
బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి
బ్రాహ్మణుల అభివృద్ధికి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పనిచేస్తుందని కార్యవర్గ సభ్యులు తెలిపారు. మంగళవారం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. 8లో u
నాటకాన్ని నిలబెడుతున్న కళాపరిషత్‌లు
జిల్లాలోని పలు సంస్థలు పరిషత్‌లు నిర్వ హిస్తూ నాటక రంగాన్ని పోషిస్తున్నాయి. తోలేరుకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర నాటక కళాపరిషత్, వీరవాసరా నికి చెందిన వీరవాసం కళా పరిషత్, భీమవరానికి చెందిన చైతన్య కళాభారతి, కళారంజని కళా పరిషత్‌లు.. ఏలూరుకు చెందిన హేలాపురి కళాపరిషత్, గరికపాటి కళా పరిషత్, పాలకొల్లు నాటక కళా పరిషత్ సంస్థలు ఏటా నాటక పోటీలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని ప్రముఖ సంస్థలకు చెందిన కళాకారులను ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి, పోటీలతో పాటు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. 1995లో రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలు ప్రారంభించి నంది అవార్డులను ఇస్తోంది. అప్పటి నుంచి జిల్లాకు చెందిన ఎంతో మంది నాటికల పోటీల్లో పాల్గొన్నా నంది అవార్డులు మాత్రం దరిచేరలేదు. 2009లో ఖాజావలీ దర్శకత్వంలో ప్రదర్శించిన ఎవరో ఒకరు సాంఘిక నాటకం బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు గెలుచుకుంది. ఆ తరువాతి సంవత్సరం వలీ దర్శకత్వంలోనే 2010లో ౖసైసె జోడెడ్ల బండి నాటకానికి బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు వరించాయి. 2012లో మహాసాధ్వి శకుంతలకు వెండి, కాంస్య నంది, 2017లో ఇంద్రసింహాసనం పౌరాణిక నాటకానికి బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు వచ్చాయి.