ఆక్వా సాగుకు సెలవు | - | Sakshi
Sakshi News home page

ఆక్వా సాగుకు సెలవు

Apr 18 2025 1:40 AM | Updated on Apr 18 2025 1:40 AM

ఆక్వా

ఆక్వా సాగుకు సెలవు

జీతాలు ఇవ్వండి.. మహాప్రభో!
జీతాలు సకాలంలో అందక ట్రిపుల్‌ ఐటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బందికి ఇప్పటికీ జీతాలు రాలేదు. 10లో u

శురకవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్ల దోపిడీని నిరసిస్తూ ఆక్వా చరిత్రలో తొలిసారి రైతులు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గం నుంచి దీనికి నాంది పలికారు. జూలై నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించగా పట్టుబడులు పూర్తిచేసుకున్న రైతులు ఇప్పటినుంచే పంటకు విరామమిచ్చి చెరువులను ఎండగట్టేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల ఆక్వా చెరువులకు 60 శాతం విస్తీర్ణంలో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. స్థానికంగా 40కి పైగా ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. కిలోకు 30 నుంచి 50 లోపు కౌంట్‌ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుంటే, 60 నుంచి 100 కౌంట్‌ రొయ్యలు చైనా, యూరోపియన్‌ దేశాలకు వెళుతున్నాయి.

టారిఫ్‌లు సాకుగా చూపి.. చి...

నెలన్నర రోజుల క్రితం 30 కౌంట్‌ (కేజీకి 30 రొయ్యలు) ధర రూ.470, 40 కౌంట్‌ రూ.415, 100 కౌంట్‌ రూ.260 వరకు ధర ఉంది. సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు వనామీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. పట్టుబడులు మొదలై మార్కెట్‌లోకి రొయ్యలు రావడం పెరగడంతో ధరలు తగ్గిస్తూ వచ్చారు. ఈనెల 3న అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటన వెలువడే నాటికి 30 కౌంట్‌ ధర రూ.460, 40 కౌంట్‌ రూ.370, 100 కౌంట్‌ రూ.230కి ధరలు పడిపోయాయి. అమెరికా సుంకాలను సాగుకు చూపించి కౌంట్‌ను బట్టి కేజీకి రూ.30ల నుంచి రూ.70 వరకు కోత పెట్టి ఈ ధరలను మరింత తగ్గించేశారు. ఇప్పట్లో పన్నుల బాదుడు లేదని అమెరికా ప్రకటించినా తగ్గించిన ధరలను పెంచలేదు. ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు సిండికేటై తమ కష్టాన్ని దోచుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. గతంలోని 30 కౌంట్‌ రూ.470–490, 50 కౌంట్‌కు రూ.370, 60 కౌంట్‌కు రూ.350 కనీస మద్దతు ధర ఉండాలని, మేత ముడి సరకు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఫీడ్‌ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.20 వేలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి ఇలాకాలో ఫ్లెక్సీల ఏర్పాటు

మంత్రి నిమ్మల సొంత నియోజకవర్గమైన పాలకొల్లు నుంచి క్రాప్‌ హాలిడేని రైతులు ప్రారంభించారు. బుధవారం యలమంచిలి మండలం శిరిగాలపల్లిలో 10 ఎకరాల్లో పంట విరామం పాటిస్తున్నట్టు ఫ్లెక్సీని ఏర్పాటుచేయగా గురువారం నియోజకవర్గంలోని పూలపల్లి, చందపర్రు, నరసాపురం నియోజకవర్గంలోని తూర్పుతాళ్లు తదితర చోట్ల దాదాపు 50కి పైగా ఎకరాల్లోని రైతులు సమ్మెలోకి వెళుతున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పట్టుబడులు పూర్తిచేసుకున్న రైతులు ఒక్కొక్కరుగా పంటకు విరామమిస్తున్నారు. చెరువుల వద్ద క్రాప్‌ హాలిడే ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి వాటి వివరాలను అధికారులకు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఊరటనివ్వని ‘ఉండి’ సమావేశం

న్యూస్‌రీల్‌

అయ్యో.. రొయ్య

ధరల పతనంపై జిల్లా రైతుల పోరుబాట

ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్‌ హాలిడే

తొలుత జూలై నుంచి అమలుకు యోచన

ఈనెల నుంచే పంట విరామంలోకి రైతులు

మంత్రి నిమ్మల ఇలాకా నుంచే ఉద్యమం మొదలు

ఇప్పటికే చెరువుల వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు

జిల్లాకు చెందిన జైభారత్‌ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల రైతులు ఈనెల 7న పాలకొల్లులో రాస్తారోకో చేశారు. మూడు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉండగా జూన్‌ నెలాఖరు నాటికి ప్రస్తుత సాగును పూర్తి చేసుకుని జూలై నుంచి సెప్టెంబరు వరకు పంట విరామం పాటించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంలో సాగు సమ్మె ప్రకంపనలు సృష్టించింది. సాగు సమ్మె విరమింపజేసే దిశగా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజుతో జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు చర్చలు జరిపారన్న ప్రచారం జరిగింది. దీంతో ఈనెల 13న ఉండిలో జరిగిన ఆక్వా సదస్సులో తమకు మేలు జరుగుతుందని రైతులు ఆశించారు. ప్రభుత్వం నుంచి ఏదో జరుగుతుందని ఆశించవద్దు.. ప్రభుత్వాన్ని ఎంతవరకు వా డాలో అంతవరకే వాడుదాం.. అన్నింటికీ ప్రభుత్వం, ప్రభుత్వం అంటే కుదరదంటూ ప్రభుత్వ పెద్దలు ఆ సమావేశంలో చెప్పిన మాటలు ఆక్వా రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేలు మాత్రమే తగ్గించడం, 15న విజయవాడలో సమావేశమైన ప్రాన్స్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ కంటితుడుపు నిర్ణయాలు రైతులను నిరాశకు గురిచేశాయి.

ఆక్వా సాగుకు సెలవు 1
1/2

ఆక్వా సాగుకు సెలవు

ఆక్వా సాగుకు సెలవు 2
2/2

ఆక్వా సాగుకు సెలవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement