
ఈదురుగాలుల బీభత్సం
జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన భారీ గాలులు, వర్షంతో భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని చోట్ల వృక్షాలు ఇళ్లపై పడ్డాయి. జంగారెడ్డిగూడెం కాలేజ్ రోడ్డులో భారీ వృక్షం నేలకూలింది. పట్టణం, మండలంలో భారీ వృక్షాలు విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు నేలకూలడం, విద్యుత్‌వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా, విద్యుత్ ఈఈ పీర్ అహ్మద్‌ఖాన్, డీఈ యు.సుబ్బారావుల ఆధ్వర్యంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను అర్ధరాత్రి తరువాత నుంచి ప్రారంభించారు. చివరకు బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరించారు.
పంటలు నష్టపోయిన రైతులు
బుట్టాయగూడెం: గత మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, గాలి బీభత్సంతో ఏజెన్సీ ప్రాంతంలోని పలు చోట్ల అరటితోటలు నేలకొరిగాయి. మొక్కజొన్న, పొగాకు, జీడిమామిడి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించగా కొమ్ముగూడెం, బుట్టాయగూడెం, నిమ్మలగూడెం, తదితర గ్రామాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. సుమారు 18 ఎకరాల వరకూ మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు ఏఓ డి.ముత్యాలరావు ప్రాథమిక అంచనా వేశారు.
నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
దెబ్బతిన్న పంటలు

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం