పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని బౌబ్రిడ్జి మీదుగా వెళుతున్న తాగునీటి ప్రధాన పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బౌబ్రిడ్జి వద్ద ఎన్నో ఏళ్లుగా పైప్‌లైన్‌కు లీకేజీలు ఏర్పడుతుండడంతో నీరు వృథాగా పోతోంది. అంతేగాక పలు ప్రాంతాల్లో సైతం ఏర్పడిన లీకేజీల ద్వారా నీరు కలుషితమవుతోందని, తోక పురుగులు వస్తున్నాయని ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సాక్షి కథనాలను ప్రచురించింది. ఎప్పటికప్పుడు అధికారులు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడం.. మళ్లీ కొన్నాళ్లకు లీకేజీలు ఏర్పడడం షరామామూలే. ప్రస్తుతం దీనిపై స్పందించిన అధికారులు ప్రధాన పైపులైన్‌కు ఏర్పడిన లీకేజీని అరికట్టేందుకు రూ.2 లక్షల వ్యయంతో కాస్ట్ ఐరన్ పైపును లింక్ చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో అధికారులు ఎంఈ వెంకటరమణ, డీఈలు వెంకటేశ్వరరావు, పవన్ ఆధ్వర్యంలో ఈపనులు చేపట్టారు. దీంతో సమస్య పరిష్కారమైంది.
పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు
పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు


