బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి కృషి
అంబేడ్కర్ మార్గంలో నడవాలి : మండలి చైర్మన్
వీరవాసరం: బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు పిలుపునిచ్చారు. నందమూరి గరువులో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అంబేడ్కర్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, సర్పంచ్ మేకల వెంకట చలపతి, మెంటే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): అందరి సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగధనుడు బీఆర్ అంబేడ్కర్ అని ఇన్‌చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అన్నారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్బంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఇన్‌చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అంబేడ్కర్ ధాత్రిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దాసరి ఆంజనేయులు, డాక్టర్ మెండెం సంతోష కుమార్, మేతర అజయ్‌బాబు, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జేడీ వి.జయప్రకాష్, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్.కృపావరం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంబేడ్కర్‌కు నివాళి
అంబేద్కర్ కాంస్య విగ్రహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ సోమవారం నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటే దానికి కారణం అంబేడ్కర్ మార్గదర్శకాలేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి కృషి
బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి కృషి


