
రక్తదానంతో ప్రాణదానం
భీమవరం (ప్రకాశంచౌక్): రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా పంచాయతీ అధికారి అరుణశ్రీ అన్నారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం, భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించారు. ఆయా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పంచాయతీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా గ్రామ పంచాయతీ ఆఫీసర్ అరుణశ్రీ భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎంఎస్‌వీ భద్రిరాజు చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ చేసిన దాతలకు, ధ్రువీకరణ పత్రాలు అందించారు. సుమారుగా 90 మంది జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగులు, అధికారులు రక్తదానం చేశారు. రక్త దానం చేసిన దాతలకు రెడ్‌క్రాస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.