గోనె సంచులు నాణ్యంగా ఉండాలి
యువతి ఆత్మహత్య
ప్రేమించి మోసం చేయడంతో ఏలూరులో నర్సుగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుందని, న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు ధర్నా చేశారు. 8లో u
జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి
ఏలూరు(మెట్రో): ధాన్యం కొనుగోలులో భాగంగా రైతులు ఉపయోగించే గోనె సంచులు నాణ్యంగా ఉండాలని, ఇందులో ఎలాంటి రాజీ లేదని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. సుమారు 55 లక్షల గోనె సంచులు అవసరం ఉందని, నిర్దేశిత కేంద్రాల్లో సంచులను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం రవాణా వాహనాల రిజిస్ట్రేషన్‌ను వేగిరపర్చాలన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 118 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తామన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఫిర్యాదులు చేసేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ 08812– 230448, 77020 03584, 75695 62076, 75695 97910ను ఏర్పాటుచేశామన్నారు. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, డీఎస్‌ఓ ప్రతాపరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బీషా, డి.శ్రీనివాస్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.
జీఓ 35తో తీరని నష్టం
ఏలూరు(మెట్రో): పంచాయతీరాజ్ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన జీఓ 35 వల్ల తీరని నష్టం జరుగుతుందని పంచాయతీరాజ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్‌రాజు తెలిపారు. జీఓతో ఏఓ పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఎంపీడీఓ పోస్టు నేరుగా ని యామకం రద్దు చేయడం వల్ల అదనంగా వచ్చిన 30 శాతం కోటాలో తమకు కనీసం 50 శాతం కూడా పెంచకపోవడం దారుణమన్నా రు. తక్షణమే జీఓ 35ను సవరణ చేయాలని ఆయన కోరారు.


