్నారు. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 12.35 గంటలకు విశాఖపట్టణం చేరుతుంది. కాకినాడ టౌన్ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు కాకినాడ టౌన్–చర్లపల్లి మధ్య ఈనెల 19న రైలు సర్వీసు నడుపనున్నారు. ఈ రైలు కాకినాడ టౌన్లో బయలు దేరి సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగనుంది. ఇక్కడ సంక్రాంతి ఎంతో అనుభూతి భీమవరం: గత ఏడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది ఆగస్టు 15 లోపు ఆ చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శతాధిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చెప్పారు. సోమవారం భీమవరం విచ్చేసిన ఆయన నానాజీ కాంప్లెక్స్ వద్ద మాట్లాడారు. 20 ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించామని, భీమవరం టాకీస్ పతాకంపై నిర్మించిన 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి, ఆ చిత్రాల ట్రైలర్స్ అన్నీ ఒకే రోజు ఒకే వేదికపై ఆవిష్కరించామన్నారు. మిగిలిన 8 చిత్రాల ట్రైలర్స్‌ను ఒకేసారి విడుదల చేయబోతున్నామ న్నారు. ప్రతి సంక్రాంతికి భీమవరం వస్తానని, భీమవరం అనుభూతి మరువలేనని అన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా టారిఫ్ దరఖాస్తులపై ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీన తిరుపతిలో, 22, 23 తేదీలలో విజయవాడలో, 27వ తేదీన కర్నూలులో ఈ ప్రజా విచారణలు జరుగుతాయన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యక్ష విధానంలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతాయన్నారు. ఈ ప్రజా విచారణల ప్రత్యక్ష ప్రసారం ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు. -
తిరువీధుల్లో శ్రీవారి వైభవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. అందులో భాగంగా శ్రీవారికి సోమవారం క్షేత్ర పురవీధుల్లో జరిగిన తిరువీధి సేవ స్వామివారి వైభవాన్ని చాటింది. తొలుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ తిరువీధి సేవ కన్నులపండువగా జరిగింది. తమ ఇంటి ముంగిటకు వచ్చిన చినవెంకన్నకు పెద్ద ఎత్తున భక్తులు నీరాజనాలు సమర్పించి, హారతులు పట్టారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
కోడి పందేలు చట్ట విరుద్ధం
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో) : జిల్లాలో కోడి పందేలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో కోడి పందేలు, బెట్టింగులు నిర్వహించడం, ప్రోత్సహించడం, పాల్గొనడం చట్టవిరుద్ధమని, జిల్లాలో ఎవరైనా కోడి పందేలు, గుండాట, బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. పోలీసు, రెవెన్యూ అధికారులు గట్టి నిఘా పెట్టాలన్నారు. సదరు ఉత్తర్వులను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా కోడి పందేలు, గుండాట, బెట్టింగు లు నిర్వహిస్తున్నట్టు గుర్తిస్తే, సదరు సమాచారాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నం. 18002331077కు తెలియజేయాలన్నారు. అ లాగే ఫొటోలు, వీడియోలను వాట్సాప్ నం.9491041428కు పంపాలని కోరారు. వచ్చేనెల రెండో వారంలో జరిగే రెండో విడత పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, మొ దటి విడత పంపిణీపై పరిశీలన విషయాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతను సమీక్షించారు. ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం ఇచ్చి న హామీలను అమలు చేయాలని చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కమిటీ కలెక్టరేట్లో జేసీకి సోమవారం వినతి పత్రం సమర్పించింది. జి ల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య, జిల్లా కో–కన్వీన ర్ పొట్టేలు పెంటయ్య మాట్లాడుతూ చేతి వృత్తి దారులకు 50 ఏళ్లకే పింఛన్ హామీని ప్రభుత్వం అమలు చేయాలని, సబ్సిడీపై రుణాలు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. చేతివృత్తిదారులతో పాటు బీసీలకు పలు హా మీలు ఇచ్చారని, వాటన్నింటినీ అమలు చే యాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాష్ట్రంలో అనేక హామీలను ప్రభుత్వం ఇచ్చిందని అవి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల కారణంగా సమ్మె నోటీ సు ఇస్తున్నట్టు భీమవరం మున్సిపల్ కాంట్రాక్టర్లు తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఏళ్ల తరబడి చేసిన పనులకు బిల్లులు చె ల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎ దుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు విధానంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. సుమారు రూ.18 కోట్ల బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పా త బకాయిలు చెల్లించే వరకూ కొత్త పనుల టెండర్లలో పాల్గొనరాదని నిర్ణయించామన్నారు. పట్టణానికి చెందిన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. భీమవరం: సంక్రాంతి పండుగకు ఇతర రా ష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చేవారు అక్కడి మద్యం తీసుకురావడం నేరమని జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి ఆర్వీ ప్రసాద్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. మద్యం తీసుకువచ్చి పట్టుబడితే కేసు నమోదు చేయడంతో పాటు ఆయా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే ఇదే విషయాన్ని ప్రైవేట్ బస్సు, టూరిస్ట్ బ స్సు, ప్రైవేట్ టాక్సీ యజమానులు గుర్తుంచుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్ ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 14 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేశారన్నారు. అలాగే 13.05 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, 95 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం రవాణా కాకుండా వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. -
లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
పాలకోడేరు: బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చే సుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి న కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుతో పాటు రూ.20 వేల జరిమానా, బాధితురాలికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ భీమవ రం పోక్సో కోర్టు జడ్జి బి.లక్ష్మీనారాయణ సో మవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. శృంగవృక్షంలోని నామనవారిపాలేనికి చెందిన పెరుమాళ్ల నరసింహారావు అలియాస్ చిన్నారి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాలిక (14)ను రోజు స్కూల్‌కు వెళ్లేటప్పుడు ప్రేమిస్తున్నానని వేధించాడు. ఈ క్రమంలో 2016 ఆగస్టు 28న బాలిక ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి లైంగికదాడికి పాల్పడినట్టు బాలి క తల్లిదండ్రులు పాలకోడేరు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన అప్పటి భీమవరం సీఐ ఆర్జీ జయసూర్య ద ర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నేరం రు జువు కావడంతో నిందితుడికి శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండవల్లి రమేష్‌నాయుడు వాదనలు వినిపించగా, పాలకోడేరు ఎస్సై మంతెన రవివర్మ, కానిస్టేబుళ్లు ఎం.బాలకృష్ణ, జి. గోపి కీలకంగా పనిచేశారు. -
ఉద్యమాలపై ఉక్కుపాదం తగదు
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ప్రజాఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని, అ నకాపల్లి జిల్లాలో రైతు నాయకుడు ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్టును ఎత్తివేయాలని, బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసు లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా కా ర్యదర్శి పి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కా ర్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ అప్పలరాజుపై ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్టు పెట్టిందన్నారు. బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో గిరిజన రైతుల సాగులో ఉన్న భూముల్లోని మొక్కజొన్న ఇతర పంటల ను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. విశా ఖలో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వి ద్యార్థి సంఘాల కార్యకర్తలపై రౌడీషీట్ ఓపెన్ చేయడం తగదన్నారు. ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రభుత్వం ఆపాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, సిరి బ త్తుల సీతారామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గూడెల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అక్రమ పీడీ యాక్టు సిగ్గుచేటు భీమవరం : ప్రశ్నించే గొంతులపై పీడి యాక్ట్‌లను, రౌడీషీట్లను ప్రయోగిస్తున్న కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని రైతు సంఘం రాష్ట్ర నేత బి.బలరాం హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేసి వెంటనే విడుదల చేయాలను కోరుతూ సీఐటీయూ, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశంచౌక్‌లో సోమవారం నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ నక్కపల్లి ప్రాంతంలో భూముల కోసం పోరాటం చేస్తున్న అప్పలరాజు ప్రజలకు అండగా నిలవడం నేరమా అని ప్రశ్నించారు. గంజాయి, మద్యం, ఇసుక మాఫియా లాంటి వారిపై పెట్టాల్సిన కేసులు ప్రజలకు అండగా నిలిచే వారిపై పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఏజెన్సీ ఏరియాలో బుట్టాయగూడెం మండలంలో గిరిజనుల భూముల్లో వేసుకున్న పంటలను ట్రాక్టర్లతో దున్ని నాశనం చేయడమే కాకుండా గిరిజను లు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన విధంగా ఉందన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వాసుదేవరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, వృత్తి సంఘాల జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, మామిడిశెట్టి రామాంజనేయులు, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డింగ్‌లో మిస్టర్ ఆంధ్రాగా విక్రమ్
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణంలో నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీల్లో వైజాగ్‌కు చెందిన విక్రమ్ మిస్టర్ ఆంధ్రాగా ఎంపికయ్యాడు. ఆదివారం రాత్రి స్థానిక చిన్నకార్ల స్టాండ్ వద్ద కేఏఎం జిమ్ పాలకొల్లు ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బెస్ట్ మజిల్స్ భాస్కర్ – వైజాగ్, బెస్ట్ మస్కిలర్గా ప్రశాంత్ – మచిలీపట్నం ముగ్గురు ఎంపికయ్యారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో 50 నుంచి 90 మంది బాడీబిల్డర్లు పోటీ పడినట్లు నిర్వాహకులు ఖండవల్లి వాసు తెలిపారు. విజేతలకు చాంబర్ సభ్యులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనందప్రకాష్, చేగొండి సూర్యప్రకాష్, మేకా శేషుబాబు, కేఎస్‌పీఎన్ వర్మ, ఉచ్చుల స్టాలిన్, సనమండ ఎబినేజర్, రామాంజుల పెద్దమదు, పసుపులేటి రాజేష్‌ఖన్నా, తటవర్తి సుధాకర్, సబితి వెంకటరెడ్డి, వింజరపు రాము, పసుపులేటి రమేష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీటీసీలకు అందని గౌరవం
బుట్టాయగూడెం: గత ఏడాదిన్నరగా ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీటీసీలకు గౌరవ వేతనం చెల్లింపులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు అధికంగా ఉండడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇలా తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు. వేతనాల కోసం ఎంపీటీసీలు అధికారులను సంప్రదిస్తున్నా ఫలితం లేకుండా పోవడంతో నిరాశకు గురవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి.. పోలవరం నియోజకవర్గంలో మొత్తం 94 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో బుట్టాయగూడెం మండలంలో 15 మంది, జీలుగుమిల్లి మండలం 9, పోలవరం 12, కుక్కునూరు 12, వేలేరుపాడు 7, కొయ్యలగూడెం 22, టి. నర్సాపురం మండలంలో 17 మంది చొప్పున ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలే ఉన్నారు. వీరికి నెలకు రూ. 3 వేల చొప్పున గౌరవ వేతనం అందించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్ 12వ తేదీన పగ్గాలు చేపట్టగా ఆ ఏడాదిలో పాత బకాయిలు చెల్లించారు. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర నుంచి గౌరవ వేతనం చెల్లించడంలేదని ఎంపీటీసీలు వాపోతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు ఎంపీటీసీలు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులైనప్పటికీ కూటమి ప్రభుత్వం తమకు అధికార కార్యక్రమాల్లో కనీసం ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఎంపీటీసీలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా గ్రామాల్లోని కూటమి నేతలకే పెత్తనం ఇస్తున్నారని దీంతో తమకు ఎటువంటి గౌరవం ఉండటంలేదని వారు చెబుతున్నారు. తమకు అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఏడాదిన్నరకు పైగా విడుదల కాని గౌరవ వేతనం నిధులు అత్యధిక శాతం వైఎస్సార్సీపీ సభ్యులు కావడంతో నిర్లక్ష్యం ప్రోటోకాల్‌కు మంగళం పాడేసిన అధికారులు కూటమి నేతలకే పెత్తనం కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు. కార్యక్రమాల సమాచారం కూడా తెలియజేయకుండా కూటమి నాయకులతో చేయిస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం. ఎంపీటీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. – గగ్గులోతు మోహన్‌రావు, వైస్ ఎంపీపీ, బుట్టాయగూడెం మండలం ఎంపీటీసీలకు ఏడాదిన్నర నుంచి చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. మాకు రావాల్సిన గౌరవ వేతనం అందకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. బకాయిలు చెల్లిస్తే పండుగపూట ఎంపీటీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – గాలి దుర్గారావు, ఎంపీటీసీ, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం -
సంక్రాంతి వైభవం చాటేలా..
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ముందెన్నడూ లేని విధంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు ఆలయ ఈఓ వై.భద్రాజి పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా కొండపైన షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సోమవారం ముస్తాబు చేశారు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఏవిధంగా జరుగుతాయో కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. పచ్చని పంటలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎలా ఉంటుందో చూపేందుకు వరి మడులు ఏర్పాటు చేసి, నాట్లు వేస్తున్నారు. అలాగే చెరకు, అరటి పంటలు వేశారు. ప్రస్తుతం మొక్కజొన్న సాగు పనులు, ఎడ్ల బండ్లకు రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. పూరి గుడిసెను నిర్మించి దాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇంకా ఈత, తాడి చెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా సంక్రాంతి విశిష్టతను తెలిపే చిత్రమాలికలు, రంగవల్లులు వేయాల్సి ఉంది. దేవస్థానం డీఈలు టి.సూర్యనారాయణ, సుధాకర్ల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పనులు మంగళవారం సాయంత్రం నాటికి పూర్తి కానున్నాయి. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే ఈ సంక్రాంతి సంబరాల్లో వేలాది మంది భక్తులు పాల్గొనాలని ఈఓ కోరారు. -
పందేల మాటున ‘పైసా’చికం
సాక్షి, భీమవరం: ఆయ్.. నేను పందెం పుంజునండీ.. పేరు డేగ.. మా ఈకల రంగు, శరీర తీరు బట్టి డేగ, నెమలి, పచ్చకాకి, నల్లకాకి, శవల, మైల, అ బ్రాస్, సేతువ పేర్లు పెట్టి మురిసిపోతుంటారు. తేడా వస్తే కోజంటూ కర్రీ చేసుకుని లొట్టలేసుకుంటూ తింటారు. ఎంత రాజభోగం అనుభవించినా సంక్రాంతి వస్తోందంటే చిగురుటాకుల్లా వణికిపోతాం. ప్రాణాలు అరికాల్లో పెట్టుకుని పోరాడతాం. ఈ భోగం మూణ్ణాళ్ల ముచ్చటనేనని తెలిసొచ్చేసరికి మా ఊపిరి పోతుంది. బతికున్నంత కాలం దర్జానే.. ఏమాటకామాట.. బతికున్నంత కాలం మా దర్జానే వేరు. పెద్ద పెద్ద లోగిళ్లు, మకాంలు మా నివా సాలు. మాలో కొందరికి ప్రత్యేకంగా పనివాళ్లు ఉంటారండోయ్. మా బాగోగులు చూస్తూ టైముకి మేత పెట్టేది వాళ్లే. అది ఆషామాషీ మేతనుకుంటే పొరపాటే. ఆ రాజభోగమే వేరు. అప్పుడప్పుడూ కాస్త ‘చుక్క’ కూడా పోస్తుంటారు. ట్రైనింగ్ మూడు నెలల్లో మా ఒక్కొక్కరిపై రూ.30 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. ఇలా పెంచిన మమ్మల్ని పందెంరాయుళ్లు రూ.లక్షలు పెట్టి కొంటారు. పండుగల పేరు చెప్పి రూ.15 కోట్లకు పైనే మాపై వ్యాపారం జరుగుతుందంటే మాకున్న డిమాండ్ అలాంటిది మరి. ఇవన్నీ చూసి ఎంతో సంబరపడతాం. జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కోరుకుంటాం. అందుకే మా గోదారోళ్లకు కావాల్సిన వారిపై కోపం వచ్చినప్పుడు నిన్ను పందెం కోడిని మేపినట్టు మేపానని దెప్పిపొడవడం మమ్మల్ని చూసే వచ్చిందంటండీ.. ఆయ్. ఈ ఆనందం క్షణకాలమేనా.. ఈ ఆనందం క్షణకాలమేనని.. అమ్మవారికి బలిచ్చేముందు మేకపోతును మేపినట్టు.. పందెం బరి లో వదలడానికి మమ్మల్ని పెంచుతున్నారని తె లిసేసరికే భూమ్మీద మాలో చాలామందికి నూ కలు చెల్లిపోతాయండి. మాకు ట్రైనింగ్ మొదలవుతుందంటేనే అర్థమవుతుంది సంక్రాంతి దగ్గరపడుతోందని. అప్పటి నుంచి దినదినగండమే. ఇన్నాళ్లూ అనుభవించిన ఆనందం, రాజభోగం అంతా ఇంకొంతకాలమేనని. మా గోడు వినేదెవ్వరూ? ఎన్ని చట్టాలుండి.. వాటిని రక్షించే వ్యవస్థలు ఎన్నుండి.. కోర్టులు ఎంత కన్నెర్ర చేసి ఏం లాభం? కంచే చేను మేసినట్టు చట్టాలు చేసే పెద్దలే చంకలో మమ్మల్ని పెట్టుకుని ఫొటోలకు పోజులిస్తూ మరీ బరులు ప్రారంభిస్తారు. మాలో మేమే కత్తులు దూసుకునేలా పందెంలో దింపి వేలల్లో, లక్షల్లో పందేలు కాసి ఆనందిస్తారు. మా తలపై నిమిరిన చేతులే మా కాళ్లకు క త్తులు కడతాయి. వారికేం తెలుసు మా బాధ? పందెంలో దిగాక ఏం చేయలేని పరిస్థితి. చుట్టూ జనం, తప్పించుకునే వీలులేక మాలో మేమే ప్రాణాల కోసం తలపడాల్సిందే. ‘కాళ్లకు కట్టిన పదునైన కత్తులు శరీర భాగాల్ని చీలుస్తూ ఛిద్రం చేస్తున్నా.. ఒళ్లంతా నెత్తురోడుతున్నా.. కనురెప్ప వాలిపోతున్నా.. రెక్కలు తెగిపడి కదలలేకున్నా.. గెంతేందుకు శరీరం సహకరించకున్నా.. జాలి లేని జనం కోసం, వారి పైశాచికానందం కోసం ఊపిరున్నంతసేపూ పోరాడతాం. చివరి క్షణాల్లో అప్పుడనిపిస్తుంది.. రెక్కలకి బలమొచ్చి పక్షుల్లా ఎగిరిపోతే ఎంత బాగుంటుందని’. మేం అనుభవించే నరకాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందడానికి పనిగట్టుకుని ఎక్కడెక్కడి నుంచో గొప్పగొప్పోళ్లు వస్తుంటారు. మూడు రోజులూ ఏమైపోతారో..? కోడిపందేలు నిర్వహిస్తే ఖబడ్దార్ అంటూ హె చ్చరించే పోలీసులు, జంతు సంక్షేమ సంఘం స మావేశాల పేరిట హడావుడి చేసే అధికారులు పండుగల మూడు రోజులూ ఏమైపోతారో తెలీదు. తర్వాత కొందరిపై ఏవో చిన్నచిన్న కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటుంటారు. ఇంకెవరికి చెప్పుకోవాలి మా బాధ? అదిగో అక్కడ బరి సిద్ధం చేసేశారు.. నన్ను పిలుస్తున్నారు.. బాయ్.. ఇక ఉంటాను. భూమ్మీద నాకింకా నూకలుంటే కొక్కొరోకో అంటూ తెల్లారి మిమ్మల్ని మేల్కొలుపుతాను. ఒకరు కోడి పోటీలంటారు.. ఇంకొకరు సంప్రదాయం అంటారు. కత్తుల్లేని పందేలు జరపమంటే మాత్రం నో అంటారు. ఆ కొట్లాటలో మాలో ఎవరోకరి ప్రాణాలు పోవాల్సిందే. నేను నెగ్గితే సరేసరి... ఓడినా వదలరు. కోజంటూ కోసేసి ఆరగిస్తారు. బతికుండగా రూ.లక్షల ధర పలికే మేము చచ్చినా తగ్గేదేలే అన్నట్టే ఉంటాం. మూడు నుంచి ఐదు కేజీల వరకు బరువుండే మా శరీరాలను రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు కొని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కావాల్సిన రాజకీయ నాయకులు, అధికారులకు కానుకగా పంపిస్తుంటారు. పండుగల మూడు రోజుల్లో కోజాల పైనే జిల్లాలో రూ.5 కోట్ల పైనే వ్యా పారం జరుగుతుందంటుంటారు. కత్తి కట్టి.. నెత్తురోడి కాళ్లకు కత్తులు కట్టి కోడి పందేల నిర్వహణ శరీరం ఛిద్రమై నెత్తురోడుతూ.. కనురెప్ప పడుతున్నా కడ దాకా పోరాటం కానరాని జంతు ప్రేమికులు అడ్డుకోలేని చట్టాలు, వ్యవస్థలు పందెం పుంజుల గోడు -
అర్జీల పరిష్కారం వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో) : పీజీఆర్ఎస్లో అందిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో భాగంగా ప్రజల నుంచి 276 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌లు చక్కటి వేదిక అన్నారు. 28 మండలాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీల్లో కొన్ని.. ● చింతలపూడి మండలం ప్రగడవరం–జార్జిపేటకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు తన ఇంటిని ఆనుకుని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేశారని, దానిని మార్చాలని కోరారు. ● ముదినేపల్లి మండలం శింగారాయపాలేనికి చెందిన వేదుళ్లపల్లి సత్యవతి గ్రామ కంఠంలో ఉన్న భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. ● ద్వారకాతిరుమల మండలం కోడిగూడేనికి చెందిన బిరుదుగడ్డ మాణిక్యం తనకు ఉన్న కొద్దిపా టి పొలం తన కోడలు మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుందని, తిరిగి ఇప్పించాలని అర్జీ అందించారు. ● జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడేనికి చెందిన బండారు చంద్రమౌళి తన పట్టా భూమికి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందించారు. ● లింగపాలెం మండలం కలరాయనగూడెం పరిధిలోని అటవీ భూముల్లో ఆక్రమణలు జరు గు తున్నాయని కోడూరి సురేష్ ఫిర్యాదు చేశా రు. అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయని కోడూ రి సురేష్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 264, 269 పరిధిలోని అటవీ భూమిలో వ్యవసాయం చేయడంతో పాటు కోడి పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. -
నువ్వుల పంటతో రైతులకు అధిక లాభాలు
చింతలపూడి: రబీ కాలంలో సార్వా వరి తరువాత రైతులు నూనె గింజల పంటను సాగుచేస్తే నాణ్యమైన పోషక విలువలున్న నూనెను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకుని ఆర్థికంగా పరిపుష్టి సాధించవచ్చని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ కె ఫణి కుమార్ రైతులకు సూచించారు. సోమవారం చింతలపూడి మండలం సమ్మెటవారిగూడెం గ్రామంలో నువ్వు పంట దిగుబడి – యాజమాన్య పద్ధతులు అనే అంశంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సార్వా వరి పంట తర్వాత నువ్వులు వంటి నూనె గింజల పంటలు వేసుకుంటే లాభదాయంగా ఉంటుందన్నారు. పెట్టుబడి వ్యయం తక్కువని, చీడపీడల తాకిడి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఎకరా వరికి కావలసిన నీటితో ఐదు ఎకరాల నువ్వు పంట సాగు చేయవచ్చని. చెప్పారు. తొలిదశలో కలుపు నివారణ, సమతుల్యమైన ఎరువులను వాడుతూ కేవలం 2, 3 తడులతో పంటను పండించుకోవచ్చన్నారు. నువ్వులకు మార్కెట్ రేటు ఎక్కువగా ఉండి సాగు ఖర్చు తక్కువ వలన నువ్వు పంట సాగులో అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఏవో శ్రీ కె. మురళికృష్ణ, మాట్లాడుతూ జిల్లాలో నవ్వు పంట సాగుపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. తక్కువ నీటితో ఈ పంటను సాగు చేసి ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చునని తెలిపారు. జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఫణి కుమార్ -
రాగి వైర్ల చోరీ ముఠా అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లు చోరీ చేసే ముఠాని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన కామవరపుకోట మండలం కేఎస్ రామవరంలో వ్యవసాయ పొలంలో గల నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగివైరు చోరీకి గురైందన్నారు. దీనిపై రైతులు తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపధ్యంలో సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంనకు చెందిన కర్ని నాగశివ, చిలకలూరిపేట మండలం రామచంద్రాపురంనకు చెందిన గౌరవరపు దివాకర్‌బాబు, మంగళగిరి మండలం యర్రబాలెంకు చెందిన మహంకాళి కిషోర్, తెలంగాణ రాష్ట్రం మహాబూబ్‌నగర్ జిల్లా బెబ్బెరుకు చెందిన డక్కలి సురేంద్రలను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిని విచారించగా, మొత్తం 22 కేసులకు సంబంధించి 40 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగివైరు చోరీ చేసినట్లు తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి సుమారు రూ.50 వేలు విలువ చేసే 50 కిలోల రాగివైరు, వైర్ల కటింగ్ అవసరమైన సామాగ్రి, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన జంగారెడ్డిగూడెం, తడికలపూడి ఎస్సైలు ఎన్వీ ప్రసాద్, పి.చెన్నారావు, క్రైంపార్టీ ఏఎస్సై ఎన్వీ సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లను ఏఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు. -
పాలకొల్లులో చెస్ పోటీలు
పాలకొల్లు సెంట్రల్: మేధా చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ రాపిడ్ చదరంగం పోటీలు సోమవారం పాలకొల్లులో జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఏపీ స్టేట్ జనరల్ సెక్రెటరీ జగదీష్, మేధా చెస్ అకాడమీ ప్రెసిడెంట్, ఆడిటర్ పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, చాంబర్స్ ప్రెసిడెంట్ కారుమూరి నరసింహరావు, మద్దాల వాసులు మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. పోటీల్లో కాకినాడ జిల్లా వాసి జాన్స జాన్ సాయి సంతోష్ ప్రథమ బహుమతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన షణ్ముఖ రెడ్డి ద్వితీయ బహుమతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మజ్జి రామ్‌చరణ్‌తేజ్ తృతీయ బహుమతి సాధించారు. వివిధ కేటగిరిలో అండర్ 7, 9, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా బహుమతులు అందజేశారు. నరసాపురం రూరల్: ఆలయాల్లో జరుగుతున్న చోరీలకు సంబంధించి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సోమవారం డీఎస్పీ జి శ్రీవేద వివరాలు వెల్లడించారు. మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ ఆలయాల్లో ఇటీవల చోరీలు జరిగాయి. ఈ చోరీ కేసుల్లో నిందితుడైన కాళీపట్నం పడమర గ్రామానికి చెందిన కవురు లోకేశ్వరరావు అనే 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.1.57లక్షలు విలువ గల 1.420 కేజీల వెండి, రూ.1.77 లక్షలు విలువగల 14 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్‌గా మార్చేశారు
కుక్కునూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుముక, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం బ్యారేజ్‌గా మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కుక్కునూరులో నూతనంగా నిర్మించిన అయితా శంకరయ్య సీపీఐ కార్యాలయం భవనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ లక్షల ఎకరాల భూమికి సాగునీరు, రాష్ట్ర నలుమూలలకు తాగునీరు, విద్యుత్ అందిస్తూ బహుళార్థకంగా ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ బ్యారేజ్‌గా మార్చిందని విమర్శించారు. సుమారు 33 వేల కోట్ల పరిహారం నిర్వాసితులకు ఇవ్వకుండా ఎగొట్టడానికి కూటమి ప్రభుత్వం మొదటి దశ, రెండో దశ అంటూ కొత్త పాట పాడుతుందన్నారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం చేపడితేనే రాష్ట్రం సస్యశ్యామలవుతుందని పేర్కొన్నారు. సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య, నాయకులు పాల్గొన్నారు. -
సార్లు.. ఇవిగో బరులు
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. న్యాయస్థానం ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు పందేల నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పండుగల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, జూదాల నిర్వహణకు జిల్లా అంతటా ఏర్పాటుచేస్తున్నారు. భీమవరం పరిసరాల్లోని డేగాపురం, పెదఅమిరం, సీసలి, మహదేవపట్న ం, వీరవాసరం, అలాగే తాడేపల్లిగూడెంలోను, తణుకులోని ఉండ్రాజవరం, పాలకొల్లు రూరల్ పూలపల్లి, వడ్లవానిపాలెం, ఆచంటలోని వడలి, దొంగరావిపాలెం తదితరచోట్ల పెద్ద బరులు సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల రెండు మూడు వరకు పెద్ద, చిన్న బరులు ఏర్పాటుచేస్తున్నారు. భారీ సెట్టింగ్‌లతో సిద్ధం చేస్తున్న కొన్ని బరులకు ఒక్కో దానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు, మిగిలిన వాటికి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు సమాచా రం. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, గుండాట, పేకాట, కో తాట, ఇతర జూదాలు నిర్వహించేందుకు వీలు గా జర్మన్ షెడ్లు, ఫ్లడ్ లైట్లు, నగదు లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని బరుల వద్ద మద్యం స్టాళ్లు, ఫాస్ట్ఫుడ్స్, తినుబండరాలకు స్టాళ్లు వెలుస్తున్నాయి. బరి ప్రత్యేకత, అక్కడకు వచ్చే జనం రద్దీని బట్టి రూ.25 లక్షలు నుంచి రూ.1.50 కోటి వరకు ఇచ్చేలా నిర్వాహకులు జూదాలు ఏర్పాటుచేసుకునే వారితో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. సాక్షి, భీమవరం: కోడి పందేలు నిర్వహిస్తే ఖబడ్దార్ అంటున్న పోలీసుల హెచ్చరికలను నిర్వాహకులు డోంట్ కేర్ అంటున్నారు. షరా మామూలేనంటూ జిల్లావ్యాప్తంగా వందకుపైనే బరులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వీటిలో పెద్ద బరులు 30 వరకు ఉండగా, మిగిలినవి చిన్నవి. బరుల చెంతనే భారీ ఎత్తున గుండాట, పేకాట, కోతాటలతో జూదాల జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయం ముసుగులో.. కోడిపందేలు, పేకాట, గుండాట తదితర జూదాలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ హైకోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రకటించింది. ఆదివారం జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన కోడిపందేల బరులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సంప్రదాయం ముసుగులో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, లేదా 112 నంబర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు అధికారులు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా బరులు ● ఉండి : పెదఅమిరం, సీసలి, మాలవానితిప్ప, ఆకివీడులోని గుమ్ములూరు రోడ్డు, అజ్జమూరు, సిద్దాపురం, మహాదేవపట్నం, ఉండి, కోలమూరు, చెరుకువాడ, గొల్లలకోడేరు, పాలకోడేరు, శృంగవృక్షం, వేండ్ర, విస్సాకోడేరు, మోగల్లు, గరగపర్రు. ● భీమవరం : డేగాపురం, శ్రీరాంపురం, గొల్లవానితిప్ప రోడ్డులో ప్రకాష్‌నగర్ వద్ద, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, యనమదుర్రు, తుందుర్రు, వీరవాసరం, నవుడూరు, కొణితివాడ, మత్య్సపురి, నందమూరుగరువు ● నరసాపురం : మొగల్తూరు, పేరుపాలెం, కేపీ పాలెం, మోళ్లపర్రు, కొత్తోట, ముత్యాలపల్లి, వేములదీవి, సీతారాంపురం, కొప్పర్రు, పీచుపాలెం, తూర్పుతాళ్లు, నరసాపురంలోని వీవర్స్ కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి వెనుక. ● పాలకొల్లు : కలగంపూడి, యలమంచిలి, అడివిపాలెం, కొంతేరు, యలమంచిలి, మేడపాడు, మట్లపాలెం, కట్టుపాలెం, పూలపల్లి, వడ్లవానిపాలెం, శివదేవుని చిక్కాల, దిగమర్రు. ● ఆచంట: కవిటం, పోడూరు, గుమ్ములూరు, పెనుమదం, వడలి, దొంగరావిపాలెం, పెనుగొండ, పెళ్లికూతురమ్మ చెరువు, ములపర్రు, రామన్నపాలెం, చినమదం, ఆచంట, వల్లూరు, ఆచంట వేమవరం, పెనుమంచిలి, కొడమంచిలి, పెనుమంట్ర, మార్టేరు, వెలగలేరు, సత్యవరం, పొలమూరు, నత్తారామేశ్వరం. ● తణుకు : రేలంగి, తూర్పువిప్పర్రు, అయినపర్రు, ఓగిడి, అత్తిలి, కె.సముద్రపుగట్టు, గు మ్మంపాడు, తేతలి, తణుకులోని ఉండ్రాజవరం రోడ్డు, హైవే ఆనుకుని రెండు చోట్ల. ● తాడేపల్లిగూడెం : ఏరియా ఆస్పత్రి వెనుక, పెంటపాడు, అల్లంపురం, కోరుమిల్లి, మీన వల్లూరు, జట్లపాలెం, పడమర విప్పర్రులో సిద్ధం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో దుగ్గిరాల, నూజివీడు నియోజకవర్గంలో మీర్జాపురం, ఉంగుటూ రు నియోజకవర్గంలో నారాయణపురం, గొల్లగూడెం, బాదంపూడి అలాగే చింతలపూడి, పోలవ రం, కైకలూరు నియోజకవర్గాల్లో మరికొన్ని బరు లు ముస్తాబవుతున్నాయి. దుగ్గిరాల, మీర్జాపురం, గొల్లగూడెం, బాదంపూడి, నారాయణపురంలో భారీ బరులు ఏర్పాటు చేసి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు రావడానికి వీలుగా వస తితో సహా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. మరోవైపు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు నిర్వాహకులుగా కొన్నిచోట్ల వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర మంత్రులను ప్రత్యేకంగా కోడి పందేలకు ఆహ్వానించారు. ఇక పోలీసులు యథావిధిగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో దుగ్గిరాల గ్రామ శివారులో చిన్నపాటి బరి, ముసునూరు మండలం చెక్కపల్లి, నూజివీడు మండలం పోత్తిరెడ్డిపల్లి మరికొన్ని చోట్ల బరులను ధ్వంసం చేశారు. కోట్లాటకు రెడీ కోడిపందేలు నిర్వహిస్తే ఖబడ్దార్ అంటున్న పోలీసులు డోంట్ కేర్ అంటున్న నిర్వాహకులు జిల్లావ్యాప్తంగా వందకు పైనే బరులు సిద్ధం గుండాట, పేకాట, కోతాటలకు ఏర్పాట్లు భారీ మొత్తంలో చేతులు మారనున్న నగదు న్యాయస్థానం ఆదేశాలు అమలయ్యేనా? -
నత్తనడకన జలజీవన్ మిషన్ పనులు
గణపవరం: గణపవరం పట్టణాన్ని పట్టి పీడిస్తున్న మంచినీటి సమస్యకు పరిష్కారంగా ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పట్టణ విస్తీర్ణం పెరిగిపోవడంతో పాటు పాత పైపులైన్లు పాడయ్యాయి. శివారు ప్రాంతాల ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. పైపుల ద్వారా సురక్షిత మంచినీరు లభించక ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి తాగునీరు కొనుగోలు చేస్తున్నారు. వీటికి పరిష్కారంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జలజీవన్ మిషన్ పథకం నుంచి రూ.3.11 కోట్లను మంజూరు చేయించారు. ఈ పథకంలో 1.20 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, 100 కెఎల్ సామర్థ్యం కలిగిన సంపు, 200 ఎంఎల్ మైక్రోఫిల్టర్, 15 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పథకానికి 2022 అక్టోబర్ 26న అప్పటి వాసుబాబు శంకుస్థాపన చేశారు. తొలిదశలో మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేశారు. గ్రామంలో 15 కిలోమీటర్ల మేర పాత పైపులైన్లు తొలగించి, కొత్తపైపులు వేయాల్సి ఉండగా ఇప్పటికి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే కొత్త పైపులు వేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ముమ్మరంగా సాగిన పనులు సాధారణ ఎన్నికలు రావడంతో మందగించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఓవర్‌హెడ్ ట్యాంకు, సంపు నిర్మించినా తుదిదశ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మైక్రో ఫిల్టర్ నిర్మాణం చేయాల్సి ఉంది. 15 కిలోమీటర్ల కొత్త పైపులైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటికి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే కొత్త పైపులు వేశారు. కొత్త పైపులైన్లు వేయడం పూర్తయితే పట్టణంలో దాదాపు రెండువేల పైచిలుకు ప్రైవేటు కుళాయిలను కొత్త పైపులైన్లకు మార్చాల్సి ఉంది. పైపులైన్ల నిర్మాణం కోసం పలు ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడికక్కడ తవ్వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు, మార్జిన్లు తవ్విన సమయంలో కొన్ని చోట్ల పాత పైపులైన్లు దెబ్బతిని వాటి ద్వారా కుళాయిల్లో మురుగునీరు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు చేపట్టి జలజీవన్ మిషన్ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజల మంచి నీటికష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. గణపవరం మంచినీటి సమస్యకు మోక్షమెప్పుడో? -
కోడిపందేల బరి ధ్వంసం
నూజివీడు: సంకాంత్రి సందర్భంగా కోడిపందేలు వేసేందుకు మండలంలోని తుక్కులూరులో సిద్ధం చేసిన కోడిపందేల బరిని రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై జ్యోతీబసు, స్టేషన్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీనిలో భాగంగా బరిని ట్రాక్టర్‌తో దున్నించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పండుగ పేరుతో కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగను శాంతియుతంగా కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. జూదాలు, కోడిపందేల జోలికి వెళ్లి ఆర్థికంగా నష్టపోవొద్దని విజ్ఞప్తి చేశారు. భీమవరం: చదరంగం క్రీడ అన్ని వయస్సుల వారికి మేథస్సును పెంచడమేగాక మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తుందని భీమవరం మావుళ్లమ్మ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ బొండాడ నాగభూషణం అన్నారు. అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో ఏపీ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ టోర్నమెంట్‌కు వివిధ జిల్లాల నుంచి 56 మంది చెస్ క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదాసు కిషోర్, గమిని పవన్, ఉపాధ్యక్షుడు పరుచూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, ప్రతి విద్యార్థి తమ ఇంట భారత దేశ పవిత్ర గ్రంథమైన రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి కోరారు. స్థానిక గిరిజన భవన సమావేశ మందిరంలో ఆదివారం ఎస్టీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మంది నిరుపేద విద్యార్థులకు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డితోపాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యులు పన్నర్సు వెంకటప్ప, కాకి లక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: సంక్రాంతి పండుగ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగ దుర్గారావు ప్రభుత్వాన్ని కోరారు. 2018 జూలై నుంచి ఇప్పటి వరకూ సీపీఎస్ ఉద్యోగులకు ఒక్క డీఏ ఏరియర్ కూడా చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రకటించలేదని, వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూజివీడు: అప్పుల బాధ తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నూజివీడు మండలం బోర్వంచ శివారు కొన్నంగుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొన్నంగుంటకు చెందిన ఆరేపల్లి దేవి(36), శివయ్య దంపతులు. వీరు కూలి పనులకు వెళ్లడంతో పాటు శివయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇల్లు నిర్మించుకునే సమయంలో అప్పులు చేయడం, ఆ అప్పులు రోజురోజుకు పెరిగిపోతుండగా వాటిని తీర్చే మార్గం కనపడక మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున ఆరేపల్లి దేవి ఇంటి వద్ద చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. రూరల్ ఎస్సై ఎన్ లక్ష్మణ్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
జీడి మామిడి.. జాగ్రత్తలతోనే అధిక దిగుబడి
చింతలపూడి: ఉమ్మడి ఏలూరు – పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన ఉన్న జీడితోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జీడిమామిడి రైతులు పూత దశ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన శాఖ అధికారిణి ఎండీ షాఫియ ఫర్హీన్ రైతులకు సూచనలు చేశారు. సాధారణంగా జీడి మామిడిలో పూత అక్టోబర్, నవంబర్ నెలల్లో మొదలై జనవరి, ఫిబ్రవరి వరకు వస్తుంది. జీడిచెట్టుకు వచ్చిన పూతలో సుమారు 200 నుంచి 800 వరకు పూలు పూస్తాయి. జీడిమామిడి చెట్లు పరాగ సంపర్కం వల్ల ఫలదీకరణ చెందుతాయి. ఈ చెట్లు పూతకు రావాలంటే సుమారు 25 రోజుల నుంచి 30 రోజులు పొడి వాతావరణం ఉండాలి. ఒకవేళ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వర్షాలు పడినట్లయితే పూత ఆలస్యమై రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తెగుళ్ల తీవ్రత కూడా అధికం. జీడిమామిడి అంట్లు నాటిన రెండవ సంవత్సరం నుంచే పూత వస్తుంది. ఆ పూతను రైతులు తుంచివేసి చెట్ల శాఖలు పెరగడానికి ప్రోత్సహించాలి. దీనివల్ల చెట్లు బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. వర్షాకాలంలో సిఫార్సు చేసిన ఎరువులు రెండు నుంచి మూడు సమ భాగాలుగా వేసుకోవాలి. ఐదు సంవత్సరాలు పైబడిన చెట్టుకు యూరియ 1.5 కేజీలు, సూపర్ ఫాస్ఫేట్ 650 గ్రాములు, పొటాష్ 1 కేజీ వేసుకోవాలి. పూత దశలో తెగుళ్ల ఉధృతి పూత దశలో మంచు ఎక్కువగా పడుతున్నప్పుడు పూత లోపల తేమ చేరి ఎండిన మగపూల వలన తామర పురుగులు లేదా తేయాకు దోమ ఉధృతి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. జీడిమామిడిలో టి దోమ పూత దశ అంటే అక్టోబర్, నవంబర్ నెలలో మొదలవుతుంది. జనవరిలో ఎక్కువై లేత చిగుళ్లు, పూత, పూత కాడలను, చిన్న కాయలను ఆశించి రసం పీల్చడం ప్రారంభిస్తాయి. రసం పీల్చినప్పుడు ఒక రకమైన పదార్థం వదలడం వల్ల కాయలపై, చిగుర్లపై గజ్జిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా పూత, చిగుర్లపై చేసిన రంధ్రాల వలన ఫ్లవర్ బైట్ అనే తెగులు కూడా వ్యాప్తి చెందుతుంది. బూడిద తెగులుతో పూతకు నష్టం పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు కూడా ఎక్కువగా పూతను నష్టపరిచి పూత రాలిపోయేలా చేస్తుంది. బూడిద తెగులు వల్ల లేత చిగుళ్లను, పూతను ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు సల్ఫర్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు, పూత, కాయమచ్చ తెగుళ్ల నివారణ ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలు పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోయి చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత, పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. దీని నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలు తొలగించుకోవాలి. మంకోజెట్ 1 గ్రాము లీటరు నీటికి, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరో తాలోనిల్ 1 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎండీ షాఫియ ఫర్హీన్, ఉద్యాన శాఖ అధికారిణి దోమ నివారణకు పూత మొదలై పువ్వు విచ్చుకోక ముందు ఒకసారి, పూలు ఫలదీకరణ చెందిన తరువాత రెండో సారి, టి దోమ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు (కాయ గోలీ సైజులో ఉన్నప్పుడు) మూడో సారి పిచికారీ చేయాలి. చెట్లు చిగురించినప్పుడు మొదట పిచికారీకి రైతులు ల్యాండా సైహాలో త్రిన్ 0.6 మిల్లీ లీటర్లు లీటరు నీటికి, లేదా అసిటామాప్రిడ్ 0.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే పూత కొమ్మలు కనిపించినప్పుడు రెండు, మూడు వారాల తరువాత ఇమిడాక్లోప్రిడ్ 0.6 మి.లీ లీటరు నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ, లీటర్ నీటికి కలిపి రెండో సారి పిచికారీ చేయాలి. కాయలు గోలీ సైజులో ఉన్నప్పుడు ల్యాండా సైహాలో త్రిన్ 0.6 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ, లీటర్ నీటికి కలిపి మూడో సారి పిచికారీ చేయాలి. వీటితో పాటు వేపనూనెను తగిన మోతాదులో కలిపి వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఉయ్యూరు: నగల దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఆదివారం ఉయ్యూరు టౌన్ పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా అయి భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ చిన్ననాటి నుంచే విలాసాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారు నగల దుకాణాలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇరు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుస్టేషన్లో చోరీ కేసు నమోదైంది. మధ్యాహ్న భోజన సమయాన్ని అదునుగా చేసుకుని నగల దుకాణాల్లోకి చొరబడి ఆభరణాలను అపహరిస్తుంటాడు. చోరీ సొత్తు కొంటున్న వ్యక్తి అరెస్ట్ ఈ క్రమంలో గత నెల 20న ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలో శ్రీకృష్ణసాయి జ్యూయలర్స్‌లో షాపు యజమానురాలు భోజనం చేస్తున్న సమయంలో షాపులోకి ప్రవేశించి 80 గ్రాములు విలువైన 35 జతల బంగారు చెవి దిద్దులను అపహరించుకుపోయాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సత్యనారాయణను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఎస్ సీఐ గోవిందరాజు, ఉయ్యూరు పట్టణ సీఐ రామారావు సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి ఉయ్యూరు మార్కెట్‌యార్డు సమీపంలో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 30 జతల చెవి దిద్దులు, 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.12 లక్షలు ఉంటుందన్నారు. సత్యనారాయణతో పాటు చోరీ సొత్తు కొనటానికి వచ్చిన కంచర్ల సాయిసుధీర్ను గుంటూరు నల్లచెరువు సమీపంలో అరెస్టు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
మాంసాహారం ధరలకు రెక్కలు
తణుకు అర్బన్ : చికెన్, మటన్, చేపల ధరలు షాకిస్తున్నాయి. పది రోజుల క్రితం వరకూ రూ.260 ఉన్న బ్రాయిలర్ చికెన్ నేడు రూ.320కు చేరుకోవడంతో మాంసాహారులు లబోదిబోమంటున్నారు. ముక్కలేనిదో ముద్దదిగని వారంతా మార్కెట్లో మాంసాహారం ధరలు చూసి గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహారం తినాల్సిందే అనే ధోరణిలో ఉన్నవారు మార్కెట్లో ధరలు చూసి ఏం తినాలి.. ఏం కొనాలనే ధోరణిలో ఉన్నారు. మటన్ రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండగా చేప ధర కిలో రూ.220గా ఉంది. చికెన్‌కు విక్రయాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో కిలో కొనేవారు అర కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొనుగోళ్లు తగ్గాయని రిటైల్ వ్యాపారులు వాపోతున్నారు. జిల్లాలో రిటైల్ వ్యాపారంలో రోజుకు 30 వేల కిలోలకుపైగా చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఆది, మంగళవారాల్లో రెట్టింపు అమ్మకాలు జరుగున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మటన్ విషయానికి వస్తే రోజూ 20 వేల కిలోల అమ్మకాలు జరుగుతుండగా, చేపలు ఆదివారం ఒక్కరోజే 50 వేల కిలోలకుపైగా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. మాంసాహారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా మాంసాహార ధరలు విపరీతంగా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని విమర్శిస్తున్నారు. -
స్వాగత ద్వారంపై రాజకీయ ఫ్లెక్సీ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శ్రీవారి కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డులోని ఆర్చిగేటు (స్వాగత ద్వారం)కు కొందరు టీడీపీ నాయకులు ఆదివారం రాజకీయ ఫ్లెక్సీని అమర్చడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇది ఆధ్యాత్మిక కేంద్రమా.. లేక రాజకీయ కేంద్రమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ఆదివారం ఉదయం యాదవ కల్యాణ మండప ప్రాంతంలో మల్టీపర్పస్ భవనం అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. దీనిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు ఏకంగా ఆర్చిగేటుకు ఫ్లెక్సీని అమర్చారు. ఇది వివాదాస్పదమైంది. అయినా దేవస్థానం అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో గరుడాళ్వార్ సెంటర్లో, లింగయ్య చెరువు మలుపులో వివిధ రాజకీయ పార్టీల నేతల ఫ్లెక్సీలు ఉండగా భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే దేవస్థానం అధికారులు వీటిని తొలగించారు. ముక్కున వేలేసుకుంటున్న భక్తులు -
బాస్కెట్‌బాల్ పోటీలు నూజివీడుకు గర్వకారణం
నూజివీడు: బాస్కెట్‌బాల్ పోటీలు నూజివీడుకే గర్వకారణమని మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గ అన్నారు. స్థానిక ధర్మఅప్పారావు కళాశాల ఆవరణలో శ్రీరాజా వెంకటాద్రి అప్పారావు బహద్ధూర్ 49వ స్మారక జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలను ఆదివారం రాత్రి మున్సిపల్ చైర్పర్సన్ త్రివేణీదుర్గ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు. 49 ఏళ్లుగా దేశంలో ఎక్కడా లేని విధంగా నూజివీడులో బాస్కెట్‌బాల్ పోటీలను నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. పురుషుల విభాగంలో తొలి మ్యాచ్ నూజివీడు–కావలి జట్ల మధ్య నిర్వహించారు. సీఐ పీ సత్య శ్రీనివాస్, టోర్నమెంట్ కన్వీనర్ పీ సాధన, కృష్ణాజిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సత్యన్నారాయణ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్లో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ఓబన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. -
వడ్డే ఓబన్నకు నివాళి
ఏలూరు(మెట్రో) : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. కలెక్టర్ వెట్రిసెల్వి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఈఎల్ బకాయిలు కాలయాపన లేకుండా తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్–1938) ఏలూరు జిల్లా శాఖ అధ్యక్షుడు ఈ.రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. మోహన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కష్టార్జిత హక్కుల కోసం నిరీక్షించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఉపాధ్యాయులు వివిధ అత్యవసర అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న పీఎఫ్ రుణాలను కూడా ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్జిత సెలవుల బకాయిలు, పీఎఫ్ రుణాలు ప్రభుత్వ దయాధర్మాలు కావని, ఉపాధ్యాయుల కష్టార్జిత హక్కులని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన పీఎఫ్ రుణాలను కూడా వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ జీ కృష్ణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెనుగొండ: జాతీయ విద్యావిధానం–2020 ద్వారా ఉన్నత విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చని ఉన్నత విద్య జాతీయ డైరెక్టరు చప్పిడి కృష్ణ అన్నారు. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు– పరిష్కారంపై ఆదివారం జాతీయ సదస్సులో పాల్గొన్నారు. 2020 జాతీయవిద్యా విధానం 10 సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని, ప్రస్తుతం ఐదు సంవత్సరాలు గడిచాయన్నారు. పెనుగొండ ఎస్వీకేపీలో నాణ్యమైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కల్పనలో పాలకవర్గం ఎప్పటికపుడు మార్పు చెందుతూ ముందుకు సాగడంతో ముందంజలో ఉందన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్రీనివాసన్, శివనాడార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జయదేవ్, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ రామచంద్రరాజు పాల్గొన్నారు. పెనుగొండ: విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చిన గురువును సిద్ధాంతం విద్యార్ధులు వినూత్న రీతిలో గౌరవించి భక్తిని చాటుకున్నారు. సిద్ధాంతానికి చెందిన ఉపాధ్యాయుడు బండారు వెంకటేశ్వరరావు ఇటీవల పదవీ విరమణ చేశారు. 30 ఏళ్లుగా వెంకటేశ్వరరావు వద్ద విద్యనభ్యసించిన వందలాది మంది విద్యార్థులు ఆదివారం గురువుకు ప్రత్యేక రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. పురవీధుల్లో కేరళ వాద్యాలతో హోరెత్తించారు. వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. -
మావుళ్లమ్మ ఆలయానికి ఉత్సవ శోభ
● రేపటి నుంచి 62వ వార్షిక మహోత్సవాలు ● ఫిబ్రవరి 14 వరకు ఉత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14 వరకు జరుగనున్న జాతర మహోత్సవాలకు సంబంధించి నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో ఆమ్మవారి అలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం వద్ద చలువ పందిళ్లు, ఆలయానికి నాలుగు దిక్కుల్లో ఆధ్యాత్మిక భావన కలిగేలా సెట్టింగ్‌లు, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. ఉత్సవాల్లో కార్యక్రమాలు ఇలా.. ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద, భరత నాట్య ప్రదర్శనలు, హరికథ, బురక్రథ వంటి కళాప్రదర్శనలు, సినీ సంగీత విభావరిలు ఏర్పాటుచేశారు. సుమారు 30 నాటకాలు, 20 హరికథ, బురక్రథలు, 15 వరకూ సినీసంగీత విభావరి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 5 నుంచి ప్రత్యేక అలంకరణలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి అష్టలక్ష్మీలుగా ప్రత్యేక అలంకరణలు నిర్వహించి పూజలు నిర్వహిస్తారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, అన్నపూర్ణదేవి అలంకరణలో పూజలు అందుకుంటారు. భారీగా భక్తుల రాక అమ్మవారి ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు రావడంతో పాటు, రాష్ట్రాంలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కొనసీమ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా సంక్రాంతి నాలుగు రోజులు అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపొతుంది. ఫిబ్రవరి 13న లక్ష మందికి అన్నదానం అమ్మవారి ఉత్సవాలను, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయం వద్ద నెల రోజులపాటు ఉత్సవ నిర్వాహకులు ఉచిత అన్నదానానికి ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఆఖరి రోజు ఫిబ్రవరి 13వ తేదీన మహా అన్నదానం నిర్వహిస్తారు. సుమారు లక్ష మందికి అన్నప్రసాదాన్ని అందిస్తారు. అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించడాన్ని జిల్లా ప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం భీమవరం డీఎస్పీ రఘువీర విష్ణు పరిశీలించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాల నిర్వాహకులు, దేవస్ధానం సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు రాకుండా పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 13 నుంచి భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ 62వ వార్షిక జాతరను నెల రోజులపాటు నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 5.15 గంటలకు వర్తక సంఘం అధ్యక్షుడు తుటారపు ఏడుకొండలు దంపతులు కలశస్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకు అమ్మవారి గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సాయంత్రం 4 గంటలకు కొటికలపూడి గోవిందరావు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రరెడ్డి ప్రారంభిస్తారన్నారు. సుమారు రూ.90 లక్షలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల నెల రోజుల పాటు నాటకాలు, బుర్రకథలు, హరికథలు, కూచిపూడి, భరతనాట్యం, సినీ ఆర్కెస్ట్రాలు ప్రతి రోజు ఉంటాయని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు తూటరపు ఏడుకొండలు, కొప్పుల సత్తిబాబు, రామాయణం చిన్నారి, కొప్పుల రంగారావు, రామాయణం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పెద్దింట్లమ్మకు విశేష పూజలు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. ఆదివారం ఒక్క రోజున అమ్మవారి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదులు, అమ్మ చిత్రపటాలు అమ్మకం, విరాళాలు, వాహన పూజల ద్వారా రూ.36,025 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.కాళ్ల: ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా కాళ్ళకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయం భూః శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆదివారం కూడారై పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కూడారై అక్కరసు (పాయసం) ప్రసాదాన్ని తయారు చేసి 1,350 గిన్నెలతో స్వామి, అమ్మ వార్లకు నివేదించారు. ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పాశురములు, గానం చేశారు. దేవాలయంనందు వివిధ రకాల పుష్పాలతో శంఖు, చక్రం, నామాలతో అలంకరణలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల ప్రసాదాలు స్వీకరించారు. యతిరాజుల ఆండాళ్ గోష్టి వారు గోదాదేవి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.భీమవరం: పట్టణంలోని రైతు బజార్ ప్రాంతంలో మద్యం షాపు వద్ద ఒక వ్యక్తిపై మద్యం మత్తులో దాడిచేసి గాయపర్చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్సై బీవై కిరణ్‌కుమార్ చెప్పారు.మహిళపై దౌర్జన్యం కేసుభీమవరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని చినరంగనిపాలెం ప్రాంతానికి చెందిన మహిళపై ప్రసన్నకుమారి, నర్సింహులు, మరో నలుగురు దౌర్జన్యం చేశారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్సై కృష్ణాజీ చెప్పారు.గుర్తు తెలియని వ్యక్తి మృతిజంగారెడ్డిగూడెం: పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గులాబీ కలర్ టీ షర్ట్, నల్లరంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఫిట్స్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కుట్రలతోనే కవ్వింపులు
సాక్షి, భీమవరం: తణుకు ప్రశాంతతను భగ్నం చేసేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ధోరణిలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. మొన్న తణుకులో మొదలైన కూటమి కవ్వింపు చర్యలు తాజాగా ఉదరాళ్లపాలెంకు వ్యాపించాయి. సాధారణంగా పండుగల సందర్భంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏ పార్టీ నేతల విగ్రహాల చెంతన ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఫ్లెక్సీలు పెట్టడం పరిపాటి. అందుకు భిన్నంగా తణుకు వై.జంక్షనన్లో వైఎస్సార్ విగ్రహం ముందుభాగంలో గత నెల 25న రాత్రి సమయంలో పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కూటమి అగ్రనాయకత్వం, ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం వివాదాస్పదమైన విషయం విదితమే. తమ అభిమాన నాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కూటమి ఫ్లెక్సీని తొలగించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ ఏర్పాటుకు ప్రయత్నించగా పోలీసులు లాక్కున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఉన్న మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విషయం తెలిసి హుటాహుటిన తణుకు చేరుకుని పార్టీ శ్రేణులతో ఆందోళనకు దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఘటన స్థలం వద్ద వైఎస్సార్సీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. 26వ తేదీ తెల్లవారుజామున పోలీసులు రెండు ఫ్లెక్సీలు తొలగించారు. 144 సెక్షన్ విధించామని మైకులో ప్రచారం చేయడంతో పాటు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటుచేశారు. ఘటన స్థలం నేషనల్ హైవేకు సంబంధించిందని, ఇక్కడ ఏ విధమైన ఫ్లెక్సీలు ఏర్పాటుచేయరాదని హెచ్చరిక బోర్డుతో విగ్రహం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఆ రోజు నుంచి విగ్రహం వద్ద పగలు, రాత్రి పోలీసులు గస్తీ కొనసాగిస్తున్నారు. తణుకులో పరిస్థితి ఇలా ఉంటే శనివారం అత్తిలి మండలంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి పర్యటనను పురస్కరించుకుని ఉదరాళ్లపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. మెయినన్ రోడ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు మంత్రికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద మాజీ మంత్రి కారుమూరిని కించపర్చేలా ఊరు, పేరు లేకుండా ఫ్లెక్సీలు వెలిశాయి. ఉదయం నుంచి ఫ్లెక్సీలు ఉన్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించారని, వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పార్టీ శ్రేణులు నిరసన చేపట్టగా వాటిని తొలగించారంటున్నారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశాంతంతకు పేరొందిన తణుకు నియోజకవర్గంలో ప్రతిపక్ష సభ్యులను కవ్వించి గొడవలు సృష్టించే కుట్రల్లో భాగంగానే ఈ తరహాలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి దుశ్చర్యల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారం ఇచ్చిన ప్రజానీకానికి మంచి పాలన అందించడం కంటే ప్రతిపక్షం వారిని ఏదోరకంగా కవ్వించి విధ్వంసాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీలో చేసిన సంక్షేమం, అభివృద్ధికి ధీటుగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే సంతోషిస్తాం. ఫ్లెక్సీలు పెట్టి గొడవలు సృష్టించాలనే చీఫ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటు. వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీ కట్టడం ఏమిటని ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఉరదాళ్లపాలెంలో నన్ను అవమానించాలనే ఉద్దేశ్యంతో ఫ్లెక్సీలు పెట్టి శునకానందం పొందుతున్నారు. గొడవలు సృష్టించి మాపై కేసులు నమోదుచేయించడమే లక్ష్యంగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నేడు వారు చేస్తున్నవన్నీ వారికి చేరే రోజులు వస్తాయి. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి ఫ్లెక్సీలతో ప్రశాంతతను భగ్నం చేసే కుట్రలు మొన్న తణుకులో.. నిన్న ఉదరాళ్లపాలెంలో కూటమి నేతల కవ్వింపు చర్యలు -
కూటమి నిర్వాకంతోనే ఆలయాల్లో అపచారాలు
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని హిందూ ఆలయాల్లో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయని, దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల కాలంలో దేవాలయాలపై దాడులు, అపవిత్రమైన కార్యక్రమాలు ఎన్నో జరిగాయన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో తాజాగా ఉచిత ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులకు కరెంట్ షాక్ తగిలిందన్నారు. అమ్మవారికి శ్రీచక్ర అర్చనలో పురుగులతో ఉన్న ఆవు పాలను వినియోగించడమనేది దుర్మార్గమైన చర్య అని అన్నారు. దుర్గమ్మ ఆలయానికి ఏకంగా కరెంటు సరఫరాను నిలిపివేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారికి జరుగుతున్న అపచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే గోవులు చనిపోయాయన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందని ఉన్మాదకరంగా మాట్లాడటం దారుణమన్నారు. డిప్యైటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతనమని డ్రామాలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. పొద్దున సనాతన వేషం, రెండో పూట ఇంకేం వేషం వేస్తాడో తెలియదన్నారు. వీకెండ్ వస్తే సీఎం చంద్రబాబు హైదరాబాద్‌కు వెళిపోతున్నారని, డిప్యూటీ సీఎం అయితే వారంలో ఒకసారి మాత్రమే మన రాష్ట్రానికి వస్తున్నాడన్నారు. ఇక మంత్రులైతే ఉంటే హైదరాబాద్ లోని పబ్బుల్లో, లేదంటే హైదరాబాద్‌లో సెటిల్మెంట్లు చేస్తుంటారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, పార్టీ గోపాలపురం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ, తదితరులున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి -
పండక్కి పప్పన్నం లేనట్లే..!
● పట్టించుకోని చంద్రబాబు సర్కారు ● మార్కెట్లో ధరల దరువు... ప్రభుత్వం నుంచి ఆదరణ కరువు ఏలూరు (మెట్రో) : ఓ వైపు ధరలు రోజురోజుకు పెరిగిపోతుంటే ప్రభుత్వం అందించాల్సిన నిత్యావసరాల సరఫరాను ప్రభుత్వం తగ్గించేస్తుంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకూ జిల్లా రేషన్‌కార్డుదారులకు నిత్యావసరాలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంది. సంక్రాంతి పండుగ అనేది తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పండుగకు నిత్యావసరాలు పూర్తిస్థాయిలో చంద్రబాబు సర్కారు అందించిన పాపాన పోవడం లేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. కనీసం బెల్లం, కందిపప్పు వంటివి కార్డుదారులకు అందిస్తే పండుగకు కాస్త ఆదరణ కల్పించినట్లు అవుతుంది. చంద్రబాబు సర్కారు దోపిడీనే రాజ్యంగా పాలన సాగిస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బియ్యాన్ని మాత్రమే కార్డుదారులకు అందిస్తూ చేతులు దులుపుకుంటున్న చంద్రబాబు సర్కారు రాగులు, జొన్నలు వంటివి అందిస్తామని ప్రచారాలు చేసినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేదు. కనీసం పెద్దపండుగ సంక్రాంతికి అయినా అందిస్తారని ఆశించినా అదీ లేకుండా పోయింది. కేవలం బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నా ఆ పంచదార కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. బెల్లం, కందిపప్పు ఊసే లేదు జిల్లాలో 1,123 రేషన్ దుకాణాల ద్వారా 6,31,044 కార్డుదారులకు రేషన్ అందిస్తున్నారు. వీటి ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదారను మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. కనీసం కార్డుదారులకు కేజీ చొప్పున కందిపప్పు పంపిణీ చేస్తే 631 టన్నులు అవసరం అవుతుంది. అరకేజీ చొప్పున 315 టన్నుల బెల్లం మాత్రమే అవసరం. ఇవేమీ పండుగకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బెల్లం, వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కంపెనీని బట్టి లీటరు వంట నూనె రు.140 నుంచి రు.160 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగకు పిండివంటలు చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రజలకు అందించే కాస్త సరుకులనూ ప్రభుత్వం అందించేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కేజీ కందిపప్పు రూ.180 వరకూ ధర పలికింది. ప్రస్తుతం రూ.110కి చేరుకుంది. కందిపప్పు కొనుగోలు చేయాలంటే ప్రజలు బెంబేలెత్తిపోయారు. చంద్రబాబు సర్కారు చోద్యం చూస్తోంది. -
ఏలూరు జీజీహెచ్‌లో వైద్యం నిల్
ఏలూరు టౌన్: హనుమాన్జంక్షన్కు చెందిన పోగోలు మౌనీష్కు ఈ నెల 4న ఘర్షణలో తలపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఏలూరు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. పరీక్షించి తలపై తీవ్ర గాయం కావటంతో 8 కుట్లు వేశారు. సిటీ స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తూ.. మందులు, ఇంజెక్షన్లు వాడాలని ప్రిస్కిప్షన్ రాశారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోకపోవటంతో వైద్యుల సలహాతో మౌనీష్ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్ళి మందులు వాడుతున్నారు. బాధితుడికి వాంతులు కావటం, అనారోగ్యానికి గురికావటంతో స్థానిక వైద్యుల వద్దకు తీసుకువెళ్ళగా జీజీహెచ్‌కు తీసుకువెళ్ళాలని సూచించటంతో ఏలూరు తరలించారు. శనివారం ఉదయం 9 గంటలకు ఏలూరు చేరుకుని సిటీ స్కాన్ రిపోర్ట్‌తో జీజీహెచ్ అత్యవసర విభాగానికి వచ్చారు. న్యూరో సర్జన్‌కు చూపించారు. రిపోర్ట్ ఆధారంగా శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందని చెప్పిన వైద్యులు ... జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్‌కు చూపించాలంటూ పంపేశారు. అక్కడకు వెళితే న్యూరో సర్జన్‌కు చూడాలంటూ బాధితుడితో ఆటలాడుకున్నారు. ఆఖరికి వైద్యచికిత్స చేయమంటూ విజయవాడ వెళ్ళాలని చెప్పేశారు. తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌కు వస్తే నరకం చూపిస్తున్నారంటూ బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ వేచి చూసి చేసేది లేక బాధితుడిని ఇంటికి తీసుకువెళ్ళారు. విజయవాడ వెళ్ళాలంటూ దాటవేత -
11 నుంచి బాస్కెట్‌బాల్ పోటీలు
● నూజివీడులో జాతీయ స్థాయి టోర్నమెంట్ ● తలపడనున్న 49 జట్లు నూజివీడు: సంక్రాంతి సందర్భంగా పట్టణంలో డీఏఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ నెల 11 నుంచి నిర్వహించనున్న శ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు బహూద్దూర్ మెమోరియల్ జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు కనువిందు చేయనున్నాయి. గత 48 ఏళ్లుగా సంక్రాంతికి బాస్కెట్‌బాల్ పోటీలు నిరాటంకంగా జరుగుతున్నాయి. పురుషులు, మహిళల విభాగంలో జరిగే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 49 జట్లు తమ ఎంట్రీలను నమోదు చేసుకున్నాయి. పురుషుల విభాగంలో 35 జట్లు, మహిళల విభాగంలో 14 జట్లు రానున్నాయి. పోటీల నిర్వహణకు బాస్కెట్‌బాల్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 20 మంది రిఫరీలు రానున్నారు. స్థానికంగా ఉన్న పట్టణ ప్రముఖులు, క్రీడామానులు తదితరుల నుంచి అందే విరాళాలతో బాస్కెట్‌బాల్ పోటీలను అంతరాయం లేకుండా నిర్వహిస్తున్నారు. లీగ్‌కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలను నిర్వహించడానికి కళాశాల ప్రాంగణంలోని రెండు బాస్కెట్‌బాల్ కోర్టులను సిద్ధం చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా పోటీలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. మాజీ రాజ్యసభ్యుడైన స్వర్గీయ ఎమ్మార్ అప్పారావు అధ్యక్షుడిగా, ఎంఎస్ అప్పారావు కార్యదర్శిగా 1969లో మొట్టమొదటిసారిగా నూజివీడు బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆవిర్భవించింది. అనంతరం 1971లో డీఏఆర్ కళాశాల్లో ఆంధ్రా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. 1973లో ఎంఎస్ అప్పారావు సారథ్యంలో బాస్కెట్‌బాల్ సంఘం ఏర్పాటైంది. 1975లో చిత్తూరులో జరిగిన ఆంధ్రా చాంపియన్‌షిప్ పోటీల్లో పురుషుల, మహిళ విభాగాల్లో నూజివీడు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నారు. 1976 నుంచి నూజివీడులో బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. క్రీడను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మార్ అప్పారావు నేతృత్వంలో నూజివీడు కేంద్రంగా జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఏర్పాటైంది. డీఏఆర్ కళాశాల్లో అప్పట్లో బాస్కెట్‌బాల్ శిక్షణ నిర్వహించేరు. ఈ శిక్షణలో నూజివీడు ప్రాంతానికి చెందిన వారు బాస్కెట్‌బాల్ నేర్చుకొని జాతీయ స్థాయి పోటీల్లో తమ సత్తా చాటి నూజివీడుకు మంచి గుర్తింపు తెచ్చారు. -
బియ్యం పట్టివేత
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని శివకాశీపురం గిరిజన బాలికల ఉన్నతపాఠశాల నుంచి అక్రమంగా బియ్యం, నిత్యావసర వస్తువులను వాహనంలో తరలిస్తున్న వార్డెన్‌ను శుక్రవారం అర్ధరాత్రి గ్రామస్తులు, జనసేన నేతలు పట్టుకున్నారు. పోలీసులు, రెవిన్యూ అధికారులకు సమాచారం అందించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించిన అధికారులు వాహనంలో 4 క్వింటాళ్ళ సన్నబియ్యం, కందిపప్పు, మంచినూనె, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వార్డెన్ పరారీలో ఉండటంతో రిజిస్టర్ కనబడలేదు. వార్డెన్ అక్రమాల పై ఉన్నతాధిరులకు నివేదిక అందించారు. -
కూటమి పాలనలో రాష్ట్రం అప్పులమయం
నూజివీడు: సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చెస్తానని చంద్రబాబు చెప్పారని, అయితే ప్రస్తుత కూటమి పాలనలో రాష్ట్రం అప్పుల్లో దూసుకుపోతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ధ్వజమెత్తారు. నాడు జగన్ పాలనలో సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తే నేడు చంద్రబాబు అప్పుల క్యాలెండర్ అమలు చే స్తున్నారని ఎద్దేవా చేశారు. నూజివీడు పట్టణ, మండల పార్టీ నిర్మాణ సంస్థాగత విస్తృత సమావేశాన్ని శనివారం స్థానిక వైఎస్సార్సీపీ నియోజకవర్గ కా ర్యాలయమైన ద్వారకా ఎస్టేట్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎన్నార్ మాట్లాడుతూ పేకాట, మట్టి, ఇసుక, మద్యం మాఫియాలే రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయన్నారు. జూదాలే టీడీపీ వాళ్లకు భుక్తిగా మారాయని విమర్శించారు. అవినీతి, అప్పులు, అక్రమాలు, దౌర్జన్యాలతో పాలన సాగుతోందన్నా రు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా తాము మోసపోయామని బాధపడుతున్నారని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు. అలాగే పాలకులకు జగన్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. సూపర్ సిక్స్ వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. గ్రామస్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు జగన్ దృష్టి పెట్టారని, గ్రా మ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి వారంద రి వివరాలను డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులపై సైతం రౌడీషీట్లు పెడుతున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి 2029 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. పాలనలో ప్రభుత్వం విఫలం చంద్రబాబు ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్‌ను అనవసరంగా ఓడించామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. పూర్తయిన ప్రభు త్వ భవనాలను కూడా ప్రారంభించకుండా పాలకులు కాలక్షేపం చేస్తున్నారని, వైఎస్ జగన్ ప్రారంభించే బస్సు యాత్రతో రాష్ట్ర ప్రభుత్వ పతనం ప్రా రంభమవుతుందన్నారు. కార్యకర్తలు ఎవరినీ చూసి భయపడాల్సిన పనిలేదని, కలిసికట్టుగా పార్టీ పటిష్టతకు పనిచేయాలన్నారు. 18 నెలలు గడిచినా అభివృద్ధి లేదు చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు గడిచినా అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కారుమూరి సునీల్‌కుమార్ అన్నారు. పేకాట, కోడిపందేలు తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎం.జయప్రకాష్, జిల్లా యూత్ అధ్యక్షుడు కామిరెడ్డి నాని మాట్లాడారు. నూజివీడు పట్టణ, మండల, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, మూల్పురి నాగవల్లేశ్వరరావు, బెజవాడ రాంబాబు, పుచ్ఛకాయల సుబ్బారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్, ఏలూరు నగర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, ఎంపీపీలు కొండా దుర్గాభవాని, గోళ్ల అనూష, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మలిశెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
ఏలూరు వైఎస్సార్సీపీలో జోష్
ఏలూరు టౌన్: ఏలూరు వైఎస్సార్సీపీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఏలూరు సమన్వయకర్త మా మిళ్లపల్లి జయప్రకాష్ సారథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు నెలలపాటు టీడీపీ పాలనలో ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఇక నూతన సంవత్సరంలో పార్టీలో మరింత జోష్‌తో ముందుకు సాగుతోంది. ఏలూరు నగరంలోని 24వ డివిజన్ నుంచి యువత వైఎస్సార్సీపీలో చేరటంతో పాటు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత గ్జేవియర్ మాస్టర్, ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి జక్కుల బెనర్జీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువతకు పార్టీ కండువాలు వేస్తూ సమన్వయకర్త జేపీ సాదరంగా ఆహ్వానం పలికారు. టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనీ, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని సమన్వయకర్త జేపీ అన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుకోవాలనీ, ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. -
అప్పుల పండుగ
కనుమ ఉత్సవానికి ఏర్పాట్లు ద్వారకాతిరుమల చినవెంకన్న కనుమ ఉత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 16న ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. IIలో uఅత్తిలి మండలంలోని బల్లిపాడు గ్రామానికి గతంలో వారంలో బుధ, శనివారాల్లో ఆరుగురు వరకు ఫైనాన్స్ వ్యాపారులు వచ్చేవారు. వీక్లీ, మంథ్లీ పేమెంట్లు చేసేలా అవసరమైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అప్పులు ఇచ్చేవారు. ఏడాది కాలంలో గ్రామానికి వచ్చే వ్యాపారులు 20 మందికి పైగా పెరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో రెండు రోజులు మాత్రమే వస్తే ప్రస్తుతం వారం పొడవునా వచ్చి అప్పులు ఇస్తున్నారంటున్నారు. ఫైనాన్స్ వ్యాపారం బాగుందన్న ఉద్దేశంతో స్థానికంగాను కొందరు యువకులు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: గోదావరి జిల్లాల్లో జరిగే అతిపెద్ద పండుగ సంక్రాంతి. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడ ఉంటూ స్వస్థలాలకు వచ్చిన వారితో సందడిగా ఉంటుంది. కొత్త దుస్తులు, పిండి వంటలు, జాతరలు, విహారయాత్రలు, ఇంటికి వచ్చే అల్లుళ్లు, మనవళ్లకు కానుకలు రూపంలో పండగ ఖర్చు ఎక్కువే. అయినా లెక్కచేయకుండా ఏడాదికో పండుగ అన్నట్టుగా ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతులు కరువు : సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మొదటి ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహనసేవ పథకాల ద్వారా జిల్లావాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లు మాత్రమే. మరోపక్క విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అభివృద్ధి పనులు నిలిచిపోవడం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలై కార్మికులకు సరిగా పనులు ఉండటం లేదు. విపత్తులు, దళారీల దోపిడీతో తొలకరి పంట నష్టాలనే మిగిల్చింది. ఆయా కారణాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అధిక వడ్డీలకు.. సాధారణంగా రూ.10 లక్షలలోపు ఫైనాన్స్ చేసే చాలా మంది వ్యాపారులు పెద్ద వ్యాపారుల నుంచి రూపాయి నుంచి రెండు రూపాయల వడ్డీకి (వడ్డీ అడ్జస్ట్మెంట్) తెచ్చి బయట పద్దుల రూపంలో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తుంటారు. కొద్ది వారాలుగా మార్కెట్లో అప్పులు తీసుకుంటున్న వారు పెరుగుతున్నారని వ్యాపారులు అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా వారి సంఖ్య మరింత పెరగడంతో తమ వద్ద డబ్బులు చాలక అదనంగా వడ్డీ అడ్జెస్ట్మెంట్పై డబ్బులు తెచ్చి ఇస్తున్నారు. పండుగ గడిస్తే చాలు.. మెల్లగా వాయిదాలు కట్టేసుకోవచ్చన్నట్టుగా అధిక వడ్డీలను లెక్కచేయకుండా అప్పులు తీసుకుంటున్నారు. పండుగల రూపేణా జిల్లాలో రూ.100 కోట్ల వరకు ఫైనా న్స్ వ్యాపారం జరుగుతుందని అంచనా. కొన్నాళ్లుగా సరిగా బేరాలు లేక ఖాళీగా ఉన్న క్లాత్ రెడీమేడ్, జ్యూయలరీ, కిరాణా తదితర షాపులు కొద్దిరోజులుగా అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. అవస్థలే నిండుగా.. జాడలేని సంక్షేమం నిర్మాణ రంగం కుదేలు డబ్బుల్లేక జనం విలవిల సంక్రాంతి కోసం అధిక వడ్డీలకు అప్పులు పాత పద్దులు తిరగేయిస్తున్న మరికొందరు గ్రామాలకు క్యూ కడుతున్న ఫైనాన్స్ వ్యాపారులు జిల్లాలో పండుగ ఫైనాన్స్ రూ.100 కోట్లకు పైనే.. ప్రస్తుతం పూటగడవడం కష్టంగానే ఉన్నా ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి పండుగను ఇంటిళ్లపాదీ కలిసి ఆనందంగా జరుపుకోవాలని చాలా మంది ఫైనాన్స్ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం తదితర ప్రాంతాలకు చెందిన స్థానిక వ్యాపారులతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులకు జిల్లాలో ఫైనాన్స్ లైన్లు ఉన్నాయి. ఇంట్లోని వారందరికీ కొత్త దుస్తులు, పిండివంటల కోసం కిరాణా సరుకులు, ప్రయాణం, వినోదం ఖర్చుల నిమిత్తం కొందరు, కోడిపందేలు, గుండాట, పేకాటల జూదం కోసం మరికొందరు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో వీక్లీ, మంథ్లీ వాయిదాల్లో తిరిగి చెల్లించేలా అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాత పద్దులుండి కొంతవరకు చెల్లించిన వారు వాటిని తిరగేయించుకుని కొత్త అప్పులు తీసుకుంటున్నారు. కొందరు ఇద్దరు ముగ్గురు వ్యాపారుల వద్ద పద్దులు తీసుకుంటున్నారు. -
పందెం బరుల ధ్వంసం
నూజివీడు/చాట్రాయి: నూజివీడు మండలం, పట్టణంలో ఏర్పాటుచేసిన పలు కోడిపందేల బరులను పోలీసులు శనివారం ధ్వంసం చేశారు. నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని పాతరావిచర్లలో బరిలో ఎస్సై జ్యోతీబసు సిబ్బందితో కలిసి ట్రాక్టర్‌తో దున్నించడంతో పాటు స్తంభాలను, ఫెన్సింగ్‌ను తొలగించారు. అలాగే నూజివీడులోని గొడుగువారిగూడెంలో పందేల బరిని టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చాట్రాయి మండలంలో.. చాట్రాయి: మండలంలోని కృష్ణారావుపాలెంలో కోడిపందేల బరిని నూజివీడు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్సై డి.రామకృష్ణ పాల్గొన్నారు. -
జడ్జిల నియామకం
సత్యప్రసాదరావు శ్రీరామ్ మురళీకృష్ణ ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 8 మంది స్పెషల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్లను నియమిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఉత్తర్వులు ఇచ్చారు. వీరిలో నండూరి నాగ వెంకట సత్య ప్రసాదరావు స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఏలూరు, రా వూ రి మురళీకృష్ణ, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ ఏలూరు, బొనిగే వెంకటరావు, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ కొవ్వూరు, సుంకవల్లి శ్రీరామ్, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ కొవ్వూరు, గుత్తుల వీర వెంకట సత్యనారాయణ స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ తణుకు, నల్లి శంకర్, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ నరసాపురం, పెంకి సత్యనారాయణ స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ పాలకొల్లు, నక్కా వెంకటేశ్వర్లు స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ జంగారెడ్డిగూడెం నియమితులయ్యా రు. వీరిలో ప్రసాదరావు, మురళీకృష్ణ, శ్రీరామ్ ఏలూరుకు చెందిన వారు. -
రహదారి భద్రతా నియమాలు పాటించాలి
జంగారెడ్డిగూడెం: ప్రమాదాల నివారణకు రహదా రి భద్రత ఆవశ్యకతను తెలియజేసేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో స్పెషల్ డ్రైవ్‌ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండని పిలుపునిచ్చారు. రహదారి ప్రమాదాల్లో యువత ఎక్కువగా మరణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. హెల్మెట్ ధరించడంతో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన పత్రాలు లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రుల పైనా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాంతకమన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నంబర్ ప్లేట్లు లేనటువంటి వారు, హెల్మెట్లు ధరించినటువంటి వారిపై జరిమానాలతో వదలకుండా, వాహనదారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించి, అప్పటికప్పుడే నంబర్ ప్లేట్లను అమర్చుకునేలాగా చర్యలు తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై ఎం.కుటుంబరావు, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరికలు
కుక్కునూరు: గత వైఎస్సార్సీపీ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అందించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. శనివారం మండలంలోని మారేడుబాక గ్రామానికి చెందిన ఏడుగురు టీడీపీని వీడి పంచాయతీ కన్వీనర్ దాడి వెంకన్న, మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్, రావు వినోద్‌లు పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు జగన్ నాయకత్వాన్ని మెచ్చి వచ్చారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని, టీడీపీ అసమర్థ పాలనే ఇందుకు కారణమన్నారు. గంటశాల దుర్గాప్రసాద్, గోలి సందీప్, గంటశాల నాగరాజు, మిడి యం లక్ష్మయ్య, మడెం లక్ష్మయ్య, కారం తిరుపతిరావు, మడకం యర్రయ్య తదితరులు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు గొగ్గులోతు సత్యనారాయణ, రాయి బాలాజీ, వేల్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొ లుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గో దాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం క్షేత్రవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ గ్రా మోత్సవం నిర్వహించారు. శివాలయం ఆర్చీగేటు వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా వర్షం చినుకులు పడటంతో స్వామివారి వాహనాన్ని వేగంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీంతో ధనుర్మాస మండపంలో నిర్వహించాల్సిన పూజలు రద్దయ్యాయి. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని, 10వ తరగతి ఇన్విజిలేషన్, జవాబుపత్రాల మూల్యాంకన విధులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే నియమించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలో డీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ 58 ఏళ్లు దాటిన వారందరినీ మూల్యాంకన విధుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కె.కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష మాధ్యమం కొనసాగించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఏవీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీనివాసరావు, కె.సురేష్‌కుమార్, ఏలూరు మండల అధ్యక్షుడు కె.దాసు, ముసునూరు మండల గౌరవాధ్యక్షుడు ఎస్వీ సుబ్బారావు, మహిళా ఉపాధ్యక్షురాలు కె.కుమారి పాల్గొన్నారని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. భీమవరం: ఉపాధి హామీ జీ రామ్‌జీ చట్టం ప్రతులను ఈనెల 14న భోగి మంటల్లో దహనం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బాతిరెడ్డి జార్జి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పాత చట్టంలో 10 శాతం రాష్ట్ర వాటా కాగా కొత్త చట్టంలో 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ఒకపక్క 125 రోజులకు పనులు పెంచామని చెబుతూ మరోపక్క 60 రోజుల నిషేధం విధించడం ఉపాధి కూలీలను మోసగించడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వచ్చేనెల 12న దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు కౌ రు పెద్దిరాజు, కండెల్లి సోమరాజు బల్ల చినవీరభద్రరావు, జక్కంశెట్టి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన ప్రసాదాల కౌంటర్ వద్ద నిమ్మకాయలు విక్రయిస్తున్న ఓ మహిళా వ్యాపారిపై దేవస్థానం సెక్యూరిటీ సూపర్వైజర్ శనివారం కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమె స్వల్పంగా గాయపడింది. ద్వారకాతిరుమల క్షేత్రంలోని లింగయ్య చెరువు వద్ద, అలాగే కొండపైన జంటగోపురాలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద కొందరు మహిళలు నిమ్మకాయలు విక్రయిస్తున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. భక్తులు వి సుగు చెందేలా చేస్తున్నారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఎన్నిసార్లు హెచ్చరించినా వా రిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే కొమ్మరకి చెందిన మానుకొండ సో మాలు అనే మహిళ నిమ్మకాయల విక్రయిస్తుండగా సెక్యూ రిటీ సూపర్వైజర్ ప్రవీణ్ కర్రతో కొట్టాడు. ఆమె మోచేతికి స్వల్ప గాయమైంది. సదరు సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాలని బా ధితురాలు అంటోంది. -
వేగంగా పాస్బుక్ల పంపిణీ
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): జిల్లాలో పట్టాదార్ పాస్‌బుక్‌లను రై తులకు వెంటనే అందించా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 9,134 పాస్‌బుక్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో ఏలూరు డివిజన్లో 5,501, జంగారెడ్డిగూడెం డివిజన్లో 3,614, నూజివీడు డివిజన్లో 90 ఉన్నాయన్నారు. అధికంగా కలిదిండి మండలంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కై కలూరు, దెందులూరు, పోలవరం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పెండింగ్‌లో ఉన్న పాస్ పుస్తకాలను వేగంగా పంపిణీ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
నయనానందకరం శ్రీవారి గ్రామోత్సవం
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగుతున్న శ్రీవారికి అడుగడుగునా భక్తులు హారతులు పట్టి, నీరాజనాలు సమర్పిస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన స్వామివారి గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ ప్రతి ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీవారికి భక్తులు హారతులిచ్చి, నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవం అనంతరం గుడి సెంటర్లోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. -
వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రెసిడెంట్‌గా అనురాధ
అల్లవరం/ఏలూరు టౌన్ : అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ ఆ పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అనురాధ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారమే లక్ష్యంగా మహిళా శక్తిని సమీకరించి, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ఈ నియామకం తన బాధ్యతలను మరింత పెంచిందని, పార్టీ బలోపేతానికి అహర్నిశలూ కృషి చేస్తానని అనురాధ తెలిపారు. పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు (టూటౌన్): పంచాయతీల్లో ఎస్సీ సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్సీ సర్పంచ్‌లు శుక్రవారం ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహార్‌కు ఫిర్యాదు చేశారు. దెందులూరు మండలం కండ్రిగ నరసింహపురంలో పంచాయతీ నిధులతో కమ్యూనిటీ హాలు నిర్మించి శ్లాబ్ లెవల్‌కు తీసుకొచ్చామని, గత 18 నెలల నుంచి పని పూర్తి కానివ్వకుండా పంచాయతీ కార్యదర్శి, ఏఈ, డీఈలు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సర్పంచ్ మెండెం సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దెందులూరు మండలం పోతునూరు సర్పంచ్ బోదుల స్వరూప్, గాలాయగూడెం సర్పంచ్ చిలకా సుబ్బారావు కూడా ఫిర్యాదు చేశారు. -
సంక్షేమానికి గ్రహణం
కామవరపుకోట: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి గ్రహణం పట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు అధ్యక్షతన, మండల పార్టీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వీరిశెట్టిగూడెం సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన్రావు నాయకత్వంలో శుక్రవారం మండల పార్టీ నిర్మాణ సంస్థగత సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమని నేడు పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తులో తగిన గుర్తింపుతో పాటు గౌరవం లభిస్తుందని తెలిపారు. పార్లమెంట్ పరిశీలకుడు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ మోసాల ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సంక్షేమానికి చెదలు పట్టిందని, పాలన చేపట్టి రెండేళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సంక్షేమ కాంతులు చెరిగిపోయాయని, సూపర్ సిక్స్ పథకాలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారని అన్నారు. కంభం విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని, గ్రామాల్లో ఎక్కడికి వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. అనంతరం జలపవారి గూడెం గ్రామానికి చెందిన కరుటూరి బాలస్వామి, కరటూరి శ్రావణ్ కుమార్, మిధున్ చక్రవర్తి, బంటుమిల్లి రవికుమార్ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరారు. జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ సతీష్ చౌదరి, జిల్లా కార్యదర్శి జయమంగళ కాసులు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గురజాల పార్థసారధి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరిత రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు సాయిల స్వాతి యాదవ్, కామవరపుకోట వైస్ ఎంపీపీ గిరిజ, నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు మేరిగ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
జంగారెడ్డిగూడెం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రభుత్వం రానుందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణ, మండల వైఎస్సార్సీపీ ఆత్మీయ విస్తృత స్థాయి సమావేశం చింతలపూడి కన్వీనర్ కంభం విజయరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నిర్మాణాత్మక శక్తిగా ఎదగాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి జగన్‌ను సీఎం చేయాలన్నారు. సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అన్ని విభాగాల కమిటీలు ఏర్పాటు చేసుకుని ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం జగన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్సీ, ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు వంకా రవీంద్రనాధ్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను వివరించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు తమకు ఇచ్చిన పదవులకు న్యాయం చేయాలని, స్థానిక నాయకత్వం బలంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో విజయానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ అక్రమ కేసులు పెడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు ప్రభుత్వం ఏలుతుందన్నారు. లక్షల కోట్ల ఆస్తులను చంద్రబాబు తమ అనునాయులకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. కోటి సంతకాల ఉద్యమం ఒక అద్భుత ఘట్టమని పేర్కొన్నారు. జగనన్న కార్యకర్తలకు ప్రముఖస్థానం కల్పిస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి జగనన్నను తిరిగి సీఎం చేసుకోవాలన్నారు. కార్యకర్తలకు అగ్రస్థానం: జెట్టి గురనాథరావు రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పరిశీలకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. కార్యకర్తలకు జగనన్న అగ్రస్థానం కల్పిస్తున్నారని, సంస్థాగత ఎన్నికలు పూర్తిచేసి పార్టీ సైన్యాన్ని సిద్దం చేయాలన్నారు. ఇప్పటికే చాలా కమిటీలు వేసి పూర్తి చేశామన్నారు. జగనన్నే మన నాయకుడని పేర్కొన్నారు. 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ బత్తిన లక్ష్మి, ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపేయి సుధీర్, సీఈసీ సభ్యులు దయ్యాల నవీన్‌బాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి తదితరులు మాట్లాడారు. కౌన్సిలర్ మానవత మూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గుప్త, వైస్ ఛైర్మన్ ముప్పిడి అంజి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, గురజాల పార్థసారధి, మేడవరపు విద్యాసాగర్, కనికళ్ల ప్రసాద్, సాయిల స్వాతి, వామిశెట్టి హరిబాబు, భావన రుషి, బత్తిన చిన్న, శ్యామ్, బోను రాధిక, తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
పీపీపీ ఉత్తర్వులను భోగి మంటల్లో తగులబెట్టండి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరించే విధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాల లను ప్రైవేటీకరణ చేసే ఉత్తర్వుల కాపీలను, వికసిత్ భారత్ జీ రాం జి కాపీలను భోగి మంటలలో వేసి తగలబెట్టి నిరసన తెలపాలని సీపీఐ కార్యకర్తలకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో బాడిశ రాము అధ్యక్షతన శుక్రవారం సీపీఐ జిల్లా కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలలో పేద ప్రజలకు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాదని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని ఆమె పేర్కొన్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి కల్పిస్తామని, ఉపాధి కల్పించని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో? అర్థం కావట్లేదని ఆమె రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ నెల 18న ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సభకు జిల్లా నుండి 3000 మంది వెళ్లాలని నిర్ణయించామన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వనజ మాట్లాడుతూ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లకు డిజైన్ చేశారని, మొదటి దశగా డ్యాం 41.15 మీటర్ల ఎత్తు వరకు, రెండవ దశగా 45.72 మీటర్లుగా నిర్ణయిస్తూ ప్రాజెక్టును పూర్తిగా రిజర్వాయర్ గా మార్చే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించడంలోనూ పునరావాసం కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ధ్వజమెత్తారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు కారం ధారయ్య, ఉప్పులూరి హేమ శంకర్, నిమ్మగడ్డ నరసింహ, జేవి రమణ రాజు, తొర్లపాటి బాబు, రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు, బి.ఎన్.సాగర్, గోలిమే బాల యేసు పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన ఉండి నియోజకవర్గానికి చెందిన జుత్తుగ నాగరాజు స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తానని, పాఠకులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్‌ను గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు నాగరాజు, డిప్యూటీ లైబ్రేరియన్ ఎ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ మత్తు మహమ్మారిలా విస్తరిస్తూ విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్నా ప్రభుత్వం కావాలనే కళ్లు మూసుకుని కూర్చోందని పలువురు నాయకులు ఆరోపించారు. శుక్రవారం విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరు ఐద్వా మహిళా సంఘం కార్యాలయంలో నిర్వహించారు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాణి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా కేంద్రాలు బహిరంగంగానే పనిచేస్తున్నా, మత్తు పదార్థాల అమ్మకాలు కాలనీల్లో నిర్భయంగా సాగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిశ్చేష్టంగా వ్యవహరిస్తోందని వక్తలు మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.లెనిన్, డీవైఎఫ్ఐ నాయకుడు ఎ.శరత్ చంద్ర, ఐద్వా నాయకురాలు పి.హైమావతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీగా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన మద్దు రామ్‌ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడేనికి చెందిన షేక్ రఫీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు వచ్చాయి. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ సోల్లా బొజ్జిరెడ్డి ఈ నెల 11న ఏలూరులోని రెవెన్యూ అతిథి గృహం చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ఏలూరులోని గిరిజన భవన్ చేరుకుని, ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి అసోసియేషన్ ప్రతినిధుల నుంచి సమస్యలు తెలుసుకుంటారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
బుట్టాయగూడెం: మండలంలోని రెడ్డిగణపవరం, దొరమామిడి గ్రామంలో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సుమారు 10 ట్రాక్టర్లతో జేసీబీల ద్వారా మట్టి గుట్టలను తొలగించి ఇళ్లకు, ఇటుకల బట్టీలకు తరలిస్తున్నారు. అయితే అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందినా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో అక్రమ మట్టి తవ్వకాలతో, ట్రాక్టర్ల శబ్దాలతో చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
హామీలపై ప్రశ్నిస్తే కేసులు
ఏలూరు (టూటౌన్): ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాల నాయకులపై, వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసులకు నిరసనగా శుక్రవారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీవైఎల్, వైఎస్సార్సీపీ యువజన విభాగం, విధ్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని, నెలకు రూ.3 వేల చొప్పున అందజేస్తామని చంద్రబాబు సర్కార్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నించిన గొంతుకలను అణగదొక్కాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు తేరా ఆనంద్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజేష్, యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీనివాస కల్యాణోత్సవం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలతో ఈ కల్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరులతో కూడిన కల్యాణమూర్తికి ఐవీ రామాంజనేయులు ఇంటి వద్ద అభిషేకాలు విశేష అర్చన వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం శోభాయాత్రగా కల్యాణ వేదిక వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి ప్రత్యేక అలంకరణ చేసి గోదా పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా ఏర్పాటు చేసిన భక్తిసంగీత విభావరి భక్తులను అలరించింది. కార్యక్రమ వ్యాఖ్యాతగా బ్రహ్మశ్రీ ఈమని శశి కుమార్ శర్మ వ్యవహరించగా, ఎమ్మెల్యే ఎస్.రోషన్ కుమార్, రాజాన సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్రావు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.కాంతారావు, ఎం.ఆదినారాయణ డీటీఎఫ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమం కోసం శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కార్యవర్గం జూమ్ సమావేశం నిర్వహించింది. సంఘ నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని, పాఠశాలలో మాతృభాషా మాధ్యమం అమలు తదితర డిమాండ్లతో విజయవాడలో ఈ ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో డీటీఎఫ్ ఉపాధ్యక్షుడు ఎస్ఏవీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు నగరానికి చెందిన ఇద్దరు స్నేహితులు సులువుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్నారు. ఏడాది కాలంలో ఏకంగా 50 మోటారు సైకిళ్ళు చోరీ చేస్తూ చివరికి ఏలూరు త్రీటౌన్ పోలీసులకు చిక్కారు. వీరితో పాటు మరో 14 మంది రిసీవర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, కేసులు వివరాలు వెల్లడించారు. ఏలూరు తూర్పువీధి గౌరమ్మగుడి ప్రాంతానికి చెందిన మహ్మద్ షాకీర్ ప్రస్తుతం ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామంలో నివాసం ఉంటున్నాడు. షాకీర్ మోటారు మెకానిక్‌గా పని చేస్తూ ఉంటాడు. ఏలూరు సుంకరవారితోట, కనకదుర్గమ్మ గుడి ఎదురుగా నివాసం ఉంటోన్న గోపిశెట్టి సురేష్ నగరంలో గోద్రెజ్ కంపెనీ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈజీ మనీకి అలవాటుపడ్డారు. మెకానిక్ షాకీర్, సురేష్ ఇద్దరూ ఆయా ప్రాంతాల్లో మోటారు సైకిళ్ళు పార్కింగ్ చేసి ఉండటాన్ని ముందుగా గమనించి స్కెచ్ వేస్తారు. షాకీర్ వేరే తాళంతో మోటారు సైకిల్‌ను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సురేష్ ఎవరైనా వస్తున్నారా అనేది గమనిస్తూ ఉంటాడు. అనంతరం ఇద్దరూ మోటారు సైకిళ్ళను ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటారు. వీరిద్దరూ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఏడాదిలో సుమారుగా 50 మోటారు సైకిళ్ళు చోరీ చేయగా, వీటి విలువ సుమారు రూ.25లక్షలు ఉంటుందని పోలీస్ అధికారుల అంచనా. కేసును ఛేదించింది ఇలా గత ఏడాది డిసెంబర్ 1న ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుగ్గిరాల గ్రామం జోసెఫ్నగర్లోని ఒక ఇంటి గ్రిల్, తాళాలు పగులగొట్టి లోపల ఉన్న హీరో ప్యాషన్ ప్రో మోటారు సైకిల్ చోరీకి గురైంది. ఈ చోరీపై కొరగంటి ప్రభాకర్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై పి.రాంబాబు దర్యాప్తు చేపట్టి చాకచక్యంగా ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టగా నిందితులు ఇద్దరూ ఏకంగా 50కిపైగా మోటారు సైకిళ్ల చోరీ చేసినట్లు గుర్తించారు. వీరిద్దరి నుంచి 50మోటారు సైకిళ్ళను త్రీటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టి.నరసాపురం మండలానికి చెందిన చోరీ సొత్తు రిసీవర్లు 14 మందిని పోలీసులు గుర్తించి వీరిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ ఎస్ఐ రాంబాబు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
మహిళ హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
ఏలూరు (టూటౌన్)/చింతలపూడి: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు 2వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన మహిళా హాత్య కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి శ్రీకాకొల్లు సువర్ణరాజు(39) శిక్ష విధించారు. చింతలపూడి మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన శ్రీకాకొల్లు సువర్ణరాజుకు ఆ ప్రాంతానికి చెందిన కంచర్ల సునీత అలియాస్ ప్రాంతానికి చెందిన కంచర్ల సునీత అలియాస్ గంగ(35)తో వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమె ఇతర వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతుందనే అసూయతో ముద్దాయి హాత్యకు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో 2023 జనవరి 20న చింతలపూడి మండలం బాలవారిగూడెం అడవికి ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఆమైపె దాడి చేసి చీరతో ఉరి బిగించి అత్యంత కిరాతకంగా హత్యా చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు శవాన్ని కొండ దిగువన రాళ్లపై పడేశాడు. ఈ ఘటపై అప్పట్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిపై నేరాలు నిరూపణ అవ్వడంతో న్యాయమూర్తి సెక్షన్ 302 ఐపీసీ కింద జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధించారు.సెక్షన్ 201ఐపీసీ కింద మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అయితే సాక్ష్యాధారాలతో దర్యాప్తు పూర్తి చేసి దోషికి శిక్ష పడేలా కృషి చేసిన ఎస్బీ ఈఐ మల్లేశ్వరరావు, సీఐ క్రాంతికుమార్, సీఎంసీ ఇన్స్పెక్టర్ ఎం.సుబ్బారావు, ఎస్సై సతీష్‌కుమార్ కానిస్టేబుల్స్‌ను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. -
రొయ్యలు అధరహో
● గత నెల రోజుల్లో భారీగా పెరిగిన ధరలు ● మార్కెట్లో 50 కౌంట్ రూ. 360 వర్షాకాలం, శీతాకాలంలో వైరస్లు వచ్చి రొయ్యల చచ్చిపోతాయి. ఆ సమయంలో అమాంతం రొయ్య ధరలు పెంచేస్తారు. ధరలు పెరిగాయని అప్పులు చేసి రొయ్యల పెంపకం చేస్తే వైరస్‌లకు పిల్ల సైజులోనే రొయ్యలు చచ్చిపోయి నష్టపోతాం. ఫ్రిబ్రవరి నుంచి రొయ్యల ధరలు తగ్గిపోతాయి. ఒక్కోసారి మే, జూన్ నెలల్లో ఐస్ లేదని రొయ్యలను వ్యాపారస్తులు కొనుగోలు చేయరు. చంద్రబాబు సర్కారు ఫీడ్ ధరలు తగ్గించి, నాణ్యమైన సీడ్ అందించడంతోపాటు విద్యుత్ సబ్సిడీ ఇచ్చి రొయ్య రైతులను ఆదుకోవాలి. – పెనుమాల నరసింహస్వామి, రొయ్య రైతు, గొల్లవానితిప్ప భీమవరం అర్బన్: ఆక్వా రాజధానిగా ఉన్న భీమవరం ప్రాంతంలో తక్కువ సమయంలో వనామీ రొయ్య పెంపకం సిరులు కురిపించడంతో రొయ్యసాగుకు రైతులు మొగ్గు చూపుతుతున్నారు. అయితే శీతాకాలంలో రొయ్యలకు సోకే వైట్ స్పాట్, విబ్రియో, వైట్గడ్ లాంటి వ్యాధులు రైతులను నష్టాల బాట పట్టిస్తున్నాయి. దీంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు ఎక్కువ లేకపోవడంతో రొయ్యల ధరలకు రెక్కలొస్తున్నాయి. భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు, దొంగపిండి, లోసరి, వెంప, పెదగరువు, ఎల్‌వీఎన్‌పురం, కొమరాడ, అనాకోడేరు, తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప తదితర గ్రామాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో వనామీ పెంపకం సాగిస్తున్నారు. వీటిపై రొయ్య రైతులు, రొయ్య వ్యాపారస్తులు వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. గత వర్షాకాలం నుంచి రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో వైరస్ బారిన పడి రొయ్యలు మృత్యువాత పడటం, మోంథా తుపాను ధాటికి కొన్ని చోట్ల రొయ్యల చెరువు గట్లు గండ్లు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టుబడికి వచ్చిన రొయ్యలు తక్కువ శాతం ఉండటంతో రొయ్యల ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. సిండికేట్‌తో తక్కువ ధరలు వర్షాకాలం, శీతాకాలంలో వనామీ రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం కావడంతో వాటికి వైరస్, విబ్రియో, ఈహెచ్‌పీ, వైట్‌గట్ తదితర వ్యాధులు సోకి మృత్యువాత పడతాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రొయ్యల పెంపకానికి వాతావరణం అనుకూలం కావడంతో ఎక్కువ మంది రైతులు రొయ్యలను పెంపకం సాగిస్తుంటారు. ఆ సమయంలో రొయ్యలను వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. పెరిగిపోయిన ఫీడ్, సీడ్ ధరలు చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టినాటి నుంచి ఫీడ్ ధరలు తగ్గించకపోవడం, నాణ్యమైన సీడ్ అందివ్వకపోవడం, నామమాత్రంగా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందివ్వడం, మరోపక్క లేబర్ చార్జీలు, రొయ్యలకు వాడే మెడిసిన్ ధరలు పెరగడంతో ప్రతిసారి రొయ్యల పెంపకంలో నష్టాలు రావడంతో రైతులు పెంపకం చేసేందుకు అనాశక్తి చూపుతున్నారు. రొయ్యల పెంపకంపై మత్స్యశాఖ చిన్నచూపు విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా జిల్లాకు చేర్చే రొయ్యల పెంపకాన్ని మత్స్యశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది రైతులకు రొయ్యల పెంపకంలో మెళుకువలు తెలియదు. దీంతో లక్షలు పెట్టుబడులు పెట్టి తరచూ నష్టాల్ని చూస్తున్నామని చెబుతున్నారు. మత్స్యశాఖాధికారులు రొయ్యల దిగుబడులపై అవగాహన సదస్సులు, పొలం పిలుస్తోంది కార్యక్రమాలు చేయడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పట్టుబడికి వచ్చిన కేజీ 20 కౌంట్ రూ.540, 25 కౌంట్ రూ. 500, 30 కౌంట్ రూ. 460, 40 కౌంట్ రూ. 390, 45 కౌంట్ రూ..370, 50 కౌంట్ రూ. 360, 60 కౌంట్ రూ. 340, 70 కౌంట్ రూ.320, 80 కౌంట్ రూ.290, 90 కౌంట్ రూ.275, 100 కౌంట్ రూ.255 ఉన్నాయి. ఈ రొయ్య ధరలు ప్రాంతాన్ని బట్టి, ఎక్కువ టన్నేజిని బట్టి రూ. 30 నుంచి 50 మారుతాయని రొయ్య వ్యాపారస్తులు చెబుతున్నారు. డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా రంగంపై చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో ఆక్వా రంగం ఏడాదికేడాది కుదేలవుతోంది. రొయ్య ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో వ్యాపారస్తులు చెప్పిన ధరలకు రొయ్యలను అమ్ముకుని నష్టాలపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేక కొందరు రైతులు రొయ్యల పెంపకానికి స్వస్తి పలుకుతున్నారు. -
14 నుంచి సంక్రాంతి సంబరాలు
భోగి మంటల్లో తగులబెట్టండి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఉత్తర్వుల కాపీలను, వికసిత్ భారత్ జీ రాం జి కాపీలను భోగి మంటలలో తగులబెట్టాలని సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. IIలో u● 15న నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు ● 16న చినవెంకన్నకు కనుమ ఉత్సవం ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో ఈనెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వై.భద్రాజి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భోగి పండుగను పురస్కరించుకుని 14న ఆలయ తూర్పు రాజగోపురం వైపున ఉన్న ఖాళీ ప్రదేశంలో కోలాట నృత్యాలు, హరిదాసులు, బుడబుక్కల వేషధారణలతో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతామన్నారు. 15న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. 16న కనుమ పండుగ సందర్భంగా దొరసానిపాడులో శ్రీవారికి కనుమ ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారు ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ దొరసానిపాడుకు బయల్దేరి వెళతారని, అక్కడ కనుమ మండపంలో అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారని తెలిపారు. -
మట్టి మాఫియా కోరల్లో గుట్టలు
● పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు ! ● నిమ్మకు నీరెత్తిన ట్టు వ్యవహరిస్తున్న అధికారులు ● ఆవాసాలు కోల్పోతున్న వన్యప్రాణులు చింతలపూడి: ఒకప్పుడు పచ్చని చెట్లతో, గుట్టలతో కళకళలాడిన ప్రాంతాలు నేడు కనుమరుగవుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన సంపదను మట్టి మాఫియా యథేచ్ఛగా దోచుకుంటోంది. గ్రామాల సమీపంలోని కొండలు, గట్లు కనుమరుగవుతుంటే, పర్యవేక్షించా ల్సిన అధికార యంత్రాంగం మాత్రం గాడ నిద్రలో మునిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టు గ్రామాలకు ఆనుకుని ఉండే కొండలు, గట్లు కేవలం రాళ్ల కుప్పలు మాత్రమే కావు. అవి ఔషధ మొక్కలకు, అనేక వన్యప్రాణులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు సురక్షితమైన ఆవాసాలు. జింకలు, దుప్పులు, కోతులు, కొండ ముచ్చులు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలు, అడవి పందులు వంటి జీవులకు ఇవి నిలయాలు. నేడు జేసీబీల సవ్వడితో ఆ మూగజీవాలు భయంతో గ్రామాలపైకి వస్తున్నాయి. ఫలితంగా మనుషులపై దాడులు పెరగడమే కాకుండా, వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న సంఘటనలు ఉన్నాయి. కాసుల కక్కుర్తి : నిర్మాణ రంగంలో మట్టికి, గ్రావెల్‌కు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు ఉన్నవి కొద్దిపాటికే అయినా, వందల అడుగుల లోతుకు తవ్వేస్తూ కొండల రూపురేఖలను మార్చేస్తున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలు (వాగులు, వంకలు) పూడిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వాపోతున్నారు. నిద్రావస్థలో అధికార యంత్రాంగం ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నిఘా లోపించడంతో మాఫియాకు అడ్డులేకుండా పోయింది. రాజకీయ అండదండలతోనే ఈ దోపిడీ సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంలో పర్యావరణ సమతుల్యత కొండలు కనుమరుగైతే వర్షపు నీరు నిల్వ ఉండక భూగర్భ జలాలు తగ్గిపోతాయి. వన్యప్రాణులు సహజ సిద్ధమైన ఆవాసాలు కోల్పోయి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. నిరంతర తవ్వకాలు, వాహనాల రద్దీతో గ్రామాలపై దుమ్ము పడి ప్రజలు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ తవ్వకాలను అరికట్టి, మన పూర్వీకులు అందించిన ప్రకృతి సంపదను, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మా చిన్నప్పుడు ఈ కొండల మీద ఎన్నో చెట్లు, జంతువులు ఉండేవి. ఇప్పుడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. కొండలను తవ్వేస్తుండటంతో నెమళ్లు, అడవి పందులు, కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. రాత్రికి రాత్రే గుట్టలను పిండి చేసి తరలిస్తున్నారు. – మాగసాని గురుబ్రహ్మం, వైఎస్సార్సీపీ బీసీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వన సంరక్షణ కోసం భూములను కేటాయిస్తోంది. మొక్కలు నాటి అడవులను పెంచాలని చూస్తుంటే, మట్టి మాఫియా మాత్రం ఆ భూములపై కన్నేసింది. చెట్లను వేళ్లతో సహా పెకిలించి, అడుగున ఉన్న మట్టిని, గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. వన సంరక్షణ భూముల్లో నుంచి మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. – తొర్లపాటి బాబు, సీపీఐ మండల కార్యదర్శి, చింతలపూడి -
గ్రామస్థాయి కమిటీలతో పార్టీ బలోపేతం
వేలేరుపాడు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గ్రామస్థాయిలో కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టినట్టు ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర అన్నారు. వేలేరుపాడులో మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన పార్టీ నిర్మాణ సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ , అనుబంధ విభాగాల కమిటీలను నియమించా లని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దమ్ము చంద్రబాబుకు లేదని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి సూపర్‌సిక్స్‌ను అమలు చేయ డం లేదన్నారు. పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునిల్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల వల్లే తాము ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నామని అన్నారు. పోలవరం ఇన్చార్జి తెల్లం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, బూత్ కమిటీ జోన్ ఇన్చార్జ్ బీవీఆర్ చౌదరి, నియోజకవర్గ రైతు వి భాగం అధ్యక్షుడు కామినేని వెంకటేశ్వరరావు, జె డ్పీటీసీ గుజ్జా రామలక్ష్మి, ఎంపీపీ వల్లా లక్ష్మీదేవి, గుద్దేటి భాస్కర్, సర్పంచ్‌లు ఉదయ్‌కిరణ్, లక్ష్మ ణ్, వైస్ ఎంపీపీలు కేస గాని వెంకటేశ్వరమ్మ, మే డవరపు నాగశ్రీ, ఎంపీటీసీ కొమ్మరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కూటమిలో బయటపడిన విభేదాలు
కొయ్యలగూడెం: పోలవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం అట్టహాసంగా నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలకు నియోజకవర్గంలోని ఏడు మండలాల కూటమి పార్టీల ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులతో పాటు దాని మిత్రపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు కూడా ముఖం చాటేశారు. మరోపక్క ఈ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. వీరితో పాటు సీఏల ద్వారా జన సమీకరణకు అధికారులు సహకరించారు. కొయ్యలగూడెంలోని ఏఎంసీ యార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి వేడుకల ఆటవిడుపు కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే ప్రారంభించి బహుమతులు అందజేశారు. -
అద్దె బస్సులు ఆపేస్తాం
సాక్షి, భీమవరం: ఆర్టీసీ అద్దె (హైర్) బస్సుల యజ మానులు పోరుబాట పట్టారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో నెలవారీ మెయింటెనెన్స్ రూ.40 వేల వరకు పెరిగితే.. ఏపీఎస్ఆర్టీసీ కేవలం రూ. 5,200లు మాత్రమే పెంచడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీసీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర అద్దె బస్సుల యజమానుల సంఘం పిలుపు మేరకు ఈనెల 12 నుంచి బస్సులు నిలిపివేసి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో.. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో వెన్నెల, స్టార్‌లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు తదితర బస్సులు 295 ఉన్నాయి. ఇవి మొత్తం రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితమంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు మాత్రమే ఫ్రీ సర్వీసును పరిమితం చేసింది. 40 శాతం హైర్ బస్సులే.. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు మొత్తం 197 ఉండగా వీటిలో 73 హైర్ బస్సులు. ఫ్రీ బస్సుతో ఆయా సర్వీసుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. బస్సు సిట్టింగ్ కెపాసిటీ 56 కాగా ప్రస్తుతం వంద మందికి పైనే ప్రయాణిస్తున్నట్టు ఓనర్లు చెబుతున్నారు. లీటరుకు 5.6 కి.మీ చొప్పున బస్సు తిరిగే రూటు, వేసే ట్రిప్పులు (టార్గెట్) మేరకు హైర్ బస్సులకు ఆర్టీసీ డీజిల్ పోయిస్తుంది. మైలేజ్ షార్టేజ్‌తో అదనంగా డీజిల్ వినియోగమైతే ఆ భారాన్ని యజమానులే భరించాలి. మెయింటినెన్స్ కింద కిలోమీటరుకు రూ.12 నుంచి రూ.13ల చొప్పున ఇస్తుంది. ఏలూరు జి ల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డి పోల పరిధిలో 303 బస్సులు ఉండగా ఫ్రీ సర్వీసు అందిస్తున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 177 ఉన్నాయి. రూ.40 వేల వరకు భారం ప్రయాణికుల రద్దీతో టైర్లు అరుగుదల పెరిగిందని, తరచూ టైర్లు పేలిపోవడం, సీట్లు దెబ్బతినడం, కట్టలు విరిగిపోవడం, ఇంజి సంబంధిత సమస్యలతో మెయింటెనెన్స్ పెరిగిపోయిందని ఓనర్లు అంటున్నారు. రోజుకు 10 లీటర్ల వరకు ఆయిల్ షార్టేజీ వస్తుండటంతో ఆ భారం తమపై పడుతోందని చెబుతున్నారు. మెయింటెనెన్స్, ఆయిల్ షార్టేజీ రూ పాల్లో ఒక్కో బస్సుపై నెలకు రూ.40 వేల వరకు అ దనపు భారంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్లో ఫ్రీ బస్సు ప్రస్తావన లే దని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మైలేజీ లీటరుకు 5.6 కి.మీ నుంచి 4.6 కి.మీ తగ్గించాలని, మెయింటినెన్స్ కి.మీ రూ.13 నుంచి రూ.18కు పెంచాలని, అనుమతి మేరకు ప్రయాణికులను అనుమతించేందుకు ఆదేశాలివ్వాలని, రద్దీకి అనుగుణంగా బస్సు ల సంఖ్యను పెంచాలని కొద్దినెలలుగా అద్దె బస్సు ల యజమానులు ఆర్టీసీని కోరుతున్నారు. 12 నుంచి సమ్మెలోకి.. ఆయిల్, మెయింటెనెన్స్ కింద ఒక్కో బస్సుకు నెలకు కేవలం రూ.5,200లు పెంచుతూ ఆర్టీసీ బుధవారం సర్క్యులర్ జారీచేయడాన్ని అద్దె బస్సు ల ఓనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నష్టాల కోర్చి తాము బస్సులు నడపలేమని, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈనెల 12 నుంచి బస్సులు నిలిపివేసి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. ఎంఎస్ఎంఈలో లోన్‌పై బస్సు తీసుకుని ఆర్టీసీలో హైర్‌కు న డుపుతున్నాను. ఫ్రీ బస్సు రద్దీతో నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు భా రం పడుతుంటే కేవలం రూ. 5,200 మాత్రమే ఆర్టీసీ పెంచింది. డిమాండ్లు పరిష్కరించకుంటే 12 నుంచి బస్సులు ఆపేస్తాం. – రాపాక మహేష్, హైర్ బస్ యజమాని, సిద్దాంతం బస్సులో 56 మందికు గాను వంద మందికి పైనే ప్రయాణిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో తరచూ మరమ్మతులతో మెయింటినెస్స్ పెరిగిపోయింది. నెలనెలా అదనపు భారంతో అద్దె బస్సుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమ్మె చేస్తాం. – ఎ.ప్రియాంక, హైర్ బస్సు యజమాని, తణుకు ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పోరుబాటలో హైర్ బస్సుల యజమానులు ఫ్రీబస్సు ఓవర్ లోడ్‌తో భారీగా పెరిగిన మెయింటెనెన్స్ ఒక్కో బస్సుపై నెలకు రూ.40 వేల వరకు అదనపు భారం ఆర్టీసీ కేవలం రూ.5,200 పెంపుపై అసంతృప్తి 12 నుంచి బస్సుల నిలిపివేతకు రాష్ట్ర హైర్ బస్ ఓనర్స్ సంఘం పిలుపు -
వైఎస్సార్సీపీలోకి చేరికలు
కుక్కునూరు: మండలంలోని చిరవెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబా లు వైఎస్సార్సీపీలో చేరాయి. కుక్కునూరులో గురువారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు (డీఎన్నార్) వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వరక రవికుమార్, యర్నం ప్రవీణ్, సారంగి రాంబాబు, సున్నం సురేష్, సున్నం ప్రవీణ్, సరి యం శివ తదితరులు ఉన్నారు. ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): వాహనాల తాత్కాలిక నమోదు (టీఆర్)కు అధిక చార్జీలు వసూలు చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఉప ర వాణా కమిషనర్ కేఎస్‌ఎంవీ కృష్ణారావు హె చ్చరించారు. ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో గురువారం టీఆర్ చార్జీలపై డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాల తాత్కాలిక నమోదు సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన చా ర్జీలను మాత్రమే వినియోగదారుల నుంచి వ సూలు చేయాలని, అదనపు లేదా అనధికార వ సూళ్లకు తావివ్వొద్దన్నారు. అలాగే ప్రతి షోరూమ్‌లో రుసుముల వివరాలు తెలిపేలా బోర్డులు ప్రదర్శించాలన్నారు. ఆర్టీఓ (ఇన్చార్జి) ఎస్ బీ శేఖర్, ఎంవీఐలు బి.భీమారావు, జి.ప్రసాదరావు, పి.రమేష్‌బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.రాము, ఎం.ఆనందకుమార్, 18 మంది వాహన డీలర్లు పాల్గొన్నారు. వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కుక్కునూరు, వేలేరుపాడు మండల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో నిర్మాణ (స్ట్రక్చర్) విలువలకు సంబంధించి సర్టిఫికెట్లు సమర్పించని వారు ఈనెల 10లోపు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకరణ అధికారి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, కుడి ప్రధాన కాలువ, యూనిట్–2, ఏలూరు ఎదుట హాజరుకావాలని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆర్ఎంసీ యూనిట్–2 ఇన్చార్జి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.ముక్కంటి ప్రకటనలో తెలిపారు. నిర్మాణ విలువలకు భూసేకరణ చేశామని, నష్టపరిహారాన్ని భూ యజమానులకు చెల్లిస్తామన్నారు. అయితే ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వని వారు (ఆధార్ కార్డు, ఇంటి పన్ను, బ్యాంక్ అకౌంటు మొదటి పేజీ, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, నోటరీ అఫిడవిట్, స్ట్రక్చర్ ఆధారాలు మొదలైనవి) హాజరుకావాలన్నారు. వేలేరుపాడు మండలంలో 145, కుక్కునూరు మండలంలో 46 మంది మొత్తంగా 191 మంది అవార్డుదారులు వారి వివరాలు సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. పెనుగొండ: కోడేరు ఇసుక ర్యాంపులో అనధికారంగా చేస్తున్న బాట పనులు తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్సీపీ నాయకులు గురువారం ఆచంట తహసీల్దార్ సోమేశ్వరరావుకు, ఆచంట పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రాలు ఇచ్చారు. అ నంతరం వారు మాట్లాడుతూ కోడేరు ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలించడానికి ఇప్ప టికీ బాట పనులు చేస్తున్నారని, అయినా అధి కారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నా రు. అధికార పార్టీ నాయకులకు అండగా అధికారులు ఉంటున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపుపై త్వరలో హైకోర్టులో కేసు వేయనున్నామన్నారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సీనియర్ నా యకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కేతా తాతరావు, టౌన్ అధ్యక్షుడు పెచ్చెట్టి సత్యనారాయణ, బీసీ నాయకులు తదితరులు ఉన్నారు. -
కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్‌కు కోకో రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, పానుగంటి అచ్యుతరామయ్య, గుది బండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు. కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి వేసి రైతులను మోసగిస్తున్నాయని చెప్పారు. విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కోకో గింజలకు రూ.550లకు పైగా ధర ఉండగా కంపెనీలు రూ.350లకు కొనుగోలు ప్రారంభించి గత రెండు రోజుల నుంచి రూ.400 లకు రైతుల ఆందోళనతో పెంచారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర రైతులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేశంలోనే ఏలూరు జిల్లాలో అత్యధిక కోకో పంట విస్తీర్ణం ఉన్నదని, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని, రాష్ట్రంలో కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఫలితంగా కోకో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. దీనిపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కోకో గింజల ధర ఫార్ములా కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కోకో రైతులు పాల్గొన్నారు. ఏలూరు ఎంపీకి కోకో రైతుల వినతి -
రేషన్ బియ్యం పట్టివేత
పాలకొల్లు (సెంట్రల్) : పాలకొల్లు పట్టణం, చెంబునిపేటలో గురువారం విజిలెన్స్, రెవెన్యూ, పౌర సరఫరా అధికారులతో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యాన్‌ను సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. యజమాని కనమర్లపూడి శేషగిరిరావు, డ్రైవర్ పీతాని మోహనకృష్ణలపై నిత్యవసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. నూజివీడు: జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు పట్టణంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థి పీ రేవంత్ ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జోజిబాబు తెలిపారు. జార్ఘండ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ జట్టుకు రేవంత్ నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ను ప్రిన్సిపాల్ అభినందించి గురువారం క్రీడా కిట్‌ను అందజేశారు. రేవంత్‌ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ శుక్రవారం ఏలూరు రానున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై.విశ్వమోహాన్రెడ్డి గురువారం ప్రకటనలో తెలియజేశారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి మీటింగ్ హాల్లో జిల్లాలోని ఎస్సీ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారన్నారు. ముందుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏలూరు, రెవెన్యు గెస్ట్‌హౌస్ నందు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలియజేశారు. కుక్కునూరు: తల్లిదండ్రులపై కుమార్తె దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడడంతో కేసు నమోదు చేసినట్లు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి పేర్కొన్నారు. వింజరం గ్రామానికి చెందిన కరేటి చిట్టెమ్మ, కృష్ణయ్య దంపతులు, వారి వ్యవసాయ భూములకు వచ్చిన పోలవరం ముంపు పరిహార డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల నుంచి మోసపూరితంగా కుమార్తె చిమడబోయిన మంగమ్మ, ఆమె కుటుంబసభ్యుల ఖాతాలకు బదిలీ చేసుకుంది. అలాగే వారి గొర్రెలు, మేకలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో ప్రశ్నించిన వృద్ధ దంపతులను అసభ్య పదజాలంతో దూషించి, శారీరకంగా దాడి చేసి, చంపుతామని బెదిరింపులకు గురిచేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. చోరీ కేసు నమోదు పోలవరం రూరల్: తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామానికి చెందిన రాపాక శ్రీను కుటుంబసభ్యులతో కలిసి బుధవారం రాత్రి శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో ఉన్న 10 కాసుల బంగారం, 10 తులాల వెండి వస్తువులను దొంగిలించినట్లు గుర్తించారు. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి గుర్తిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెదపాడు: మానవత సేవాసంస్థ రాష్ట్ర చైర్మన్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోయిన కోటేశ్వరరావు తన భార్య సూర్య నాగమణి భౌతికకాయాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. నాగమణి అనారోగ్యంతో బుధవారం మరణించారు. తన మరణంలో కూడా సేవ ఉండాలనే ఆశయంతో తమ మరణాంతరం తమ శరీరాలను మెడికల్ కళాశాలలకు అప్పగించేందుకు ముందస్తుగా అనుమతి పత్రాన్ని అందించారు. దీంతో సూర్యనాగమణి భౌతికకాయాన్ని కోటేశ్వరరావు మెడికల్ కళాశాలకు అప్పగించారు. వివిధ జిల్లాలకు చెందిన మానవత ప్రతినిధులు సూర్య నాగమణి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
పాలకోడేరు: పలుచోట్ల చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగను పాలకోడేరు పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుడి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పాలకోడేరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పి.రఘువీర్ విష్ణు గురువారం వివరాలు వెల్లడించారు. గత నెల 29వ తేదీన విస్సాకోడేరు కు చెందిన కలిదిండి లావణ్య, భర్త శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి భీమవరం ఆసుపత్రికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మచిలీపట్నం రూరల్, మోకావారి పాలెం, నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన నిందితుడు ఆరేపల్లి దుర్గారావును ఈనెల 7వ తేదీ సాయంత్రం గొల్లలకోడేరు సెంటర్లో పాలకోడేరు ఎస్సై రవివర్మ అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ఏలూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 145 దొంగతనాల కేసులున్నాయని, 30 సార్లు జైలుకు కూడా వెళ్లనట్లు డీఎప్పీ చెప్పారు. చోరీ కేసుల్లో పాలకోడేరు పోలీస్ స్టేషన్‌కు సంబంధించి రూ.2.35 లక్షలు, పెనమలూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించి రూ.4.25 లక్షలు, కై కలూరు పోలీస్ స్టేషన్‌కు సంబంధించి రూ.18 వేలు, శ్రీ కాళహస్తి పోలీస్ స్టేషన్ కు సంబంధించి రూ.40 వేలు విలువైన బంగారం, వెండి ఆభరణాలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎప్పీ చెప్పారు. -
గురువులపై కర్ర పెత్తనం
నిడమర్రు: చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 8 పిరియడ్స్ బోధించేలా ప్రతీ సబ్జెక్ట్‌కు ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి జులై నెలలో టీచర్ హ్యాండ్ బుక్స్ అందించారు. దీని ప్రకారం ఉపాధ్యాయుల బోధన జరుగుతోంది. ఇటీవల 8 పిరియడ్స్ బోధనను 4 పిరియడ్స్‌కు కుదించి ఉదయం 4 పిరియడ్స్‌లో 8 పిరియడ్స్‌కు సంబంధించిన బోధన పూర్తిచెయ్యాలని, మధ్యాహ్నాం 4 పిరియడ్స్ ఎఫ్ఎల్ఎన్ తరగతులు నిర్వహించాలని 75 రోజుల ఎఫ్ఎల్ఎన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వమే 8 పిరియడ్స్ ఎలా బోధించాలో టీచర్ హ్యాండ్ బుక్స్ ఇచ్చి, ఇప్పుడు వాటిని 4 పిరియడ్స్‌లో బోధించాలనే నిర్ణయంపై ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సబ్జెక్ట్‌కు అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాయించేలా అందించిన మూల్యాంకన పుస్తకాలతో తలలు పట్టుకుంటున్నారు. 10వ తరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత చెందేలా ఎస్ఎస్ఎసీ పరీక్షల వరకూ 100 రోజుల ప్రణాళిక రూపొందించింది. ప్రతి రోజు ఆరోజు బోధించిన సబ్జెక్ట్‌పై సాయంత్రం వేళల్లో పరీక్షలు పెట్టి రోజువారీ విద్యార్థుల మార్కులు ఆన్లైన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలవుతోంది. ఈ 100 రోజుల ప్రణాళిక అమలుపై విద్యాశాఖ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకూ పర్యవేక్షణ కొనసాగుతోంది. తాజాగా ఈ పర్యవేక్షణ, పరిశీలన బాధ్యతలను మండలంలోని ఇతర శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో విద్యాశాఖపై పరాయి శాఖల పెత్తనం చేసేలా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పర్యవేక్షణకు 256 మంది అధికారుల నియామకం పదో తరగతి 100 రోజుల ప్రణాళిక అమలుపై ఏలూరు జిల్లాలోని 256 ఉన్నత పాఠశాలలకు ఆయా మండలాల, పట్టణాల్లోని వ్యవసాయశాఖ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ శాఖ, వెలుగు, ఇరిగేషన్, ఉద్యానవనశాఖ, సీ్త్రశిశు సంక్షేమశాఖ, పశువర్ధకశాఖ, వైద్యశాఖ, గృహనిర్మాణశాఖ, మత్య్సశాఖ, పోలీస్‌శాఖ, టౌన్‌ప్లానింగ్ వంటి శాఖలకు చెందిన గెజిటెడ్ అధికారులను ప్రత్యేక తరగతుల నిర్వహణా పర్యవేక్షణకు నియమించారు. ఈ మేరకు జిల్లా ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు గత నెలలో జారీ అయ్యాయి. గణపవరం జెడ్పీస్కూల్లో విద్యార్థుల ప్రగతి పరిశీలిస్తున్న డీవైఈవో రామాంజనేయులు (ఫైల్)చానమిల్లి జెడ్పీస్కూల్లో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంపీడీవో (ఫైల్)ఇప్పటికే విద్యాశాఖలోని అన్ని స్థాయిల్లో అధికారులు ప్రతి రోజు టెన్త్ విద్యార్థులకు అమలవుతున్న 100 రోజుల ప్రణాళికల అమలుపై తనిఖీలు చేస్తూ ఉన్నత అధికారులకు నివేదికలు ఇస్తున్నారు. అయినా ఇతర శాఖలను ఉపాధ్యాయులపై పెత్తనం చేసేలా, వారి పనితీరును, బోధనను పర్యవేక్షించేలా తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. డీఈఓ, డీప్యూటీ డీఈఓ, ప్రతి మండలానికి ఇద్దరేసి చొప్పున మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి ఉన్నత పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులను కాదని.. ఇతర శాఖల అధికారులను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించడాన్ని ఆక్షేపిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో ఏమైనా తేడాలొస్తే ఈ మానిటరింగ్ ఆఫీసర్లు బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణతకు 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారుల నియామకం ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల ఆగ్రహం ప్రత్యేక తరగతులు నిర్వహించే విషయంలో ప్రభుత్వం, ఇతర శాఖల వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. విద్యాశాఖలో ఎంతో అనుభవం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారిని కాదని ఇతర ఽశాఖలకు పెత్తనం వల్ల విద్యార్థులకు ఒరిగేది ఏమి ఉండదు. ఒత్తిడి వల్ల ఆశించిన ఫలితాలు రావు. – పుప్పాల సూర్యప్రకాశరావు, స్టేట్ కౌన్సిలర్, ఎస్టీయూవిద్యాశాఖ అమలు చేస్తున్న ప్రణాళిక అమలు తీరుపై విద్యాశాఖ అధికారులు ఉండగా ఇతర శాఖలను పర్యవేక్షణ అధికారులుగా నియమించడం ఉపాధ్యాయుల అస్థిత్వం దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నాం. ఇలాంటి పర్యవేక్షణలను ఏమాత్రం సహించేది లేదు. ఇది మంచి పరిణామం కాదు. – గెడ్డం సుధీర్, రాష్ట్ర నాయకులు, వైఎస్సార్‌టీఏ ఇప్పటికే సెలవు దినాలు, ఆదివారాలు సైతం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ రోజువారీ పరీక్షల ఫలితాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఉపాధ్యాయుల బోధనా పనితీరును పర్యవేక్షించేందుకు ఇతర శాఖల అధికారులను నియమించడం ఉపాధ్యాయులను అవమానించడమే. – బోర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎమ్మెల్సీ -
చినవెంకన్న హుండీ ఆదాయం రూ.2.09 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. గడచిన 16 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,09,40,260 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 79 గ్రాముల బంగారం, 3.552 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రద్దయిన పాత నోట్లు ద్వారా రూ.5,500 లభించినట్టు చెప్పారు. లెక్కింపులో జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా దళం సభ్యులు పాల్గొన్నారు. -
ప్రాణాలైనా అర్పిస్తాం
శురకవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026భూసేకరణ కోసం ప్రభుత్వం కనీసం ఎలాంటి గ్రామ సభలు నిర్వహించలేదు. రైతుల అభిప్రా యాలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూసేకరణ అప్రజాస్వామికం. ఒక ప్రజాప్రతినిధిగా ఈ చర్యను వ్యతిరేకిస్తున్నా. – అబ్బు సుబ్రహ్మణేశ్వరరావు, సర్పంచ్, మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం మండలం భూములను కోల్పోయే వారిలో అంతా చిన్న, సన్నకారు రైతులే. వీరికి వ్యవసాయమే జీవనాధారం. భూములను కోల్పోతే వీరంతా రోడ్డున పడతారు. ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవాలి. – టి.శ్రీనివాస్, ఎంపీటీసీ, మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం మండలం నాకు ఎకరా భూమి వారసత్వంగా రాగా దీనిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నా. ఇప్పుడు ఆ భూమిని తీసుకుని కొంత పరిహారం ఇస్తే సరిపోతుందా. జీవనాధారాన్ని కోల్పోతాం. – ఏకుల శ్రీను, రైతు, బోడిగూడెం ఒకరిద్దరు అవినీతిపరుల వల్ల భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారంటూ అధికారు లు ప్రకటిస్తున్నారు. మాకు నా లుగెకరాలు ఉండగా నాలుగు కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాం. – జక్కు చల్లారావు, రైతు, బోడిగూడెం ఏలూరు (టూటౌన్): ‘మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ మా భూములను మాత్రం నేవీ ఆయుధ క ర్మాగారానికి ఇచ్చేది లేదు’ అంటూ బాధిత రైతులు తెగేసి చెబుతున్నారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కెట్ నగరం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు నిరసన బాట పట్టారు. బోడిగూడెం పంచాయతీ పరిధి బర్కెట్ నగరం ప్రాంతంలో 1,200 ఎకరాల్లో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ కర్మాగారం ఏర్పా టుతో చిన్న, సన్నకారు రైతులు జీవనోపాధి కో ల్పోయి రోడ్డుపాలవుతామని ఆవేదన చెందుతు న్నారు. కనీసం తమ అనుమతి తీసుకోకుండా, గ్రా మసభలు నిర్వహించకుండా భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా ఇటీవల ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారుల నిర్లక్ష్యం : కర్మాగారం ఏర్పాటు విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం గ్రామసభలు పెట్టి ప్రాజెక్టు పరిధిలోని రైతులతో మాట్లాడలేదని ఆరోపిస్తున్నారు. స్థానిక రైతు ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భూములను సేకరించాలని చూస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా చిన్న, సన్నకారు రైతులే.. ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల్లో అందరూ చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఎకరా, రెండెకరాలు ఉన్న వారే అధికం. ఈ ప్రాంతంలో భూసేకరణ చేస్తే సుమారు 500 మందికి పైగా రైతులు నిర్వాసితులు కానున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారం వల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. బలవంతంగా భూసేకరణ చేస్తే తామంతా చెల్లాచెదురవుతామని, తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. కుక్కునూరులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్. చిత్రంలో పార్లమెంట్ ఇన్చార్జి సునీల్, నియోజకవర్గ ఇన్చార్జి బాలరాజు, పరిశీలకుడు రవీంద్ర జాగిలంతో తనిఖీలు చేయిస్తున్న దృశ్యంజిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆయుధ డిపోపై సమరభేరి నేవీ ఆయుధ కర్మాగార బాధిత రైతుల్లో ఆందోళన కర్మాగారానికి భూములిచ్చేది లేదంటూ తేల్చిచెప్పిన వైనం గ్రామ సభలు నిర్వహించకపోవడంపై మండిపాటు జీవనాధారం కోల్పోతామంటున్న కర్షకులు బోడిగూడెం పరిసర గ్రామాల రైతుల నిరసన బాట తమ ప్రాంతంలో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పాటుచేస్తున్నట్టు గతనెలలో పత్రికల్లోనే చూశామని, అప్పటివరకూ ఈ విషయం తమకు తెలియదని బాధితులు అంటున్నారు. అయితే తమ వాదనలకు భిన్నంగా రెవెన్యూ అధికారులు మాత్రం స్థానిక రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధం ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపడం విడ్డూరంగా ఉందంటున్నారు. తమ ప్రాంతంలోని ఒకరిద్దరు అవినీతిపరుల చర్యలను సాకుగా చూపి వందలాది మంది రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలనుకోవడం దుర్మార్గమని మండిపడుతున్నారు. భూములను ఇచ్చేందుకు తామెవరికీ ఇష్టం లేదని అలాంటప్పుడు మా భూములను ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. -
బరుల తయారీలో టీడీపీ నేతలు
మండవల్లి : మండవల్లి మండలం ఉనికిలిలో సంక్రాంతి పండుగకు కోడిపందేల నిర్వహణకు టీడీపీ నాయకులు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు గ్రామంలో సంక్రాంతికి పేకాట, కోడి పందేలు పెట్టిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల ప్రాంతంలో టీడీపీ నాయకులు కోడిపందేల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పేకాట కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఏలూరు(మెట్రో): జెడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేసి ఖాతాదారులకు అందుబాటులో ఉంచాలని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు టి.రామారావు, జనరల్ సెక్రటరీ బి.రెడ్డిదొర కోరారు. బుధవారం జెడ్పీ సీఈవోకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేయడం వల్ల ఖాతాదారులకు వారి ఖాతాలలో నిల్వల గురించి తెలియడంతో పాటు, మిస్సింగ్ క్రెడిట్స్‌ను వెంటనే సరి చూసుకునే అవకాశం కలుగుతుందన్నారు. రుణ దరఖాస్తులను సాధ్యమైనంత తొందరగా పరిశీలించి రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : విద్య ఒక్కటే అభివృద్ధికి మార్గమని, ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి మంచి ఫలితాలు సాధించడం ద్వారా కుటుంబ, దేశ అబివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. యువజన అవగాహన వారోత్సవాల్లో భాగంగా కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు కష్టపడి విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడతారని, వారి కలలు సాకారం చేయడానికి తమవంతు కృషిచేయాలని సూచించారు. నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. సెలవుల అనంతరం ఈనెల 19న ట్రిపుల్ ఐటీల్లో తరగతులు పునఃప్రారంభమవుతాయన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థినులు తమ ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి 45 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భీమవరం(ప్రకాశం చౌక్): ఏపీఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా అసోసియేషన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భీమవరంలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా యువీ పాండురంగారావు, కార్యదర్శిగా సుకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా అల్లూరి శ్రీనివాసరాజు, ట్రెజరర్‌గా కృష్ణప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా హరిప్రసాద్‌బాబు, 17 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఉమెన్ వింగ్ చైర్మన్‌గా కె.గౌరి, కన్వీనర్‌గా పి.కిర్తీ, క్యాషియర్‌గా సీహెచ్.ధనలక్ష్మీ, 14 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ఏలూరు జిల్లా అధ్యక్షుడు చొడగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బరి కోసం చెట్ల నరికివేత
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహించేందుకు కూటమి నాయకులు భారీ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే పెనుమంట్ర రజక పేట–జుత్తిగ రోడ్లో రైతుకు చెందిన పచ్చిక బీడులో నేలను చదును చేశారు. పంచాయతీరాజ్ రోడ్డును కూడా పార్కింగ్ కోసం లెవల్ చేశారు. బరి ఏర్పాటుకు ఇరువైపులా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పెంచిన చెట్లను సైతం నరికేశారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారుల అండదండలతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీఎం నాయకుడు కేతా గోపాల్ విమర్శించారు. -
కాయ్ రాజా కాయ్!
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సంక్రాంతి జూద క్రీడకు సర్వం సన్నద్ధమైంది. కోడి పందేల బరుల్లో ప్రత్యేకంగా పేకాట శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ముందుగానే శిబిరాలను ఖరారు చేసి విక్రయించడానికి వీలుగా అడ్వాన్సులు తీసుకుంటున్నారు. చిన్నపాటి బరుల్లో లక్షతో మొదలై భారీ బరుల్లో కోటిన్నర వరకు ధరకు జూదక్రీడలను ముందుగానే విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కోడిపందాల బరుల్లో భారీగా పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వంద కోట్లపైన కోడిపందేలు జరిగే అవకాశం ఉండగా.. దానికి రెట్టింపు స్థాయిలో జూదక్రీడలు ఉండటం విశేషం. ఉమ్మడి పశ్చిమలో కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించేలా అట్టహాసంగా ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఉండి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలోని అత్యధికంగా కోడిపందేల బరులు ఏర్పాటవుతుండగా కై కలూరు, పోలవరం, దెందులూరులో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో చిన్నపాటి బరి నుంచి రూ.30 లక్షల వరకు పందేలు నిర్వహించే స్థాయిలో బరులు ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ కోడి పందేల ముసుగులో కత్తులు కట్టి నిషేధిత కోడిపందాలు యథేచ్ఛగా ఒకవైపు నిర్వహించడానికి వీలుగా ఏర్పాటు చేస్తుంటే మరోవైపు పూర్తిగా నిషేధమైన జూదక్రీడలను భారీగా కొనసాగించేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగానే అమ్మకాలు పేకాటలో కోత ముక్క, లోన బయట, గుండాట శిబిరాలను ప్రతి బరిలో వేర్వేరుగా ఏర్పాటు చేస్తుంటారు. ముందస్తుగానే బరి రద్దీ, స్థాయి ఏర్పాటైన ప్రదేశాన్ని బట్టి ధరలను నిర్ణయిస్తుంటారు. భారీ బరుల్లో మూడు కలిపి రూ.50 నుంచి రూ.70 లక్షల ధరకు విక్రయిస్తుంటారు. వీటిలో నిర్వాహకులకు గుండాటలో అత్యధిక లాభాలు వస్తుంటాయి. భీమవరంలోని గొల్లవానితిప్ప, ఉండిలోని ఉండి, తాడేపల్లిగూడెం, దెందులూరు మండలంలో దుగ్గిరాల, చింతలపూడి, పాలకొల్లు, నర్సాపురం ఇలా ప్రధాన ప్రాంతాల్లో రూ.50 లక్షల నుండి రూ.5 కోట్ల స్థాయి పందేలు నిర్వహించే చోట అత్యధికంగా రూ.70 లక్షల ధరకు పేకాట శిబిరాలు విక్రయిస్తున్నారు. భీమవరం సమీపంలోని ఒక బరిలో గుండాటకు రూ.70 లక్షలు, పేకాటకు రూ.40 లక్షలు, కోతాటకు రూ.30 లక్షలు అడ్వాన్సులు తీసుకున్నట్లు సమాచారం. కోడి పందేల నిర్వాహకులకు జూద క్రీడలే ప్రధాన ఆదాయం. ఉదాహరణకు... కోటి రూపాయలు పందేలు జరిగే బరిలో మూడు రోజుల మీద 30 పందేలు నిర్వహిస్తే రూ.30 కోట్లు కోడి పందేలు జరిగితే అదే శిబిరంలో జూదక్రీడలు రూ.30 నుంచి రూ.40 కోట్ల స్థాయిలో జరుగుతుంటాయి. వాటిని ముందుగానే విక్రయించి సుమారు రూ.కోటి మేర నిర్వాహకులు వసూలు చేస్తారు. ప్రతి కోడి పందెంలో కోటికి రూ.10 లక్షల చొప్పున మెయింటెనెన్స్‌కు వసూలు చేస్తుంటారు. అతిథులకు భోజనాలు, బరి ఏర్పాట్లు, నిర్వహణ ఇలా అన్ని ఖర్చులు తీసి మిగిలింది నిర్వాహకుడి ఖాతాలో వేసుకుంటారు. ప్రస్తుతం జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకులో అత్యధిక ధరకు పేకాట శిబిరాలు అమ్ముడైనట్లు సమాచారం. పందెం బరుల్లో పేకాటకు భారీ డిమాండ్ అత్యధిక బరుల్లో ముందే పేకాట శిబిరాల అమ్మకం బరి స్థాయిని బట్టి ధరల నిర్ణయం చిన్న బరుల్లో రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకం గుండాటలో నిర్వాహకులకు భారీగా మిగులు కోడిపందేలను మించి పేకాట -
అడిగేదెవరు.. ఆపేదెవరు?
ద్వారకాతిరుమల: ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు సంపాదించుకుంటాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు కొందరు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎంతో విలువైన గ్రావెల్ మట్టిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు అంటూ ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ద్వారకాతిరుమల మండలంలోని పలు చెరువులు, పోలవరం కుడి కాలువ గట్టుపై నిత్యం పొక్లెయిన్లతో యథేచ్ఛగా గ్రావెల్ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారులను మామూళ్ల మత్తులో జోకొడుతున్నారు. నిబంధనలకు పాతర వేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమార్కుల మధ్య పంపకాలు తేడా వచ్చినప్పుడు మాత్రమే కథ పోలీస్టేషన్‌కు చేరుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిబంధనలను తుంగలోకి తొక్కి ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. గ్రావెల్ మట్టి మాఫియా చెరువులు, పోలవరం కుడి కాలువ గట్లపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. ముఖ్యంగా గుణ్ణంపల్లి–ఎం.నాగుపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టి తవ్వకాలు గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం పెద్ద పెద్ద అగాథాలను తలపిస్తోంది. అలాగే పలు చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, గోతులు పెడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఆ గోతులు నీటితో నిండి పశువులు, రైతులు అందులో పడి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. పంపకాలు తేడా వచ్చినప్పుడే.. కొందరు పచ్చనేతలు సిండికేట్‌గా ఏర్పడి ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. సాధారణంగా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. అయితే అక్రమార్కుల మధ్య పంపకాలు తేడా వచ్చి, అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకున్నప్పుడు మాత్రమే అధికారులు రంగప్రవేశం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్య జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై ప్రజలు మండిపడుతున్నారు. సేవ చేస్తారని కూటమికి అధికారం కట్టబెడితే.. దోచుకు తింటున్నారని ధ్వజమెత్తుతున్నారు. తూతూమంత్రంగా ఫైన్లు సత్తాల పంచాయతీ సండ్రకుంటకు చెందిన ఓ నాయకుడు గతంలో సత్తాల చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, పెద్దపెద్ద గోతులు పెట్టాడు. రెండు మూడు సార్లు పోలీసులు చిక్కినా అతడి తీరు మారలేదు. మంగళవారం రాత్రి సైతం ఆ నాయకుడు గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్య పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, మట్టిని తరలిస్తూ పోలీసులకు పట్టబడడంతో అతడి టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు కేసులు నమోదు చేయకుండా మైన్స్ అధికారులకు అప్పగిస్తుండడం, అక్కడి అధికారులు తూతూమంత్రంగా ఫైన్లు వేసి వదిలేస్తుండటం వల్ల ఇలాంటి నాయకులకు భయం లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీకి చెందిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తూ.. అధికార పార్టీ వారిని మైన్స్ అధికారులకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు ఎక్కడంటే.. ● తిరుమలంపాలెంకు చెందిన ఓ నాయకుడు ఎటువంటి అనుమతులు లేకుండా సూర్యచంద్రరావుపేటలోని కృష్ణాపురం చెరువు, గొల్లగూడెంలోని దొర చెరువు, తిరుమలంపాలెంలోని నారప్ప చెరువులో మట్టిని తవ్వి తిమ్మాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ప్రైవేట్ కల్యాణ మండపానికి తరలిస్తున్నాడు. ● పి.కన్నాపురం గ్రామానికి చెందిన ఓ నాయకుడు గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, గ్రావెల్ మట్టిని దూబచర్లకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేలకు విక్రయిస్తున్నాడు. మొత్తం కాంట్రాక్టు 500 టిప్పర్ల మట్టికి కాగా, రోజుకు 50 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నాడు. ● జి.కొత్తపల్లిలో ఓ నాయకుడు రైతుల పొలాల్లో గ్రావెల్‌ను ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వి, చుట్టు పక్కల ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు. ● తక్కెళ్లపాడుకు చెందిన టీడీపీ నాయకుడు గుణ్ణంపల్లి ప్రాంతంలోని పోలవరం కుడికాలువ–తాడిపూడి కాలువ గట్ల మధ్యలో ఉన్న ఖాళీ భూమిలో ఈ తవ్వకాలు జరుపుతున్నాడు. ఇప్పటికే కాలువకన్నా ఎక్కువ లోతు తవ్వకాలు జరిపాడు. భవిష్యత్తులో ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ● ఐఎస్.జగన్నాధపురంలో ఓ నాయకుడు ఎర్ర చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి ఇటుక బట్టీలకు, ఖాళీ స్థలాలను మెరక చేసేందుకు తరలిస్తున్నాడు. రెచ్చిపోతున్న టీడీపీ నేతల మట్టి మాఫియా కాలువ గట్లు, చెరువుల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు నిత్యం వందలాది టిప్పర్ల మట్టి తరలింపు మా రాజ్యం.. మా ఇష్టం అంటూ నేతల బెదిరింపులు మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం -
15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష
నూజివీడు: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష బుధవారం నాటికి 15వ రోజుకు చేరింది. క్యాంపస్‌లోని ఐ3 భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన టెంట్లో దీక్ష నిర్వహిస్తున్నారు. వీరందరూ తమ క్లాసులకు వెళ్లి టైంటేబుల్ ప్రకారం విద్యార్థులకు పాఠాలు బోధించి తదనంతరం పోరాట దీక్షలో కూర్చుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏడేళ్లకు పైగా తమకు వేతనాలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని, దీనిపై తాము గత 15రోజులుగా పోరాడుతున్నా ఆర్జీయూకేటీ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యూజీసీ ప్రకారం వేతనాలు ఇస్తామని చెప్పి, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ సుబ్బారావు, రచన గోస్వామి, పీవీ లక్ష్మణరావు, జాడ సీతాపతిరావు, లంకపల్లి రాజేష్, భవాని, ఉదయశ్రీ, దీప్తీ సాహూ తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం: మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీని, టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తహసీల్దార్ ఎన్.నాగరాజు తెలిపారు. యర్రంపేట సమీపంలోని పులపాల చెరువులో బుధవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి జేసీబీని ఏర్పాటు చేసి లారీల్లో మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పీడబ్ల్యూడీ ఏఈ ఎంఆర్ భాస్కర్‌తో కలిసి దాడి చేసినట్లు తహసీల్దార్ చెప్పారు. ఈ సమయంలో జేసీబీ, ఒక టిప్పర్ లారీని పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు తెలిపారు. పోలవరం రూరల్: పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకై జిల్లా సాధనా సమితి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం 9వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరంలో మహిళలు దీక్ష చేపట్టారు. జిల్లా ఏర్పాటు చేయాలంటూ పలువురు వక్తలు ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా ఏటిగట్టు సెంటర్లో సాధనా సమితి సభ్యులు పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్లకార్డులు పట్టుకుని నినదించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధనా సమతి నాయకులు సొబ్బన మోహన్, బుగ్గా మురళీకృష్ణ, కోటంరాజు రాంబాబు, జేవీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (మెట్రో): ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ప్రకృతి వ్యవసాయం డీపీఎం బి.వెంకటేష్ అన్నారు. స్థానిక ఏలూరు జిల్లా వ్యవసాయ కార్యాలయంలోని ఐడీపీ హాల్లో బుధవారం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందులతో పండించిన ఆహారం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, సాధ్యమైనంత వరకు అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యతకను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను సత్కరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ఏడీఏ, ఏలూరు, పెదపాడు ఏవోలు, సెర్ప్ సిబ్బంది, ఏలూరు మండల ఏపీఎం, రైతులు పాల్గొన్నారు. -
హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలో పని చేస్తున్న హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాలని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. రైతులు అవసరాల కోసం నిలువచేసే ఎరువులు, పురుగు మందుల గోదాంలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ బుధవారం డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బద్దా వెంకట్రావు, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాస రావు మాట్లాడుతూ 40 ఏళ్ల నుంచి డీసీఎంఎస్‌లో 21 మంది హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. వారికి ఇప్పటికీ చట్టబద్ధమైన సౌకర్యాలు లేవన్నారు. హమాలీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పించవలసిన అధికారులు ఉన్న ఉపాధిని ప్రైవేటు వ్యవస్థకు అప్పచెప్పే ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. -
తెగ తాగేశారు
ఏలూరు టౌన్ : టీడీపీ సర్కారు ప్రజారోగ్యాన్ని పక్కనబెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. మందుబాబులకు లిక్కర్‌ను నిత్యం అందుబాటులో ఉంచుతోంది. గత రెండేళ్ళుగా జిల్లాలో మద్యం విక్రయాల జోరు పెరిగింది. ఒకవైపు వైద్యసేవలను నిర్లక్ష్యం చేస్తూ...మరోవైపు సంక్షేమాన్ని పక్కనబెట్టింది. కేవలం ఆదాయమే పరమావధిగా టీడీపీ నేతలు మద్యం విక్రయాలను భారీగా పెంచేశారు. ప్రతి లిక్కర్ షాపుకు అనుసంధానంగా సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి మరీ మద్యం రోజంతా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు మద్యం దుకాణాల యజమానుల పంట పండింది. ఏలూరు జిల్లాలో మద్యం షాపులు మందుబాబులతో కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 155 ప్రైవేట్ మద్యం షాపుల్లో మద్యం నిత్యం అందుబాటులో ఉంటోంది. ఏడాది డిసెంబర్లో రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ 31న ప్రభుత్వం మద్యం దుకాణాలకు అర్థరాత్రి 12 గంటల వరకూ విక్రయాలకు అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. రెండు రోజుల్లో రూ.14.60 కోట్లు ఏలూరు జిల్లాలో డిసెంబర్ 31, జనవరి 1న అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో మందుబాబులు, యువత భారీఎత్తున మద్యం తాగుతున్నారు. ప్రైవేటు మద్యం షాపులకు మందుబాబుల ఉత్సాహం కాసులు కురిపిస్తోంది. 2025 డిసెంబర్ 31, 2026 జనవరి 1న జిల్లాలో ఏకంగా రూ.14.60 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. 31న మద్యం కేసులు –7891, బీర్ల కేసులు – 4286 అమ్మకాలు చేయగా, కొత్త ఏడాది మొదటి రోజున 7234 మద్యం కేసులు, 3985 కేసుల బీర్లు తాగేశారు. 2023 డిసెంబర్లో విక్రయాలు – రూ.101.62 కోట్లు 2024 డిసెంబర్లో విక్రయాలు – రూ.110.75కోట్లు 2025 డిసెంబర్లో విక్రయాలు – రూ.118.26కోట్లు 2023 డిసెంబర్ 31న అమ్మకాలు – రూ. 6.54 కోట్లు 2024 డిసెంబర్ 31న – రూ.7.34కోట్లు 2025 డిసెంబర్ 31న – రూ. 8.12కోట్లు ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ప్రైవేటు మద్యం షాపులు 155 ఉండగా, మరో 20 బార్లకు లైసెన్సులు మంజూరు చేశారు. ఇక ప్రైవేటు మద్యం దుకాణాల్లో నెలకు సరాసరి రూ.95 కోట్ల నుంచి గరిష్టంగా రూ.118 కోట్ల వరకూ విక్రయాలు చేయడం గమనార్హం. శీతాకాలంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మద్యం సేల్స్ అధికంగా ఉంటే.. వేసవిలో చల్లటి బీర్లు తాగేందుకు మందుబాబులు ఎగబడుతున్నారు. ఏలూరు జిల్లాలో 2025 ఏడాదిలో సరాసరిన రూ.1140 కోట్ల నుంచి రూ.1250 కోట్ల వరకూ మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ సర్కారు మద్యం ఆదాయంపై మాత్రమే దృష్టి పెట్టిందని, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. రెండు రోజుల్లో రూ.14.60 కోట్ల అమ్మకాలు డిసెంబర్లో రూ.118 కోట్ల విక్రయాలు ఏలూరు జిల్లాలో ఏరులై పారుతోన్న మద్యం -
యథేచ్ఛగా కోళ్ల వ్యర్థాల తరలింపు
ఆగిరిపల్లి: మండలంలో ఇష్టానుసారంగా చేపల చెరువుల కోసం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఆగిరిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో పదుల సంఖ్యలో మాంసం దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు చికెన్ దుకాణాల వద్ద నుంచి చేపల చెరువుల నిమిత్తం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఉదయం పూట జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కోళ్ల వ్యర్థాల తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం: భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎంవీ ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన గంజి వనజకు జోషిబాబుతో 2024 జనవరిలో గన్నవరంలో వివాహమైంది. వివాహ సమయంలో రూ.5 లక్షల నగదు, 6 కాసుల బంగారం, చీర సారె కింద రూ.2 లక్షలు కట్నంగా ఇచ్చారు. చెడు వ్యసనాలకు బానిసైన జోషిబాబు వివాహం అయిన కొద్దిరోజుల నుంచి భార్య వనజను శారీరికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనికి అతని కుటుంబసభ్యులు ఆరుగురు సహకరిస్తున్నట్లు బాధితురాలు వనజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. వీరవాసరం: శ్రీ కొల్లా భాస్కరమ్మ, శ్రీ గుండా లక్ష్మీ రత్నావతి మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్, క్రికెట్ పోటీలు బుధవారం వీరవాసరంలో ప్రారంభమయ్యాయి. నరసాపురం– నెల్లూరు జట్ల మధ్య, వీరవాసరం– బుట్టాయగూడెం, కొవ్వూరు– జంగారెడ్డిగూడెం జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. క్రీడాకారులు, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి పోటీలను తిలకించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా జయ ప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, గుండా రామకృష్ణ, కారింశెట్టి మూర్తి, బాజీంకి గంగా మహేష్, పీఎన్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
భీమడోలు: మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన 68వ జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిఫ్‌లో సూరప్పగూడేనికి చెందిన వెజ్జు ధరియా జూనియర్ కేటగిరిలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ ఏడాది చివరిలో జరిగే నేషనల్స్ పోటీల్లో విజేతగా నిలిస్తే ఇండియన్ టీంలో స్థానం పొందుతుందని తండ్రి సోము తెలిపారు. చిన్నతనం నుంచి షూటింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుని, అలుపెరుగని శ్రమతో తన లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న ధరియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. మాజీ సర్పంచ్ వెజ్జు సూర్యకుమారి, కొండలరావు మనవరాలు ధరియా గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు. పెదపాడు: రోడ్డు ప్రమాదంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తిరుపతి జిల్లా, నారాయణ వనం మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన కుంభ విజయ్ ఈనెల 6వ తేదీన తన మోటారు సైకిల్‌పై విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా రాత్రి 8.30 గంటల సమయంలో స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్దకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తలకి బలమైన గాయం కావడంతో జాతీయ రహదారి అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్వో రాగాల కృష్ణ ఫిర్యాధు మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరి కాలువ పక్కన డంపింగ్ యార్డ్
● ప్రమాదం అంచున ఐదు గ్రామాల సాగు, తాగునీటి సరఫరా ● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సర్పంచ్, గ్రామస్తులు దెందులూరు: గోదావరి కాలువ పక్కన ఉండ్రాజవరం వంతెన వద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం నిలుపుదల చేయాలని పోతునూరు గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్, కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్నేని శ్రీను, గ్రామస్తులు కలిసి జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గోదావరి కాలువ పక్కన డంపింగ్ యార్డ్ పెడితే పోతునూరు, కొవ్వలి, సత్యనారాయణపురం, దెందులూరుతో పాటు ఏలూరు గ్రామాలకు సాగు, తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఎన్నడూ గోదావరి కాల్వ పక్కన డంపింగ్ యార్డ్ నిర్మాణం జరగలేదన్నారు. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా కలెక్టర్, డీపీఓను విచారణ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్నేని శ్రీను విలేకరులతో మాట్లాడుతూ తాము డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకం కాదన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గోదావరి కాలువ పక్కన ఎవరైనా డంపింగ్ యార్డ్ పెడతారా అని ప్రశ్నించారు. -
తిరువీధుల్లో శ్రీవారి శోభ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం క్షేత్ర పురవీధుల్లో శ్రీవారికి జరిగిన తిరువీధి సేవ స్వామివారి వైభవాన్ని చాటడంతో పాటు, భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. గుడి సెంటర్లోని ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని రాత్రి సైతం స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. ఏలూరు (టూటౌన్): చెక్‌బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.7.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తీర్పును వెలువరించారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఏలూరుకు చెందిన మేడపాటి సుధాకర్ వద్ద నుంచి నగరానికి చెందిన ఆవుల అనిత 2023 ఫిబ్రవరి 18న రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పును తిరిగి చెల్లించే నిమిత్తం 2024, ఏప్రిల్ 18న రూ.7.50లక్షల చెక్కును ఇచ్చారు. సుధాకర్ రెడ్డి ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా చెల్లుబాటు కాలేదు. దీంతో ఆయన 2025లో కేసు వేశారు. విచారణ అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో సదరు మహిళపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.7.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాది దారుని తరుఫున న్యాయవాది చిక్కా భీమేశ్వరరావు తన వాదనలను కోర్టులో వినిపించారు. -
క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి
భీమవరం: భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జైత్ర 2026 పేరిట నిర్వహిస్తున్న స్పోర్ట్స్ కార్నివాల్‌కు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్‌వర్మ మాట్లాడుతూ ఈ పోటీల్లో పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో 100 టీంలు పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్ చక్రవర్తి, ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ సీహెచ్ హరిమోహన్, జి సారిక తదితరులు పాల్గొన్నారు. -
భాగవతోత్తముడు త్యాగరాజు
భీమవరం: త్యాగరాజు 96 కోట్ల నారాయణ జపం చేసి శ్రీసీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవతోత్తముడని మహా సహస్రావధాని గరికిపాటి నర్సింహారావు అన్నారు. భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం గరికిపాటి త్యాగరాజు రామాయణంపై ప్రవచనం చేశారు. దేశమంతా మోగుతున్న నినాదం జై శ్రీరామ్ నామ మంత్రమని, నాదోపాసనతో పరబ్రహ్మను చేరవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగరాజు అన్నారు. శ్రీరామ దర్శనం పొంది భగవంతుడున్నాడన్న సత్యాన్ని చాటిన నిష్కార్మయోగి, తెలుగు భాష తీయందనాన్ని, సాహితీ పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన ధన్యజీవి, మోక్ష సాధన మార్గాల్లో సంగీతం ఒకటని తలచి తన సంకీర్తనల ద్వారా భగవంతునికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయుడు త్యాగరాజస్వామి అంటూ కీర్తించారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణ పనులన్నీ 2027 మార్చికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ సైట్‌లోని సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రాజెక్టు పనులు, పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందించాలని సూచించారు. మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డులోనే కలెక్టరేట్
భీమవరం: పట్టణంలో గతంలో ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీంతో కొంతకాలంగా కలెక్టరేట్ తరలిపోతుందనే ప్రచారానికి ఆయన తెరదించడంతోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కలెక్టరేట్‌ను ఉండి ప్రాంతానికి తరలించడానికి చేసిన ప్రయత్నాలకు చెక్ పెట్టినట్లు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరం కేంద్రంగా ప్రకటించడంతో తాత్కాలిక కలెక్టరేట్‌ను పట్టణంలోని మల్లితోట ప్రాంతంలోని అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణానికి కుముదవల్లి రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.100 కోట్లు నిధులు మంజూరుచేసినట్లు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఉండి ఎమ్మెల్యే కలెక్టరేట్‌ను ఉండి నియోజకవర్గానికి తరలించుకుపోడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీంతో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజుతో సహా వైఎస్సార్సీపీ నాయకులు తరలింపు వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. వామపక్ష పార్టీలు కలెక్టరేట్ తరలింపును అడ్డుకుంటామంటూ ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో అంజిబాబు ఏఎంసీలోనే కలెక్టరేట్ అంటూ స్పష్టం చేయడంతో కలెక్టరేట్ తరలింపు వ్యూహానికి చెక్ పెట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్పష్టం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు -
పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు
● 3 నెలలుగా జీతాలు లేక అవస్థలు ● 18 నెలల పీఎఫ్ బకాయి ● రెండు కాంట్రాక్ట్ సంస్థల దోబూచులాట ఏలూరు టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తోన్న శానిటరీ కార్మికులు ఆకలి కేకలు సర్కారుకు వినిపించడం లేదు. రెండు కాంట్రాక్ట్ సంస్థలు ఆర్థిక కారణాలతో కోర్టుల కెక్కి కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకునే కుట్రలు చేయటంపై వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మూడు నెలలుగా జీతాలు లేకపోవటంతో కుటుంబాలు పండుగ పూట పస్తులు ఉండాల్సిన దైన్యస్థితి ఏర్పడిందని కార్మికులు బాధ పడుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు తమ ఆరోగ్యాలను సైతం ఫణంగా పెట్టి సేవలందిస్తుంటే.. ప్రభుత్వం తమపై ఏమాత్రం కనకరం చూపటంలేదంటూ మానసిక ఆవేదనకు గురవుతున్నారు. గతంలో పనిచేసిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, కొత్తగా కాంట్రాక్ట్ సంస్థ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల యాజమాన్యాల ఆర్థిక లావాదేవీల గొడవల మధ్య శానిటరీ కార్మికులు నలిగిపోతున్నారు. కార్మికుల వెతలు పట్టవా ? ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తోన్న శానిటరీ కార్మికుల కష్టాలు తీర్చే నాథుడే కానరావటం లేదు. సర్వజన ఆసుపత్రితోపాటు రెండు జిల్లాల్లోని ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్‌లో సుమారు 368 మంది శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా 3 నెలలుగా జీతాలు లేక జీవనం కష్టంగా మారిందని ఆవేదధన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్ట్ సంస్థ సుమారుగా రూ.1.32 కోట్ల జీతాల బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెలలో జీతాలు వేస్తారని ఆశించినా ఫలితం లేదంటున్నారు. రూ.4.68 కోట్ల పీఎఫ్ బకాయిలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి జోన్–2 గా పరిగణిస్తారు. ఈ జోన్–2 పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో శానిటరీ వర్కర్లకు 18 నెలలుగా పీఎఫ్ బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో శానిటరీ వర్కర్‌కు నెలకు రూ.2 వేల పీఎఫ్‌గా కటింగ్ చేస్తారు. జోన్–2 పరిధిలో సుమారుగా 1300 మందికి పైగా శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు. కేవలం జోన్–2లో కాంట్రాక్ట్ సంస్థ పీఎఫ్ బకాయిలు సుమారుగా రూ.4.68 కోట్లు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో జీతాలు, పీఎఫ్ బకాయిలు పేరుకుపోయినా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. -
వైభవంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారికి నిర్వహించిన తిరువీధి సేవ భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజ గోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనం అయింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. ఆఖరిలో ఆలయ ప్రధాన కూడలిలో ఉన్న ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పెదపాడు: కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పెదపాడు ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనం సీజ్‌చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. -
తణుకు ప్రభుత్వ కళాశాలకు ఐఎస్వో ధ్రువీకరణ
తణుకు అర్బన్: తణుకు చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల పలు విభాగాల్లో ఐఎస్వో ప్రమాణాల్లో ధ్రువీకరణ సాధించిందని ప్రిన్సిపాల్ సీహెచ్ ఏడుకొండలు తెలిపారు. పర్యావరణ నిర్వహణ, విద్యా సేవల నాణ్యత, ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రమాణాల్లో ధ్రువీకరణ పొందినట్లు చెప్పారు. ఈ ధ్రువీకరణలు హైదరాబాద్‌కు చెందిన హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ద్వారా జారీ చేయబడినట్లు స్పష్టం చేశారు. ఇది కళాశాల నాణ్యతా ప్రమాణాలకు అంతర్జాతీయ గుర్తింపు అని అన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమష్టి కృష్టితో ఈ ఘనత సాధ్యమైనట్లుగా వివరించారు. నరసాపురం: రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాల గ్రౌండ్లో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన క్రికెట్ బాలుర టాలెంట్ స్పాటింగ్లో నరసాపురం పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. పట్ణణంలోని రుస్తుంబాద బాలాజీ క్రికెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న మామిడి వెంకట నవసూర్య, యర్రంశెట్టి దేవకీనందన్ ఎంపికయ్యారు. త్వరలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు. మండవల్లి: గోడౌన్లో సిగరెట్ బాక్సుల చోరీ జరిగిన ఘటన లోకుమూడిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోకుమూడిలో రత్న ఎంంటర్ప్రైజస్ పేరిట నిత్యావసర సరుకుల గోడౌన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 6న ఉదయం యజమాని గోడౌన్ వద్దకు వెళ్లగా షట్టర్ వంచబడి లాకులు తెరిచి ఉన్నాయి. లోపలకి వెళ్లి చూడగా 11 గోల్డ్ఫ్లాక్ సిగరెట్ బాక్సులు చోరీ జరిగినట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలియజేశారు. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం: భీమవరరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీంగ్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజులపాటు అంతర్ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల మెన్ అండ్ ఉమెన్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బీహెచ్‌వీఎస్ రామకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి మంగళవారం చెప్పారు. కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటలకు పోటీలను కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభిస్తారన్నారు. వాలీబాల్, కబడ్డీ, పికిల్ బాల్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. తణుకు అర్బన్: ప్రపంచ తెలుగు సభల్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపునకు గోల్డ్ మెడల్ దక్కింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 5 తేదీల్లో గుంటూరులో శ్రీ సత్య సాయి స్పిరిచ్యువల్ సిటీ నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందకు పైగా చిత్రకారులు పాల్గొని కళాఖండాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తాను ఎఫెక్షన్ శీర్షికతో రూపొందించిన చిత్రానికి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నట్లు వెంకటాపు వివరించారు. చిత్రకళా ప్రదర్శన కోఆర్డినేటర్ కళారత్న ఎస్.విజయ్‌కుమార్, అమీర్ ఆర్ట్ అకాడమీ కార్యదర్శి డాక్టర్ అమీర్ జాన్, డ్రీమ్ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ పెరపోగు రమేష్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ చిత్రకారులు కొండూరి నాగేశ్వరరావు, మారేడు రాము, మధు కురువ చేతులమీదుగా గోల్డ్‌మెడల్ అందుకున్నట్లు చెప్పారు. -
ఆదాయంలో ఎదురులేని వెదురు
● జిల్లాలోని మన్యంలో 5,381 ఎకరాల్లో వెదురు వనరు ● ప్రతి ఏటా అక్టోబర్ నుంచి జూన్ వరకూ వెదురు కర్రల కటింగ్ ● ఒక్కసారి నరికినా మూడేళ్లలో మళ్లీ పెరుగుదల బుట్టాయగూడెం: వెదురును పచ్చ బంగారం అంటారు. వెదురు బొంగులను కోష్టాలు, పందిళ్ల నిర్మాణానికి, ఇంటి పైకప్పులకు వాడతారు. నిచ్చెనల తయారీకీ ఉపయోగిస్తారు. వెదురును బద్దలుగా చీల్చి పలు రకాల వస్తువులను తయారు చేస్తారు. బుట్టలు, తట్టలు, గంపలు, చేటలు మొదలైనవి వెదురుతోనే చేస్తారు. వెదురు కలప పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని అడవిలో వేల ఎకరాల్లో సహజ సిద్ధంగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వెదురు కూపులు పచ్చదనంతో ఎత్తయిన చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ వెదురు కర్రలను ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి జూన్ నెలాఖరు వరకూ నరికించి జంగారెడ్డిగూడెంలో ఉన్న అటవీశాఖ వెదురు డిపోకు తరలించి అక్కడ వెదురు కర్రలను వేలం వేస్తారు. మన్యంలో 5,381 ఎకరాల్లో వెదురు వనాలు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న అటవీ పరిధిలో సుమారు 5,318 ఎకరాల్లో వెదురు వనాలు ఉన్నాయి. బుట్టాయగూడెం మండలంలోని రేగులపాడు, ముంజులూరు, మోతుగూడెం, పోలవరం మండలంలోని కొల్లుమామిడి–1, 2 గుమ్ములూరు, తదితర ప్రాంతాల్లో వెదురు కొమ్ములను అటవీశాఖ అధికారులు పెంచుతున్నారు. వీటిలో ఒక్కో కూపును మూడు కూపులుగా విభజించారు. వెదురు బాగా పెరిగిన తర్వాత వాటిని అధికారులు నరికిస్తారు. అయితే వీఎస్ఎస్ కూపులుగా కూడా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలంలోని ఒర్రింక, ముంజులూరు, రేగులపాడు, చింతపల్లి, రేపల్లె అటవీ ప్రాంతంలో కూడా వెదురు వనాలు ఉన్నాయి. ఒక్కసారి నరికిన ప్రదేశంలో తిరిగి మళ్లీ మూడేళ్లకు వెదురు తయారవుతుంది. దానిని కూడా అటవీశాఖ అధికారులు కూలీలతో నరికిస్తారు. ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో వెదురు నరికే కార్యక్రమాన్ని అధికారులు చేపడతారు. ఇక్కడ నరికిన వెదురు కర్రలను లారీల్లో ఆరు నెలల పాటు జంగారెడ్డిగూడెం అటవీశాఖ డిపోకు తరలిస్తారు. ప్రస్తుతం వెదురు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నరికిన వెదురు కర్రలను లారీల్లో గిరిజనులు జంగారెడ్డిగూడెం డిపోకు తరలిస్తున్నారు. 200 కొండరెడ్డి కుటుంబాలకు జీవనోపాధి పశ్చిమ ఏజెన్సీప్రాంతంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు ఉండవు. పూడు వ్యవసాయమే వారికి ఆదాయం. అది కూడా కేవలం తిండి గింజలు సమకూర్చుకోవడానికే తప్ప ఆదాయం కోసం కాదు. బుట్టాయగూడెం కుక్కునూరు, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 200 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు వెదురు కలప నరికివేత జీవనోపాధి కల్పిస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఈ వెదురు కలపను కొండరెడ్డి గిరిజనులకు ఆరు నెలలపాటు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. -
తవ్వేద్దాం.. దోచేద్దాం
బ్రో.. రెడ్ సిగ్నల్ పడింది ట్రాఫిక్ నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారులు రూల్స్ పాటించడం లేదు. సిగ్నల్ రూల్స్ సైతం పాటించకుండా ప్రయాణం సాగిస్తున్నారు. 8లో uబుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026నియోజకవర్గంలోని ర్యాంపులన్నీ సీఆర్‌జెడ్ పరిధిలో ఉండటంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. అధికారులను అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారే తప్ప అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మేటలు, నదీ గర్భంలో తవ్వకాలు చేయడం వలన భూగర్భ జలాల్లో ఉప్పునీటి సాంద్రత పెరిగి స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి ఏలూరు (టూటౌన్): ఏలూరు అటవీ విభాగంలో క్యాంపా పథకంలో 13 వాహనాలు కొనుగోలు చేసినట్లు జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు. అటవీ సంరక్షణ, రక్షణ, అగ్నిప్రమాదాల నియంత్రణ, చెట్ల కొట్టివేత అడ్డుకోవడం, వన్యప్రాణుల సంరక్షణ, క్షేత్రస్థాయిలో వేగవంతమైన పర్యవేక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ వాహనాలు దోహదపడతాయన్నారు. అటవీ వనరుల పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. ఏలూరు (టూటౌన్): ఈ నెల 11న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు ఏలూరు గిరిజన భవన్‌కు రానున్నారని ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఆలిండియా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం వెంకటేశ్వర్ల బృందం కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని ఏలూరు ఆస్పత్రి సెంటర్లో కలిసి ఆహ్వానించింది. చైర్మన్, సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏలూరు (టూటౌన్): జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ, ఎన్ఎస్ రామరాజు ప్రారంభించిన జనచైతన్య యాత్ర ఏలూరు చేరుకుంది. జనవరి 3న విశాఖపట్నంలో మొదలుపెట్టిన రైడ్ 8న తేదీన తిరుపతి చేరుకుంటుందని జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం ప్రధాన కార్యదర్శి కాళే శ్రీనివాసరావు తెలిపారు. ఆశ్రం ఆసుపత్రి వద్ద యాత్రకు బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం నాయకులు స్వాగతం పలికారు. సాక్షి, భీమవరం: మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇలాకాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. గతేడాది కోట్లాది రూపాయల ఇసుకను తరలించేసిన అక్రమార్కులు ఇప్పుడు అదే పనిలో పడ్డారు. తీరం వెంట తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారు. కోడేరులో బాటలు సిద్ధం చేస్తుండగా వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని సిద్ధాంతం నుంచి బియ్యపుతిప్ప వరకు ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలో వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. సముద్రపు ఆటుపోట్లతో ఈ ప్రాంతంలో ఇసుకలో ఉప్పునీటి సాంద్రత ఎక్కువగా ఉండి నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడటం, తీరప్రాంత పరిరక్షణలో భాగంగా రెండేళ్ల క్రితం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. అప్పటినుంచి ఈ ర్యాంపులు తెరుచుకోలేదు. ఇదే అదునుగా టీడీపీ నేతలు చక్రం తిప్పారు. సాధారణంగా ఇసుక తవ్వకాలు చేయాలంటే ఇరిగేషన్, మైనింగ్, పొల్యూషన్, రెవెన్యూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతులు తప్పనిసరి. తీరప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతున జట్టు కార్మికులతో పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. ఏ విధమైన అనుమతులు లేకుండానే సిద్దాంతం నుంచి నరసాపురం వరకు గతంలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోయాయి. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుకాసురుల ఇష్టారాజ్యం అయ్యింది. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్లు లోతున ఇసుకను తవ్వి కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టారు. లోడింగ్ రూపంలో బయట అమ్మకాలు చేయడంతో పాటు ఎక్కడికక్కడ అనధికార స్టాకులు పెట్టి వరదల సమయంలో అధిక ధరలకు అమ్ముకున్నా అధికారులు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బాటలకు సన్నాహాలు : గోదావరిలో వరద ప్రభావం తగ్గడంతో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి తదితర చోట్ల ఇసుక మేటలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గోదావరిలోకి లారీల రాకపోకలకు వీలుగా బాటలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కోడేరు వద్ద గతంలోని వరదలకు కొట్టుకుపోయిన పాత బాటను రాళ్లు వేసి పొక్లెయిన్లతో సరిచేస్తున్నారు. భీమవరం: ఎరువుల డీలర్లు, రైతులు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనుగోలు చేయాలని ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.బాట పనుల కోసం తీసుకొచ్చిన పొక్లెయిన్ గతేడాది తవ్వకాలు చేస్తున్న దృశ్యం (ఫైల్) టీడీపీ నాయకుడి పాత్రపై ఆరోపణలు కొయ్యలగూడెం: యువకుడిపై సమీప బంధువైన ఓ వ్యక్తి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం సత్యసాయినగర్కి చెందిన రాచూరి రవితేజ ఈ నెల 5న రాత్రి ఇంటి వద్ద ఉండగా సమీప బంధువైన అంగడాల నాగరాజు బీరు సీసాతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రవితేజ ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. రవితేజ తండ్రి సుబ్బారావు మాట్లాడుతూ తనకు, టీడీపీ నాయకుడైన తన అన్నకు మధ్య కోర్టు తగాదాలు ఉన్నాయని, తన అన్న బావమరిది నాగరాజు రాజీ పడాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. తన అన్న ప్రోద్బలంతో తన కుమారుడిపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఏలూరు (టూటౌన్): సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు దక్షి ణమధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న విశాఖపట్నం–చర్లపల్లి (08513), 19న చర్లపల్లి–విశాఖపట్నం(08514) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు. పలు ప్రత్యేక రైళ్లు రద్దు : సంక్రాంతి సందర్భంగా ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్ళను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13న నడవాల్సిన నర్సాపూర్–చర్లపల్లి, 17న నడవాల్సిన చర్లపల్లి–నర్సాపూర్, 19న వికారాబాద్–చర్లపల్లి, వికారాబాద్–కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20న వికారాబాద్–నర్సాపూర్, వికారాబాద్–కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కోడేరు వద్ద బాట ఏర్పాటు చేస్తుండటంతో స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలిసి బాట సిద్ధం చేస్తున్నవారు పొక్లెయినర్లను లంకల్లోకి తరలించేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ నేతలు తహసీల్దార్ సోమేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే సహించేది లేదని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అడ్డుకుంటామన్నారు. బాట ఏర్పాటుపై మైనింగ్‌శాఖ అధికారులు స్పందిస్తూ కోడేరు ప్రాంతంలో తనిఖీలు చేశామని, అయితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నట్టు ఆధారాలు దొరకలేదని, రాళ్లతో ఉన్న మట్టి దిబ్బలు, మధ్యలో అక్కడక్కడ కొట్టుకుపోయిన పాత బాట కనిపించినట్టు పేర్కొనడం గమనార్హం. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు సన్నాహాలు గోదావరి తీరం వెంట పాత ర్యాంపుల్లో బాటలు సిద్ధం చేసే పనిలో టీడీపీ నేతలు కోడేరులో యంత్రాలతో బాటలు అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు గతేడాది అక్రమ తవ్వకాలతో కోట్లాది రూపాయలు స్వాహా -
కార్మికుల కష్టాలు పట్టవా ?
ఆర్థిక లావాదేవీల గొడవలతో రెండు కాంట్రాక్ట్ సంస్థలు కోర్టుకు వెళ్లటంతో కార్మికుల జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని కార్మికుల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలి. కుటుంబ పోషణకు శానిటరీ పనులు చేసే కార్మికులను పండుగ రోజుల్లో పస్తులు ఉంచటం దారుణం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వందలాది కార్మిక కుటుంబాల ఆకలితో అలమటించే దుస్థితి నెలకొంది. – కె.కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షుడు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తోన్న పేద కుటుంబాలపై అధికారులు మానవత్వం చూపించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటే ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేసే శానిటరీ వర్కర్లకు మాత్రం శాపంలా మారింది. మూడు నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్ట్ సంస్థలు కోర్టుల్లో కేసులు వేసుకుని, కార్మికులను ఇబ్బందులకు గురిచేయటం దారుణం. పీఎఫ్ బకాయిలు సైతం 18 నెలలుగా ఇవ్వకుండా మోసం చేశారు. – తుర్లపాటి బాబు, చింతలపూడి ఏరియా కార్యదర్శి, ఏఐటీయూసీ -
రెడ్ సిగ్నల్ పడితే మాకేంటి!
ఏలూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నా వాహనదారులు మాత్రం రూల్స్ పాటించడం లేదు. సిగ్నల్ రూల్స్ సైతం పాటించకుండా ఇష్టారాజ్యంగా ప్రయాణం సాగిస్తూ ప్రమాదాలకు ఎదురు వెళుతున్నారు. రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం.. ఆపిన కానిస్టేబుల్‌తో వాగ్విదానికి దిగడం షరా మాములైపోయింది. రూల్స్ పాటించండి.. క్షేమంగా ఇంటికి వెళ్లండి అంటూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా మనకేమిటిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏలూరు ప్రధాన కూడలి అయిన ఫైర్‌స్టేషన్ సెంటర్, పాతబస్టాండ్ సెంటర్లో సిగ్నల్ పడినా ఆగకుండా ప్రయాణాలు సాగిస్తున్న దృశ్యాలు ఇవి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
యువకుడిపై హత్యాయత్నం
ఆకివీడు: ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన ఆకివీడు మండలంలోని కోళ్లపర్రు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి తల్లిదండ్రులు సరోజనీ, బుల్లియ్య తెలిపిన వివరాల ప్రకారం కోళ్లపర్రు గ్రామ శివారు సగర్లపేటకు చెందిన గండికోట శివ సోమవారం రాత్రి ఆకివీడు వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కాపుకాసి దాడి చేశారు. దీంతో అతడి తలకు, ఛాతిపైన, కుడి చేతి భుజం ఎముకకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న శివను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీహెచ్‌సీలో చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. బాధితుడి వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఆసుపత్రి నుంచి తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ధర్మ పోరాటానికి సీఐటీయూ మద్దతు
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్ష మంగళవారం నాటికి 14వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా ఐ3 బిల్డింగ్ వద్ద అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాట దీక్ష నిర్వహించారు. ఈనెల 7న చాన్సలర్‌ను కలిసి చర్చలు జరపనున్న నేపధ్యంలో చర్చల అనంతరం చేపట్టాల్సిన కార్యాచరణను నిర్ణయిస్తామని వారు పేర్కొన్నారు. వీరి ధర్మ పోరాట దీక్షకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను, న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. నేటి నిత్యవసర ధరలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కారం అయితేనే విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు దృష్టి సారించగలరని నిజాన్ని పాలకులు గుర్తించాలన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు జాడ సీతాపతిరావు, పీవీ లక్ష్మణరావు, జడ సుబ్బారావు, రాజేష్ పాల్గొన్నారు. -
అయోమయంగా ఉపాధి పనులు
ముసునూరు మండలంలో పనులు చేయకుండానే ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులు చర్చనీయాంశంగా మారింది. సామాజిక తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. 8లో uఏలూరు (టూటౌన్): బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గత డిసెంబర్ 3 నుంచి 100 రోజులపాటు బాల్య వివాహాల నిరోధంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కోసం గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొనే సీతారాం పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో అవకతవకలు
● పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపులు ● ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో వెల్లడి ● రికవరీకి ఆదేశించిన అధికారులు ముసునూరు: ప్రభుత్వ పథకాన్ని సవ్యంగా అమలు చేయకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించబోనని సోషల్ ఆడిట్, పబ్లిక్ హియరింగ్ ప్రొసీడింగ్ అధికారి పురుషోత్తం ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 16 గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల 18 వ విడత సామాజిక తనిఖీలపై ప్రజావేదిక కార్యక్రమాన్ని స్థానిక ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ పి.ఏసుబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీల్లో పలు గ్రామాల క్షేత్ర సహాయకులు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో నాణ్యతాలోపం, అవగాహన లేమి, బిల్లుల చెల్లింపుల్లో ఉన్న ఆరాటం, ఆత్రుత తదితర అంశాలు వెల్లడయ్యాయి. రహదారి వేయకుండానే.. 61 మీటర్ల రహదారి వేసినట్లు బిల్లుల చెల్లింపు, కూలీలు పనికి రాకపోయినా హాజరువేయడం, వేలి ముద్రలు వేయకున్నా వేతనాల చెల్లింపులు, మొక్కలు వేయకుండానే.. వేసినట్లు లెక్కలు చూపడం, తదితర తప్పులు బహిర్గతం అయ్యాయి. 2,467 పనులు నిర్వహించగా, వాటిపై జరిమానాలు రూ.44 వేలతో కలిపి మొత్తం రూ.51 వేలు రికవరీలకు జిల్లా విజిలెన్స్ అధికారిణి అనుపమ ఆదేశించారు. అనంతరం ప్రొసీడింగ్ అధికారి పురుషోత్తం మాట్లాడుతూ సిబ్బంది సక్రమంగా పనిచేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో అవసరమైన సమగ్ర సౌకర్యాలు చేపట్టాలని, ఎక్కువ మందిని సమకూర్చాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొండా దుర్గాభవాని, వైస్ ఎంపీపీ రాజానాయన, ఏపీడీ శ్రీనివాస్, అంబుడ్స్‌మెన్ మహబూబ్ బాషా, మణికంఠ, స్టేట్ రిసోర్స్ పర్సన్స్, ఏపీఓ రోజ్‌లీల, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. -
కనులపండువగా శ్రీవారికి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి, తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ఈ వేడుక ఆధ్యంతం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం పూజలు జరిపి హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం: బంగారం తీసుకుని వస్తువులు తయారు చేస్తానని, పాత బంగారం రిపేర్ చేయిస్తానని చెప్పి ఏడుగురిని మోసం చేసిన తండ్రీకొడుకులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మున్సిబు గారి వీధిలో స్వర్ణకారులైన తండ్రీకొడుకులు పడగ రాము, విజయ్‌ప్రకాష్ బంగారు నగలు తీసుకుని మోసం చేసినట్లు తెలిపారు. నూకారపు చంద్ర అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వారిని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లిలో సోమవారం ఓ భారీ కొండచిలువ స్థానికుల చేతిలో హతమైంది. పోలవరం కుడి కాలువ పక్కనున్న శ్రీనివాస రెడ్డి, తన తోటలోకి వెళుతుండగా 13 అడుగుల ఈ కొండ చిలువ ఆయన కంటపడింది. దాంతో ఒక్కసారిగా ఆయన హడలిపోయారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారిని పిలువగా, వారొచ్చి ఈ కొండ చిలువను హత మార్చారు. ఇంత పెద్ద కొండ చిలువను చూడడం ఇదే మొదటిసారని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఇంకా కొండ చిలువలు ఉన్నాయని, పశువులపై దాడి చేస్తున్నాయని రైతులు అంటున్నారు. అంతా అప్రమత్తంగా ఉండాలని గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కో–కన్వీనర్ వసంతాటి శ్రీనివాస్ సూచించారు. -
జోరుగా నల్ల బెల్లం విక్రయాలు
● సారా తయారీకి వినియోగం ● చింతలపూడికి టన్నుల కొద్దీ దిగుమతి చింతలపూడి : ఏలూరు జిల్లాలో నల్ల బెల్లంతో పా టు సాధారణ బెల్లం అమ్మకాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. వ్యవసాయ అవసరాల పేరుతో విక్రయిస్తున్న నల్ల బెల్లం వాస్తవానికి సారా తయారీలో ప్రధాన ముడి పదార్థంగా మారుతోంది. ఈ అక్రమ వ్యాపారం వల్ల పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. చిత్తూరు నుంచి భారీగా.. చింతలపూడిలో సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. స్థానిక బెల్లం వ్యాపారులు కొందరు సిండికేట్‌గా మారి టన్నుల కొద్దీ బెల్లాన్ని చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. సారా తయారీకే ఈ బెల్లాన్ని వినియోగిస్తారని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా నామమాత్రపు దాడులు చేస్తూ బెల్లం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గత నెలలో అధికారులు బెల్లం దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించి సారా తయారీదారులకు బెల్లం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే బెల్లం విక్రయాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. వ్యాపారులు కూడా నిబంధనలను అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. చింతలపూడి మార్కెట్‌కు లారీల్లో టన్నుల కొద్దీ బెల్లం వస్తుందనేది బహిరంగ రహస్యం. ఉన్నతాధికారులు బెల్లం గోడౌన్లపై దాడులు చేసి వ్యాపారులను కట్టడి చేస్తే సారా తయారీని అరికట్టవచ్చు. చింతలపూడి నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్లం అ మ్మకాలు సాగిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బెల్లం వ్యాపారులతో సంబంఽధిత అధికారులు కుమ్మక్కు కావడంతో సారాను అరికట్టలేకపోతున్నారు. బెల్లం అమ్మకాలను నియంత్రిస్తే సారా తయారీని నిర్మూలించవచ్చు. – తొర్లపాటి బాబు, సీపీఐ మండల కార్యదర్శి -
పశువుల పాక దగ్ధం
పెంటపాడు: మండలంలోని కె.పెంటపాడులో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదంలో పశువుల పాక దగ్ధమైంది. దోమల కోసం పెట్టిన పొగ రాజుకొని ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో సుమారు 10 గేదెలు పాకలో ఉన్నాయి. కొన్ని పశువులు తప్పించుకోగా 4 పాడి పశువులకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కాకి వీరాస్వామికి చెందిన పశువుల పాకతో పాటు, సమీపంలో ఉన్న గడ్డి వాము అగ్నికి ఆహుతైంది. గూడెం అగ్నిమాపక అధికారి కేవీఎం కొండబాబు, మండల పశువైద్యాఽధికారి పి.అశోక్‌కుమార్ తమ సిబ్బందితో వచ్చి కాలిన పశువులకు వైద్యపరీక్షలు చేసారు. సిబ్బంది మంటలను అదుపు చేశారు. మూడు పశువులు కోలుకుంటున్నాయని, మరో పశువు 90 శాతం పైగా కాలిపోయిందని, వైద్యాధికారి అశోక్‌కుమార్ తెలిపారు. -
కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలి
పోలవరం రూరల్: కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సోమవారం పోలవరం మండలం వింజరం సచివాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడారు. 10శాతం నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంటే కొత్త చట్టం ప్రకారం 40 శాతం నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులు కాలరాస్తూ ఉపాధి హామీ పనులు ఏ ప్రాంతంలో, ఎలా కల్పించాలో కేంద్రం నిర్ణయిస్తుందనడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు కొమరం రామారావు, మడి వెంకటగిరి, పాములేటి పెంటారెడ్డి, శబల శివకుమార్, అరగంటి జోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను కొనసాగించాలి జంగారెడ్డిగూడెం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు జీవరత్నం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ చట్టంపై గ్రామసభ నిర్వహించారు. సభ అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యదర్శి జె.సతీష్ కి అందించారు. సామాన్యల జీవన హక్కులపై ప్రభావం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ చట్టంలో తీసుకువచ్చిన మార్పులు గ్రామీణ పేదలు, కూలీలు, నిరుద్యోగ యువత జీవన హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డీవైఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ ఖండించారు. ఈ మార్పులను వెంటనే ఉపసంహరించుకొని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మైసన్నగూడెం సచివాలయం వద్ద కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం అందజేశారు. -
మందు వికటించి 19 గొర్రెలు మృతి
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం ఎ.గోకవరంలో జలగ మందు వికటించడంతో 19 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఆకుల గంగరాజు 50 గొర్రెలకు జలగ నివారణ మందును ఆదివారం పట్టించారు. ఆదివారం సాయంత్రానికి 12 గొర్రెలు చనిపోయాయి. సోమవారం మరో 7 గొర్రెలు చనిపోయాయి. విషయం పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియడంతో చేబ్రోలు, కై కరంలోని పశువైద్యులు అప్రమత్తమయ్యారు. గొర్రెలను చేబ్రోలు తెప్పించుకుని 30 గొర్రెలకు వైద్యం చేయించారు. ఆ గొర్రెలు తేరుకుంటున్నాయి. గొర్రెలు ఎందుకు చనిపోయాయో తెలుసుకోడానికి ఏలూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. సోమవారం సాయంత్రానికి నివేదిక రాగా.. ఎక్కువ మోతాదులో మందు వాడటం వల్ల గొర్రెలు చనిపోయినట్లు తేలిందని చేబ్రోలు పశువైధ్యాదికారి కిషోర్ వివరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చేబ్రోలు పశువులు ఆసుపత్రి వద్దకు వెళ్ళి బాధిత రైతులను పరామర్శించారు. -
నాణ్యమైన పరిష్కారం చూపాలి
ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందే అర్జీలకు న్యాయమైన పరి ష్కారం చూపాలని జేసీ ఎంజే అభిషేక్ గౌడ అ న్నారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో ఆగంగా డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్‌తో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్‌లో భాగంగా జిల్లాలో 28 మండలాలకు సంబంధించి 28 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, వినతులు స్వీకరించామన్నారు. అర్జీల్లో కొన్ని.. ● అప్పనవీడుకి చెందిన కనికిచర్ల కుమార్‌బాబు ఎన్‌హెచ్–16 విస్తరణలో భాగంగా డ్రెయినేజీ స మస్య ఇబ్బంది పెడుతోందని అర్జీ అందించారు. ● ఏలూరులోని శాంతినగర్‌కు చెదిన కట్నేని వెంకట గోపాలకృష్ణ తన 3.16 సెంట్లను భూసేకరణ చేశారని, అయితే ఇప్పటివరకూ నష్టపరిహారం రాలేదన్నారు. భూసేకరణ నుంచి తన భూమికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ● కామవరపుకోటకి చెందిన పోపూరి శ్రీనివాసు ఆయిల్‌పామ్ మొక్కల సబ్సిడీ సొమ్ములకు వినతిపత్రం అందించారు. ● పెనుమల్లి నివాసి వీరమల్లు పెదకొండలరావు గ్రామం మధ్యలో డ్రైనేజీ కాలువకు ఆనుకుని ఆ క్వా ప్రాసెసింగ్ యూనిట్లతో పర్యావరణ కా లుష్యం ఏర్పడుతుందని ఫిర్యాదు చేశారు. -
స్కూల్ స్వీపర్ల నిరసన
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ స్కూల్ స్వీప ర్లు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలంటూ యూనియన్ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పీజీఆర్ఎస్ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు కె.విజయలక్ష్మి మాట్లాడు తూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 180 మంది స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారన్నారు. స్వీపర్లకు రూ.4 వేలు, శానిటేషన్ వర్కర్లకు రూ.6 వేలు ఇచ్చి గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారన్నారు. ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానాలను అనుసరించి కార్మి కులకు ఫుల్ టైమ్ వేతనాలు ఇప్పించాలని డి మాండ్ చేశారు. లేకుంటే ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సీహెచ్ లక్ష్మి, ఎస్కే యాస్మిన్, టి.నాగమణి, ఎల్.రమణ, పి.సారమ్మ, వై.భవానీ పాల్గొన్నారు. కై కలూరు: రైలు పట్టాలు మరమ్మతుల నిమిత్తం మండవల్లి–కై కలూరు రైలు మార్గంలో లెవిల్ క్రాసింగ్ నంబరు–81 (కోరుకొల్లు గేట్)ను వారం రోజులపాటు మూసివేస్తున్నట్టు కై క లూరు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎండీ అబ్దుల్ రహ్మాన్ సోమవారం తెలిపారు. ఈనెల 7న ఉదయం 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటలకు వరకు గేటు మూసివేస్తామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. దెందులూరు: గోపన్నపాలెం గ్రామ పంచాయతీలో విధి నిర్వహణలో అలసత్వం, ఇతర కారణాల నేపథ్యంలో గ్రేడ్–3 సెక్రటరీ స్పానిష్బా బు, గ్రేడ్–5 సెక్రటరీ విజయకుమార్‌కు జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ షోకా జ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఆకస్మికంగా పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభను సందర్శించారు. అలాగే పోతునూరు పంచాయతీలో ప్రభుత్వ స్థలంలో కట్టిన భవనంపై దళిత సర్పంచ్ అనే సాకుతో తన పేరు ముద్రించలేదని పోతునూరు సర్పంచ్ బోదుల స్వరూప్ కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ కార్యదర్శికి డిప్యూటీ ఎంపీడీఓ ఆశీర్వాదం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఒకే మండలంలో ముగ్గురు గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు (టూటౌన్): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనతా వారధిగా వచ్చిన ట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న అన్నారు. బీజేపీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూ రు కలెక్టరేట్ వద్ద జనతా వారధి నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషిచేస్తుందని నాయకులు అన్నారు. జిల్లా అధ్యక్షు డు విక్రమ్ కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. ముసునూరు: రూ.లక్ష జరిమానా, కుల వెలివేత బాధిత కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం తీవ్ర గాలింపు నిర్వహిస్తున్నట్టు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. మండలంలోని లోపూడిలో కుల పెద్దల తీర్పుతో బెంబేలెత్తి కుటుంబసభ్యులంతా మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పా ల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించి, అదృశ్యమైన బోట్ల కనకారావు కుటుంబం ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసు బృందాలు ఏలూరు, చింతలపూడి, నూజివీడు, హను మాన్ జంక్షన్, విసన్నపేట పరిసర ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకూ ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. కుల పెద్దలు పోలీసుల అదుపులో ఉన్నారు. -
టీడీపీ నేత.. రేషన్ బియ్యం మేత
● 210 బస్తాల బియ్యం, 342 కిలోల పంచదార బ్లాక్ మార్కెట్‌కు? ● రూ.6 లక్షలకుపైగా ప్రజాధనం లూటీ ● 6ఏ కేసుతో సరిపెట్టిన అధికారులు తణుకు అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని తణుకులో టీడీపీ మా జీ కౌన్సిలర్ బొక్కేసిన వ్యవహారం ఆలస్యంగా వె లుగు చూసింది. తణుకు పాతవూరు శివాలయం ప్రాంతంలోని 23వ నంబరు చౌకడిపోను తెరవకుండా విసుగు తెప్పించడంతో పాటు తెరిచినా గంటలోపు తలుపులు మూసివేయడం వంటి వ్యవహారంపై పలువురు కార్డుదారులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అలాగే లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా కొందరితో వేలిముద్రలు వేయించుకుని, కొందరికి ఏ సమాధానం చెప్పకుండా డిపో మూసేసి సరుకును నేరుగా బియ్యం మాఫియాకు విక్రయిస్తున్న వ్యవహారం బట్టబయలైంది. బి య్యం, పంచదార రేషన్ డిపోలోనే ఉన్నట్టు ఆన్లైన్ లో సరుకు చూపిస్తుండటంతో రెవెన్యూ అధికారులకు చిర్రెత్తుకొచ్చింది. సదరు డిపోలో 105.75 క్వింటాళ్ల బియ్యం (సుమారు 210 బస్తాలు), 342 కిలోల పంచదార నిల్వలు తేడా గమనించి గత నెల లో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసి మరో డిపో డీలర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ వర్గమనే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత డీలర్‌ను తొలగించి టీడీపీ మాజీ కౌన్సిలర్ అభ్యర్థన మేరకు ఈ డిపోను అతడి భార్య పేరున కేటాయించారు. రేషన్ షాపు పెత్తనమంతా సదరు మాజీ కౌన్సిలర్ చూడటం, తదితర సమస్యలపై నాలుగు నెలలుగా పలు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే టీడీపీ నాయకుడు కావడంతో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేని పరిస్థితి. అయినా మార్పు లేకపోవడంతో చివరకు కేసు నమోదు చేశారు. ఈ డిపో డ్వాక్రా గ్రూపునకు చెందిన వారికి కేటాయించిన డిపోగా తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్‌కు.. చౌక డిపో పరిధిలో 740 రేషన్ కార్డులు ఉండగా 30 శాతం కూడా సరుకులు పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్డుదారులతో బయోమెట్రిక్ వేయించకుండానే బియ్యాన్ని బయట మార్కెట్‌కు తరలించారు. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ లాగిన్‌లో మాత్రం బియ్యం స్టాకు కనిపించేది. మొ త్తంగా 210 బస్తాల బియ్యానికి సంబంధించి రూ.6 లక్షలకు పైగా ప్రజాధనం లూటీ చేసినట్టు సమాచారం. దీనిపై తణుకు తహసీల్దార్ దండు అశోక్వర్మను ‘సాక్షి’ వివరణ కోరగా 23వ నంబరు చౌకడిపోపై పలు ఫిర్యాదులు వచ్చాయని, పరిశీలనలో 105.75 క్వింటాళ్ల బియ్యంతోపాటు 342 కిలోల పంచదార షార్టేజీ ఉండటంతో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసి, తాత్కాలికంగా మరో డీలరును ఇన్చార్జిగా నియమించినట్టు చెప్పారు. అలాగే తణుకులో మరో ముగ్గురు డీలర్లు ఇదే తరహాలో డిపోను నడుపుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. -
బల ప్రదర్శనకు వేదికగా జాతర
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజలను భక్తిమార్గంలో నడిపిస్తూ, ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా జరగాల్సిన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. జాతరలో రాజకీయాల ప్రవేశంతో వేరుకుంపట్లు పెట్టుకుని ఎవరికి వారుగా ఉత్సవాలను నిర్వహించే పరిస్థితికి ఉత్సవాన్ని దిగజార్చారు. గతంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర మహోత్సవాలను కొన్ని కమిటీల ప్రతినిధులు ఆదాయ వనరుగా పరిగణించి ప్రతి ఏడేళ్ళకు ఒకసారి నిర్వహించేలా సంప్రదాయాన్ని మార్చేశారు. అయినప్పటికీ అమ్మవారి జాతర నగర ప్రజల్లో సెంటిమెంట్‌గా నిలిచిపోవడంతో కమిటీల నిర్ణయానికి ప్రజలు అంగీకారం తెలిపి ఎప్పుడు అమ్మవారి జాతరకు పిలుపునిచ్చినా ఉత్సవాల విజయవంతానికి తమవంతు సహకారం అందిస్తున్నారు. బల ప్రదర్శనకు వేదికగా గంగానమ్మ జాతర తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు జాతర జరుగుతుందని నగర ప్రజల్లో చర్చ నడుస్తోంది. గతంలో జాతర మహోత్సవాలన్నీ టీడీపీ అధికారంలో ఉండగా జరిగినవే కావడంతో ఈ చర్చకు బలం చేకూరుతోంది. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే జాతర మహోత్సవాలకు సంబంధించి కమిటీల్లో అందరూ టీడీపీకి చెందిన నాయకులే ఉండడంతో ఈ వాదన నిజమే అంటున్నారు. ప్రస్తుతం కొన్ని కమిటీలు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవడం కోసం అదే పార్టీకి చెందిన, అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరిని కమిటీలకు దూరం చేయడంతో అలా బయటకు వెళ్ళాల్సి వచ్చిన వారు తమ ప్రాంత వాసులతో చర్చించి వేరుకుంపటి పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. అలా వేరు కుంపటి పెట్టుకున్న వారు తమ బలాన్ని ప్రదర్శించే కార్యక్రమాలు చేపడుతున్నారని భక్తులు అంటున్నారు. సినీ బృందాలు, ప్రజాప్రతినిధుల సందర్శన వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరకు ఆయా కమిటీల ప్రతినిధులు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల విజయోత్సవ యాత్రలు, చిత్ర ప్రమోషన్ కోసం పర్యటన చేస్తూ నగరానికి విచ్చేసిన సినీ బృందాలను కొందరు కమిటీల వారు తమ మేడల వద్దకు రప్పిస్తున్నారు. మరి కొందరు రాజకీయ ప్రముఖులను, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ మేడల వద్దకు తీసుకొచ్చి అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. మరోప్రాంతంలో రోజూ ప్రత్యేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించడానికి తిప్పలు పడుతున్నారు. బృందాలుగా సారెల సమర్పణ నగరంలోని అమ్మవారి భక్తులు మాత్రం తమ భక్తిప్రపత్తులు చాటుకుంటూనే ఉన్నారు. ఏడేళ్ళ తరువాత వచ్చిన జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటున్నారు. అమ్మవార్లు వేంచేసిఉన్న మేడల వద్దకు తండోపతండాలుగా భక్తులు వెళ్ళి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చద్ది నైవేద్యాలు, చలిమిడి, వడపప్పు, పానకం సమర్పిస్తున్నారు. నగరంలోని వివిధ పేటలకు చెందిన భక్తులు, ఒక్కో అపార్ట్మెంట్లో నివశిస్తున్న భక్తులు సామూహికంగా అమ్మవార్లకు సారెలు సమర్పిస్తున్నారు. కమిటీల్లో పోటీ వాతావరణం గతంలో రెండు మూడు ప్రాంతాలకు పరిమితమైన జాతర ప్రస్తుతం ఏడు ప్రాంతాలకు విడిపోయింది. కేవలం పడమర వీధి, తూర్పువీధి, పవర్పేటల్లో మాత్రమే ఇలా 12 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతరను నిర్వహించేవారు. ఈ కమిటీల్లో ఇతరులకు స్థానం కల్పించడానికి ఆయా కమిటీల ప్రతినిధులు నిరాకరించడంతో మరి కొన్ని ప్రాంతాల వారు వీరికి పోటీగా జాతర కొలుపులు ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణపు వీధిలో జాతర మహోత్సవం పడమర వీధి కమిటీకి వ్యతిరేకంగా ప్రారంభమైనట్టు అనుకుంటున్నారు. లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, తంగెళ్ళమూడి ప్రాంతాల్లో కూడా జాతర నిర్వహిస్తున్నారు. భక్తుల్లో గందరగోళం పోటీ వాతావరణంలో జరుగుతున్న జాతర మహోత్సవాలు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గంగానమ్మ జాతరలో భాగంగా స్థానిక పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారు నగరంలోని ఎక్కువ ప్రాంతాల్లో సంచరించే వారు. ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా పడమర వీధి మేడల వద్దకే వెళ్ళి మొక్కులు చెల్లించుకునే వారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా తాము గతంలో కొలిచిన అమ్మవారి వద్దకు వెళ్ళాలా, లేకుంటే కొత్తగా తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మేడలవద్దకు వెళ్ళాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. అటూఇటూ తేల్చుకోలేని వారు మాత్రం ఎందుకై నా మంచిదని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేడలను సందర్శించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏలూరులో సినీ బృందాలు, ప్రజాప్రతినిధుల సందర్శనలు బృందాలుగా అమ్మవార్లకు సారెల సమర్పణ కమిటీల్లో పోటీ వాతావరణం -
మా భూముల కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
ఏలూరు (టూటౌన్): మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ మా భూములను మాత్రం నావీ ఆయుధ కర్మాగారానికి ఇచ్చేది లేదంటూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కెట్ నగరం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలోని బర్కెట్నగరం ప్రాంతంలోని 1,166 ఎకరాల్లో నావీ ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దారుణమన్నారు. దీని వల్ల ఐదు గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తామంతా జీవనోపాఽధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కనీసం రైతుల అనుమతి తీసుకోకుండా, గ్రామసభలు నిర్వహించకుండా భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం దుర్మార్గమన్నారు. భూములను ఇచ్చేందుకు తామెవరికీ ఇష్టం లేదని స్పష్టం చేశారు. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్‌ను కోరారు. తమకు న్యాయం చేయకపోతే ఎంతటి పోరాటానికై నా సిద్ధమన్నారు. -
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
భీమవరం: భీమవరం త్యాగరాజ భవనంలో త్యాగరాజ స్వామి 107వ ఆరాధనోత్సవంలో భాగంగా సోమవారం చైన్నెకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు పతంగి బ్రదర్స్ గాత్ర కచేరి ఆకట్టుకుంది. ముందుగా త్యాగరాజ ఆరాధనోత్సవాల అధ్యక్షుడు ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు, గౌరవాధ్యక్షుడు గంధం విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షుడు గన్నబత్తుల శ్రీనివాసరావు, ఎన్ఆర్ కే రాజులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ధాత్రే ఎస్ పతంగి, ధ్రువ ఎస్ పతంగి ఆలపించిన త్యాగరాజ కృతులు, అన్నమయ్య పదాలు అలరించాయి. కారుమూరి ఆదిత్య, చెరుకువాడ వెంకట్రామయ్య, కారుమూరి నరసింహమూర్తి, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
108 ఉద్యోగుల సమ్మె సైరన్
భీమవరం(ప్రకాశం చౌక్): కుయ్.. కుయ్.. అంటూ ఆపదలో ఉన్న వారి చెంతకు నిమిషాల్లో చేరి ప్రాణాలు రక్షించే 108 అంబులెన్స్ సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం 108 వాహన ఉద్యోగులు నెలలు తరబడి ఎదురుచూస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతనెల 25 వరకు ఎదురుచూసిన ఉద్యోగులు పోరాటబాట పట్టారు. ఆరోగ్యశ్రీ లేబర్ కమిషనర్‌కు గతనెల 26న సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. అలాగే సమస్యలతో కూడిన 18 డిమాండ్లను పొందుపర్చారు. అయితే సమస్యల పరిష్కారానికి చ ర్చలు జరుగుతున్నా సఫలం కాలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 108 వాహన సిబ్బంది మొత్తం 203 మంది పనిచేస్తున్నారు. డిమాండ్లు ● ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.4 వేలల్లో రూ.2 వేలు మాత్రమే పెంచి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్ ఎఫ్పీ ప్రకారం ఈపీఎఫ్ఓ యాజయాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని చెప్పినా ఇప్పటికీ పట్టించుకోలేదు. ● గత సర్వీసు ప్రొవైడర్ ఇప్పటికీ పుల్, ఫైనల్ సెటిల్మెంట్ చేయకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. ● పోలీస్ ఎఫ్ఐఆర్ ఉందని, ఫీల్డ్ విజిట్‌లో పలురకాల పనిష్మెంట్ల పేరుతో భవ్య సంస్థ ఉద్యోగుల విధులను నిలుపుదల చేయడం లేదా టెర్మినేషన్ చేయడం చేస్తోంది. ఇలా టెర్మినేట్ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ● ఉద్యోగులను తొలగించకుండా మెరుగైన ట్రైనింగ్ ఇవ్వాలి. ● భవ్య సంస్థ వచ్చి 7 నెలలు పూర్తయినా ఏ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోవడం, జీతాలపై స్పష్టత లేకపోవడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. ● 5 నుంచి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వెంటనే ఆటోమెటిక్ శ్లాబ్ అప్‌గ్రేడ్ చేయాలి. ● భవ్య సంస్థ పనిష్మెంట్ కాలాన్ని చూపుతూ జీతాన్ని తగ్గించడం మానాలి. శ్లాబ్‌కు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి. ● గత సర్వీస్ ప్రొవైడర్ రిలీవింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. గతంలో మాదిరిగా షిఫ్ట్‌కు రూ.200 చెల్లించాలి. ● కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగా ఫెస్టివల్ హాలిడేస్ ప్రయోజనాలు అందించాలి. ● సిబ్బంది నియామకం చేపట్టాలి. ● వాహనాల మరమ్మతులకు జిల్లాకు ఒక గ్యారేజీ ఉండటంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలి. ● వాహనం మైనర్ రిపేర్‌కు గురైతే ఆ ఖర్చులను సిబ్బంది భరించాలని అధికారులు చెబుతున్నారు. సంస్థ ఆ ఖర్చులు భరించేలా చర్యలు తీసుకోవాలి. ● రోజుకు 12 గంటల పని ఒత్తిడితో కూడకుందని, 8 గంటల పనివిధానం అమలు చేయాలి. ● వాహనాలు నిలుపు ప్రదేశంలో షెల్టర్ లేదని, వాహనాల క్లీనింగ్లకు, ఉద్యోగులకు వాష్‌రూంలు ఏర్పాటు చేయాలి. ● బ్రేక్ డౌన్ అయిన వాహన సిబ్బందికి అటెండెన్స్ ఇవ్వాలి. ● సంస్థ సీపీఆర్ ఫోన్లు ఇవ్వడం వల్ల మొబైల్ డేటా లేకపోవడంతో అవాంతరాలు ఏర్పడుతున్నా యి. ప్రతి వాహనానికీ డేటాతో కూడిన ఆండ్రాయిడ్ ఫోన్లు అందించాలి. ● ఐఎఫ్‌టీ కేసుల విషయంలో సరైన గైడెన్స్ రూపొందించి మెడికల్ ఆఫీసర్లకు, 108 సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. ఉమ్మడి జిల్లాలో 108 ఉద్యోగులు జిల్లా మేనేజర్ 1 సూపర్వైజర్లు 2 పైలెట్లు 90 ఈఎంటీలు 110 కుయ్.. కుయ్.. కష్టాలేనోయ్! సమస్యల పరిష్కారానికి నోటీసు 18 డిమాండ్ల సాధనే లక్ష్యం ప్రభుత్వం స్పందించకుంటే 12 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి.. ఉమ్మడి జిల్లాలో నిలిచిపోనున్న సేవలు -
విధుల్లో అలసత్వం సరికాదు
ఏలూరు టౌన్: పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, విధుల్లో అలసత్వం సరికాదని జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా 41 ఫిర్యా దులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజలు తమ సమీపంలోని డీఎస్పీ, సీఐ కార్యాలయాలకు వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఆన్లైన్లో మీకోసం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్లోనూ సంప్రదించవచ్చన్నారు. ప్రజలు సైబ ర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సత్యసాయి సేవా సంఘం స భ్యులు బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు. -
పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు
మండవల్లి: సంక్రాంతి పండుగకు ఎవరూ కోడి పందేలు, పేకాట నిర్వహించవద్దని, పేకాట నిర్వాహకులకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఎస్ఐ సీహెచ్ఎస్ రామచంద్రరావు అన్నారు. శ్రీ నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో కోడి పందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలపై సోమవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని పేర్కొన్నారు. నూజివీడు: ఆలిండియా సాఫ్ట్‌బాల్ ఇంటర్ యూనివర్శిటీ పోటీలకు ట్రిపుల్ ఐటీ బాల బాలికల జట్లను ఎంపిక చేశారు. జట్టులో నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన మేఘన, అమృత, భాగ్యశ్రీ, తేజస్విని, దివ్య, సంధ్యారాణి ఎంపికయ్యారు. బాలుర జట్టుకు గణేష్, రామ్ ప్రసాద్, రాంబాబు, పరమేష్, రాజేష్, లోవరాజు, కోటిరెడ్డి ఎంపికయ్యారు. బాలుర జట్టు వచ్చే నెల 1 నుంచి 5 వరకు మహారాష్ట్రలో నిర్వహించే పోటీలకు హాజరుకానున్నారు. బాలికల జట్టు 6 నుంచి 10 వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. హ్యాండ్‌బాల్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ పోటీల కోసం జ్ఞానేంద్ర, రాజు ఎంపికయ్యారు. భీమవరం: పట్టణంలోని హన్సీ కల్యాణ మండపంలో చీరల ఎబ్జిబిషన్లో చీరలు దొంగతనం చేసిన నలుగురు మహిళలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. సోమవారం టూటౌన్ పోలీసుస్టేషన్లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో ఈ నెల 3న చీరల ఎగ్జిబిషన్ ఏర్పాటుచేయగా 4న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన మేడారపు రజనీ, పొన్న చుక్కమ్మ, పొన్నూరు మల్లి, మేడారపు లక్ష్మి ఎగ్జిబిషన్ తిలకించడానికి వచ్చి సుమారు రూ.80 వేలు చీరలను దొంగిలించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా నిందితులను గొల్లవానితిప్ప రోడ్డులో సోమవారం అరెస్ట్ చేసి వారి నుంచి చీరలను స్వాధీనం చేసుకున్నారు. పోలవరం రూరల్: ఈ నెల 7న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రానున్నారని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. దీనికి సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి ఆమె సోమవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. భీమవరం: భీమవరంలో బుధవారం రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. ఆగి ఉన్న మినీ లారీని మరో లారీ ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం బలుసుమూడి ప్రాంతంలోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం దింపేందుకు మినీ లారీ ఆగింది. ఆ సమయంలో వెనకనుంచి వస్తున్న మరో లారీ ఆ లారీని ఢీకొంది. ఆగి ఉన్న మినీలారీ వేగంగా వెళ్లి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని, రోడ్డు మార్జిన్లో దిగబడి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
వీరవాసరం: కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. 25 జిల్లాల నుంచి జట్లు తలపడ్డాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను తిలకించారు. ఈ పోటీల్లో కృష్ణా, ఎన్టీఆర్, అనంతపురం, విజయనగరం జిల్లా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. తూర్పుగోదావరి– కర్నూలు జట్ల మధ్య జరిగిన పోటీలో కర్నూలు జట్టు విజయం సాధించింది. కాకినాడ– ఏలూరు జట్ల మధ్య పోటీలో కాకినాడ, పశ్చిమగోదావరి– తిరుపతి మధ్య పోటీలో పశ్చమ గోదావరి జట్టు విజయం సాధించింది. విశాఖపట్నం–అన్నమయ్య జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో అన్నమయ్య జట్లు విజయం సాధించింది. గుంటూరు– పల్నాడు జిల్లా మధ్య పోటీలో పల్నాడు, శ్రీకాకుళం– కడప మధ్య పోటీలో శ్రీకాకుళం విజయం సాధించారు. సత్య సాయి జిల్లాపై కృష్ణ, తూర్పుగోదావరిపై అనంతపురం, ఏలూరుపై పశ్చిమ గోదావరి, తిరుపతిపై కాకినాడ జట్లు గెలుపొందాయి. నంద్యాలపై పల్నాడు జట్టు, కడపపై బాపట్ల, సత్యసాయిపై నెల్లూరు విజయం సాధించింది. కర్నూలుపై అనంతపురం, ఏలూరుపై తిరుపతి, నంద్యాలపై గుంటూరు, చిత్తూరుపై ఎన్టీఆర్ జిల్లా విజయం సాధించింది. విజయనగరం– ప్రకాశం జట్ల మధ్య జరిగిన పోటీల్లో విజయనగరం 18 పాయింట్లతో, నెల్లూరు–కృష్ణా మ్యాచ్‌లో కృష్ణా జట్టు 32 పాయింట్లతో విజయం సాధించింది. -
స్వర్ణోత్సవ సంబరాలకు ఎస్వీకేపీ సిద్ధం
పెనుగొండ: మెరుగైన విద్యతో పేరెన్నికగన్న ఎస్వీకేపీ విద్యా సంస్థలు స్వర్ణత్సోవ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. పెనుగొండలో 1974లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. దీని కోసం కళాశాలలో దేశ విదేశాల్లో స్థిరపడిన విద్యార్ధులు తరలిరానున్నారు. ఈ కళాశాలను డాక్టర్ కేఎస్ రాజు, 8 మంది సభ్యులతో ప్రారంభించారు. 1974లో కేవలం నాలుగు కోర్సులతో ప్రారంభమై, 1976లో జాతీయ సేవా పథకం, 1978లో క్రీడా విభాగం, 1984లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, 1987లో బీఎస్సీ కంప్యూటర్స్ ప్రారంభించారు. 1992లోనే ఎంసీఏ కోర్సు స్థాపించి, ఎందరో సాఫ్ట్వేర్ ఇంజినీర్లను తయారుచేసింది. సంబరాలకు 5 వేలకు పైగా పూర్వ విద్యార్థులు హజరవుతున్నారని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ కే రామచంద్రరాజు తెలిపారు. -
వైఎస్సార్సీపీ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కక్ష గట్టి దాడులు చేస్తే సహించేది లేదని, మా కార్యకర్తలకు ఏమైనా జరిగితే దేనికై నా సిద్ధమని, ఎక్కడికై నా వెళ్లేందుకు వెనుకాడబోమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మండలం అంబర్‌పేట గ్రామంలో దళితులైన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కూరపాటి నాగభూషణంపై కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకునేలా వేధించడం దుర్మార్గమన్నారు. కూటమి నేతల భూదందాలు అధికారులకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఏలూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాగభూషణాన్ని సోమవారం వాసుబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నా రు. పార్టీ అండగా ఉంటుందని నాగభూషణానికి భ రోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగభూషణం 40 ఏళ్ల క్రితం ముగ్గురు అన్నదమ్ముల వద్ద 60 సెంట్ల భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడిందన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావటంతో స్థానిక టీడీపీ, జనసేన నేతలు టార్గెట్ చేశారని విమర్శించారు. అంబర్‌పేటలో ఏకంగా 100 ఎకరాల పోరంబోకు భూమి ఉందని, క్వారీలు కూటమి నేతలు, భూస్వాముల స్వాధీనంలో ఉన్నాయని, అధికారులు వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు చెందిన పెద్ద రైతులు పలు ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని, అయితే దళితుడైన నాగభూషణం కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మాత్రమే ప్రభుత్వ అధికారులు అలజడులు సృష్టించటం, లాక్కునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని వాసుబాబు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు -
ఏపీఎన్జీజీఓ సంఘ కార్యవర్గం ఏకగ్రీవం
ఏలూరు(మెట్రో): ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఎన్నికలు నిర్వహించగా ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవమైందని, మొత్తం 17 మంది ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి కె.శరత్‌బాబు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా చోడగిరి శ్రీనివాసరావు (జలవనరుల శాఖ), సహాధ్యక్షుడిగా నోరి శ్రీనివాసరావు (జలవనరులు) , ఉపాధ్యక్షులుగా ఎం.ఫణికుమార్ (పశు సంవర్ధక), ఏవీవీయల్ నరసింహారావు (మున్సిపల్), బి.లక్ష్మీపతి (రాష్ట్ర ఆడిట్), పూడి శ్రీనివాస్ (బీసీ వెల్ఫేర్), ఎండీ రెహమాన్ (సహకార), ఉపాధ్యక్షురాలి గా ఎం.లీలారాణి ఎన్నికయ్యారు. అలాగే సెకండరీ హెల్త్ కార్యదర్శిగా నెరుసు వెంకటరామారావు (వైద్య ఆరోగ్య), కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.నరేంద్ర బాబు (వైద్య ఆరోగ్య), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సాంబశివరావు (పబ్లిక్ హెల్త్), ఎండీ ఖాదర్ బేగ్ (వ్యవసాయ), కె.ఉమామహేశ్వరరావు (వైద్యారోగ్య), కె.కనికరాజు (పంచాయతీరాజ్), ఎంవీఎన్ఎల్ తులసి (వైద్యారోగ్యశాఖ), సంయుక్త కార్యదర్శిగా (మహిళ) ఎన్.ఝాన్సీ లక్ష్మీబాయి (బీసీ వెల్ఫేర్), కోశాధికారిగా వి.శ్రీనివాసరావు (స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కె.శరత్‌బాబు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.రంజిత్‌నాయుడు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల సభ్యులు పాల్గొన్నారు. -
ముద్రా రుణమంటూ సైబర్ మోసం
మిర్చికి కొత్త క్రేజ్ వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామంలో ఓ యువ రైతు సాగు చేసిన రంగురంగుల మిర్చి ఆకట్టుకుంటోంది. మంచి దిగుబడి వచ్చింది. 8లో uరూ.2.50 లక్షలకు టోకరా తణుకు అర్బన్: తణుకులో ముద్రా రుణం మంజూరైందని వచ్చిన ఫోన్‌కాల్‌కు ఆశపడి ఓ మహిళ రూ.2.50 లక్షల ను సైబర్ నేరగాళ్లకు స మర్పించుకున్న వ్యవహారం వెలుగులోకి వ చ్చింది. వివరాల్లోకి వెళితే.. తణుకు పాత పోలీస్‌స్టేషన్ వీధిలో సిద్ధార్థ కర్రీ పాయింట్ (పంతులు కర్రీ పాయింట్) ద్వారా ఉపాధి పొందుతున్న మహిళ సూరికుర్చి లక్ష్మికి కొంతకాలం క్రితం వచ్చిన ఫోన్ కాల్లో మీకు రూ.5 లక్షలు ముద్ర లోన్ మంజూరైనట్లు సైబర్ నేరగాడు నమ్మించాడు. తాను హైదరాబాద్ బేగంపేటలోని ఆఫీసులో ఉంటానని తన పేరు అరు ణ్గా పరిచయం చేసుకున్నాడు. రుణం కావాలంటే ముందుగా ఫీజు, ఇతర రుసుముల కింద రూ.50 వేలు చెల్లించాలని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన లక్ష్మి పలు దఫాలుగా రూ.2.50 లక్షలు ఆన్లైన్ పేమెంట్ యాప్‌ల రూపంలో చెల్లించింది. త్వరలో రూ.7.50 లక్షలు ఇస్తామని చెప్పి చివరగా మరో రూ.50 వేలు చెల్లించాలనడంతో ఆమె నిరాకరించింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సైబర్ మోసగాడు లిఫ్ట్ చేయకపోవడంతో బాధితురాలు హైదరాబాద్ వెళ్లినా అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేదు. దీంతో ఆమె ఆదివారం తణుకులో పోలీసులను ఆశ్రయించింది. -
ఆహ్లాదం.. ఆటపాక పక్షుల కేంద్రం
కై కలూరు: పెద్ద పండగ సంక్రాంతి కళ ఆటపాక పక్షుల విహార కేంద్రంలో కనిపిస్తోంది. నూతన ఏడాదికి ఇటీవల సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు పక్షుల కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. విదేశీ పక్షుల రాకకు అనువైన శీతాకాలం కావడంతో ఇప్పటికే పక్షులు ఆటపాకలో కనువిందు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆదివారం పలు జిల్లాల నుంచి పర్యాటకులు పక్షుల వీక్షణకు వచ్చారు. బోటు షికారు చేస్తూ పెలికాన్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి తిలకించారు. అదే విధంగా సమీప ఈఈసీ కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంలో పక్షుల విశేషాలను తెలుసుకున్నారు. సమీప చిల్డ్రన్ పార్కులో చిన్నారులు ఆటలాడుకున్నారు. అటవీశాఖ ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజేష్ కొల్లేరు పక్షుల విశేషాలు, నైసర్గిక స్వరూపం వంటి విషయాలను పర్యాటకులకు వివరించారు. ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో కోడి పందేల స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 17 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 31,630 నగదు, కోడి పుంజు, 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. జంగారెడ్డిగూడెం: కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన నాగరాజు అతని భార్యతో విడిపోయి ఉంటున్నాడు. భార్య జంగారెడ్డిగూడెంలో తన 8 ఏళ్ల కూతురితో జీవిస్తోంది. శనివారం రాత్రి నాగరాజు భార్య ఇంటికి వెళ్లి భార్యను దూషించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తీరని చింత
బుట్టాయగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంత వరప్రదాయినిగా ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పలనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పథకం ప్రారంభమై 17 ఏళ్లు కావొస్తున్నా పలు దశల్లోనే పనులు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కి 19 నెలలు కావస్తున్నా కనీసం పనులను కన్నెత్తి చూడటం లేదని రైతులు అంటున్నారు. 2009లో శ్రీకారం : 2009లో అప్పటి సీఎం వైఎస్సార్ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో సుమారు రూ.1,708 కోట్ల అంచనాలతో చేపట్టారు. మొదట్లో పనులు వేగంగా జరిగినా వైఎస్సార్ అకాల మరణంలో మందగించాయి. 2017లో టీడీపీ హయాంలో రూ.4,909 కోట్లతో ఫేజ్–2 పనులు చేపట్టారు. అయితే అవి కూడా కొంత మేర జరిగి నిలిచిపోయాయి. 2019లో వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బకాయిల చెల్లింపు, పనులను వేగవంతం చేశారు. అయితే కోవిడ్ తర్వాత పనులు ముందుకు సాగలేదు. అలాగే భూసేకరణ సమస్యలతో కూడా పనులు ముందుకు సాగని పరిస్థితి. జగన్ హయాంలో నాబార్డు నుంచి పథకానికి రూ.1,930 కోట్లు మంజూరు చేశారు. 33 మండలాలలకు ప్రయోజనం.. పథకం పూర్తయితే ఉమ్మడి పశ్చిమగోదావరితోపాటు కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 33 మండలాలు, 410 గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఉమ్మడి పశ్చిమలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని 2.80 లక్షల ఎకరాలకు మొత్తం 4.80 లక్షల ఎకరాలకు నీరందుతుంది. గోదావరి నుంచి 6,870 క్యూసెక్కుల నీరు చొప్పున 90 రోజులపాటు 53.50 టీఎంసీల నీటిని ఎత్తిపోయొచ్చని అధికారులు చెబుతున్నారు. జల్లేరు.. అదే తీరు : బుట్టాయగూడెం–జీలుగుమిల్లి మండలాల మధ్య సుమారు రూ.470 కోట్ల వ్యయంతో జల్లేరు రిజర్వాయర్ పనులను చేపట్టారు. ఇక్కడ 14 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఇక్కడ నుంచి సాగర్ ఎడమ కాల్వ కింద ఉండే 2.80 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వయోడక్ నిర్మాణం ప్రాంతం పిచ్చిమొక్కలతో కనిపిస్తుంది. అలాగే కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతలు, జల్లేరు రిజర్వాయర్ పనుల పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. నిలిచిన చింతలపూడి ఎత్తిపోతల కాలువ పనులు కన్నెత్తి చూడని చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంలో రూ.1,931 కోట్ల మంజూరు జల్లేరు రిజర్వాయర్ పనులలోనూ అలసత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల పూర్తికి ప్రభుత్వం కృషి చేయాలి. ఎన్నికలకు ముందు పలుమార్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా ఎందుకు పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా దీనిపై దృష్టి పెట్టాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం చింతలపూడి పథకం పూర్తయితే మాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇటు సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తాయి. భూగర్భజలాలు పెరగడం వల్ల పంటలకు పుష్కలంగా నీరు అందుతుంది. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. – కోర్సా బాలకృష్ణ, గిరిజన రైతు, బెడదనూరు -
రామేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
పెనుమంట్ర: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు దంపతులు ఆదివారం సాయంత్రం పెనుమంట్ర మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన నత్త రామేశ్వరంలోని ఉమా రామలింగేశ్వర స్వామిని, జుత్తిగలో సోమేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెల్ల ధనుంజయ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ద్వారకాతిరుమల : గోవిందా.. గోవిందా.. అంటూ శ్రీవారి భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో క్షేత్ర పరిసరాలు ఆదివారం మార్మోగాయి. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట, ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపంలో భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పెదవేగి: మహిమ గల తల్లి శ్రీ రాట్నాలమ్మకు భక్తులు విశేష రీతిలో పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి దేవస్థానానికి విచ్చేసిన భక్తులు వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుం వల్ల రూ.18,100, విరాళంపై రూ.4,622, లడ్డూ ప్రసాదంపై రూ.9,975, పులిహోర ప్రసాదంపై రూ.690, ఫొటోల అమ్మకంపై రూ.1,890, మొత్తం రూ.35,277 ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్ కుమార్ తెలిపారు. కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మహిళలు అమ్మకు పాలపొంగళ్లు సమర్పించారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క అదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గధుల అద్దెలు, చిత్రపఠాలు అమ్మకం, వాహన పూజలు, విరాళాలు కలపి రూ.19,426 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఏలూరు (మెట్రో) : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏలూరులో జరిగాయి. శ్రీధర్ రాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా హెచ్.గోపాలకృష్ణ, ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. -
జగన్ కటౌట్ చూసి కూటమికి కంగారు
● అందుకే అక్రమ అరెస్ట్‌లు ● మాజీ మంత్రి వనిత మండిపాటు ద్వారకాతిరుమల: కూటమి నాయకులు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కటౌట్‌ను చూసి.. కంగారు పడే పరిస్థితికి వచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఎద్దేవా చేశారు. గత నెల 21న జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా రామసింగవరంలో వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటూ గ్రామానికి చెందిన యువకులు మానుకొండ హిమకుమార్, మానుకొండ రాజ్‌కుమార్, బిరుదుగడ్డ రాజు, కనికెల్లి కిషోర్, కనికెల్లి ఏసులపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు. ఈ సందర్భంగా వనిత ఆదివారం బాధిత యువకుల ఇళ్లకు వెళ్లి వారికి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తానున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతటా జరిగిన విధంగానే గోపాలపురం నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగాయన్నారు. వీటిని చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు. దీంతో కటౌట్లలో ఏ తప్పులున్నాయని వెతుక్కునే పరిస్థితికి కూటమి నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు. ఒక సినిమా డైలాగ్‌ను వాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఏవైతే హామీలిచ్చారో వాటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేదని తానేటి వనిత చెప్పారు. దీంతో ప్రజలంతా వారిని తిరస్కరిస్తున్నారన్నారు. దా నిని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి, జగనన్న పుట్టినరోజును కూ డా రాజకీయానికి వాడుకున్నారని విమర్శించారు. ఈ దుస్థితి మన రాష్ట్రంలో, మన రాజకీయాల్లో మాత్రమే కనిపించడం దౌర్భాగ్యమన్నారు. మేకను నరికిన దానికి జంతు బలి అంటూ రచ్చ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బలిచ్చినవి వారికి కనిపించలేదా అని ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, ఎప్పుడో పెట్టిన పోస్టులను వెతికి పట్టుకుని మరీ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మన రాష్ట్రంలో మాత్రమే చూశామన్నారు. వైఎస్సార్సీపీని అణగదొక్కడమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తోందని మండిపడ్డారు. అందుకే ప్రజ లు కూటమి ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని వనిత భరోసా ఇచ్చారు. ఆమె వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
మిర్చికి కొత్త క్రేజ్
వేలేరుపాడులో గుంటూరు కారం ఘాటు వేలేరుపాడు : సాధారణంగా ఎరుపు రంగులో ఉన్న వివిధ రకాల మిర్చిని రైతులు సాగుచేస్తుంటారు. కానీ ఆ యువ రైతు వైరెటీగా ఉంటుందని పసుపు పచ్చ మిర్చీని సాగు చేశాడు. దీంతో ఆ యువ రైతు పంట పండింది. యూట్యూబ్‌లో చూసి, గుంటూరు నుంచి తెప్పించి పచ్చ మిర్చి రకం విత్తనాలు నాటిన ఆ రైతుకు మంచి ఆదాయం వచ్చింది. అరుదుగా పండించే ఈ పసుపు పచ్చ మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఆ రైతు పంట పండింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామానికి చెందిన బుడిపిటి విక్రమ్ అనే యువ రైతు మొత్తం ఐదు ఎకరాల మిర్చి పంట సాగు చేశాడు. ఇందులో పసుపు పచ్చ రకం మిర్చి ఒక ఎకరం సాగు చేయగా, మిగతా నాలుగు ఎకరాల్లో నంబర్ 5 రకం ఎర్ర మిర్చి సాగు చేశాడు. పచ్చ మిర్చికి మంచి డిమాండ్ ఉండడంతో.. యూ ట్యూబ్‌లో చూసిన విక్రమ్ గుంటూరు నుంచి యువీ, నరింగ ఎఫ్–1 హైబ్రేడ్ చిల్లీ విత్తనాలను తెప్పించి ఎకరం సాగు చేశాడు. ఎకరానికి లక్షా 15 వేల వరకు పెట్టుబడి పెట్టగా 25 క్వింటాళ్ళ పసుపు మిర్చి దిగుబడి వచ్చింది. క్వింటా ధర గుంటూరు మార్కెట్లో ప్రస్తుతం రూ.40 వేలు పలుకుతుండగా, గత ఏడాది క్వింటా ధర రూ.65 వేల వరకు పలికింది. పసుపు రంగు మిర్చి గుంటూరు మార్కెట్ నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. దేశ, విదేశాల్లో వివిధ వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఈ మిర్చిని వివిధ కంపెనీలు చిన్న పిల్లలు తినే బింగో, లేస్, తదితర స్నాక్స్‌లో వినియోగిస్తున్నారు, రంగుల తయారీకి కూడా వాడుతున్నారు. యూట్యూబ్‌లో ఎల్లో రకం మిర్చి సాగు లాభసాటిగా ఉంటుందని చూశాను. ఈ ప్రాంతంలో ఈ రకం ఎవరూ సాగు చేయలేదు. వైరెటీ ఉంటుందని ఎకరం వేశాను. ఎకరాకు రూ.1.15 లక్షలు పెట్టుబడి పెడితే రూ.13 లక్షల వరకు లాభం వచ్చింది. నల్ల రేగడి నేల కావడంతో మంచి దిగుబడి వచ్చింది. -
వైభవంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేష పుష్పమాలికలతో అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం తిరువీధి సేవకు పయనమైంది. అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారు క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగారు. ప్రతి ఇంటి ముంగిట భక్తులు శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
బకాయిలు విడుదల చేయాలి
చింతలపూడి: ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల జీతాలు, 12 నెలల పీఎఫ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తొర్లపాటి బాబు డిమాండ్ చేశారు. బకాయిల విడుదల కోరుతూ ఐదు రోజులుగా కార్మికులు నిరసన తెలియజేస్తున్నా వెంటనే స్పందించకుంటే డీసీహెచ్ఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పాత కాంట్రాక్టు ముగిసి కొత్త కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించే సమయంలో కా ర్మికులకు రావాల్సిన జీతాలను చెల్లించకపోగా, ఆందోళన చేస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే వీరి జీతాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మంగళవారం నుంచి జిల్లా అధికారుల కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగుతామన్నారు.ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టి.మరియ మ్మ, కుమారి, వాణి తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల తిప్పలు.. ఎమ్మెల్యే డప్పులు
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో గతనెల 30న జరిగిన ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లన్నీ తానే చేయించానని, భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలగలేదని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గొప్పలు చెప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆరోజు భక్తులు పడిన ఇబ్బందుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్లజర్ల మండలంలోని ప్రకాశరావుపాలెంలో గత శనివారం జరిగిన టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతేడాది ముక్కోటి ఏర్పాట్లను తానే దగ్గరుండి పర్యవేక్షించానని, అప్పుడు 30 నుంచి 35 వేల మంది భక్తులు వచ్చారని, ఈ సారి రెట్టింపు అవుతుందని అనుమానం కలిగిందన్నారు. అందుకే కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేయించానన్నారు. పెద్ద తిరుపతిలో ముక్కోటి మరుసటి రోజు 64 వేల మంది భక్తులు దర్శిస్తే, ద్వారకాతిరుమలలో ముక్కోటి నాడు 60 వేల మంది భక్తులు దర్శించారన్నారు. ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ, అల్పాహారం ఇవ్వాలని రాత్రి 9 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వెంటపడుతూ దేవస్థానం వారికి, పోలీసులకు డైరెక్షన్ ఇచ్చానన్నారు. కనీసం మంచినీరు కూడా అందలేదని, టాయిలెట్స్ లేవని, రూ. 500 లు టికెట్లు తీసుకుని నానా తిప్పలు పడుతున్నామని, ఇప్పటికే 4 గంటల సమయం పట్టిందని, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, అధికారులపై భక్తులు మండిపడ్డారు. టీడీపీ నాయకుల వల్లే ఫెయిల్ వీఐపీ గేట్ నుంచి, ధ్వజస్తంభం మీదుగా వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులను మాత్రమే పంపుతామని కలెక్టర్, ఎస్పీలకు వివరించారు. ముక్కోటి నాడు కొందరు టీడీపీ నాయకులు తమ కుటుంబ సభ్యులను, పార్టీకి చెందిన వారిని ఆ గేటు నుంచి లోపలికి పంపారు. దేవస్థానం అధికారులు గేటు తాళాలను సైతం నాయకులకే అప్పగించినట్టు తెలుస్తోంది. ధ్వజస్తంభం వద్ద రద్దీ పెరిగి, రూ. 500 టికెట్లు తీసుకున్న భక్తులు, గోవింద స్వాములు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులంతా అష్టకష్టాలు పడ్డారు. వీఐపీ గేటు లోంచి సుమారు 5 వేల మందికి పైగా వెళ్లినట్టు తెలుస్తోంది. ముక్కోటి ఏర్పాట్లపై గోపాలపురం ఎమ్మెల్యే గొప్పలు 60 వేల మంది శ్రీవారిని దర్శించారని, అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రకటన ఆ రోజు సౌకర్యాలు అందక ఇబ్బందులు పడ్డ భక్తులు -
20 కాసుల బంగారం చోరీ
తణుకు అర్బన్: ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ జరిగిన ఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దువ్వ సంతమార్కెట్ ప్రాంతంలోని భవనంలో నివసిస్తున్న సింహాద్రి సూర్య భగవాన్ నివాసంలోకి శనివారం రాత్రి దొంగలు ప్రవేశించి 20 కాసుల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. సూర్యభగవాన్ ఇంటి కింది భాగంలో మందుల దుకాణం, వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. వ్యాపారం ముగిసిన అనంతరం రాత్రి ఒంటిగంటకు తన భార్యతో కలిసి దుకాణం వెనుక ఉన్న బెడ్రూమ్లో నిద్రించారు. తెల్లవారుజామున 5 గంటలకు మందుల కోసం గ్రామస్తులు తలుపుకొట్టి నిద్రలేపగా మందుల దుకాణంలోకి వెళ్లాడు. క్యాష్ పెట్టె చిందరగా ఉండడంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్రూమ్లో ఉన్న బీరువా తలుపు తెరిచి ఉంది. చూడగా బంగారు ఆభరణాలు లేవని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చి తణుకు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. చోరీ ఘటనలో దువ్వ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చోరీ జరిగిన ఇంటిని తాడేపల్లిగూడెం డీఎస్పీ కె.విశ్వనాఽథ్ పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీం ఇంటి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దువ్వలో ప్రధానమైన సంతమార్కెట్ ప్రాంతం ఎంతో రద్దీగా ఉంటుంది. ఎటుచూసినా ఇళ్లు ఉన్నప్పటికీ ఇంట్లోకి చొరబడి చోరీ చేసి తీరు అనుమానాస్పదంగా మారింది. బంగారు ఆభరణాలు ఉన్న ప్రాంతంలోనే ఉన్న రూ.10ల నోట్ల కట్టలు తీసుకోకపోవడం గమనార్హం. బీరువాలో ఉన్న బ్యాంకు పుస్తకాలు ఇతర కాగితాలను సందులో గోడపై వదిలివెళ్లారు. రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్లకు గంతలు కట్టుకుని దీక్షలు
నూజివీడు: 8 ఏళ్లుగా జీతాలను పెంచడంలో ఆర్జీ యూకేటీ ఉన్నతాధికారులు చేస్తున్న జాప్యానికి నిరసనగా నూజివీడు ట్రిపుల్ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న ధర్మపోరాట దీక్ష ఆదివారం కొనసాగింది. 12వ రోజు వీరంతా కళ్లకు గంతలు కట్టుకుని దీక్ష చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.విజయకుమార్ దీక్షా శిబిరం వద్దకు రాగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యపై నివేదికను ఇవ్వమని అడిగినా మూడు నెలలుగా ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. జీతాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, దీక్షను విరమించాలని వైస్ చాన్సలర్ కోరారు. వేతనాల పెంపుపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసు కునే వరకూ ఆందోళనను విరమించేది లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్లు తేల్చిచెప్పారు. ఏదో ఒక హామీతో రాకుండా చాన్సలర్‌తో చర్చిస్తానని చెప్పడం తమను మభ్యపెట్టడమే అవుతుందని, ఇలాంటి దాటవేత ధోరణితోనే తమకు అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు. అనంతరం విలేకరులు అడుగుతున్నా మాట్లాడకుండా వీసీ విజయకుమార్ క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. దీక్షల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీవీ లక్ష్మణరావు, బొత్స శ్రీనివాసరావు, లంకపల్లి రాజేష్, వెంకటేశ్వర్లు, సామినేని భవాని, రచనా గోస్వామి, యూ విజయశ్రీ, దీప్తి సాహూ పాల్గొన్నారు. -
అవును.. ఇది పంట కాలువే!
ఉండి: నిండా గుర్రపుడెక్క, తూడుతో నిండి అర్తమూరు వెళ్లే పంట కాలువ అ ధ్వానంగా మారింది. ఒక వైపు గట్లు లేకపోవడంతో పల్లపు ప్రాంతాలకు నీరు వెళ్లిపోతోంది. దీంతో రైతులు సాగునీరు అందక అల్లాడుతున్నారు. ఎగువ ప్రాంతాలకు నీరు కావాలంటే రైతులు ఇంజిన్ల సాయంతో తోడుకోవాల్సిన పరిస్థితి. ఒక వైపు గట్టు లేకపోవడం, మరో వైపు తూడు, చెత్తతో నిండిపోవడంతో పాటు పూర్తిస్థాయిలో పూడిక తీసిన దాఖలాలు లేవు. దీంతోపాటు నీటి ప్రవాహం మందగించి పసర్లతో నిండిపోవడంతో అరకొర నీరు కూడా సాగుకు పనికిరావడం లేదని రైతులు అంటున్నారు. ఆక్వా చెరువుల మధ్య నుంచి ప్రవహించే పంట కాలువ కావడంతో నీటి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. రాత్రిళ్లు ఆక్వా వ్యర్థాలను ఈ కాలువలోకి వదులుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువ బాగుచేయించాలని కోరుతున్నారు. -
వెలివేశారంటూ ఆత్మహత్యాయత్నం
ముసునూరు: తన కుటుంబాన్ని వెలివేసినట్లు కుల పెద్దలు ప్రకటించడంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకారావు ఇటీవల నాటు సారా తయారీ, విక్రయాలు నిర్వహిస్తుండగా ఎకై ్సజ్ అధికారులు దాడులు చేసి పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత గ్రామంలోని తన సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు అతనిని పంచాయతీకి పిలిపించి, రూ.లక్ష జరిమానా విధించారని, కట్టలేమని బతిమాలినా వినిపించుకోలేదని జరిమానా చెల్లించకపోతే వెలివేస్తున్నామని ప్రకటించారని వీడియోలో పేర్కొన్నారు. తమ కులస్తులు ఎవరూ తమతో మాట్లాడకుండా ఉండాలని, తన తల్లిదండ్రులను కూడా బెదిరించారని, తమకు మంత్రి పార్థసారథి అండదండలున్నాయని ఏమీ చేయలేవని తనను బెదిరించారని వీడియోలో పేర్కొన్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పురుగుమందు డబ్బాతో సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై చెప్పారు. సీసీ కెమేరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. సారా తయారీ విక్రయాలు మానేయాలని హెచ్చరించామని తమ మాటను ధిక్కరించడంతో మిన్నకుండి పోయామని, వెలి వేయడం, కుల బహిష్కరణ చేయడం వంటి నిర్ణయాలు తాము చేయలేదని కుల పెద్దలు పేర్కొంటున్నారు. పురుగుల మందు డబ్బాతో కుటుంబం సెల్ఫీ వీడియో -
అందని సహకారం
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలందించడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీ) కీలకం. వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆయా సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఖజానాకు ఏమాత్రం భారం కాని చిన్నపాటి సమస్యల పరిష్కారానికి మనసొప్పడం లేదు. ఆయా సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ద్వారా మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. కంటితుడుపు చర్యలు ప్రకటనలతో సరిపెట్టడం తప్పించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో విసుగు చెందిన ఉద్యోగులు నెల రోజులుగా దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. దశల వారీగా ఆందోళనలు గతేడాది నవంబర్ 27న సహకార రంగంలో ఉన్న రెండు యూనియన్లు ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించాయి. దీనిలో భాగంగా గతనెల 6న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. 8న డీసీసీబీ బ్రాంచి ఆఫీసుల వద్ద ధర్నాలు చేశారు. 16న జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి వినతిపత్రాలు అందించారు. 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. 29న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కనీసం చర్చలకూ పిలవలేదు సహకార ఉద్యోగులు దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కనీసం ఉద్యోగులతో చర్చలు కూడా జరపలేదు. దీంతో సహకార ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలు మరింత ఉధృతం చేసేందుకు నిర్ణయించి సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలకు నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ దీక్షలను ఈనెల 26 వరకు కొనసాగించాలని కార్యాచరణ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన సహకార ఉద్యోగులు రోజుకు ఒక జిల్లా చొప్పున రిలే దీక్షల్లో పాల్గొనేలా ఆయా జిల్లాల నా యకులకు సూచించారు. ఈమేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులు ఈనెల 6న విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించే దీక్షల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. జీఓ నం.36ని అమలు చేసి ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి డీఎల్‌ఎస్‌ఎఫ్ ఏర్పాటుతో జీతభత్యాలు చెల్లించాలి. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2019, 2024 వేతన సవరణలు జరగాలి. అప్పటివరకూ మధ్యంతర భృతి ఇవ్వాలి. గ్రాట్యూటీ సీలింగ్ ఎత్తివేసి చట్టప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు అమలుచేయాలి. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇ న్సూరెన్స్ చేయించాలి. డ్యూ టు పద్దులను రద్దు చేయాలి. 2019 తరువాత సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. డీసీసీబీకి సహకార సంఘాలు చెల్లించిన షేరు ధనం 6 శాతానికి తగ్గకుండా డివిడెండ్ లేదా వడ్డీ సొసైటీలకు చెల్లించాలి. సమస్యలు పట్టవా? నెల రోజులుగా ఉద్యోగుల ఆందోళనలు అయినా ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కారు నేటి నుంచి రిలే దీక్షలకు పిలుపు నెల రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించి సోమవారం నుంచి రిలే దీక్షలకు పిలుపునిచ్చాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకూ వెనకాడబోం. – కేవీవీ సత్యనారాయణ, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
మీర్జాపురంలో ‘బరి’తెగింపు
నూజివీడు: నూజివీడు పేరు చెబితే.. మామిడి తోట లు, బాస్కెట్‌బాల్, చెడుగుడు పోటీలు గుర్తుకు వస్తా యి. అయితే ప్రస్తుతం పేకాట శిబిరాలు, గ్రావెల్ మా ఫియా గుర్తుకు వస్తుంది. దీనికితోడు సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల నిర్వహణకు అడ్డాగా మారనుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నూజివీడు ప్రాంతంలో జూదాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పండగ సాంప్రదాయం ముసుగులో కోడి పందేలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు నూజివీడు మండలం మీర్జాపురంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం : కోడి పందేలకు బాపులపాడు మండలం అంపాపురం, ఏలూరు స మీపంలోని కొప్పాక సరసన మీర్జాపురం చేరనుంది. ఇక్కడ భారీ బరి ఏర్పాటు చేయడంతో పాటు సోష ల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు పెట్టి ప్రచా రం నిర్వహిస్తున్నారు. ప్రధాన బరిని మూడు ఎకరా ల్లో సిద్ధం చేశారు. కోడి పందెం వేసేందుకు ఒక ప్లాట్‌ఫాం, పందెలను చూసేందుకు మూడు వైపులా గ్యాల రీ, మరోవైపు వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాపురం గ్రామ పరిధిలో నేషనల్ హైవే–216 హెచ్ నూజివీడు–హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారికి సమీపంలో మీర్జాపురం–బిళ్లనపల్లి రోడ్డులో ఈ భారీ బరి సిద్ధమవుతోంది. సంక్రాంతి సంబరాల పేరుతో ఇక్కడ ముసుగు పందేలతో పా టు రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.9 లక్షల చొప్పున రాత్రీపగలూ తేడా లేకుండా పందేలు వేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జూదగాళ్లు, కోడిపందేలు చూసేందుకు వచ్చే వారు నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరులోని హోటళ్లలో రూమ్‌లను బుక్ చేసుకున్నారు. రూ.కోట్లలో పందేలు మీర్జాపురంలో కోడి పందేలు కోట్లలో జరగనున్నాయి. మొదటి పందెం రూ.కోటి అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. బరి పందేంతో పాటు చూడటానికి వచ్చే వారు కూడా పెద్ద ఎత్తున పందేలు కాస్తారు. కోడి పందేలకు అనుబంధంగా పేకాట, గుండాట, ఇతర జూద క్రీడలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి జూదాలతో పేదల జేబులు గుల్లకావడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారో లేదో చూడాలి మరి. కోడి పందేల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు -
విరాళాలను దేవస్థానం ఖాతాలో జమ చేస్తాం
ఆగిరిపల్లి: రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి భక్తులు అందించే కానుకలకు దేవస్థానం తరపున రసీదు అందిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి సీహెచ్ సాయి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 29 వరకు వైభవంగా నిర్వహించునున్నట్లు తెలిపారు. 26న రథోత్సవం నిర్వహించునున్నట్లు తెలిపారు. అన్నదానానికి భక్తులు అందించే విరాళాలకు ఎలాంటి రసీదులు ఇవ్వమని కొంతమంది అంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి అపోహలు నమ్మవద్దని అన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం అన్నదానానికి భక్తులు అందించిన విరాళాలు రూ.6,24899 దేవస్థానం తరఫున ఉన్న బ్యాంక్ అకౌంట్లోనే జమ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తామని తెలిపారు. వేలేరుపాడు: 2024, 2025వ సంవత్సరంలో ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టిన చెరువులు, రహదారుల పనుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీలో బయటపడింది. శనివారం వేలేరుపాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రేపాకగొమ్ము సర్పంచ్ సోడే వెంకమ్మ అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. మొత్తం రూ.8 కోట్ల వ్యయంతో 520 పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొసీడింగ్ ఆఫీసర్‌గా ఉన్న నూజీవీడు ఏపీడీ శ్రీనివాసరావు వివిధ పనుల రికార్డులు పరిశీలించగా, రూ.26.31 లక్షల అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ పనులు ఎక్కడ చేపట్టారో చూపాలని ఏపీడీ సిబ్బందిని ప్రశ్నించగా, సరైన సమాధానం ఇవ్వకపోగా, గోదావరి వరదలకు కొట్టుకుపోయాయని సమాధానమిచ్చారు. దీనిపై ఏపీడీ పూర్తి విచారణకు ఆదేశించారు. ఫీల్డు అస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.22 వేల చొప్పున జరిమానా విధించారు. దుర్వినియోగం చేసిన సొమ్మును ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద రికవరీ చేయాలని ఆదేశించారు. పెదపాడు: మండలంలోని అప్పనవీడులో గత నెల 23న రెడ్డి జ్యోతి అనుమానస్పద రీతిలో మృతి చెందడంతో పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా భర్త అనిల్, మరో మహిళ పాకలపాటి జ్యోతిని అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చామని పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. -
కమ్మేసిన పొగమంచు
భీమడోలు: జాతీయ, రాష్ట్ర రహదారులను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరడంతో మంచు కురిసి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం 9 గంటలైన మంచు తెరలు వీడనే లేదు. భీమడోలు బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోయింది. రహదారులపై మంచు కమ్ముకోవడంతో రహదారులు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు. ఉదయం పనులకు వెళ్లే కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. వృద్ధులు, చిన్నపిల్లలు మంచులో తిరగవద్దని, తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
బతుకు చక్రం సాగేదెలా?
బుట్టాయగూడెం: సమాజంలో మనిషికి గౌరవం, హుందాతనం వచ్చేలా చేసేది అతను ధరించే దుస్తులే. ఆ దుస్తులకు మంచి రూపురేఖలతో సాధారణ గుడ్డను దుస్తులుగా తయారు చేయడంలో టైలరింగ్దే కీలకపాత్ర. అయితే టైలర్ బతుకు చక్రం అంధకారంగా మారింది. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో కుట్టు మిషన్ల చక్రం వేగం తగ్గింది. వివిధ డిజైన్లతో రెడీమేడ్ దుస్తులు సరసమైన ధరలకే లభించడంతో యువత వాటిపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీని ఫలితంగా టైలర్ల కుటుంబ పోషణ భారమై దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు రెడీమేడ్ దుస్తులపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో టైలర్స్ చేతుల్లో పనిలేక అనేక మంది రోడ్డున పడుతున్నారు. కొందరైతే ఈ పనిమానేసి వేరే పనుల్లో స్థిరపడుతున్నారు. 30 ఏళ్లపాటు టైలరింగ్ వృత్తిలో అనుభవం ఉన్న టైలర్లు ప్రస్తుతం చేసేందుకు పనిలేక ఇల్లు గడవక బడ్డీ కొట్లు ఏర్పాటు చేసుకుని సరుకులను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో 600కు పైగా టైలర్లు జిల్లాలో సుమారు 600కు పైగా టైలర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అత్యధికంగా 30 నుంచి 40 సంవత్సరాలు అనుభవం ఉన్న టైలర్లు ఉన్నారు. ఒకప్పుడు ఎలాంటి దుస్తులు కుట్టాలన్నా టైలర్లపైనే ఆధారపడవలసి వచ్చేది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పాఠశాలల పునఃప్రారంభం సమయాల్లో టైలర్లకు తీరికలేక రాత్రీ పగలు పనిచేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనుచూపుమేర కనిపించడంలేదని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడీమేడ్ దుస్తుల ప్రభావం గుదిబండలా మారింది. క్రిస్మస్, సంక్రాంతి పండుల్లో కుట్టేందుకు తమకు పనులు లేక మహిళల చీరల పాలు, పాత ప్యాంట్లు సైజులు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నామని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 600 మంది టైలర్ల పరిస్థితి ఇలానే ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రూ.10 వేల ఆర్థిక భరోసా: వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదికి రూ.10 వేల చొప్పున టైలర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేసేవారు. నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా టైలర్స్ డే రోజున టైలర్ల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇలా ఒక్కో టైలర్‌కు నాలుగేళ్లలో రూ.40 వేలు సొమ్ము బ్యాంకు ఖాతాలో జమయ్యేవి. ప్రస్తుతం పనులు లేక ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారంలేక తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని టైలర్లు కోరుతున్నారు. టైలర్లకు తగ్గిన గిరాకీ పండుగ రోజుల్లో పనులు లేక వెలవెలబోతున్న షాపులు ప్రత్యామ్నాయ పనుల వైపు చూపు వైఎస్సార్సీపీ పాలనలో ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం టైలర్ వృత్తినే నమ్ముకుని జీవనం సాగించే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో పనులు లేక టైలర్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. రాబోయే రోజుల్లో టైలర్లు కనుమయ్యే పరిస్థితి నెలకొంది. నేను 1982 నుంచి టైలర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం టైలర్లకు ఇటువంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు. ప్రభుత్వం టైలర్లను ఆదుకోవాలి. దొండపాటి గంగులు, టైలర్, బుట్టాయగూడెం ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం టైలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పండుగ రోజుల్లో కూడా పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. నేను గత 30 సంవత్సరాలుగా టైలరింగ్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఇద్దరు టైలర్లు పనిచేస్తున్నారు. వారికి పని చూపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. పండుగ రోజుల్లో సరైన పనులు లేక ముగ్గురం ఖాళీగా ఉంటున్నాము. గత వైఎస్సార్సీపీ పాలనలో మా బ్యాంక్ ఖాతాలో ఏడాదికి రూ. 10వేలు చొప్పున నాలుగేళ్లలో రూ. 40 వేలు అందించారు. షేక్ లాల్‌సాహెబ్, బాబూ టైలర్, బుట్టాయగూడెం -
తమ్ముడు కాకపోయినా తలకొరివి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను (45) అనారోగ్యంతో బాదపడుతూ శనివారం మృతి చెందాడు. బంధువులు ఉన్నా ఎవరింటికీ వెళ్లడు. పొరుగున ఉండే పతివాడ మావుళ్లమ్మను అక్కా అని పిలిచేవాడు. ఆ అనుబంధంతో ఆమె తలకొరివి పెట్టింది. తాను ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసి వయసు మీదపడడంతో మానేశానని.. శ్రీనును ఇంటి వద్దే పెట్టుకుని చూసుకునేదాన్నని మావుళ్లమ్మ తెలిపింది. శ్రీనుకు ఇద్దరు అక్కలున్నట్లు సమాచారం. శనివారం శ్రీను మృతి చెందడంతో కుటుంబ సభ్యలుకు సమాచారం ఇచ్చినా రాలేదని.. తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే పెట్టినట్లు ఆమె తెలిపింది. -
ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతి
దెందులూరు: విద్యుదాఘాతంతో గోపన్నపాలెంలో ఆకుల సురేష్‌కు చెందిన ఇంట్లో ఫ్రిడ్జ్, సామగ్రి అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆకుల సురేష్ ఇంట్లో మంటలు ఎక్కువ కాకుండా అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో ఫ్రిజ్‌తో పాటు రూ.లక్ష విలువచేసే సామగ్రి కాలిపోయింది. పెనుగొండ: అప్పుల బాధతో చిట్‌ఫండ్ వ్యాపారి దొంగరావిపాలెం బ్రిడ్జి వద్ద శనివారం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేట మండలం ఏడిదకు చెందిన పల్లా సురేష్(52) చిట్‌ఫండ్ చేస్తూ నష్టాల పాలయ్యాడు. భార్య నాగలక్ష్మీకి చెందిన బంగారం అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య నాగలక్ష్మి తణుకులో జాన్వీ బ్యూటీ అకాడమీలో బ్యూటిషియన్‌గా పనిచేస్తోంది. అప్పులు బాధ ఎక్కువ కావడంతో ఏడిదలో ఉన్న ఇంటిని అమ్మే విషయంలో మనస్పర్ధలు రావడంతో తణుకు నుంచి ఏడిద వెళ్తూ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని 21వ వార్డు కొబ్బరితోట, మహంకాళమ్మ గుడి సమీపంలో ఉంటున్న నడపన రంగారావు(50) శనివారం సాయంత్రం టూ టౌన్‌లోని ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. రంగారావు టీ సెంటర్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అగ్నిమాపక అధికారి కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. -
మధ్యవర్తిత్వంపై ప్రత్యేక సదస్సు
ఏలూరు (టూటౌన్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ నెల 2 నుంచి 31 వరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం నిమిత్తం స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఎ.మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శిక్షణ పొందిన మధ్యవర్తులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మధ్యవర్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, కక్షిదారులకు న్యాయ సహాయం అందించడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి ఏ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానం సాయం
కై కలూరు: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండలంలోని పోలీసుస్టేషన్లను ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. అనంతరం టౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నేరాల నియంత్రణలో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గుతోందని ఇందుకు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడమే ప్రధాన కారణమన్నారు. కై కలూరు స్టేషన్ల పరిధిలో ఇటీవల నమోదైన కేసుల్లో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించి కేసులను ఛేదించడం అభినందనీయమన్నారు. తాడేపల్లిగూడెం: పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని శనివారం విజిలెన్సు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చేసిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. చిన్నంశెట్టి మణికంఠ 4.50 టన్నుల రేషన్ బియ్యం నిల్వ చేసినట్టుగా సోదాల్లో గుర్తించారు. అతనిని అధికారులు ప్రశ్నించగా రేషన్ కార్దుదారుల నుంచి కిలో రూ.20కి కొనుగోలు చేసి , జంగారెడ్డిగూడెంకు చెందిన మంచాల సాయికి కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు నిల్వ ఉన్న సుమారు రూ.1.80 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకుని, నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. విజిలెన్సు ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడిలో విజిలెన్సు ఎస్ఐ కె.సీతారాం, గూడెం సీఎస్డీటి. వి.అన్నపూర్ణ, వీఆర్ఓ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కోడి పందేలకు సన్నద్ధం
దుగ్గిరాలలో సిద్ధం చేస్తున్న బరిసాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలకు సర్వం స న్నద్ధమైంది. హైకోర్టు నిషేధాజ్ఞలు.. నూరు శాతం కట్టడి చేస్తామన్న పోలీసుల ప్రతిజ్ఞలు.. సాంప్రదాయ పందాలనే నిర్వహిస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటల ముసుగున కత్తికట్టిన కోడి పందేలకు వేదికలు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించే రీతిలో ప్రతి నియోజకవర్గంలో భారీ పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా పందెంరాయుళ్లను ఆకర్షించేలా హడావుడి చేయడం విశేషం. ఇంత జరుగుతున్నా పోలీసులు మొక్కుబడిగానైనా స్పందించని పరిస్థితి. గతేడాది సంక్రాంతి సీజన్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పందేలు జరిగినట్టు అంచనా. ఈసారి అంతకు మించి అనే స్థాయిలో పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, కర్నాటకలకు చెందిన బడా నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలుకుతున్నారు. మండలానికి 15కు తగ్గకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ భారీ పందెం బరులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి మండలానికీ 15కు తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సంబంధించిన బరి మినీ స్టేడియం తరహాలో సిద్ధమైంది. పందెంరాయుళ్లు కూర్చోవడానికి వీలుగా సాధారణ గ్యాలరీలు మొదలు వీఐపీల గ్యాలరీ వరకు పందెం బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియాలో సైతం పోస్టులు చేస్తున్నారు. ఇదే తరహాలో తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆస్పత్రి వెనుక భారీ బరి సిద్ధం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి, తేతలి, ఆచంట నియోజకవర్గంలోని మార్టేరు, వెలగలేరు, పాలకొల్లు నియోజకవర్గంలో చించినాడ బ్రిడ్జి వద్ద, భీమవరంలోని వీరవాసరం, సీసలి, జువ్వలపాలెం, ఉండి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి. ప్రజాప్రతినిధులకు పర్సంటేజీలు కూటమి పార్టీల నేతలే పూర్తిస్థాయిలో పందేల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పందేల స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులతో పర్సంటేజీలు ఖరారు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇంకో అడుగు ముందుకేసి సొంత బరులు, సొంత స్థలాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.లక్షల నుంచి రూ.కోట్ల స్థాయి మొ దలు, పందేల జరిగే బరుల వరకూ ముడుపులను పర్సంటేజీల వారీగా ఖరారు చేస్తున్నారు. వీటిల్లో సింహభాగం ప్రజాప్రతినిధి ముఠాకే దక్కుతుంది. అవన్నీ కూడా ఖర్చుల పేరిట వసూలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక పేకాట, గుండాట నిర్వాహకులకు కూడా పందేల స్థాయిని బట్టి రేట్లు ఖరారు చేస్తున్నారు. పండగ పేరు.. జూదాల జోరు ఉమ్మడి పశ్చిమలో బరులకు ఏర్పాట్లు భారీస్థాయిలో పందేలకు సన్నాహాలు మినీ స్టేడియాలను తలపించేలా వేదికలు ప్రజాప్రతినిధులతో నిర్వాహకుల వాటాల మంతనాలు పేకాట, గుండాట, కోతాటలకు స్పెషల్ ప్యాకేజీ సోషల్ మీడియా వేదికగా బరుల వివరాలు వెల్లడి అడ్డగోలుగా బరులు ఏర్పాటుచేస్తున్నా పట్టించుకోని పోలీసు యంత్రాంగంఉమ్మడి జిల్లాలో ఏటా సంక్రాంతి సీజన్లో భారీగా కోడి పందేలు నిర్వహిస్తుంటారు. రూ.5 వేల నుంచి మొదలు రూ.5 కోట్ల వరకు పందేలు కాస్తూ మూడు రోజులపాటు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు పేకాట, గుండాట, కోతాట, ఇతర జూదక్రీడలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. పోలీసులు యథావిధిగా కోడిపందాల సీజన్ ముందు మొక్కుబడి బైండోవర్లు, నియోజకవర్గానికి ఓ చోట పందెం బరులను ధ్వంసం చేయడం, కోడికి కట్టే కత్తులను పదుల సంఖ్యలో సీజ్ చేసి నివేదికను హైకోర్టుకు పంపి కట్టడి చేస్తున్నట్టు ప్రకటించి పండగ దాటించేస్తుంటారు. అయితే ఈ ఏడాది జిల్లాలో పోలీస్ స్పందన మాత్రం నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతంలోనే కోడి పందేలకు ప్రసిద్ధి. ఆంధ్ర, తెలంగాణతో పాటు బెంగళూరు, చైన్నె నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్ల వస్తుంటారు. ముఖ్యంగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, కై కలూరులో మూడు రో జుల పాటు మకాం వేసి రూ.లక్షలు మొదలు రూ.కోట్ల వరకు పందేలు కడుతుంటారు. -
వేటకు పోటు
సముద్రంలో వేట సాగించే బోట్లకు డీజిల్ సబ్సిడీ సొమ్ములు ప్రభుత్వం మూ డు నెలలుగా జమ చేయడం లేదు. ఇది చాలా దారుణం. మత్స్యకార భృతి పెంచామని చెబుతున్న ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ లేకుండా చేసి నడ్డివిరిచింది. వెంటనే ప్రభుత్వం పెండింగ్ సొమ్ములు జమచేయాలి. నెలకు రిజిస్టర్ బోటుకు డీజిల్ సబ్సిడీ కింద రూ.10 వేలు అందించాలి. – బర్రి శంకరం, మత్యకార నేత డీజిల్ సబ్సిడీ సొమ్ములు కొంతకాలంగా జమకాకపోవడం నిజమే. అయితే సాంకేతిక ఇబ్బందులు కారణంగానే ఇది జరిగింది. త్వరలో డీజిల్ సబ్సిడీ బోటు యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమవు తుంది. నరసాపురంలో 139 రిజిస్టర్ బోట్లు ఉన్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వేట సాగించే బోట్లకు ఆ బోట్లు ఏ జిల్లాలో రిజిస్టర్ అయ్యి ఉంటే అక్కడే సొమ్ములు జమవుతాయి. – వై.ఏడుకొండలు, ఇన్చార్జ్ మత్స్యశాఖ అధికారి, నరసాపురంనరసాపురం: సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చంద్రబాబు ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని మూడు నెలలుగా నిలిపివేసింది. ఇక ఈ సబ్సిడీని పూర్తిగా నిలిపివేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. దీంతో గంగపుత్రులపై డీజిల్ భారం పడుతోంది. అలాగే సముద్రపు వేట కష్టం కానుంది. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో వేట సవ్యంగా సాగడం లేదు. దీనికి తోడు డీజిల్ సబ్సిడీకి బ్రేక్ వేయడంతో వేటకారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు ఐస్ ధరలు, నిర్వహణ వస్తువు ల ధరలు కూడా పెరగడంతో వేటకు ఖర్చు తడిసిమోపెడు అవుతోందని అంటున్నారు. బోటుకు 300 లీటర్లు ప్రభుత్వం వేట బోటుకు నెలకు 300 లీటర్ల డీజిల్‌పై సబ్సిడీ కింద రూ.2,700 ఇస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబందించి నరసాపురంలో రిజిస్టర్ వేట బోట్లు 139 ఉన్నాయి. గతంలో డీజిల్ సబ్సిడీ లీటరు రూ.6 ఉండగా.. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.9కు పెంచింది. ఇలా సముద్రపు వేటకు ఊతమిచ్చింది. జిల్లాలో సుమారు 5 వేల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. నరసాపురం తీరంలో రోజూ 80కి పైగా మెకనైజ్డ్ బోట్లు వేట సాగిస్తాయి. మత్స్య సంపద ఎక్కువగా లభిస్తుండటంతో విశాఖ, మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన బోట్లు కూడా ఇక్కడ వేట సాగిస్తాయి. డీజిల్ దెబ్బకు విలవిల ప్రస్తుతం డీజిల్ ధర లీటరు రూ.98లుగా ఉంది. వేట బోట్లకు డీజిల్ ప్రధానం. ఒక్కో బోటు సముద్రంలోకి వేటకు వెళ్లి రోజుల తరబడి ఉంటుంది. సరుకు సరిగా పడకపోతే 10 నుంచి 20 రోజుల వరకు వేచి ఉంటారు. దీంతో అన్ని రోజులకు సరిపడా డీజిల్ నింపుకుని వెళుతుంటారు. బోటు కండీషన్‌ను బట్టి రోజుకు ఒక్కో బోటుకు 20 నుంచి 30 లీటర్ల డీజిల్ అవసరం. వేటకు వెళ్లాలంటే దాదాపు 300 నుంచి 400 లీటర్లు డీజిల్ నింపుకోవాలి. సగటున 400 లీటర్ల డీజిల్‌కు రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా వలలు, ఐస్, నిర్వహణ ఖర్చులు కలిపి ఒక బోటుకు సుమారు రూ.లక్షకు పైగా ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో డీజిల్ సబ్సిడీ అందకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్య కార్మికులపైనా భారం ఒక్కోబోటుపై 10 మంది వరకు మత్స్యకారులు పని చేస్తారు. వీరికి ప్రత్యేకంగా జీతాలు ఉండవు. వేట ఖర్చులు పోను పడిన సరుకులో వచ్చిన లాభాన్ని బోటు యజమాని కార్మికులకు కొంత శాతం వాటాగా పంచుతాడు. ప్రస్తుతం డీజిల్ సబ్సిడీ అందకపోవడంతో మత్స్య కార్మికులపైనా ఈ ప్రభావం పడుతోంది. అలాగే గోదావరిలో వేట సాగించే ఇంజిన్ చెక్క నావలు కూడా నరసాపురం తీరంలో 200 వరకూ ఉంటాయి. వీరికీ డీజిల్ పోటు తప్పడం లేదు. లీటర్ల లెక్కతో సంబంధం లేకుండా డీజిల్ సబ్సిడీ నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మత్స్యకార సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయి నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూకుమ్మడిగా వేట సాగిస్తున్న మత్స్యకారులు ఆటు‘బోట్లు’ మూడునెలలుగా డీజిల్ సబ్సిడీకి బ్రేక్ చేపల వేటకు ఖర్చులు తడిసిమోపెడు నష్టాలు చవిచూస్తున్న మత్స్యకారులు డీజిల్ పథకానికి కత్తెరపై నిట్టూర్పు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీజిల్ సబ్సిడీని పెంచాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రాయితీని ఇవ్వకపోవడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రభు త్వం పలు నిబంధనలతో మత్స్యకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్స్యశాఖ వద్ద రిజిస్టర్ అయిన బోట్లు యజమానులు ముందుగా డీజిల్‌కు డబ్బులు పెట్టుకోవాలి. తరువాత బిల్లును మత్స్యశాఖకు సమర్పిస్తే ఆరు నెలలకోసారి బిల్లులు మంజూరవుతాయి. -
మళ్లీ రోడ్డెక్కిన చెత్త సమస్య
నరసాపురం: నరసాపురంలో చెత్త డంపింగ్ సమ స్యను ఎమ్మెల్యే గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. దీంతో చెత్త డంపింగ్ విషయంలో రోజుకో ఉద్రిక్తత తలెత్తుతోంది. తాజాగా చెత్తను పట్టణంలో మార్కెట్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పార్కు రోడ్డులోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద డంప్ చేయడం మొదలుపెట్టారు. అక్కడున్న ము న్సిపల్ చేపల మార్కెట్ భవనం వద్ద చెత్తను వేయడంతో శనివారం స్థానికులు అభ్యంతరం చెప్పారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ షాన్వాజ్ఖాన్, బూసరపు జయ తదితరులు మద్దతు తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా షాన్వాజ్ఖాన్ మాట్లాడుతూ ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఉన్నచోట చెత్తను వేస్తే స్థానికులు ఎలా బ తుకుతారని ప్రశ్నించారు. చెత్తను పార్కు రోడ్డులో డంప్ చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాటర్ ట్యాంక్ ఏరియాలో.. 12వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ సఖినేటిపల్లి సురేష్ శానిటరీ ఇన్స్పెక్టర్తో వాగ్వాదానికి దిగారు. 18 వార్డులకు నీటిసరఫరా చేసే ట్యాంకర్ ఉన్నచోట చెత్త ఎలా వేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషన ర్ ఆదేశాలతోనే ఇక్కడ వేస్తున్నామని చెప్పడంతో సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకంగా లేఖ ఇస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. మొత్తంగా మున్సిపాలిటీలో చెత్త సమస్య జటిలమవుతోంది. నరసాపురం పార్కు రోడ్డులో ఉద్రిక్తత -
ఈవీ.. పట్టించుకోరేమీ?
నూజివీడు: పట్టణంలోని ఇరుకు సందుల్లో నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందు కు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన ఈ వీ ఆటోలు మూలకు చేరాయి. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)లో భాగంగా అందించిన ఆరు ఈవీ ఆటోలు మున్సిపాలిటీ అలసత్వం, నిర్వహణలోపం కారణంగా మరమ్మతులకు గురవడంతో పక్కన పెట్టేశారు. బ్యాటరీలు పనిచేయకపోవడంతో అ లాగే వదిలేశారు. సప్లయి చేసిన కంపెనీ సైతం సర్వీసు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. వీటికి చార్జింగ్ ఎక్కుతున్నా వాహనం కదలడం లేదంటూ గాంధీపార్కు పక్కనే ఉన్న మీసేవా కేంద్రం భవనం ఆవరణలో పెట్టారు. విద్యుత్ ద్వారా నడిచే ఈ వాహనాల ద్వారా మున్సిపాలిటీపై ఆర్థిక భారం తగ్గుతుంది. వీటిని రన్నింగ్‌లో పెట్టకపోవడంపై పలువురు కౌన్సిలర్లు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. వీటిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
సందడిగా గోదావరి క్రీడా ఉత్సవాలు
భీమవరం: మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు దో హదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అ న్నారు. స్థానిక ఎస్ఆర్కేఆర్ కళాశాలలో శనివారం గోదావరి క్రీడా ఉత్సవాలు (ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి పోటీలు)ను ఆమె క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్‌పుట్ వంటి క్రీడాంశాల్లో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఉద్యోగులకు ఆటవిడుపు, శాఖల మధ్య స్నేహపూరిత వాతావరణం పెంపొందించేలా క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మండల, డివిజన్ స్థాయిల్లో ప్రతిభ కనబర్చిన వారు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. -
విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలి
భీమవరం: విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి నైపుణ్యాలను పెంపొందించేలా గైడ్స్ ట్రైనింగు వినియోగించుకోవాలని డీఈఓ నారాయణ, ఏపీసీ శ్యామ్‌సుందర్ తెలిపారు. గైడ్ కెప్టెన్ అడ్వాన్స్, పేసీ కోర్సులకు సంబంధించి స్థానిక ఎస్సీహెచ్బీఆర్ఎస్ స్కూల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శనివారం ఆయన పా ల్గొని మాట్లాడారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా సెక్రటరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రాముఖ్యత ఉంటుందని, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని తెలిపారు. హెచ్ఎంలు శ్రీనివాస్, ఎంఓ చంద్రశేఖర్, అడ్వాన్స్ రిసోర్స్ పర్సన్ కస్తూరి సుధాకర్ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 105 రోజులకు రూ.1,02,81,455 ఆదాయం సమకూరింది. అలాగే బంగారం 215 గ్రాములు 200 మిల్లీగ్రాములు, 360 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తెలిపారు. జిల్లా ఎండోమెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, భీమవరం తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు, శక్తీశ్వర స్వామి దేవస్థానం ఈఓ దండు కృష్ణంరాజు, భీమేశ్వరస్వామి దేవస్థానం ఈఓ తోట శ్రీనివాస్, చిక్కాల దేవస్థానం ఈఓ కడలి సాగర్ పర్యవేక్షించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ద్వారకాతిరుమల: గొడవ పడుతున్న తల్లి, భా ర్యకు సర్దిచెప్పలేక చెప్పలేక పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందా డు. ద్వారకాతిరుమల పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం.. మండలంలోని శరభాపురం గ్రామానికి చెందిన గుంపుల రాజశేఖర్(30) పి.కన్నాపురంలోని కోకోకోలా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈనెల 1న సాయంత్రం అతడి తల్లి, భార్యకు మధ్య గొడవ జరిగింది. ఈ స మయంలో వారిద్దరికీ సర్దిచెప్పలేక ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ గ్రామంలోని గొ ప్పగుంట చెరువు వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. అటుగా వెళ్లినవారు అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్‌ను హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథ మ చికిత్స అనంతరం రాజశేఖర్ తండ్రి రాంబాబు అతడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్ మృతిచెందగా పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి రాంబా బు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు.కాళ్ల: దాళ్వాలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనువైన వరివంగడాల వినియోగంపై ఉండి కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. శనివారం సీసలిలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో సూచనలిచ్చారు. దాళ్వాలో ఎంటీయూ 1121 వేయడం వల్ల పంట కోత 130 రోజులపైనే పడుతుందని దీని వల్ల వేసవి ప్రభావం పడి బియ్యం నూక అయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా 11 ఎంటీయూ 1121తో సంకరపరచి చిరు సంచి దశలో ఉన్న ఎంటీయు 1426 వంగడం సాగు చేయాలన్నారు. జింకు లోపం గమనించి ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలో చొప్పున ముడి జింకును నేలకు వేయాలని సూచించారు. ఎకరాకు 45 కిలోల పొటాషి యం రెండు దఫాలుగా పిచికారీ చేయాలన్నారు. శాస్త్రవేత్తలు మల్లికార్జున, విజయలక్ష్మి, మత్య శాస్త్రవేత్త శ్రీనివాస్, హర్టీకల్చర్ శాస్త్రవేత్త బిందు, వ్యవసాయాధికారి పి.రమేష్‌నాయుడు పాల్గొన్నారు. -
వ్యూహాలకు పదును పెట్టాలి
తాడేపల్లిగూడెం: లక్ష్యాలు సాధించాలంటే విద్యార్థులు వ్యూహాలకు పదును పెట్టాలని నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు పిలుపునిచ్చారు. ఇనిస్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఏపీ నిట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎంటర్ప్రెన్యూర్ షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంటు ప్రోగ్రామ్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఏపీఎంఎస్ఎంఈ టెక్నాలజీ సహకారంతో ఈనెల 20 నుంచి 20 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులు సృజన శీల వ్యాపార ఆలోచనలకు ఆకృతినిస్తే అంకుర పరిశ్రమలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. విభిన్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకొచ్చే విద్యార్థులను సంస్థ ప్రోత్సహిస్తోందన్నారు. నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, కార్యక్రమం చైర్మన్ జి.రవికిరణ్‌శాస్త్రి మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యవంతులుగా తయారు కావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు. -
గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన రెండో రోజుకు
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో గెస్ట్‌ఫ్యాకల్టీ వేతనాలను యాజమాన్యం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్జీయూకేటీ కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళన శుక్రవారం రెండో రోజుకు చేరింది. దీనిలో భాగంగా ట్రిపుల్ఐటీ ప్రధాన గేటు వద్ద గెస్ట్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ 2018లో నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 44మందిని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించారని, అప్పటి నుంచి రూ.25వేల వేతనానికే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీతో పాటు డాక్టరేట్ చేసిన టీచర్లు ఎక్కడైనా ఇంత తక్కువ వేతనానికి పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నోమార్లు తమ వేతనాలను పెంచాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఏడేళ్లుగా వేతనాన్ని ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమతో పనిచేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించకపోవడం దారుణం నూజివీడు: ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్లు పరిష్కరించాలని గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అనాగరికమని సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి జీ.రాజు ధ్వజమెత్తారు. ఈ దీక్షకు సీఐటీయూ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు.


