
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
కై కలూరు: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ 134వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని.. రాజకీయ అవకాశాలు అనేక మందికి దక్కుతున్నాయంటే రిజర్వేషన్ల రూపంలో అంబేడ్కర్ చూపిన కృషే కారణమన్నారు. మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చేటు అని సత్యాన్ని ఆయన సమాజానికి సూచించారన్నారు. అణగారిన వర్గాల అభ్యన్నతి కృషి చేసిన ఆయన కృషిని చరిత్ర మరువదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ కీలక భూమిక పోషించారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ గంటా సంధ్య మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అనంతరం డీఎన్నార్ కలిదిండి మండలం మూలలంకలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, బీసీ సెల్ సెక్రటరీ బలే నాగరాజు, యాక్టివిటీ సెక్రటరీ మహాదేవ విజయబాబు, కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు సాక్షి సాయిబాబు, కుర్మా నెహెమ్యా, మహ్మద్ గాలిబ్‌బాబు, పరింకాయల వెంకటేశ్వరారవు, బోయిన చంద్ర భోగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, బేతపూడి ఏసేబు రాజు తదితరులు పాల్గొన్నారు.