‘ఫీజు’ కోసం పోరు
భీమవరం: నిబంధనలు మీరిన ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, జీఓ 77, 107, 108లను రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలంటూ గురువారం భీమవంరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జీఓ 77 రద్దు చేస్తామని, పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, అయినా వీటిని అమలు చేయలేదన్నారు. అనంత రం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లుకు అందజేశారు.


