ఇసుక రీచ్‌లు ప్రారంభించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం గుర్తించిన, అనుమతించిన ఇసుక రీచ్‌లను తక్షణమే ప్రారంభించాలని భవన ని ర్మాణ కార్మిక సంఘ నాయకులు గళమెత్తారు. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జి ల్లాలో ఇసుక రీచ్‌లను ప్రారంభించాలని, భవ న నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్‌లను ప్రారంభించకపోవడంతో తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఇసుక తెచ్చుకోవడంతో వినియోగదారులకు అధిక భారమవుతోందన్నారు. జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు బోడెం వెంకట్రావు, ఎం.ఇమ్మానియేల్ పాల్గొన్నారు.
కనీస మద్దతు ధర అందేలా చర్యలు
ఏలూరు(మెట్రో): జిల్లాలో రబీ సీజన్ పంట ఉత్పత్తులకు ప్ర భుత్వ మద్దతు ధర అందేలా చర్యలు తీసుకున్నామని, పప్పు ధా న్యాల కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుచేసినట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల్లోకొనుగోలు కేంద్రాల ద్వారా 1,922 టన్నుల పెసల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకూ 2,095 టన్నులు సేకరించామన్నారు. ఈ లక్ష్యాన్ని 2,745 టన్నులకు పెంచుతూ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు, అవగాహనా సదస్సులు నిర్వహించామన్నారు. జిల్లాస్థాయి కంట్రోల్‌రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
24న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
ఏలూరు (టూటౌన్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలంటూ ఈనెల 24న ఏలూరు కార్మికశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్టు ఏపీ బిల్డింగ్ అధర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు తెలిపారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు ఓవర్ బ్రిడ్జి సెంటర్‌లో గురువారం భవన నిర్మాణ కార్మికులతో కలిసి నిరసన తెలి పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని, పది నెలలు గడిచినా ఈ హామీ అమలు కాలేదన్నారు.
పెంచిన ఆస్తి పన్ను తగ్గించాలి
ఏలూరు (టూటౌన్): పట్టణాల్లో పెంచిన ఆస్తి (ఇంటి) పన్ను తగ్గించాలని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కార్యదర్శి ఎ.రవి గురువారం ప్రకటన విడుదల చేశారు. 2025–26కి సంబంధించి పట్టణాల్లో ఆస్తిపన్ను 15 శాతం పెంచారని విమర్శించారు.
‘ఓపెన్’ ప్రాక్టికల్స్‌కు 75 మంది..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ కోర్సుల ప్రాక్టికల్స్‌కు 75 మంది హాజరయ్యారు. భౌతికశాస్త్రం పరీక్షకు 40 మందికి 29 మంది, రసాయన శాస్త్రం పరీక్షకు 40 మందికి 29 మంది, జీవశాస్త్రం పరీక్షకు 21 మందికి గాను 17 మంది హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేసవి స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ ప్రోగామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన 3, 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యార్థులు (సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఐటీఐ ట్రేడ్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రైవేటుగా ఆలిండియా ఐటీఐ ట్రేడ్ పరీక్ష రాయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పి.రజిత ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులు ఈనెల 12న సాయంత్రం 5 గంటలలోపు సమీపంలోని ఐటీఐ కళాశాలల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.
ఇసుక రీచ్‌లు ప్రారంభించాలి


