
కై కలూరు ఏఎంసీలో కయ్యాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల ఎంపిక కై కలూరు నియోజకవర్గంలో కయ్యాలకు కారణమవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి తర్వాత రెండో స్థానంగా కై కలూరు, కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవులను భావిస్తారు. రాష్ట్రంలో కై కలూరు ఏఎంసీ ఆదాయంలో మొదటి స్థానంలో నిలవగా.. రాష్ట్ర జీడీపీలో కలిదిండి మండలం మొ దటి స్థానంలో ఉంది. దీంతో ఈ రెండు ఏఎంసీ చైర్మన్ల పదవుల కోసం కూటమి పార్టీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో ఏఎంసీ చైర్మన్లను ప్రకటించినా కై కలూరు, కలిదిండి ప్రస్తావన లేదు. దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
రిజర్వేషన్ల చిచ్చు
ఏఎంసీ చైర్మన్ల రిజర్వేషన్ల కేటాయింపులో మతలబు జరిగిందనే భావన కూటమి నేతల్లో నెలకొంది. మొదట్లో కై కలూరు ఏఎంసీ బీసీ కోటాలో టీడీపీ నాయకుడు పూలా రాజీ సతీమణికి, కలిదిండి ఏఎంసీ చైర్మన్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పోకల జోగిరాజుకు కేటాయించినట్టు ప్రచారం జరిగింది. అయినా ఎమ్మెల్యే కామినేని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా కై కలూరు ఏఎంసీ పదవిని పెన్మత్స త్రినాథరాజు, గంగుల శ్రీదేవి, బూరుబోయిన శ్రీనివాసరావు, తెంటు వెంకటరమణ, కలిదిండి నుంచి జనసేన నేత చలపతి, అండ్రాజు శ్రీనివాసరావు ఆశించారు. తాజాగా కై కలూరు ఏఎంసీ ఓసీ, కలిదిండి ఏఎంసీ ఎస్సీ మహిళకు కేటాయించాలని నిర్ణయించినట్టు, అధిష్టానం వద్ద ఇవే రిజర్వేషన్లు ఉంటే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేశారని ఆశావహులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పలువురు బరిలో..
కై కలూరు ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్ ఓసీగా మారిస్తే టీడీపీ మండలాధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు మొ దటి వరుసలో ఉన్నారు. అలాగే కేవీఎన్‌ఎం నా యుడు, పుప్పాల సూర్యప్రకాశరావు పోటీపడుతున్నారు. కలిదిండి ఏఎంసీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ గా మారితే ముదినేపల్లి మండలానికి చెందిన పంత గాని సురేష్ కుటుంబం, కోరుకొల్లు పంచాయతీ స ర్పంచ్ బట్టు లీలాకనకదుర్గ (జనసేన) పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే కలిదిండిని జనసేనకు కేటాయిస్తే చలపతికి వస్తుందనే ప్రచారం కూడా ఉంది. కై కలూరు ఏఎంసీ బీసీ మహిళా కోటాలో తెంటు వెంకటరమణ బరిలో ఉన్నారు.
చైర్మన్ పదవి కోసం ఆశావహుల యత్నాలు
కై కలూరు ఓసీ, కలిదిండి ఎస్సీ మహిళ రిజర్వేషన్లకు పట్టు
ఏఎంసీ చైర్మన్లను ప్రకటించని ప్రభుత్వం