
ఊరించి.. ఉసూరుమనిపించారు
ఉండి: కోటి ఆశలతో సమావేశానికి హాజరైన ఉ మ్మడి జిల్లా ఆక్వా రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మత్స్య శాఖ, ఆక్వా రైతుల ఆధ్వర్యంలో ఆదివారం ఉండి మండలం వాండ్రం పరిధిలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆక్వా రైతుల సదస్సులో చివరికి ఉసూరుమనిపించారు. సమావేశాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రా రంభించి మాట్లాడుతూ రైతుల విన్నపాలు ప్రభు త్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొని మాట్లాడారు. ఏం మాట్లాడినా షరతులు వర్తిస్తాయి అన్నట్టే ఉండటంతో రై తులు వాటిని ఆమోదించలేకపోయారు. మా ఉ సురు పోసుకుంటారు.. అంటూ రైతులు శాపనా ర్థాలు పెట్టడం గమనార్హం. మేత ధరలు తగ్గించాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యుత్ సబ్సిడీ మాత్రం అందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల డిమాండ్లు
జోన్‌ల వారీగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యూనిట్ విద్యుత్ ధర రూ.2 ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రైతులు సమావేశంలో డిమాండ్ చేశారు. నాణ్యమైన సీడ్ అందించాలని, మద్దతు ధరలు తగ్గిపోవడంతో నష్టపోతున్నామని, ధరల స్థిరీకరణను ఏర్పాటు చేయాలని కోరారు. ఆక్వా రంగంలో గందరగోళానికి ఫీడ్ కంపెనీలు ప్రధాన కారణమని, రైతులను నిండా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నింటికీ ప్రభుత్వం అంటే కుదరదు
దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తన మాటలతో రైతులను గందరగోళానికి గురిచేశారు. ఆక్వా రైతులు అడిగిన విన్నపాలకు, రఘురామ చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో రైతులు తెల్లముఖాలు వే శారు. సొంత పార్టీకి చెందిన వారు కూడా ము ఖా లు మాడ్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులకు ఏదో జరుగుతుందని ఆశించకండి.. ప్రభుత్వా న్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడదాం.. అన్నింటికీ ప్రభుత్వం.. ప్రభుత్వం అంటే కుదరదు.. ప్రభుత్వం అన్ని విషయాల్లో అయిపోయి ఉంది అంటూ రఘురామ చెప్పడం గమనార్హం. ప్రభుత్వ సహకా రం అనే సంగతి మీ బుర్రల్లో నుంచి తీసేయాలంటూ ఆయన రైతులకు తేల్చిచెప్పారు. ప్ర భుత్వాన్ని రోడ్లు వేయాలని మాత్రం అడుగుదామని అన్నారు.
అడిగినవన్నీ నెరవేరిస్తే
రైతులు లేజీగా తయారవుతారు
రైతులు అడిగే కొన్ని విన్నపాలు చూస్తుంటే వాటిని నెరవేరిస్తే రైతులు లేజీగా తయారవుతారని డిప్యూ టీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ముందు మీకు వచ్చిన కష్టాన్ని తట్టుకుని ముందుకు వెళ్లేలా ప్రయత్నించండి అని అన్నారు. అలాగే ఆక్వా రైతులు నిబంధనలు పాటించకుండా చెరువుల తవ్వకాలు చేశారని, నిబంధనలు తప్పక పాటించాలంటూ చురకలు వేశారు.
నీరుగారిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆక్వా రైతుల సమావేశం
ఆక్వా రైతులు నిబంధనలు పాటించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆదేశం