
ముస్లింలకు అండగా జగన్
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం–2025లో మార్పులు కోరుతూ ముస్లింలకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించిన మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి ముస్లింలు క్షీరాభిషేకం చేశారు. గురువారం కై కలూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆధ్వర్యంలో కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం కోసం పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింలకు అండగా ఉంటారని, ధైర్యంగా ఉండాలని అన్నారు. పార్టీ ముస్లిం నాయకులు షేక్ రఫీ, మహమ్మద్ గాలిబ్‌బాబు మాట్లాడుతూ వక్ఫ్ బిల్లును సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అండగా నిలవడాన్ని యావత్ ముస్లిం సమాజం హర్షిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఎన్‌ఆర్‌సీపై ముస్లింలకు అండగా జగన్ నిలిచారని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ముదిరాజ్‌ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, నాయకులు సోమాల శ్యామ్‌సుందర్, తోట మహేష్, సమయం వీరాంజనేయులు, పంజా నాగు, ముస్లిం పెద్దలు అబ్దుల్ మాలిక్, ఫిర్దోజ్ ఖాన్, అమీర్, నయీమ్, జాకీర్, అలీమ్, ఎండీ ఆసిఫ్ పాషా, షేక్ రషీద్, గఫర్, రెహమాన్, కరీముల్లా, సజీద్, బాబా, ఇక్బాల్, సలీం, జహంగీర్, బషీర్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్