పొగాకు బ్యారన్ల దగ్ధం
జంగారెడ్డిగూడెం: మండలంలోని చిన్నవారిగూడెంలో గ్రామానికి చెందిన దాకవరపు అర్జునరావు, దాకవరపు రవికృష్ణలకు చెందిన పొగాకు బ్యారన్లు బుధవారం రాత్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.28 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు పేర్కొన్నారు. వారిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు గురువారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో రూ.20 లక్షల పొగాకు, రూ.8 లక్షలు విలువైన రెండు బ్యారన్లు నష్టపోయామని రైతులు వివరించారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ బ్యారన్లు దగ్ధంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. క్యూరింగ్ సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జెట్టి సూచించారు. రైతులను పరామర్శించిన వారిలో ఎ.పోలవరం సర్పంచ్ బుద్దాల సీతారాముడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, సత్రం లక్ష్మణరావు, తాడువాయి సొసైటీ మాజీ అధ్యక్షుడు కనికళ్ల ప్రసాద్, బుద్దాల నాగేంద్రం, బుద్దాల సత్యనారాయణ, బండారు సూరిబాబు, బండారు ప్రసాద్, దాకవరపు వెంకటేశ్వరరావు, నెల్లూరు గంగరాజు, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


