
పోలవరంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆక్టోపస్ పోలీస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసు శిక్షణలో భాగంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని బుధవారం సందర్శించారు. ప్రాజెక్టు భద్రతా చర్యల్లో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంలోని పలుచోట్ల మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. ఐజీపీ (ఆపరేషన్స్)లో భాగంగా ఆక్టోపస్ బృందం సభ్యులు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఉత్తర్వుల మేరకు వీటిని నిర్వహించారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ సీహెచ్‌ఎస్‌ఆర్‌సీ మూర్తి, బ్రావో టీమ్ డీఎస్పీ ఎం.చిన్నకొండయ్య ఆధ్వర్యంలో 50 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.