
గ్యాస్ సిలిండర్‌తో నిరసన
కుక్కునూరు: పెట్రో, గ్యాస్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సీపీఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో శుక్రవారం కుక్కునూరు ప్రధాన సెంటర్ లో గ్యాస్ సిలిండర్‌తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ నరేంద్రమేదీ ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గిస్తామని చెప్పి వివిధ రకాల పన్నుల భారాన్ని ప్రజలపై మోపి పెట్టుబడిదారులకు వేల కోట్లు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికి అనేక మార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంగాల కల్లయ్య, షేక్ మున్ని, సొడే చిరమయ్య తదితరులు పాల్గొన్నారు.
17న ఆశ్రంలో జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ఆశ్రం మెడికల్ కశాశాల ఆవరణలో ఈ నెల 17న సీనియర్ మెన్ జట్టు, 18న అండర్–23 మెన్, అండర్–19 బాలుర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. 01–09–2002 తర్వాత పుట్టిన వారు అండర్–23 విభాగానికి, 01–09–2006 తర్వాత పుట్టిన వారు అండర్–19 విభాగం పోటీల్లో పాల్గొనేందుకు అర్హులను వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు పుట్టిన తేదీ, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న వారు 2025–2026 సంవత్సరానికి ఏసీఓ నిర్వహించే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
తెలంగాణలో ఉన్నా ఉపాధి సొమ్ము జమ
ద్వారకాతిరుమల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవకతవకలు రాష్ట్ర సరిహద్దులు దాటాయి. మండలంలోని ఐఎస్ జగన్నాథపురానికి చెందిన దంపతులు పసుపులేటి నరసింహమూర్తి, అతని భార్య పావని ఏడాది క్రితం తెలంగాణలోని సంగారెడ్డికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే ఐఎస్ జగన్నాథపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో వారికి మస్తర్లు పడుతున్నాయి. దీంతో వారి బ్యాంకు ఖాతాకు నగదు కూడా జమ అవుతుంది. అయితే వారిద్దరూ ఐఎస్ జగన్నాఽథపురంలో ఈనెల 1 నుంచి 5 వరకు పసుపులేటి వీరాయమ్మ తోటలో రింగ్ ట్రెంచ్ పనులు చేసినట్టు ఆన్‌లైన్‌లో చూపారు. ఆ పనిదినాలకు సంబంధించిన రూ. 2,742 లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇది తెలిసిన కొందరు గ్రామస్తులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు. అలాగే పనికి వెళ్లని ఒక టీడీపీ నాయకుడికి, తాపీ మేసీ్త్రకి, ట్రాక్టర్ డ్రైవర్‌కు, ఇలా మరి కొంత మందికి ఉపాధి మస్తర్లు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోందని అంటున్నారు. అయితే దొంగ మస్తర్ల ద్వారా వచ్చే సొమ్ములో వాటాలు సంబంధిత అధికారులు, సిబ్బందికి అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఉపాధి సొమ్మును అక్రమంగా స్వాహా చేస్తున్న వారిపై తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.