
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. ఇదేమి పాలన అని ప్రశ్నిస్తే కేసులు.. ఏమిటీ దౌర్జన్యం అని నిలదీస్తే దాడులు.. అన్యాయం అని నిరసన తెలిపితే అరెస్టులు.. ప్రజాస్వామ్యం జిందాబాద్ అంటే జైళ్లు.. ఇదీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరు. రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు ‘సాక్షి’పై కక్ష గట్టిన ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు ఆరుగురు విలేకరులపై అక్రమ కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాత్రికేయులు గళమెత్తారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి వినతిపత్రాలు అందించారు.
తణుకు అర్బన్: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథ నానికి ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంపై తణుకు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు తహసీలార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని నినదించారు. ఏపీయూ డబ్ల్యూ జే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులా భాస్కర్ మా ట్లాడుతూ జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా అక్రమ కేసులు నమోదుచేయడం శోచనీయమన్నా రు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. అనంతరం తహసీల్దార్ దండు అశోక్‌వర్మకు తణుకు ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూ జే మాజీ సెక్రటరీ కొడమంచిలి కృష్ణ, ఏపీయూడబ్ల్యూజే చిన్నపత్రికల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి ఏడుకొండలు, తణుకు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు బొండ రామ్‌కుమార్, పాత్రికేయులు తానేటి దొరబాబు, గజ్జరపు నారాయణమూర్తి, కొలగాని రాజా, పంజా శివ, వెలగల నారాయణరెడ్డి, చిల్లా రాజశేఖర్, గాదిరెడ్డి రామ్‌ప్రసాద్, రంబాల బద్రి, అమర రాజశేఖర్, సతీష్, హరీష్, పెద్దిరాజు, సత్యప్రసాద్, డేగల మణి, ఆనంద్, ముమ్మిడివరపు ప్రతాప్ తదిత రులు పాల్గొన్నారు.
కేసులు సిగ్గు సిగ్గు
ఉండి: మీడియాపై అక్రమ కేసులు సిగ్గు సిగ్గు అంటూ ఉండి ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు నినదించారు. ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.కృష్ణమోహన్, చిట్టూరి జోషి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రత్నకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశా రు. మీడియాపై అక్రమ కేసులు దారుణమని, గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన నీతులు మర్చిపోయిందా అంటూ ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలిచే మీడియాను అణగదొక్కేలా అక్రమ కేసులు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సీనియర్ జర్నలిస్టులు తాళం హనుమంతరావు, బురిడి రవిబాబు, సీహెచ్ బంగార్రావు, ప్రెస్‌క్లబ్ కోశాధికారి సత్యనారాయణ, సభ్యులు తాళం హనుమంతరావు, బురిడి రవిబాబు, సీహెచ్ బంగార్రావు, మణికంఠ, కేశవ, బాలాజీ, వెంకటరమణ, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
పెనుగొండ: జర్నలిస్టులపై కేసు నమోదు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమే అంటూ పెను గొండలో జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెనుగొండలో తహసీల్దార్ జి.అనితకుమారికి వినతిపత్రం సమర్పించారు. విలేకరులు గుర్రాల శ్రీనివాసరావు, తేతలి తమ్మిరెడ్డి, బి.చిట్టిబాబు, రాజశేఖర్, పి.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
కేసులు తక్షణమే ఎత్తివేయాలి
జంగారెడ్డిగూడెం: ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు జంగారెడ్డిగూడెంలో శుక్రవారం స మావేశమయ్యారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ కోరారు. అక్రమ కేసులను తక్షణ మే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డీవీ భాస్కరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ రమణరావు, ఎం.గంగరాజు పాల్గొన్నారు.
అక్రమ కేసులు అన్యాయం
పాలకొల్లు సెంట్రల్: వృత్తి ధర్మంలో భాగంగా వార్తలు రాస్తే కేసులు కట్టే సంస్కృతి నుంచి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పాలకొల్లు ప్రెస్‌క్లబ్ సెక్రటరీ ఎంఎన్‌వీ సాంబశివరావు అన్నారు. శుక్రవారం పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరా రు. ప్రెస్‌క్లబ్ ట్రెజరర్ తోట రాంబాబు, క్లబ్ సభ్యు లు బండి శ్రీనివాస్, పులపర్తి నాని, మండెల అప్పలరాజు, వానపల్లి భాను, కారుమంచి రాజ్‌గోపాల్, పప్పుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు
మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు
నిరసనలు.. వినతిపత్రాలు అందజేత
జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

పత్రికా స్వేచ్ఛకు విఘాతం

పత్రికా స్వేచ్ఛకు విఘాతం