
● అలరించిన జాతీయస్థాయి నాటిక పోటీలు
పట్టణంలోని కళారంజని నాటక అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీసోమేశ్వర జనార్ధనస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. పోటీల్లో గురువారం ప్రదర్శించిన గుంటూరు వారి అభినయ ఆర్ట్స్ ‘ఇది అతని సంతకం’, హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి శ్రీసారీ రాంగ్‌నెంబర్‌శ్రీ నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ఎన్ రవీంద్రరెడ్డిని ప్రముఖ సినీనటుడు ఎస్‌వీ రంగారావు స్మారక పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో కళారంజని వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరఽథీశ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వై వెంకటరమణ, మెంటే పూర్ణచంద్రరావు, మల్లుల సీతారామప్రసాద్, మాదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
–భీమవరం

● అలరించిన జాతీయస్థాయి నాటిక పోటీలు